అన్నాడీఎంకే శాసనసభపక్ష నాయకుడిగా ఎన్నికైన పళనిస్వామి ఈ సాయంత్రం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలవనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఆయనకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను ఆయన కోరనున్నారు. గోల్డెన్ బే రిసార్టు నుంచి ఎమ్మెల్యేలతో కలిసి పళనిస్వామి రాజ్ భవన్ కు బయలుదేరారు.