లేదంటే పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచనోత్సవాలకు రావాలి
నిజాంపై పోరాడిన యోధులను స్మరించుకోవాల్సి రోజిది
కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం
కరీంనగర్‌టౌన్: ‘తెలంగాణ ప్రజా పాలన దేనికోసం? ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు? పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నరు. నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నరు.. అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. కాంగ్రెస్‌కు చేతనైతే విమోచన దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తే తప్పకుండా నేనే హాజరవుతా. వారికి చేతకాకుంటే కేంద్రం పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరు కావా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు.
గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంగళవారం ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్స వం అంటే నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన రోజని, నాడు రజాకార్లు మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన దురాగతాలను మరచిపోలేమని అన్నారు. సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ఆపరేషన్ వల్లే నేడు నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందన్నారు. రజాకార్ల దళం సృష్టించిన పారీ్టయే ఎంఐఎం అని.. ఆ పారీ్టకి భయపడి, ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ విమోచన దినోత్సవం జరపకుండా ప్రజలను వంచిస్తున్నాయని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment