assembly constencies
-
సబ్‌ప్లాన్ .. జనగణన
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమలవుతున్న సబ్‌ప్లాన్‌ను బీసీలకు కూడా వర్తింపజేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తాము అధికారంలోకి వస్తే బీసీ సబ్‌ప్లాన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వనుంది. ఈ సబ్‌ప్లాన్ కింద ప్రత్యేకంగా నిధులను కేటాయించి అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేయించడం ద్వారా రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని వివరించనుంది. ఈ నెల 10వ తేదీన కామారెడ్డిలో జరగనున్న ‘బీసీ గర్జన’సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించే బీసీ డిక్లరేషన్‌లో సబ్‌ప్లాన్‌ను పొందుపరచాలని నిర్ణయించింది. దీనితో పాటు బీసీ వర్గాల గణన చేపడతామని కూడా హామీ ఇవ్వనుంది. ఈ రెండు ప్రధాన హామీల ద్వారా రాష్ట్రంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ వర్గాలకు చెందిన ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే వ్యూహంలో భాగంగా బీసీ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేస్తామని కూడా ప్రకటించనుంది. ప్రస్తుతం బీసీ విద్యార్థులకు ర్యాంకుల వారీగా ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. అలా కాకుండా డిగ్రీ నుంచి పై స్థాయిలో ఉండే ఏ కోర్సులో అడ్మిషన్ పొందిన బీసీ విద్యార్థికైనా పూర్తి ఫీజు చెల్లిస్తామని హామీ ఇవ్వనుంది. ఎంబీసీ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీసీ బంధు పేరుతో అమలు చేస్తున్న రూ.లక్ష నగదు సాయం పథకానికి కౌంటర్‌గా బీసీ డిక్లరేషన్ సభ వేదికగానే కొత్త పథకాన్ని ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. అయితే నగదు మొత్తాన్ని పెంచి ఇవ్వాలా? నగదు కాకుండా బీసీల అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రత్యేకంగా మరో పథకాన్ని రూపొందించాలా? అన్న దానిపై టీపీసీసీ నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిందని, ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని కామారెడ్డి సభలో సిద్ధరామయ్య ప్రకటిస్తారని చెబుతున్నారు. దీంతో పాటు కుల కార్పొరేషన్ల ఏర్పాటు, వాటికి నిధుల కేటాయింపు, అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కార్పొరేషన్‌కు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లాంటివి కూడా ప్రకటించనుంది. బీసీలతో పాటు మైనారీ్టల కోసం కూడా ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించగా, ఈనెల 9న ఆ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. నేటి నుంచి రేవంత్ రాష్ట్ర పర్యటన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. హెలికాప్టర్లో ప్రయాణించడం ద్వారా రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 7వ తేదీన ఆలంపూర్ జోగుళాంబ దేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభతో ప్రచారం ప్రారంభం కానుంది. అదే రోజు గద్వాల, మక్తల్ నియోజకవర్గాల్లోనూ రేవంత్ పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన ఖానాపూర్, ఆదిలాబాద్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో, 9వ తేదీన పాలకుర్తిలో, హైదరాబాద్‌లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించి సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.10వ తేదీన కామారెడ్డిలో జరిగే బీసీ గర్జన సభకు హాజరవుతారు. అదే రోజున కామారెడ్డి నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. హైదరాబాద్‌లో మైనార్టీ ముఖ్యులతో డిన్నర్ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక ఈనెల 11వ తేదీన బెల్లంపల్లి, రామగుండం, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. -
జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ రాజకీయ చరిత్ర
కోరుట్ల నియోజకవర్గం కోరుట్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేత కె.విద్యాసాగరరావు మరోసారి విజయం సాదించారు. ఆయన 2009 నుంచి ఒక ఉప ఎన్నికతో సహా నాలుగుసార్లు గెలిచారు. 2018 ఎన్నికలలో ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది జె.నర్సింగరావుపై 31220 ఓట్ల మెజార్టీతో విసయం సాదించారు. విద్యాసాగరరావుకు 84605 ఓట్లు రాగా, నరసింగరావుకు 53385ఓట్లు వచ్చాయి. ఇక్కడ పోటీచేసిన బిజెపి అభ్యర్ది డాక్టర్ వెంకట్‌కు పదిహేనువేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఆయన మూడోస్థానానికి పరిమితం అయ్యారు. విద్యాసాగరరావు వెలమ సామాజికవర్గానికి చెందిన వారు. ఈ నియోజకవర్గంలో వెలమ సామాజికవర్గం తమ పట్టు నిలబెట్టుకుంటూ వస్తోంది. రెండువేల తొమ్మిది నుంచి కొత్తగా ఏర్పడిన కోరుట్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీనే గెలిచింది. కోరుట్ల, అంతకుముందు ఉన్న బుగ్గారం నియోజకవర్గాలలో కలిపి వెలమ సామాజికవర్గం నేతలు ఏడుసార్లు విజయం సాధిస్తే, రెడ్లు నాలుగు సార్లు, బిసిలు రెండుసార్లు, ఇతరులు రెండుసార్లు గెలుపొందారు. మాజీ మంత్రి రత్నాకరరావు బుగ్గారం నుంచి ఒకసారి ఇండిపెండెంటుగా, రెండుసార్లు కాంగ్రెస్ ఐ పక్షాన గెలుపొందారు. బుగ్గారం నియోజకవర్గానికి 12సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఐదుసార్లు, టిడిపి రెండుసార్లు, పిడిఎఫ్ ఒకసారి గెలిచాయి. నలుగురు ఇండిపెండెంట్లు గెలుపొందడం మరో ప్రత్యేకత. కోరుట్ల నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
నియోజకవర్గానికో మొబైల్ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్ : ప్రతీ నియోజకవర్గానికి ఒక కరోనా టెస్టింగ్ మొబైల్ లేబొరేటరీని అందుబాటులోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. తద్వారా ప్రతీ గ్రామానికి వెళ్లి జ్వరం సహా అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించి కరోనా నిర్ధారణ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ముఖ్యమంత్రి నుంచి అనుమతి వచ్చాక ప్రజల ముంగిటకే వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ జీహెచ్ఎంసీ పరిధిలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించేందుకు 20 మొబైల్ కరోనా టెస్టింగ్ బస్సులను సిద్ధం చేస్తోంది. అందులో ప్రస్తుతం 3–4 బస్సులు ఇప్పటికే బస్తీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మిగిలిన వాటిని కూడా త్వరలో అందుబాటులోకి తెస్తారు. అలాగే ప్రతీ గ్రామీణ నియోజకవర్గానికి ఒక మొబైల్ టెస్టింగ్ లేబొరేటరీ చొప్పున వంద బస్సులను సమకూర్చాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీలో ‘వెర’ స్మార్ట్ హెల్త్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్ మానిటరింగ్ అనాలసిస్ సర్వీస్ క్వారంటైన్ (ఐ–మాస్క్) టెక్నాలజీతో చేసిన వోల్వో బస్సుల్లో కరోనా లేబొరేటరీ కల్పించినట్లే, ప్రతీ నియోజకవర్గంలో సమకూర్చుతారు. పరీక్షల సంఖ్య రెండింతలు ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు రోజూ దాదాపు 22 వేల వరకు చేస్తున్నారు. ఇకపై రోజూ 40 వేల కరోనా పరీక్షలు చేయాలని కేబినెట్ నిర్ణయించడంతో ప్రతి బస్సులో ఒకేసారి పది మందికి కరోనా పరీక్షలు చేసే వీలుంది. అలా ప్రస్తుతం జీహెచ్ఎంసీలో నడుపుతున్న 3 మొబైల్ బస్సుల్లో రోజూ ఒక్కో దాంట్లో 300 పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే వంద బస్సులు వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో 30 వేల టెస్టులు వీటి ద్వారానే నిర్వహించవచ్చునని వైద్య వర్గాలు చెబుతున్నాయి. -
విభజించి గెలిచారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు ఆమోదముద్ర పడి సరిగ్గా దశాబ్దకాలం అయ్యింది. 2008లో పార్లమెంటు ఆమోదించగా.. 2009 ఎన్నికల సందర్భంగా మారిన నియోజకవర్గాల హద్దులతో పలువరి నే‘తలరాతలు’ కూడా మారాయి. నియోజవర్గాల రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు జరగడంతో ఆయా కేటగిరికి చెందిన నేతలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. పాత 13 నియోజకవర్గాల్లో ఏడు పాతవి ఉండగా... మరో ఆరింటిని మార్పు చేసి కొత్తవి ఏర్పాటు చేశారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాల్లో పెద్ద ఎత్తున మార్పులు.. చేర్పులకు తావిచ్చింది. కోరుట్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు ఆమోదముద్ర పడి సరిగ్గా పదేళ్లు అవుతోంది. మారిన సెగ్మెంట్ల హద్దులతో నేతల తలరాతలు మారిపోయాయి. కొంత మంది నేతలు కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీ నియోజకవర్గాలకు మారిపోవాల్సి వచ్చింది. నియోజవర్గాల రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు జరగడంతో ఆయా కేటగిరికి చెందిన నేతలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. విభజన ఫలితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంతకుముందున్న 13నియోజకవర్గాల్లో ఆరు సెగ్మెంట్లు కనుమరుగయ్యాయి. ఆ స్థానంలో మరో ఆరు కొత్తవి అవిర్భవించాయి. ఏడు పాతవే ఉన్నాయి. మొత్తం మీద నియోజకవర్గాల పునర్విభజన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ సమీకరణాల్లో పెద్ద ఎత్తున మార్పులు.. చేర్పులకు తావిచ్చింది. 2008లో విభజనకు ఆమోదం.. 2001 జనాభా లెక్కల ఆధారంగా అప్పటికి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం 2002లో రిటైర్డు సుప్రీం కోర్టు జడ్జి కుల్దీప్సింగ్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. 2004–05 సంవత్సరాల్లో ఈ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించింది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల హద్దుల మార్పులు.. పరిపాలన సౌలభ్యత.. ప్రజల అనుకూలత వంటి అన్ని అంశాలపై కూలకుశంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. 2006లో హైదరాబాద్‌లో నియోజకవర్గాల పునర్విభజన కమిటీ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించింది. అన్ని వర్గాల నుంచి వచ్చిన వినతులు..అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ 2007సంవత్సరంలో తాము రూపొందించిన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. కమిటీ సిపార్సులకు 2008 ఫిబ్రవరిలో రాష్ట్రపతి ప్రతిభా భారతి ఆమోద ముద్ర వేశారు. ఆ తరువాత వచ్చిన 2009అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాల వారీగా ఎన్నికలు నిర్వహించారు. ఆరు నియోజకర్గాలు కనుమరుగు నియోజకవర్గాల పునర్విభజనకు ఆమోదముద్ర పడిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో ఉన్న ఆరు సెగ్మెంట్లు కనుమరుగయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల హద్దులు మారడంతో ఆయా సెగ్మెంట్లలో చేరిన కొత్త మండలాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా పాత్రిపదికన రిజర్వేషన్లు మారిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కేవలం ఒక ఎస్సీ(మేడారం), ఒక ఎస్టీ(నేరెళ్ల)అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉండగా ఆ తరువాత కొత్తగా మూడు ఎస్సీ నియోజకవర్గాలు చొప్పదండి, ధర్మపురి, మానకొండూరు ఏర్పాటయ్యాయి. విభజనలో మెట్పల్లి, మేడారం, నేరెళ్ల, కమలాపూర్, బుగ్గారం, ఇందుర్తి నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. వీటి స్థానంలో కోరుట్ల, రామగుండం, వేములవాడ, ధర్మపురి, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. మారిన నే‘తలరాతలు’ నియోజకవర్గాల పునర్విజనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొందరి నేతల రాతలు తారుమారయ్యాయి. సెగ్మెంట్ల మార్పుతో పాటు గతంలో ఉన్న మండలాల్లోనూ మార్పులు జరగడంతో కొంత మంది నాయకులు తమ పట్టును కోల్పోగా.. మరికొంత మందికి కలిసొచ్చింది. బుగ్గారం, మెట్పల్లి నియోజకవర్గాలు కలిసిపోయి కోరుట్ల ఏర్పాటు కావడం మెట్పల్లి ప్రాంత నేతలకు కలిసొచ్చింది. బుగ్గారంకు చెందిన నాయకులు ఉనికి కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమలాపూర్, ఇందుర్తి, నేరెళ్ల ప్రాంతాలకు చెందిన నేతలు కొంతమంది పట్టు ఉన్న ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. గతంలో మెట్పల్లి నియోజకవర్గంలో ఉన్న మేడిపల్లి, కథలాపూర్ మండలాలు వేములవాడలో కలియడంతో ఆ ప్రాంతంలోని నేతలకు ఇప్పటికీ ఇక్కడ పూర్తిస్థాయిలో పట్టు దొరకడం లేదు. పెద్దపల్లి, మేడారం నియోజవర్గం పరిధిలోనూ కొంతమంది నేతలకు వలసల ఇబ్బంది తప్పలేదు. పాత మేడారం నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న కొంత మంది ధర్మపురి, చొప్పదండి సెగ్మెంట్లలో పాగా వేశారు. ఇలా సెగ్మెంట్ల పునర్విభజన ఉమ్మడి జిల్లాలోని నేతలపైన ప్రభావం చూపడమే కాకుండా రాజకీయ సమీకరణాల్లో ఎన్నో మార్పులకు తావిచ్చింది. 2009కు ముందు నియోజకవర్గాలు బుగ్గారం మెట్పల్లి జగిత్యాల మేడారం హుజూరాబాద్ కమలాపూర్ కరీంనగర్ మంథని నేరెల్ల(ఎస్టీ) సిరిసిల్ల ఇందుర్తి చొప్పదండి పెద్దపల్లి 2009తరువాత నియోజకవర్గాలు కరీంనగర్ మానకొండూర్(ఎస్సీ) హుజూరాబాద్ హుస్నాబాద్ చొప్పదండి(ఎస్సీ) వేములవాడ సిరిసిల్ల కోరుట్ల జగిత్యాల ధర్మపురి(ఎస్సీ) పెద్దపల్లి రామగుండం మంథని -
సీట్లు పెరగకున్నా నష్టం లేదు
ఉన్న సీట్లతోనే సంతృప్తిగా ఉన్నాం: సీఎం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచినా, పెంచకున్నా రాజకీయంగా తమకు లాభనష్టాలేమీ ఉండబోవని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘ఉన్న సీట్లతోనే సంతృప్తిగా ఉన్నాం. మాకిప్పటికే 90 మంది ఎమ్మెల్యేలున్నారు. మిగతా 29 సీట్లలో ఏడు ఎంఐఎంకు ఇచ్చినా మిగతా 22 సీట్లకు మేమే అభ్యర్థులను వెతుక్కోవాల్సి ఉంటది. టీఆర్ఎస్కు ఢోకా లేదు. రాజకీయంగా సుస్థిరంగా ఉంది. చిన్న రాష్ట్రాల్లో తక్కువ అసెంబ్లీ సీట్లుంటే రాజకీయ అస్థిరత ఉంటుందనే విభజన చట్టంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. కానీ రాజ్యాంగ సవరణతో సంబంధం లేకుండా అని వాడాల్సిన చోట రాజ్యాంగ సవరణతో అని ముడిపెట్టారు. ఇందుకు జైరాం రమేశ్ అజ్ఞానమే కారణం. ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు పునర్విభజన అంశం చర్చకు వచ్చినప్పుడు నేనేమనుకుంటున్నానని ఆయన అడిగారు. రాజకీయంగా మాకు లాభనష్టాలేమీ లేవు గానీ విభజన చట్టంలో ఉందని గుర్తుచేశా. పునర్విభజన ఇప్పట్లో జరగదని ఆయన మాటలను బట్టి అర్థమైంది’’ అని వివరించారు. వివిధ అంశాలపై సీఎం ఏమన్నారంటే.. కొత్త సచివాలయం కడుతం బైసన్ పోలో గ్రౌండ్ ఇస్తామని ప్రధాని మాటిచ్చారు. ఆ భూమిని కేవలం సచివాలయం కోసమే అడగలేదు. శాసనసభ, తెలంగాణ కళాభవన్ అక్కడే నిర్మిస్తాం. అసెంబ్లీ శిథిలావస్థకు చేరుతోంది. ఒక సంగీత విభావరి నిర్వహించాలంటే రవీంద్రభారతి చాలదు. మూడు నాలుగు వేల మంది కూర్చునే హాల్ లేదు మనకు. రాజీవ్ రహదారి, మేడ్చల్ జాతీయ రహదారులను విస్తరించాలి. ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ దాకా పీవీ ఎక్స్‌ప్రెస్ వే లాంటి రోడ్డు వేయాలి. అందుకే మొత్తం 52 ఎకరాలు అడిగినం. అక్కడ కూడా కేసు వేశారు. గచ్చిబౌలి స్టేడియంలో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. స్పోర్ట్స్ స్కూల్లోనూ ఆటల్లేవు. ఉప్పల్ స్టేడియం ఖాళీగా ఉంటోంది. సిటీలో 500 ఎకరాల విస్తీర్ణంలో క్రీడా మైదానాలున్నాయి. జింఖానా గ్రౌండ్స్‌ను మేమేమన్నా తీసుకున్నమా? రిజర్వేషన్లపై ఏదోటి తేల్చాలని కోరా.. బీసీ–ఈ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుకు ప్రధాని సానుకూలత వ్యక్తం చేశారు. ఇటీవల ఆయన్ను కలిసినప్పుడు.. దీనిపై అసెంబ్లీ చట్టం చేసి పంపిందని ప్రస్తావించాను. ఆర్థికంగా వెనుకబాటుతనం ఉండకూడదని, ముస్లింలలో వెనుకబాటును పారదోలాలని ప్రధాని సైతం ప్రకటించారు. రిజర్వేషన్లపై ఏదోటి తేల్చాలని ప్రధానిని కోరా. వచ్చే పర్యటనలో ఇదే విషయంతో వస్తానని కూడా చెప్పా. తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి అమలు చేసే రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకాన్ని ప్రధానికి వివరించా. దేశమంతా అమలు చేయమని చెప్పా. ప్రధాని కూడా మెచ్చుకున్నారు. దీనిపై ప్రత్యేకంగా నోట్ తయారు చేసి పంపించమన్నారు. ఈసారి పర్యటనకు వెళ్లినప్పుడు ఆ నోట్‌ను ఇవ్వాల్సి ఉంది. మద్దతు పలికినంత మాత్రాన బీజేపీతో పొత్తేమీ లేదు.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు పలికినంత మాత్రాన బీజేపీతో టీఆర్ఎస్కు పొత్తేమీ లేదు. అంశాల వారీగానే మద్దతు ఉంటుంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు ముందే ప్రధాని ఫోన్ చేసి తమ మద్దతు కోరారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రస్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడుకు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మద్దతివ్వాల్సిందే. నేను జీవితాంతం లౌకికవాదిగానే ఉంటా. మా పార్టీ అదే వైఖరి అనుసరిస్తుంది. గూర్ఖాల్యాండ్పై ఆచితూచి గూర్ఖాల్యాండ్ కొంతప్రాంతం అంతర్జాతీయ వ్యవహారాలతో ముడిపడి ఉన్నందున, పక్కనే ఉన్న చైనాతోనూ ఘర్షణ పూరిత వాతావరణమున్నందున అక్కడి పరిస్థితులపై వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయం చెప్పలేను. చెప్పాల్సిన సందర్భం వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కమ్యూనిస్టు పార్టీలపై విసుర్లు.. రాష్ట్రంలో అసలు లెఫ్ట్ పార్టీలున్నాయా? ఆ పార్టీలు గతించిపోయిన పార్టీలు. వరంగల్‌లో ఎన్నికలప్పుడు 350 ప్రజాసంఘాలతో మహా కూటమిగా పోటీ చేస్తే ఏమైంది.. 350 ఓట్లు కూడా రాలేదు. దూరదృష్టితోనే సింగూరు నీటి నిల్వ దూరదృష్టితోనే సింగూరు నీటిని వ్యవసాయ అవసరాలకు విడుదల చేయకుండా బంద్ చేశాం. ఇప్పుడు రాష్ట్రంలో కడెం మొదలు నాగార్జునసాగర్ వరకు నీటి నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరో రెండు నెలలు వర్షాల సీజన్ ఉంది. వానలు పడుతాయనే ఆశలున్నాయి. కానీ పడకుంటే హైదరాబాద్‌కు సైతం తాగునీటికి ఇబ్బంది వస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా సింగూరులో 15 టీఎంసీలున్నా.. విడుదల చేయటం లేదు.