విమోచన దినోత్సవం అవసరం లేదు
♦ గతంలో తెలంగాణ ఉనికిని చాటుకోవడానికి కోరాం: కేటీఆర్
♦ మేం దీనికోసం డిమాండ్ చేసింది వాస్తవమే
♦ ఇప్పుడు తెలంగాణకు జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఉంది
♦ బీజేపీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తోందని వ్యాఖ్య
♦ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలసిన మంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణకు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉన్నందున విమోచన దినోత్సవాన్ని నిర్వహించాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అంశంలో బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని.. విమోచన దినం పేరుతో మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పలు వురు కేంద్ర మంత్రులను కలవడానికి ఢిల్లీకి వచ్చిన కేటీఆర్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని టీఆర్‌ఎస్ కోరిన మాట వాస్తవమేనని చెప్పారు. కానీ, అప్పుడు తెలంగాణ ఉనికి చాటుకోవడానికి ప్రత్యేకంగా ఎలాంటి సందర్భం లేకపోవడం వల్ల విమోచన దినం నిర్వహించాలని డిమాండ్ చేశామన్నారు.
బీజేపీ రాజకీయం చేస్తోంది..
విమోచన దినం విషయంలో బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. విమోచన దినోత్సవం పేరుతో మతాల మధ్య చిచ్చుపెట్టి, ఆ మంటల్లో చలి కాచుకోవడానికి ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ఎప్పటికీ సెక్యులర్ పార్టీ అని.. ఏ కులాన్ని, మతాన్ని కించపరచకుండా అన్ని వర్గాలను కలుపుకొనిపోతుందని పేర్కొన్నారు. తెలంగాణ మాండలికాన్ని ప్రజలు పెద్ద ఎత్తున అనుసరిస్తున్నారని.. తెలంగాణ మాండలికంలో కళాకారులు పెరుగుతున్నారని, సినిమాల్లోనూ వినియోగం పెరిగిందని చెప్పారు. అన్ని మతాల పండుగలను, మహానుభావుల జన్మదినోత్సవాలను ప్రభుత్వం నిర్వíహిస్తోందని తెలిపారు. ఇన్ని రకాలుగా తెలంగాణ ఉనికిని చాటుతున్నప్పుడు విమోచన దినోత్సవాన్ని నిర్వహించాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు.
ఎఫ్‌ఆర్‌బీఎం.. 3.5 శాతానికి పెంచండి
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణ రాష్ట్రానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని 3.5 శాతానికి పెంచాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కేటీఆర్ కోరారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ఎంపీ వినోద్‌లతో కలసి ఆయన జైట్లీతో భేటీ అయ్యారు. తెలం గాణలోని సంక్షేమ కార్యక్రమాలకు రుణాలు తీసుకొనేందుకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు కేటాయించిన ఎయిమ్స్‌కు నిధులు విడుదల చేయాలని, ఐఐఎం కేటాయింపుపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ కేటాయించండి
కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీని కేటాయించాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి జవదేకర్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కేబి నెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటా మని జవదేకర్ హామీ ఇచ్చినట్టు కేటీఆర్ తెలిపారు.
ఆ భూములు అప్పగించండి
హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రోడ్ల విస్తరణ చేపట్టామని, అందుకోసం పలుచోట్ల కేంద్ర హోం శాఖకు చెందిన భూములు అవసరమని కేటీఆర్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించారు. హైదరాబాద్‌లో బేగంపేట్‌లోని రసూల్‌పూరా చౌరస్తాలో ఉన్న కేంద్ర హోంశాఖకు చెందిన రెండున్నర ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. గతంలో కేంద్ర హోంమంత్రి దీనికి అంగీకరించినా కిందిస్థాయి అధికారులు ప్రతిపాదన ను తిరస్కరించారని రాజ్‌నాథ్‌కు వివరించారు.
సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు
హైదరాబాద్‌కు ఇప్పటివరకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని, అందువల్లే గంటకు రెండు సెంటీమీటర్ల వర్షం కురిసినా.. తట్టుకొనే పరిస్థితి లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఆక్రమణకు గురైన నాలాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆ ప్రక్రియలో ఇళ్లు కోల్పోతున్న పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు.
లండన్ డిప్యూటీ మేయర్‌తో కేటీఆర్ భేటీ
ఢిల్లీలో లండన్ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వివరించారు. వచ్చే ఏడాది హైదరాబాద్‌కు రావా లని రాజేశ్ అగర్వాల్‌ను కేటీఆర్ కోరారు.