
దారితప్పిన గవర్నర్ విద్యాసాగర్ రావు హెలికాప్టర్
హైదరాబాద్: మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు హెలికాప్టర్ దారి తప్పడంతో కాసేపు కలకలం రేగింది. శుక్రవారం విద్యాసాగర్ రావు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ కు బయల్దేరిన సమయంలో ఆయన హెలికాప్టర్ దారి తప్పింది. అయితే.. నాందేడ్ కు వెళ్లాల్సిన హెలికాప్టర్ కాస్తా దారి తప్పి, అనుకోకుండా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దాదాపు 15 నిమిషాలు ఈ పరిసర ప్రాంతాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత మళ్లీ హెలికాప్టర్ ను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.