తమిళనాడు గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు | Anyone Who Uses A Gun Should Be Dealt With A Gun: Tamil Nadu Governor | Sakshi
Sakshi News home page

RN Ravi: తమిళనాడు గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు

Published Mon, Aug 1 2022 1:07 PM | Last Updated on Mon, Aug 1 2022 1:25 PM

Anyone Who Uses A Gun Should Be Dealt With A Gun: Tamil Nadu Governor - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. 2008 నవంబర్‌ 11న ముంబైలో పేలుళ్ల ఘటన జరిగిన నెలల్లోనే ఉగ్రవాదంపై పాకిస్థాన్‌తో భారత్‌ కుదుర్చుకున్న ఒప్పందాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  

‘అంతర్గత భద్రతకు సమకాలీన సవాళ్లు’ అనే అంశంపై కొచ్చిలో ఆదివారం గవర్నర్‌ మాట్లాడారు. నవంబర్‌ 11 ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులతో దేశం మొత్తం గాయపడిందన్నారు.  ఉగ్రవాదుల కారణంగా దేశమంతా విషాదంలో మునిగిపోతే, ఘటన జరిగి 9 నెలలు గడవకముందే ఇరు దేశాలు (అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, పాక్ ప్రధాని) తీవ్రవాద బాధితులుగా పేర్కొంటూ సంతకాలు చేశాయని గుర్తు చేశారు. పాకిస్థాన్‌ మనకు మిత్రదేశమా, లేక శత్రు దేశమా ఈ అంశంలో క్లారిటీ ఉండాలని, కన్ఫ్యూజన్‌ ఉంకూడదని అన్నారు.

పాకిస్థాన్‌పై ప్రతీకార చర్య
పుల్వామా ఉగ్రదాడి ఘటన తరువాత సర్జికల్‌ స్ట్రైక్‌ ద్వారా పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పామని గవర్నర్‌ రవి వెల్లడించారు. పుల్వామా దాడి అనంతరం భారత యుద్ద విమానాలు పాక్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్‌ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయని తెలిపారు. భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ పేరుతో ప్రతీకార చర్య తీసుకుందని అన్నారు. దీని ద్వారా ఎవరైనా ఉగ్రవాదానికి పాల్పడితే తిరిగి అందుకు తగిన భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే వార్నింగ్‌​ ఇచ్చినట్లు చెప్పారు.
చదవండి: మంకీపాక్స్‌తో కేరళ వాసి మృతి.. కేంద్రం కీలక నిర్ణయం

మన్మోహన్‌పై మండిపాటు
మన్మోహన్‌ సింగ్‌ నాటి పాలనతో పోలిస్తే ప్రస్తుతం భారత అంతర్గత భద్రత మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన స‌మ‌యంలో అంతర్గత భద్రతకు మావోయిస్టుల ముప్పు ఎక్కువగా ఉండేదని గవర్నర్‌ ఆరోపించారు. అప్పట్లో తీవ్ర‌వాదుల హింస 185 జిల్లాల్లో ఉండేద‌ని, ఇప్పుడు ఆ సంఖ్య 8 జిల్లాల‌కు త‌గ్గిన‌ట్లు వెల్ల‌డించారు. ప్రజలు తీవ్రవాదాన్ని తిరస్కరించి సాధారణ పరిస్థితులకు సహకరించడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు

కశ్మీర్‌పై రవి మాట్లాడుతూ.. హింసను సహించేది లేదని స్పష్టం చేశారు. తుపాకీ ఉపయోగించే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలన్నారు.  దేశ సమైక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడే వారితో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లలో ఎలాంటి సాయుధ గ్రూపుతోనూ చర్చలు జరపలేదని పేర్కొన్నారు. ఒకవేళ జరిగినా రాజకీయాలకు తావులేకుండా.. మావోయిస్టుల లొంగిపోవడం, పునరావాసం కోసమేనని తెలిపారు. మావో ప్రాంతాల్లోని వారికి ప్ర‌త్యేక ఐడియాల‌జీ ఉంటుందని, వాళ్లు పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్య విధానాన్ని న‌మ్మ‌ర‌ని అన్నారు. అయితే తాము దాన్ని అంగీక‌రించ‌బోమ‌ని, ఇక వాళ్ల‌తో చ‌ర్చ‌లు అవ‌స‌రం లేద‌ని గ‌వ‌ర్న‌ర్ ర‌వి తెలిపారు.
చదవండి: Taiwan News: అమెరికా చైనా మధ్య... తైవాన్‌ తకరారు.. ఏమిటీ వివాదం?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement