పదిరోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత (68) కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. జ్వరం, డీ హైడ్రేషన్ సమస్యలతో సెప్టెంబర్ 22న ఆస్పత్రిలో చేరిన జయ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు, పార్టీ కార్యాలయం ఏ ప్రకటన చేయకపోవటంతో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే శనివారం సాయంత్రం జయను పరామర్శించిన తమిళనాడు ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు, వైద్యుల సంరక్షణలో ఆమె కోలుకుంటున్నారని తెలిపారు. ఆస్పత్రి యాజమాన్యం కూడా రెండ్రోజుల తర్వాత అమ్మ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేసింది. ‘వైద్యుల చికిత్సకు సీఎం బాగానే స్పందిస్తున్నారు. అవసరమైన పరీక్షలు నిర్వహించాం.