
సాక్షి, హైదరాబాద్: అన్ని పార్టీలు హైదరాబాద్ విమోచన వజ్రోత్సవాలను నిర్వహిస్తామని చెప్పడం బీజేపీ సాధించిన గొప్ప విజయమని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించారు. విమోచన దినోత్సవం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అధికారికంగా గుర్తించాలని బీజేపీ ఆధ్వర్యంలో తాము అప్పట్లో ఉద్యమం చేశా మని గుర్తుచేశారు.
శనివారం విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు అన్ని పార్టీలు ఉత్సవాల నిర్వహణకు ముందుకు రావడంతో తాము ఈ ఉద్యమంలో సఫలీకృతం అయ్యామన్నారు. గతం నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న ఏదో ఒక రూపంలో కార్యక్రమాలను నిర్వహించామన్నారు. పరకాలలో జరిగిన పోరాటాన్ని దృశ్య రూపంలో చూపించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివిధ విషయాలు, చరిత్ర వంటి వా టిని పాఠ్యాంశాల్లో చేర్చాలని, జర్నలిస్ట్ షోయ బుల్లాఖాన్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతి ష్టించాలని విద్యాసాగర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment