విమోచన దినం జరుపుతామనలేదు | don't say Liberation Day celebrating : nayini narsimha | Sakshi
Sakshi News home page

విమోచన దినం జరుపుతామనలేదు

Published Sun, Sep 18 2016 3:20 AM | Last Updated on Fri, Mar 29 2019 9:14 PM

విమోచన దినం జరుపుతామనలేదు - Sakshi

విమోచన దినం జరుపుతామనలేదు

అది బీజేపీ డిమాండ్ మాత్రమే: నాయిని

 సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినం జరుపుతామని తామెప్పుడూ అనలేదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో విలీనమైన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని.. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో జాతీయజెండాను ఆవిష్కరించారు. విమోచన దినం జరపాలనేది బీజేపీ చేస్తున్న డిమాం డ్ మాత్రమేనన్నారు. సెప్టెంబర్ 17న రాచరిక పాలన అంతమై ప్రజాస్వామ్యంలో అడుగు పెట్టామని పేర్కొన్నారు.

మత సామరస్యానికి, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సీఎం కేసీఆర్ పరిపాలిస్తున్నారని.. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ స్టేట్‌ను ఏపీలో కలిపితే పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement