విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సరికాదు
Published
Sat, Sep 17 2016 6:37 PM
| Last Updated on Wed, Aug 15 2018 9:35 PM
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం సరికాదు
మునుగోడు : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించని సీఎం కేసీఆర్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి గంగిడి మనోహర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మునుగోడులో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని.. రెండేళ్లుగా ప్రజలు ఎరుదుచూస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేసిన సీఎం.. నేడు కొన్ని మతాలకు సంబంధించిన ఓట్లు కోసం విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడం లేదన్నారు. తెలంగాణ అమరవీరుల చరిత్రను పాఠ్యాంశాల్లో ముద్రించి నేటి తరానికి తెలియచేయాలన్నారు. వచ్చే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేపట్టే విధంగా కేంద్రం నుంచి ఆదేశాలు జారీ చేయిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనం వేణు, మండల అధ్యక్షుడు బొడిగె అశోక్‌కుమార్‌గౌడ్, నాయకులు సోమ నర్సింహ, కూరెళ్ల వెంకట్‌ఉదయకృష్ణ, మాదగోని నరేందర్‌గౌడ్, నామ ఆంజనేయులు, నీరుడు రాజారాం, పోతెపాక ధర్మయ్య పాల్గొన్నారు.