
జయ స్వాగతాన్ని మరువలేను!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. జయలలిత ప్రజల ముఖ్యమంత్రి, ప్రజానేత అని అన్నారు. డైనమిజానికి, ధైర్యసాహసాలకు ఆమె ప్రతీక అని కొనియాడారు. మహిళాశక్తికి, మహిళా సాధికారితకు, మొక్కవోని ధైర్యానికి ప్రతిరూపం జయలలిత అని కీర్తించారు.
సెప్టెంబర్ 2న తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను చెన్నై విమానాశ్రయం వచ్చినప్పుడు జయలలిత ఎదురొచ్చి సాదర స్వాగతం పలికారని, ఆమె ఆప్యాయకరమైన స్వాగతం, సౌమ్యమైన మాటలు ఇప్పటికీ తన జ్ఞాపకాలలో తాజాగా ఉన్నాయని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు.