Wrong UPI ID Transfer: ఆధునిక కాలంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటివి వాటి ద్వారా ఎక్కువ ట్రాన్సక్షన్స్ జరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఉన్న చాలా మంది ఇప్పుడు ఈ యాప్స్ ద్వారానే లావాదేవీలను చేస్తుంటారు. అయితే ఇలా ట్రాన్సక్షన్స్ జరిగే సమయాల్లో అప్పుడప్పుడు అనుకోకుండా వేరే ఖాతాలకు అమౌంట్ సెండ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి అనుభవం చాలామందికి ఎదురై ఉంటుంది. అలాంటి సందర్భంలో అమౌంట్ మళ్ళీ ఎలా పొందాలి? ఎవరికి పిర్యాదు చేయాలనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
✸ ఒక వ్యక్తి అనుకోకుండా యూపీఐ ద్వారా అమౌంట్ వేరే ఖాతాలకు పంపించినప్పుడు ముందుగా ఆ వ్యక్తిని కాంటాక్ట్ అవ్వాలి. అనుకోకుండా అమౌంట్ పంపించామని, దాన్ని తిరిగి పంపించాలని అడగాలి. నిజాయితీగా ఉండే వ్యక్తులు తప్పకుండా అమౌంట్ తిరిగి పంపిస్తారు. అలా కాకుండా కొంతమంది డబ్బు పంపించనప్పుడు వెంటనే యూపీఐ కస్టమర్ సపోర్ట్ తీసుకోవాలి.
(ఇదీ చదవండి: దేశంలో మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు - టెక్నాలజీలో భళా భారత్)
✸ యూపీఐ కస్టమర్ సపోర్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఏ యూపీఐ ద్వారా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అయిందో ఆ యూపీఐ కస్టమర్ సపోర్ట్‌కి కంప్లైంట్ చేయాలి, పొరపాటున డబ్బు వేరే ఖాతాకు జమయ్యిందని జరిగిన విషయం వెల్లడిస్తే.. వారు తిరిగి డబ్బు వచ్చేలా చేస్తారు.
✸ యూపీఐ కస్టమర్ సపోర్ట్ నుంచి కూడా మీకు సానుకూల స్పందన రాకుండా పోతే, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించాలి. ఆర్‌బీఐ ప్రత్యేకించి ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి 'అంబుడ్స్‌మెన్ ఫర్ డిజిటల్ ట్రాన్సక్షన్స్' (Ombudsman for Digital Transactions) పేరుతో ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. ఆ అధికారికి మీరు పిర్యాదు చేయడం ద్వారా తిరిగి డబ్బు వెనక్కి పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment