recovering
-
Afzalgunj Incident: కోలుకున్న ‘బీదర్ క్షతగాత్రుడు’
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకలోని బీదర్‌లో ‘అఫ్జల్‌గంజ్ దుండగులు’ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన శివకుమార్ నగరంలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఇది తనకు పునర్జన్మ అంటూ చేసిన వీడియోను ఆయన సమీప బంధువు గురువారం విడుదల చేశారు. బీదర్‌లోని శివాజీ సర్కిల్ వద్ద గత గురువారం (ఈ నెల 16) ఉదయం భారీ దోపిడీ చోటు చేసుకుంది. బైక్‌పై వచి్చన ఇద్దరు దుండగులు ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే సీఎంఎస్ సంస్థకు చెందిన వాహనంపై విరుచుకుపడ్డారు. ఈ వాహనంలో సెక్యూరిటీ గార్డు, గన్‌మెన్ లేకపోవడం వీరికి కలిసి వచ్చింది. కస్టోడియన్లుగా ఉన్న శివకుమార్, గిరి వెంకటే‹Ùలపై తుపాకీతో కాల్పులు జరిపి రూ.83 లక్షలతో ఉన్న అల్యూమినియం బాక్సు ఎత్తుకెళ్లారు. నాలుగు తూటాలు దిగిన వెంకటేష్ అక్కడిక్కడే చనిపోగా... ఛాతిలోకి ఓ తూటా దూసుకుపోయిన శివకుమార్ తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు రాత్రి వారు అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి రాయ్‌పూర్ వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలతో రోషన్ ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ పైనా కాల్పులు జరిపిన ఇరువురూ పారిపోయారు. బీదర్ పోలీసులు తొలుత శివకుమార్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో వారి సూచన మేరకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న శివకుమార్ నాటి ఉదంతానికి సంబంధించిన వివరాలు చెబుతుండగా చిత్రీకరించిన ఓ వీడియోను ఆయన సమీప బంధువు శివయోగి కన్నడ మీడియాకు విడుదల చేశారు. అందులో శివకుమార్ చెప్పిన వివరాలివీ... ‘ఆ రోజు నగదు తీసుకుని సీఎంఎస్‌కు చెందిన చెస్ట్ నుంచి బయటకు వచ్చాం. ఇద్దరు దుండగులు నేరుగా మాపై దాడికి దిగారు. కస్టోడియన్‌గా ఉన్న నాతో పాటు నా సహచరుడి పైనా కాల్పులకు పాల్పడ్డారు. నేను తొలుత తప్పించుకున్నా.... వెంకటేష్‌పై కాల్పులు జరుపుతుండటంతో తుపాకీ చేతిలో ఉన్న వ్యక్తిని చూసి అరుస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశా. దీంతో అతడు నా వైపు గురిపెట్టి కాలి్చన తూటా నా ఛాతిలోకి దూసుకుపోయింది. ఇది నాకు పునర్జన్మ లాంటిది’ అని పేర్కొన్నారు.మళ్లీ తెరపైకి మనీష్ పేరు..అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిటీ పోలీసులు బీదర్‌తో పాటు నగరంలోని కొన్ని సీసీ కెమెరాల్లో లభించిన దుండగుల ఫొటోలను సేకరించారు. వీటిని కర్ణాటక అధికారులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపారు. వీటిలో ఉన్న ఓ దుండగుడు తమ రాష్ట్రానికి చెందిన మోస్ట్ వాంటెడ్ మనీష్ కుషా్వహా మాదిరిగా ఉన్నాడు అంటూ బీహార్ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఇతడే సూత్రధారిగా రెండు నేరాలు జరిగినట్లు భావించారు. అతడి కోసం ముమ్మరంగా గాలించడం మొదలెట్టారు. అయితే గత శుక్రవారం రాత్రి బీహార్ పోలీసులు ఆ ఫొటోలను అక్కడి నిరంజన గ్రామంలో ఉండే మనీష్ తల్లిదండ్రులకు చూపించారు. వారు వాటిని చూసి తమ కుమారుడు కాదని చెప్పడంతో ఆ విషయాన్ని నగర పోలీసులకు చెప్పారు. దీంతో అతడు సూత్రధారి కాదనే ఉద్దేశంతో పోలీసులు మరికొన్ని కోణాల్లో ముందుకు వెళ్తున్నారు. అయితే తాజాగా మహేష్ తల్లిదండ్రులు తమ కుమారుడిని రక్షించడానికి తప్పుదోవ పట్టించి ఉంటారనే అనుమానం పోలీసులకు వచ్చింది. దీనికితోడు మహేష్ ఆచూకీ సైతం లేకపోవడంతో అతడి పాత్రను పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో మహేష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు. -
యూపీఐ నుంచి పొరపాటున డబ్బు పంపించారా? ఇలా చేస్తే మళ్ళీ వస్తాయ్..
Wrong UPI ID Transfer: ఆధునిక కాలంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటివి వాటి ద్వారా ఎక్కువ ట్రాన్సక్షన్స్ జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఉన్న చాలా మంది ఇప్పుడు ఈ యాప్స్ ద్వారానే లావాదేవీలను చేస్తుంటారు. అయితే ఇలా ట్రాన్సక్షన్స్ జరిగే సమయాల్లో అప్పుడప్పుడు అనుకోకుండా వేరే ఖాతాలకు అమౌంట్ సెండ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి అనుభవం చాలామందికి ఎదురై ఉంటుంది. అలాంటి సందర్భంలో అమౌంట్ మళ్ళీ ఎలా పొందాలి? ఎవరికి పిర్యాదు చేయాలనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ✸ ఒక వ్యక్తి అనుకోకుండా యూపీఐ ద్వారా అమౌంట్ వేరే ఖాతాలకు పంపించినప్పుడు ముందుగా ఆ వ్యక్తిని కాంటాక్ట్ అవ్వాలి. అనుకోకుండా అమౌంట్ పంపించామని, దాన్ని తిరిగి పంపించాలని అడగాలి. నిజాయితీగా ఉండే వ్యక్తులు తప్పకుండా అమౌంట్ తిరిగి పంపిస్తారు. అలా కాకుండా కొంతమంది డబ్బు పంపించనప్పుడు వెంటనే యూపీఐ కస్టమర్ సపోర్ట్ తీసుకోవాలి. (ఇదీ చదవండి: దేశంలో మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు - టెక్నాలజీలో భళా భారత్) ✸ యూపీఐ కస్టమర్ సపోర్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఏ యూపీఐ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో ఆ యూపీఐ కస్టమర్ సపోర్ట్‌కి కంప్లైంట్ చేయాలి, పొరపాటున డబ్బు వేరే ఖాతాకు జమయ్యిందని జరిగిన విషయం వెల్లడిస్తే.. వారు తిరిగి డబ్బు వచ్చేలా చేస్తారు. ✸ యూపీఐ కస్టమర్ సపోర్ట్ నుంచి కూడా మీకు సానుకూల స్పందన రాకుండా పోతే, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించాలి. ఆర్బీఐ ప్రత్యేకించి ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి 'అంబుడ్స్‌మెన్ ఫర్ డిజిటల్ ట్రాన్సక్షన్స్' (Ombudsman for Digital Transactions) పేరుతో ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. ఆ అధికారికి మీరు పిర్యాదు చేయడం ద్వారా తిరిగి డబ్బు వెనక్కి పొందవచ్చు. -
కోవిడ్ రికవరీలో ఆంధ్రప్రదేశ్ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోజురోజుకు కోవిడ్ రికవరీ రేటు పెరుగుతోంది. కరోనా బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. దీంతో రికవరీ రేటు జాతీయ సగటు కంటే.. మన రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదైంది. దేశంలో జూలై 1 నాటికి 96.95 శాతంగా ఉంటే.. మన రాష్ట్రంలో 97.31 శాతంగా రికవరీ రేటు నమోదైంది. ఒక దశలో రాష్ట్రంలో రోజుకు 24 వేల కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పుడు 3 వేల కేసులే వస్తున్నాయి. అలాగే రికవరీ రేటు కూడా 84 శాతానికి పడిపోయిన పరిస్థితి నుంచి.. ఇప్పుడు 97.31 శాతానికి చేరింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ రికవరీ రేటు నమోదు కావడం గమనార్హం. పాజిటివ్ వచ్చిన వాళ్లు కూడా ఆస్పత్రులకు వచ్చి చికిత్స పొందాల్సిన అవసరం రాకుండానే కోలుకుంటున్నారు. ఇంట్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వమే హోం ఐసొలేషన్ కిట్లు అందిస్తోంది. 104 కాల్ సెంటర్లో పేర్లు నమోదు చేసుకున్న డాక్టర్లు.. ఇంట్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఫోన్ చేసి సలహాలు, సచనలు ఇస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం 104కు కాల్ చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఐసీయూ, ఆక్సిజన్, సాధారణ బెడ్స్ ప్రతి జిల్లాలోన పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రికవరీ రేటు ఇలా రాష్ట్రం రికవరీ రేటు (శాతంలో) ఆంధ్రప్రదేశ్ 97.31 తెలంగాణ 97.27 తమిళనాడు 97.14 పంజాబ్ 96.78 ఒడిశా 96.13 కర్ణాటక 96.08 కేరళ 96.08 మహరాష్ట్ర 96.02 దేశ సగటు 96.95 -
1.56 శాతానికి పడిన మరణాల రేటు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విస్తృతి ఆగడం లేదు. అయినప్పటికీ మరణాల రేటు 1.56 శాతానికి పడింది. మరోవైపు, పాజిటివ్ కేసుల సంఖ్య 63 లక్షలు దాటేసింది. మరణాల సంఖ్య లక్షకు చేరువవుతోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 86,821 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దీంతో ఇప్పటిదాకా మొత్తం కేసుల సంఖ్య 63,12,584కు చేరింది. అలాగే ఇప్పటివరకు 52,73,201 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. రికవరీ రేటు 83.53 శాతానికి చేరింది. తాజాగా 1,181 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 98,678కి చేరుకుంది. ప్రస్తుతం 9,40,705 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. కేసుల్లో యాక్టివ్ కేసులు 14.90 శాతం ఉన్నాయి. మొత్తం రికవరీల్లో 77 శాతం రికవరీలు 10 రాష్ట్రాల్లో నమోదయ్యాయి. దేశంలో ఆగస్టు 7వ తేదీ నాటికి కరోనా కేసుల సంఖ్య 20 లక్షలకు చేరింది. ఆగస్టు 23 నాటికి 30 లక్షలకు, సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలకు, సెప్టెంబర్ 16 నాటికి 50 లక్షలకు, సెప్టెంబర్ 28వ తేదీ నాటికి 60 లక్షలకు చేరుకుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్నట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా సెప్టెంబర్ 30వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 7,56,19,781 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. బుధవారం ఒక్కరోజే 14,23,052 టెస్టులు నిర్వహించినట్లు తెలియజేసింది. -
ఆ‘పన్ను’ హస్తం
కరోనా వైరస్ ధాటికి విలవిల్లాడిన మహా విశాఖ నగర పాలక సంస్థ.. మెల్లమెల్లగా కోలుకుంటోంది. మార్చి నెల నుంచి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టిన కోవిడ్.. కొత్త ఆర్థిక సంవత్సరంలో రూపాయి.. రూపాయి పోగు చేసుకుంటోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో రాయితీ ప్రకటనతో ఖజానాకు కాస్త ఊరటనిస్తోంది. అయితే సర్వర్ సమస్య వేధిస్తోంది. ఫలితంగా పన్ను చెల్లింపుల కోసం ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ ప్రభావంతో 2019–20 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూలులో లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. రూ.350 కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నామని జీవీఎంసీ ప్రకటించినా.. లక్ష్యానికి రూ.120 కోట్ల దూరంలో కేవలం రూ.236 కోట్లతో సరిపెట్టుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ రాయితీ ప్రకటన చేయడంతో నెమ్మది నెమ్మదిగా జీవీఎంసీ ఖజానాకు కాసులు వచ్చి చేరుతున్నాయి. మూడు నెలల్లో రూ.94.32 కోట్లు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్ 14 వరకూ లాక్డౌన్ ప్రకటించడంతో అన్నీ మూతపడ్డాయి. ఫలితంగా వ్యాపారాలు దెబ్బతినడంతో పన్ను చెల్లింపులకు కూడా భారమవుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు 2019–20 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగిసిపోయింది. 2020–21 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. తొలుత ఏప్రిల్ నెలాఖరు వరకూ 5 శాతం రాయితీతో పన్ను చెల్లించుకునేందుకు జీవీఎంసీ అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడకపోవడంతో రాయితీ ప్రకటనను జూన్ 30వ తేదీ వరకూ పొడిగించడంతో పన్ను చెల్లింపుదారులు ఊరట చెందారు. ఏప్రిల్, మే, జూన్ 29వ తేదీ వరకూ మూడు నెలల కాలంలో మొత్తం రూ.94.32 కోట్లు వసూలయ్యాయి. మొరాయిస్తున్న సర్వర్లు ప్రతి సంవత్సరం వడ్డీ రాయితీ వంటి ప్రోత్సాహకాలు ప్రకటించిన సమయంలో పెద్ద మొత్తంలో పన్నులు వసూలవుతుంటాయి. రాయితీ కోసమే పన్ను చెల్లింపుదారులు చాలా వరకూ ఎదురుచూస్తుంటారు. లక్షల రూపాయలు పన్నులు చెల్లించే బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, కార్యాలయాల యజమానులు కూడా రాయితీ రోజుల్లోనే పన్ను చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కరోనా ప్రభావంతో మీసేవ, ఈసేవ కేంద్రాల్లో పన్ను చెల్లింపుల్ని నిలిపివేశారు. దీంతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సౌకర్యం కేంద్రంతో పాటు అన్ని జోనల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లపైనే ఆధారపడ్డారు. కొంత మంది మాత్రమే డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ ఎప్పటిలాగానే మొరాయించడంతో పన్ను చెల్లింపుదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి సౌకర్యం సెంటర్‌తో పాటు జోనల్ కార్యాలయాల వద్ద బారులు తీరుతూ పన్ను చెల్లింపు కోసం ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. సర్వర్ మాటిమాటికీ మొరాయిస్తుండటంతో చాలా మంది చెల్లింపులు పూర్తి చేయకుండానే వెనుదిరిగారు. మూతపడిన జోన్–3 కార్యాలయం జోన్–3 పరిధిలో 49,066 అసెస్మెంట్లు ఉన్నాయి. మొత్తం ఈ కార్యాలయ పరిధి నుంచి రూ.50.72 కోట్లు పన్ను చెల్లింపులు జరగాల్సి ఉంది. అయితే ఇటీవలే జోన్–3 కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందికి కరోనా సోకడంతో ఆ కార్యాలయ పరిధిలో పన్ను చెల్లింపు కేంద్రాన్ని మూసివేశారు. దీంతో ఆ పరిధిలో ఉన్న చెల్లింపుదారులంతా సమీపంలో ఉన్న ప్రధాన కార్యాలయ సౌకర్యం కేంద్రంపైనే ఆధారపడ్డారు. దీంతో సోమవారం ఇక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరి అవకాశం వినియోగించుకోండి.. కమిషనర్ సూచనల మేరకు జీవీఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన పన్ను చెల్లింపు కౌంటర్లని సది్వనియోగం చేసుకోవాలి. లాక్డౌన్ కాలంలోనూ పన్ను చెల్లింపులు సజావుగా నిర్వహించాం. లాక్డౌన్ కారణంగా పరిమితులు ఉండడంతో చెల్లింపుల్లో జాప్యం జరిగింది. లేదంటే గతేడాది కంటే మెరుగ్గానే పన్నులు వసూలయ్యే అవకాశం ఉండేది. మంగళవారం రాయితీకి చివరి రోజు కావడంతో ప్రజలంతా ఈ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోండి. సకాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి దోహదపడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. –ఫణిరామ్, జీవీఎంసీ డిప్యూటీ కమిషనర్(రెవెన్యూ) -
అమ్మ త్వరలో ఇంటికి ..అన్నాడీఎంకే నేత వెల్లడి
-
అమ్మ త్వరలో ఇంటికి
అన్నాడీఎంకే నేత వెల్లడి సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని.. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో ఆస్పత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని అన్నాడీఎంకే వెల్లడించింది. లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ సమక్షంలో అపోలో ఆస్పత్రి వైద్యులు, ఎయిమ్స్, సింగపూర్ వెద్య నిఫుణులు జయలలిత ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేసి దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి గురువారం ప్రకటించారు. కాగా, అపోలో ఆస్పత్రి మాత్రం దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. జయలలిత ఆస్పత్రిలో చేరి గురువారానికి 29 రోజులైంది. సీఎం జయ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శివకుమార్ నేతృత్వంలో ప్రారంభమైన చికిత్సలో ఆ తర్వాత లండన్, ఎయిమ్స్, సింగపూర్ వైద్యులు పాలుపంచుకున్నారు. ప్రస్తుతం జయలలితకు ఫిజియోథెరపీ మాత్రమే కొనసాగుతోంది. కాగా, జయ డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకునేందుకు లండన్ డాక్టర్ రిచర్డ్ మరో నాలుగు రోజుల్లో చెన్నై రానున్నట్లు తెలుస్తోంది. అమ్మ కోలుకోవాలని కోరుతూ అనేక ఆలయాల్లో అన్నాడీఎంకే శ్రేణులు గురువారం కూడా ప్రార్థనలు నిర్వహించాయి. జయలలిత అనారోగ్యానికి గురైందన్నవేదనతో ఈనెల 13న శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్న తమిళనాడులోని కుంభకోణానికి చెందిన మోహన్‌కుమార్(48) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. -
వదంతులకు చెక్
-
వదంతులకు చెక్
గవర్నర్ ప్రకటనతో ఊరట అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆనందం అమ్మ జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టే పరిణామం శనివారం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ (ఇన్చార్జ) విద్యాసాగర్‌రావు అమ్మను పరామర్శించారు. అనంతరం విడుదల చేసిన ప్రకటన అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించడం గమనార్హం. సాక్షి, చెన్నై: జ్వరం, డీ హైడ్రేషన్‌తో సీఎం జయలలిత గత నెల 22వ తేదీ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన జయలలితకు అక్కడ వైద్య బృందం మెరుగైన సేవల్ని అందిస్తూ వస్తున్నారు. వారం రోజుల పాటు అమ్మ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశారు. తదుపరి బులిటెన్లు ఆగడం, అన్నాడీఎంకే వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో సీఎం జయలలితకు వ్యతిరేకంగా గత రెండు రోజులుగా వదంతులు హోరెత్తే పనిలో పడ్డాయి. అదే సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్పందిస్తూ, సీఎం ఆరోగ్యంపై అధికారిక ప్రకటన, ఫొటోతో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అయితే, అలాంటి ప్రయత్నాలు జరగని దృష్ట్యా, వదంతులు మరింతగా హల్చల్ చేశాయి. వీటిపై పోలీసులు తీవ్రంగా స్పందించే పనిలో పడ్డారు. వదంతులు సృష్టించే వారిపై చర్యలకు సిద్ధం అవుతూ, తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ పరిస్థితుల్లో శనివారం ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ అమ్మకు వైద్య సేవల్ని విస్తృతం చేసే పనిలో పడ్డారు. వదంతులకు చెక్: శనివారం అమ్మ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేయడంతో ఉత్కంఠ బయలు దేరింది. అయితే, అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆమెకు చికిత్స కొనసాగుతుందని , ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వలర్మతి భరోసా ఇస్తూ వచ్చారు. ప్రజల గురించి ఆలోచించే అమ్మ జయలలిత ప్రజా సేవను ఆసుపత్రి నుంచే కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే, ఆ పార్టీ నేత బన్రూటి రామచంద్రన్ స్పందిస్తూ, డాక్టర్ రిచర్డ్ నేతృత్వంలో అమ్మకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని, త్వరితగతిన కోలుకుని ప్రజల్లోకి వస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఫొటోలు విడుదల చేయాల్సిన అవసరం లేదని, ప్రజలకు తాము సమాధానం ఇవ్వాలేగానీ, ప్రతి పక్షాలకు కాదని పరోక్షంగా కరుణానిధికి చురకలు అంటిస్తూ, అమ్మ ఆరోగ్యంగా ఉన్నారన్న ధీమాను మరో మారు వ్యక్తం చేశారు. అయినప్పటికీ వదంతులు సాగడం, రాష్ట్ర గవర్నర్(ఇన్చార్జ) విద్యాసాగర్ రావు అపోలో ఆసుపత్రికి సాయంత్రం ఆరేడు గంటలకు రానున్న సమాచారంతో అధికారిక ప్రకటన వెలువడొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో ఆ పరిసరాల్లో భద్రతను మరింత పటిష్టం చేయడంతో మీడియా దృష్టి అంతా అపోలో ఆసుపత్రి వైపుగా మరలింది. ఆరున్నర గంటల సమయంలో ఆసుపత్రికి చేరుకున్న గవర్నర్ విద్యా సాగర్‌రావు అర గంట పాటు అక్కడ ఉండి తిరుగు పయనం అయ్యారు. కాసేపటికి రాజ్ భవన్ నుంచి విడుదలైన ప్రకటనతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆనందం వికసించింది. అలాగే, వదంతులకు చెక్ పెట్టినట్టు అయింది. ప్రకటనతో ఊరట: అమ్మ చికిత్స పొందుతున్న వార్డులోకి తాను వెళ్లినట్టు, అక్కడ అందిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించినట్టు గవర్నర్ విద్యాసాగర్‌రావు తన ప్రకటనలో వివరించారు. వైద్యుల్ని అడిగి చికిత్సా వివరాలు తెలుసుకున్నట్టు పేర్కొన్నారు. సీఎం జయలలిత కోలుకుంటున్నట్టు వైద్యులు తన దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆమె త్వరితగతిన కోలుకోవాలని తాను ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య బృందానికి గవర్నర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, రాష్ట్ర మంత్రులు ఓ పన్నీరు సెల్వం, ఎడపాడి పళనిస్వామి, తంగమణి, ఎస్పీ వేలుమణి, సి.విజయ భాస్కర్, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, సలహాదారు షీలా బాలకృష్ణన్ గవర్నర్ విద్యా సాగర్ రావుతో ఉన్నారు. -
జయమ్మ కోలుకుంటోంది.. ఆలయాల్లో బారులు
-
జయమ్మ కోలుకుంటోంది.. ఆలయాల్లో బారులు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధినేత జయలలిత కోలుకుంటున్నారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా గురువారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమెను సుబ్బయ్య విశ్వనాథన్ అనే చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. 'గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పర్యవేక్షణలో ఉంచాం. పూర్తిస్థాయిలో కోలుకోగానే డిశ్చార్జి చేస్తాం' అని విశ్వనాథన్ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కాగా, జయలలితకు చికిత్స చేస్తున్న నేపథ్యంలో ఆ ఆస్పత్రి ప్రాంగణంలో దాదాపు 500 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఆస్పత్రి వైపుగా వెళ్లే అన్ని మార్గాలు మూసి వేసి ఆ ప్రాంతాల్లో ఉన్నవారికి ఇంటి నుంచే పనిచేసేలా ఆదేశాలు ఇచ్చారు. ఇదిలా ఉండగా, జయలలిత త్వరగా కోలుకోవాలని ఆమె భక్తులు, అభిమానులు, కార్యకర్తలు, అనుచర వర్గం ఇప్పటికే ఆలయాల్లో బారుల తీరారు. పొర్లు దండాలు పెడతూ మొక్కు చెల్లించుకుంటున్నారు. చెన్నైలో పలువురు ముస్లిం కార్పొరేటర్లు మసీదుల్లో ప్రత్యేక ప్రార్ధనలు చేయిస్తున్నారు. -
కోలుకుంటున్న చెన్నై
-
బాలచందర్‌కు రజనీ, కుష్బూ పరామర్శ
ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ క్రమంగా కోలుకుంటున్నారని చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బాలచందర్ ఆరోగ్యంపై ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. కాగా, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ కావేరి ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న బాలచందర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, దానిపై ఎవరూ ఎలాంటి వదంతులు సృష్టించొద్దని ఈ సందర్భంగా కుష్బూ చెప్పారు.