కోరుట్ల నియోజకవర్గం
కోరుట్ల నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ నేత కె.విద్యాసాగరరావు మరోసారి విజయం సాదించారు. ఆయన 2009 నుంచి ఒక ఉప ఎన్నికతో సహా నాలుగుసార్లు గెలిచారు. 2018 ఎన్నికలలో ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది జె.నర్సింగరావుపై 31220 ఓట్ల మెజార్టీతో విసయం సాదించారు. విద్యాసాగరరావుకు 84605 ఓట్లు రాగా, నరసింగరావుకు 53385ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది డాక్టర్ వెంకట్‌కు పదిహేనువేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆయన మూడోస్థానానికి పరిమితం అయ్యారు. విద్యాసాగరరావు వెలమ సామాజికవర్గానికి చెందిన వారు.
ఈ నియోజకవర్గంలో వెలమ సామాజికవర్గం తమ పట్టు నిలబెట్టుకుంటూ వస్తోంది. రెండువేల తొమ్మిది నుంచి కొత్తగా ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీనే గెలిచింది. కోరుట్ల, అంతకుముందు ఉన్న బుగ్గారం నియోజకవర్గాలలో కలిపి వెలమ సామాజికవర్గం నేతలు ఏడుసార్లు విజయం సాధిస్తే, రెడ్లు నాలుగు సార్లు, బిసిలు రెండుసార్లు, ఇతరులు రెండుసార్లు గెలుపొందారు. మాజీ మంత్రి రత్నాకరరావు బుగ్గారం నుంచి ఒకసారి ఇండిపెండెంటుగా, రెండుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన గెలుపొందారు. బుగ్గారం నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఐదుసార్లు, టిడిపి రెండుసార్లు, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. నలుగురు ఇండిపెండెంట్లు గెలుపొందడం మరో ప్రత్యేకత.
కోరుట్ల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment