Liberation Day
-
తెలంగాణ చరిత్రను మరుగుపరిచారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్వాతంత్య్ర దినాన్ని మరుగునపరిచి.. ఈనాటి తరానికి తెలియకుండా పాలకులు తొక్కిపెట్టారని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన 13 నెలల తర్వాత తెలంగాణలో మువ్వన్నెల జెండా ఎగిరిందన్న విషయం తెలియకుండా చేశారంటూ ధ్వజమెత్తారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసిన 1948 సెపె్టంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకున్నా, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వమే అధికారిక వేడుకలు జరుపుతుందని చెప్పారు.నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం దేశంలోనేకాక ప్రపంచ పోరాటాల్లోనే మహోన్నతమని, అపురూప ఘట్టమన్నారు. భారత సైన్యం ముందు 17 సెపె్టంబర్ 1948లో నిజాం రాజు, సైన్యం, రజాకార్లు లొంగిపోయారన్నారు. ఇంతటి గొప్ప పోరాటచరిత్ర నేటి తరానికి తెలియకుండా తొక్కిపెట్టారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం సెపె్టంబర్ 17న ‘విమోచన’దినోత్సవం అధికారికంగా నిర్వహించలేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం మజ్లిస్‌కు సలాం కొడుతూ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని చెప్పారు.తెలంగాణ ఉద్యమం సమయంలో ‘విమోచన దినోత్సవం’అధికారికంగా నిర్వహించాలని ఆనాటి పాలకులను నిలదీసిన కేసీఆర్ సీఎం అయ్యాక స్వరం మార్చారన్నారు. విమోచన దినంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వక్రభాష్యాలు చెప్పి మోసం చేశాయని తెలిపారు.17 సెపె్టంబర్ను బీఆర్ఎస్ ‘జాతీయ సమైక్య దినం’అనడం, కాంగ్రెస్ ‘ప్రజాపాలన దినోత్సవం’అనడం ముమ్మాటికీ ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టడమేనని చెప్పారు. రజాకార్ల వారసుల కోసమే: బండి సంజయ్ పిడికెడు రజాకార్ల వారసుల కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు. దేశ విచి్ఛన్నకర శక్తులతో అధికార పారీ్టలు అంటకాగే పరిస్థితి తెలంగాణలో ఉండడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రజాకార్లపై పోరాడిన చరిత్ర ఉందని, అదే రజాకార్ల వారసులను సంతృప్తిపరిచే చర్యలను ప్రభుత్వాలు విడనాడాలని కోరారు.వచ్చే ఏడాది నుంచైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర భద్రతా బలగాలు నిర్వహించిన పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే ప్రదర్శనలు సాగాయి. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించారు. రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డిని కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి, సీఐఎస్ఎఫ్ డీజీ ఆర్ఎస్. భాటియా పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో.... బీజేపీ కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దిన వేడుకల్లో భాగంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేసి, అమరవీరులకు నివాళు లర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ...‘ప్రస్తుత సెప్టెంబర్ 17 చాలా ప్రత్యేకమైనది. విశ్వకర్మ జయంతి, వినాయక నిమజ్జన మహోత్సవం, ప్రధాని మోదీ జన్మదినం. అందుకే ఇది చాలా పవిత్రమైన రోజు’అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శానంపూడి సైదిరెడ్డి, బంగారు శ్రుతి, మనోహర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్ పాల్గొన్నారు. -
చేతనైతే విమోచన ఉత్సవాలు నిర్వహించండి
కరీంనగర్‌టౌన్: ‘తెలంగాణ ప్రజా పాలన దేనికోసం? ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు? పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నరు. నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నరు.. అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. కాంగ్రెస్‌కు చేతనైతే విమోచన దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తే తప్పకుండా నేనే హాజరవుతా. వారికి చేతకాకుంటే కేంద్రం పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరు కావా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు.గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంగళవారం ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్స వం అంటే నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన రోజని, నాడు రజాకార్లు మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన దురాగతాలను మరచిపోలేమని అన్నారు. సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ఆపరేషన్ వల్లే నేడు నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందన్నారు. రజాకార్ల దళం సృష్టించిన పారీ్టయే ఎంఐఎం అని.. ఆ పారీ్టకి భయపడి, ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ విమోచన దినోత్సవం జరపకుండా ప్రజలను వంచిస్తున్నాయని విమర్శించారు. -
నేడు కేంద్రం ఆధ్వర్యంలో ‘విమోచనం’
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది. ఉదయం 7.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కళాకారుల ప్రదర్శనలు నిర్వహిస్తారు. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ద్వారా ‘సెప్టెంబర్ 17–హైదరాబాద్ విమోచన దినం’ప్రాధాన్యత వివరించేలా సంక్షిప్త ప్రదర్శన ఉంటుంది. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు పోలీసు బలగాలు, సైనికదళాల పరేడ్ ఉంటుంది. 9 గంటలకు కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, గజేంద్రసింగ్ చౌహాన్, బండి సంజయ్ పరేడ్ గ్రౌండ్స్‌లోని యుద్ధస్మారకం వద్ద నివాళులరి్పస్తారు. ఉదయం 9.15 గంటలకు జి.కిషన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేస్తారు.కేంద్ర మంత్రులు సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తారు. 9.20 గంటలకు కేంద్ర సాయుధ బలగాల నుంచి కిషన్‌రెడ్డి గౌరవవందనం స్వీకరిస్తారు. అనంతరం 700 మందికిపైగా కళాకారులు మంగళవాద్యం, బతుకమ్మ, కొమ్ముకోయ, బోనాలు–పోతరాజు, డప్పులు, కోలాటం, లంబాడీ, గుస్సాడి, ఒగ్గు కథ తదితరాలను ప్రదర్శిస్తారు. చివరగా ‘హైద రాబాద్ విమోచన దినం శకటం ప్రదర్శన ఉంటుంది. 10.10 గంటలకు కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి స్వాగతోపన్యాసం చేస్తారు. తర్వాత బండి సంజయ్ ప్రసంగిస్తారు. రాష్ట్రం నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన ఆరుగురిని సన్మానిస్తారు. 10.30 గంటలకు కిషన్‌రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం కేంద్ర సమాచార శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జి బిషన్‌ను కేంద్రమంత్రులు తిలకిస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. -
‘విమోచన’ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు
రసూల్‌పురా (హైదరాబాద్): హైదరాబాద్ విమోచన దినోత్సవం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆదివారం జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా విద్యార్థులు రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటైన కార్యక్రమంలో పాలుపంచుకోవడం స్ఫూర్తిదాయకమని అన్నారు. హైదరాబాద్ ప్రాంత చరిత్ర, రజాకార్ల దౌర్జన్యాలు, హైదరాబాద్ స్టేట్‌ను భారతదేశంలో విలీనం చేసిన పరిస్థితులు.. వంటి చరిత్రను నేటి విద్యార్థులు తెలుసుకోవాలని గవర్నర్ సూచించారు. గత మూడు రోజులుగా రాష్ట్రపతి నిలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రీయ రాగ్ (గానం), ఆజాదీ కా యాక్ట్స్ (స్కిట్, డ్రామా) క్విజ్‌లో (ప్రహేలికా) భారత సారస్వతం, ఫొటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక ప్రదర్శనలు, ఓపెన్ మైక్ సెషన్, ప్యానల్ చర్చలు, ఇతర అంశాల్లో జరిగిన పోటీల్లో విజేతలకు గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు మెమెంటో, ప్రశంసాపత్రాలు, కన్సొలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ గుప్త, డిప్యూటీ సెక్రటరీ స్వాతి షాహి, కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు, సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బీజే రావు, పరిపాలనాధికారి రజనిప్రియ, సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఉదయం 11 గంటలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సెప్టెంబర్ 17న రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు తెలంగాణ పరిణామం చెందిన సందర్భంగా ప్రతిఏటా ఆ రోజున తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండావిష్కరణలు చేయనున్నారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వవిధానానికి అనుగుణంగా ఆదివారం రాజ్‌భవన్‌లో విమోచన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో గవర్నర్ ఉదయం 9.30 గంటలకు జాతీయజెండాను ఆవిష్కరించనున్నారు. విమోచన దినోత్సవం జరుపుకోవాలి: గవర్నర్ పిలుపు హైదరాబాద్ విముక్తి పోరాటం దేశ స్వాతంత్య్ర సంగ్రామచరిత్రలో అత్యంత కీలక ఘట్టంగా నిలుస్తుందని గవర్నర్ తమిళిసై అన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ తన సందేశాన్ని విడుదల చేశారు. విమోచన ఉద్యమంలో పోరాటయోధుల త్యాగాలను స్మరించుకుని వారికి నివాళి అర్పించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని, మనం సంఘటితంగా పోరాడి సాధించిన విజయాలకు ఇది గుర్తుగా నిలుస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. -
అధికారికంగా విమోచనదినోత్సవం నిర్వహించాలి
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న సమైక్యతా దినోత్సవం కాకుండా అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. వేలాదిమంది యువకులు, మహిళలు పెద్దఎత్తున నిజాంపై పోరాడితే.. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతే.. సమైక్యతా దినోత్సవం ఎలా అవుతుందని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. హైదరాబాద్ ముక్తి దివస్ పేరిట కర్ణాటక, మహారాష్ట్రల్లో ఉత్సవాలు నిర్వహిస్తుంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. మంగళవారం కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న విమోచన దినోత్సవంలో కేంద హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొంటారని తెలిపారు. ఇందులో పాల్గొనా లని తెలంగాణతో సహా కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ స్టేట్ విమోచనకు సంబంధించి చారిత్రక పరిణామాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన బొల్లారం రాష్ట్రపతి నిలయంలోనూ ఈ సారి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వర్చువల్‌గా పాల్గొంటారని వెల్లడించారు. ఎంఐఎంకు కేసీఆర్ లొంగిపోయి..విమోచన దినోత్సవాన్ని కాలరాస్తున్నారు కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలతో, మజ్లిస్‌కు వంతపాడుతూ సీఎం కేసీఆర్ విమోచన దినోత్సవ చరిత్రను కాలరాస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అనుమతి ఉంటేనే కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఎద్దేవా చేశారు. విమోచన దినోత్సవం నిర్వహించని మొదటి ద్రోహి కాంగ్రెస్ అయితే.. రెండో ద్రోహి బీఆర్ఎస్ అని మండిపడ్డారు. ’’తెలంగాణ విమోచన దినోత్సవాలను ఎందుకు అధికారికంగా జరపడం లేదు? ఎంఐఎంకు లొంగిపోయి, తెలంగాణ అస్థిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని’’ 2007లో నాటి అధికార కాంగ్రెస్‌ను ప్రశ్నించిన కేసీఆర్... మరి ఇప్పుడెందుకు అధికారికంగా నిర్వహించడం లేదని ప్రశ్నించారు. చరిత్రను ఈ తరానికి అందించడంలో కాంగ్రెస్ కుట్ర చేస్తే.. ఇప్పుడు ఎంఐఎంకు కేసీఆర్ లొంగిపోయి విమోచన దినోత్సవ చరిత్రను కనుమరుగు చేస్తున్నారని ఆరోపించారు. బాబు అరెస్టుపై నో కామెంట్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌పై ఓ విలేకరి ప్రశ్నించగా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే అరెస్ట్ చేశారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పేర్కొన్నారని, ఐతే దానికి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద లేదని కిషన్‌రెడ్డి బదులిచ్చారు. గ్రౌండ్ ఇవ్వలేదనడం మూర్ఖత్వం తమకు గ్రౌండ్ ఇవ్వలేదని కొందరు(కాంగ్రెస్ పార్టీ నేతలనుద్దేశించి) మూర్ఖత్వంతో ఆరోపణలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం ఆధ్వర్యంలో అక్కడ విమో చన దినోత్సవాలను నిర్వహించుకోవాలని నిర్ణయిస్తే.. దాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్, ఇతర పార్టీలు కుట్ర చేస్తున్నాయని నిందించారు. విమోచన ఉత్సవాలు నిర్వహించాల్సిందిగా.. రాష్ట్రంలోని సర్పంచ్ లకు లేఖలు రాస్తున్నట్టు తెలిపారు. -
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు
మన్సూరాబాద్/ఘట్కేసర్: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే 80 రోజుల్లో ఎన్నికలు రానున్నాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్రస్థాయి సమ్మేళనాన్ని మన్సూరాబాద్‌లో నిర్వహించారు. మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కిషన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అలాగే మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం అవుషాపూర్‌లో నిర్వహించిన బీజేవైఎం రాష్ట్రస్థాయి సమావేశానికి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించిన కేసీఆర్.. ఎన్నికల ఫలితాలు వెలువడగానే వారికి వెన్నుపోటు పొడిచి దగా చేశారని ధ్వజమెత్తారు. దళితబంధు పేరుతో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను నిర్విర్యం చేశారని మండిపడ్డారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత కన్నీరు పెడుతోందని ఈటల రాజేందర్ ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి డప్పుకొట్టి కార్యకర్తల్లో జోష్ నింపారు. కాగా, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతమొందించడానికి బీఆర్ఎస్ను, దేశంలో గాంధీ కుటుంబ పాలన రాకుండా కాంగ్రెస్‌ను ఓడించాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేవైఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటేనన్నారు. బుధ, గురువారాల్లో నిరుద్యోగ దీక్ష, 15న హైదరాబాద్– పరకాల బైక్ ర్యాలీ ఉంటాయని తెలిపారు. -
16న రాత్రే నగరానికి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. 17న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. 16న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో రాత్రి 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు సీఆర్పీఎఫ్ ఆఫీసర్స్ మెస్ నుంచి రోడ్డుమార్గాన సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. ఉదయం 9 నుంచి 11 గంటల దాకా హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్, సీఐఎప్ఎఫ్ ఇతర పోలీసు బలగాల వందనం స్వీకరిస్తారు. అనంతరం రోడ్డుమార్గాన శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఉదయం 11.50 నిమిషాలకు ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారు. -
‘విమోచన దినోత్సవం’పై కేటీఆర్ రిప్లై
హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17 తేదీ ప్రత్యేకతపై రాజకీయపరమైన చర్చ, పార్టీల పరస్పర విమర్శలపర్వంగా ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటోంది. అయితే.. తాజాగా కర్ణాటక-తెలంగాణ సరిహద్దు గ్రామంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమోచన దినోత్సవ సంబంధిత కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు.. కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాల నిర్వహణపై ప్రకటనలు కూడా చేశారు. ఈ దరిమిలా.. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ విమోచన దినోత్సవంపై ఓ ట్వీట్ చేశారు. ‘‘విమోచన దినోత్సవం అని ఎందుకు పిలవకూడదని అడిగే వాళ్లు.. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన ఆగష్టు 15వ తేదీని ఎందుకు మనం లిబరేషన్ డేగా జరుపుకోకూడదు? అని ప్రశ్నించారు. అది బ్రిటీష్ వాళ్లు అయినా నిజాం అయినా.. అణచివేతదారులకు వ్యతిరేకంగా త్యాగాలు, పోరాటాలను గౌరవప్రదంగా స్మరించుకోవడం ముఖ్యం. ఇంకా అక్కడే ఉండిపోకండి.. మీ భవిష్యత్ నిర్మాణానికి ముందుకు రండి అంటూ ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చారాయన. To those who ask why can’t we call it Liberation Day; Why do we celebrate 15th August as Independence Day and not as Liberation Day? What should matter is respectful commemoration of the sacrifices & struggles against oppressors; be it the British or Nizam “Stop being a… — KTR (@KTRBRS) March 27, 2023 ఇక ఆదివారం కర్నాటకలోని బసవ కళ్యాణ్ తాలుకా గోరట గ్రామంలో రజాకార్ల దాష్టీకంపై పోరాడి అసువులు బాసిన అమరవీరుల స్మారకార్థం ఏర్పాటు చేసిన స్థూపాన్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆదివారం అమిత్ షా ఆవిష్కరించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్ భయపడుతున్నదని ఈ సందర్భంగా ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అందుకే నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఇదీ చదవండి: తెలంగాణకు ఆమె గర్వకారణం: కేసీఆర్ -
విమోచనమే నిజమైన స్వాతంత్య్ర దినం
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్ విమోచన దినం జరుపుకోవడం ద్వారా మనం నిజమైన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు నిజాం రాజు తలవంచిన రోజు. క్రూరమైన రజాకార్లు పారిపోయిన రోజు. హైదరాబాద్ విలీనంతో భారత చిత్రపటం సంపూర్ణమైన రోజు’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. నిజాం, రజాకార్ల నుంచి విముక్తి కోసం వేరే ఏ రాష్ట్రం ఇంత పోరాడలేదన్నారు. నిజాం కాలంలో బతుకమ్మ ఆడేందుకు మహిళలు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నారో తెలుసన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా శనివారం ఆమె రాజ్‌భవన్‌లో వర్శిటీల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తొలిసారిగా విమోచన దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ రోజు కోసం 74 ఏళ్లు ఎదురుచూశామన్నారు. విమోచన దినోత్సవాల ద్వారా మన అమరవీరుల పోరాటాలకు, వారి త్యాగాలకు గొప్ప నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై తెలంగాణ విమోచన పోరాటయోధులు, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. -
ఏటా మరఠ్వాడ ముక్తి దిన్ ఉత్సవాలు :మహారాష్ట్ర సీఎం శిందే
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సందర్భంగా మహారాష్ట్రలోని శంభాజీ నగర్లో ఏటా మరఠ్వాడ ముక్తిదిన్ నిర్వహిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శనివారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవ పరేడ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిజాం నిరంకుశ, నియంతృత్వ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన ఈ రోజు బంగారు పేజీల్లో లిఖించదగ్గ రోజని అన్నారు. విముక్తి పొందిన ఇన్నేళ్ల తరువాత ఉత్సవం నిర్వహించుకునే అవకాశం దక్కిందని, ఇది ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా వల్లనే సాధ్యమైందని చెప్పారు. విమోచనం కోసం ప్రాణాలర్పించిన వారికి శిందే నివాళులు అర్పించారు. విమోచన ఉత్సవాలు జరపాలని ఎదురు చూస్తున్న ప్రజల కల నేటికి నెరవేరిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. 1948 సెప్టెంబర్ 17న అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తే.. 75 ఏళ్ల తర్వాత ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారని గుర్తుచేశారు. విమోచన ఉత్సవాలు జరపకుండా రజాకార్ల పార్టీ అడ్డుకుందని, అలాంటి పార్టీ కూడా జాతీయ జెండా ఎగరేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చామన్నారు. కర్ణాటకలోని బీదర్, రాయచూరు, యాద్గిర్ వంటి ప్రాంతాల్లో కూడా రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటాలు చేశారని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీరాములు గుర్తు చేశారు. బీదర్ జిల్లాలోని 76 గ్రామాలు, రాయచూరు జిల్లాలోని 26 గ్రామాల్లో రజాకార్లు అరాచకాలు సృష్టించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనా రెడ్డి, విజయశాంతి, జి. వివేక్, ఎంపీలు కె.లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్ కుమార్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ధర్మారావు, వన్నాల శ్రీరాములు పాల్గొన్నారు. -
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్ పర్యటన (ఫొటోలు)
-
కారు.. కమలం.. మధ్యలో ’కాంగ్రెస్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘సెప్టెంబర్ 17’సందర్భంగా జరగబోతున్న పొలిటికల్ ధూంధాంలో కాంగ్రెస్ పార్టీ కూడా తన వంతు పాలుపంచుకోబోతోంది. కారు, కమలం పార్టీలకు దీటుగా ఈ అంశంపై ప్రజల్లోకి వెళ్లాలని, ఇందుకోసం ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. సెప్టెంబర్ 17న నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో జాతీయజెండాను ఎగురవేసే కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. టీఆర్ఎస్, బీజేపీలకు కౌంటర్‌గా సిద్ధం చేసిన యాక్షన్ ప్లాన్‌ను కాంగ్రెస్‌పార్టీ ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించబోతోంది. బహుజన తెలంగాణ స్లోగన్‌తో ముందుకు.. తెలంగాణ విమోచనం, జాతీయ సమైక్యతాదినోత్సవం పేరుతో బీజేపీ, టీఆర్ఎస్లు చేస్తున్న రాజకీయ హడావుడిని అందుకోవడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏడాది పొడవునా ఉత్సవాలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. సెప్టెంబర్ 17న రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో జాతీయ జెండాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టనుంది. అదేరోజున రాష్ట్రవ్యాప్తంగా ‘బహుజన తెలంగాణ తల్లి’పోస్టర్‌ను కూడా ఆవిష్కరించాలని నిర్ణయించింది. ఆ తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను కొనసాగించాలని, విలీన వజ్రోత్సవాలను వచ్చే ఏడాది సెప్టెంబర్ 16 వరకు చేపట్టాలని యోచిస్తోంది. వీలున్నన్ని చోట్ల బహుజన తెలంగాణతల్లి విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర, దేశ స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక సంస్థానాలు భారతదేశంలో విలీనమైన ప్రక్రియ గురించి ప్రజలకు వివరించి, అవగాహన కల్పించేందుకు బహుముఖ కార్యక్రమాలు చేపట్టాలని కూడా భావిస్తోంది. ఇప్పుడు హడావుడి చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీలు అసలు అప్పటికి పుట్టనే లేదని, కేవలం రాజకీయలబ్ధి కోసమే సెప్టెంబర్ 17 సందర్భంగా ఉద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయనే అంశాన్ని కూడా ప్రజలకు వివరించనుంది. కాగా, టీఆర్ఎస్, బీజేపీలు వేసిన ట్రాప్‌లో తాము పడబోమని, నాటి విలీన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాలుపంచుకున్న పార్టీగా ప్రజలకు తాము చేసింది చెప్పుకోవాల్సిన అవసరం ఉందని, చెప్పుకునే చరిత్ర తమ పార్టీకి మాత్రమే ఉందని, ఇందుకు సంబంధించిన కార్యాచరణను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తామని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. -
‘ఈ ఉద్యమంలో మేము సఫలమయ్యాం’
సాక్షి, హైదరాబాద్: అన్ని పార్టీలు హైదరాబాద్ విమోచన వజ్రోత్సవాలను నిర్వహిస్తామని చెప్పడం బీజేపీ సాధించిన గొప్ప విజయమని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు వ్యాఖ్యానించారు. విమోచన దినోత్సవం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అధికారికంగా గుర్తించాలని బీజేపీ ఆధ్వర్యంలో తాము అప్పట్లో ఉద్యమం చేశా మని గుర్తుచేశారు. శనివారం విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడు అన్ని పార్టీలు ఉత్సవాల నిర్వహణకు ముందుకు రావడంతో తాము ఈ ఉద్యమంలో సఫలీకృతం అయ్యామన్నారు. గతం నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న ఏదో ఒక రూపంలో కార్యక్రమాలను నిర్వహించామన్నారు. పరకాలలో జరిగిన పోరాటాన్ని దృశ్య రూపంలో చూపించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివిధ విషయాలు, చరిత్ర వంటి వా టిని పాఠ్యాంశాల్లో చేర్చాలని, జర్నలిస్ట్ షోయ బుల్లాఖాన్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతి ష్టించాలని విద్యాసాగర్ డిమాండ్ చేశారు. -
సెప్టెంబర్ 17.. మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ గేమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలను సెప్టెంబర్ 17.. ఒక్క సారిగా మార్చేసింది. వాడీవేడిని రగిల్చింది. ఎత్తుకు పైఎత్తులు వేసేలా శనివారం రాజకీయాలు కొనసాగాయి. మూడు పార్టీల మధ్య గేమ్‌గా మారింది. తెలంగాణ విలీన దినాన్ని ఎనిమిదేళ్లుగా పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఉత్సవాల నిర్వహణకు పోటాపోటీగా రంగంలోకి దిగాయి. పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభు త్వం నిర్వహిస్తుందని, అందులో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేలకు లేఖలు రాశారు. హైదరాబాద్ సంస్థానం నుంచి విముక్తి పొందిన మూడు రాష్ట్రాలను కలిపి విమోచన దినోత్సవం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరై కేంద్రబలగాల గౌరవ వందనం స్వీకరిస్తారని అందులో వెల్లడించారు. గౌరవ అతిథులుగా హాజరుకావాలని ముగ్గురు ముఖ్యమంత్రులను కోరారు. మరోౖ వెపు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’గా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని తీర్మానించారు. ప్రారంభ, ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఇదిలాఉండగా, మజ్లిస్ పార్టీ సైతం ఉత్సవాలను ఆహ్వానిస్తూనే.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు, సీఎం కేసీఆర్‌కు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లేఖ రాశారు. పాతబస్తీలో తిరంగా యాత్రతోపాటు బహిరంగ సభ నిర్వహిస్తామని, కేసీఆర్‌ను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన అసదుద్దీన్.. తమ సూచనను పరిగణనలోకి తీసుకుని జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహణకు ముందుకొచ్చినందుకు కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేయడం కొసమెరుపు. కాగా ఈ ఉత్సవాల గురించి ఎనిమిదేళ్లుగా ఏ మాత్రం పట్టించుకోని బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పుడు నిర్వహిస్తామని చెప్పడం అవకాశవాద రాజకీయమంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించడం గమనార్హం. -
మాస్కో టూ హైదరాబాద్!
ఓల్గా సే గంగ, గంగా సే ఓల్గా. ప్రాంతం ఏదైనా దేశం ఏదైనా సరే, అసమర్థుల జీవయాత్ర ఒకే రకంగా ఉంటుందని పలుమార్లు రుజువైంది. ఖాతాల్లో ఎన్ని ఘనతలున్నా అవి వారికి ఉపయోగపడవు. కాలక్రమంలో ఆ ఘనతలన్నీ విజేతల ఖాతాల్లోకి బదిలీ అవుతుంటాయి. ఈ వారం రష్యాలో, తెలం గాణలో జరిగిన రెండు పరిణామాలు ఇదే సంగతిని మరోసారి నిర్ధారించాయి. రష్యాలో గోర్బచెవ్ మరణం, హైదరాబాద్ సంస్థాన విలీనాంశం ఈ పరిణామాలు. మిహాయిల్ సెర్గీవిచ్ గోర్బచెవ్ సోవియట్ యూనియన్‌కు చిట్టచివరి అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయ్యవారిని చేయబోతే కోతి తయారైందని మన దగ్గర ఒక సామెత ఉన్నది. ఆయన కూడా ఒక లెనిన్‌ను సృష్టిద్దామనుకున్నాడు. సదరు సృష్టికార్యం వికటించి ఎల్త్సిన్ తయారయ్యాడు. ఎల్త్సిన్ ముదిరి పుతిన్ అవతారమెత్తాడు. జార్ చక్రవర్తుల నిరంకుశ కాలం నాటి రష్యాను ‘జాతుల బందిఖానా’గా లెనిన్ అభివర్ణించాడు. కజకిస్థాన్ వగైరా మధ్యఆసియా దేశాలు, ఆర్మేనియా తదితర కాకేసస్ ప్రాంత రాజ్యాలు, ఉక్రెయిన్, బెలారస్ వంటి తూర్పు యూరప్ జాతులు, బాల్టిక్ తీర జాతులు, ఫిన్లాండ్... రష్యన్ సామ్రా జ్యంలో అంతర్భాగంగా ఉండేవి. భాషాపరంగా, సాంస్కృతికంగా నాన్–రష్యన్ జాతులన్నీ తీవ్రమైన వివక్షకు, అణచివేతకు గురయ్యేవి. విప్లవం విజయ వంతమైన తర్వాత ఏర్పడిన సోవియట్ యూనియన్‌లో ఈ జాతులన్నింటికీ విడిపోయే హక్కుతో సహా సమస్త ప్రజాస్వా మిక హక్కులను కల్పించాలని లెనిన్ సంకల్పించారు. ఆ మేరకు బోల్షివిక్ పార్టీ ఒక ప్రకటన కూడా చేసింది. ఆ వెంటనే ఫిన్లాండ్ చేసిన స్వాతంత్య్ర ప్రకటనను కూడా లెనిన్ అనుమతించారు. మిగిలిన జాతుల సమస్యల్ని కూడా పరిష్కరించడానికి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసి స్టాలిన్‌ను ఆ శాఖకు మంత్రిగా నియమించారు. అనతికాలంలోనే లెనిన్ అనారోగ్యానికి గురికావడం, కొద్దిరోజుల్లోనే చనిపోవడంతో పాలనా పగ్గాలు స్టాలిన్ చేతికి చిక్కాయి. స్టాలిన్ స్వయంగా రష్యన్ కాదు. జార్జియన్. అయినప్పటికీ ఇతర జాతులేవీ యూనియన్ నుంచి విడి పోకుండా కమ్యూనిస్టు పార్టీ పెత్తనం ద్వారా జాగ్రత్తపడ్డారు. జారిస్టు రష్యా నాటి వివక్ష, భాషా సంస్కృతుల అణచివేతను అమలు చేయలేదు గానీ జాతుల స్వతంత్ర కాంక్షను మాత్రం ఉక్కుపాదంతో అణచివేశారు. స్టాలిన్ హయాంలో సోవియట్ యూనియన్ ఆర్థికాభివృద్ధికి వేగంగా పునాదులు పడినప్పటికీ, ప్రజాస్వామిక హక్కులు మాత్రం మృగ్యమయ్యాయి. ఏక పార్టీ నియంతృత్వం కొనసాగింది. సొంత పార్టీలో ప్రత్యర్థులను కూడా వెంటాడి వేటాడారు. లెనిన్ వారసుడిగా అధికారంలోకి రావాల్సిన ట్రాట్సీ్క వంటి మేధావిని కూడా ప్రవాసంలోనే మట్టుబెట్టారు. అయితే స్టాలిన్ అటువంటి కఠిన వైఖరి అవలంబించకపోయినట్లయితే సోవియట్ యూనియన్ను బాల్యదశలోనే సామ్రాజ్యవాద శక్తులు కడతేర్చి ఉండేవని స్టాలిన్ అనుకూల వర్గం వాదించింది. స్టాలిన్ మరణానంతరం ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నికటా కృశ్చేవ్ అధికారం లోకి వచ్చారు. అయినా అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో పెద్దగా మార్పు రాలేదు. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన ఉదంతం ప్రచారంలో ఉన్నది. ఒక సమావేశంలో స్టాలిన్‌ను విమర్శిస్తూ కృశ్చేవ్ మాట్లాడుతున్నారట. అప్పుడాయన దగ్గరకు ఒక చీటీని ఎవరో పంపించారు. కృశ్చేవ్ ఆ చీటిని విప్పి చదివారు. ‘స్టాలిన్ జీవించి ఉన్నప్పుడు మీరెందుకు ఈ మాటలన్నీ చెప్పలేద’ని అందులో ఉన్నదట. చదివిన తర్వాత ఆ ‘చీటిని పంపిందెవరో చేయెత్తండ’ని కృశ్చేవ్ అడిగారట. ఎవరూ ఎత్తలేదు. కాసేపు నిరీక్షించిన తర్వాత ‘ఇదిగో ఇందుకే నేను కూడా మాట్లాడలేద’ని కృశ్చేవ్ నవ్వుతూ చెప్పారట! గోర్బచెవ్ చేతికి పార్టీ పగ్గాలొచ్చేనాటికి దేశంలో ప్రజాస్వామ్య ఆకాంక్ష పెరగసాగింది. ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా ఆర్థిక పరిస్థితి దిగజారింది. అఫ్గానిస్తాన్ యుద్ధంతో చేతులు కాల్చుకున్నది. జనంలో అసంతృప్తి వ్యాపించడం మొదలైంది. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని గోర్బచెవ్ సంక ల్పించారు. ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలకడం కోసం రోనాల్డ్ రీగన్, మార్గరెట్ థాచర్‌లతో చర్చలు జరిపారు. వీరిద్దరూ ఆయా దేశాల్లో ఉక్కు మనుషులుగా పేరుగాంచారు. గోర్బచెవ్కు స్వదేశంలో మెతక మనిషనే పేరున్నది. పశ్చిమ దేశాలతో ఒప్పందం మేరకు భారీ సంఖ్యలో అణ్వస్త్రాలను ధ్వంసం చేశారు. అఫ్గానిస్తాన్ నుంచి ఉపసంహరించుకున్నారు. తూర్పు యూరప్ దేశాల్లోని కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోతుంటే ప్రేక్షకపాత్ర పోషించాడే తప్ప సైన్యాన్ని వినియోగించలేదు. బెర్లిన్ గోడ బద్దలవడాన్ని అనుమతించారు. జర్మనీల ఏకీకరణకు పరోక్షంగా సహక రించారు. ఆర్థిక రంగంలో పెరిస్త్రోయికా (పునర్నిర్మాణం), రాజకీయ రంగంలో గ్లాస్‌నోస్త్ (పారదర్శకత) విధానాలను అమలు చేశారు. సంస్కరణలను మరింత వేగవంతం చేయా లన్న ఎల్త్సిన్ తదితర ప్రజాస్వామిక వాదుల ఒత్తిడికి లొంగి ఒకేసారి సోవియట్ వ్యవస్థ తలుపులు, కిటికీలను బార్లా తెరిచేశారు. వీచే గాలుల ఉధ్ధృతికి తనను తాను నిభాయించుకోలేకపోయారు. పరిస్థితులను తన అదుపులో ఉంచుకుంటూ నెమ్మది నెమ్మదిగా తలకెత్తుకోవలసిన సంస్కరణలను ఒక్కసారిగా చేపట్టారు. అతిపెద్ద ప్రజాస్వామ్య వాదిగా తానే మిగిలిపోవాలన్న దుగ్ధతో సంప్రదాయ కమ్యూని స్టులకు దూరమయ్యారు. ఇటు ప్రజాస్వామికవాదులకు గోర్బచెవ్ కంటే ఎల్త్సిన్లోనే సమర్థుడైన నాయకుడు కనిపిం చాడు. గోర్బచెవ్ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారింది. పశ్చిమ దేశాల్లో శాంతిదూత అనే ఇమేజ్ సంపాదించినప్పటికీ, స్వదేశంలో అసమర్థుడిగా ముద్రపడింది. సోవియట్ యూని యన్ పతనాన్ని ఆయన కోరుకోలేదు. ఆర్థిక పునరుజ్జీవనం కోసం మార్కెట్ శక్తులను ఒక మేరకు అనుమతించాలను కున్నారు. సోషలిస్టు వ్యవస్థలోనే ప్రజాస్వామిక సంప్రదా యాలను పాటించాలనుకున్నారు. కమ్యూనిస్టు పార్టీని సోషల్ డెమోక్రాటిక్ పార్టీగా నడపాలని భావించారు. నిర్వహణా దక్షత లేక అధికారానికి దూరమై ముప్పయ్యేళ్లపాటు పత్రికలకు వ్యాసాలు, పుస్తకాలు రాసుకుంటూ గడిపేశారు. తన చర్యల ఫలితంగా ఎల్త్సిన్లూ, పుతిన్లూ పుట్టుకొచ్చి రాజ్యమేలుతుంటే మౌనంగా గమనించారు. ఇరవయ్యో శతాబ్దంలో చరిత్రను మలుపుతిప్పిన కీలక పరిణామానికి శ్రీకారం చుట్టిన మహా సంస్కరణవాది అంత్యక్రియలకు అధికార లాంఛనాలు కూడా దక్కలేదు. ఈనెల పదిహేడో తేదీ కోసం తెలంగాణలో ఒక రాజకీయ జాతర కార్యక్రమం రూపుదిద్దుకుంటున్నది. హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమై 74 సంవత్స రాలైంది. ఇప్పుడు ఏడాది పొడవునా కేంద్ర ప్రభుత్వం విమోచన ఉత్సవాలు జరుపబోతున్నదట! రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాది పొడుగునా వజ్రోత్సవాలు జరపాలని కేబినెట్ నిర్ణయించింది. అసదుద్దీన్ ఒవైసీ సూచన మేరకు జాతీయ సమైక్యతా ఉత్సవాలుగా నామకరణం చేసింది. ఇంతకుముందు రజతోత్సవాలు, స్వర్ణోత్సవాలు వచ్చిపోయాయి గానీ, ఇంత హడావిడి గతంలో ఎప్పుడూ లేదు. కాలం గడిచిపోతున్నకొద్దీ ఉత్సవ సంరంభాలు తగ్గుముఖం పడతాయి కానీ పెరగడ మన్నదే ఒక వింత. ఇదే రాజకీయ వింత! విలీనానికి ‘విమోచనం’ అనే పేరుపెట్టి రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని రాజకీయ పరిశీలకుల అభి ప్రాయం. స్వాతంత్య్రం రాకముందు దాదాపు 500 సంస్థానాలు బ్రిటీష్ వారి అనుమతితోనే స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. అందులో చాలావరకు చిన్నచిన్న సంస్థానాలు. హైదరాబాద్, కశ్మీర్ మాత్రమే పెద్ద రాజ్యాలు. స్వతంత్రం వచ్చిన తర్వాత వీటన్నింటినీ ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయవలసిన అవసరం ఏర్పడింది. విలీనానికి సిద్ధంగా లేని హైదరాబాద్ సంస్థానంపై కేంద్రం ‘పోలీస్ చర్య’ జరిపి విలీనం చేసుకున్నది. ‘విమోచనం’ అనే మాట వచ్చినప్పుడు ఎవరి నుంచి అనే ప్రశ్న వస్తుంది. నిజాం రాజు పరాయి దేశ పాలకుడు కాదు. ఏడెనిమిది తరాలపాటు ఇక్కడే పుట్టి పెరిగిన అసఫ్‌జాహీ వంశస్థుడు. పది తరాలకు ముందు ఇప్పటి ఉజ్బెకిస్థాన్ నుంచి వచ్చిన ఒక పండితుడు షాజహాన్ దగ్గర కొలువులో చేరాడు. క్రమంగా దక్కన్ రాజప్రతినిధులుగా మారి, ఔరంగజేబు మరణం తర్వాత స్వతంత్రరాజులయ్యారు. ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో చెలరేగిన రజాకార్ మూకలను అదుపులో పెట్టడంలో ఆయన విఫలమయ్యారు తప్ప స్వయంగా ఆయన మతసహనం లేనివాడు అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. అనేక దేవాల యాలు కట్టించాడనే పేరు కూడా ఉన్నది. ఆ రోజుల్లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకే ఐదు లక్షలు విరాళంగా ఇచ్చి, బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి మాత్రం పది లక్షలు విరాళ మిచ్చాడు. ఇందులో జనాభానూ, విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకున్నాడే తప్ప మతాన్ని ఆయన చూడలేదు. విద్య, వైద్య రంగాల్లో ఆయన వేసిన పునాదులను కూడా విస్మరించలేము. ఒక ఫ్యూడల్ వ్యవస్థకు అధిపతి నిజాం ప్రభువు. ఈ వ్యవస్థ ప్రతినిధులుగా దొరలు, దేశ్‌ముఖ్‌లు గ్రామసీమల్లో చేసిన అరాచకం, దోపిడీ అంతా ఇంతా కాదు. రైతాంగాన్ని పీల్చి పిప్పిచేశారు. దిగువ శూద్రుల్ని వెట్టి బానిసలుగా మార్చివేశారు. ఈ అమానుషత్వానికీ, దోపిడీకీ వ్యతిరేకంగానే కమ్యూనిస్టుల (సంఘం) ఆధ్వర్యంలో రైతుకూలీలు జరిపిన సాయుధ పోరాటం దేశచరిత్రలో సాటిలేని ఒక ఉజ్జ్వల ఘట్టం. హైదరాబాద్‌పై ‘పోలీస్ చర్య’ జరిగేనాటికి సాయుధ రైతాంగ దళాలు మూడువేల గ్రామాలను భూస్వాముల పీడన నుంచి విడిపించాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగి ఉంటే ‘విమోచనం’ అనే మాటకు అర్థం ఉండేది. కానీ, ‘పోలీసు చర్య’ తర్వాత యూనియన్ సైన్యాలు భూస్వాములను మళ్లీ గ్రామాల్లో ప్రతిష్ఠించాయి. తీవ్రత తగ్గినా దోపిడీ కొనసాగింది. అధికార బదిలీ మాత్రమే జరిగింది తప్ప ప్రజలకు ఏ రకమైన విముక్తీ లభించలేదని ఈ పరిణామం స్పష్టం చేసింది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాల్లో కమ్యూనిస్టులూ, మిగిలిన తెలంగాణాతో పాటు మరాఠా, కన్నడ జిల్లాల్లో స్టేట్ కాంగ్రెస్ పార్టీ, ఆర్యసమాజ్‌లు నాడు నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్నాయి. ఈ పోరాటాల్లో హిందువులతో పాటు ముస్లింలు కూడా పెద్దయెత్తున పాల్గొ న్నారు. నిజాం ప్రభువు ముస్లిం మతస్థుడు కనుక ‘విమోచనం’ అనే పదాన్ని పదేపదే వాడటం వల్ల భావోద్వేగాలు తలెత్తి రాజకీయంగా వర్కవుట్ కావచ్చన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు కనిపిస్తున్నది. నిజానికి బీజేపీ కానీ, దాని పూర్వరూపమైన ‘జనసంఘ్’ గానీ పోలీస్ చర్య జరిగేనాటికి పుట్టలేదు. బీజేపీకి దీటుగా ఉత్సవాలను తలకెత్తుకోబోతున్న టీఆర్ఎస్ కూడా అప్పుడు పుట్టలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తెలివిగా ఈ తాజా ఎజెండాను బీజేపీ తలకెత్తుకున్నది. రాజకీయ పరిశీలకుల అంచనాల మేరకు నెలరోజుల కిందటి వరకు తెలంగాణలో బీజేపీ మూడో స్థానంలో ఉన్నది. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఆ పార్టీకి కూడా కొత్తగా బలం పెరగడం లేదు. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్న దాఖలాలు కూడా లేవు. ఆశ్చర్యకరంగా అనిశ్చిత ఓటర్ల (ఎటూ తేల్చుకోని) సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నదని కొన్ని అనధికార సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ ఓటర్లే ఎక్కువ. ఉపఎన్నిక వాకిట్లో ఉన్న మునుగోడులోనే ఇరవై శాతానికి పైగా అనిశ్చిత ఓటర్లున్నారని అంచనా. కాంగ్రెస్ పార్టీ ఏదైనా అద్భుతాన్ని సృష్టించగలిగితేనే అనిశ్చిత ఓటర్లు అటువైపు మొగ్గుతారు. నిజాం పాలనలో పోరాటాలు జరిపిన కాంగ్రెస్–కామ్రేడ్స్ కళ్లప్పగించి చూస్తుండగానే అదే అంశంపై బీజేపీ – టీఆర్ఎస్లు తలపడటం ఎన్నికల ఎత్తుగడగానే పరిగణించాలి. ‘సెప్టెంబర్ 17’ సాక్షిగా సెమీ ఫైనల్ దశ నుంచి ఫైనల్స్‌లో అడుగు పెట్టా లని బీజేపీ సన్నాహాలు చేస్తున్నది. భావోద్వేగాల ద్వారా అని శ్చిత ఓటర్లను గెలవాలని అది వలవేస్తున్నది. లౌకిక బాణంతో ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ సమాయత్తమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా అద్భుతాన్ని సృష్టిస్తుందా లేదా అన్నదే ఇప్పుడు బిలియన్ డాలర్ల ప్రశ్న. అటువంటి అద్భుతం జరగకపోతే మాత్రం కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రయాణాలు అసమర్థుల జీవయాత్రలుగానే మిగిలిపోతాయి. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
కేంద్రం కీలక నిర్ణయం.. అధికారికంగా ‘విమోచన’ ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 17న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, హోంశాఖల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ ఉత్సవాల్లో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై పాల్గొననున్నారు. ఈ ఉత్సవాలను హైదరాబాద్ స్టేట్ విలీన దినోత్సవంగా కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ శాఖలు భావిస్తున్నట్లు సమాచారం. పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంశాఖ పరిధిలోని ఏడు సాయుధ దళాలతో నిర్వహించే సైనిక కవాతు సందర్భంగా అమిత్ షా సైనిక వందనం స్వీకరించనున్నారు. సైనిక కవాతుతోపాటు కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గతంలో హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న వివిధ ప్రాంతాలు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలలో విలీనమైన విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో కేంద్ర సాంస్కృతికశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోనూ...: ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ తరహాలో ఈ నెల 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 దాకా (హైదరాబాద్ స్టేట్ విలీనమై 75 ఏళ్లు పూర్తయ్యే దాకా) ఏడాదిపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నైజాం విముక్త స్వతంత్ర ఉత్సవాల పేరిట చేపట్టాలని రాష్ట్ర స్వయం సేవక్‌సంఘ్ (ఆరెస్సెస్) నిర్ణయించింది. రాజకీయరంగు లేకుండా నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఆనాటి నియంతృత్వ పాలనను ఎత్తిచూపేలా వివిధ కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తున్నారు. ఏడాదిపాటు వీటి నిర్వహణకు ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఇతర భావసారూప్య శక్తులు, వ్యక్తులతో ఒక సమన్వయ కమిటీ ద్వారా చేపట్టనున్నట్లు సమాచారం. ఈ సమితికి గౌరవాధ్యక్షుడిగా జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, అధ్యక్షుడిగా డా. వంశతిలక్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమితి లక్ష్యాలు, ఆలోచనలు, చేపట్టబోయే కార్యక్రమాలను శనివారం ప్రకటించనున్నారు. చదవండి: ఏడాది పొడవునా తెలంగాణ విలీన వజ్రోత్సవాలు! -
ఏడాది పొడవునా తెలంగాణ విలీన వజ్రోత్సవాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూకుడుకు చెక్‌పెట్టే దిశలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగమైన తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమై వచ్చే 17వ తేదీకి 74 ఏళ్లు గడిచి 75వ ఏట ప్రవేశిస్తున్న తరుణంలో ఏడాది పొడవునా తెలంగాణ విలీన వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. శనివారం జరగనున్న మంత్రిమండలి భేటీలో.. దీనిపై తుది నిర్ణ యం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహించినట్లు.. తెలంగాణ వజ్రోత్సవాలు నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు చాటేలా కార్యక్రమాల నిర్వహణపై కేబినెట్ భేటీలో చర్చించి విధి విధానాలు ఖరారు చేసే అవకాశముంది. సీబీఐకి నో ఎంట్రీ.. తెలంగాణలో సీబీఐ విచారణలకు ఫుల్స్టాప్ పెట్టా లని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కూడా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో విచారించేందుకు వీలుగా సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతులు ఉపసంహరించుకోవడం కేబినెట్ ఎజెండాలో ఉండనుందని అధికార వర్గాల సమాచారం. సీబీఐ, ఈడీ వంటి సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఇటీవల బిహార్ రాజధాని పట్నాలో ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించిన నేపథ్యంలో.. అనుమతి ఉత్తర్వులను ఉపసహరించుకుంటున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఉద్యో గ నోటిఫికేషన్ల జారీ లో పురోగతి, ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, ధరణి సమస్యలు, వాయిదా పడిన రెవెన్యూ సదస్సుల నిర్వహణ, విద్యుత్ బకాయిల చెల్లింపుపై కేంద్రం ఆదేశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అంశాలపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. గంటల వ్యవధిలో కీలక సమావేశాలు! రాష్ట్ర మంత్రివర్గం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశం జరగనుంది. ఇక మరో రెండురోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇలావుండగా మంత్రివర్గ భేటీతో పాటు టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశంపై రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అందుకే ఒకేరోజు కేబినేట్ భేటీ, టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లెజిస్లేచర్, పార్లమెంటరీ పార్టీల భేటీకి హాజరు కావాల్సిందిగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులకు ఆహ్వానం అందింది. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఈ భేటీలో తెలియజేయడంతో పాటు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించే అవకాశముందని తెలుస్తోంది. అదే సమయంలో జాతీయ పార్టీ ఏర్పాటు కు సంబంధించి కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు 57 ఏళ్లు నిండిన వారందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేసిన నేపథ్యంలో, నియోజకవర్గాల్లో అర్హులందరికీ చేరేలా చూడాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ ఓటు బ్యాంకులో కీలకమైన ఆసరా పింఛన్ లబ్ధి దారుల అభిమానం చూరగొనేలా క్షేత్ర స్థాయిలో విస్తృత పర్యటనలు చేయాల్సిందిగా ఆదేశించనున్నారు. 15 వరకు అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి భేటీ ఈ నెల 6న ఉదయం 11.30 గం.కు ప్రారంభమవుతాయని అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు శుక్రవారం ప్రకటించారు. శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమవుతాయి. సమావేశాల ఎజెండాపై 6న జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాలు వారం రోజుల పాటు ఈ నెల 15వ తేదీ వరకు జరిగే అవకాశముందని సమాచారం. -
విముక్తి దినోత్సవం.. ‘శామ్సంగ్’ వారసుడికి అధ్యక్షుడి క్షమాభిక్ష
సియోల్: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ వారసుడు లీ సహా ప్రముఖ కార్పొరేట్లు తదితర 1,700 మందికి దేశాధ్యక్షుడు యూన్ సుక్ యోల్ విముక్తి దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రకటించనున్నారు. రెండో ప్రపంచయుద్ధం ముగిశాక జపాన్ వలస పాలన నుంచి విముక్తి పొందిన రోజును దక్షిణ కొరియా ఏటా ఆగస్ట్ 15న విముక్తి దినోత్సవం జరుపుకుంటుంది. శామ్సంగ్ అనుబంధంగా ఉన్న రెండు సంస్థల విలీనం కోసం 2015లో అప్పటి అధ్యక్షురాలు పార్క్‌కు ఆ సంస్థ వారసుడైన లీ జే యంగ్ భారీగా ముడుపులు అందజేశారు. ఈయనతోపాటు లొట్టే గ్రూప్ చైర్మన్ షిన్ డాంగ్ బిన్ తదితరుల నుంచి కూడా అధ్యక్షురాలు భారీగా లంచాలు అందుకున్నారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో అధ్యక్షురాలు పార్క్ పదవి నుంచి వైదొలిగారు. ఆమెకు సుమారు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆమెకు గత ఏడాది అధ్యక్షుడు మూన్ క్షమాభిక్ష ప్రకటించారు. 30 నెలల జైలు శిక్ష పడిన శామ్సంగ్ వారసుడు లీకి కూడా గత ఏడాది పెరోల్ లభించింది. తాజాగా, అధ్యక్షుడి క్షమాభిక్షతో మిగిలిన జైలు జీవితం కూడా ముగియనుంది. దేశంలో వాణిజ్య కార్యకలాపాలకు ఊతమివ్వడం ద్వారా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకే అధ్యక్షుడు ప్రముఖ వ్యాపారవేత్తలకు క్షమాభిక్షలు ప్రకటించారని దక్షిణ కొరియా న్యాయశాఖ శుక్రవారం పేర్కొంది. -
సర్దార్ పటేల్ మరికొంత కాలం బతికుంటే.. గోవా విమోచన ముందే జరిగేది
పనాజి: సర్దార్ వల్లబ్‌భాయ్ పటేల్ మరికొంత కాలం బతికుంటే పోర్చుగీసు పాలన నుంచి గోవా విమోచన ముందే జరిగేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మనకు 1947 స్వాతంత్య్రం వచ్చినప్పటికీ గోవా చాలాకాలం పోర్చుగీసు పాలనలోనే ఉండిపోయింది. భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ను చేపట్టి 1961 డిసెంబరు 19న గోవాకు వలసపాలన నుంచి విముక్తి కల్పించింది. గోవా భారత్‌లో భాగమైంది. ఆదివారం 60వ గోవా విమోచన దినోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన మోదీ మాట్లాడుతూ... సర్దార్ పటేల్ గనక మరికొన్ని రోజులు బతికి ఉంటే గోవా ప్రజలు 1961 కంటే చాలాముందుగానే స్వేచ్ఛావాయువులు పీల్చేవారని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, హోంమంత్రిగా పనిచేసిన పటేల్ 1950 డిసెంబరు 15న తుదిశ్వాస విడిచారు. నిజాం పాలనలోని ప్రస్తుత తెలంగాణ, మరఠ్వాడా, కల్యాణ కర్ణాటక (ఐదు జిల్లాలు)తో సహా దేశంలోని పలు సంస్థానాలను భారత్‌లో విలీనం చేసి పటేల్ ఉక్కుమనిషిగా పేరొందారు. గోవా విమోచన ఆలస్యం కావడానికి నెహ్రూయే కారణమని గతంలో పలువురు బీజేపీ అన్నారు. గోవా విమోచన కోసం పోరాడిన స్థానికులకు, ఇతర ప్రాంతాల వారికి నివాళులర్పించిన మోదీ వారి కృషిని కొనియాడారు. భారత స్వాతంత్య్రంతో గోవా విమోచన పోరాటం ఆగిపోకుండా నాటి సమరయోధులు చూసుకున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చినా... దేశంలోని ఒక భాగమైన గోవా (డయ్యూ– డామన్తో కలిసి) ఇంకా పరాయిపాలనలోనే ఉందనే భావనతో స్వతంత్ర ఫలాలను భారతీయులు పూర్తిగా ఆస్వాదించలేకపోయారన్నారు. అందుకే పలువురు స్వాతంత్య్ర సమరయోధులు సర్వస్వం వదిలి గోవా ప్రజలతో కలిసి విమోచన కోసం పోరాడారన్నారు. శతాబ్దాల తరబడి వలస పాలకుల ఆధీనంలో ఉన్నప్పటికీ గోవా ప్రజలు తమ భారతీయతను మర్చిపోలేదన్నారు. అలాగే మొఘలాయిల పాలనలో మగ్గిన భారత్ కూడా గోవాను ఏనాడూ మరువలేదన్నారు. సుపరిపాలనలో పలు అంశాల్లో ముందంజలో ఉన్నందుకు గోవా ప్రభుత్వాన్ని ప్రధాని అభినందించారు. తలసరి ఆదాయం, బడుల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు, ప్రతి గడపకూ వెళ్లి చెత్త సేకరణ, ఆహార భద్రత అంశాల్లో గోవా అగ్రస్థానాన ఉందని మోదీ వివరించారు. దివంగత మాజీ సీఎం మనోహర్ పారిక్కర్‌ను గుర్తుచేసుకున్నారు. గోవాకు ఉన్న వనరులు, అవకాశాలను చక్కగా గుర్తించి అభివృద్ధి పథాన నడిపారని పారిక్కర్‌ను కొనియాడారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మోదీ మిరామర్‌లో వాయుసేన, నావికాదళ విన్యాసాలను తిలకించారు. -
అమెరికాలో తెలంగాణ విమోచన దినోత్సవం
-
370ని రద్దు చేసినట్టు ఇది కూడా..
సాక్షి, ఢిల్లీ : నిజాం పాలనలో రజాకార్ల దురాగతాలు నేటికీ మర్చిపోలేని భయంకర దృశ్యాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనీష్ తివారీ, తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయుధ పోరాటంలో పాల్గొన్న బైరాన్‌పల్లి గ్రామ సమరయోధులను ఆహ్వానించి వారికి సన్మానం చేశారు. ముందుగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ రజాకార్ల వ్యతిరేకులను, మలిదశ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరినప్పుడే సాయుధ పోరాట యోధులకు సరైన గుర్తింపు దక్కుతుందని వ్యాఖ్యానించారు. సెప్టెంబరు 17న గ్రామగ్రామాన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జాతీయ పతాకం ఎగరేస్తూ విమోచన దినోత్సవం నిర్వహించాలని పిలుపునిస్తున్నానని తెలిపారు. తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ భారతదేశంలో విలీనమైన రోజును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా ఎందుకు నిర్వహించట్లేదని ప్రశ్నించారు. విమోచనంలో పాల్గొన్న వారి త్యాగాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసినట్టుగా.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. మురళీధర్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానం నుంచి విడిపోయి కర్ణాటక, మహారాష్ట్రలో కలిసిన జిల్లాలు విమోచన దినోత్సవాన్ని జరుపుకొంటున్నాయి కానీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు జరపట్లేదని నిలదీశారు. కాంగ్రెస్‌లాగా టీఆర్ఎస్ కూడా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. కేసీఆర్ అహంకార ధోరణికి అంతం పలికే రోజు ఎంతో దూరంలో లేదని బీజేపీ ఈ వేదిక నుంచి ప్రకటిస్తుందని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట దృశ్యాల ఫోటో ప్రదర్శనను నాయకులు వీక్షించారు. -
‘అతన్నో సూపర్మ్యాన్లా చూపిస్తోంది’
పణాజి : అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రిని బీజేపీ హీ - మ్యాన్, సూపర్‌మ్యాన్ లాగా చూపించే ప్రయత్నం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో బుధవారం (నిన్న) నిర్వహించిన 57వ గోవా లిబరేషన్ డే పరేడ్ కార్యక్రమాలకు సీఎం మనోహర్ పారికర్ హాజరుకాకపోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఉర్ఫాన్ ముల్లా మాట్లాడుతూ.. ‘బీజేపీ గోవా సీఎమ్‌ను ఫోటో సెషన్ కోసం వాడుతూ.. అతన్ని ఓ హీ - మ్యాన్, సూపర్‌మ్యాన్‌గా చూపించే ప్రయత్నం చేస్తోంది. వైద్యులను వెంటబెట్టుకుని వెళ్లి మరి నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను పర్యవేక్షించిన పారికర్‌కు ఇంత ముఖ్యమైన గోవా లిబరేషన్ డే పరేడ్ వేడుకలకు హాజరుకావడానికి మాత్రం ఆరోగ్యం సహకరించలేదా’ అంటూ ప్రశ్నించారు. నిజంగా ఇది చాలా విచారకరమన్నారు. ఇదిలా ఉండగా గోవా లిబరేషన్ డే పరేడ్ వేడుకల్లో గోవా అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్, పారికర్ స్థానంలో ఉండి కార్యక్రమాలు నిర్వహించారు. పారికర్ అనారోగ్య కారణాల వల్ల అసెంబ్లీకి హాజరు కాలేకపోయారన్నారు. ఆయన బదుల ఈ ఉపన్యాసాన్ని తాను చదువుతున్నానంటూ సావంత్ చెప్పుకొచ్చారు. -
ఒకప్పటి రూపాయే.. ఇప్పుడు కువైట్ దీనార్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదో తెలుసా.. తెలియకపోతే తెలుసుకోండి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన కరెన్సీ కువైట్ దీనార్. ఈ రోజు ఒక కువైట్ దీనార్ భారత కరెన్సీలో సుమారు రూ. 215లకు సమానం. కానీ ఒకప్పడు కువైట్ ఏ కరెన్సీ ఉపయోగించేదో తెలుసా.. ఇండియా కరెన్సీనే వాడేది. 1959 వరకూ భారతీయ రూపాయినే కువైట్ కరెన్సీగా చలామణి అయ్యేది. కానీ 1960లొ తొలిసారి రూపాయి స్థానంలో గల్ఫ్ రూపీని ప్రవేశ పెట్టింది. తరువాత కాలక్రమేణా ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా రూపాంతం చెందింది. 1990 ఇరాక్ చెర నుంచి కువైట్ విముక్తి పొందింది. అప్పటినుంచి ఫిబ్రవరి 25, 26 లను లిబరేషన్ డే (విముక్తి దినోత్సవంగా) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన దేశ కరెన్సీ ఏవిధంగా మార్పు చెందుతూ వచ్చిందో తెలియచేస్తూ దేశ రాజధానిలో వాటి నమూనాలను ఏర్పాటు చేసింది. ఈసందర్భంగా 1959లో ఉపయోగించిన రూపాయిని సైతం జాబితాలో చేర్చింది. ఆ వీడియో మీకోసం. -
విమోచన దినోత్సవం అవసరం లేదు
♦ గతంలో తెలంగాణ ఉనికిని చాటుకోవడానికి కోరాం: కేటీఆర్ ♦ మేం దీనికోసం డిమాండ్ చేసింది వాస్తవమే ♦ ఇప్పుడు తెలంగాణకు జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉంది ♦ బీజేపీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని వ్యాఖ్య ♦ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలసిన మంత్రి సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణకు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉన్నందున విమోచన దినోత్సవాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అంశంలో బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని.. విమోచన దినం పేరుతో మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పలు వురు కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీకి వచ్చిన కేటీఆర్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని టీఆర్ఎస్ కోరిన మాట వాస్తవమేనని చెప్పారు. కానీ, అప్పుడు తెలంగాణ ఉనికి చాటుకోవడానికి ప్రత్యేకంగా ఎలాంటి సందర్భం లేకపోవడం వల్ల విమోచన దినం నిర్వహించాలని డిమాండ్ చేశామన్నారు. బీజేపీ రాజకీయం చేస్తోంది.. విమోచన దినం విషయంలో బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. విమోచన దినోత్సవం పేరుతో మతాల మధ్య చిచ్చుపెట్టి, ఆ మంటల్లో చలి కాచుకోవడానికి ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎప్పటికీ సెక్యులర్ పార్టీ అని.. ఏ కులాన్ని, మతాన్ని కించపరచకుండా అన్ని వర్గాలను కలుపుకొనిపోతుందని పేర్కొన్నారు. తెలంగాణ మాండలికాన్ని ప్రజలు పెద్ద ఎత్తున అనుసరిస్తున్నారని.. తెలంగాణ మాండలికంలో కళాకారులు పెరుగుతున్నారని, సినిమాల్లోనూ వినియోగం పెరిగిందని చెప్పారు. అన్ని మతాల పండుగలను, మహానుభావుల జన్మదినోత్సవాలను ప్రభుత్వం నిర్వíహిస్తోందని తెలిపారు. ఇన్ని రకాలుగా తెలంగాణ ఉనికిని చాటుతున్నప్పుడు విమోచన దినోత్సవాన్ని నిర్వహించాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం.. 3.5 శాతానికి పెంచండి 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణ రాష్ట్రానికి ఎఫ్ఆర్బీఎం పరిమితిని 3.5 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కేటీఆర్ కోరారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ఎంపీ వినోద్‌లతో కలసి ఆయన జైట్లీతో భేటీ అయ్యారు. తెలం గాణలోని సంక్షేమ కార్యక్రమాలకు రుణాలు తీసుకొనేందుకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు కేటాయించిన ఎయిమ్స్‌కు నిధులు విడుదల చేయాలని, ఐఐఎం కేటాయింపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ కేటాయించండి కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీని కేటాయించాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి జవదేకర్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కేబి నెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని జవదేకర్ హామీ ఇచ్చినట్టు కేటీఆర్ తెలిపారు. ఆ భూములు అప్పగించండి హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ చేపట్టామని, అందుకోసం పలుచోట్ల కేంద్ర హోం శాఖకు చెందిన భూములు అవసరమని కేటీఆర్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించారు. హైదరాబాద్‌లో బేగంపేట్‌లోని రసూల్‌పూరా చౌరస్తాలో ఉన్న కేంద్ర హోంశాఖకు చెందిన రెండున్నర ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. గతంలో కేంద్ర హోంమంత్రి దీనికి అంగీకరించినా కిందిస్థాయి అధికారులు ప్రతిపాదన ను తిరస్కరించారని రాజ్‌నాథ్‌కు వివరించారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు హైదరాబాద్‌కు ఇప్పటివరకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని, అందువల్లే గంటకు రెండు సెంటీమీటర్ల వర్షం కురిసినా.. తట్టుకొనే పరిస్థితి లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఆక్రమణకు గురైన నాలాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆ ప్రక్రియలో ఇళ్లు కోల్పోతున్న పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. లండన్ డిప్యూటీ మేయర్‌తో కేటీఆర్ భేటీ ఢిల్లీలో లండన్ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వివరించారు. వచ్చే ఏడాది హైదరాబాద్‌కు రావా లని రాజేశ్ అగర్వాల్‌ను కేటీఆర్ కోరారు.