Tamil Nadu Governor
-
అభిప్రాయం చెప్పకుండా గవర్నర్ బిల్లుల్ని ఆపరాదు
న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి సందర్భాల్లో ప్రతిష్టంభన ఎలా తొలుగుతుందని ప్రశ్నించింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై ఆమోద ముద్ర వేయడంలో గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఏదైనా బిల్లు కేంద్ర చట్టానికి విఘాతం కలిగిస్తుందని మీరు భావిస్తే, ఆ మేరకు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపుతున్నట్లు గవర్నర్ చెప్పాలి. లేకపోతే ప్రతిష్టంభన తలెత్తుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టంభనను ఎలా అధిగమిస్తుందని మీరు భావిస్తున్నారు? ఇటువంటి ప్రతిష్టంభనను మీరే తొలగించాలి. ఈ విషయం గమనించండి’అని గవర్నర్ తరఫున వాదించిన అటార్నీ జనరల్ వెంకటరమణికి సూచించింది. అటార్నీ జనరల్ వినతి మేరకు తదుపరి విచారణను 10వ తేదీకి వాయిదా వేసింది. -
గౌరవం నిలపాలి!
తమిళనాడు సర్కారుకూ, ఆ రాష్ట్ర గవర్నర్‌కూ పొసగడం లేదన్నది కొన్నేళ్ళుగా జగమెరిగిన సత్యమే. ఆ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నూతన సంవత్సరంలో తమిళనాడు శాసనసభ తొలిసారి సమావేశమైనప్పుడు సభను ఉద్దేశించి గవర్నర్ చేయాల్సిన ప్రారంభ ప్రసంగం వరుసగా మూడో ఏడాది సైతం రచ్చ రాజేసింది. శాసనసభలో ప్రసంగించకుండానే గవర్నర్ ఆర్.ఎన్. రవి నిష్క్రమించడం వివాదాస్పదమైంది. రాష్ట్రాల యూనియనైన భారత సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్రపై ఇది మళ్ళీ చర్చకు తావిచ్చింది. అత్యంత గౌరవాస్పదమైనదైన గవర్నర్ పదవి, ఇటీవల గవర్నర్లు కొందరు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టవశాత్తూ చర్చనీయాంశమవుతోంది. రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టాక రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలతో కయ్యానికి కాలుదువ్వుతూ, రాజ్యాంగ పరిధిని మించి ప్రవర్తిస్తున్నారన్నదీ నిష్ఠురసత్యమే. గవర్నర్ హోదా దుర్వినియోగం కావడం కొత్త ఏమీ కాదు. అదో సుదీర్ఘ చరిత్ర. ఒకప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పిన రోజుల్లో గవర్నర్లు వట్టి రబ్బరు స్టాంపులనే పేరుండేది. కేంద్రం పనుపున రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను ఒక్క కలం పోటుతో బర్తరఫ్ చేశారనే దుష్కీర్తికీ కొదవ లేదు. ఢిల్లీ గద్దెపై పార్టీ జెండా మారినా... ఇప్పుడూ అదే రకమైన దుర్వినియోగం వేరొక పద్ధతిలో కొనసాగుతోందని వాపోవాల్సి వస్తోంది. గతంలో కాంగ్రెస్ పాలకులు చేశారు కాబట్టి ఇప్పుడు మేమూ ఆ రకంగానే ప్రవర్తిస్తామని ప్రస్తుత పాలకులనుకుంటే అది సమర్థనీయం కాదు. రాజ్యాంగ విధినిర్వాహక పదవుల దుర్వినియోగం వ్యక్తులకే కాక, వ్యవస్థకూ మాయని మచ్చవుతుంది. ‘టీమ్ ఇండియా’ అంటూ కేంద్ర పాలకులు తరచూ ఆదర్శాలు పైకి వల్లె వేస్తున్నా, ఆచరణలో జరుగుతున్నది వేరు. బీజేపీయేతర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకొని, రాజ్‌భవన్‌ను రాజకీయ అస్త్రంగా వాడుతున్నారనే ఆరోపణ... కొన్నేళ్ళుగా కేరళ నుంచి కశ్మీర్ దాకా అనేకచోట్ల వినిపిస్తున్నది. తమిళనాట డీఎంకే సర్కారుతో గవర్నర్ రవికి మొదటి నుంచీ ఉప్పూ నిప్పే! ఏళ్ళ తరబడి పాటిస్తూ వస్తున్న వ్యవస్థీకృత సభా సంప్రదాయాలను తోసిరాజనడమే కాదు... లౌకికవాదం సహా పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సాక్షాత్తూ రాజ్యాంగమే లౌకికవాదాన్ని ఔదలదాల్చిన దేశంలో... రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నరే... అది వట్టి యూరోపియన్ సిద్ధాంతమనీ, భారతదేశంలో దానికి చోటులేదనీ వ్యాఖ్యానించారు. అది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ మధ్య ప్రసారభారతి కార్యక్రమంలో, ఇప్పుడు చట్టసభలో జాతీయ గీతాలాపనపై ఆయన రగడ చేశారు. నిజానికి, తమిళనాట అధికారిక కార్యక్రమాలన్నిటా ‘తమిళతల్లి స్తుతి’ (తమిళ్‌తాయ్ వాళ్తు)ని ప్రార్థనా గీతంగా పాడడం 1970 నుంచి ఉన్నదే. 2021 డిసెంబర్లో దాన్ని రాష్ట్ర గీతంగానూ ప్రకటించారు. తమిళ ప్రభుత్వ కార్యక్రమాలన్నిటినీ తమిళ్‌తాయ్ వాళ్తుతో ఆరంభించి, జాతీయ గీతాలాపనతో ముగించడం దశాబ్దాల సంప్రదాయం. ఆ సంగతే ముందుగానే ప్రభుత్వం చెప్పినప్పటికీ, దాన్ని గౌరవించాల్సిన గవర్నర్ పదేపదే విభేదించడం, అంతటితో ఆగక ‘ద్రావిడనాడు’ భావనపైనే అభ్యంతరాలు చెప్పడం, ఒక కార్యక్రమంలో అధికారిక గీతం నుంచి ద్రావిడనాడు ప్రస్తావన అనుమానాస్పద రీతిలో తొలగింపునకు గురికావడం... అన్నీ వివాదాలే. సభాసమావేశాల ప్రారంభ ప్రసంగంలో ప్రభుత్వ విధానప్రకటనను సభ్యుల ముంగిట ప్రతిపాదించడం గవర్నర్ రాజ్యాంగ విధి. కానీ, 2023లోనూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రసంగ పాఠంలో ‘ద్రావిడ నమూనా పాలన’ సహా కొన్ని అంశాలను రవి ఉద్దేశపూర్వకంగానే వదిలేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయన్నదీ చదవలేదు. అదేమంటే, ప్రసంగపాఠంలో కొన్ని అంశాలు తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ తీవ్రమైన వ్యాఖ్యే చేశారు. పెరియార్ రామసామి, కామరాజ్, అణ్ణాదురై, కరుణానిధి, అంబేడ్కర్ లాంటి పేర్లను చదవడానికి నిరాకరించడం, ‘తమిళనాడు’ బదులు ‘తమిళగం’ అనాలనడం రవిపై గతంలోనే విమర్శల వేడి పెంచాయి. ఇలా రాజ్యాంగ పరిధిని పదేపదే ఉల్లంఘించి, వివాదాలకు కేంద్రమవడం సరికాదు. ఆ మాటకొస్తే ప్రజలెన్నుకున్న ప్రభుత్వంతో కేంద్ర పాలకులు కూర్చోబెట్టిన గవర్నర్లు తలపడడం, ప్రభుత్వ అధికారిక బిల్లుల్ని ఆమోదించకుండా తాత్సారం చేయడం, వైస్ ఛాన్సలర్ల నియామకానికి మోకాలడ్డడం, బాహాటంగా పాలనను విమర్శించడం... ఇవన్నీ పశ్చిమ బెంగాల్, పంజాబ్, కర్ణాటక సహా పలుచోట్ల కొద్దికాలంగా చూస్తున్నదే. రాజ్భవన్లు రాజకీయ కేంద్రాలవుతున్నాయన్న విమర్శకు ఇలాంటివే కారణం. ప్రాథమిక హక్కుల్లో భాగంగా వ్యక్తిగత హోదాలో ఎవరికి ఎలాంటి అభిప్రాయాలున్నా తప్పు లేదు. భావప్రకటన స్వేచ్ఛను తప్పుపట్టనూ లేము. కానీ, రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తుల నుంచి ఆశించేది వేరు. సదరు హోదా తాలూకు గౌరవానికి భిన్నమైన అభిప్రాయాల్ని వ్యక్తీకరించినా, ప్రజా ప్రభుత్వ పాలనకు రాజ్యాంగహోదాతో అభ్యంతరం చెప్పినా అది హర్షణీయం కాదు. ఒక విధంగా అది రాజ్యాంగ విధులకే ఉల్లంఘన. రాష్ట్ర మంత్రిమండలి సలహా సూచనల మేరకే గవర్నర్ వ్యవహరించాలంటూ 1974లోనే ఏడుగురు సభ్యుల సుప్రీమ్ కోర్ట్ ధర్మాసనం చెప్పిన మాట శిరోధార్యం కావాలి. కేంద్రంలో రాష్ట్రపతి లాగా, రాష్ట్రంలో ప్రభుత్వ ఆలోచనకు అద్దం పట్టాల్సిన గవర్నర్లు ఆ రాజ్యాంగ విధిని విస్మరించ లేరు. వన్నె తగ్గించే పనుల్ని మానుకుంటేనే ప్రజాస్వామ్య స్ఫూర్తి గెలుస్తుంది. రాజ్యాంగ రూపకర్తల సదాశయం నిలుస్తుంది. -
తమిళనాడు గవర్నర్ రవిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దోషిగా తేలిన డీఎంకే నాయకుడిని తిరిగి మంత్రివర్గంలో చేర్చుకోవడానికి ఆర్ఎన్ రవి నిరాకరించడంపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే.. ప్రభుత్వం ఏం చేస్తుందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు అటు కేంద్రం, ఇటు ఆర్ఎన్ రవిపై సుప్రీం మండిపడింది. కాగా జైలు శిక్ష నిలుపుదలతో ఎమ్మెల్యే పదవిని మళ్లీ దక్కించుకున్న డీఎంకే సీనియర్ నేత కే పొన్ముడిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తిరిగి చేర్చుకోవడానికి గరవ్నర్ రవి నిరాకరించడంపై సీఎం స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. గవర్నర్ చర్య రాజ్యాంగ నైతికతకు విరుద్దమని పేర్కొంది. ఈ పిటిషన్‌పై సీజేఐ చంద్రచూడ్, జస్టిస్‌లు బీవీ పార్ధివాలా, మనోజ్‌కుమార్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. డీఎంకే నేత కే పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్‌కు రేపటి వరకు(శుక్రవారం) ఒక రోజు సమయం ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. ‘రేపు గవర్నర్ మా మాట వినకుంటే.. రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాల్సిందిగా ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తాం. తమిళనాడు గవర్నర్ ప్రవర్తనపై మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము. గవర్నర్ అలా చేయకుండా ఉండాల్సింది. అతను. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అతిక్రమించాడు. మేము దీనిపై ఓ కన్నేసి ఉంచుతాం. రేపు (శుక్రవారం) నిర్ణయం తీసుకుంటాం ’ అంటూ సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఎన్నికల యుద్ధానికి సై.. ఈ రాష్ట్రాల్లో గెలుపెవరిది? కాగా అక్రమాస్తుల కేసులో మద్రాస్ హైకోర్టు గత ఏడాది డిసెంబర్లో మూడేళ్లు జైలు శిక్ష విధించడంతో ఎమ్మెల్యే, మంత్రి పదవికి పొన్ముడి అనర్హుడైన విషయం తెలిసిందే. ఆయన ప్రతినిథ్యం వహించిన తిరుక్కోవిలూరు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీగా ఉన్నట్టు గెజిట్‌లో కూడా ప్రకటించారు. ఈ పరిస్థితులలో జైలు శిక్షను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు గత వారం తీర్పు వెలువరించింది. ఈ పరిణామాలతో పొన్ముడికి మళ్లీ ఎమ్మెల్యే పదవి దక్కింది. అదే సమయంలో ఆయనకు మరోసారి మంత్రి పదవి అప్పగిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన సిఫారసును రాజ్‌భవన్‌కు పంపించారు. అయితే గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేయలేదు. ప్రమాణ స్వీకారం చేయించేందుకు నిరాకరించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. గవర్నర్ తీరును అందులో వివరించారు. కోర్టు ఉత్తర్వులను గవర్నర్ గౌరవించడం లేదని పేర్కొంటూ, పొన్ముడికి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలని గవర్నర్‌ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ గురువారం విచారణకు రాగా.. గరర్నర్ ప్రవర్తనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. -
ప్రసంగం పూర్తి పాఠం చదవని గవర్నర్
రాష్ట్ర అసెంబ్లీ వేదికగా సోమవారం మరోమారు ప్రభుత్వం – గవర్నర్ మధ్య వివాదం భగ్గుమంది. ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని చదివేందుకు గవర్నర్ ఆర్ఎన్ రవి నిరాకరించారు. తొలుత తమిళంలో మాట్లాడుతూ అందరికీ ఆహ్వానం పలికిన ఆయన తర్వాత తనకు కేటాయించిన కూర్చీలో మౌనంగా కూర్చుండిపోయారు. దీంతో గవర్నర్ తరపున ఈ ప్రసంగం తమిళ తర్జుమా పాఠాన్ని స్పీకర్ అప్పావు సభకు వినిపించారు. ఇది ముగియగానే సభ నుంచి ఆర్ఎన్ రవి హఠాత్తుగా లేచి బయటకు వెళ్లి పోయారు. కాగా జాతీయ గీతం ఆలపించేందుకు ముందుగానే గవర్నర్ సభ నుంచి వెళ్లి పోవడం వివాదానికి దారి తీసింది. సాక్షి, చైన్నె: సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి – గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. గత ఏడాది అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగాన్ని పక్కన పెట్టి, అందులో కొత్త అంశాలను గవర్నర్ చేర్చడం రచ్చకెక్కింది. ఇలాంటి పరిస్థితి ఈ ఏడాది పునరావృతం కాకుండా ముందుగానే గవర్నర్‌కు ప్రసంగంలోని అంశాలను ప్రభుత్వం పంపించింది. దీంతో కొత్త ఏడాదిలో తొలి సమావేశం వివాదాలకు ఆస్కారం లేకుండా గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతుందని అందరూ భావించారు. అయితే సోమవారం అసెంబ్లీలో ఇందుకు భిన్నంగా పరిస్థితులు నెలకొన్నాయి. మరోమారు గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేసినట్లుగా అర్ధాంతరంగా వెళ్లి పోవడం వివాదానికి దారి తీసింది. తొలి సమావేశం.. సెయింట్ జార్జ్ కోటలోని అసెంబ్లీ భవనంలో ఉదయం కొత్త ఏడాదిలో తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన గవర్నర్ ఆర్ఎన్ రవిని స్పీకర్ అప్పావు, అసెంబ్లీ కార్యదర్శి శ్రీనివాసన్ ఆహ్వానించారు. అసెంబ్లీ ఆవరణలో భద్రతా సిబ్బంది వద్ద గౌరవ వందనం స్వీకరించి, జాతీయ గీతం ముగియగానే సభలోకి గవర్నర్ అడుగు పెట్టారు. ఆయనకు సభలో సీఎం స్టాలిన్ మొదలు అందరు సభ్యులు లేచి నిలబడి ఆహ్వానం పలికారు. తమిళనాడు సభ నిబంధనలకు అనుగుణంగా తొలుత తమిళ తల్లి గీతం ఆలపించారు. ముందుగా జాతీయ గీతం ఆలపించాలన్న ప్రస్తావనను గవర్నర్ ఈ సమయంలో తీసుకొచ్చినట్లు సమాచారం. సభ నిబంధనలకు అనుగుణంగా తొలుత తమిళ తల్లి గీతం, చివర్లో జాతీయ గీతం ఆలపించడం జరుగుతుందని ఆయనకు స్పీకర్ అప్పావు వివరణ ఇచ్చినట్లు తెలిసిందే. తమిళ తల్లి గీతం తదుపరి గవర్నర్ ఆర్ఎన్ రవి తమిళంలో మాట్లాడుతూ అందరినీ ఆహ్వానించారు. ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని పక్కన పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేసినానంతరం తనకు కేటాయించిన సీట్లో మౌనంగా కూర్చున్నారు. దీంతో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రసంగ పాఠం తమిళ తర్జుమాను స్పీకర్ అప్పావు సభకు వినిపించారు. హఠాత్తుగా లేచి వెళ్లి పోయిన గవర్నర్ గవర్నర్ ప్రసంగాన్ని స్పీకర్ అప్పావు వివరిస్తూ రెండున్నర సంవత్సరాల డీఎంకే ప్రభుత్వ ప్రగతి, రికార్డులను, ప్రజాకర్షణ కార్యక్రమాలు, ప్రజా రంజక పాలన, ద్రవిడ మోడల్ గురింతి ప్రస్తావించారు. పుదుమై పెన్, కలైంజ్ఞర్ మగళిర్ తిట్టం, బడుల్లో అల్పాహార పథకం గురించి వివరిస్తూ దేశానికే ఇవి ఆదర్శంగా మారినట్లు పేర్కొన్నారు. నేరాల కట్టడిలో రాజీ లేదని, తమిళనాడు శాంతివనంగా ఉందని పేర్కొంటూ, పౌర చట్టాన్ని తమిళనాడులోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కుల గణనకు చర్యలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞిప్తి చేశారు. కచ్చదీవులలో తమిళ జాలర్లకు భద్రతకు చర్యలు తీసుకుంటామని, కావేరి తీరంలో మేఘదాతులో కర్ణాటక డ్యాం నిర్మాణ ప్రయత్నాలకు అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. గ్లోబెల్ ఇన్వెస్టర్స్ మీట్, తాగునీటి పథకాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఎగుమతులు, వైద్య రంగంలోనే కాదు క్రీడా రంగంలోనూ తమిళ ఖ్యాతిని చాటే విధంగా వ్యాఖ్యలు చేశారు. దివ్యాంగులకు పింఛన్‌ను రూ. 2 వేలు చేసినట్లు, స్వయం సహాక బృందాలకు రుణాలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ, కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల తమిళనాడుకు రూ. 20 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రకటించారు. మెట్రో ఫేజ్– 2 పనులకు నిధులు, అనుమతులు కరువయ్యాయని పేర్కొంటూ, గత ఏడాది చివర్లో తమిళనాట వరద విలయం గురించి ప్రస్తావించారు. తమిళనాడును ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రాలేదని, కనీస నిధులు కూడా కేటాయించాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎం కేర్ నిధిలో వృథాగా ఉన్న నగదులో రూ.50 వేల కోట్లను తమిళనాడుకు ఇప్పించేందుకు గవర్నర్ ప్రత్యేక చొరవ చూపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రసంగం ముగింపు సమయంలో గాడ్సే అంటూ అప్పావు ఏదో వ్యాఖ్యలు చేయగానే గవర్నర్ హఠాత్తుగా తన సీట్లో నుంచి లేచి వాకౌట్ చేస్తున్న తరహాలో బయటకు వెళ్లి పోయారు. జాతీయ గీతాన్ని ఆలపించే ముందే గవర్నర్ హఠాత్తుగా సభ నుంచి బయటకు వెళ్లడం వివాదానికి దారి తీసింది. అదే సమయంలో సీనియర్ మంత్రి దురై మురుగన్ సభలో ఓ తీర్మానం ప్రవేశ పెట్టారు. ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన గవర్నర్ ప్రసంగంలోని అంశాలను మాత్రమే సభా రికార్డులలో పొందు పరుస్తున్నట్లు, మిగిలినవన్నీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు. గవర్నర్ సభ నుంచి వెళ్లి పోవడం విచారకరమని న్యాయ శాఖమంత్రి రఘుపతి విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అగౌరవ పరిచే విధంగా గవర్నర్ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే మిత్రపక్ష పార్టీల నేతలు, ఎమ్మెల్యేలు గవర్నర్ చర్యలను తీవ్రంగా ఖండించారు. నిబంధనలను విస్మరించిన గవర్నర్ ఈ సమావేశానంతరం స్పీకర్ అప్పావు నేతృత్వంలో సభా వ్యవహారాల కమిటీ భేటీ అయ్యింది. ఇందులో సభలో చర్చించాల్సిన అంశాలను, సభ నిర్వహణ తేదీలు, చర్చల వివరాలు, బడ్జెట్ దాఖలుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను స్పీకర్ అప్పావు మీడియాకు వివరించారు. 7 రోజుల పాటు సభ జరుగుతుందని ప్రకటించారు. 13వ తేదీ సంతాప తీర్మానాలు, 14, 15 తేదీలలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు, చర్చ, 16, 17, 18 తేదీలు సెలవు అని వివరించారు. ఈ నెల 19వ తేదీ ఆర్థిక బడ్జెట్, 20 వ్యవసాయ బడ్జెట్ దాఖలు చేయడం జరుగుతుందన్నారు. 21వ తేదీన ఆదాయ, వ్యయాలకు సంబంధించిన నివేదిక దాఖలు, 22న ఆర్థిక, వ్యవసాయ బడ్జెట్‌పై చర్చతో సభ ముగియనున్నట్లు వివరించారు. రోజూ సభ ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు జరుగుతుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గవర్నర్ అసెంబ్లీలో వ్యవహరించారని ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. గవర్నర్‌ను ఆహ్వానించిన క్రమంలోనే అసెంబ్లీ ఆవరణలో జాతీయ గీతం ఆలపించడం జరిగిందన్నారు. అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధంగా జాతీయ గీతం ముందుగా ఆలపించాలని గవర్నర్ తనను కోరినట్లు, నిబంధనలు మార్చలేమని తాను స్పష్టం చేశానని వివరించారు. ప్రసంగం చదవకుండా గవర్నర్ మౌనంగా కూర్చోవడం శోచనీయమని, అసెంబ్లీని, ప్రజాస్వామ్యాన్ని అగౌరవ పరిచే విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఆయన నడుచుకున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా అసెంబ్లీలో జైలు శిక్షతో అనర్హత వేటుకు గురైన మంత్రి పొన్ముడి సీటును మార్చకుండా, అలాగే ఉంచడం గమనార్హం. పస లేని ప్రసంగం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతి పక్ష నేత పళణిస్వామి మీడియాతో మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగాన్ని స్పీకర్ అప్పావు చదవి వినిపించారని గుర్తు చేస్తూ.. ఇందులో ఏమాత్రం పస లేదన్నారు. రుచి, శుచి లేని అంశాలే ఇందులో ఉన్నట్టు, ఇది పాచి పోయిన(కుళ్లిన) ప్రసంగంగా ఎద్దేవా చేశారు. ప్రభుత్వం – గవర్నర్ – స్పీకర్ మధ్య గొడవలకే అసెంబ్లీ వేదికగా మారిందని విమర్శించారు. తన ప్రసంగానికి ముందుగా జాతీయ గీతం ఆలపించాలని గవర్నర్ కోరినట్టు, ఇందుకు స్పీకర్ నిరాకరించడంతోనే ఆయన ప్రభుత్వ ప్రసంగాన్ని బహిష్కరించినట్లు వివరించారు. ప్రజలకు ఈ ప్రసంగం ద్వారా ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు. కొత్త పథకాలకు చోటు లేకున్నా, సొంత డబ్బాను మాత్రం ఈ పాలకులు ఈ ప్రసంగం ద్వారా బాగానే వాయించుకున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అన్నాడీఎంకే ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు, భవనాలకు ప్రస్తుతం రిబ్బన్ కట్టింగ్లు చేసుకుని తన ఘనత గా చెప్పుకుంటున్నారని విమర్శించారు. సమర్థించిన బీజేపీ గవర్నర్ అసెంబ్లీలో హుందాగా వ్యవహరించారని, నిబంధనలకు అనుగుణంగానే సభలో కూర్చున్నట్లు బీజేపీ శాసన సభా పక్ష నేత నయనార్ నాగేంద్రన్ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ అప్పావు సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా, ఆయన చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలతో సభ నుంచి హఠాత్తుగా గవర్నర్ బయటకు వెళ్లి పోయారని వివరించారు. స్పీకర్ ప్రసంగాన్ని పూర్తి చేసే వరకు గవర్నర్ సభలోనే ఉన్నారని పేర్కొంటూ, తమిళ తల్లి గీతం, జాతీయ గతం వ్యవహారంలో అసెంబ్లీ నిబంధనలను తాము గౌరవిస్తున్నామన్నారు. స్పీకర్ తీరుతోనే సభలో గవర్నర్ మౌనంగా కూర్చున్నారని, చివరకు ఆయన బయటకు వెళ్లేంత పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. -
మూడేళ్లు ఏం చేసినట్లు?
న్యూఢిల్లీ: ఆమోదముద్ర కోసం తన వద్దకు వచ్చిన బిల్లులకు మూడేళ్లుగా ఇంకా ఏ నిర్ణయమూ వెల్లడించని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆగ్రహం వ్యక్తంచేసింది. డీఎంకే సర్కార్ అసెంబ్లీలో ఆమోదింపజేసిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించింది. ‘ పంజాబ్ ప్రభుత్వ కేసులో మేం ఆదేశాలు జారీచేసేదాకా తమిళనాడు గవర్నర్ మేలుకోలేదు. 2020 జనవరి నుంచి తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఆమోదముద్ర వేయలేదు. మూడేళ్లు ఆయన ఏం చేసినట్లు? ఇదే తరహా పంజాబ్ ప్రభుత్వ కేసులో నవంబర్ 10న మేం ఆదేశాలిచ్చాకే అది చూసి ఆర్ఎన్ రవి పాత బిల్లులపై నిర్ణయం తీసుకున్నారు. ఇంతటి తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రమాదకరం’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. ఐదే ఉన్నాయి కోర్టు వ్యాఖ్యానాలపై గవర్నర్ తరఫున హాజరైన అటార్నీ జనరల్(ఏజీ) ఆర్. వెంకటరమణి వాదనలు వినిపించారు. ‘ ఈ బిల్లుల్లో ఎన్నో సంక్షిష్టమైన అంశాలున్నాయి. అయినా ఇవి పాత బిల్లులు. ప్రస్తుత గవర్నర్ 2021 నవంబర్ 18న బాధ్యతలు స్వీకరించకముందు నాటివి. బిల్లుల ఆమోదం ఆలస్యాన్ని ఈ గవర్నర్‌కు ఆపాదించొద్దు. ప్రస్తుతం గవర్నర్ వద్ద కేవలం ఐదు బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 10 బిల్లులను శనివారమే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మళ్లీ ఆమోదించింది’ అని వాదించారు. కేరళ గవర్నర్, కేంద్రానికి నోటీసులు పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తున్నారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌పై ఆ రాష్ట్ర సర్కార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలపాలని కేరళ గవర్నర్, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ‘గవర్నర్ రాష్ట్రానికి అతీతులుగా వ్యవహరిస్తున్నారు. ఆరిఫ్ వద్ద 7–21 నెలలుగా ఎనిమిది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ కేకే వేణుగోపాల్ వాదించారు. -
తమిళనాడు గవర్నర్‌పై బీజేపీ చీఫ్ అసంతృప్తి!
చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై అక్కడి అధికార పక్షం డీఎంకే తీవ్రస్థాయిలో అసంతృప్తితో రగిలిపోతోంది. అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన బాలజీ సెంథిల్‌ను ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే మంత్రి పదవి నుంచి తొలగించడం.. అదీ న్యాయపరమైన చిక్కుల్ని తెచ్చిపెట్టే అంశం కావడంతో గవర్నర్ రవి వెనక్కి తగ్గడం తెలిసిందే. ఈ వ్యవహారం తర్వాత డీఎంకే రోజుకో రీతిలో గవర్నర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వస్తోంది. తాజాగా.. ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ చేస్తున్న విమర్శలు రాజకీయంగా బీజేపీకి మేలు చేసేవే అయినప్పటికీ.. అలాంటి ప్రకటనలకు గవర్నర్ దూరంగా ఉండాలనే తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారాయన. విల్లుపురంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో అన్నామలై పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో.. గవర్నర్ వ్యవహరశైలిపై మీడియా నుంచి ఆయనకు ప్రశ్న ఎదురైంది. ‘‘డీఎంకే సంధించే ప్రతీ ప్రశ్నకు గవర్నర్ రవి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, అది ఆయన పని కాదు. ఎందుకంటే ఆయన రాజకీయనేత కాదు. గవర్నర్ ప్రతిదానికీ సమాధానం చెప్పుకుంటూ పోతే.. ఈ వ్యవహారానికి పుల్‌స్టాప్ పడుతుందా?. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నింటిపై ఆయన (రవి) రోజూ ప్రెస్మీట్లు పెడితే ఈ ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఖచ్చితంగా అంగీకరించదు అని అన్నామలై వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో ఓ జర్నలిస్ట్ పొరుగు రాష్ట్రం తెలంగాణ ప్రస్తావన తెచ్చారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సమస్యలపై రోజూ మీడియాతో మాట్లాడతారని.. అలాంటప్పుడు తమిళనాడు గవర్నర్ అదే చేస్తే అభ్యంతరం దేనికని ప్రశ్నించారు. దానికి అన్నామలై సమాధానమిస్తూ.. అలా జరిగితే అందరికంటే ఎక్కువ సంతోషించే వ్యక్తిని తానేనని, ఎందుకంటే గవర్నర్ అలా మీడియా ముందుకొచ్చి ప్రశ్నిస్తే అధికార పక్షం అక్రమాలు బయట పడతాయన్నారు. కానీ.. గవర్నర్ అలా చేయకూడదనే తాను బలంగా కోరుకుంటున్నట్లు చెప్పారాయన. ‘‘గవర్నర్ ఉంది రాజకీయాలు చేయడానికి కాదని అన్నామలై అభిప్రాయపడ్డారు. గవర్నర్ రాజకీయాలు మాట్లాడకూడదు. ఎందుకంటే అది తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. గవర్నర్ తన పని తాను చేసుకుంటూ పోవాలి. ఒకప్పుడు.. గవర్నర్లు ఆరు నెలలు లేదంటే సంవత్సరానికి ఒకసారి వార్తాపత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మనం చూశాం. అప్పుడది బాగానే ఉండేది. నేను ఇతర రాష్ట్రాల గవర్నర్లపై వ్యాఖ్యానించదలచుకోలేదు. ఎందుకంటే.. ఎవరి పని తీరు వారిది కాబట్టి. కానీ, తమిళనాడు విషయంలో అధికార డీఎంకే తప్పు చేసినప్పుడు.. ఆ పార్టీని బీజేపీ నేత విమర్శించడానికి.. ఓ గవర్నర్ విమర్శించడానికి తేడా ఉంటుంది కదా. అసెంబ్లీ లోపల గవర్నర్ ప్రభుత్వాలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయవచ్చు. అలా కాకుండా నాలాగే రోజూ ప్రెస్ మీట్ పెట్టడం మొదలుపెడితే గవర్నర్ అనే హోదాకి ఉన్న గౌరవం పోతుంది అని అన్నామలై చెప్పారు. ఇదీ చదవండి: మతతత్వ పార్టీలకు ప్రజాదరణ ఉండదు -
అమిత్ షా ఎంట్రీ.. వెనక్కి తగ్గిన తమిళనాడు గవర్నర్
చెన్నై: అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని క్యాబినెట్ నుంచి తప్పిస్తూ గవర్నర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్ని గంటల్లోనే ఆర్.ఎన్. రవి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఇంతకూ అమిత్ షా ఏం చెప్పారు? ఎందుకు సెంథిల్ బాలీజీ విషయంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి వెనక్కి తగ్గారు? క్యాష్ ఫర్ జాబ్స్, మనీల్యాండరింగ్ లాంటి తీవ్రమైన అవినీతి ఆరోపణల కేసుల నేపథ్యంలో క్యాబినెట్ నుంచి మంత్రి సెంథిల్‌ను తొలగిస్తున్నట్లు గవర్నర్ ఆర్.ఎన్.రవి నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం గవర్నర్ తన విచక్షణ అధికారం ఉపయోగించినట్లు రాజ్‌భవన్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఈ నిర్ణయంపై డీఎంకే ప్రభుత్వం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు అర్ధరాత్రి సమయంలో అటార్నీ జనరల్‌తో భేటీ అయిన గవర్నర్ ఆర్ఎన్ రవి.. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలుపుదల చేసినట్లు ప్రకటన విడుదల చేశారు. దీంతో బాలాజీ ప్రస్తుతానికి మంత్రిగానే కొనసాగనున్నారు. గవర్నర్ ఆర్.ఎన్.రవి నిర్ణయం న్యాయ పరంగా చిక్కుల్ని తెచ్చి పెట్టే అవకాశం ఉందనే అనుమానంతోనే అటార్ని జనరల్ సూచన తీసుకోమని అమిత్ షా సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బుధవారం బాలాజీ జ్యూడీషియల్ కస్టడీని జులై 12వ తేదీ వరకు పొడిగించింది స్థానిక కోర్టు. మనీల్యాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఆయన్ని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన చేతిలో ఉన్న శాఖలను ఇది వరకే మరో ఇద్దరు మంత్రులకు సీఎం స్టాలిన్ అందజేయగా.. మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రస్తుతం సెంథిల్ కొనసాగుతుండడం గమనార్హం. ఇదీ చదవండి: అర్ధరాత్రి తమిళనాట హైడ్రామా.. మంత్రి డిస్మిస్‌పై వెనక్కి తగ్గిన గవర్నర్! -
తమిళనాడు Vs తమిళగం దుమారం..వివరణ ఇచ్చిన గవర్నర్
తమిళనాడు రాష్ట్రం పేరు విషయంలో గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలు పెద దుమారం రేపాయి. ఏకంగా తమిళనాడు వర్సెస్ తమిళగం అనే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరదించుతూ గవర్నర్ రవి వివరణ ఇచ్చారు. తాను తమిళనాడుకి వ్యతిరేకిని కానని తాను పేరు మార్చాలని సూచించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని నొక్కి చెప్పారు. తన మాటలను అర్థం చేసుకోకుండా కొందరూ అలా కావాలనే వక్రీకరించారన్నారు. తమిళ ప్రజలు, కాశీకి మధ్య గల చారిత్రక సాంస్కృతిక అనుసంధానం గురించి మాట్లాడుతూ..'తమిళగం' అనే పదాన్న ప్రస్తావించానని చెప్పారు. వాస్తవానికి ఆ రోజుల్లో తమిళనాడు లేదన్నారు. అందుకనే చారిత్రక సాంస్కృతిక సందర్భంలో 'తమిళగం' అనే పదాన్ని సముచితమైనదిగా చెప్పేందుకు యత్నించానన్నారు. అంతేగాదు గవర్నర్ తనపై వస్తున్న వ్యతిరేక వాదనలకు ముంగింపు పలికేలా వివరణ ఇస్తూ.." 'తమిళనాడు' అంటే 'తమిళుల దేశం' అని, 'తమిళగం' అంటే 'తమిళుల ఇల్లు' అని అర్థం. 'నాడు' అనే పదానికి అర్థం 'భూమి'. భారతదేశంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతాన్ని వర్ణించడానికి ఈ పదాన్ని వాడాలని చాలమంది భావిస్తున్నారు. తమిళనాడు భారతదేశంలో అంతర్భాగం కాదనే కథనాన్ని పురికొల్పే వారికి ఈ వాదన సరితూగవచ్చు. దేశం మొత్తానికి వర్తించేది తమిళనాడు కాదని, అలవాటుగా మారింది. నిజం గెలవాలంటే తమిళగం సరైన పదం. విదేశీయలు పాలన కాలంగా మన సంస్కృతి నాశనమై ఇలా ఈ పదం వచ్చిందని వివరణ ఇచ్చారు. కాగా పొంగల్ వేడుకలకు రాజ్‌భవన్ ఆహ్వానంలో తమిళ వెర్షన్లో గవర్నర్‌ని తమిళగ ఆజునర్ లేదా తమిళగం గవర్నర్ అని ప్రస్తావించడం, దానికి తోడు ఆయన కూడా తమిళనాడు పేరు గురించి మాట్లాడటం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను గవర్నర్ రవి ముందుకు తెచ్చారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. అంతేకాదు రవికి వ్యతిరేకంగా అసెంబ్లీలో క్విట్ తమిళనాడు, గెట్ ఔట్ రవి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కూడా. (చదవండి: పెద్దనాన్న ఇంటికి ఉదయ నిధి స్టాలిన్.. ఆనందంతో ఆహ్వానించిన కాంతి అళగిరి) -
Tamil Nadu: అంబేద్కర్ పేరు పలకని గవర్నర్.. డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంతో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అసెంబ్లీ ప్రసంగ పాఠాన్ని గవర్నర్ మార్చి ప్రసంగించారు. ప్రసంగంలో బీఆర్ అంబేద్కర్, పెరియార్, సీఎన్ అన్నాదురై, కరుణానిధి వంటి ప్రముఖుల పేర్లను దాటవేస్తూ కొత్త వ్యాఖ్యలను జోడించారు. ప్రసంగ పాఠంలో మార్పులను గుర్తించిన సీఎం స్టాలిన్.. దీనిపై అభ్యంతరం తెలియజేయగానే గవర్నర్ సభ నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ వివాదం ఆరోజు నుంచి రగులుతూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న గవర్నర్ ప్రవర్తనపై తమిళనాడుతో సహా దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్త వాజీ కృష్ణమూర్తి గవర్నర్ ఆర్ఎన్ రవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. గవర్నర్ అంబేద్కర్ పేరు చెప్పలేకపోతే అతను కశ్మీర్ వెళ్లాలని, అక్కడికి ఉగ్రవాదులను పంపుతామని, వారు ఆయన్ను కాల్చి చంపుతారని బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ‘భారత దేశానికి రాజ్యాంగాన్ని అందించిన పితామహుడు అంబేద్కర్ పేరును ఈ వ్యక్తి ఉచ్చరించడానికి నిరాకరిస్తే, ఆయనను చెప్పుతో కొట్టే హక్కు నాకు ఉందా లేదా?. అసలు గవర్నర్ రాజ్యాంగం పేరుతో ప్రమాణం చేయలేదా? దాన్ని రాసింది అంబేద్కర్ కాదా.. రాజ్యాంగం మీదనే ప్రమణం చేస్తే ప్రసంగంలోని అంబేద్కర్ పేరును ఎందుకు చదవలేదు. అంబేద్కర్ పేరు చెప్పకపోతే కాశ్మీర్‌కు వెళ్లిపో.. మేమే ఓ ఉగ్రవాదిని పంపిస్తాం.. వారు మిమ్మల్ని తుపాకీతో కాల్చిచంపగలరు’ అని డీఎంకే కార్యకర్త శివాజీ కృష్ణమూర్తి అన్నారు. చదవండి: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కార్యాలయంపై సీబీఐ దాడులు.. If he (TN Gov RN Ravi) refuses to utter the name of Ambedkar in his Assembly speech, don't I have the right to assault him? If you (Gov) don't read out the speech given by Govt, go to Kashmir&we'll send terrorists so that they'll gun you down: DMK's Shivaji Krishnamoorthy (12.01) pic.twitter.com/OvcuauylVw — ANI (@ANI) January 13, 2023 మరోవైపు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గవర్నర్‌పై బెదిరింపు వ్యాఖ్యలపై రాజ్ భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎంకేకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని గవర్నర్ డిప్యూటీ సెక్రటరీ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌పై శివాజీ కృష్ణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అవుతోందని చెన్నై సీపీకి రాసిన లేఖలో రాజ్ భవన్ పేర్కొంది. ఈ వీడియోలో శివాజీ కృష్ణమూర్తి గవర్నర్‌పై దుర్భాషలాడటంతో పాటు, పరువు నష్టం కలిగించే విధంగా భయపెట్టే పదజాలాన్ని ఉపయోగించారని లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా శివాజీ కృష్ణమూర్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ ఫిర్యాదును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ క్రైమ్ విభాగానికి పంపారు. -
తమిళనాడు రాజకీయ విభేదాలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
తమిళ సినిమా: ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య విభేదాలు, రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు, బీజేపీ తమిళ భాషాభివృద్ధి అధ్యక్షుడు పేరరసు విళిత్తెళు చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదవన్ సినీ క్రియేషన్స్ పతాకంపై శివగంగ నగర్ మండ్రం అధ్యక్షుడు, నటుడు సీఎం దొరై ఆనంద్ నిర్మిస్తున్న చిత్రం ఇది. మురుగా అశోక్, గాయత్రి జంటగా నటిస్తున్నారు. ఏ.తమిళ్ సెల్వన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ గురువారం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. దర్శకుడు పేరరసు, గిల్డ్ అధ్యక్షుడు జాగ్వర్ తంగం, పారిశ్రామికవేత్త దామ్ కన్నన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ఇక్కడ ఉన్న వారిని చూస్తుంటే తమిళ భాషాభిమానులని తెలుస్తోందన్నారు. ఇప్పుడు తమిళ భాషపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే తమిళంపై రాజకీయాలు చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. తమిళం అన్నా, తమిళనాడు అన్నా ఒకటి కాదా అంటూ ప్రశ్నించారు? తమిళనాడు వర్ధిల్లాలి.. తమిళం వర్ధిల్లాలి అన్నవి రెండు ఒకటే అన్నారు. రాజకీయ పార్టీల్లో పలు విభాగాలు ఉండవచ్చని, అయితే తమిళుడు తమిళుడుగానే ఉండాలని పేర్కొన్నారు. గవర్నర్ అనే వ్యక్తి రెండేళ్లలో వెళ్లిపోతారని తమిళులు ఇక్కడే ఉంటారని అన్నారు. ఈ చిత్రంలోని పాటలు తమిళుడు మోసపోతూనే ఉన్నాడు అనే పదం ఉందన్నారు. అది నిజమేనన్నారు. కాబట్టి తమిళ రాజకీయాల్లో తమిళుడు చిక్కుకోరాదని ఈ సందర్భంగా పేరరసు అన్నారు. -
తమిళనాడు గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. 2008 నవంబర్ 11న ముంబైలో పేలుళ్ల ఘటన జరిగిన నెలల్లోనే ఉగ్రవాదంపై పాకిస్థాన్‌తో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘అంతర్గత భద్రతకు సమకాలీన సవాళ్లు’ అనే అంశంపై కొచ్చిలో ఆదివారం గవర్నర్ మాట్లాడారు. నవంబర్ 11 ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులతో దేశం మొత్తం గాయపడిందన్నారు. ఉగ్రవాదుల కారణంగా దేశమంతా విషాదంలో మునిగిపోతే, ఘటన జరిగి 9 నెలలు గడవకముందే ఇరు దేశాలు (అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని) తీవ్రవాద బాధితులుగా పేర్కొంటూ సంతకాలు చేశాయని గుర్తు చేశారు. పాకిస్థాన్ మనకు మిత్రదేశమా, లేక శత్రు దేశమా ఈ అంశంలో క్లారిటీ ఉండాలని, కన్ఫ్యూజన్ ఉంకూడదని అన్నారు. పాకిస్థాన్‌పై ప్రతీకార చర్య పుల్వామా ఉగ్రదాడి ఘటన తరువాత సర్జికల్ స్ట్రైక్ ద్వారా పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పామని గవర్నర్ రవి వెల్లడించారు. పుల్వామా దాడి అనంతరం భారత యుద్ద విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని తెలిపారు. భారత్ సర్జికల్ స్ట్రైక్ పేరుతో ప్రతీకార చర్య తీసుకుందని అన్నారు. దీని ద్వారా ఎవరైనా ఉగ్రవాదానికి పాల్పడితే తిరిగి అందుకు తగిన భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పారు. చదవండి: మంకీపాక్స్‌తో కేరళ వాసి మృతి.. కేంద్రం కీలక నిర్ణయం మన్మోహన్పై మండిపాటు మన్మోహన్ సింగ్ నాటి పాలనతో పోలిస్తే ప్రస్తుతం భారత అంతర్గత భద్రత మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన సమయంలో అంతర్గత భద్రతకు మావోయిస్టుల ముప్పు ఎక్కువగా ఉండేదని గవర్నర్ ఆరోపించారు. అప్పట్లో తీవ్రవాదుల హింస 185 జిల్లాల్లో ఉండేదని, ఇప్పుడు ఆ సంఖ్య 8 జిల్లాలకు తగ్గినట్లు వెల్లడించారు. ప్రజలు తీవ్రవాదాన్ని తిరస్కరించి సాధారణ పరిస్థితులకు సహకరించడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు కశ్మీర్‌పై రవి మాట్లాడుతూ.. హింసను సహించేది లేదని స్పష్టం చేశారు. తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలన్నారు. దేశ సమైక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడే వారితో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లలో ఎలాంటి సాయుధ గ్రూపుతోనూ చర్చలు జరపలేదని పేర్కొన్నారు. ఒకవేళ జరిగినా రాజకీయాలకు తావులేకుండా.. మావోయిస్టుల లొంగిపోవడం, పునరావాసం కోసమేనని తెలిపారు. మావో ప్రాంతాల్లోని వారికి ప్రత్యేక ఐడియాలజీ ఉంటుందని, వాళ్లు పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని నమ్మరని అన్నారు. అయితే తాము దాన్ని అంగీకరించబోమని, ఇక వాళ్లతో చర్చలు అవసరం లేదని గవర్నర్ రవి తెలిపారు. చదవండి: Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్ తకరారు.. ఏమిటీ వివాదం? -
అతని రిలీజ్ సంగతి మమ్మల్నే తేల్చమంటారా?: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి పేరరివాలన్ విడుదల విషయంలో కేంద్రం, తమిళనాడు గవర్నర్ అనుసరిస్తున్న వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరరివాలన్ విడుదల విషయంలో ఈ నెల పదో తేదీ లోగా తేల్చాలని, లేదంటే అవసరమైన ఆదేశాలను తామే జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఇక ఈ విషయంలో తదుపరి వాదనలేవీ లేవని కనుక కేంద్రం భావిస్తే పేరరివాలన్‌ను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని, రాజ్యాంగ ధర్మాసనం, ఫెడరల్ రాజ్యాంగ విధానానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశంగానే దీనిని భావిస్తున్నట్టు పేర్కొన్న ధర్మాసనం.. ఈ నెల 10లోగా ఏదో ఒక విషయం చెప్పాలని కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. రాజీవ్‌గాంధీ హత్యకేసులో ముద్దాయిలుగా ఉన్న పేరరివాలన్ సహా ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు శాసనసభ ఆమోదించింది. అయితే, ఈ బిల్లును రాష్ట్రపతికి పంపడంలో గవర్నర్ తీవ్ర జాప్యం చేశారు. దీంతో పేరరివాలన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపడంలో గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని, కాబట్టి ఆయన నిర్ణయంతో సంబంధం లేకుండా తమను విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ పీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. తదుపరి వాదనలేవీ లేవని కేంద్రం కనుక స్పష్టంగా చెప్పేస్తే పేరరివాలన్ విడుదలపై ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. మెరిట్ల ఆధారంగా కేసును వాదించడానికి మీరు సిద్ధంగా లేనందున మేము అతనిని జైలు నుండి విడుదల చేయమని ఉత్తర్వు జారీ చేస్తామ. కేంద్రం ఆదేశానుసారం తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తే గనుక అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న దానికి మేము కళ్ళు మూసుకోలేము. అధికారానికి పరిమితులు ఉండొచ్చు. కానీ, రాజ్యాంగం మాత్రం ఆగిపోకూడదు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
ఆరుగురు రాష్ట్రపతులు ఇక్కడి విద్యార్థులే
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆరుగురు రాష్ట్రపతులను అందించిన ఘనత మద్రాసు యూనివర్సిటీకే సొంతమని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. మద్రాసు వర్సిటీ 160వ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించగా రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిగ్రీలు అందుకుంటున్న విద్యార్థుల్లో మూడింట ఒకవంతు అమ్మాయిలుండటంపై కోవింద్ మాట్లాడుతూ ఒక అమ్మాయిని చదివిస్తే రెండు కుటుంబాలను చదివించినట్లేనన్నారు. ‘ మాజీ రాష్ట్రపతులు సర్వేపల్లి రాధాకృష్ణన్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, ఆర్ వెంకట్రామన్, కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం.. వీరంతా ఇక్కడ చదువుకున్న వారే. తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి ఈ వర్సిటీ విద్యార్థే. నోబెల్ బహుమతులు అందుకున్న సీవీ రామన్, సుబ్రమణియన్ చంద్రశేఖర్‌లు సైతం ఇక్కడే చదువుకున్నారు. ఈ వర్సిటీలో విద్యనభ్యసించిన సుబ్బారావు, పతంజలి శాస్త్రిలు ప్రధాన న్యాయమూర్తులుగా ఎదిగారు. ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, సరోజినీనాయుడు, సీ సుబ్రమణియన్‌లు కూడా వర్సిటీకి పేరు తెచ్చినవారే. ఇంతటి పేరు ప్రఖ్యాతులు, ఘనత వహించిన విశ్వవిద్యాలయమిది’ అని కోవింద్ అన్నారు. స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్ పురోహిత్ పాల్గొన్నారు. -
షాకింగ్ : నేను స్నానం చేస్తుంటే గవర్నర్ చూశారు..!
సాక్షి, చెన్నై : ‘నేను స్నానం చేస్తుండగా గవర్నర్ బాత్రూమ్లోకి తొంగి చూశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోండి’ అంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ‘ఆ పెద్దమనిషి చర్య నన్ను షాక్‌కు గురిచేసిందం’ని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి సమస్యలను తెలుకునే ఉద్దేశంతో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ శుక్రవారం కడలూరు జిల్లాలో పర్యటించారు. అధికారులతో సమీక్షా సమావేశాల అనంతరం.. వీధివీధి, ఇల్లిల్లూ తిరుగుతూ పరిస్థితులను ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ ఇంటిలోకి వెళుతూ.. పక్కనున్న మరుగుదొడ్డిలోకి తొంగిచూశారు. లోపల ఓ మహిళ స్నానం చేస్తుండటంతో క్షణంలో వెనుకడుగువేశారు. అయితే, గవర్నర్ చర్యకు షాక్ తిన్న మహిళ కాసేపటికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించిన గవర్నర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో గవర్నర్ వెంట కడలూరు కలెక్టర్, అధికార ఏఐడీఎంకేకి చెందిన కొందరు నేతలు కూడా ఉన్నారు. మరోవైపు గవర్నర్ పర్యటనను నిరసిస్తూ ప్రతిపక్ష డీఎంకే కడలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించింది. మహిళ ఫిర్యాదుపై గవర్నర్‌గానీ, రాజ్‌భవన్‌గానీ ఇంకా స్పందించాల్సిఉంది. కాన్వాయ్ ఢీకొని ఇద్దరి మృతి గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ భద్రతా సిబ్బంది వాహనం ఢీకొని ఇద్దరు మృతిచెందారు. కడలూరు-చెన్నై మార్గంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. -
నన్ను కాదు.. మోదీనే!
తమిళనాట పట్టు సాధించడం లక్ష్యంగానే బన్వరిలాల్ పురోహిత్‌ను కేంద్రంలోని బీజేపీ పాలకులు ప్రథమ పౌరుడిగా రంగంలోకి దించారు. రాజకీయాల్లోనే కాదు, పాలనపరంగా పట్టున్న పురోహిత్, ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు మీద ప్రయోగించిన అస్త్రంగా చెప్పవచ్చు. ఇందుకు బలాన్ని చేకూర్చే రీతిలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. సాక్షి, చెన్నై : రాష్ట్ర గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల వరకు రాజ్‌భవన్ వరకే పరిమితం అన్నట్టుగా బన్వరి లాల్ పురోహిత్ వ్యవహరించారు. రెండు రోజుల క్రితం తమిళనాట ఇక, తానే పాలన అన్నట్టుగా ఆయన వేసిన తొలి అడుగు చర్చకు, వివాదానికి దారితీసింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంలా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఏ విధంగా మారారో, దానికి రెట్టింపుగా, ఏకంగా తమిళనాడు పాలనను పురోహిత్ తన గుప్పెట్లోకి తీసుకునే పనిలో పడ్డట్టు సమాచారం. అదే సమయంలో కిరణ్ బేడీని అనుసరిస్తూ పురోహిత్ ముందుకు సాగుతున్నారనే చర్చ బయలుదేరింది. అయితే, తనను కాదు, ప్రధాని నరేంద్ర మోదీని అనుసరిస్తూ పురోహిత్ పయనం అన్నట్టు కిరణ్ తాజాగా వ్యాఖ్యానించడం గమనించ దగ్గ విషయం. ప్రధాని పిలుపు మేరకే.. పురోహిత్ తనను అనుసరిస్తున్నారన్న ప్రచారం ఊపందుకోవడంతో ఓ మీడియాతో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ స్పందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన గవర్నర్ల మహానాడులో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా ఆదేశాలు వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రసంగాల్లో ప్రజలతో మమేకం కావాలని, ప్రజల్లో ఒకరిగా వారికి దగ్గర కావాలని, వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించినట్టు వివరించారు. అందుకే తాను, ప్రజల్లోకి వెళ్తున్నట్టు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు, ఆయన ఆకాంక్ష మేరకు పురోహిత్ తమిళనాడులో చొచ్చుకు వెళ్తున్నారేగానీ, తనను అనుసరించడం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడే దగ్గరుండి వారి సమస్యలు తెలుసుకునేందుకు వీలుందన్నారు. రాజ్‌భవన్‌కే పరిమితం కాదు గవర్నర్ అంటే, రాజ్‌భవన్‌కే పరిమితం కావాలన్న రూల్ లేదని, ప్రజల్లోకి వెళ్లేందుకు, సమావేశాలు నిర్వహించేందుకు తగ్గ అధికారాలు ఉన్నట్టు వివరించారు. గవర్నర్‌కు అధికారాలు లేనప్పుడు, ఎందుకు అన్ని ఫైల్స్ సంతకం కోసం, ఆమోదం కోసం రాజ్ భవన్‌కు వస్తున్నాయని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. రాజ్ భవన్‌కే పరిమితం కావాల్సిన అవసరం లేదని, ఇక ప్రతి గవర్నర్ ప్రజల్లోకి వెళ్తారని, వారికి దగ్గరగా ఉండి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని అన్నారు. -
తమిళనాడుకు కొత్త గవర్నర్
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు నియమితుల య్యారు. ఆదివారం తమిళనాడు, బిహార్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా, అండమాన్ నికోబార్ దీవులకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో తమిళనాడుకు ఏడాది తర్వాత పూర్తిస్థాయి గవర్నర్‌ను నియమించినట్లయింది. ప్రస్తుతం అసోం గవర్నర్‌గా ఉన్న బన్వారీలాల్ పురోహిత్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమించారు. అలాగే అండమాన్, నికోబార్ దీవుల లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ఉన్న జగదీశ్ ముఖిని పురోహిత్ స్థానంలో అసోం గవర్నర్‌గా నియమించారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సత్యపాల్ మాలిక్‌ను బిహార్ గవర్నర్‌గా నియమించారు. బిహార్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ గంగా ప్రసాద్.. మేఘాలయ గవర్నర్‌గా, ఎన్ఎస్జీలో పని చేసిన రిటైర్డ్ బ్రిగేడియర్ బీడీ మిశ్రా.. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, నేవీ స్టాఫ్ అడ్మైరల్ మాజీ చీఫ్ దేవేంద్ర కుమార్ జోషి.. అండమాన్, నికోబార్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న తమిళనాడుకు ఏడాది కాలంగా పూర్తిస్థాయి గవర్నర్ లేని విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ నుంచి మహా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు తాత్కాలిక గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త గవర్నర్ల గురించి క్లుప్తంగా... బన్వారీలాల్ పురోహిత్: మహారాష్ట్రలోని విదర్భకు చెందిన వ్యక్తి. సామాజిక, రాజకీ య, విద్య, పారిశ్రామిక రంగాల్లో దశాబ్దాలు గా క్రీయాశీలంగా ఉన్నారు. 1977లో రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో నాగ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే ప్రారంభించిన ‘ది హితవాద’ ఇంగ్లిష్ దినపత్రికను పునరుద్ధరించారు. సత్యపాల్ మాలిక్: ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు. బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు. 1990 ఏప్రిల్ 21 నుంచి 1990 నవంబర్ 10 వరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రామ్‌నాథ్ కోవింద్ రాజీనామాతో ఖాళీ అయిన బిహార్ గవర్నర్ పదవి ఈయనకు వరించింది. గంగా ప్రసాద్: 1994లో బిహార్ ఎమ్మెల్సీగా తొలిసారి ఎన్నిక య్యారు. 18 ఏళ్లపాటు ఎమ్మెల్సీగా ఉన్నారు. శాసన మండలిలో విపక్ష నేతగా పని చేశారు. జగదీశ్‌ముఖి: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఎమర్జెన్సీ సమయంలో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఢిల్లీలోని జనక్‌పురి అసెంబ్లీ స్థానం నుంచి 7 సార్లు ఎన్నికయ్యారు. మంత్రిగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేశారు. దేవేంద్ర కుమార్ జోషి: 1974 ఏప్రిల్ 1న ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 2012 ఆగస్టు నుంచి 2014 ఫిబ్రవరి 26 వరకు నేవల్ స్టాఫ్ చీఫ్‌గా చేశారు. ఐఎన్ఎస్ సింధురత్నలో అగ్ని ప్రమాదం జరగడంతో దానికి నైతిక బాధ్యతగా రాజీనామా చేశారు. పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా∙పతకం అందుకున్నారు. బీడీ మిశ్రా: ఎన్ఎస్జీ (బ్లాక్ కాట్ కమాండోస్) కౌంటర్ హైజాక్ టాస్క్ ఫోర్స్ కమాండర్‌గా పనిచేశారు. 1993లో భారత విమానం హైజాక్ అయిన సమయంలో చేపట్టిన సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా కార్గిల్ యుద్ధంలో పాల్గొనేందుకు వలంటీర్‌గా ముందుకొచ్చారు. కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్‌లో చురుకైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నారు. -
'జల్లికట్టు' ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
-
'జల్లికట్టు' ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
చెన్నై: సంప్రదాయ జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని నిలిపివేసేలా రూపొందించిన ఆర్డినెన్స్‌కు తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆమోదం తెలిపారు. జల్లికట్టును పునరుద్ధరించాలంటూ గడిచిన ఐదు రోజులుగా తమిళనాడు వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో దిగివచ్చిన కేంద్రప్రభుత్వం.. శుక్రవారమే ఈ ఆర్డినెన్స్‌కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాలో కొద్దిపాటి మార్పులుచేసి కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఆమోదించాయి. అనంతరం ఆ ఆర్డినెన్స్‌ను తిరిగి రాష్ట్రానికి పంపారు. ఈ ఆర్డినెన్స్ ద్వారా జంతుహింస నిరోధక చట్టాన్ని సవరించి, అందులోని ‘ప్రదర్శన జంతువులు(పర్ఫామింగ్ యానిమల్స్)' జాబితా నుంచి ఎద్దులను తొలగిస్తారు. ఈ ఆర్డినెన్స్‌ను జనవరి 23 నుంచి జరుగబోయే తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సీఎం పన్నీర్ సెల్వం అళంగనలూర్లో ఈ ఆటను రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా వారి సంబంధిత జిల్లాలో జల్లికట్టు ఆటకు స్వీకారం చుట్టనున్నారు. సీఎం పన్నీర్ సెల్వం పలు మార్లు విజ్ఞప్తి చేసినా వెనక్కి తగ్గని నిరసనకారులు.. ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించడంతో ఆందోళనలు విరమించే అవకాశంఉంది. (ఆర్డినెన్సుపై అనుమానాలు.. ఆగని నిరసనలు) -
జయ స్వాగతాన్ని మరువలేను!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. జయలలిత ప్రజల ముఖ్యమంత్రి, ప్రజానేత అని అన్నారు. డైనమిజానికి, ధైర్యసాహసాలకు ఆమె ప్రతీక అని కొనియాడారు. మహిళాశక్తికి, మహిళా సాధికారితకు, మొక్కవోని ధైర్యానికి ప్రతిరూపం జయలలిత అని కీర్తించారు. సెప్టెంబర్ 2న తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను చెన్నై విమానాశ్రయం వచ్చినప్పుడు జయలలిత ఎదురొచ్చి సాదర స్వాగతం పలికారని, ఆమె ఆప్యాయకరమైన స్వాగతం, సౌమ్యమైన మాటలు ఇప్పటికీ తన జ్ఞాపకాలలో తాజాగా ఉన్నాయని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. -
తమిళనాడుకు మహిళా గవర్నర్?
-
తమిళనాడుకు మహిళా గవర్నర్?
- విద్యాసాగర్‌రావుకు పనిభారం - పరిశీలనలో ఆనందీబెన్, నజ్మాహెప్తుల్లా - రెండు రోజుల్లో కేంద్రం ప్రకటన? సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు గవర్నరుగా బీజేపీ సీనియర్ మహిళా నేతలు నజ్మాహెప్తుల్లా, అనందిబెన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రోశయ్య పదవీ కాలం ఆగస్టు 31తో ముగిసింది. సహజంగా గవర్నర్ల పదవీకాలం ముగిసేలోపే కొత్త వారిని ఖరారు చేస్తారు. కర్ణాటక శాసన మండలి చైర్మన్ శంకరమూర్తి పేరును కేంద్రం దాదాపు ఖరారు చేసింది. అయితే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ వివాదం రగులుతున్న తరుణంలో కర్ణాటకకు చెందిన శంకరమూర్తిని గవర్నర్‌గా నియమించడం అగ్నిలో ఆజ్యం పోసినట్లేనని భావించి కేంద్రం వెనక్కు తగ్గింది. దీంతో మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావును గత నెలలో ఇన్చార్జ్గా నియమించింది. ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చికి త్స పొందుతుండటం, ఇప్పట్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం లేకపోవడంతో గవర్నర్ బాధ్యతలు కీలకంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు, సీనియర్ మంత్రులు పన్నీర్‌సెల్వం, పళనిస్వామిలను రాజ్‌భవన్‌కు పిలిపించుకుని పరిస్థితిని గవర్నర్ సమీక్షించాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి నిర్వర్తిస్తున్న ప్రభుత్వ శాఖలను పన్నీర్‌సెల్వంకు అప్పగించడం వంటి కీలక నిర్ణయాలను విద్యాసాగర్‌రావు ఇన్చార్జ్ గవర్నర్ హోదాలోనే తీసుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు చేశాయి. మహారాష్ట్ర, తమిళనాడుల మధ్య తిరుగుతూ బాధ్యతలు నిర్వర్తిస్తున్న గవర్నర్ విద్యాసాగర్‌రావు జయ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఎక్కువరోజులు తమిళనాడులోనే గడపాల్సి వస్తోంది. దీంతో తమిళనాడుకు శాశ్వత గవర్నర్‌ను నియమించాలని కేంద్రం నిర్ణయించింది. గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్, మణిపూర్ గవర్నర్ నజ్మాహెప్తుల్లా పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో ఉన్నందున త్వరలోనే గవర్నర్ నియామకంపై ఒక ప్రకటన రావచ్చని తెలుస్తోంది. -
అమ్మపై కుట్ర
సీబీఐ విచారణకు ఎంపీ శశికళ పుష్ప డిమాండ్ శశికళ పథకం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకుని అన్నాడీఎంకే పార్టీని, ప్రభుత్వాన్ని కైవసం చేసుకునేందుకు శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కుట్రపన్నుతున్నారని ఆ పార్టీ బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపించారు. అక్రమంగా జయ సంతకాన్ని ఫోర్జరీ చేసే ప్రమాదం కూడా ఉందని పేర్కొంటూ తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావుకు సోమవారం ఆమె ఒక లేఖను పంపారు. సోమవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ జయలలిత నెచ్చెలి శశికళపై ఆమె పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చుట్టూ జరిగే అనేక సంఘటనలకు శశికళ కుటుంబ సభ్యులే పాత్రధారులని, అన్నీ ఓ పథకం ప్రకారం జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. జయలలిత అనారోగ్యానికి దారితీసిన పరిస్థితుల్లో సీబీఐ విచారణ అవసరమని శశికళ పుష్ప డిమాండ్ చేశారు. శశికళ, నటరాజన్ వారి కుటుంబ సభ్యులపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున వారందరినీ అపోలో నుంచి పంపించేయాలన్నారు. అన్నాడీఎంకే దిశగా కాంగ్రెస్ గత పదేళ్లుగా డీఎంకేకు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్.. ఇపుడు అన్నాడీఎంకే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతల వైఖరి సైతం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. జయ స్థానంలో పార్టీ పగ్గాలు చేతపుచ్చుకునేందుకు శశికళ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రానున్న ఉప ఎన్నికల్లో తంజావూరు నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం ఊపందుకొంది. అన్నాడీఎంకేకు ఒక జాతీయ పార్టీ అండదండలు అవసరమని భావిస్తున్న శశికళ.. కాంగ్రెస్‌కు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జయలలితను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అకస్మాత్తుగా రావడం శశికళ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు అంటున్నారు. -
వదంతులకు చెక్
-
వదంతులకు చెక్
గవర్నర్ ప్రకటనతో ఊరట అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆనందం అమ్మ జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టే పరిణామం శనివారం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ (ఇన్చార్జ) విద్యాసాగర్‌రావు అమ్మను పరామర్శించారు. అనంతరం విడుదల చేసిన ప్రకటన అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం జయలలిత త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించడం గమనార్హం. సాక్షి, చెన్నై: జ్వరం, డీ హైడ్రేషన్‌తో సీఎం జయలలిత గత నెల 22వ తేదీ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన జయలలితకు అక్కడ వైద్య బృందం మెరుగైన సేవల్ని అందిస్తూ వస్తున్నారు. వారం రోజుల పాటు అమ్మ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు బులిటెన్ విడుదల చేశారు. తదుపరి బులిటెన్లు ఆగడం, అన్నాడీఎంకే వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో సీఎం జయలలితకు వ్యతిరేకంగా గత రెండు రోజులుగా వదంతులు హోరెత్తే పనిలో పడ్డాయి. అదే సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్పందిస్తూ, సీఎం ఆరోగ్యంపై అధికారిక ప్రకటన, ఫొటోతో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అయితే, అలాంటి ప్రయత్నాలు జరగని దృష్ట్యా, వదంతులు మరింతగా హల్చల్ చేశాయి. వీటిపై పోలీసులు తీవ్రంగా స్పందించే పనిలో పడ్డారు. వదంతులు సృష్టించే వారిపై చర్యలకు సిద్ధం అవుతూ, తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ పరిస్థితుల్లో శనివారం ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచర్డ్ అమ్మకు వైద్య సేవల్ని విస్తృతం చేసే పనిలో పడ్డారు. వదంతులకు చెక్: శనివారం అమ్మ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేయడంతో ఉత్కంఠ బయలు దేరింది. అయితే, అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని, ఆమెకు చికిత్స కొనసాగుతుందని , ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో ఆసుపత్రి వద్ద ఉన్న అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వలర్మతి భరోసా ఇస్తూ వచ్చారు. ప్రజల గురించి ఆలోచించే అమ్మ జయలలిత ప్రజా సేవను ఆసుపత్రి నుంచే కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే, ఆ పార్టీ నేత బన్రూటి రామచంద్రన్ స్పందిస్తూ, డాక్టర్ రిచర్డ్ నేతృత్వంలో అమ్మకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని, త్వరితగతిన కోలుకుని ప్రజల్లోకి వస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఫొటోలు విడుదల చేయాల్సిన అవసరం లేదని, ప్రజలకు తాము సమాధానం ఇవ్వాలేగానీ, ప్రతి పక్షాలకు కాదని పరోక్షంగా కరుణానిధికి చురకలు అంటిస్తూ, అమ్మ ఆరోగ్యంగా ఉన్నారన్న ధీమాను మరో మారు వ్యక్తం చేశారు. అయినప్పటికీ వదంతులు సాగడం, రాష్ట్ర గవర్నర్(ఇన్చార్జ) విద్యాసాగర్ రావు అపోలో ఆసుపత్రికి సాయంత్రం ఆరేడు గంటలకు రానున్న సమాచారంతో అధికారిక ప్రకటన వెలువడొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో ఆ పరిసరాల్లో భద్రతను మరింత పటిష్టం చేయడంతో మీడియా దృష్టి అంతా అపోలో ఆసుపత్రి వైపుగా మరలింది. ఆరున్నర గంటల సమయంలో ఆసుపత్రికి చేరుకున్న గవర్నర్ విద్యా సాగర్‌రావు అర గంట పాటు అక్కడ ఉండి తిరుగు పయనం అయ్యారు. కాసేపటికి రాజ్ భవన్ నుంచి విడుదలైన ప్రకటనతో అన్నాడీఎంకే వర్గాల్లో ఆనందం వికసించింది. అలాగే, వదంతులకు చెక్ పెట్టినట్టు అయింది. ప్రకటనతో ఊరట: అమ్మ చికిత్స పొందుతున్న వార్డులోకి తాను వెళ్లినట్టు, అక్కడ అందిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించినట్టు గవర్నర్ విద్యాసాగర్‌రావు తన ప్రకటనలో వివరించారు. వైద్యుల్ని అడిగి చికిత్సా వివరాలు తెలుసుకున్నట్టు పేర్కొన్నారు. సీఎం జయలలిత కోలుకుంటున్నట్టు వైద్యులు తన దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆమె త్వరితగతిన కోలుకోవాలని తాను ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్య బృందానికి గవర్నర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, రాష్ట్ర మంత్రులు ఓ పన్నీరు సెల్వం, ఎడపాడి పళనిస్వామి, తంగమణి, ఎస్పీ వేలుమణి, సి.విజయ భాస్కర్, రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, సలహాదారు షీలా బాలకృష్ణన్ గవర్నర్ విద్యా సాగర్ రావుతో ఉన్నారు. -
వెళ్లొస్తా
తమిళనాడు గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య ఐదేళ్ల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. ఆ బాధ్యతల్ని అందుకునేందుకు మరో తెలుగు గవర్నర్ సిద్ధమయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్ రావుకు తమిళనాడు గవర్నర్ బాధ్యతలు అదనంగా అప్పగిస్తూ రాష్ర్టపతి భవనం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా అందరి మన్ననల్ని అందుకున్న కొణిజేటి రోశయ్య, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం అనూహ్యంగా సీఎం పదవిని అధిరోహించారు. అక్కడి కాంగ్రెస్ రాజకీయ పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరైన ఆయన 2011 జూన్‌లో పదవికి అధిష్టానం ఆదేశాలతో రాజీనామా చేశారు. తలపండిన నేతను గౌరవించుకునే విధంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం రోశయ్యను తమిళనాడు గవర్నర్‌గా ఆగస్టు 26న నియమించింది. ఆయన నియామకంతో ఇక్కడి తెలుగు వారిలో ఆనందం వికసించింది. అదే ఏడాది ఆగస్టు 31న ఆయన బాధ్యతలు స్వీకరించినానంతరం తమిళనాట ఉన్న తెలుగు వారికి రాజ్‌భవన్ ప్రవేశం ఎంతో సులభతరం అయిందని చెప్పవచ్చు. తమిళులకు గౌరవాన్ని ఇస్తూనే, తెలుగువారు పిలిస్తే పలికే గవర్నర్‌గా పేరు గడించారు. తెలుగు వారి కార్యక్రమాలు తన సొంత కార్యక్రమంగా భావించి ముఖ్యఅతిథిగా హాజరవుతూ, తనకు ఉన్న అధికారాల మేరకు ఐదేళ్లుగవర్నర్ పదవికి న్యాయం చేశారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రోశయ్య పదవికి మాత్రం ఎలాంటి ఢోకా రాలేదు. ఇందుకు కారణం, తమిళనాడు ప్రభుత్వంతో ఆయన సన్నిహితంగా మెలగడమేనని చెప్పవచ్చు. ఈ సన్నిహితమే మళ్లీ ఆయన పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం సాగింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు చోటు చేసుకున్నా, ఆయన పదవీ కాలంలో చివరి రోజైన బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు రాష్ర్టపతి భవన్ నుంచి ఇక సేవలకు సెలవు అన్నట్టుగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక సెలవు ఐదేళ్ల పాటు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య పదవీ కాలం బుధవారంతో ముగిసింది. అయితే, ఆయన స్థానంలో పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరగలేదు. కర్ణాటకకు చెందిన శంకరయ్య, గుజరాత్‌కు చెందిన ఆనందిబెన్ పటేల్ పేర్లు వినిపించినా, చివరకు ఇన్చార్జ్ గవర్నర్ నియమించబడ్డారు. ఇందుకు తగ్గ ఉత్తర్వులు రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడ్డాయి. ఇన్చార్జ్గా రాబోతున్న గవర్నర్ కూడా తెలుగు వారు కావడం విశేషం. ఆయనే మహారాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సీహెచ్ విద్యాసాగర్ రావు. కరీంనగర్లో జన్మించిన ఆయన ఆది నుంచి బీజేపీలో తన సేవల్ని అందిస్తూ వచ్చారు. 1985 నుంచి 1998 వరకు ఎమ్మెల్యేగా, 1999లో ఎంపీగా గెలిచిన విద్యాసాగర్ రావు, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విద్యాసాగర్ రావు చెన్నైకు వచ్చి ఇన్చార్జ్ గవర్నర్ బాధ్యతల్ని ఒకటి రెండు రోజుల్లో స్వీకరించే అవకాశం ఉంది. ఆయనకు తన బాధ్యతల్ని అప్పగించి రోశయ్య ఆ పదవి నుంచి తప్పుకుంటారు. -
యాగానికి వచ్చిన గవర్నర్ రోశయ్య
-
తెలుగైతేనే స్పందిస్తారా ?
చెన్నై : అధికార అన్నాడీఎంకే పార్టీ బీజేపీకి చేరువయ్యే కొద్దీ రాష్ట్ర కాంగ్రెస్ ఆరోపణల పర్వం, విమర్శల స్వరం పెంచుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే మధ్య పొత్తుకుదిరి సమష్టిగా పోటీకి దిగిన పక్షంలో ఎలా ఎదుర్కొవాలనే అంశంలో అన్ని పార్టీల్లో కంగారు నెలకొంది. తాజా పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సాగిన నరేంద్రమోదీ ప్రభంజనాన్ని సైతం నిలువరించి రాష్ట్రంలో అమ్మ జయకేతనం ఎగురవేశారు. ఏడాది పాలనలో ఎంతో కొంత ప్రతిష్టను మూటగట్టుకున్న బీజేపీ... అమ్మతో కలిసి అసెంబ్లీకి తలపడితే బలీయమైన శక్తిగా అవతరించగలదనే అభిప్రాయం అందరిలో నెలకొంది. ఆస్తుల కేసులో జయ జైలుపాలు కావడాన్ని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ప్రయోగించాలని ప్రతిపక్షాలు అంచనా వేశాయి. అయితే ఆమె నిర్దోషిగా బైటపడడంతో సదరు అస్త్రాన్ని అటకెక్కించక తప్పలేదు. ప్రతిపక్షాలకు ఇక మిగిలింది అమ్మ కేబినెట్. అమ్మ కేబినెట్ అవినీతిమయం అంటే జయ ప్రభుత్వం అక్రమాలమయం అని చెప్పక చెప్పినట్లే అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. అమ్మ ప్రభుత్వాన్ని ప్రజల్లో అప్రతిష్టపాలు చేయాలంటే అవినీతి ఆరోపణలు ఒక్కటే మార్గమని కాంగ్రెస్ రాష్ట్ర రథసారథి ఈవీకేఎస్ ఇళంగోవన్ తలపోశారు. అమ్మ కేబినెట్లోని మంత్రులు భారీ అవినీతి పరులను ఆరోపిస్తూ గవర్నర్ రోశయ్యకు గత ఏడాది వినతిపత్రం సమర్పించారు. అంతేగాక మంత్రుల అవినీతి వివరాలతో కూడిన జాబితాను సమర్పించినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తమిళ మంత్రులపై తాము చేసిన ఆరోపణలు గవర్నర్ బంగ్లాలో బుట్టదాఖలైనాయని వారు కలవరపడుతున్నారు. కులమతాలు, భాషా భేదాలు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే హోదాలో ఉన్న రోశయ్య మాతృభాషైన తెలుగును ఇళంగోవన్ ప్రస్తావిస్తూ పరుషపూరితమైన వ్యాఖ్యానాలు చేశారు. చెన్నై సత్యమూర్తి భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇళంగోవన్ మాట్లాడుతూ, తమిళ మంత్రులు పాల్పడుతున్న అవినీతి చిట్టాను రాష్ట్రగవర్నర్ కే రోశయ్యకు సమర్పించి ఎనిమిది నెలలు అవుతోంది, ఆ చిట్టా ఏమైందో ఇంత వరకు తెలియలేదని అన్నారు. ఆ అవినీతి చిట్టాను ఆంగ్లం, తమిళంలో ఇచ్చాము, ఒకవేళ రోశయ్యకు తెలుగులో రాసిస్తేనే అర్థం అయ్యేలా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులపై మరో అవినీతి చిట్టాను సిద్ధం చేసేందుకు తాను ఎటువంటి జాప్యానికి పాల్పడటం లేదని అన్నారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోశయ్య
-
రోశయ్యకు కర్ణాటక బాధ్యతలు
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ కే రోశయ్యకు కర్ణాటక తాత్కాలిక గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రపతి కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ శనివారం పదవీ విరమణ చేయనున్నారు. దీంతో రోశయ్యకు అదనపు బాధ్యతులు అప్పగించారు. యూపీఏ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన భరద్వాజ్ ఐదేళ్ల క్రితం కర్ణాటక గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య యూపీఏ హయాంలో తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
అండమాన్‌లో పడవ మునక
-
నిర్లక్ష్యం వల్లే పడవ ప్రమాదాలు: రోశయ్య
చెన్నయ్: అండమాన్ దీవుల్లో బోటు ప్రమాదంలో 21 మంది మరణించిన సంఘటనపై తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య తీవ్రంగా స్పందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి టూరిస్ట్ ఆపరేటర్, బోట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. కొందరు ఆపరేటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రోశయ్య సంతాపం తెలియజేశారు. అండమాన్ బోటు ప్రమాదంలో 21 మంది చనిపోగా, మరొకరి జాడ తెలియరాలేదు. 28 మంది ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన భద్రత చర్యలు తీసుకుంటారని రోశయ్య చెప్పారు. ఆదివారం పోర్ట్ బ్లెయిర్ సమీపంలో టూరిస్టులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. పడవ సామర్థ్యానికి మించి 50 మంది ప్రయాణికులను ఎక్కించుకున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాకు చెందినవారు. ఈ దుర్ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయిల నష్టపరిహారం ప్రకటించారు. -
తిరుమలేశుని సేవలో రోశయ్య
తిరుమల : తమిళనాడు గవర్నర్ రోశయ్య మంగళవారం ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్నారు. విఐపీ దర్శనంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇటీవలే రోశయ్య మనమరాలి వివాహం జరిగిన విషయం తెలిసిందే. నూతన దంపతులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రోశయ్యను టీటీడీ వేద పండితులు రంగనాయకుల మండలంలో వెంకన్న తీర్థ ప్రసాదాలు అందచేశారు.