
గవర్నర్ తో స్టాలిన్ భేటీ.. ఏం చెప్పారో?
చెన్నై: అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శుక్రవారం రాత్రి ఇంచార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీలో సీఎం కుర్చీ కోసం కుమ్ములాట జరుగుతుండడంతో రాష్ట్రంలో పాలన స్తంభించిందని వివరించారు. రాష్ట్రంలో అనిశ్చితిని తొలగించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో 9 నెలలుగా రాజకీయ సంక్షోభం నెలకొందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని స్టాలిన్ అన్నారు. గవర్నర్ స్పందించాలి, ప్రజాస్వామాన్ని కాపాడాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం న్యాయమైన నిర్ణయం తీసుకోవాలన్నారు.