vidyasagar rao
-
అన్ని పక్షాలు కలిస్తేనే ప్రభుత్వం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వమంటే అధికార పక్ష సభ్యులే కాదని, అన్ని పార్టీల సభ్యులు కలిస్తేనే ప్రభుత్వం అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వమని, కేవలం 65 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలను మాత్రమే ప్రభుత్వంగా భావించడం పొరపాటని పేర్కొన్నారు. ఎన్నికల సమ యంలో మాత్రమే వేర్వేరుగా పోరాడాలని, ఎన్నికల తర్వాత అన్ని వర్గాలు కలిసి అభివృద్ధి వైపు ప్రయాణం సాగించాల్సి ఉంటుందని అన్నారు. తమిళనాడు, మహారాష్ట్రల మాజీ గవ ర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకా న్ని ఆదివారం తాజ్ కృష్ణ హోటల్లో హరియణా, ఒడిశా గవర్నర్లు బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ తదితరులతో కలిసి సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.అప్పట్లో చర్చలతో సమస్యలు పరిష్కారమయ్యేవి‘పాలకపక్షం, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం. అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎంత సమయం మైక్ ఇస్తారో.. ప్రధాన ప్రతిపక్ష నేతకు కూడా అంతే సమయం మైక్ ఇస్తారు. ఉమ్మడి ఏపీలో బీజేపీ ప్రాతినిధ్యం చాలా తక్కువే అయినప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చాలా విషయాలు లేవనెత్తేవారు. కమ్యూనిస్టులు కూడా ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేవారు. అసెంబ్లీ వాయిదా పడితే పాలక పక్షం, ప్రతిపక్షం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితులు ఉండేవి. అలాంటి వాతావరణం నెలకొల్పేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 13 నెలల ప్రజాపాలనలో ఒక్క ప్రతిపక్ష సభ్యుడిని కూడా సస్పెండ్ చేయలేదు..’ అని సీఎం చెప్పారు.అన్ని పార్టీల సహకారం అవసరం‘రాష్ట్ర అభివృద్ధికి అన్ని పార్టీల సహకారం అవసరం. సమస్యలొస్తే తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒక్కటి అవుతాయి. అలాంటి సంస్కృతి తెలంగాణలో కూడా పెరగాలి. రాష్ట్ర అభివృద్ధి కంటే రాజకీయాలు ముఖ్యం కాదు. ఈ విషయంలో ప్రజా ప్రభుత్వం ఎలాంటి భేషజాలకు పోదు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడాలి. సమీపంలోని అమరావతితో కాదు. హైదరాబాద్ విశ్వనగరంలా మారాలంటే మెట్రోరైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. రీజినల్ రింగ్ రోడ్డు, రిజినల్ రింగ్ రైల్ ప్రాజెక్టులపై కేంద్రం కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.అందుకు కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకోవాలి. రాష్ట్రానికి సముద్ర మార్గం లేనందున డ్రైపోర్టును, ఆటో మొబైల్ ఇండ్రస్ట్రీని తెలంగాణకు ఇచ్చేలా ప్రధానిని అడగాలి. గోదావరి నీటి వినియోగం పూర్తిగా జరగాలనే ఉద్దేశంతోనే రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాణహిత–చేవెళ్ల చేపట్టారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు మహారాష్ట్ర భూభాగాన్ని తెలంగాణకు ఇవ్వాలి. ఇందుకు విద్యాసాగర్‌రావు, బీజేపీ పెద్దలు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు.విద్యార్థి రాజకీయాల్లేకుంటే చైతన్యం ఉండదు‘వర్సిటీల్లో విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనను ప్రోత్సహించాలి. విద్యార్థి రాజకీయాలు లేకుంటే చైతన్యం ఉండదు. సమస్యలకు పరిష్కారం తొందరగా దొరకదు. స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా యువతకు వేగంగా ఉపాధి అవకాశాలు అందుతాయి. జూన్ రెండో తేదీ నాటికి ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యాసాగర్రావుగారి వ్యక్తిగతం ఎవరూ విమర్శించరని రేవంత్ చెప్పారు. రాజకీయ చైతన్యం అధికంగా ఉన్న తమిళనాడు రాష్ట్రానికి, అలాగే ఆర్థిక కేంద్రం మహారాష్ట్రకు ఒకేసారి గవర్నర్‌గా పనిచేసిన ఆయన..జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్టను పెంచారని కొనియాడారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కరీంనగర్‌కు చెందిన విద్యాసాగర్‌రావు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారన్నారు. ఆయన పనితీరు అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్, బండి సంజయ్, మాజీ ఎంపీలు బి.వినోద్‌కుమార్, టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు మాట్లాడారు.అన్ని పార్టీలు అభివృద్ధి కోసం పోరాడాలియువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే దిశగా ప్రభుత్వం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని విద్యాసాగర్‌రావు అన్నారు. మూసీ నది పరిరక్షణ అత్యవసరమని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాని సూచించారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రైవేటు బిల్లులు ఆమోదింపజేసిన ఘనత ఉందని, ఈ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని అనుసరించాలని ఆకాంక్షించారు. -
గిరిజనుల భూమి గిరిజనులకే!
ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకున్నాయిఅనేదాన్నిబట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది. అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్, కొమురం భీం లాంటి యోధులు ‘జల్’, ‘జంగల్’, ‘జమీన్ ’ పేరిట వారి హక్కుల సాధన కొరకు పోరాడి ప్రాణాలర్పించారు. అయితే స్వతంత్ర భారతదేశంలో గిరిజనుల కోసం చేసిన చట్టాలు నిర్వీర్యమయ్యాయి. చొరబాటుదారులు అడవి ద్వారాలు తీశారు. ఆదిమ జాతీయులకు వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరానిది. ప్రభుత్వాలు, పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఆలోచించి ఒక ఆమోదయోగ్యమైన కార్యాచరణను రూపొందించుకోకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర చెబుతోంది.మాతృమూర్తైనా, మాతృభాషైనా, మాతృదేశమైనా పలికేటప్పుడు వేరువేరుగా వినిపించినా ఆ మూడింటి అంతఃసూత్రం ఒకటే బంధం. తల్లి గర్భాల యంలో మనం నేర్చుకున్న మనదైన భాషలో మాతృదేశంలో తొలి అడుగు మోపే నవజాత శిశువుకు ఈ మూడింటి అస్తిత్వం అనివార్యంగా ఇవ్వబడుతుంది. ఇలాంటిదే ఒక జాతికి కూడా ఉంటుంది. అదే మూలవాసీ సంస్కృతి. ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీ ప్రజల అస్తిత్వం, గౌరవం, కృషి ఏ మేరకు గుర్తింపునకు నోచుకు న్నాయి అనేదాన్నిబట్టి ఆ జాతి సమగ్ర మూర్తిమత్వం అర్థమవుతుంది.సుద్దాల అశోక్‌తేజ రాసిన ‘కొమురం భీముడో’ అన్న సినీ గేయం కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తుంది. అడవి తల్లి తన గిరిజన సంతానాన్ని ఆత్మ గౌరవ బావుటా ఎగురెయ్యాలని సందేశాత్మకంగా చేసిన హెచ్చరి కలను స్పష్టం చేసేవిధంగా ఈ పాట సాగింది. వారి హక్కుల కోసం వారే ఉద్యమించాలనే ఉద్వేగాన్ని నింపుతుంది. ఈ పాట ప్రతి గిరిజనుడిని అగ్ని కణంలా వెంటాడింది. దేశంలో గిరిజన ప్రాంతా లున్న అన్ని రాష్ట్రాలలో వారి భాషలోకి తర్జుమా చేసి వినిపించాలనే ప్రణాళికతో అక్కడి నాయకులు ముందుకుపోతున్నారు. ‘మన సంస్కృతి మూలాల్ని నాశనం చేస్తున్న విదేశీయుల మీద నా పోరాటం’ అన్నారు బిర్సా ముండా. నూరేళ్ళ జీవితానుభవంతో 25 ఏళ్లు బతికి ధిక్కార హెచ్చరికను వినిపించి, బ్రిటిష్‌వాళ్ల గుండెల్లో ఫిరంగులు పేల్చాడు. ఆయన జయంతి నవంబర్ 15న ‘జన్ జాతీయ దివస్’గా జరుపుకొంటున్నాం. బిర్సా ముండా చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉంచడంతో పాటు, రాంచీ విమానాశ్ర యానికి, ఇంకా ఎన్నో సంస్థలకు ఆ వీరుని పేరు పెట్టడం జరిగింది. అల్లూరి సీతారామరాజు, రాంజీ గోండ్, కొమురం భీం లాంటి యోధులు ‘జల్’, ‘జంగల్’, ‘జమీన్ ’ పేరిట వారి హక్కుల సాధన కొరకు పోరాడి ప్రాణాలర్పించారు. బ్రిటిష్ పాలనలో మొత్తం 75 సార్లు గిరిజన తిరుగుబాట్లు జరిగాయంటే వారి చైతన్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవాలి. తెలంగాణా గవర్నరు జిష్ణుదేవ్ వర్మ ఈ మధ్యన తెలంగాణ గిరిజన ప్రాంతాలలో పర్యటించడం ముదావహం. గిరిజనులకు బాస టగా నిలవడానికి ‘యాక్ట్ 1/70’ని రూపొందించుకున్నాం. అందులో ఉన్న సెక్షన్ 3(1)(ఎ) ప్రకారం, వివాదాలు తేలేంతవరకు షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఉన్న భూమి గిరిజనులదిగానే భావించబడుతుంది. ఈ మధ్యన గవర్నరు పర్యటించిన ప్రాంతం ఆ కోవకే చెందుతుంది. వారికి అధికారులు ఏ మేరకు పరిస్థితులను విశదీకరించారో గానీ, రాజ్యాంగంలోని ‘షెడ్యూల్ 5’ ప్రకారం గవర్నరుకు విశేషాధికారాలు ఉంటాయి. ఇది వజ్రాయుధం లాంటిది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ‘రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు చెడ్డవాళ్లైతే అది కూడా చెడ్డది కావడం ఖాయం. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు మంచివాళ్లైతే అది కూడా మంచిదవటం అంతే ఖాయం’ అన్నారు. మన రాజ్యాంగ సంవిధాన మౌలిక నిర్మాణం ఎంతో గొప్పది. సామాజిక అణచివేతకు గురైనవారి అభ్యున్నతి కోసం తోడ్పడడమే రాజ్యాంగంలోని రిజర్వే షన్ల లక్ష్యం.స్వాతంత్య్రానంతరం పాలకులు ఆదివాసీలను చేరడానికి ముఖ్యంగా మూడు ఆలోచనలు చేశారు. ఏకాంతవాసం, కలిసి పోవటం, అభ్యున్నతి. 1958లో మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ కలిసిపోవటాన్ని ఎంచుకున్నారు. అంటే ఆదివాసీలతో కలిసి వారిని అభివృద్ధి పరచాలని. ఆదివాసీలను దోపిడీ నుంచి కాపా డాలని, రక్షణగా నిలవాలని, వారికి సంక్షేమ పథకాలు రూపొందింపజేయాలని భావించి ‘పంచశీల’ను ఎంచుకున్నారు. ఆ తరువాత యాక్ట్ డి.ఎఫ్. 1970 చట్టం తీసుకొచ్చారు. గిరిజనుల భూమిని, అటవీ సంపదను ఇది కవచంలాగా కాపాడుతుందని ఊదరగొట్టారు. కానీ ఆ చట్టాలు నిర్వీర్యం అయ్యాయి. చొరబాటుదారులు అడవి ద్వారాలు తీశారు.తెలంగాణాలో నిజాం కాలంలో దీనికోసం హైమన్ డార్ఫ్‌ని తన సలహాదారుగా నియమించుకున్నారు. ఎన్నో సంస్కరణలు చేశామను కున్నారు. కానీ 1948 అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు ఈ దిశగా పెద్దగా చర్యలు తీసుకోలేదు. 1976, ’77లో ఆదిలాబాద్‌లోని ఉట్నూరు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు విస్తుపోయే వాస్తవాలెన్నో వెలుగులోకి వచ్చాయి. సంపన్నతే చుట్టరికంగా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రా ప్రాంతాల నుండి వచ్చిన ధనికులు గిరిజనుల భూమిని ఆక్రమించుకొని, అసలు హక్కుదారులైన గిరిజనులను అక్కడ నుండి తరిమేశారనీ, దాంతో వారు దూరంగా వచ్చి తలదాచుకున్నారనీ, ఇప్పుడు ఆ స్థలాల నుండి కూడా అటవీ అధికారులు వేరే ప్రాంతాలకు వెళ్ళాలని బెదిరిస్తున్నారనీ గిరిజనులు చెప్పుకొచ్చారు.ఇదంతా వింటుంటే చరిత్రలోని చివరి మొఘల్ రాజు బహదూర్ షా జాఫర్ కథ గుర్తొస్తోంది. 1857 తిరుగుబాటు అణచివేయబడి బ్రిటిష్ సైన్యం చేతిలో ఆయన ఓడిపోయిన తరువాత రెండు గజాల భూమి తన భారతదేశంలో తనకు దొరకలేదనీ, ఆ బాధతోనే తన చివరి రోజుల్లో బర్మాలోనే గడుపుతూ అక్కడే ఖననం చేయబడ్డాడనీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గిర్‌గిలాని తన ఉపన్యాసంలో ఉట్టంకించటం గుర్తొస్తోంది. ఇక్కడ మనం చర్చించాల్సిన అంశం ఒకటుంది. రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూళ్ళ ద్వారా గవర్నర్లకు విశేష అధికారాలే కల్పించారు. వారి జీవన స్రవంతిని, సంస్కృతి, వైవిధ్యాలను రక్షిస్తూ తమకు నచ్చిన రీతిలో జీవించే విధంగా గవర్నర్లు రెగ్యులరైజేషన్ ద్వారా పరిపాలించే అధికారాలను ఈ అధికరణలు ఇవ్వడం జరిగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే గిరిజనులు, వారి భూములపై హక్కుల అంశంపై అధ్యయనం చేయడానికి ల్యాండ్ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదికను 2005 ఆగస్టు 15న జె.ఎన్. గిర్‌గిలాని ఆనాటి శాసనసభకు సమర్పించారు. అందులో ఎన్నో భయంకర నిజాలు, గిరిజనేతరులు కబళించిన భూవివరాలు వెల్లడ య్యాయి. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలోని గిరిజన ప్రాంతాల కోసం ఐఏఎస్ మూర్తి గారిని నియామకం చేసింది ప్రభుత్వం. వీరి నివేది కలో కేంద్రంలో కొంతమంది ఉన్నతాధికారులు అసలు 5వ షెడ్యూ ల్నే రాజ్యాంగం నుంచి ఎత్తివేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు ఒక ఆశ్చర్యకరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ఈ రెండు నివే దికలు ‘రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్’ ద్వారానే బహిర్గతమయ్యాయి తప్ప, అసలు శాసనసభ మెట్లు ఎక్కలేదన్నది నిజం. తెలంగాణ గవర్నర్ పర్యటించిన ములుగు జిల్లా గోవింద రావు పేట మండలంలోని గిరిజనుల భూముల అన్యాక్రాంతం గురించి ప్రభుత్వం నియమించిన కమిటీ 25 సంవత్సరాల క్రితమే నివేదిక లిచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ట్రైబల్ రెగ్యులేషన్ యాక్ట్ కింద వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనాయనీ, వాటిని గిరిజనులకు అప్పగించాలనీ తీర్పులిచ్చినా చలనం లేదు. తరతరాల నుండి జరిగిన అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ‘ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2006’ కూడా నిరర్థకంగా మారింది. బిహార్‌లో గిరిజన యోధుడు బిర్సా ముండా త్యాగాన్ని శ్లాఘిస్తూ ఏళ్ల తరబడి గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న డాక్టర్ ఫెలిక్స్ పెడల్‌ను ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవాలి. ఈయన ఎంతో చరిత్ర ఉన్న చార్లెస్ డార్విన్ మునిమనవడు. ఆయన నుండి స్ఫూర్తిని పొందాలి. ‘ఆజాద్ కా అమృతోత్సవ్’ దేశమంతటా జరుపుకొంటున్న శుభ వేళ ఆదిమ జాతీయులకు మాత్రం వారి భూమి వారికి దక్కకుండా పోవడం క్షమించరానిది. ఏ చర్యలు తీసుకున్నామని వివిధ ప్రభు త్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలు, వివిధ రాజకీయ పార్టీలు,స్వచ్ఛంద సంస్థలు ఆలోచించాలి. దృఢ సంకల్పంతో ఒక ఆమోద యోగ్యమైన కార్యాచరణను రూపొందిచుకోకపోతే ఆందోళనకరమైన పరిస్థితులు అనివార్యమవుతాయని గత ఉద్యమాల చరిత్ర స్పష్టం చేస్తోంది.సి.హెచ్. విద్యాసాగర్‌రావు వ్యాసకర్త మహారాష్ట్ర మాజీ గవర్నర్ -
జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ రాజకీయ చరిత్ర
కోరుట్ల నియోజకవర్గం కోరుట్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేత కె.విద్యాసాగరరావు మరోసారి విజయం సాదించారు. ఆయన 2009 నుంచి ఒక ఉప ఎన్నికతో సహా నాలుగుసార్లు గెలిచారు. 2018 ఎన్నికలలో ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది జె.నర్సింగరావుపై 31220 ఓట్ల మెజార్టీతో విసయం సాదించారు. విద్యాసాగరరావుకు 84605 ఓట్లు రాగా, నరసింగరావుకు 53385ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది డాక్టర్ వెంకట్‌కు పదిహేనువేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆయన మూడోస్థానానికి పరిమితం అయ్యారు. విద్యాసాగరరావు వెలమ సామాజికవర్గానికి చెందిన వారు. ఈ నియోజకవర్గంలో వెలమ సామాజికవర్గం తమ పట్టు నిలబెట్టుకుంటూ వస్తోంది. రెండువేల తొమ్మిది నుంచి కొత్తగా ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీనే గెలిచింది. కోరుట్ల, అంతకుముందు ఉన్న బుగ్గారం నియోజకవర్గాలలో కలిపి వెలమ సామాజికవర్గం నేతలు ఏడుసార్లు విజయం సాధిస్తే, రెడ్లు నాలుగు సార్లు, బిసిలు రెండుసార్లు, ఇతరులు రెండుసార్లు గెలుపొందారు. మాజీ మంత్రి రత్నాకరరావు బుగ్గారం నుంచి ఒకసారి ఇండిపెండెంటుగా, రెండుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన గెలుపొందారు. బుగ్గారం నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఐదుసార్లు, టిడిపి రెండుసార్లు, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. నలుగురు ఇండిపెండెంట్లు గెలుపొందడం మరో ప్రత్యేకత. కోరుట్ల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
హైదరాబాద్ దేశానికీ రెండో రాజధాని..!
-
జగిత్యాల సీఎం కప్ పోటీల్లో దొంగల హల్చల్..
జగిత్యాల: సీఎం కప్ లైటింగ్ నిర్వహణ చూస్తున్న సతీష్ అనే వ్యక్తి నుంచి లక్ష రూపాయలు కొట్టేసిన దొంగలు.. మంత్రి కొప్పుల, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు హాజరైన కార్యక్రమంలో లక్ష రూపాయలు అపహరణకు గురి కావడంతో కలకలం.. పోలీస్ సెక్యూరిటీ కళ్ళు కప్పి ఉడాయించిన దొంగ.. మైక్ లో అనౌన్స్ మెంట్ చేసిన నిర్వాహకులు. -
అది అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: భారతదేశం అనాదిగా నాస్తిక, అస్తిక వాదాలకు నిలయంగా ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. నగరంలోని కళాభారతిలో 10 రోజులపాటు కొనసాగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా సమతా స్ఫూర్తిని ప్రజలమధ్య నింపడానికి కృషిచేశారని, నాస్తికులు, ఆస్తికులు పోట్లాడుకుని జైళ్లకు వెళ్లడం అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. అప్పటి సామాజిక విధానాల్లో ఉన్న అస్పృశ్యతను తొలగించడానికి అంబేడ్కర్ బౌద్ద మతాన్ని స్వీకరించి, అందులోని విధానాల ద్వారానే సౌభాతృత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. వీటికి సంబంధించిన విజ్ఞానం లభించాలంటే ఇలాంటి పుస్తక ప్రదర్శనలు అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహన్ని తయారుచేయించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో గ్రంథాలయాలు: ఇంటర్నెట్తో పిల్లల్లో వచ్చిన మార్పులు చూశాక అందోళన అనిపించినా ఇలాంటి పుస్తక ప్రదర్శన ద్వారా ఆ భయాలు తొలగిపోయాయని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని తెలిపారు. హైదరాబాద్‌లో 100 స్కూళ్లను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని సిలబస్ మార్చే విధంగా కృషి చేస్తున్నామని, అందులో నీతి కథలు, పర్యావరణం, వ్యక్తిత్వ నిర్మాణం పాఠ్యాంశాలుగా చేర్చబోతున్నామని పేర్కొన్నారు. భిన్న వాదనలు ఉన్నా పుస్తకం మనుషులను ఏకం చేస్తుందని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయా చితం శ్రీధర్, రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ సోమ భరత్ కుమార్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ ప్రొఫెసర్ కొండ నాగేశ్వర్ పాల్గొన్నారు. -
‘ఈ ఉద్యమంలో మేము సఫలమయ్యాం’
సాక్షి, హైదరాబాద్: అన్ని పార్టీలు హైదరాబాద్ విమోచన వజ్రోత్సవాలను నిర్వహిస్తామని చెప్పడం బీజేపీ సాధించిన గొప్ప విజయమని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించారు. విమోచన దినోత్సవం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అధికారికంగా గుర్తించాలని బీజేపీ ఆధ్వర్యంలో తాము అప్పట్లో ఉద్యమం చేశా మని గుర్తుచేశారు. శనివారం విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు అన్ని పార్టీలు ఉత్సవాల నిర్వహణకు ముందుకు రావడంతో తాము ఈ ఉద్యమంలో సఫలీకృతం అయ్యామన్నారు. గతం నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న ఏదో ఒక రూపంలో కార్యక్రమాలను నిర్వహించామన్నారు. పరకాలలో జరిగిన పోరాటాన్ని దృశ్య రూపంలో చూపించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివిధ విషయాలు, చరిత్ర వంటి వా టిని పాఠ్యాంశాల్లో చేర్చాలని, జర్నలిస్ట్ షోయ బుల్లాఖాన్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతి ష్టించాలని విద్యాసాగర్ డిమాండ్ చేశారు. -
మేధావుల మౌనం రాష్ట్రానికి నష్టం: బండి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మేధావుల మౌనం తెలంగాణకు నష్టమని, అంతా మేల్కొని ప్రజాస్వామ్య పాలనకు సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. మంగళవారం హుజూరాబాద్‌లో నిర్వహించిన పుర ప్రముఖుల సమావేశానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. మేధావుల మౌనం కారణంగా తెలంగాణలోని అన్ని వర్గాలు నష్టపోతున్నాయన్నారు. మేధావులు ఇకనైనా మేల్కొనాలని, కేసీఆర్ గడీల పాలనను బద్దలు కొట్టాలని, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని తన రచనలతో ఉర్రూతలూగించిన గూడ అంజన్నను కడసారి చూడని వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణ కోసం జీవితాంతం పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్‌ను సైతం ఘోరంగా అవమానించాడన్నారు. కేసీఆర్ అంటే.. కల్వకుంట్ల కమీషన్ల రావు అని, కాళేశ్వరం పేరిట రూ.వేల కోట్లు దోచుకుంటున్నాడని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ఈటల గెలుపు తథ్యమని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణ బీజేపీ అద్యక్ష్యడి రేసులో లేను
-
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అక్కడ ఏం జరిగిందో.. ఇక్కడ హుజూర్నగర్ ఉప ఎన్నికలు కూడా అదే తరహాలో జరిగాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి రెండో రాజాధానిగా హైదరాబాద్‌ను చేసే విషయంపై పార్టీలో చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ‘రాజధాని చర్చ అనేది ప్రజల మధ్య జరగాలి. ఒకవేళ చర్చ జరిగితే తప్పేం ఉంది? అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయండంపై విద్యాసాగర్ రావు కొత్తగా ఏం చెప్పలేదని, కేంద్రపాలిత ప్రాంతం ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుస్థిర పాలనకు సీట్ల సంఖ్య పెరగాలని, మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పోటీ చేస్తామని తెలిపారు. ఇక రాష్ట్రంలో రైతు బంధు రావడం లేదని, కేంద్రం ఇచ్చే రూ. 2000 వేలు మాత్రమే అందుతున్నాయన్న విషయాన్ని ప్రజలు గమనించారని పేర్కొన్నారు. కాగా ఆర్టీసీ సమస్య కేంద్రం పరిధిలో లేదని.. అది రాష్ట్ర పరిధిలోని అంశంమని లక్ష్మణ్ తెలిపారు. ఆర్టీసీ సమ్మెలో కేంద్రం ఇంతవరకు జోక్యం చేసుకోలేదని, కేంద్రం దృష్టికి సమస్యను తాము తీసుకువెళ్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ అధికారం చేపట్టిన తొలి ఐదేళ్లలో పథకాలు జోరుగా సాగాయి.. కానీ ఇప్పుడు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో పాలన సజావుగా సాగడం లేదు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదు.. సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతాం’ అని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని.. అయితే బీజేపీ అడ్డదారిలో వెళ్లదని రాజ్యాంగ బద్ధంగానే ముందుకు సాగుతుందని తెలిపారు. ప్రజలలో తిరుగుబాటు వస్తే.. ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపెడతారని పేర్కొన్నారు. -
కాలువలో ఎమ్మెల్యే పీఏ గల్లంతు
జగిత్యాలక్రైం : కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు పీఏ గిరీశ్ (38) ఎస్సారెస్పీ కెనాల్లో గల్లంతయ్యారు. ఆదివారం ఆయన జగిత్యాలకు చెందిన నలుగురు స్నేహితులతో కలసి అంతర్గాం శివారులో విందు చేసుకున్నారు. అనంతరం ఎస్సారెస్పీ కాలువలో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే నీటి ప్రవాహ వేగానికి గిరీశ్ కొట్టుకుపోయారు. ఆయనను రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ పోలీసులు, ప్రత్యేక పోలీసు బృందం ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. -
కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రండి..
సాక్షి, ముంబై : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందం కీలకం కావడంతో ఆ రాష్ట్ర సీఎంను ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణ యం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ముంబై వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ శుక్రవారం ముంబై రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు పుష్పగుచ్ఛం ఇస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొలుత రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. ఈనెల 21న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి వద్ద ప్రాజెక్టు ను ప్రారంభిస్తున్నామని, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో సమావేశమయ్యా రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మీ సహకా రం మరవలేనిదని పేర్కొంటూ ఫడ్నవిస్‌ను సత్కరించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. కేసీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌తో సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు -
సృజనాత్మకత పెంచుకోవాలి
సాక్షి, హైదరాబాద్: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు సృజనాత్మకను, నైపుణ్యాలను పెంచుకుంటే భవిష్యత్తుకు భరోసా ఉంటుం దని, అలాగే విద్యా వ్యవస్థలో నాణ్యమైన విద్యను అందించినప్పుడే దేశం అభివృద్ధి సాధిస్తుందని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. గ్రామాలే కేంద్రంగా అభివృద్ధి జరగాలని అప్పుడే అనుకున్న ప్రగతి సాధించగలుగుతామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్)లో ‘‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ డెవలప్మెంట్ డిస్కోర్స్’’కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ చదువంటే కేవలం పరీక్షల కోసమేనన్న భావన నుంచి బయటకు రావాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి దోహదపడతాయన్నారు. టాటా కన్సల్టెంట్ సర్వీస్(టీసీఎస్) నిర్వహించిన సర్వేలో గణిత సమస్యల సాధనలో ఇండియాలోని 21 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఓఈసీడీ దేశాల 15 ఏళ్ల విద్యార్థుల కంటే తక్కువ సామర్థ్యం కలిగి ఉండటం బాధాకరమన్నారు. మన దేశ విద్యా విధానాన్ని ప్రక్షాళన చేసే దిశగా కృషి జరగాలన్నారు. యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరముందని లేకుంటే అది సమాజా నికి పెను సవాలుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తు న్నా గిరిజన గ్రామాలు ఇంకా అభివృద్ధి ఫలా లు అందుకోలేకపోతున్నాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో నీతి అయోగ్ వైస్ చైర్మన్ డా.రాజీవ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు విస్తరించాలి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తరించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కళాశాలలో తలసేమియా విభాగాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో వైద్యులు, వైద్య విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశంలో తలసేమియా, సికిల్‌సెల్ వ్యాధులు ప్రాణాంతకంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధితో మూడు నుంచి నాలుగు కోట్ల మంది బాధపడుతున్నారని తెలిపారు. ప్రముఖ నగరాల్లో కూడా ఈ వ్యాధి కనిపిస్తోందని తెలిపారు. పోలియో, స్మాల్పాక్స్ల్లా నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో భారత వైద్యులకు మంచి గుర్తింపు ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ యోజన పథకం కింద ఇప్పటికే ఆరు లక్షల మంది ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకోగా, రూ.800 కోట్లు ఖర్చయిందని రాష్ట్రపతి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ సమస్యలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్య సమూహాల మధ్య ఒక అవగాహన కలిగించడం, వారికి సకాలంలో సలహాలు ఇచ్చి సమస్య పరిష్కారం చూపడం ఒక ముఖ్యమైన ఘట్టంగా తీసుకోవాలన్నారు. గిరిజన వర్గాలలో ముఖ్యంగా జన్యుపరమైన రక్త రుగ్మతలను నిర్మూలించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఆసుపత్రుల నుంచి ఆరోగ్యం–రక్షణ నిపుణులు, సమాజంలో స్వచ్ఛంద సంస్థలతో కలసి పనిచేయాలని రాష్ట్రపతి సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్ అత్యంత ప్రతిభ కనబర్చిన ఐదుగురు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్‌ను అందజేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం అవగాహన అవసరం : గవర్నర్ నరసింహన్ ఆరోగ్య తెలంగాణ సాధించాలంటే గ్రామీణులంతా ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తలసేమియా తదితర వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరి పాత్ర కీలకమన్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. హెల్త్ ఫర్ ఆల్ అనే నినాదంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అందుకు పెళ్లికి ముందే అందరూ వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ, ఎంపీ బి.వినోద్‌కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ బి.శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
జయ కేసులో వెంకయ్యకు సమన్లు?
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై విచారణలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావులకు సమన్లు జారీ చేసేందుకు విచారణ కమిషన్ సిద్ధమవుతోంది. 2016 సెప్టెంబరు 22వ తేదీన అనారోగ్య కారణాలతో జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరడం, అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన కన్నుమూయడం తెలిసిందే. నాడు జయను పరామర్శించేందుకు అపోలో ఆస్పత్రికి వచ్చిన ఉపరాష్ట్రపతి వెంకయ్య, గవర్నర్ విద్యాసాగర్‌లను విచారించాలని కమిషన్ భావిస్తోంది. తన తరఫు లాయర్‌ను అనుమతించాలని జయ మేనకోడలు దీప చేసిన విజ్ఞప్తిని కమిషన్ తోసిపుచ్చింది. దీంతో ఆమె బుధవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఆ దంపతులను చూస్తేనే నా జన్మ ధన్యమవుతుంది
రాజోళి (అలంపూర్) : ‘వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి–భారతి దంపతులను చూస్తేనే నా జన్మ ధన్యమవుతుంది.. అపుడే నాకు ఆనందం అని కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళికి చెందిన విద్యాసాగర్ పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డిని చూడా లని తన కోరిక అని ఆయన చెప్పిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్.. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన శనివారం రాజోళికి వచ్చి విద్యాసాగర్‌ను ఆయన నివాసం లో పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ తనకు, తన తల్లిదండ్రులకు వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కుటుంబమంటే ప్రాణమని.. ఎప్పటికైనా పెద్దాయనను కలవాలని అనుకున్నా కుదరలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత జగన్ చూసినపుడల్లా కలవాలని, మాట్లాడాలని అనిపించినా కుదరడం లేదని తెలిపారు. సివిల్ ఇంజనీర్‌గా ఎన్నో ప్రాజెక్టుల్లో సేవలందించిన తనకు ఎక్కడా సరైన గౌరవం దక్కకపోగా.. వైఎస్ కుటుంబాన్ని చూడగానే తెలియని ధైర్యం వస్తుందని పేర్కొన్నారు. అయితే, పని చేసే సమయంలోనే నా రెండు కిడ్నీలు చెడిపోగా, అల్సర్ కూడా వచ్చిందని.. ఇంతలోనే తన కూతురు కూడా చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. తన కుమార్తె కూడా జగన్‌ను చూడాలని కోరుకునేదని.. ఆమె కోరిక తీరకపోగా, తన కోరికైనా తీరుతుందో, లేదోనని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాను జగన్ చూడాలనుకుంటున్న విషయం తెలుసుకుని ఆయన తరఫున శ్రీకాం త్‌రెడ్డిని పంపించడం ఆనందంగా ఉందని విద్యాసాగర్ తెలిపారు. ఇంత త్వరగా స్పందించే గుణం ఉండడంతోనే వైఎస్సార్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని, అందుకే జననేతగా పిలుస్తున్నారని తెలిపారు. విద్యాసాగర్‌కు అండగా ఉంటాం.. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటా మని గట్టు శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించేలా సమస్య తెలుసుకునేందుకు తనను జగన్మోహన్రెడ్డి పంపించారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కొండూరు చంద్రశేఖర్, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్, బీస మరియమ్మతో పాటు భూపాల్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, చంద్రవాసులు రెడ్డి, బంగారు మహేశ్వర్ రెడ్డి, వంశీధర్‌రెడ్డి, రాజు, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘ఇరిగేషన్ డే’గా విద్యాసాగర్‌రావు జన్మదినం
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదలరంగ నిపుణుడు, ప్రభుత్వ సలహాదారు దివంగత ఆర్.విద్యాసాగర్‌రావు పుట్టినరోజు నవంబర్ 14ను తెలంగాణ ‘ఇరిగేషన్ డే’గా ప్రకటించాలని రాష్ట్ర ఇంజనీర్ల జేఏసీ, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా ప్రభుత్వాన్ని కోరాయి. విద్యాసాగర్‌రావు కన్న కలలను సాకారం చేసే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశాయి. ఆదివారం విద్యాసాగర్‌రావు ప్రథమ వర్ధంతి సందర్భంగా జలసౌధ ప్రాంగణంలో ఇంజనీర్లు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో పాటు సీఈలు సునీల్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేతో పాటు ఇంజనీర్ల జేఏసీ నాయకులు వెంకటేశం, మోహన్‌సింగ్, వెంకటరమణారెడ్డి, సల్లా విజయ్‌కుమార్, చక్రధర్, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు శ్యాంప్రసాద్‌రెడ్డి, రాంరెడ్డి, ముత్యంరెడ్డి, రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యనాథన్ మాట్లాడుతూ, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాకోసం విద్యాసాగర్‌రావు తీవ్రంగా తపించేవారని, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన సందర్భంలో తాను ఆయనతో సుదీర్ఘంగా చర్చించినట్టు చెప్పారు. ఆయనిచ్చిన విలువైన సూచనల ఆధారంగా కోర్టుల్లో పిటిషన్లు వేశామని గుర్తు చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ విద్యాసాగర్‌రావును వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణగా అభివర్ణించారు. డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఈ సునీల్ మాట్లాడుతూ, డిండి ప్రాజెక్టుని అనుకున్న సమయానికి పూర్తిచేసి నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండకు సాగునీరు, తాగునీరు అందిస్తామన్నారు. శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ, విద్యాసాగర్‌రావు ఆశయ సాధనకు పునరంకిత మవుతామని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రాజెక్టులని సకాలంలో పూర్తి చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మార్చే కృషిలో పాలుపంచుకుంటామన్నారు. -
‘డిండి’కి విద్యాసాగర్‌రావు పేరు
సాక్షి, హైదరాబాద్: ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటిరంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. కొద్దిరోజుల్లోనే విద్యాసాగర్‌రావు ప్రథమ వర్ధంతి జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఘన నివాళి అర్పించింది. ఇకపై ఈ ప్రాజెక్టును ‘‘ఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం’’గా పరిగణించాలని నీటిపారుదల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ‘‘సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన వివక్షను విద్యాసాగర్‌రావు ఎలుగెత్తి చాటారు. సంక్లిష్టమైన విషయాలను సులువుగా అర్థమయ్యే విధంగా విడమరిచి చెప్పి, జరిగిన అన్యాయంపై ప్రజలను చైతన్య పరిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా సాగునీటి అంశాలపై విస్తృత చర్చకు అవకాశం కల్పించారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లాకు తాగునీరు, తెలంగాణలో బీళ్లుగా మారిన భూములకు సాగునీరు అందివ్వాలనేది ఆయన జీవితాశయంగా ఉండేది. ఆయన కలగన్నట్లుగానే సాగునీటి రంగంలో ఎంతో పురోగతి సాధిస్తున్నాం. ఆయన పుట్టిన నల్లగొండ జిల్లాకు నీరందించే డిండి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టుకోవడం సముచితంగా ఉంటుందని భావిస్తున్నాం’’అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. విద్యాసాగర్‌రావు అనారోగ్యంతో బాధపడుతూ తన చివరి కోరికగా తన సొంతూరు సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా కోరారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి అప్పుడే దేవాలయ పునరుద్ధరణకు కోటి రూపాయలు మంజూరు చేశారు. జేఏసీ సైతం.. ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ఇంజనీర్స్ జేఏసీ సైతం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ టి.వెంకటేశం, కన్వీనర్ వెంకటేశ్వర్లు, కోచైర్మన్ శ్రీధర్‌రావు దేశ్‌పాండే తదితరులు శనివారం ఓ ప్రకటనలో తమ సంతోషం వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు హర్షం డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. విద్యాసాగర్‌రావుకు ఇది సరైన నివాళి అని అభిప్రాయపడ్డారు. సముచిత నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నీటి పారుదల శాఖ తరఫున, ఇంజనీర్లు, అధికారుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు, మంచినీరు అందిస్తామని హరీశ్ ప్రకటించారు. -
గవర్నర్ విద్యాసాగర్‌రావుకు కోపమొచ్చింది
సాక్షి, ముంబయి : మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుకు కోపం వచ్చింది. తన ప్రసంగానికి మరాఠీ అనువాదం మిస్సయిందని ఆయన అటు శాసన మండలి చైర్మన్‌పై, శాసనసభ స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి చేష్టలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, ఆ ప్రసంగానికి సంబంధించి మరాఠీ అనువాదం చేసేందుకు ఎవరు ప్రయత్నించనట్లు తాను గుర్తించానంటూ ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తూ ఆయన మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ రామ్‌రాజేనాయక్ నిమ్‌బకార్‌కు, అసెంబ్లీ స్పీకర్ హరిభౌ బగదేకు లేఖ రాశారు. 'ఈ రోజు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి నేను ప్రసంగిస్తున్న సమయంలో నా ప్రసంగాన్ని మరాఠీలోకి అనువాదం చేయలేదు. ఇలాంటిది సీరియస్‌గా తీసుకోవాలనది నా ఉద్దేశం. దీనికి కారణమైనవారిపై కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఏం చర్యలు తీసుకున్నారో నాకు తెలియజేయాలి' అని విద్యాసాగర్ రావు లేఖలో పేర్కొన్నారు. -
తెలుగు మహాసభలు ఆరంభ వేడుకలు
-
విద్యాసాగర్‌రావుకు ఘనంగా వీడ్కోలు
సాక్షి, చెన్నై: ఇన్‌ఛార్జి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నమహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు తమిళనాడు ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. ముఖ్యమంత్రి కె. పళనిస్వామి ఆధ్వర్యంలో గురువారం ఇక్కడి ఎయిర్‌పోర్టులో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తదితరులు ఆయనను సన్మానించారు. అప్పటి గవర్నర్ కె. రోశయ్య పదవీ విరమణ చేసిన తర్వాత 2016 సెప్టెంబర్‌లో మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యాసాగర్‌రావు తమిళనాడు ఇన్చార్జి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా కేంద్రం తమిళనాడు గవర్నర్‌గా బన్వరిలాల్ పురోహిత్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయన శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పదవీ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యాసాగర్‌రావుకు తమిళనాడు ప్రభుత్వం వీడ్కోలు పలికింది. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రత్యేక విమానంలో గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. -
గవర్నర్‌గా కల్రాజ్ మిశ్రా వస్తారా?
సాక్షి, చెన్నై: గత కొంత కాలంగా రోజుకో మలుపు తిరుగుతున్న తమిళ రాజకీయాలకు చెక్ పెట్టే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది. పూర్తిస్థాయిలో గవర్నర్ నియామకం జరగకపోవడం, ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుతో కాలం వెల్లదీస్తుండంతో తమిళనాడు రాజకీయాలు ప్రతిష్ఠంభనలో పడ్డాయి. ఈ మేరకు వాటన్నింటకి చెక్ పెట్టే విధంగా తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం. తాజాగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కేంద్ర మంత్రిగా పనిచేసి రాజీనామా చేసిన కల్రాజ్ మిశ్రాను తమిళనాడు గవర్నర్‌గా నియమకానికి కసరత్తు పూర్తయినట్టు ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రోశయ్య పదవీ కాలం గత ఏడాది ఆగస్టులో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆ పదవికి పూర్తి స్థాయిలో గవర్నర్ నియమకం జరగలేదు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యా సాగర్‌రావు ఏడాది కాలంగా తమిళనాడుకు ఇన్చార్జి గవర్నర్‌గా అదనపుబాధ్యలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఈఏడాదికాలంలో తమిళనాట రాజకీయంగా అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌కు తప్పలేదు. ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన గవర్నర్ ఆచితూచి స్పందిస్తున్నారు. ముంబై టూ చెన్నై పర్యటన సాగించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తమిళనాడుపై విద్యా సాగర్ రావుకు పూర్తి పట్టు ఉన్న దృష్ట్యా, ఆయన్నే పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమించేందుకు తగ్గ కసరత్తులు సాగుతున్నట్టు ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడ్డాయి. అయితే, తనకు ఆ భాగ్యం వద్దన్నట్టుగా ఢిల్లీకి ఆయన మొర పెట్టుకున్నట్లు సమాచారం. రాజకీయాలతో విసిగి వేసారిన విద్యా సాగర్ రావు పూర్తి స్థాయి బాధ్యతలు తనకు వద్దని నిరాకరించినట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత తమిళనాట పరిస్థితుల నేపథ్యంలో పూర్తి స్థాయి గవర్నర్ నియమకంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 75 ఏళ్ల బీజేపీ సీనియర్ కల్రాజ్ మిశ్రా పేరు తెరపైకి వచ్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన పార్టీ ఆదేశాల మేరకు గత వారం పదవికి రాజీనామా చేశారు. ఆయన అనుభవాలు తమిళనాడుకు ఉపయోగ పడుతాయన్న భావనతో బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవికి కేంద్రానికి సిఫారసు చేసినట్టు సమాచారం. దీంతో కల్రాజ్ మిశ్రాను తమిళనాడు గవర్నర్‌గా నియమించేందుకు తగ్గ కసరత్తు ముగిసినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్న దృష్ట్యా, ఆయన తిరిగి రాగానే, కల్ రాజ్ మిశ్రా నియమకానికి ఆమోదముద్ర పడే అవకాశాలు ఉన్నట్టు కమలనాథుల్లో చర్చ సాగుతోంది. -
విలీనం: హుటాహుటిన తమిళనాడుకు గవర్నర్
-
విలీనం: హుటాహుటిన తమిళనాడుకు గవర్నర్
చెన్నై: అన్నాడీఎంకే అమ్మ, పురట్చి తలైవి శిబిరాలు ఒకే వేదిక మీదకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు చర్చలు ఆశాజనకంగా సాగి.. సీట్ల పందేరాలు కొలిక్కి రావడంతో సీఎం పళనిస్వామి (ఈపీఎస్), మాజీ సీఎం పన్నీర్ సేల్వం (ఓపీఎస్) నేతృత్వంలోని ఈ రెండు శిబిరాలు విలీనం దిశగా కదులుతున్నాయి. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన చేసేందుకు తగిన ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. సోమవారం విలీనంపై అధికారిక ప్రకటన వెలువడవచ్చునన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సోమవారం హుటాహుటిన చెన్నైకి బయలుదేరడం గమనార్హం. ముంబైలో ఉన్న ఆయన సోమవారం నాటి తన అపాయింట్‌మెంట్లనీ రద్దు చేసుకొని.. చెన్నై బయలుదేరారని గవర్నర్ పీఆర్వో తెలిపారు. అన్నాడీఎంకేలోని ఈపీఎస్-ఓపీఎస్ శిబిరాల విలీనం నేపథ్యంలోనే ఆయన తమిళనాడు వస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విలీన ప్రక్రియ జోరందుకున్న నేపథ్యంలో అన్నాడీఎంకే నేతల అత్యవసర భేటీకి పళని పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశం వేదికగా చిన్నమ్మ శశికళను పార్టీ నుంచి సాగనంపబోతున్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. దీంతో ఈ చర్యల్ని అడ్డుకునే రీతిలో న్యాయ పోరాటానికి దినకరన్ కసరత్తుల్లో పడడంతో ఉత్కంఠ పెరిగింది. రాయపేట కార్యాలయం నుంచి అన్నాడీఎంకే కార్యవర్గంలోని ప్రధాన సభ్యులందరికీ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్టు సీఎం పళని ఆదేశాలు అందడంతో అందరూ చెన్నైకి చేరుకునే పనిలో పడ్డారు. ఉదయం పదిన్నర గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. పన్నీరు పెట్టిన షరతుల్లో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ తొలగింపు ప్రధానంగా ఉన్నాయి. ఈ రెండింటినీ నెరవేర్చడం లక్ష్యంగా చట్టపరంగా అన్నాడీఎంకే నిబంధనల్లో సవరణలకు సిద్ధం అవుతూ ఈ సమావేశానికి పిలుపునిచ్చినట్టు సమాచారం. అదే సమయంలో పన్నీరు శిబిరంలో ఉన్న మధుసూదనన్ అన్నాడీఎంకే నిబంధనల మేరకు పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా వ్యవహరిస్తున్న దృష్ట్యా, ఆయన అధ్యక్షతన తాజా సమావేశానికి ఏర్పాట్లు చేసినట్టుగా తెలిసింది. చిన్నమ్మను సాగనంపుతూ తీర్మానం వెలువడ్డ కొన్ని క్షణాల్లో పన్నీరు పార్టీ కార్యాలయంలో అడుగు పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. సోమవారం అమావాస్య రావడం. ఈ రోజును తమిళులు శుభకరంగా భావిస్తుండడంతో విలీనం కూడా అదేరోజు సాగడం ఖాయం అన్న ప్రచారం ఊపందుకుంది. ఇక, పన్నీరుకు పార్టీ నిర్వాహక అధ్యక్ష పదవి, డిప్యూటీ సీఎం, మరో ఇద్దరికి మంత్రి పదవుల శాఖలు సిద్ధం చేసినట్టు తెలిసింది. -
డిండి ఎత్తిపోతలకు విద్యాసాగర్ పేరు!
జలసౌధలో కాంస్య విగ్రహం... ప్రభుత్వ సూత్రప్రాయ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇటీవల అనారోగ్యంతో మరణించిన రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు సేవలకు గుర్తింపుగా నల్లగొండ జిల్లాలో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో పాటే ఆయన కాంస్య విగ్రహాన్ని జలసౌధలో ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. దీనిపై త్వరలోనే ప్రభుత్వం తరఫున ప్రకటన వెలువడనుందని నీటి పారుదల శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత నీటి పారుదల ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనతో విద్యాసాగర్‌రావు విశేష సేవలందించారు. ఇందులో భాగంగానే పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకా లను చేపట్టడంలో ఆయన విశేష కృషి చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే గత నెల 29న విద్యాసాగర్‌రావు మరణం తర్వాత రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు ఆయన పేరు పెడతామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టిన నల్లగొండ జిల్లాలోని డిండి ఎత్తిపోతల పథకానికి విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. దీనిపై శనివారం జరగనున్న ఆయన సంస్మరణ సభలో ప్రభుత్వం ఓ ప్రకటన చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన కాంస్య విగ్రహాన్ని జలసౌధలో అలీ నవాబ్ జంగ్ బహదూర్ పక్కన ఏర్పాటు చేయాలని సైతం నిర్ణయించినట్లుగా సమాచారం. -
పలికే జల ప్రవాహం
నివాళి కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంతో, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో, సుప్రీం కోర్టులో తెలంగాణ వాదనలు రూపొందించడంలో ఆయనదే కీలక పాత్ర. అఫిడవిట్లు ఆయన ఆమోదించిన తర్వాతనే వాటిని సమర్పించడం జరిగేది. ఇప్పుడు అవన్నీ కీలకమైన దశకు చేరుకున్నాయి. ఈ సమయంలో ఆయన లేకపోవడం పెద్ద లోటుగానే భావిస్తున్నాను. ఇక మహారాష్ట్రతో గోదావరిపై అంతర్రాష్ట్ర ఒప్పం దాలు కుదుర్చుకునే ప్రతీ సందర్భంలో విద్యాసాగర్‌రావు సహకారాన్ని అందించేవారు. తెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు రామరాజు విద్యాసాగర్‌రావు కన్నుమూశారన్న వార్త జీర్ణించుకోలేనిది. తెలంగాణ సమాజానికి తీరని లోటు. ఆయన మన మధ్య లేకపోవడం నాకు వ్యక్తిగతంగా కూడా పూడ్చలేని లోటు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయనతో సన్నిహిత, వ్యక్తిగత సంబంధం ఏర్పడింది. ఆయన నిరాడంబర జీవిత శైలి విశిష్టమైనది. అందుకే వయసుతో, హోదాతో నిమిత్తం లేకుండా ఎవరికైనా ఆయన దగ్గరవుతారు. ఆయన పాఠాలే మాకు మార్గదర్శకం కేసీఆర్æ పక్కన కూర్చొని సాగునీటిపై జరిపే చర్చలని నేను కూడా శ్రద్ధగా ఆలకించేవాడిని. తీరిక లేని ఉద్యమ కార్యాచరణ వలన విద్యాసాగర్‌రావు రాసిన వ్యాసాలని క్రమం తప్పకుండా చదవలేకపోయినా, కంట పడినప్పుడు మాత్రం తప్పక చదవేవాడిని. అది ముఖ్యమైన వ్యాసమని తోచినప్పుడు, అప్పుడు చదవడానికి తీరిక చిక్కకపోతే దాచుకొని చదివిన సందర్భాలు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు నిర్వహించినప్పుడు నీటి వనరుల గురించి పాఠాలు చెప్పేది విద్యాసాగర్‌రావు మాత్రమే. జటిలమైన సాంకేతక అంశాలని అరటిపండు ఒలిచి పెట్టినట్టు చెప్పే ఆయన పద్ధతి వలన సాగునీటి సంగతులు, టీఎంసీలు, క్యూసెక్కుల లెక్కలు అవగతమైనాయి. కృష్ణా, గోదావరి నదీజలాల్లో తెలంగాణ కు న్యాయంగా దక్కవలసిన వాటాల గురించి, గోదావరి, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుల గురించి ఆయన చెప్పిన పాఠాల కారణంగానే మా వంటివారికి స్పష్టత వచ్చింది. అంతర్రాష్ట్ర సమస్యలపైన కూడా ఆయనకున్న అవగాహన వేరొకరిలో కనిపించదు. ప్రాజెక్టుల స్థితిగతులపై ఎంతో కొంత తెలిసిన వారు ఉన్నప్పటికీ అంతర్రాష్ట్ర సమస్యలపై, గోదావరి, కృష్ణా ట్రిబ్యునళ్ల గురించి విద్యాసాగర్‌రావు మాత్రమే సాధికారికంగా వివరించేవారు. ప్రాజెక్టుల అంతరార్ధాలను పసిగట్టినవాడు పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో సాగునీటి రంగంపై మాట్లాడే అవకాశం విద్యాసాగర్‌రావుకు కేసీఆర్ ఇస్తూ ఉండేవారు. ఆయన మాట్లాడితేనే ఆ అంశానికి సాధికారత వస్తుందని ఆయన నమ్మకం. విషయంలోని అంతస్సూత్రాన్ని పసిగట్టడంలోనే విద్యాసాగర్‌రావు నైపుణ్యం కనిపిస్తుంది. ఉదాహరణకు శ్రీశైలం జలాశయం కనీస నీటి మట్టాన్ని 834 అడుగుల నుంచి 854 పెంచడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యం ఏమై ఉంటుందో, అకస్మాత్తుగా ఎటువంటి సర్వేలు, డీపీఆర్‌లు లేకుండానే 165 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తి పోసే దుమ్ముగూడెం నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ పథకాన్ని ఎందుకు చేపట్టినారో, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా పోలవరం ప్రాజెక్టును ఎందుకు చేపట్టిందో.. అంతరార్ధాన్ని ఆయన మాత్రమే వివరించి చెప్పగలిగేవారు. ఈ అవగాహన తర్వాత కాలంలో నేను మంత్రిగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడింది. పుష్కలంగా నీటి లభ్యత ఉన్న గోదావరి నీటిని తెలంగాణ అవసరాలకు వినియోగించుకోవడానికి రీ ఇంజనీరింగ్ చేపట్టడానికి విద్యాసాగర్‌రావు ఇచ్చిన అవగాహన ఎంతగానో ఉపయోగపడింది. జల ఒప్పందాలలో పెద్ద దిక్కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి సలహాదారుగా విద్యాసాగర్‌రావునే నియమించినారు. సాగునీటి శాఖలో ప్రతి కార్యక్రమంలో సలహాదారుగా తనవంతు పాత్రని ఆయన పోషించారు. ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌పై ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన కొన్ని వందల గంటల మేధోమథనంలో ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నారు. అయన అపార అనుభవం ప్రాజెక్టుల రూపకల్పనలో కీలకమైనది. వారం వారం నిర్వహించే మిషన్ కాకతీయ వీడియో కాన్ఫరెన్స్‌లకు, ప్రాజెక్టుల సమీక్షా సమావేశాలకు, కేబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు ఆయనను తప్పనిసరిగా ఆహ్వానించేవాడిని. సాధ్యమైనప్పుడల్లా నేను కూడా పాల్గొనేవాడు. ఢిల్లీలో కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ అధికారులతో ఆయనకున్న సంబంధాలను పురస్కరించుకుని అంతర్రాష్ట్ర సమస్యలు పరిష్కరించే బాధ్యతను ఆయనకే అప్పగించేవాడిని. ఆయన ఎంతో దీక్షతో ఆ పనులని నెరవేర్చేవారు. కృష్ణాజలాల్లో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా కోసం కేంద్ర ప్రభుత్వంతో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో, సుప్రీం కోర్టులో తెలంగాణ వాదనలు రూపొం దించడంలో ఆయనదే కీలక పాత్ర. అఫిడవిట్లు ఆయన ఆమోదించిన తర్వాతనే వాటిని సమర్పించడం జరిగేది. ఇప్పుడు అవన్నీ కీలకమైన దశకు చేరుకున్నాయి. ఈ సమయంలో ఆయన లేకపోవడం పెద్ద లోటుగానే భావిస్తున్నాను. ఇక మహారాష్ట్రతో గోదావరిపై అంతర్రాష్ట్ర ఒప్పం దాలు కుదుర్చుకునే ప్రతీ సందర్భంలో కేసీఆర్ వెన్నంటి ఉండి విద్యాసాగర్‌రావు తనవంతు సహకారాన్ని అందించేవారు. సొంతూరుకు మేలు చేయాలని.. ప్రభుత్వ సలహాదారు పదవి నిర్వహిస్తున్నా ఆయన సాదాసీదా జీవితం గడిపేవారు. అయన పదవిలో ఉండగా నా సహాయం కోసం అడిగినవి కూడా వారి∙వ్యక్తిగతానికి సంబంధించినవి కావు. దిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్న సామెత మనందరికీ ఎరుకే. విద్యాసాగర్‌రావు కన్న ఊరు జాజిరెడ్డిగూడెంను మరువలేదు. తన ఊరికి ఏదైనా చెయ్యాలని ఎంతో తపనపడ్డారు. ఆ ఊరి చెరువులు నింపి శాశ్వత వ్యవస్థ ఏర్పాటుకావాలని కోరుకున్నారు. జాజిరెడ్డిగూడెంలో ఒక మార్కెట్ యార్డుని మంజూరు చేయమని అడిగారాయన. ఊరికి ఒక కల్యాణ మంటపం కావాలని కోరుకున్నారు. అందుకు తమ పూర్వీకుల ఇంటి జాగాని విరాళంగా ఇచ్చి నా చేతనే శంకుస్థాపన చేయించారు కూడా. అయన కోరినట్లు చెరువులని నింపడానికి ఎస్ఆర్ఎస్పీ డిస్ట్రిబ్యూటరీ నుంచి ఒక తూముని ఏర్పాటు చెయ్యమని అధికారులని ఆదేశించినాను. జాజిరెడ్డిగూడెంలో మార్కెట్ యార్డుని మంజూరు చేశాను. కల్యాణ మంటపం పనులని త్వరలోనే ప్రారంభింపజేసి ఆయన మొదటి వర్ధంతి నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తాం. అర్వపల్లిలో ఉన్న ప్రాచీన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కోటి రూపాయలను ఇటీవలే మంజూరు చేశారు. జాజిరెడ్డిగూడెంలో ఆయన అనుకున్న పనులని పూర్తి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఒక ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు పేరు ప్రభుత్వం ఆయన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలని చేసింది. కానీ ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ప్రొ. జయశంకర్ లాగానే విద్యాసాగర్‌రావుని క్యాన్సర్ భూతం మన నుంచి దూరం చేసింది. ఆయన మరణ ప్రకటన వెలువడిన తరువాత అధికారికంగా అంత్యక్రియలు జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఒక సాగునీటి ప్రాజెక్టుకు విద్యాసాగర్‌రావు పేరు పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి నిర్ణయించారు. సాగునీటి శాఖ అధికారులతో సంప్రదించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాం. విద్యాసాగర్‌రావు కన్న కలలను నెరవేర్చడానికి ప్రభుత్వం పోరాడుతూనే ఉంటుంది. కృష్ణా , గోదావరి జలాల్లో తెలంగాణ కు న్యాయమైన వాటాను సాధిస్తాం. ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణని కోటి ఎకరాల మాగాణంగా మారుస్తాం. ఇదే మేం విద్యాసాగర్‌రావు గారికి అర్పించే ఘనమైన నివాళి కాగలదు. (వ్యాసకర్త, తెలంగాణ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి) తన్నీరు హరీష్‌రావు -
కన్నీటి వీడ్కోలు
-
విద్యాసాగర్‌రావుకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: నీటిపారుదల రంగ నిపుణుడికి అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. జలసాగరుడిని కడసారిగా చూసేందుకు హైదరాబాద్ హబ్సిగూడలోని ఆయన నివాసానికి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉద్యమసహచరులు, బంధుమిత్రులు పెద్దఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ ముఖ్య సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ శనివారం తుదిశ్వాస విడిచిన సంగతి విదితమే. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీమంత్రి ఎమ్మెల్యే డీకే అరుణ, నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు విద్యాసాగర్‌రావు భార్య సుజాత, కుమారుడు రమణలను పరామర్శించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు హబ్సిగూడ నుండి ప్రత్యేక వాహనంలో పార్థివదేహాన్ని అంబర్‌పేట హిందూ శ్మశానవాటికకు తరలించారు. అంతిమయాత్రలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజా, కులసంఘాల ప్రతినిధులు, బంధుమిత్రులు, తెలంగాణ ఉద్యమ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వ హించారు. సంతాప సూచకంగా పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్చారు. విద్యా సాగర్‌రావు చితికి కుమారుడు రమణారావు నిప్పంటించారు. ప్రముఖుల నివాళి విద్యాసాగర్‌రావు అంత్యక్రియల్లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. అంత్యక్రి యల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు, తెలంగాణ జలవనరుల విభాగం చైర్మన్ వి.ప్రకాశ్, ప్రజాగాయకుడు గద్దర్, విరసం నేత వరవరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, బీసీ కమీషన్ చైర్మన్ బీఎస్ రాములు, కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తదితరులు పాల్గొన్నారు. సురవరం సంతాపం తెలంగాణ జలవనరుల విషయంలో ప్రత్యేక కృషి చేసిన సాగునీటిరంగ నిపుణుడు విద్యా సాగర్‌రావు మృతి పట్ల సీపీఐ ప్రధాన కార్య దర్శి సురవరం సుధాకరరెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా తనకు ఆయనతో పరిచయం ఉందని, తెలంగాణ ఉద్యమంలో తెరవెనక గొప్ప కృషి చేశారని, ప్రొఫెసర్ జయశంకర్‌కు కుడి భుజంగా నిలిచారని నివాళి అర్పించారు. -
విద్యాసాగర్‌రావుకు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్: మూత్రాశయ కేన్సర్‌తో బాధపడుతూ శనివారం కన్నుమూసిన తెలంగాణ నీటి పారుదల రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10.30 గంటలకు అంబర్‌పేటలోని శ్మశానవాటికలో పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. మంత్రులు తలసాని శ్రీనివాసరావు, హరీశ్‌రావు, ఎంపీలు మల్లారెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ప్రజా గాయకుడు గద్దర్, అల్లం నారాయణ, వరవరరావు తదితరులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. -
కంటతడిపెట్టిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ జలయోధుడు విద్యాసాగర్‌రావు మృతదేహాన్ని చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటతడిపెట్టారు. ఆయన మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ సతీసమేతంగా విద్యాసాగర్‌రావు నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. విద్యాసాగర్‌రావుతో తన అనుబంధాన్ని గుర్తుకుతెచ్చుకున్న సీఎం కళ్లు చెమర్చారు. తెలంగాణ రైతుల దీనగాథలను అప్పట్లో ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్‌కు పాఠాలుగా విద్యాసాగర్‌రావు బోధించారు. కేవలం పునాది రాళ్లకే పరిమితమైన తెలంగాణ ప్రాజెక్టులను చూసి తీవ్ర ఆవేదన చెందే విద్యాసాగర్‌రావు కేసీఆర్‌కు ఆ విషయాలు వివరించేవారు. కృష్ణా, పెన్నా బేసిన్ల మధ్య ఉమ్మడి ఏపీలో నిర్మించిన పోతిరెడ్డి పాడు తెలంగాణకు ఉరితాడు అవుతుందని హెచ్చరించారు. కృష్ణా జలాల అంశంలో నీటి దామాషాను పాటించకుంటే వచ్చిన నీటిని వచ్చినట్లు ఎగువ రాష్ట్రాలు వాడుకుంటాయని, అలా జరిగితే అది దిగువ రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తొలిసారిగా తేల్చిచెప్పింది విద్యాసాగర్‌రావే. ‘నీళ్లు–నిజాలు’పేరిట ఆయన రాసి న పుస్తకంలో... ఉమ్మడి ఏపీ ప్రభుత్వం పక్షపాత ధోరణితో తెచ్చిన జీవోలు, వాటితో జరిగే నష్టం, తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్న తీరుని వివరించారు. నీటిపారుదల రంగంలో అపార అనుభవం ఉన్న విద్యా సాగర్‌రావును రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్.. సాగునీటి సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం, పాలమూర రంగారెడ్డి ప్రాజెక్టుల డిజైన్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. మూత్రాశయ క్యాన్సర్‌తో విద్యాసాగర్‌రావు శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. సంబంధిత మరిన్ని కథనాలకై చదవండి సాగునీటి స్వాప్నికుడు ఇకలేరు -
తీవ్ర విషాదంలో ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారు ఆర్. విద్యాసాగర్‌రావు మరణం పట్ల కలత చెందిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యాసాగర్‌రావు ఆరోగ్యం బాగా క్షీణించి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యపరిస్థితిని ముఖ్యమంత్రి తెలుసుకుంటూనే ఉన్నారు. కేసీఆర్ తన సతీమణితో సహా హాస్పిటల్ కూడా ఆయన్ని పరామర్శించారు కూడా. అప్పటి నుంచి సిఎం తనకు కలిసిన ప్రతీ ఒక్కరితో విద్యాసాగర్ రావు గురించే మాట్లాడారు. ఉద్యమ సమయంలో తెలంగాణకు నీటి పారుదలరంగంలో జరిగిన అన్యాయంపై గణాంకాలతో సహా వివరాలు సేకరించి ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం ,ప్రాజెక్టులపై జరిగిన అన్యాయంపై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యమైనదని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి, వ్యక్తిగతంగా తనకు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తూ, సలహాలు ఇస్తూ ముందుకు నడిపారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రాజెక్టుల రీ డిజైనింగ్ సహా నీటి పారుదల రంగంలో చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పనలో విద్యాసాగర్ రావు విశేష అనుభవం ఉపయోగపడిందన్నారు. జయశంకర్ తర్వాత తెలంగాణ జాతికి దక్కిన మరో గొప్ప మహానుభావుడు విద్యాసాగర్ రావు అని కేసీఆర్ ప్రశంసించారు. తెలంగాణ జాతి విద్యాసాగర్ రావును ఎన్నటికీ మరిచిపోదని ఆయన అన్నారు. విద్యాసాగర్‌రావు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ప్రాణాలు దక్కించడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు చేసిన కృషి, తెలంగాణ జాతి చేసిన ప్రార్థనలు ఫలించి ఆయన ఆరోగ్యం మళ్లీ మెరుగుపడుతుందని భావించానని అన్నారు. ఆయన మరణం తెలంగాణ జాతికి తీరని లోటని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు కట్టి తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించాలనే స్వప్న సాకారంలో భాగస్వామిగా ఉండాల్సిన విద్యాసాగర్ రావు అర్థాంతరంగా మనల్ని వదిలివెళ్లారన్నారు. తనకు విద్యాసాగర్ రావు మంచి మిత్రుడని,మొదటి నుంచి కుటుంబ సభ్యుడిగా,తనకు పెద్దన్నలాగా వ్యవహరించేవారని సిఎం అన్నారు. విద్యాసాగర్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
విద్యాసాగర్ రావు కన్నుమూత
-
విద్యాసాగర్ రావు కన్నుమూత
ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్. విద్యాసాగర్ రావు కన్నుమూశారు. ఎక్స్టెన్సివ్ మెటస్టాటిక్ బ్లాడర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఉదయం 11.23 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. గత కొంత కాలంగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగానే ఉండటంతో కొన్నాళ్లుగా వెంటిలేటర్ మీద ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొని, సాగునీటి విషయంలో రాష్ట్రం ఆవశ్యకత గురించి ఆయన ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఆయన అత్యంత సన్నిహితులు. ఇటీవలే ఆయనను కేసీఆర్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. 'విద్యన్నా.. నేను కేసీఆర్‌ను' అంటూ పలకరించారు. సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ)లోనూ కీలక బాధ్యతలు నిర్వర్తించి రిటైరైన విద్యాసాగర్ రావు.. తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయనను కేసీఆర్ సర్కారు సాగునీటి ముఖ్య సలహాదారుగా నియమించింది. కాగా విద్యాసాగర్ రావు రెండేళ్లుగా కేన్సర్‌తో బాధ పడుతున్నారు. ఏడాది క్రితం అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. తిరిగి నగరానికి వచ్చినతర్వాత కూడా ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. దాంతో ఈనెల 22న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చి అప్పటినుంచి కీమోథెరపీ అందించారు. అయినా ఫలితం లేకపోయింది. -
విషమంగానే విద్యాసాగర్‌రావు ఆరోగ్యం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు ఆర్.విద్యాసాగరరావు ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఆస్పత్రి శుక్రవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని ఆస్పత్రి ఫౌండర్ చైర్మన్ డాక్టర్ గురు ఎన్.రెడ్డి తెలిపారు. ఎక్స్టెన్సివ్ మెటస్టాటిక్ బ్లాడర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన వెంటిలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్నారని వివరించారు. -
నిలకడగా విద్యాసాగర్ ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: సాగునీటిరంగ నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు రామరాజు విద్యాసాగర్‌రావు ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కు స్పందిస్తున్నారని కాంటినెంటల్ ఆస్పత్రి డాక్టర్లు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ గురు ఎన్.రెడ్డి మధ్యాహ్నం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. రెండ్రోజులుగా ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, ఆస్పత్రి ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనను నిరంతరం పరీక్షిస్తోందని చెప్పారు. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, ఆరోగ్యం మెరుగైతే 24 గంటల తర్వాత వెంటిలెటర్ తొలగిస్తామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారని వివరించారు. కాగా, విద్యాసాగర్‌రావు చనిపోయారంటూ టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం నిజం కాదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
విషమంగానే విద్యాసాగర్‌రావు ఆరోగ్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ప్రస్తుతం ఆయనకు వెంటి లేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నారు. కొంతకాలంగా ఆయన బ్లాడర్ కేన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆదివారం మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డిలు వేర్వేరుగా ఆస్పత్రిని సందర్శించి విద్యాసాగర్‌రావు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ఎంపీ బీబీ పాటిల్, శాఖ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషి, ఇతర ఇంజనీర్లు ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. -
కాళేశ్వరానికి ‘పర్యావరణ’ బ్రేక్!
కేంద్ర జల సంఘం ఓకే చెప్పేంత వరకు అనుమతులివ్వలేం l స్పష్టం చేసిన కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ l నేడు ఢిల్లీకి విద్యాసాగర్‌రావు, సీఈ సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ)నకు బ్రేక్ పడింది! ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతులు ఇచ్చేవరకు తాము ఈఐఏకు అనుమతులు ఇవ్వబోమని కేంద్ర పర్యావర ణ, అటవీ శాఖ తేల్చిచెప్పింది. ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసా ధ్యాలపై చర్చించాకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) రెండో సమావేశపు మినిట్స్‌ను పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా వెబ్సైట్లో ఉంచింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు వచ్చాకే ఈఐఏకు అనుమతిస్తామనడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై తేల్చుకునేందుకు నీటి పారుదల శాఖ అధికారులు సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. పర్యావరణ అనుమతులకు ఆగాల్సిందే సుమారు 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.80,499.71 కోట్ల అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపడుతున్న విషయం తెలిసిందే. గోదావరి నుంచి మొత్తం 180 టీఎంసీలను మళ్లించేలా 26 రిజర్వాయ ర్లను నిర్మించేందుకు ప్రణా ళిక వేశారు. ప్రాజెక్టు పరిధిలో మొత్తంగా 80 వేల ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. 2,866 హెక్టార్లు (13,706 ఎకరాల)మేర అటవీ భూమి అవసరం ఉంది. ఈ మొత్తం భూమిలో 13,706 హెక్టార్లు (34,265 ఎకరాలు) పూర్తిగా ముంపు ప్రాంతంలో ఉంది. ఈ అంశాలన్నీ పర్యావరణా న్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేసేవే. వీటన్నింటికీ పరిష్కారాలు చూపుతూ ప్రభుత్వం పర్యావరణ ప్రభావ మదింపు చేపట్టాలి. ఇక దీనికి తోడు ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించాలంటే మొత్తం 18 విభాగాల నుంచి అనుమతులు తప్పనిసరి. ఇందులో కొన్ని అనుమతులు సులభమైనవే అయినా.. పర్యావరణ, అటవీ శాఖ అనుమతులు కాస్త క్లిష్టతరమైనవి. ప్రస్తుతం కోర్టు కేసులు, ట్రిబ్యునళ్ల తీర్పుల నేపథ్యంలో నీటి పారుదల శాఖ.. కాళేశ్వరం ప్రాజెక్టులో పర్యావరణ అంశానికే ప్రాధాన్యం ఇచ్చి పర్యావరణ మదింపు కోసం ఈఏసీకి గత నెలలోనే వివరణ ఇచ్చింది. ఈ వివరణలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రాజెక్టు డిజైన్‌కు అనుగుణంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్(టీఓఆర్)ను ఖరారు చేసినట్లు సమాచా రం సైతం అందించింది. ఈ టీఓఆర్ విధివిధానా లకు అనుగుణంగా పర్యావరణ మదింపు నివేదికను తిరిగి మంత్రిత్వ శాఖకు సమర్పిస్తే అక్కడ ఆమోదం దక్కనుంది. ఈ ఆమోదం ఉంటేనే ప్రాజెక్టుకు జాతీ య హోదా అంశంతో పాటు రుణాలు తీసుకునేం దుకు రాష్ట్రానికి వెసులుబాటు ఉంటుంది. అ యితే ఈఏసీ ఇటీవల వెలువరించిన తన మినిట్స్ కాపీలో మాత్రం పర్యావరణ అనుమతులకు అంగీకరించలే మని పేర్కొంది. ‘‘ప్రాజెక్టు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలు తదితర అంశా లపై చర్చలు జరిపాం. అయితే ఈ ప్రాజెక్టును అనుమతించకూడదని నిర్ణయిం చాం. కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టుకు ఆమోదిం చలేం’’ అని కమిటీ తన మినిట్స్ లో స్పష్టం చేసింది. కమిటీకి చైర్మన్‌గా ఉన్న శరద్‌కుమార్ జైన్ సహా మరో 11 మంది సభ్యులు ఓకే చెప్పినా హైడ్రాలజీ విభాగానికి సంబంధించిన చీఫ్ ఇంజనీర్ దీనికి అడ్డు తగలడంతోనే ఈఐఏకు బ్రేకులు పడ్డాయని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. దీనిపై తేల్చుకునేందుకు సోమవారం ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, సీఈ హరిరాం ఢిల్లీ వెళ్లనున్నారు. కొత్త మార్గదర్శకాలే అడ్డు? కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఆగడం వెనుక ఇటీవల కేంద్ర జల సంఘం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలే కారణమని తెలుస్తోంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ప్రాజెక్టు అనుమతులు తొందరగా రావాలంటే సీడబ్ల్యూసీతో సంప్రదించి రూపొందించిన డీపీఆర్ కచ్చితంగా ఉండాలి. మొదట రాష్ట్ర ప్రభుత్వాలు ఒక డీపీఆర్‌ను రూపొందించాలి. ఆ డీపీఆర్‌తో సీడబ్ల్యూసీని సంప్రదిస్తే.. వారు అవసరమైన మార్పుచేర్పులు సూచిస్తారు. ఆ మార్పులను పొందుపరిచి రాష్ట్రాలు తుది డీపీఆర్‌ని సీడబ్ల్యూసీకి ఇవ్వాలి. దీనిపై సీడబ్ల్యూసీ, దాని అనుబంధ డైరెక్టరేట్లకి ప్రజెంటేషన్ ఇస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితే సీడబ్ల్యూసీ సూత్రప్రాయ అంగీకారం తెలుపుతుంది. ఆ తర్వాత నిర్ణయించిన గడువులోగా అను మతులు జారీ చేస్తారు. వాస్తవానికి ఏ రాష్ట్రమైనా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలంటే అన్ని అనుమతులు ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన అనంతరం అనుమతులకు దరఖాస్తు చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం జరిగినా ఏళ్లకు ఏళ్లుగా పర్యావరణ, అటవీ వంటి అనుమతులు రాక ప్రాజెక్టు నిర్మాణాల్లో విపరీత జాప్యం జరిగి, వాటి అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇది మొత్తంగా ప్రాజె క్టు వ్యయ, ప్రయోజనాల మధ్య భారీ అంతరాన్ని పెంచుతోంది. దీన్ని దృష్టి లో పెట్టుకొనే ఇటీవల సీడబ్ల్యూసీ కొత్త మార్గదర్శకాలు తెచ్చింది. ఈ మార్గదర్శకాలే ప్రస్తుతం కాళేశ్వరానికి అడ్డుగా మారాయి. -
పోలవరం వాటాలు తేల్చేలా ఆదేశాలివ్వండి
కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శితో విద్యాసాగర్‌రావు సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు పరి ష్కరించేందుకు ఏర్పాటైన ఏకే బజాజ్ కమిటీకి స్పష్టమైన ఆదేశాలిచ్చి పోలవరం, పట్టిసీమ వాటాలు తేల్చేలా చూడాలని కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్జీత్సింగ్ను రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు ఆర్.విద్యాసాగర్‌రావు కోరారు. శుక్రవారం ఢిల్లీలో అమర్‌జీత్‌సింగ్‌తో భేటీ అయిన ఆయన.. బజాజ్ కమిటీ విధులపై చర్చించారు. పోలవరం, పట్టిసీమల ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు తరలిస్తున్న నీటిలో ఎగువ రాష్ట్రాలకు దక్కే వాటాలను కమిటీ తేల్చాలని పేర్కొన్నా, ఆ అంశం తమ పరిధిలోకి రాదంటూ కమిటీ ఇటీవల రాష్ట్ర పర్యటన సందర్భం గా చేసిన వ్యాఖ్యలను అర్జీత్సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. ట్రిబ్యునల్ కేటాయింపులు చేసేందుకు చాలా సమయం పడుతున్నందున ఈలోగా తాత్కా లిక కేటాయింపులు చేసి, నిర్దిష్ట వాటా చెప్పాల్సిన బాధ్యత కమిటీపై ఉందని.. అది పట్టించుకోకుండా విధివిధానాలంటే కమిటీ ఏర్పాటుకు అర్థం లేదని వివరించారు. అమర్జీత్సింగ్ స్పందిస్తూ.. ఈ అంశం తమ దృష్టికి వచ్చిందని, కమిటీ పెద్దలతో మాట్లాడతానని స్పష్టం చేసినట్లుగా సమాచారం. -
పళనిస్వామికి గవర్నర్ అపాయింట్ మెంట్
-
పళనిస్వామికి గవర్నర్ అపాయింట్ మెంట్
చెన్నై: అన్నాడీఎంకే శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నికైన పళనిస్వామి ఈ సాయంత్రం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలిశారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తో ఆయన భేటీ అయ్యారు. గోల్డెన్ బే రిసార్టు నుంచి ఎమ్మెల్యేలతో కలిసి పళనిస్వామి నేరుగా రాజ్ భవన్ కు వచ్చారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. పళనిస్వామి వెంట 12 మంది మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని ఇంతకుముందు గవర్నర్ ను కలిసి పన్నీర్ సెల్వం, శశికళ కోరిన సంగతి తెలిసిందే. అయితే గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో గవర్నర్ ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
'రేపటికల్లా గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి'
చెన్నై: తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు తీరును రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి తీవ్రంగా వ్యతిరేకించారు. ఎమ్మెల్యేల మద్ధతున్న వ్యక్తిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించక పోవటం ప్రలోభాల కిందకే వస్తుందన్నారు. తమిళనాడు సీఎంగా ఎవరికి అవకాశమివ్వాలన్న అంశంలో గవర్నర్ ఇంకా నాన్చడం సరికాదని హితవు పలికారు. రేపటికల్లా గవర్నర్ విద్యాసాగర్ రావు దీనిపై నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ఆర్టికల్ 32 కింద రిట్ దాఖలు చేస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. న్యాయపోరాటం చేసి అయినా తమిళ రాజకీయ సంక్షోభానికి తెరదించుతామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల మద్ధతున్న వ్యక్తిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో జాప్యం చేయడం ప్రలోభాల కిందకే వస్తుందని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు. వారం రోజుల కిందట పన్నీర్ సెల్వం రాజీనామా అనంతరం.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను హ్యాండిల్ చేయలేకపోతే పదివి వదిలేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. శశికళను పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని, ఎమ్మెల్యేల సంపూర్ణ మద్ధతు ఆమెకు ఉన్న తరుణంలో ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాలంటూ ఇటీవల ఆయన సూచించారు. మరోవైపు పన్నీర్ సెల్వానికి రోజురోజుకు మద్ధతు పెరిగిపోవడం శశికళ వర్గంలో గుబులు రేపుతోంది. The TN Guv must decide CM issue by tomorrow otherwise a WP under Art 32 of the Constitution can be filed charging abetment of horse trading — Subramanian Swamy (@Swamy39) 12 February 2017 -
గవర్నర్ తో స్టాలిన్ భేటీ.. ఏం చెప్పారో?
చెన్నై: అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శుక్రవారం రాత్రి ఇంచార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీలో సీఎం కుర్చీ కోసం కుమ్ములాట జరుగుతుండడంతో రాష్ట్రంలో పాలన స్తంభించిందని వివరించారు. రాష్ట్రంలో అనిశ్చితిని తొలగించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 9 నెలలుగా రాజకీయ సంక్షోభం నెలకొందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని స్టాలిన్ అన్నారు. గవర్నర్ స్పందించాలి, ప్రజాస్వామాన్ని కాపాడాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం న్యాయమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. -
గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
-
గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
చెన్నై: తమిళ రాజకీయం గవర్నర్ వద్దకు చేరింది. అధికార అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం, శశికళ నటరాజన్ గురువారం సాయంత్రం వేర్వేరుగా ఇంచార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలిశారు. రాష్ట్ర ప్రథమ పౌరుడికి తమ మొర వినిపించారు. తనతో శశికళ బలవంతంగా రాజీనామా చేయించారని, సీఎం పదవికి చేసిన రాజీనామాను వెనక్కు తీసుకుంటానని గవర్నర్ తో పన్నీర్ సెల్వం చెప్పారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల లేఖను గవర్నర్ కు అందించి ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని 'చిన్నమ్మ' కోరారు. దీంతో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పన్నీర్ సెల్వంకు అవకాశం ఇస్తారా, శశికళను ఆహ్వానిస్తారా అనే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ రెండూ కాదని రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా అని చర్చించుకుంటున్నారు. గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని తమిళ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
గవర్నర్‌తో శశికళ భేటీ!
-
క్షణక్షణం.. గవర్నర్‌తో శశికళ భేటీ!
చెన్నై: ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు పావులు కదుపుతున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ గురువారం రాత్రి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో సమావేశమయ్యారు. 120కిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు తనకుందని, మెజారిటీ (117) మద్దతు తనకు ఉన్న కారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఆమె గవర్నర్‌ను కోరినట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని, అవసరమైతే.. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు కూడా సిద్ధమని ఆమె తెలిపినట్టు తెలుస్తోంది. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లేఖలను ఆమె ఈ సందర్భంగా గవర్నర్‌కు సమర్పించారు. ఆమె వెంట పదిమంది మంత్రులు ఉన్నారు. అయితే, ఎమ్మెల్యేలు ఎవరూ ఆమె వెంట రాకపోవడం గమనార్హం. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే ఆమె వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలంతా శశికళ ఏర్పాటుచేసిన క్యాంపులోనే ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శశికళ అభ్యర్థనపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పోయెస్ గార్డెన్ నుంచి నేరుగా మేరినా బీచ్ చేరుకున్న ఆమె.. అక్కడ దివంగత జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. తన చేతిలోని ఎమ్మెల్యేల సంతకాలున్న పత్రాలను సమాధి వద్ద ఉంచారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగంతో కనిపించారు. జయలలిత తరహాలో ఆకుపచ్చని చీర కట్టుకున్న శశికళ ఒకింత కన్నీటి పర్యంతమవుతూ అమ్మ సమాధి వద్దనుంచి రాజ్‌భవన్‌కు కదిలారు. -
శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్!
చెన్నై: గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌తో భేటీ అయిన అనంతరం తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. నవ్వుతూ కనిపించిన ఆయన ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని మరోసారి చెప్పారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని, శశికళ ఒత్తిడి చేయడం వల్లే పదవికి రాజీనామా చేశానని ఆయన మీడియాకు చెప్పారు. తనకు అండగా నిలబడిన ఎమ్మెల్యేలకు పన్నీర్ సెల్వం కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే శుభవార్త చెప్తానంటూ ఆయన విలేకరుల సమావేశాన్ని ముగించారు. మద్దతుదారులైన నేతలు, కార్యకర్తల మధ్య పన్నీర్ ఈ సందర్భంగా నవ్వుతూ కనిపించారు. ఆయన నవ్వుతూ కళకళలాడటంతో అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. అయితే, పన్నీర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది? ఆయనకు గవర్నర్ మరో అవకాశం ఇస్తారా? లేదా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. -
గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు?
చెన్నై: తమిళనాట రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెలం (ఓపీఎస్) గురువారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వీరి భేటీ 20నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, సెల్వం నువ్వా-నేనా అన్నరీతిలో తలపడుతున్న నేపథ్యంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అందరి దృష్టి గవర్నర్‌పై నెలకొన్న నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై వీరు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. మొత్తం తనకు మద్దతుగా ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలతో ఓపీఎస్ గవర్నర్‌ను కలిశారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు తనకు అవకాశం ఇప్పించాలని ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌ను కోరినట్టు సమాచారం. శశికళ ఒత్తిడి చేయడం వల్లే రాజీనామా చేశానని, వీలుంటే తన రాజీనామాను వెనుకకు తీసుకుంటానని కూడా ఓపీఎస్ చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో తనకు మరో అవకాశం ఎందుకు కల్పించాలో ప్రధానంగా సెల్వం.. గవర్నర్‌కు వివరించినట్టు చెప్తున్నారు. తమిళనాడు రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరిచేందుకు ప్రస్తుతం గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని, ఈ నాలుగు ఆప్షన్లలో (శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం) ఆయన దేనిని ఎంచుకుంటారన్నది రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. -
శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్?
ఆ విచక్షణాధికారం ఉందంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత తమిళనాట అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం తారస్థాయిలో చేరిన నేపథ్యంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. శశికళను ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తమకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం చెబుతున్నది. తనకు కూడా మెజారిటీ ఉందని, అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశమిస్తే.. తన బలమేమిటో నిరూపించుకుంటానని పన్నీర్ సెల్వం చెప్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలను చూస్తే ప్రస్తుతం పన్నీర్ సెల్వం వద్దు ఆరుగురు ఎమ్మెల్యేలకు మించి బలం లేదని చెప్తున్నది. దీంతో అంకెల సమీకరణాలు ఇప్పుడు తమిళనాట ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శశికళ, పన్నీర్ సెల్వంలలో ఎవరి ముఖ్యమంత్రి కావాలన్న మ్యాజిక్ ఫిగర్ 117 ఉండాల్సిందే. దీంతో మెజారిటీ మద్దతు ఉన్న శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని గవర్నర్ ఆహ్వానించకతప్పదా? అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన అధికార పార్టీ నేత ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంటుందని ఆయన తెలిపారు. తన పుస్తకం 'ఫియర్లెస్ ఇన్ అపోజిషన్' విడుదల సందర్భంగా ఆయన 'ది హిందూ'తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'మెజారిటీ సంఖ్యాబలమున్న పార్టీ నాయకుడితో ప్రమాణం చేయించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత గవర్నర్‌కు ఉంటుంది. ప్రస్తుతమున్న ఆయా కారణాల వల్ల ప్రమాణాన్ని కొద్దిరోజులు వాయిదా వేస్తున్నానని చెప్పే విచక్షణాధికారం కూడా గవర్నర్‌కు ఉంటుంది. ఇది చిన్నపాటి అవకాశం. రాజ్యాంగబద్ధత దీనికి ఉందా? లేదా? అన్నది చూడలేదు కానీ, ఈ అవకాశం గవర్నర్‌కు ఉంటుందని నేను భావిస్తున్నా' అని ఆయన చెప్పారు. ప్రస్తుతం గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని, ఈ నాలుగు ఆప్షన్లలో (శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం) ఆయన దేనిని ఎంచుకుంటారన్నది రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాయిదా ఆప్షన్ కూడా ఆయన ఎంచుకుంటారా? అన్నది చూడాలి అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
విమానంలోనూ గవర్నర్ ను వదల్లేదు!
చెన్నై: తమిళనాడులో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అందరిచూపు ఇంచార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావుపైనే ఉంది. ఆయన ఏం చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రతి కదలికను మీడియా ప్రముఖంగా చూపిస్తోంది. గురువారం మధ్యాహ్నం ముంబై నుంచి చెన్నైకు ఆయన వచ్చారు. విమానంలో కూడా మీడియా ప్రతినిధులు ఆయనను వదల్లేదు. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారని విమానంలో విద్యాసాగర్ రావును చుట్టుముట్టి ప్రశ్నలు సంధించారు. అయితే విద్యాసాగర్ రావు మాత్రం నోరు మెదపలేదు. తమిళనాడు నెలకొన్న రాజకీయ సంక్షోభంపై మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు. చెన్నై విమానాశ్రయంలో దిగిన తర్వాత మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. పన్నీర్ సెల్వం, శశికళ నటరాజన్ తో భేటీ అయిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. -
విమానంలోనూ గవర్నర్ ను వదల్లేదు!
-
విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం!
చెన్నై: తమిళనాట రాజకీయాలు రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠరేపుతున్న తరుణంలో ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైలో అడుగుపెట్టారు. ఆపద్ధర్మ సీఎం హోదాలో పన్నీర్ సెల్వం ఎదురెళ్లి మరీ విద్యాసాగర్‌కు సాదర స్వాగతం తెలిపారు. ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ-పన్నీర్ సెల్వాం నువ్వా-నేనా అన్న స్థాయిలో హోరాహోరీగా తలపడుతుండటంతో ఈ సంక్షోభంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ నిర్ణయం ఏమిటా.. అని తమిళనాడే కాదు యావత్ దేశం ఎదురుచూస్తున్నది. ఇలాంటి తరుణంలో రాజ్‌భవన్‌లో అడుగుపెట్టిన గవర్నర్ మరికాసేపట్లో డీజీపీ, సీఎస్‌లను కలువబోతున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఆయన సమీక్షిస్తారు. ఇప్పటికే మొదట ఓపీఎస్‌కు, ఆ తర్వాత శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తరుణంలో గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని, ఈ నాలుగు ఆప్షన్లలో (శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం) గవర్నర్ దేనిని ఎంచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. -
గవర్నర్ ముందు 4 ఆప్షన్స్!
-
ముందు సెల్వం, తర్వాత శశికళ..
-
పన్నీరు సెల్వంకు ఫస్ట్ ఛాన్స్!
చెన్నై: అనూహ్య మలుపులు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో గవర్నర్ పాత్ర కీలకంగా మారింది. ఈ రోజు (గురువారం) చెన్నై వెళ్తున్న మహారాష్ట్ర, తమిళనాడు ఉమ్మడి గవర్నర్ విద్యాసాగర్ రావు నిర్ణయం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని అన్నా డీఎంకే చీఫ్ శశికళ చెబుతుండగా.. తనకు 45 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెబుతున్నారు. ఇరు వర్గాలు గవర్నర్ అపాయింట్మెంట్ కోరాయి. గవర్నర్ విద్యాసాగర్ రావు తొలుత పన్నీరు సెల్వంకు అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశముంది. తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించిన పన్నీరు సెల్వం.. సభలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరనున్నారు. సభలో బలనిరూపణ జరిగితే ఎమ్మెల్యేలు తనవైపే వస్తారని ఆయన ధీమాగా ఉన్నారు. మరోవైపు శశికళ వర్గం కూడా గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను ఇప్పటికే ఓ హోటల్‌కు తరలించారు. పార్టీలో 134 మంది ఎమ్మెల్యేలకుగాను 131 మంది శశికళ క్యాంప్‌లో ఉన్నారు. ఎమ్మెల్యేలందరితో కలసి శశికళ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బలనిరూపణకు పన్నీరు సెల్వానికి అవకాశం ఇస్తారా? లేక ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానిస్తారా? లేక అన్నా డీఎంకేలో చీలిక కారణంగా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తారా? గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. -
తమిళనాడు గవర్నర్ పని చేస్తున్నారా?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం చేయడానికి సహకరించకుండా ఉన్న ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్.. గవర్నర్ చర్యలపై మండిపడ్డారు. భారతీయ జనతాపార్టీ డైరెక్షన్లో తమిళనాడు గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని దిగ్విజయ్ విమర్శించారు. అసలు గవర్నర్ విధులను ఆయన నిర్వర్తిస్తున్నారా అని దిగ్విజయ్ ట్విట్టర్లో ప్రశ్నించారు. అంతకుముందు స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ తిరునవుక్కరసర్ సైతం బీజేపీ వ్యవహారాన్ని తప్పుపట్టారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ లబ్ధి పొందాలని భావిస్తుందని ఆయన విమర్శించారు. Political turmoil in TN and Governor playing truant. Is he fulfilling his duties ? No. He is doing politics under direction of BJP. — digvijaya singh (@digvijaya_28) February 8, 2017 -
ఇక సమరమే!
► నేటి నుంచి సభా పర్వం ► అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత ► గవర్నర్ ప్రసంగంతో శ్రీకారం ► సభా మందిరంలో మార్పులు చేర్పులు ► 24న అమ్మకు సంతాపం ► 25న జల్లికట్టు ముసాయిదా సాక్షి, చెన్నై : అసెంబ్లీ సమరానికి సర్వం సిద్ధమైంది. జల్లికట్టు ప్రకంపనల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సభాపర్వం వాడివేడిగా సాగే అవకాశాలు ఉన్నాయి. గవర్నర్(ఇన్ )విద్యాసాగర్‌రావు ప్రసంగంతో సోమవారం పది గంటలకు అసెంబ్లీ సమావేశం కానుంది. ఇక, ఈనెల 24న అమ్మ జయలలిత మృతికి సంతాపం తీర్మానం, 25వ తేదీన జల్లికట్టుకు మద్దతుగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించే విధంగా స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పదవీ కాలం విషయంగా ముసాయిదాలు దాఖలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్నాడీఎంకే సర్కారు రెండోసారిగా అధికారంలోకి వచ్చినానంతరం దివంగత సీఎం జయలలిత నేతృత్వంలో గత ఏడాది బడ్జెట్ సమావేశాలు సాగాయి. తదుపరి చోటుచేసుకున్న పరిణామాలతో అమ్మ జయలలిత ఆసుపత్రి పాలు కావడం, చివరకు అందర్నీ వీడి అనంత లోకాలకు చేరడం చోటు చేసుకున్నాయి. సీఎంగా అమ్మ నమ్మిన బంటు పన్నీరుసెల్వం పగ్గాలు చేపట్టినా, రాష్ట్రంలో పాలన అంతంత మాత్రమే. ఇక, జల్లికట్టు నినాదం పన్నీరుసెల్వం ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలోనే పెట్టింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో తొలి అసెంబ్లీ సమావేశానికి తగ్గ ఏర్పాట్ల మీద సీఎం పన్నీరుసెల్వం దృష్టి పెట్టారు. ఆయా విభాగాల్లోని కేటాయింపులు, పథకాల తీరు తెన్నుల మీద మంత్రులు సమీక్షలు ముగించి, ప్రతి పక్షాల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. సభాపర్వం తేదీని రాష్ట్ర ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రకటించడంతో అసెంబ్లీ సమావేశానికి తగట్టు సర్వం సిద్ధమైంది. ఇక సమరమే...జల్లికట్టు ప్రకంపన తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశం అవుతుండడంతో ఉత్కంఠ నెలకొంది. అధికార పక్షంతో ఢీ కొట్టేందుకు బలమైన ప్రధాన ప్రతిపక్షం సిద్ధమైంది. దీంతో సభాపర్వం వాడి వేడిగా సాగే అవకాశాలు ఎక్కువే. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యే తొలి సమావేశం కావడంతో, ఇందులో ఏదేని కొత్త పథకాలను ప్రకటించేనా అన్న ఎదురు చూపుల్లో సర్వత్రా ఉన్నారు. అమ్మ పథకాల కొనసాగింపుతో పాటు, ఇతర పథకాల మీద పన్నీరు దృష్టి పెట్టేనా అని పెదవి విప్పే వాళ్లూ ఉన్నారు. అమ్మ జయలలిత లేని తొలి సమావేశం కావడంతో ఇక, అన్నాడీఎంకే వర్గాల్లో అమ్మ భక్తి ఏ మేరకు ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక, ఈ ఏడాదిలో తొలి సమావేశాన్ని ప్రారంభించేందుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం 9.50 గంటలకు అసెంబ్లీ ఆవరణకు చేరుకుంటారు. స్పీకర్ ధనపాల్, అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ఆయనకు మర్యాద పూర్వకంగా స్వాగతం పలుకుతారు. పది గంటలకు సరిగ్గా గవర్నర్ ఆంగ్ల ప్రసంగం ప్రారంభం అవుతుంది. తదుపరి ఆ ప్రసంగాన్ని స్పీకర్ ధనపాల్ తమిళంలో అనువదిస్తారు. ఇంతటితో తొలి రోజు సభ ముగుస్తుంది. తదుపరి స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, చర్చించాల్సిన అంశాలు, ముసాయిదాల గురించి సమీక్షించి ఇందులో నిర్ణయం తీసుకుంటారు. రేపు అమ్మకు సంతాపం: అందరి అమ్మ జయలలిత భౌతికంగా దూరమైనానంతరం జరుగుతున్న తొలి సమావేశం కావడంతో సంతాప తీర్మానం, సందేశాలు సభలో సాగించాల్సి ఉంది. రెండో రోజు మంగళవారం అమ్మ జయలలిత మృతికి సంతాప తీర్మానం, నేతల ప్రసంగాలు ఉంటాయి. అదే రోజు మాజీ మంత్రి కోశిమణితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ గవర్నర్ బర్నాల, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫెడల్ క్యాస్ట్రోల మృతికి సంతాపంగా మౌనం పాటించనున్నారు. ఈ ప్రక్రియతో రెండో రోజు సభ ముగియనుంది. ఇక మూడో రోజు బుధవారం నుంచి సభలో వాడివేడి ప్రసంగాలు సాగనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు తెలుపడమే కాకుండా, చర్చలు, జల్లికట్టు ముసాయిదా సభ ముందు కు రానున్నాయి. అలాగే, స్థానిక సంస్థల ఎన్నిక లు ఆగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయా సంస్థలకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తూ సభలోముసాయిదాను దాఖలు చేయనున్నారు. ఇక, అమ్మ జయలలిత సీఎంగా ఉన్న సమయంలో శాసనసభ పక్ష నేతగా పన్నీరు సెల్వం వ్యవహరించిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన సీఎం పగ్గాలు చేపట్టిన దృష్ట్యా, శాసన సభ పక్షనేతగా ఎవరు వ్యవహరిస్తారోనన్న ఎదురుచూపులు అన్నాడీఎంకేలో పెరిగాయి. ఇక, అమ్మ సభలో లేని దృష్ట్యా, మందిరంలో కొన్ని మార్పులు చేర్పులు జరి గినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.అసెం బ్లీ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, వాహనాల రాకపోకలకు ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా, అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు సమాయత్తమయ్యే విధంగా డీఎంకే శాసనసభా పక్ష సమావేశం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు రాయపేటలోని ఆ పార్టీ కార్యాలయంలో జరుగనుంది. -
హాఫ్ మారథాన్‌లో అపశృతి
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదివారం ఉదయం ముంబైలో హాఫ్ మారథాన్‌ను ప్రారంభించారు. సీఎస్టీలో ఉత్సాహంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. మారథాన్‌లో పాల్గొన్న ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడ కలకలం రేగింది. స్పృహ కోల్పోయిన యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది. -
శశికళను కలవడంపై అభ్యంతరం, స్టాలిన్ లేఖ
-
శశికళను కలవడంపై అభ్యంతరం, స్టాలిన్ లేఖ
చెన్నై: తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు డీఎంకే కోశాధికారి ఎం.కె.స్టాలిన్ గురువారం లేఖ రాశారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సులర్లు శశికళను కలవడంపై ఆయన ఆ లేఖలో అభ్యంతరం తెలిపారు. రాజ్యాంగ పదవిలో లేని వ్యక్తిని వీసీలు ఎలా కలుస్తారని స్టాలిన్ లేఖలో ప్రశ్నించారు. విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టకుండా చూడాలని ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరారు. కాగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవులు ఒకేసారి ఖాళీ అయ్యాయి. పెద్దగా తర్జనభర్జన అవసరం లేకుండానే ముఖ్యమంత్రి పదవి పన్నీర్‌సెల్వాన్ని వరించింది. జయ రెండుసార్లు జైలు కెళ్లినపుడు పన్నీర్సెల్వంకే సీఎం బాధ్యతలు అప్పగించడంతో ఆమె అభీష్టానికి అనుగుణంగా పన్నీరుకే పట్టం కట్టారు. అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి జయలలిత నెచ్చెలి శశికళకే అప్పగించేందుకు రంగం కూడా సిద్ధమైంది. ఇందుకు శశికళ సైతం మౌనమే అంగీకారంగా వ్యవహరిస్తున్నారు. అలాగే పన్నీర్‌సెల్వం సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతిరోజూ పోయెస్‌గార్డెన్ కు వెళ్లి చిన్నమ్మ దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు అధికారులు శశికళను కలవడంపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
జయ స్వాగతాన్ని మరువలేను!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తమిళనాడు, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. జయలలిత ప్రజల ముఖ్యమంత్రి, ప్రజానేత అని అన్నారు. డైనమిజానికి, ధైర్యసాహసాలకు ఆమె ప్రతీక అని కొనియాడారు. మహిళాశక్తికి, మహిళా సాధికారితకు, మొక్కవోని ధైర్యానికి ప్రతిరూపం జయలలిత అని కీర్తించారు. సెప్టెంబర్ 2న తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను చెన్నై విమానాశ్రయం వచ్చినప్పుడు జయలలిత ఎదురొచ్చి సాదర స్వాగతం పలికారని, ఆమె ఆప్యాయకరమైన స్వాగతం, సౌమ్యమైన మాటలు ఇప్పటికీ తన జ్ఞాపకాలలో తాజాగా ఉన్నాయని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. -
జయకు గవర్నర్ పరామర్శ
- సీఎం కోలుకోవడంపై హర్షం.. వైద్యులను అభినందించిన విద్యాసాగర్‌రావు - పరిస్థితి వివరించిన అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు సీఎం జయలలిత దాదాపుగా కోలుకున్న నేపథ్యంలో తమిళనాడు ఇన్‌చార్జ్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం అపోలో ఆస్పత్రికి వెళ్లారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయలలిత అనారోగ్యంపై గత నెల 30వ తేదీన అనేక వదంతులు వ్యాపించడంతో ఈనెల 1వ తేదీ రాత్రి విద్యాసాగర్‌రావు హుటాహుటిన ముంబయి నుంచి చెన్నై చేరుకుని నేరుగా అపోలోకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శనివారం ఉదయం 11.30 గంటలకు రెండోసారి ఆయన ఆస్పత్రికి వచ్చారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, మంత్రులు పన్నీర్ సెల్వం, తంగమణి, వేలుమణి, డాక్టర్ విజయభాస్కర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామమోహన్‌రావు, ప్రభుత్వ గౌరవ సలహాదారు షీలా బాలకృష్ణన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ తదితరులతో మాట్లాడి సీఎం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రుల బృందం గవర్నర్‌ను సీఎంకు చికిత్స సాగుతున్న రెండో అంతస్తులోని వార్డుకు తీసుకె ళ్లింది. అయితే జయ ఉన్న గదిలోకి గవర్నర్ వెళ్లలేదు. అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి.. సీఎంకు అందిస్తున్న చికిత్స గురించి గవర్నర్‌కు వివరించారు. జయలలిత బాగా మాట్లాడుతున్నారని చెప్పారు. అర గంటపాటు ఆస్పత్రిలో గడిపిన గవర్నర్ 12 గంటలకు తిరిగి వెళ్లిపోయారు. అనంతరం వైద్యుల బృందం కృషిని అభినందిస్తూ రాజ్‌భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.జయలలిత పూర్తిగా కోలుకోవాలని మంత్రులు, అన్నాడీఎంకే కార్యకర్తలు శనివారం కూడా ప్రత్యేక పూజలు జరిపారు. ఎంపీ విజయకుమార్.. చెన్నై రాణీమేరి కళాశాలలో 1500 మంది విద్యార్థినులతో కలిసి ప్రార్థనలు చేశారు. -
జయకు గవర్నర్ విద్యాసాగర్ పరామర్శ
-
ఆరోగ్యమస్తు
► పడకపై కూర్చుని భోజనం ► సీఎం మాట్లాడుతున్నారు ► అపోలో హెల్త్ బులెటిన్ విడుదల సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కోసం అపోలో ఆసుపత్రి చేసిన కృషి సఫలీకృతమైందా, అమ్మ కోలుకోవాలని కోరుకుంటూ లక్షలాది మంది చేసిన పూజలు ఫలించాయా...శుక్రవారం నాటి పరిస్థితిని సమీక్షించుకుంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి జయలలిత సంభాషిస్తున్నట్లుగా అపోలో ఆసుపత్రి శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌బులెటిన్‌లో స్పష్టం చేయడం గమనార్హం. గతనెల 22వ తేదీ అర్ధరాత్రి వేళ సీఎం జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు. కేవలం జ్వరం, డీహైడ్రేషన్ మాత్రమేనని అపోలో వైద్యులు ప్రకటించారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే శ్రేణులు సైతం అమ్మకు ఏమీ కాలేదు. నేడో రేపో ఇంటి ముఖం పడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా అంచనాలు వేస్తుండగానే మూడు వారాల క్రితం అపోలో ఆసుపత్రి వద్ద ఉత్కంఠ నెలకొంది. అమ్మకు ఏదో అయిపోయిందనే ప్రచారం మొదలైంది. మీడియా సైతం అదే హడావిడి చేసింది. గవర్నర్ విద్యాసాగర్‌రావు హడావుడిగా అపోలోకు చేరుకున్నారు. లండన్ నుంచి డాక్టర్ రిచర్డ్‌ను రప్పించారు. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం చెన్నైకి పరుగులు పెట్టింది. సింగపూర్ నుంచి మహిళా ఫిజియోథెరపిస్టులు అపోలోకు చేరుకున్నారు. వీరికి తోడు సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్ శివకుమార్ నేతృత్వంలోని అపోలో వైద్యుల బృందం ఎలానూ ఉంది. అయితే అదృష్టవశాత్తు ఉత్కంఠ పరిస్థితులు సద్దుమణిగాయి. అమ్మ కోలుకుంటున్నారనే ప్రకటనతోనే నెలరోజులు గడిచిపోయాయి. ఈ నెల రోజుల కాలంలో అనేక దశల్లో తీవ్రస్థాయి చికిత్సలు చేశారు. చికిత్సలకు సీఎం శరీరం బాగా స్పందిస్తూ ఆమె కోలుకుంటున్నందునే హెల్త్ బులెటిన్లు విడుదల చేయడం లేదని అపోలో వైద్యులు అంటున్నారు. ఏమైతేనేమీ అమ్మ బాగా కోలుకోవడంతోపాటు ఆసుపత్రిలోని బెడ్‌పై కూర్చుని ఆహారం కూడా తీసుకుంటున్నట్లుగా శుక్రవారం శుభసమాచారం వెలుగులోకి వచ్చింది. సింగపూరు నుంచి వచ్చిన ఫిజియోథెరపిస్టులు అపోలోలోనే ఉండగా, డాక్టర్ రిచర్డ్ ఈనెల 23వ తేదీన లండన్ నుంచి మళ్లీ చెన్నైకి చేరుకుంటున్నారు. డాక్టర్ రిచర్డ్‌తోపాటు ఇతర వైద్యులు జయ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని అన్నాడీఎంకే శ్రేణులు ఆశిస్తున్నాయి. కాగా పదిరోజుల తరువాత అపోలో ఆసుపత్రి శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో సైతం సీఎం క్రమేణా కోలుకుంటున్నారని, మాట్లాడుతున్నారని స్పష్టం చేయడం విశేషం. ట్రాఫిక్ రామస్వామిపై రెండు కేసులు: సీఎం జయలలితకు జరుగుతున్న చికిత్స పట్ల అవమానకరంగా వ్యాఖ్యానించిన సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామిపై చెన్నై సైబర్ క్రైం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జయలలితకు జరుగుతున్న చికిత్సపై సవివరమైన ప్రకటన చేయాలంటూ ఒక వైద్యుడు దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సీఎంకు జరుగుతున్న చికిత్స గురించి అడి గే హక్కు మీకు లేదని పేర్కొంటూ న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను కొట్టివేశారు. కొనసాగుతున్న ప్రార్థనలు : ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతూ రాష్ట్రమంతా ప్రార్థనలు కొనసాగుతున్నాయి. దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి చైర్మన్ సీ కల్యాణ్ అధ్వర్యంలో రెండు రోజుల మహా మృత్యుంజయ మూలమంత్ర జపయాగం శుక్రవారం ప్రారంభమైంది. ఈ యాగంలో 30 శివార్చకులు యాగాన్ని నిర్వహించగా, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కలైపులి థాను, మండలి గౌరవ కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్, నిర్మాతలు కొండ్రెడ్డి కృష్ణారెడ్డి, రవికొట్టార్కర, ఎల్ సురేష్ పాల్గొన్నారు. దక్షిణ చెన్నై ఎంజీఆర్ సంఘం నేతలు శాంతోమ్ చర్చిలో శుక్రవారం ప్రార్థనలు చేశారు. సైదాపేట అమ్మన్ ఆలయంలో మాజీ మంత్రి వలర్మతి పూజలు చేశారు. ఎమ్మెల్యే వెట్రివేల్ నేతృత్వంలో వ్యాసార్పాడి కరుమారి అమ్మన్ ఆలయానికి వెయ్యిమంది మహిళలు పాల కలశాలతో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నేడు చెన్నైకు విద్యాసాగర్‌రావు
ఇన్చార్జ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం తమిళ ప్రజలకు రోశయ్య కృతజ్ఞతలు తమిళనాడు ఇన్చార్జ్ గవర్నర్‌గా నియమితులైన మహారాష్ర్ట గవర్నర్ విద్యాసాగర్ రావు శుక్రవారం చెన్నైకు రానున్నారు. రాజ్ భవన్లో ఇన్చార్జ్ గవర్నర్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ప్రస్తుత గవర్నర్ కొణిజేటి రోశయ్య బాధ్యతల నుంచి తప్పుకోని... తమిళ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. చెన్నై : తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య పదవీ కాలం బుధవారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్చార్జ్ గవర్నర్‌గా తెలుగు వారైన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు నియమితులయ్యారు. దీంతో ఆయన తన బాధ్యతల్ని స్వీకరించేందుకు సిద్ధం అయ్యారు. శుక్రవారం ఢిల్లీ నుంచి ఆయన చెన్నైకు రానున్నారు. రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్ వేదికగా జరిగే కార్యక్రమంలో ఇన్చార్జ్ గవర్నర్‌గా విద్యాసాగరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన చేత మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమం తదుపరి తన బాధ్యతల్ని విద్యాసాగర్ రావుకు రోశయ్య అప్పగించనున్నారు. ఈ రోజు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ ప్రమాణ స్వీకారం జరగనున్నది. ఈ కార్యక్రమంలో సీఎం జయలలితతోపాటుగా మంత్రులు, అధికారులు పాల్గొనే అవకాశం ఉంది. కాగా, బాధ్యతల నుంచి తప్పుకోనున్న ప్రస్తుత గవర్నర్ రోశయ్య తమిళ ప్రజలకు తన కృతజ్ఞతలు తెలుపనున్నారు. ఇందుకు తగ్గ ప్రకటనను గురువారం రాత్రి సిద్ధం చేశారు. గవర్నర్ గా బాధ్యత గల పదవిలో ఐదేళ్ల పాటుగా పనిచేసిన తనకు ఎన్నో మధుర స్మృతులు మిగిలాయని రోశయ్య పేర్కొన్నారు. సంస్కృతిని అమితంగా గౌరవించే ఇక్కడి ప్రజలకు తన వంతు సేవ అందించే అవకాశం దక్కిందన్నారు.తమిళనాడు ముఖ్యమంత్రి జె జయలలితతో పాటు ఆమె మంత్రి వర్గంలోని సహచరులకు, రాజకీయ పార్టీల నాయకులకు, మాజీ, ప్రస్తుత వీసీలకు, విద్యా మేధావులు, వివిధ విభాగాల్లోని వారికి, మీడియా మిత్రులకు, రాజ్ భవన్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తె లుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు తన మీద ఎంతో ప్రేమాభిమానాలు చూపించారని, వారందరికి హృదయ పూర్వకంగా అభినందనలు రోశయ్య అభినందనలు తెలిపారు. -
వెళ్లొస్తా
తమిళనాడు గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య ఐదేళ్ల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. ఆ బాధ్యతల్ని అందుకునేందుకు మరో తెలుగు గవర్నర్ సిద్ధమయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్ రావుకు తమిళనాడు గవర్నర్ బాధ్యతలు అదనంగా అప్పగిస్తూ రాష్ర్టపతి భవనం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సాక్షి, చెన్నై : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేతగా అందరి మన్ననల్ని అందుకున్న కొణిజేటి రోశయ్య, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం అనూహ్యంగా సీఎం పదవిని అధిరోహించారు. అక్కడి కాంగ్రెస్ రాజకీయ పరిస్థితులతో ఉక్కిరిబిక్కిరైన ఆయన 2011 జూన్‌లో పదవికి అధిష్టానం ఆదేశాలతో రాజీనామా చేశారు. తలపండిన నేతను గౌరవించుకునే విధంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం రోశయ్యను తమిళనాడు గవర్నర్‌గా ఆగస్టు 26న నియమించింది. ఆయన నియామకంతో ఇక్కడి తెలుగు వారిలో ఆనందం వికసించింది. అదే ఏడాది ఆగస్టు 31న ఆయన బాధ్యతలు స్వీకరించినానంతరం తమిళనాట ఉన్న తెలుగు వారికి రాజ్‌భవన్ ప్రవేశం ఎంతో సులభతరం అయిందని చెప్పవచ్చు. తమిళులకు గౌరవాన్ని ఇస్తూనే, తెలుగువారు పిలిస్తే పలికే గవర్నర్‌గా పేరు గడించారు. తెలుగు వారి కార్యక్రమాలు తన సొంత కార్యక్రమంగా భావించి ముఖ్యఅతిథిగా హాజరవుతూ, తనకు ఉన్న అధికారాల మేరకు ఐదేళ్లుగవర్నర్ పదవికి న్యాయం చేశారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రోశయ్య పదవికి మాత్రం ఎలాంటి ఢోకా రాలేదు. ఇందుకు కారణం, తమిళనాడు ప్రభుత్వంతో ఆయన సన్నిహితంగా మెలగడమేనని చెప్పవచ్చు. ఈ సన్నిహితమే మళ్లీ ఆయన పదవీ కాలాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం సాగింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు చోటు చేసుకున్నా, ఆయన పదవీ కాలంలో చివరి రోజైన బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు రాష్ర్టపతి భవన్ నుంచి ఇక సేవలకు సెలవు అన్నట్టుగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక సెలవు ఐదేళ్ల పాటు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య పదవీ కాలం బుధవారంతో ముగిసింది. అయితే, ఆయన స్థానంలో పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరగలేదు. కర్ణాటకకు చెందిన శంకరయ్య, గుజరాత్‌కు చెందిన ఆనందిబెన్ పటేల్ పేర్లు వినిపించినా, చివరకు ఇన్చార్జ్ గవర్నర్ నియమించబడ్డారు. ఇందుకు తగ్గ ఉత్తర్వులు రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడ్డాయి. ఇన్చార్జ్గా రాబోతున్న గవర్నర్ కూడా తెలుగు వారు కావడం విశేషం. ఆయనే మహారాష్ట్ర గవర్నర్‌గా వ్యవహరిస్తున్న సీహెచ్ విద్యాసాగర్ రావు. కరీంనగర్లో జన్మించిన ఆయన ఆది నుంచి బీజేపీలో తన సేవల్ని అందిస్తూ వచ్చారు. 1985 నుంచి 1998 వరకు ఎమ్మెల్యేగా, 1999లో ఎంపీగా గెలిచిన విద్యాసాగర్ రావు, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విద్యాసాగర్ రావు చెన్నైకు వచ్చి ఇన్చార్జ్ గవర్నర్ బాధ్యతల్ని ఒకటి రెండు రోజుల్లో స్వీకరించే అవకాశం ఉంది. ఆయనకు తన బాధ్యతల్ని అప్పగించి రోశయ్య ఆ పదవి నుంచి తప్పుకుంటారు. -
నిధులు ఖర్చు చేస్తే నీళ్లేవి?
పదేళ్లలో ఐదు లక్షల ఎకరాలకైనా నీళ్లిచ్చారా? కాంగ్రెస్‌కు ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు ప్రశ్నలు 1956 నుంచి 2004 వరకు గరిష్టంగా జరిగిన సాగు 18 లక్షలే తమ్మిడిహెట్టి 152 మీటర్లకు సమ్మతి ఉన్నట్లు ఒక్క కాగితమైనా ఉందా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి రంగంపై కాంగ్రెస్ చేసిన ప్రజెంటేషన్‌ను ప్రభుత్వం తిప్పికొట్టింది. అవాస్తవాలతో ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రయత్నించిందని విమర్శించింది. ఉమ్మడి ఏపీలో సాగునీటి రంగంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని శ్రీకృష్ణ కమిటీ ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెలంగాణను కించపరిచేలా వ్యవహరించారని దుయ్యబట్టింది. కాంగ్రెస్ ప్రజెంటేషన్‌పై గురువారం ప్రభుత్వం తరఫున సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు సచివాలయంలో గంటన్నర పాటు వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ లేవనెత్తిన ప్రతి అంశాన్ని స్పృసిస్తూ.. కొట్టిపారేశారు. వివిధ అంశాలపై విద్యాసాగర్‌రావు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. 2004 వరకు గరిష్ట సాగు 18 లక్షలే.. రాష్ట్రంలో 1956 నుంచి 2004 వరకు కెనాల్, చెరువుల కింద ఉన్న సాగు 47 లక్షలని కాంగ్రెస్ చెప్పింది. నిజానికి ఇరిగేషన్ ద్వారా గరిష్టంగా 1990-91లో 18 లక్షల ఎకరాలకు సాగు నీరందింది. మిగతా ఏ ఏడాదిలోనే ఈ స్థాయిలో సాగు నీరందలేదు. బోర్లు, బావుల కింద రైతులు తమ సొంత ఖర్చుతో చేసుకున్న 32 లక్షల ఎకరాల సాగును తన ఖాతాలో కలిపేసుకుని 47 లక్షలనడం తప్పు. 2004-14 వరకు 51 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల నిర్మాణం చేశారని కాంగ్రెస్ చెబుతోంది. ఇందులో ఎప్పుడైనా 5 లక్షల ఎకరాలకైనా నీళ్లిచ్చారా?. కేవలం నిధులు ఖర్చు చేశారు తప్పితే నీళ్లివ్వలేదు. జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉందన్న సీడబ్ల్యూసీ కాంగ్రెస్ పార్టీ ప్రతిసారీ ప్రాణహిత-చేవెళ్ల గొప్ప ప్రాజెక్టని, జాతీయ హోదాకు ప్రయత్నించామని చెబుతోంది. నిజానికి కేంద్ర జల సంఘం ఈ ఏడాది జూలై 4న కేంద్ర కేబినెట్ సెక్రటరీకి సమర్పించిన లేఖలో ప్రాణహితపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘ఎలాంటి సర్వేలు చేయకుండా ప్రాథమిక అంచనాలతో ప్రాజెక్టును రూ.42,300 కోట్లతో వ్యయం వేశారు. 180 టీఎంసీల నీటిని మళ్లించేందుకు 7 రిజర్వాయర్లను 14.7 టీఎంసీలతో ప్రతిపాదించారు. ఇందులో 90 టీఎంసీలను మళ్లించేందుకే ప్రణాళిక వేశారు. ఎలాంటి సర్వే.. డిజైన్స్ లేకుండా ఈపీసీ విధానం ద్వారా చేపట్టిన ఈ ప్రాజెక్టును గమనిస్తే కాంట్రాక్టర్లకు లాభార్జన చేసేలా, జాతీయ ప్రయోజనాలకు భంగం కలిగేలా ఉంది’ అని ఘాటుగా విమర్శించింది. మహారాష్ట్ర తమ్మిడిహెట్టి 152 మీటర్లను వ్యతిరేకించడం, ఆ ఎత్తులో నీటి లభ్యత లేకపోవడంతోనే మేడిగడ్డ ద్వారా నీటిని మళ్లించాలని నిర్ణయించాం. మేడిగడ్డ ద్వారా నిర్ణీత 16 లక్షల ఎకరాలతో పాటు ఎస్సారెస్పీ, సింగూరు, నిజాంసాగర్ కింద ఉన్న 20 లక్షల ఆయకట్టుకు కలిపి మొత్తంగా 36 లక్షల ఎకరాలను స్థిరీకరించే అవకాశం ఉంది. మరి 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకున్నట్లు కాంగ్రెస్ వద్ద ఒక్క కాగితమైనా ఉందా?. ముంపు తగ్గిస్తే పాలమూరు తప్పంటారా? తక్కువ సామర్థ్యం ఉన్న జూరాలను కాదని పెద్ద రిజర్వాయరైన శ్రీశైలం నుంచి నీటిని పాలమూరు ద్వారా తరలిస్తామంటే కాంగ్రెస్ తప్పంటోంది. నిజానికి శ్రీశైలానికి జూరాలతో పాటు తుంగభద్ర నీళ్లొస్తాయి. ఇక జూరాలతో ముంపు 72 వేల ఎకరాలైతే.. శ్రీశైలంతో ముంపు 40 వేల ఎకరాలే. జూరాలతో ప్రభావితమయ్యే కుటుంబాలు 84 వేలైతే.. శ్రీశైలంతో 11 వేలే. ఈ దృష్ట్యానే శ్రీశైలం ఎంపిక చేశాం. పాలమూరు, డిండి ఎత్తిపోతల ద్వారా రంగారెడ్డి జిల్లాలో 4.35 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు యత్నిస్తున్నాం. ప్రాణహిత పథకంలో 2.10 లక్షల ఎకరాలకే జిల్లాలో నీళ్లిచ్చేలా ప్రణాళిక వేశారు. కానీ రీఇంజనీరింగ్‌తో 4.35 లక్షల ఎకరాలకు నీరందుతుంది. ఉమ్మడి ఏపీలో అన్యాయాన్ని ప్రస్తావించరా? ఉమ్మడి ఏపీలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగినా కాంగ్రెస్ తన ప్రజెంటేషన్‌లో ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని మళ్లించినా, దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ద్వారా నీటిని తీసుకెళ్లే ప్రయత్నం చేసినా మాట్లాడలేదు. ఆర్డీఎస్ కాల్వల పనుల్లో ఏపీ అడ్డుకుంటున్న వైనాన్ని చెప్పలేదు. కేవలం తన తప్పిదాలను కప్పిపుచ్చి, తెలంగాణ ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేసింది. -
నిరుద్యోగంపై జేఏసీ సమరం
- ఆగస్టు మొదటి వారంలో సదస్సు: కోదండరాం - 21, 22న పాలమూరు ప్రాజెక్టులపై అధ్యయనం -మల్లన్నసాగర్ నిర్వాసితులకు చట్టంపై అవగాహన కల్పిస్తాం - బలవంతపు భూసేకరణ అవసరం లేదు - విద్యాసాగర్‌రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్యపై పోరుబాట పట్టాలని తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. గురువారం జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన హైదరాబాద్‌లోని కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు మొదటి వారంలో నిరుద్యోగ సమస్యపై సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్టుగా వెల్లడించారు. విద్యుత్ రంగ సమస్యలు, వాస్తవాలు, పరిష్కారాలపై వచ్చేవారంలో పుస్తకం విడుదల చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, తెలంగాణ వచ్చిన తర్వాత పురోగతి, క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితిపై అధ్యయనం చేస్తామన్నారు. ఈ నెల 21, 22న జేఏసీ బృందం ఆ జిల్లాలోని ప్రాజెక్టులపై అధ్యయనం చేస్తుందన్నారు. మల్లన్నసాగర్లో భూనిర్వాసితులకు న్యాయపరమైన అంశాలు, చట్టంపై అవగాహనకు జేఏసీ ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందుకు వీలైన రూపాల్లో ప్రజలకు అవగాహన, చైతన్యం కల్పిస్తామని వివరించారు. ప్రాజెక్టులు నిపుణుల కోసం కాదు.. ప్రాజెక్టులు నిపుణుల కోసం కట్టుకునేవి కావని కోదండరాం అన్నారు. సాదా బైనామాలను అడ్డుపెట్టుకుని రైతులను బెదిరించడం సమంజసం కాదన్నారు. ‘‘బలవంతంగా భూసేకరణ అవసరం లేదు. తమ్మిడిహెట్టి, కంతనపల్లి తరహాలో మల్లన్నసాగర్‌పై ఎందుకు ఆలోచన చేయడం లేదు? సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చట్టాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని అన్నారు. చట్టానికి లోబడి పనిచేయాల్సిన ప్రభుత్వ సలహాదారు చట్టాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనడం సబబు కాదన్నారు. తెలంగాణ అంశాలపై కనీస అధ్యయనం చేసిన తర్వాతే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తామన్నారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు ప్రహ్లాద్, పిట్టల రవీందర్, ఇటిక్యాల పురుషోత్తం, వెంకట రెడ్డి, భైరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను గందరగోళపరచకండి
ప్రాజెక్టులపై ఆర్. విద్యాసాగర్‌రావు వ్యాఖ్య - కోదండరాం, హనుమంతరావు వంటివారు తొందరపడి మాట్లాడొద్దు - మల్లన్నసాగర్‌పై అనుమానాలుంటే నివృత్తి చేసుకోవచ్చు - మీకు ఎలాంటి అనుమానాలున్నా తగిన సమాచారం ఇస్తాం సాక్షి, న్యూఢిల్లీ : ‘‘కోదండరాం సాధారణ వ్యక్తి కాదు. తెలంగాణ ప్రజలకు ప్రతిబింబం లాంటి వారు. అలాంటివారు తొందరపడి మాట్లాడకూడదు. మాకు చాలా బాధ కలుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో కలిసి తిరిగిన వాళ్లం. హనుమంతరావుకు, కోదండరాంకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ప్రాజెక్టులపై ప్రజలను గందరగోళ పరచవద్దు’’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నీటిపారుదల రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు అన్నారు. మల్లన్నసాగర్‌పై అనుమానాలుంటే నివృత్తి చేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టుకు ఇంకా తుది రూపం లేదని, అయితే అన్ని ప్రత్యామ్నాయాలు ఆలోచించాకే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చిందన్నారు. మల్లన్నసాగర్, పాల మూరు ఎత్తిపోతల పథకాలపై అనుమానాలను నివృత్తి చేసేందుకు బుధవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రభుత్వానికి ఉండే ఇబ్బందులు ఉం టాయి. ప్రతిదానికి దురుద్దేశం ఆపాదించాల్సిన అవసరం లేదు. నాడు పులిచింతల, పోలవరం వద్దని అనేక పార్టీలు, ప్రజాసంఘాలు, నేను, కోదండరాం, హనుమంతరావు వ్యతిరేకించాం. పోలవరానికి అనుమతులు లేవు. అయినా కడుతున్నారు. మన సలహాలు స్వీకరించనంత మాత్రాన ప్రభుత్వాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. నా బాధ ఏంటం టే.. కోదండరాం, హనుమంతరావులాంటి వాళ్లు.. కూడా తప్పుపట్టడం. మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నా తగిన సమాచారం ఇస్తాం. అవసరమైతే సంబంధిత అధికారులను మీ దగ్గరికి పంపిస్తాం. కానీ మీరు ఎవరో పిలిచారని అక్కడికి వెళ్లి.. తెలిసీ తెలియకుండా మాట్లాడడం వల్ల ప్రజల్లో గందరగోళం తలెత్తుతుంది. ఇటీవల నారాయణఖేడ్ వద్ద రాజీవ్ బీమా ప్రాజెక్టుకు సంబంధించి పక్కనున్న జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి నీళ్లు తెస్తున్నారని మీరు మాట్లాడారు. ఆచరణ యోగ్యంకాని వాటిని ఎలా అమలుచేస్తాం? జూరాల ప్రాజెక్టుకు శ్రీశైలం ప్రాజెక్టుకు చాలా తేడా ఉంది. అని ఆయన అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు తాము అభ్యంతరం చెప్పలేదని, అయితే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రైవేటు వ్యక్తితో కేసు వేయించిందని తప్పుపట్టారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పాతదేదని, కేవలం డిజైన్ మాత్రమే మారిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు, పట్టిసీమకు అనుమతి వచ్చిన వెంటనే అందులో నాగార్జునసాగర్ పై ప్రాంతానికి వాటా రావాల్సి ఉందన్నారు. వైఎస్ రాజనీతిజ్ఞుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజనీతిజ్ఞత కారణంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఆయన మొదలుపెట్టిన 84 ప్రాజెక్టుల్లో చాలావరకు ఇప్పుడు పూర్తవుతున్నాయని విద్యాసాగర్‌రావు అన్నారు. ‘‘రాజశేఖరరెడ్డి జలయజ్ఞం మొదలుపెట్టినప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి ఉంది. అప్పుడు మేం అభ్యంతరం చెప్పాం. మీరు 84 ప్రాజెక్టులు కడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేవు. నీళ్ల కేటాయింపులు లేవన్నాం. పోలవరం వంటి ప్రాజెక్టుకు కనీసం స్థలానికి సంబంధించిన అనుమతి కూడా లేదు. అప్పుడు ఆయన అన్నాడు.. ‘రావు గారూ మీరు పద్ధతి ప్రకారం కట్టాలంటున్నారు. కానీ ఎగువ రాష్ట్రాలు అడ్డూఅదుపు లేకుండా కడుతున్నాయి.. వాటిని ఎవరు ఆపుతున్నారు? నాకు ప్రజలు ఐదేళ్లు పాలించమని చెప్పారు. మరి నేను ఈ ఐదేళ్లు ప్రాజెక్టులు కట్టకుండా ఉంటే ప్రజలు ఏమంటారు?’ అని నన్ను ప్రశ్నించారు. ఐదేళ్లలో అన్నీ పూర్తి కాలేకపోవచ్చని, కానీ ఈరోజు మొదలుపెడితే తప్పకుండా ఏదో ఒకరోజు పూర్తవుతాయని ఆయన చెప్పారు. ప్రాజెక్టులకు అనుమతులన్నీ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయన అనుకున్నట్టుగానే పోలవరం దాదాపుగా పూర్తయ్యేందుకు వస్తోంది. ఆయన నిర్ణయం కరెక్టే అని రుజువవుతోంది’’ అని అన్నారు. వైఎస్‌ను స్ఫూర్తిగా తీసుకుని ప్రాజెక్టులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆయన రాజనీతిజ్ఞత కారణంగానే ఏపీలో ప్రాజెక్టులు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. -
శ్రీవారి సేవలో మహారాష్ట్ర గవర్నర్
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆయనకు టీటీడీ అధికారులు రంగనాయకులు మండపంలో శ్రీవారి తీర్థ ప్రాసాదాలు అందించారు. -
శ్రీశైలం నుంచి సాగర్‌కు 13 టీఎంసీల నీరు విడుదల
కృష్ణా బోర్డు అంగీకారం తెలంగాణకు 4.2, ఏపీకి 4 టీఎంసీలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాల నిమిత్తం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 13 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. ఇందులో 4.2 టీఎంసీల నీటిని తెలంగాణ, మరో 4 టీఎంసీలను ఏపీ తమ తాగునీటి అవసరాలకు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. మరో 4.8 టీఎంసీలు సాగర్‌లో కనీస నీటిమట్టాలను నింపేందుకు అవసరమని తేల్చింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని సోమవారం రాత్రి మౌఖికంగా ఇరు రాష్ట్రాల అధికారులకు తెలియజేసింది. రాష్ట్ర తాగునీటి అవసరాలకు 10.54 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ గత నెల 29న కృష్ణా బోర్డుకు విన్నవించింది. నల్లగొండ జిల్లాలోని 14 తాగునీటి పథకాలకు 1.13 టీఎంసీలు, జంటనగరాల తాగునీటి అవసరాలకు 4.543 టీఎంసీలు అవసరముందని తెలిపింది. అయితే నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 507 అడుగుల నీటిమట్టం ఉందని, జంట నగరాలకు నిరంతరంగా తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకోవాలంటే సాగర్‌లో 510 అడుగుల కనీస నీటిమట్టాన్ని ఉండేలా చూడాలన్న హైకోర్టు ఉత్తర్వులను గుర్తుచేస్తూ, సాగర్‌లో నీటిమట్టాన్ని 510 అడుగులకు పెంచడానికి 4.87 టీఎంసీలు అవసరమని వివరించింది. ఇదే సమయంలో ఏపీ సైతం తమ అవసరాలకు 4 నుంచి 6 టీఎంసీలు అవసరమని తన ప్రతిపాదనను తెలంగాణ ముందు పెట్టింది. సోమవారం ఉదయం ఏపీకి చెందిన నీటిపారుదల శాఖ అధికారులు దీనిపై తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావును కలిశారు. అనంతరం ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఈఎన్సీలు మాసబ్‌ట్యాంక్‌లోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాతో భేటీ అయ్యారు. తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేయాలని కోరారు. దీనికి సమ్మతించిన ఆయన బోర్డు తాత్కాలిక చైర్మన్ రామ్‌శరాణ్ ఆదేశాల మేరకు శ్రీశైలం నుంచి 13 టీఎంసీల నీటి విడుదలకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఈ నీటిని ఇరు రాష్ట్రాలు మార్చి వరకు వినియోగించుకోవాలని సూచించారు. -
యప్ టీవీ నుంచి సరికొత్త యాప్
ముంబై: ఇంటర్నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ సరికొత్త యాప్ 'యప్ టీవీ బజార్'ను ప్రారంభించింది. ముంబైలోని జుహులో మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ బుధవారం సంయుక్తంగా ఈ యాప్‌ను లాంచ్ చేశారు. హై క్వాలిటీ విడియోలను ఈ యాప్ ద్వారా చూడవచ్చు. విద్యా సమాచారం, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్, మూవీ ట్రైలర్స్, తదితర సమాచారాన్ని మనం యప్ టీవీ బజార్ నుంచి పొందవచ్చు. వ్యక్తిగతంగా ఎవరైనా తాము రూపొందించిన వీడియోలను యప్ బజార్ నుంచి మార్కెట్ చేసుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, కంప్యూటర్ వాడేవారు సులువుగా ఈ యాప్ ద్వారా తమకు కావల్సిన విషయాన్ని చూడవచ్చు. కంటెండ్ డెవలపర్స్ తమ డాటాను, వీడియోల ద్వారా ఇందులో భద్రపరుచుకోవడంతో పాటు సులువుగా మార్కెటింగ్ చేసుకోవచ్చునని యప్ టీవీ వ్యవస్థాపకుడు, సీఈవో ఉదయ్ రెడ్డి తెలిపారు. గతంలో కంటెంట్ డెవలపర్లకు ఉన్న సమస్యలకు ఈ యాప్ పరిష్కారం చూపిస్తుందని ధీమావ్యక్తం చేశారు. గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో పరిశ్రమలు నూతన టెక్నాలజీని వాడుతున్నాయన్నారు. వీడియో కంటెంట్ ప్లాట్ఫారం అయిన యప్ టీవీ యాప్‌ను అందరూ స్వాగతించాలని చెప్పారు. ఎవరైనా తమ వీడియోను ఈ యాప్ ద్వారా అందరికీ పరిచయం చేసి, మార్కెట్ చేసుకోవడం ప్రారంభించి కొత్త బిజినెస్ చేసుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు. అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. క్రియేటివిటీని అందరికీ పరిచయం చేసుకునేందుకు మంచి అవకాశమన్నారు. గూగుల్ ప్లే స్టోర్‌లో యప్ టీవీ అత్యంత ఆదరణ కలిగిన రెండో యాప్ అని, యప్ టీవీ బజార్ అందరూ విశ్వసించదగ్గ యాప్ అని అభిషేక్ బచ్చన్ అభిప్రాయపడ్డాడు. -
కృష్ణా.. మొర వినేనా?
♦ నేడు కేంద్రం అఫిడవిట్‌పై సుప్రీంలో వాదనలు ♦ తీర్పు వ్వ్యతిరేకంగా ఉంటే న్యాయపోరాటానికి సిద్ధం ♦ ఢిల్లీలోనే సీఎం, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వివాదాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో గురువారం సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగు రాష్ట్రాల మొరను సుప్రీంకోర్టు ఆలకిస్తుందా? లేక కేంద్ర నిర్ణయాన్నే పరిగణనలోకి తీసుకుంటుందా? అన్న అంశంపై ఉత్కంఠ సాగుతోంది. ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర వైఖరి ఎలా ఉన్నా.. మొత్తం జలాల కేటాయింపును సమీక్షించి నాలుగు రాష్ట్రాలకు మళ్లీ పంచకుంటే తెలంగాణకు జరిగే అన్యాయాన్ని సమర్థంగా సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పరివాహక ప్రాంతం ఆధారంగా రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కలేని, అందువల్ల కొత్తగా కేటాయింపులు జరపాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాలని నిర్ణయించింది. మిగులు జలాలపైనే వాదనలు తన వాదనల్లో మిగులు జలాల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని రాష్ట్రం నిర్ణయించింది. బచావత్ అవార్డు ప్రకారం కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత లెక్కన 2,060 టీఎంసీల నికర జలాలు ఉన్నట్లు గుర్తించగా.. బ్రజేష్ ట్రిబ్యునల్ మాత్రం 65 శాతం నీటి లభ్యతను ఆధారం చేసుకుని 2,578 టీఎంసీల జలం ఉన్నట్టు తేల్చారు. కొత్తగా 163 టీఎంసీల నికర జలం, మరో 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీలకు పంపిణీ చేసింది. ఈ లెక్కన ఇప్పటికే ఉన్న కేటాయింపులకు అదనంగా ఏపీకి 190 టీఎంసీలు, కర్ణాటకకు 177 టీఎంసీలు, మహారాష్ట్రకు 81 టీఎంసీల నీటిని కేటాయించారు. ఇందులో 280 టీఎంసీల మేర మిగులును ఎగువ రాష్ట్రాలే వాడేసుకుంటే దిగువన మిగులు జలాలపై ఆధారపడిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనే అంశాన్ని కోర్టు ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాలకే వివాదాన్ని పరిమితం చేస్తే క్యారీ ఓవర్ స్టోరేజీ కింద ఇచ్చిన 150 టీఎంసీల నీటిని మాత్రమే తెలంగాణ, ఏపీలు పంచుకోవాల్సి ఉంటుంది. జూరాలకు 9 టీఎంసీలు, ఆర్డీఎస్కు 4 టీఎంసీలు, తెలుగుగంగకు కేటాయించిన 25 టీఎంసీలను యథావిధిగా కొనసాగించే అవకాశాలుంటాయని, అప్పుడు తెలంగాణ ఒనగూరే ప్రయోజనం ఏమీ ఉండదని వివరించనుంది. కోర్టు తీర్పు వ్యతిరేకంగా ఉంటే మళ్లీ న్యాయపోరాటానికే తెలంగాణ సర్కారు. మొగ్గుచూపనుంది. -
సంజయ్‌దత్‌కు గవర్నర్ ఝలక్
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఝలక్ ఇచ్చారు. సంజూబాబా పెట్టుకన్న క్షమాభిక్ష పిటిషన్‌ను ఆయన తిరస్కరించారు. 1993 నాటి ముంబై పేలుళ్ల నేపథ్యంలో ఆయుధాల చట్టం కింద దోషిగా తేలిన సంజయ్ దత్.. ప్రస్తుతం పుణెలోని ఎర్రవాడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, అతడికి మిగిలిన శిక్షాకాలాన్ని మాఫీ చేయాలంటూ సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు మహారాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రెండున్నరేళ్ల క్రితం వినతి పంపారు, దాన్ని పరిశీలించిన ప్రభుత్వం.. గత వారంలో గవర్నర్‌కు పంపింది. కానీ పిటిషన్‌ను పరిశీలించిన గవర్నర్ విద్యాసాగర్ రావు.. క్షమాభిక్ష అవసరం లేదంటూ దాన్ని తిరస్కరించారు. ఇప్పటికే సంజయ్ దత్ వివిధ కారణాలతో పలుమార్లు పెరోల్ మీద బయటకు వస్తూ, మళ్లీ లోపలకు వెళ్తున్నారు. దీంతో ఇలాంటి సమయంలో శిక్షను మాఫీ చేయడం సరికాదన్న ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటివరకు అనుభవించిన శిక్షాకాలాన్ని లెక్కిస్తే, సంజయ్ దత్ 2016 ఫిబ్రవరిలోనే విడుదల అవ్వాల్సి ఉంది. అంటే, మరో ఐదునెలలు గడిస్తే ఎలాంటి క్షమాభిక్ష అవసరం లేకుండానే అతడు విడుదలవుతాడు. -
సంజయ్‌దత్‌కు గవర్నర్ ఝలక్
-
నికర జలాలు చుక్కకూడా వదులుకోం
* నదుల అనుసంధానంపై కేంద్రానికి స్పష్టం చేసిన తెలంగాణ * కేటాయింపుల మేరకే ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం * రాష్ట్రం నుంచి వాదనలు వినిపించిన ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: మహానది-గోదావరి నదుల అనుసంధానంలో తమకు నష్టం జరిగితే ఒప్పుకొనే ప్రసక్తి లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. కేంద్ర జలవనరుల శాఖ నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సోమవారం ఢిల్లీలో ఐదోసారి సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ర్టం నుంచి నీటి పారుదలరంగ నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హాజరయ్యారు. ఈ సమావేశంలో విద్యాసాగర్‌రావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. సమావేశం అనంతరం ఆయన ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘అవసరానికి మంచి ఉన్న నీటిని ఇతర నదులైన కృష్ణా-పెన్నా-కావేరి-వైదేహిలకు మళ్లించేందుకు వీలుగా మహానది-గోదావరి నదుల అనుసంధానం చేయాలని కేంద్రం తలపెట్టింది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. మహానది విషయంలో తమ దగ్గర మిగులు జలాలు లేవని ఒడిశా చెప్పింది. వారిని ఒప్పించే ప్రయత్నాల్లో కేంద్రం కొన్ని ప్రత్యామ్నాయాలు చూపింది. మహానది నుంచి 230 టీఎంసీలు గోదావరికి వస్తాయి. అవి ధవళేశ్వరం వద్ద కలుస్తాయి. అయితే వచ్చే నీళ్ల కంటే పోయే నీళ్లు ఎక్కువగా ఉంటాయని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీ వద్దంది. కానీ ఇప్పుడు విడిపోయాక స్వాగతిస్తోంది. తెలంగాణకు గోదావరిలో మిగులు జలాలు లేవు. కేంద్రం వద్ద ఉన్న లెక్కలు ఎప్పుడో 20, 30 ఏళ్ల కిందటివి. అప్పుడు మేం కట్టిన ప్రాజెక్టులే లేవు. ఇప్పుడు కంతనపల్లి, దేవాదుల తదితర ప్రాజె క్టులన్నీ కడుతున్నాం. అప్పుడు నీళ్ల లభ్యత ఉన్నందున మిగులు అన్నారు. మేం అన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టాం. బచావత్ కేటాయింపులను ఒక చుక్క కూడా వదులుకునేది లేదు. పాత లెక్క ప్రకారం 1,440 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని అవార్డు ఇచ్చింది. ఏపీకి సుమారు 500 టీఎంసీలు, తెలంగాణకు 950 టీఎంసీలు వస్తాయి. మా 950 టీఎంసీల వినియోగానికి మేం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. ఆ నీళ్లలో ఒక్క చుక్క కూడా తీసుకునేందుకు మేం ఒప్పుకోం. అందరినీ ఒకే గాటన కట్టేస్తే లాభం లేదు. మా కేటాయింపుల నుంచి ఒక్క చుక్క వదలబోం..’ అని వివరించినట్టు విద్యాసాగర్‌రావు తెలిపారు. ‘పాలమూరు ప్రాజెక్టు వల్ల ఏపీకి నష్టం లేదు’ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు గతంలోనే జీవో ఇచ్చారని, అది పాత ప్రాజెక్టేనని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణకు హక్కుగా ఉన్న జలాలనే ఈ ప్రాజెక్టుకు కేటాయిస్తున్నమని తెలిపారు. ఏపీ చేపట్టిన పట్టిసీమే కొత్త ప్రాజెక్టని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు వల్ల ఏపీ ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ తాము నదుల అనుసంధానాన్ని స్వాగతిస్తున్నామని, త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిందిగా కోరారని సమాచారం. ‘ఏడాది చివరికల్లా కెన్-బెత్వా నదుల అనుసంధానం’ న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని కెన్-బెత్వా నదులు అనుసంధాన పనులు మొదలుపెడతామని కేంద్ర నీటి వ నరుల శాఖ సహాయ మంత్రి సన్వార్ లాల్ జాట్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి పర్యావరణ, అటవీ శాఖల అనుమతులు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. చట్టపరమైన అనుమతులు రాగానే పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. సోమవారమిక్కడ నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ మంత్రి అధ్యక్షతన ఐదోసారి సమావేశమైంది. -
అహింసే ఆయుధం!
తెలంగాణ ఉద్యమ చరిత్రనూ, దాని నేపథ్యాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తనిష్క మల్టీ విజన్ పతాకంపై గుజ్జ యుగంధర రావు నిర్మించిన చిత్రం ‘బందూక్’. దేశపతి శ్రీనివాస్, విద్యాసాగర్‌రావు, మిధున్‌రెడ్డి, సెహరా బాను ముఖ్య తారలుగా లక్ష్మణ్ మురారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కార్తీక్ కొడగండ్ల పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ప్లాటినమ్ డిస్క్ వేడుకలో పాల్గొన్న గాయకుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ‘‘ఆత్మగౌరవాన్ని నిలుపుకోవడానికి చేసిన తెలంగాణ పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించారు’’ అన్నారు. ‘‘ఆయుధంతో చేసే పోరాటం కన్నా, అహింస గొప్పద నే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు ఎన్. శంకర్, నందిని సిద్ధారెడ్డి, రామ్మోహన్, అమరేందర్ త దితరులు పాల్గొన్నారు. -
దారితప్పిన గవర్నర్ విద్యాసాగర్ రావు హెలికాప్టర్
హైదరాబాద్: మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు హెలికాప్టర్ దారి తప్పడంతో కాసేపు కలకలం రేగింది. శుక్రవారం విద్యాసాగర్ రావు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ కు బయల్దేరిన సమయంలో ఆయన హెలికాప్టర్ దారి తప్పింది. అయితే.. నాందేడ్ కు వెళ్లాల్సిన హెలికాప్టర్ కాస్తా దారి తప్పి, అనుకోకుండా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దాదాపు 15 నిమిషాలు ఈ పరిసర ప్రాంతాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత మళ్లీ హెలికాప్టర్ ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఆడ బిడ్డలను చదివిద్దాం..
* త్వరలో కాళేశ్వరం బ్రిడ్జి ప్రారంభం * కరీంనగర్‌కు స్మార్ట్ హోదాకు కృషి * మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు కరీంనగర్ : దేశంలో ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు తగ్గుతోందని మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను గర్భంలోనే చంపేయొద్దని, వారిని బాగా చదివించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. అంతకుముందు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ 2025 నాటికి ప్రపంచ జనాభాలో 29 ఏళ్ల వయస్సుగల జనాభా ఎక్కువగా భారత్‌లోనే ఉంటుందన్నారు. ఇందులో ఆడపిల్లల సంఖ్య కూడా ఎక్కువగా ఉండాలని, ఆడబిడ్డలను కడుపులోనే చంపేసే సంస్కృతిని విడనాడాలని సూచించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను కలిపే కాళేశ్వరం బ్రిడ్జి నిర్మాణం త్వరలో పూర్తవుతుందని, ఆగస్టులో వంతెన రెండు రాష్ట్రాలకు సులువుగా రాకపోకలు కొనసాగుతాయని అన్నారు. తెలంగాణ బిడ్డల అలుపెరగని పోరాటాన్ని ప్రపంచం మొత్తం గుర్తించిందన్నారు. దాంతో హైదరాబాద్‌కు ప్రపంచంలోనే మంచి గుర్తింపు వచ్చిందన్నారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా మార్చాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కోరానన్నారు. నగర మేయర్ రవీందర్‌సింగ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో మంత్రి ఈటెల, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాసరలోని సరస్వతీ అమ్మవారిని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు శనివారం దర్శించుకున్నారు. సామాజిక సేవ చేయండి బాసర: ప్రతి ఒక్కరూ సామాజిక సేవపై దృష్టి సారించాలని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు అన్నారు. శనివారం ఆయన బాసరలోని అఖిల భారత వెలమ సంఘం ఆధ్వర్యంలో వోని ధర్మయ్య వెలమ చౌల్ట్రీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వెలమ సంఘ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. బాసరలో భక్తుల సౌకర్యర్థం మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున అతిథి గృహాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సానూకులంగా స్పందించారు. ఎమ్మె ల్యే దివాకర్‌రావు, అఖిల భారత వెలమ సంఘం అధ్యక్షుడు భానుప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
సర్వే తర్వాతే రీడిజైన్
ప్రాణహిత ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సమగ్ర సర్వే నిర్వహించిన అనంతరమే ఓ అంచనాకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది. సమగ్ర సర్వే జరిగితేనే ప్రతిపాదిత కాళేశ్వరం దిగువన నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలు స్పష్టమవుతాయని అంచనా వేస్తోంది. గోదావరిలో హైడ్రాలజీ లెక్కలను పునఃపరిశీలన చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించిన ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లుగా సమాచారం. ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా నిర్ణయించడంతో తమ భూభాగంలోని 4,500 ఎకరాల మేర ఆయకట్టు ముంపునకు గురవుతోందని, ఈ దృష్ట్యా బ్యారేజీ ఎత్తును తగ్గించాలని మహారాష్ట్ర ఇటీవల రాష్ట్రాన్ని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు రీ డిజైన్‌పై దృష్టిసారించిన ప్రభుత్వం కాళేశ్వరం దిగువన మేటిగడ్డ ప్రాంతం నుంచి నీటిని మళ్లించే అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతోపాటే తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పరిగణనలోకి తీసుకొని ఎల్లంపల్లి వరకు ఇప్పటికే రూ.4 వేల కోట్లతో కెనాల్ల తవ్వకం పూర్తి చేశారు. ప్రస్తుతం డిజైన్‌ను మార్చి కాళేశ్వరం వరకు నీటిని తరలించాలంటే కొత్తగా కెనాల్ తవ్వాలి. అదే జరిగితే ఇప్పటికే పనులు చేసిన కెనాల్ల ఖర్చు వృథా కానుండగా, కొత్త కెనాల్ల కోసం మరింత వ్యయం చేయాల్సి ఉంటుంది. సమగ్ర సర్వే జరిగితే పాత కాల్వలను యధావిధిగా వాడుకోవచ్చా, లేక కొత్త కాల్వల నిర్మాణం అవసరమైతే దానికి అయ్యే వ్యయం ఎంత అన్నది తేలుతుంది. దీంతో త్వరలోనే వ్యాప్కోస్ ప్రతినిధులతో మరోమారు భేటీ అయి ఓ స్పష్టతకు రావాలని నిర్ణయించినట్లు తెలిసింది.