Parade Grounds
-
తెలంగాణ చరిత్రను మరుగుపరిచారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్వాతంత్య్ర దినాన్ని మరుగునపరిచి.. ఈనాటి తరానికి తెలియకుండా పాలకులు తొక్కిపెట్టారని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన 13 నెలల తర్వాత తెలంగాణలో మువ్వన్నెల జెండా ఎగిరిందన్న విషయం తెలియకుండా చేశారంటూ ధ్వజమెత్తారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసిన 1948 సెపె్టంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకున్నా, 2022 నుంచి కేంద్ర ప్రభుత్వమే అధికారిక వేడుకలు జరుపుతుందని చెప్పారు.నిజాంకు వ్యతిరేకంగా ప్రజలు సాగించిన పోరాటం దేశంలోనేకాక ప్రపంచ పోరాటాల్లోనే మహోన్నతమని, అపురూప ఘట్టమన్నారు. భారత సైన్యం ముందు 17 సెపె్టంబర్ 1948లో నిజాం రాజు, సైన్యం, రజాకార్లు లొంగిపోయారన్నారు. ఇంతటి గొప్ప పోరాటచరిత్ర నేటి తరానికి తెలియకుండా తొక్కిపెట్టారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం సెపె్టంబర్ 17న ‘విమోచన’దినోత్సవం అధికారికంగా నిర్వహించలేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం మజ్లిస్‌కు సలాం కొడుతూ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని చెప్పారు.తెలంగాణ ఉద్యమం సమయంలో ‘విమోచన దినోత్సవం’అధికారికంగా నిర్వహించాలని ఆనాటి పాలకులను నిలదీసిన కేసీఆర్ సీఎం అయ్యాక స్వరం మార్చారన్నారు. విమోచన దినంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వక్రభాష్యాలు చెప్పి మోసం చేశాయని తెలిపారు.17 సెపె్టంబర్ను బీఆర్ఎస్ ‘జాతీయ సమైక్య దినం’అనడం, కాంగ్రెస్ ‘ప్రజాపాలన దినోత్సవం’అనడం ముమ్మాటికీ ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టడమేనని చెప్పారు. రజాకార్ల వారసుల కోసమే: బండి సంజయ్ పిడికెడు రజాకార్ల వారసుల కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు. దేశ విచి్ఛన్నకర శక్తులతో అధికార పారీ్టలు అంటకాగే పరిస్థితి తెలంగాణలో ఉండడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి రజాకార్లపై పోరాడిన చరిత్ర ఉందని, అదే రజాకార్ల వారసులను సంతృప్తిపరిచే చర్యలను ప్రభుత్వాలు విడనాడాలని కోరారు.వచ్చే ఏడాది నుంచైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర భద్రతా బలగాలు నిర్వహించిన పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే ప్రదర్శనలు సాగాయి. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించారు. రజాకార్ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డిని కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, సాంస్కృతిక శాఖ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి, సీఐఎస్ఎఫ్ డీజీ ఆర్ఎస్. భాటియా పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయంలో.... బీజేపీ కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దిన వేడుకల్లో భాగంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేసి, అమరవీరులకు నివాళు లర్పించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ...‘ప్రస్తుత సెప్టెంబర్ 17 చాలా ప్రత్యేకమైనది. విశ్వకర్మ జయంతి, వినాయక నిమజ్జన మహోత్సవం, ప్రధాని మోదీ జన్మదినం. అందుకే ఇది చాలా పవిత్రమైన రోజు’అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శానంపూడి సైదిరెడ్డి, బంగారు శ్రుతి, మనోహర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్ పాల్గొన్నారు. -
ఆగస్టు 15 ఎంత ముఖ్యమో సెప్టెంబర్ 17 కూడా అంతే: కిషన్‌రెడ్డి
పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు..తెలంగాణలో సెప్టెంబర్ 17వ తేదీ సందర్బంగా పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది హైదరాబాద్ ముక్తి దివాస్ నిర్వహిస్తాం. తెలంగాణ చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నిజాం చెరిపేసే ప్రయత్నం చేశారు. ఉద్దేశపూర్వకంగా చరిత్రను తొక్కి పెట్టారు. స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు, బలిదానాలు దాచడం దుర్మార్గం. ప్రధాని ఆదేశాలతో 2022 నుంచి వేడుకలు చేస్తున్నాం. భవిష్యత్‌లో కూడా ఇదే వేదికగా తెలంగాణ లిబరేషన్ డే నిర్వహిస్తాం.పనిముట్లనే ఆయుధాలుగా చేసుకొని ప్రజలు నిజాంపై పోరాటం చేశారు. రజాకార్ల ఆగడలతో ఇక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవించారు. నిజాం హయాంలో బలవంతపు మత మార్పిడికి పాల్పడ్డారు. హిందూ మహిళలను బలవంతంగా ఎత్తుకెళ్లి అఘాయిత్యాలు చేశారు. పాకిస్తాన్లో హైదరాబాద్ సంస్థానాన్ని కలపాలని నిజాం భావించాడు. పాకిస్తాన్‌తో చర్చలు కూడా జరిపారు. సర్దార్ పటేల్ నిజాంతో ముందుగా శాంతి చర్చలు జరిపారు. తమ సంస్థానం జోలికి వస్తే హైదరాబాద్‌లో ఉన్న కోటిన్నర హిందువులను చంపేస్తామని ఖాసిం రజ్వీ బెదిరించారు. అందుకే ఆపరేషన్ పోలోతో హైదరాబాదు సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారు. ఈ గడ్డకు స్వాతంత్ర్యం వచ్చిన రోజును జరపకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక విమోచన వేడుకలపై మాట మార్చారు. విమోచన దినోత్సవం జరపకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తున్నాయి. మేము నిర్వహించే ఈ ఉత్సవాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. మనకు వాస్తవ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది. చరిత్ర గాడి తప్పితే భవిష్యత్తు తరాలు ప్రమాదంలో పడతాయి. పథకం ప్రకారం చరిత్రను పక్కదారి పట్టిస్తున్నారు. ఆగస్ట్ 15 ఎంత ముఖ్యమో.. సెప్టెంబర్ 15 కూడా అంతే ముఖ్యం. చరిత్రను పట్టించుకోని పార్టీలను తరిమికొడదాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు సహకరించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేశారు. 👉పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన కిషన్ రెడ్డి.👉తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి👉పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కిషన్ రెడ్డి. 👉నేడు తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా విమోచన దినోత్సవ వేడుకలను స్థానిక బీజేపీ నేతలు నిర్వహించనున్నారు.👉బీజేపీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేసిన కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17వ తేదీ నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజు. వేలాది మంది తెలంగాణ ప్రజలు విరోచిత పోరాటం చేశారు. అనేక బలిదానాలు, అనేక త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చింది. నిజాం రాజాకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో పటేల్ పాత్ర సాహసోపేతమైనది.లిబరేషన్ డే ఉత్సవాలు, విశ్వకర్మ జయంతి ఉత్సవాలు, వినాయక శోభాయాత్ర ఉత్సవాలు, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు.. నేడు నాలుగు ప్రధాన ఘట్టాలు ఒకేసారి రావడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. గత మూడేళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తుందికాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి. తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలి.👉ఇక, ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేసి సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, పారా మిలటరీ, రక్షణ దళాల కవాతు జరుగుతుంది. 𝗛𝗼𝗻𝗼𝗿𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝘂𝗻𝘀𝘂𝗻𝗴 𝗵𝗲𝗿𝗼𝗲𝘀 𝘄𝗵𝗼 𝗳𝗼𝘂𝗴𝗵𝘁 𝗳𝗼𝗿 𝘁𝗵𝗲 𝗹𝗶𝗯𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻 𝗼𝗳 𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱!Join the #HyderabadLiberationDay celebrations tomorrow, 17th September 2024, at Parade Grounds, Secunderabad, from 8:00 AM onwards. pic.twitter.com/9IjbadoyrS— G Kishan Reddy (@kishanreddybjp) September 16, 2024ఇది కూడా చదవండి: తెలంగాణ తల్లికి నేడు పాలాభిషేకాలు: కేటీఆర్ -
చేతనైతే విమోచన ఉత్సవాలు నిర్వహించండి
కరీంనగర్‌టౌన్: ‘తెలంగాణ ప్రజా పాలన దేనికోసం? ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు? పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నరు. నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నరు.. అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. కాంగ్రెస్‌కు చేతనైతే విమోచన దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తే తప్పకుండా నేనే హాజరవుతా. వారికి చేతకాకుంటే కేంద్రం పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరు కావా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సోమవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు.గణేశ్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మంగళవారం ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్స వం అంటే నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన రోజని, నాడు రజాకార్లు మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన దురాగతాలను మరచిపోలేమని అన్నారు. సర్దార్ పటేల్ ఆపరేషన్ పోలో ఆపరేషన్ వల్లే నేడు నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందన్నారు. రజాకార్ల దళం సృష్టించిన పారీ్టయే ఎంఐఎం అని.. ఆ పారీ్టకి భయపడి, ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ విమోచన దినోత్సవం జరపకుండా ప్రజలను వంచిస్తున్నాయని విమర్శించారు. -
నేడు కేంద్రం ఆధ్వర్యంలో ‘విమోచనం’
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది. ఉదయం 7.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన కళాకారుల ప్రదర్శనలు నిర్వహిస్తారు. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ద్వారా ‘సెప్టెంబర్ 17–హైదరాబాద్ విమోచన దినం’ప్రాధాన్యత వివరించేలా సంక్షిప్త ప్రదర్శన ఉంటుంది. ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు పోలీసు బలగాలు, సైనికదళాల పరేడ్ ఉంటుంది. 9 గంటలకు కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, గజేంద్రసింగ్ చౌహాన్, బండి సంజయ్ పరేడ్ గ్రౌండ్స్‌లోని యుద్ధస్మారకం వద్ద నివాళులరి్పస్తారు. ఉదయం 9.15 గంటలకు జి.కిషన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేస్తారు.కేంద్ర మంత్రులు సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తారు. 9.20 గంటలకు కేంద్ర సాయుధ బలగాల నుంచి కిషన్‌రెడ్డి గౌరవవందనం స్వీకరిస్తారు. అనంతరం 700 మందికిపైగా కళాకారులు మంగళవాద్యం, బతుకమ్మ, కొమ్ముకోయ, బోనాలు–పోతరాజు, డప్పులు, కోలాటం, లంబాడీ, గుస్సాడి, ఒగ్గు కథ తదితరాలను ప్రదర్శిస్తారు. చివరగా ‘హైద రాబాద్ విమోచన దినం శకటం ప్రదర్శన ఉంటుంది. 10.10 గంటలకు కేంద్ర సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమా నండూరి స్వాగతోపన్యాసం చేస్తారు. తర్వాత బండి సంజయ్ ప్రసంగిస్తారు. రాష్ట్రం నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన ఆరుగురిని సన్మానిస్తారు. 10.30 గంటలకు కిషన్‌రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం కేంద్ర సమాచార శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జి బిషన్‌ను కేంద్రమంత్రులు తిలకిస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు. -
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనే విమోచన ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా హైదరాబాద్ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. రెండేళ్లక్రితం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో తొలిసారిగా ఈ ఉత్సవాలను కేంద్రం అధికారికంగా నిర్వహించినపుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ వేడుకలకు అమిత్‌షా హాజరవుతారని రాష్ట్ర పార్టీ నేతలు గట్టిగా విశ్వసించారు. అయితే ఈ నెల 17న పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన విమోచన వేడుకలు నిర్వహించనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. గతేడాది కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా చారిత్రక గోల్కొండ కోటలో సైనికదళాల పరేడ్‌తో పాటు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన విషయం విదితమే.ఈ ఏడాది కూడా కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఆయనతో పాటు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం... పారా మిలటరీ దళాలు, సైనిక దళాలు పరేడ్‌ను నిర్వహించనున్నాయి. హైదరాబాద్ సంస్థానం విముక్తి కోసం జరిగిన పోరాటానికి సంబంధించిన చారిత్రక అంశాలతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను కళాకారులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే...17న హైదరాబాద్ విమోచన సందర్భాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడాన్ని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 17న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడాన్ని కేంద్రమంత్రి సంజయ్, బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. 17న రాష్ట్ర ప్రభుత్వమే విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు బీజేపీ శాసనసభాపక్షం సిద్ధమవుతోంది. -
పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఉదయం 9.30 గంటల సమయంలో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు నివాళులు అర్పించారు. 9.55 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. సీఎం రేవంత్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. వివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అధికారిక గేయంగా ఖరారు చేసిన అందెశ్రీ రచన ‘జయ జయహే తెలంగాణ..’సంక్షిప్త రూపాన్ని ఆవిష్కరించారు. ఈ గేయాన్ని వినిపిస్తున్న సమయంలో కవి అందెశ్రీ భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవడం కనిపించింది. కేసీఆర్ కోసం ప్రత్కేకంగా సోఫా..: రాష్ట్ర ఆవి ర్భావ వేడుకలకు రావాలంటూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఆహ్వనం పంపిన విషయం తెలిసిందే. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్ సభలో ముందు వరసలో కేసీఆర్ కోసం ప్రత్యేకంగా సోఫా ఏర్పా టు చేశారు. కేసీఆర్‌కు కేటాయించిన స్థానం అంటూ కాగితంపై రాసి ఉంచారు.సోనియాగాంధీ వీడియో సందేశం వేడుకలకు ముఖ్య అతి థిగా సోనియాగాంధీని సీఎం రేవంత్ ఆహ్వానించినా.. అనివార్య కారణాలతో రాలేకపోయారు. అయితే తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ సోనియా ఒక వీడియో సందేశం పంపారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఎల్రక్టానిక్ తెరలపై ఈ సందేశం వీడియోను ప్రదర్శించారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎందరో అమరవీరుల త్యాగఫలం. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ నివాళులు అర్పిస్తున్నాను.తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి 2004 లో కరీంనగర్ సభలో హామీ ఇచ్చాను. అది సొంత పార్టీలో అసమ్మతి స్వరాలకు కారణమైంది. కొందరు నేతలు మా నిర్ణయంతో విభేదించారు. అయినా మాట నిలబెట్టుకుంటూ తెలంగాణ ఏర్పాటు చేశాం. ఇప్పుడు రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉన్నాం. సీఎం రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ హామీలు నెరవేరుస్తుంది. ప్రజలకు శుభం జరగాలి. జైహింద్.. జై తెలంగాణ’’అని వీడియో సందేశంలో సోనియా పేర్కొన్నారు. -
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)
-
దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ వేడుకలకు సంబంధించిన షెడ్యూల్, ఇతర వివరాలను రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్ హనుమంతరావు శనివారం వెల్లడించారు. దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరగనున్నాయని చెప్పారు. కార్యక్రమాలు ఉదయం 9.30 గంటలకు గన్‌పార్క్ వద్ద మొదలై.. రాత్రి 9 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ముగుస్తాయని తెలిపారు. ట్యాంక్ బండ్‌పై నిర్వహించే వేడుకలకు వచ్చే ప్రజలు సాయంత్రం 5 గంటలోపే చేరుకోవాలని సూచించారు. సర్వాంగ సుందరంగా ట్యాంక్‌బండ్ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల కోసం పరేడ్ గ్రౌండ్స్‌లో, ట్యాంక్‌బండ్‌పై చేస్తున్న ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఇతర నేతలు పరిశీలించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో వేదికలు, హాజరయ్యే వారికోసం సిద్ధం చేస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఇక దశాబ్ది ఉత్సవాల కోసం ట్యాంక్‌బండ్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై జరిగే కార్యక్రమాలను వీక్షించడానికి పలుచోట్ల ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. 80కిపైగా ఫుడ్, వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేశారు.మంచినీటిని అందుబాటులో పెట్టారు. పదేళ్ల తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. నాడు సోనియా గాంధీ ఒక అడుగు వెనక్కి వేసి ఉంటే తెలంగాణ రాకపోయేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ పాత్రను మరవలేమన్నారు. ఇక ప్రత్యేక తెలంగాణ కోసం ప్రపంచం గరి్వంచదగ్గ ఉద్యమం జరిగిందని.. కానీ ఆ ఉద్యమానికి అనుగుణంగా గత పదేళ్లలో పాలన జరగలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ పరిశీలనలో మంత్రుల వెంట ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఉత్సవాల షెడ్యూల్ ఇలా..⇒ ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుంటారు. అమరులకు నివాళులు అర్పిస్తారు. ⇒ 9.55 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు సీఎం చేరుకుంటారు. ⇒ 10.00 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సాయుధ బలగాల కవాతు, గౌరవ వందనం ఉంటాయి. ⇒10.15 నుంచి 10.35 వరకు బలగాల మార్చ్ ఫాస్ట్ ఉంటుంది. ⇒10.35 గంటలకు ‘జయ జయహే తెలంగాణ’రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. ⇒ 10.38 కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరైతే ఆమె తొలుత ప్రసంగిస్తారు. తర్వాత సీఎం రేవంత్ ప్రసంగం ఉంటుంది. సోనియా రాకుంటే నేరుగా సీఎం ప్రసంగిస్తారు. ⇒ 11.08 గంటలకు పోలీసు, ఉత్తమ కాంటింజెంట్ల అవార్డుల ప్రదానం. ⇒11.20కు పరేడ్ ముగింపు కోసం పరేడ్ కమాండర్‌కు అనుమతి ⇒11.25 గంటలకు అవార్డుల స్వీకర్తలతో ఫొటో సెషన్ ⇒11.30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో కార్యక్రమం ముగింపు.సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కార్యక్రమాలివీ..⇒ 6.50 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటారు. ⇒ 7.00 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లను సందర్శిస్తారు ⇒ 7.20 గంటలకు కార్నివాల్ మొదలవుతుంది. ⇒ 7.30 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు.. కళాకారుల నృత్యాలు, ఆటపాటలు ⇒ 8.30కు ఫ్లాగ్ వాక్.. జయ జయహే తెలంగాణ గేయం 13.5 నిమిషాల పూర్తి వెర్షన్ విడుదల. ⇒ 8.44 గంటలకు గేయ రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణికి సన్మానం ⇒ 8.50 గంటలకు ఆకట్టుకునేలా బాణసంచా ⇒ 9.00గంటలకు ట్యాంక్‌బండ్‌పై కార్యక్రమం ముగింపు. -
TG: గవర్నర్‌కు ఆహ్వానం.. సోనియా రాక డౌటే!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు ప్రభుత్వం తరఫున ఆహ్వానం వెళ్లింది. శనివారం ఉదయం రాజ్‌భవన్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ ఆహ్వానం గవర్నర్‌కు అందించారు. జూన్ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. రాజకీయ పార్టీలకు, పలువురు నేతలకు హాజరు కావాలని ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాలు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జూన్ 2న ఉదయం పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ, ఇతర కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళాబృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.సోనియా రాక అనుమానమే!ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి ఆహ్వానం వెళ్లింది. ఢిల్లీ వెళ్లి మరీ సీఎం రేవంత్‌రెడ్డి సోనియాకు ఆహ్వానం అందించారు. ఈలోపు రేపటి వేడుకల కార్యక్రమాల్లోనూ ఆమె ఐదు నిమిషాలు ప్రసంగిస్తారని ఉంది. దీంతో ఆమె రాక ఖరారైందని అంతా అనుకున్నారు. అయితే ఆమె అనారోగ్యం.. పైగా ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ పర్యటన రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకైతే సోనియా కార్యాలయం తెలంగాణ పర్యటనపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
ఉదయం పరేడ్ గ్రౌండ్స్‌లో.. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను జూన్ 2న అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేడుకలను నిర్వహించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 2న జరిగే కార్యక్రమాల షెడ్యూల్ ఇదీ..అమరవీరులకు నివాళులతో మొదలుజూన్ 2న ఉదయం 9.30కు అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత సీఎం జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటాయి.తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ఆవిష్కరి స్తారు. అనంతరం ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు. విశిష్ట సేవలు అందించిన పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్ అనంతరం ఉదయం కార్యక్రమం ముగుస్తుంది.సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వేడుకగా..2న సాయంత్రం ట్యాంక్‌బండ్ మీద వేడుకలు నిర్వహిస్తారు. తెలంగాణకు సంబంధించిన హస్తక ళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30కు సీఎం రేవంత్ ట్యాంక్‌బండ్‌కు చేరుకుని వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. తర్వాత తెలంగాణ కళారూ పాలకు అద్దం పట్టేలా కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేస్తున్న వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్బండ్ఒక చివర నుంచి మరో చివరి వరకు 5 వేల మంది భారీ ఫ్లాగ్‌వాక్ నిర్వహి స్తారు. ఈ ఫ్లాగ్‌వాక్ జరుగుతున్న సమయంలో ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గేయం ఫుల్‌వెర్షన్ (13.30 నిమిషాల)ను విడుదల చేస్తారు. గీత రచయిత, కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిలను సన్మానిస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా సాగే బాణసంచా కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న ఏర్పాట్లుతెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాన వేదికతోపాటు, ముఖ్య అతిథులు, ఆహ్వానితులు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా లాంజ్‌లు సిద్ధం చేస్తున్నారు. వేసవి తీవ్రత నేపథ్యంలో భారీ టెంట్లను, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణసంచా, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్ల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దాదాపు 80 స్టాళ్లను సిద్ధం చేస్తున్నారు. వీటిలో హస్తకళలు, మహిళా బృందాలు తయారు చేసిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ హోటళ్ల స్టాల్స్, చిన్న పిల్లలకు గేమింగ్ షోలు ఉన్నాయి. కార్నివాల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళాబృందాలు ప్రదర్శన ఇవ్వనున్నాయి. -
నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారు: తమిళిసై
Live Updates.. ►ఈరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం ►ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కానున్న సీఎం రేవంత్, మంత్రులు ►హైదరాబాద్ సెక్రటేరియట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. ►జాతీయ పతాకవిష్కరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి. ►రిపబ్లిడ్ డే సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తూ.. ‘తెలంగాణలో గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో నియంతృత్వ ధోరణికి ప్రజలు తమ తీర్పు ద్వారా చరమగీతం పాడారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పు ప్రకటించారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించలేదు. ►పదేళ్ల పాలనలో రాజ్యాంగ విలువలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలు ఈ ప్రజా ప్రభుత్వంలో ఇప్పుడిప్పుడే మళ్లీ పునర్ నిర్మించుకుంటున్నాం. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునరుద్ధరణ చేసుకుంటున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయి. ►ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వవు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలు పెట్టింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. గత ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది’. ►గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థికస్థితి దిగజారింది. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది. వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తాం. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ►సైనికుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ తమిళిసై ►పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై. ►జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు ►నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి. ►హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకల్లో పాల్గొంటారు. ►రిపబ్లిక్ డే వేడుకల కోసం పబ్లిక్ గార్డెన్‌ను అధికారులు సిద్ధం చేశారు. సీఎంతో పాటు మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గవర్నర్ తమిళి సై జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ►శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ సీఎం రేవంత్ చేరుకున్నారు. పరేడ్ గ్రౌండ్లో వీరుల సైనిక్ స్మారక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డికి త్రివిధ దళాలు స్వాగతం పలికాయి. రిపబ్లిక్ డే సందర్భంగా వీరుల సైనిక్ స్మారకం వద్ద యుద్ధ వీరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. -
పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
Hyderabad Kite Festival 2024: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ ఫెస్టివల్ 2024 (ఫొటోలు)
-
పరేడ్ గ్రౌండ్లో మోదీ సభ.. ఈ మార్గాల్లో రాత్రి 8 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున ప్రచారం కోసం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే మాదిగల విశ్వరూప మహాసభకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 9 లేదా 10 శాతానికి పెంచే విషయంపైనా మోదీ ఏదైనా ప్రకటన చేయవచ్చునని ఊహాగానాలు సాగుతు న్నాయి. ప్రధానిమోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో నేడు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ అదనపు (ట్రాఫిక్) పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు తెలిపారు. టివోలి క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజ్ ఎక్స్ రోడ్స్‌ను ఊసివేయనున్నారు. పలు మార్గాల్లో దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. సంబంధిత వార్త: నేడు తెలంగాణకు మోదీ ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. ►పంజాగుట్ట-గ్రీన్‌ల్యాండ్, బేగంపేట నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు, తివోలి ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్ల మధ్య రహదారులు మూసివేస్తారు. ►సికింద్రాబాద్ సంగీత్ కూడలి నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్ వైఎంసీఏ వద్ద క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సీటీఓ, రసూల్‌పురా, బేగంపేట వైపు వెళ్లాలి ►బేగంపేట నుంచి సంగీత్ కూడలికి వచ్చే వాహనాలను సీటీఓ ఎక్స్ రోడ్స్ వద్ద బాలంరాయ్, బ్రూక్‌బాండ్, టివోలి, స్వీకార్ ఉప్కార్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా మళ్లిస్తారు ►బోయినపల్లి, తాడ్‌బండ్ నుంచి టివోలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను బ్రూక్ బాండ్ వద్ద సీటీఓ, రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. ►కార్ఖానా, ఏబీఎస్ నుంచి ఎస్బీహెచ్-ప్యాట్ని వైపు వచ్చే ట్రాఫిక్ స్వీకార్-ఉప్కార్ వద్ద వైఎంసీఏ, క్లాక్ టవర్, ప్యాట్నీ లేదా టివోలి-బ్రూక్‌బాండ్, బాలంరాయ్, సీటీవో వైపు మళ్లిస్తారు. ►ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలకు ఎస్బీహెచ్- స్వీకార్-ఉప్కార్ వైపు అనుమతిలేదు. క్లాక్ టవర్, వైఎంసీఏ లేదా ప్యారడైజ్, సీటీఓ వైపు పంపిస్తారు. ►ఆర్టీఏ కార్యాలయం (తిరుమలగిరి), కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడ నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్ టివోలి వద్ద స్వీకార్-ఉప్కార్, వైఎంసీఏ లేదా బ్రూక్ బాండ్, బాలంరాయ్, సీటీఓ వైపు ప్రయాణించాలి. ►జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి బేగంపేటవైపు వచ్చే వాహనాలను పంజాగుట్ట వద్ద ఖైరతాబాద్, గ్రీన్‌ల్యాండ్ రాజ్‌భవన్ వైపు పంపిస్తారు. -
అమిత్ షాతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ భేటీ
Updates.. ► తెలంగాణలో పార్టీ కార్యవర్గంపై అమిత్ షా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీలో కోఆర్డినేషన్‌పై పలు అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో అమిత్ షా చర్చించినట్లు సమాచారం. అందరినీ కలుపుకుని పోవాలని నాయకులకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. ► కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు బండి సంజయ్‌లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొన్ని రోజుల క్రితం వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు తెలంగాణ నియోజకవర్గాల్లో పర్యటించి సమర్పించిన నివేదికలపై ప్రస్తుతం జరిగిన భేటీలో చర్చించారు. తెలంగాణ నియోజకవర్గాల్లో పార్టీ బలబలాలపై వివిధ రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు గతంలో సంచరించి ఓ నివేదికను రాష్ట్ర అధిష్ఠానానికి సమర్పించిన విషయం తెలిసిందే. ► అమిత్ షా మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట యోధులకు వందనాలు. ఉస్మానియాలో వందేమాతం పేరుతో ఆందోళనలు జరిగాయి. పటేల్ లేకుంటే తెలంగాణకు విమోచనం కలిగేది కాదు. తెలంగాణ ప్రజలపై జనరల్ డయ్యర్ బుల్లెట్ల వర్షం కురిపించారు. రజాకార్ల అరాచకాలకు పరకాల సజీవసాక్ష్యంగా నిలుస్తుంది. పరకాలలో అనేక మంది అమరులయ్యారు. తెలంగాణ చరిత్రను 75ఏళ్ల పాటు వక్రీకరించారు. ► చంద్రయాన్-3 విజయంతో భారత్‌కు అంతర్జాతీయ కీర్తి. డిజిటల్ రంగంలో భారత్ దూసుకుపోతోంది. స్వాతంత్ర్య పోరాటాన్ని కూడా కాంగ్రెస్ వక్రీకరించింది. మోదీ ప్రధాని అయ్యాక ఆ పొరపాటును సవరించాం. ఈరోజు మోదీ పుట్టినరోజు సేవాదివస్గా జరుపుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదు. ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోసమే విమోచన దినోత్సవాన్ని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారు. విమోచనంపై రాజకీయం చేసేవారిని ప్రజలు క్షమించరు. సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవం జరిపించడానికి కారణాలున్నాయి. భవిష్యత్ తరాలకు నాటి పోరాటయోధులను గుర్తుచేయడం, పోరాట యోధులను సన్మానించడమే అని అన్నారు. ► పారామిలటరీ బలగాల గౌరవవందనం స్వీకరించిన అమిత్ షా. ► సర్ధార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించిన అమిత్ షా. ► జాతీయ జెండా ఎగురవేసిన అమిత్ షా. ► వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన అమిత్ షా. ► తెలంగాణ సాయుధ పోరాట వీరులకు అమిత్ షా నివాళులు అర్పించారు. అనంతరం, గౌరవ వందనం స్వీకరించారు. ► కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. ► పరేడ్ గ్రౌండ్ చుట్టూ సీఆర్పీఎఫ్ బలగాలు మోహరించాయి. ► తెలంగాణ బీజేపీ ఆఫీసులో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి.. ఆదివారం ఉదయం పార్టీ ఆఫీసులో జాతీయ జెండాను ఎగురవేశారు. ► ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు రాష్ట్ర విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ.. ప్రతీ ఏడాది పార్టీ ఆఫీసుల్లో వేడుకలను నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నిజాం సైన్యం అనేక మందిని ఊచకోత కోసింది. తెలంగాణకు 13 నెలలు స్వాతంత్ర్యం ఆలస్యంగా వచ్చింది. ఎంతో మంది బలిదానంతో తెలంగాణకు స్వేచ్చ లభించింది. ► తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ► ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసు విభాగం గతానికి భిన్నంగా పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ► ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అటు పరేడ్ గ్రౌండ్, ఇటు పబ్లిక్ గార్డెన్స్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌ను శనివారం నాటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ► ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి. మొత్తమ్మీద దాదాపు 2500 మంది సిబ్బందిని రెండు చోట్ల మోహరిస్తున్నారు. -
నిజాంను ఎదిరించిన యోధుల కుటుంబ సభ్యులకు సన్మానం
రసూల్‌పురా (హైదరాబాద్): నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుల కుటుంబ సభ్యులను తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో సన్మా నిస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న విమోచన దినోత్సవ కార్యక్రమానికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సభ ఏర్పాట్లను కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయడం లేదని, దీంతో ఈ యేడు కూడ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని ఆయన తెలిపారు. కాగా, కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమంపై పోలీసులు, ఒక పార్టీ మీటింగ్ తరహాలో సర్క్యులర్ జారీ చేశారని, దీనిపై వెంటనే క్షమాపణ చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిజాం పాలనలో పోరాటాలు, ప్రజల కష్టాలపై కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పర్చువల్గా ఎగ్జిబిషన్, నిజాం పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన ప్రముఖ పాత్రికేయుడు షోయబుల్లాఖాన్, గిరిజన యోధుడు రామ్‌జీ గోండు పేర్ల మీద పోస్టల్ కవర్ విడుదల చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ విమోచన ఉత్సవాలను జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తే తమ నాయకులను, కార్యకర్తలను కొట్టి జైల్లో వేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఎప్పుడూ విమోచన వేడుకలు నిర్వహించలేదని, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రజాకార్ల వారసుల పార్టీతో కలసి చరిత్రను తెలియనివ్వలేదని విమర్శించారు. బీజేపీలోకి ప్రత్తిపాటి లక్ష్మీనారాయణ సాక్షి, హైదరాబాద్: సీనియర్ కాంగ్రెస్‌నేత ప్రత్తిపాటి లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. శనివారం బీజేపీ కార్యాల యంలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా.కె.లక్ష్మణ్ సమక్షంలో ఆయన కాషాయతీర్థం పుచ్చుకున్నారు. లక్ష్మీనారా యణకు కండువా కప్పి లక్ష్మణ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ఆ యన కాంగ్రెస్ పార్టీలో జాతీయ, రాష్ట్రస్థాయిల్లో వివిధ హోదాల్లో పని చేశారు. -
కొనసాగిన ఎస్సై దేహదారుఢ్య పరీక్షలు
ఏలూరుని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఎస్సై అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. మొత్తం 538 మంది మహిళా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 260 మంది మాత్రమే హాజరయ్యారు. వీరికి ఫిజికల్ ఎఫీషియెన్సీ పరీక్షల్లో భాగంగా 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ తదితర పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 4,581 మంది పురుష అభ్యర్థులు హాజరు కాగా, 3,233 మంది, 1177 మంది మహిళ అభ్యర్థులు హాజరు కాగా, 607 మంది అర్హత సాధించారని చెప్పారు. పరీక్షలను ఎస్పీ డి.మేరి ప్రశాంతి, ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు పరిశీలించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
ఎల్బీ స్టేడియం లేదా ఓఆర్ఆర్ సమీపంలో
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నిర్వహణకు ఈ నెల 17న పరేడ్‌గ్రౌండ్స్‌లో అనుమతి లభించదనే అంచనాలతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయా లను పరిశీలిస్తోంది. పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహణకు అనుమతివ్వాలని ఈనెల 2వ తేదీనే దరఖాస్తు చేసినప్పటికీ బీజేపీ నేతలు అమిత్‌షా సభ పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఎల్బీ స్టేడియం లేదంటే ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) పరి సరాల్లోని ఖాళీ స్థలం ఎంచుకుని అక్కడ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోనియాగాంధీ చేత ఐదు గ్యారంటీ కార్డు స్కీంలను ప్రకటించాలనే వ్యూహంతో పరేడ్‌గ్రౌండ్స్‌లో సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కానీ, అక్కడ ఇప్పటివరకు అనుమతి లభించని కారణంగా మరో స్థలం వెతికే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డారు. సభ ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీడబ్ల్యూసీకి సిద్ధం మరోవైపు, ఈనెల 16,17 తేదీల్లో హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకోసం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి పార్టీ నేతలకు దిశానిర్దేశం కూడా చేసింది. ఈ సమావేశాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కూడా టీపీసీసీ నిర్ణయించింది. గతంలో తిరుపతిలో నిర్వహించిన ప్లీనరీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సీడబ్ల్యూసీ సమావేశాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు గాను పకడ్బందీగా ముందుకెళుతోంది. ఇందుకోసం మంగళవారం సాయంత్రం గాంధీభవన్‌లో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇన్చార్జి ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్, రాష్ట్ర నాయకులు మధుయాష్కీ, మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. కాగా, ఈ సమావేశాల నిర్వహణపై సమీక్ష నిర్వహించేందుకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై సీడబ్ల్యూసీ సమావేశాల నిర్వహణకు సర్వం సిద్ధం చేయనున్నారు. నేడు కీలక భేటీ ఇక, టికెట్ల ఖరారులో భాగంగా రాష్ట్రస్థాయిలో జరిగే కసరత్తుకు నేడు తెరపడనుంది. బుధవారం గాంధీభవన్ వేదికగా పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ మురళీధరన్‌తో పాటు సభ్యులు సిద్ధిఖీ, మేవానీ, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు హాజరు కానున్నారు. వీరంతా సమావేశమై పీఈసీ సమావేశంలో వచ్చిన నివేదికలను పరిశీలించి రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన అభ్యర్థుల తుది జాబితాను ఢిల్లీకి పంపనున్నారు. అయితే, స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసిన వెంటనే ఈ జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ)కి ఈనెల 7వ తేదీనే పంపనున్నట్టు తెలుస్తోంది. అనంతరం సీఈసీ సమావేశమై అధికారికంగా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనుంది. మొత్తంమీద గత 20 రోజులుగా పార్టీ అభ్యర్థిత్వాల కోసం జరుగుతున్న కాంగ్రెస్ కసరత్తు బుధవారం నాటితో రాష్ట్ర స్థాయిలో ముగియనుంది. మరోవైపు బీసీ డిక్లరేషన్ కమిటీ సమావేశం కూడా నేడు జరగనుంది. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్‌లో జరగనున్న ఈ సమా వేశంలో బీసీ డిక్లరేషన్‌లో పొందుపర్చాల్సిన హామీలను ఖరారు చేయనున్నారు. -
17న పరేడ్ గ్రౌండ్స్‌లోవిమోచన దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని రాష్ట్రంలో జరుపుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత సర్కార్‌తో పాటు గత ప్రభుత్వాలు విమోచన దినోత్స వాలు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి.. మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకు ఈ కార్యక్రమాన్ని విస్మరించాయని విమర్శించారు. అయితే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గతేడాది సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా విమోచన ఉత్సవాలు నిర్వహించామని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజర య్యారని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా పరేడ్ గ్రౌండ్స్‌లోనే కేంద్రం తరఫున ఈ కార్యక్రమా లు నిర్వహించనున్నట్టు తెలిపారు. మంగళవారం ఆయన ‘మేరీ మాటీ మేరా దేశ్’లో భాగంగా ‘మనమట్టికి నమస్సు లు, మన వీరులకు వందనం’ నినాదంతో స్వాతంత్య్ర సమరయోధులు, దేశం కోసం త్యాగాలు చేసిన వారి స్మరణకు చేపడుతున్న ప్రత్యేక కార్యక్రమా లను గురించి వివరించారు. దేశవ్యాప్తంగా ప్రజలను మరోసారి ఏకతాటి పైకి తెచ్చేందుకు ‘నేను పుట్టిన నేల, నన్ను కన్న దేశం’ పేరుతో సెప్టెంబర్ 1న కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. గ్రామస్తులంతా ఇంటినుంచి పిడి కెడు మట్టి కానీ, పిడికెడు బియ్యాన్ని కానీ కలశంలో సేకరించేలా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. 7,500 కలశాల ద్వారా ఢిల్లీకి మట్టి ఈ నెలలో అన్ని గ్రామాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి, మండల కేంద్రాల్లో దాన్ని గౌరవించి, తర్వాత జిల్లా కేంద్రానికి, అక్కడి నుంచి రాష్ట్ర రాజధానికి చేర్చడం జరుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. చివర్లో ఢిల్లీలోని అమృత్ పార్క్ (అమృత వనం)లో 75 వేల మొక్కలు నాటి సుమారు 7,500 కలశాల ద్వారా తెచ్చిన మట్టిని కర్తవ్యపథ్‌లోని వార్ మెమోరియల్ పక్కనున్న స్థలంలో పెడతామని, అక్కడ అమరవీరుల స్మారక వనాన్ని ఏర్పాటు చేస్తామని కిషన్‌రెడ్డి వివరించారు. భూములు లాక్కొనేందుకే ధరణి ఇబ్రహీంపట్నం రూరల్: రైతులు, అమాయకుల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు భూములు లాక్కొనేందుకే ధరణి ఉపయోగపడుతోందని, దీనివల్ల రైతులకు ఒరిగిందేమీ లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలో మంగళవారం నిర్వహించిన బీజేపీ రైతు మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణి.. బీఆర్ఎస్కు భరణిగా మారిందని ఎద్దేవా చేశారు. రైతును రాజును చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న 7 వేల మంది రైతుల కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సమావేశంలో కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు శంభూజీ కుమార్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సెప్టెంబరు 17న పెరేడ్ గ్రౌండ్ లో సభ కోసం టీకాంగ్రెస్ సన్నాహాలు
-
Yoga Mahotsav: హైదరాబాద్‌లో గ్రాండ్‌గా యోగా మహోత్సవ్ (ఫొటోలు)
-
పరేడ్ గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవ్
రసూల్‌పురా(హైదరాబాద్): భారతీయ వారసత్వ సంపద యోగా అని.. ఇస్లామిక్, క్రిస్టియన్ అనే భేదాలు, భాషలు, ప్రాంతాల తేడా లేకుండా ప్రపంచమంతా యోగాను అనుసరిస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ప్రపంచ యోగా దినోత్సవమైన జూన్ 21కి 25 రోజుల కౌంట్‌డౌన్‌గా శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో యోగా మహోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా నేతృత్వంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం కేంద్ర ఆయుష్ మంత్రి శర్వానంద సోనోవాల్, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి ముంజ్‌పరా మహేంద్రభాయ్ కాళూభాయ్లతో కలసి కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ యోగా మహోత్సవ్‌కు గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హజరవుతున్నారని కిషన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని కూడా ఆహా్వనించామని చెప్పారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ప్రపంచ యోగా దినోత్సవానికి కౌంట్‌డౌన్‌గా యోగా మహోత్సవ్లు నిర్వహిస్తున్నామని వివరించారు. 75 రోజు ల కౌంట్‌డౌన్‌ను అసోంలో, 50 రోజుల కౌంట్‌డౌన్ జైపూర్‌లో నిర్వహించామని చెప్పారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే యోగా మహోత్సవ్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, కళాకారులు, వేలమంది యోగా గురువులు, సినీ ఆరి్టస్టులు, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా దాకా: సోనోవాల్ ఈసారి ప్రపంచ యోగా దినోత్సవ నినాదం ‘వసుదైక కుటుంబం కోసం యోగా’అని కేంద్ర మంత్రి శర్వానంద సోనోవాల్ తెలిపారు. ప్రధాని మోదీ కృషి కారణంగా ప్రపంచం మొత్తం యోగాను సంపూర్ణ ఆరోగ్యానికి మార్గదర్శిగా అంగీకరించిందని చెప్పారు. మూడు శాఖల సాయంతో ఓడరేవుల్లో నౌకలతో ‘ఓషన్ రింగ్ ఆఫ్ యోగా’ను నిర్వహించనున్నామని.. ఆర్కిటిక్ నుంచి అంటార్కిటికా వరకు ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రాంతాల్లో ఈ యోగా ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. ఆర్కిటిక్‌లోని స్వా ల్బార్డ్ భారత పరిశోధన స్థావరం, హిమాద్రి, అంటార్కిటికాలోని మూడో భారత పరిశోధన స్థావరం, ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఫ్లైట్ డెక్‌లపై యోగా ప్రదర్శన ఉంటుందన్నారు. -
కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ప్రధాని మోదీ చురకలు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అనంతరం, పరేడ్ గ్రౌండ్స్‌లో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ.. రిమోట్ ద్వారా శంకుస్థాపనలు చేశారు. ఐదు జాతీయ రహదారులకు, బీబీనగర్ ఎయిమ్స్ అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే, మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులను మోదీ ప్రారంభించారు. రూ.11,355 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇక, జెండా ఊపి.. ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించారు. అనంతరం, బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రియమైన సోదర సోదరీమణులరా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యమవుతున్నాయన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలిగించవద్దని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో, తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. మేం అభివృద్ధి చేస్తుంటే సొంత పనుల కోసం, కుటుంబ లాభం కోసం కొంత మంది ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడంలేదు. స్వార్థ ప్రయోజనాల కోసమే కొందరి ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవినీతి, కుటుంబ పాలన రెండూ ఒక్కటే. తెలంగాణలో కొందరి గుప్పిట్లోనే అధికారం మగ్గుతోంది. తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతి పెరిగింది. ప్రతీ వ్యవస్థలో పెత్తనం చలాయించాలని వారి ప్రయత్నం జరుగుతోంది. కొందురు వారి స్వలాభం మాత్రమే చూసుకుంటున్నారు. అవినీతపరులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందే. అవినీతిని ముక్తకంఠంతో ఖండించాలి. ఎంతపెద్దవారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. చట్టపరమైన సంస్థల పనిని అడ్డుకోవద్దు. విచారణ సంస్థలను బెదిరిస్తున్నారు. కొంత మంది అవినీతిపరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు వాళ్లకు షాక్ ఇచ్చింది. కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలి. నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి. తెలంగాణలో ప్రజావ్యతిరేకత మొదలైంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక, అంతుకుముందు.. తెలంగాణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామన్నారు. తెలంగాణ ఏర్పాటులో ప్రతీఒక్కరూ భాగస్వాములయ్యారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి తిరుమల వెంకన్న వరకు ట్రైన్ వేశామన్నారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా చేయాలన్నది కేంద్రానికి తెలుసు. రూ.11వేల కోట్లకుపైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం. ఏపీ-తెలంగాణను కలుపుతూ మరో వందేభారత్ రైలును ప్రారంభించాం. సబ్కా సాత్, సబ్కా వికాస్ నినాదంతో మందుకెళ్తున్నాం. హైదరాబాద్‌లో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరించాం. ఎంఎంటీఎస్ విస్తరణ కోసం రూ.600 కోట్లు కేటాయించాం. తెలంగాణను అభివృద్ధి చేసే అవకాశం నాకు దక్కింది. రైల్వేల్లో తెలంగాణకు భారీగా నిధులు కేటాయించాం. తెలంగాణలోనూ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణలో హైవే నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాం. తెలంగాణలో 4 హైవేలైన్లకు శంకుస్థాపన చేశాం. రాష్ట్రంలో 5వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. తొమ్మిదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ముందంజలో ఉన్నాం. ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా భారత్‌లో స్థిరంగా అభివృద్ధి జరుగుతోంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాం. ఇదే సమయంలో గత ప్రభుత్వాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థులు, రైతులు, చిరు వ్యాపారులకు నేరుగా నగదు జమ కోసం డిజిటల్ పేమెంట్ వ్యవస్థను ప్రోత్సహించాం. గతంలో ఇది ఎందుకు నిర్వహించలేదు? అని ప్రశ్నించారు. -
‘కేసీఆర్ సహకరించకపోవడం వల్లే ఎంఎంటీఎస్ బడ్జెట్ పెరిగింది’
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో ఉన్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించారు. అనంతరం, పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రులు, స్థానిక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో 13 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తే అందులో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు బహుమతిగా ఇచ్చారు. రూ.714 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే ఎంఎంటీఎస్ బడ్జెట్ పెరిగింది. రాష్ట్ర సహకారం లేకున్నా వందే భారత్ రైలును ప్రారంభించాం. రూ, 7864 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి జరిగిందన్నారు. తెలంగాఆణలో జాతీయ రహదారులకు రూ. 1.04 లక్షల కోట్లు కేటాయించినట్టు తెలిపారు. తెలంగాణలో 33 జిల్లాల్లో 32 జిల్లాలకు కేంద్రం జాతీయ రహదారులతో అనుసంధానం చేసిందన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రపంచస్థాయిలో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి కేంద్రం సంకల్పించింది. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలి. భూసేకరణకు ప్రభుత్వం ముందుకు రావాలి. తొమ్మిదేళ్లలో ప్రధాని మోదీ రైల్వేను సమూలంగా మార్చారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్‌ల కోసం రూ.4400 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. -
ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం!
సాక్షి, హైదరాబాద్: ఉప్పు, నిప్పుల ఉన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీల వ్యవహారం మరోసారి తెరమీదకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8న హైదరాబాద్‌లో పర్యటించడమే ఇందుకు కారణం. మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కొంతకాలం నుంచి ప్రధాని మోదీ పాల్గొంటున్న ఏ ప్రభుత్వ, ఇతర కార్యక్రమాల్లోనూ సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. ఇంతకుముందు పలుమార్లు మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినా.. స్వాగతం పలకడానికి సీఎం వెళ్లలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులనే పంపారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ సభకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పటిలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, జీఎస్టీ నిధుల నిధుల విడుదల, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తదితర విషయాల్లో కేంద్రం చూపుతున్న మొండి వైఖరికి నిరసనగా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణపై వివక్ష చూపుతున్న ప్రధానితో ఒకే వేదికను పంచుకోవడం ఇష్టం లేక కేసీఆర్ మోదీ పర్యటను హాజరుకావడం లేదని సమాచారం. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 8న తెలంగాణలో పర్యటించనున్నారు. తొలుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన ప్రారంభించనున్నారు. ఎమ్‌టీఎస్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా 13 ఎమ్ఎమ్టీఎస్ రైళ్లను ప్రారంభించనున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్ సభలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు నిరసనగా.. మరోవైపు ప్రధాని రాష్ట్ర పర్యటన రోజే బీఆర్ఎస మహా ధర్నాలు చేపట్టనుంది. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ధర్నాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. సింగరేణి బొగ్గు బావుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడె, రామగండంలో మహా ధర్నాలు చేపట్టనుంది. సీఎంకు 7 నిమిషాలు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ప్రధాని పాల్గొననున్నవి కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కావడంతో ప్రోటోకాల్ ప్రకారం సీఎం, ఇతర ప్రముఖులకు హోదాల ప్రకారం ఆహ్వానించారు. పరేడ్‌గ్రౌండ్స్ సభలో కేసీఆర్ ప్రసంగానికి ఏడు నిమిషాల సమయాన్ని కేటాయించారు శనివారం మోదీ షెడ్యూల్ ఇదీ.. ► ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు రాక ► 11.45కు రోడ్డు మార్గాన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్రధాని.. ► 11.45 నుంచి 12 గంటల దాకా అక్కడే కార్యక్రమాలు. సికింద్రాబాద్–తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం ► మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకోనున్న మోదీ ► 12.20 నుంచి 12.30 గంటల వరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు ► 12.30 నుంచి 12.37 గంటల దాకా సీఎం కేసీఆర్ ప్రసంగం ► 12.37 నుంచి 12.50 గంటల వరకు ఎంఎంటీఎస్ ఫేజ్–2తోపాటు పలు రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ► మధ్యాహ్నం 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం ► 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్న ప్రధాని. ఇక ప్రధాని రాష్ట్ర పర్యటన కేవలం రెండు గంటల్లోనే ముగియనుంది. శనివారం ఉదయం 11.30కు హైదరాబాద్‌కు చేరుకోనున్న మోదీ.. 1.30 గంటల సమయంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. -
Republic Day Celebrations: కేసీఆర్ ప్రభుత్వంపై గవర్నర్ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది. కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వైరం చేరింది. కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్ అంటే చిన్నచూపు అని, కనీస మర్యాద ఇవ్వకుండా అవమానపరుస్తారని సందర్భం వచ్చినప్పుడల్లా సీఎంపై తమిళిసై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి రాష్ట్ర ప్రభుత్వంపై తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజ్‌భవన్‌లోనే జరుపుకోవాలన్న ప్రభుత్వ లేఖపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది పరేడ్ గ్రౌండ్లో వేడుకలు జరపకపోవడం బాధాకరమని వాపోయారు. రాష్ట్రంలో గణతంత్ర వేడుకలను నిర్వహించకపోవడంపై గవర్నర్ తమిళిసై కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన్నట్లుగా సమాచారం. హైకోర్టులో పిటిషన్ మరోవైపు తెలంగాణలో రిపబ్లిక్ వేడుకలపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం దిక్కరించడంపై పిటిషన్ దాఖలు చేశారు. వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మాధవి ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం 2.30 నిమిషాలకు విచారించనుంది. గవర్నర్‌కు లేఖ తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకి లేఖ రాసింది. అనివార్య కారణాలతో పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ వేడుకలు జరపలేమని తెలిపింది. రాజ్‌భవన్‌లోనే వేడుకలు నిర్వహించాలని లేఖలో ప్రభుత్వం పేర్కొంది. -
పండుగొచ్చె.. భాగ్యనగరంలో పతంగుల సందడి
-
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హైదరాబాద్ పర్యటన (ఫొటోలు)
-
అమిత్ షా.. అభినవ సర్దార్ పటేల్: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు అని పేర్కొన్నారు బీజేపీ సీనియర్ నేత, ఎంపీ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరిగిన తెలంగాణ విమోచన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు బలైపోయారు. అప్పుడు.. హైదరాబాద్‌లో తొలిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జెండా ఎగరేశారు. మళ్లీ 74 ఏళ్ల తర్వా త మళ్లీ అమిత్ షా వచ్చి త్రివర్ణ పతాకం ఎగరేశారు. అమిత్ షా అభినవ సర్దార్ పటేల్ అని అభివర్ణించారు కిషన్ రెడ్డి. పాతికేళ్లుగా ఈ వేడుకలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు.. బీజేపీ పోరాటంతోనే విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం అని కిషన్‌రెడ్డి ప్రకటించుకున్నారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజన్న ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వం తూతూమంత్రంగా వేడుకలు జరుపుతోందని మండిపడ్డారు. అసలు ఇన్నిరోజులు ఎందుకు నిర్వహించలేదని కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించారాయన. సెప్టెంబర్ 17 సందర్భంగా.. కేంద్రం ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా విమోచన వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. పరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా.. జాతీయ జెండా ఎగరేసి, అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. ఇదీ చదవండి: విలీన విషయంలో వివాదాలు వద్దు-వెంకయ్యనాయుడు -
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. కాగా, పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ తలపెట్టిన తెలంగాణ విమోచన వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపం, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అమిత్ షా నివాళులు అర్పించారు. అలాగే, పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర పారామిలటరీ బలగాలు(12 బృందాలతో) పరేడ్ నిర్వహించాయి. ఈ సందర్బంగా అమిత్ షా కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించారు. విమోచన దినోత్సవ వేడుకలకు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే హాజరయ్యారు. అలాగే, ఈ వేడుకల్లో భాగంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకకు చెందిన 1500 మంది కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. Union Home Minister #AmitShah hoisted #NationalFlag at Parade ground in #Secunderabad during the celebrations of #BJP Central govt's #HyderabadLiberationDay Vs#TelanganaJateeyaSamaikyataVajrotsavalu#TelanganaNationalIntegrationDay of #TRS govt. #Hyderabad #TelanganaPolitics pic.twitter.com/AxFJ5Big0B — Surya Reddy (@jsuryareddy) September 17, 2022 -
16న హైదరాబాద్‌కు అమిత్‌షా
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో బీజేపీ అగ్రనేత, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన 16న సాయంత్రం నగరానికి చేరుకుంటారు. 17న ఉదయం పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, కేంద్ర హోంశాఖ పరిధిలోని వివిధ బలగాల సైనిక వందనాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించిన వివిధ జిల్లాల నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై రాష్ట్రంలో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. హైదరాబాద్ సంస్థానం, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన యోధులు లేదా వారి కుటుంబసభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ జన్మదినం కూడా కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే సేవా కార్యక్రమాల్లో అమిత్‌షా పాల్గొంటారు. ఇందులో భాగంగా వికలాంగులు, ఇతర వర్గాలకు ఉపయోగపడే అంబులెన్స్‌ల అందజేత, దివ్యాంగులకు మోటార్‌సైకిళ్లు, ట్రైసైకిళ్ల పంపిణీ, వివిధ హాస్టళ్లవారికి మరుగుదొడ్లను శుభ్రం చేసే ప్రత్యేక పరికరాలు, యంత్రాలు (బోస్చ్)అందజేస్తారు. రేపు స్కూటర్ ర్యాలీలో పాల్గొననున్న కిషన్‌రెడ్డి తెలంగాణ విమోచన ఉత్సవాల్లో భాగంగా ఈనెల 15న బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోటార్/స్కూటర్ ర్యాలీలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పాల్గొంటారు. గురువారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ.. నేరుగా పరేడ్‌గ్రౌండ్స్‌కు, అక్కడినుంచి అసెంబ్లీ ఎదుటనున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు సాగుతుంది. -
తెలంగాణ విమోచన దినోత్సవాలు.. సీఎం కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం
సాక్షి,హైదరాబాద్: సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్‌ను గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా రావాలని ఆహ్వానించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఈ కార్యక్రమానికి వస్తున్నారని కిషన్ రెడ్డి వివరించారు. ఏడాది పాటు రాష్ట్రమంతా తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలని, ఇందులో కేంద్ర ప్రభుత్వం సైతం భాగస్వామ్యం అవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తోతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే , కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మైకి సైతం ఆహ్వానం పంపుతున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ విమోచనం తర్వాత కొన్ని జిల్లాలు కర్ణాటక, మహారాష్ట్రలో కలిశాయని, అందుకే మూడు రాష్ట్రాలకు దీనితో సంబంధం ఉందని వివరించారు. సెప్టెంబర్ 17.. నిజాం నవాబు నుంచి తెలంగాణ స్వాతంత్య్రం పొందిన రోజు. ఇప్పుడదే రోజున రాష్ట్రంలో హైవోల్టేజీ రాజకీయానికి రంగం సిద్ధమవుతోంది. టీఆర్ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు ఈ నెల 17న ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి పోటీ పడుతున్నాయి. ఆ రోజు నాటికి తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమై 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ ఏట అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని.. ఆ రోజు నుంచి ఏడాది పాటు తెలంగాణ విలీన వజ్రోత్సవాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చదవండి: స్టేట్.. సెంటర్.. సెప్టెంబర్ 17.. తెలంగాణలో హైవోల్టేజీ పాలిటిక్స్ -
కేంద్రం కీలక నిర్ణయం.. అధికారికంగా ‘విమోచన’ ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 17న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాలు, హోంశాఖల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ ఉత్సవాల్లో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితోపాటు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై పాల్గొననున్నారు. ఈ ఉత్సవాలను హైదరాబాద్ స్టేట్ విలీన దినోత్సవంగా కాకుండా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ శాఖలు భావిస్తున్నట్లు సమాచారం. పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర హోంశాఖ పరిధిలోని ఏడు సాయుధ దళాలతో నిర్వహించే సైనిక కవాతు సందర్భంగా అమిత్ షా సైనిక వందనం స్వీకరించనున్నారు. సైనిక కవాతుతోపాటు కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గతంలో హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉన్న వివిధ ప్రాంతాలు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలలో విలీనమైన విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో కేంద్ర సాంస్కృతికశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోనూ...: ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ తరహాలో ఈ నెల 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 దాకా (హైదరాబాద్ స్టేట్ విలీనమై 75 ఏళ్లు పూర్తయ్యే దాకా) ఏడాదిపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నైజాం విముక్త స్వతంత్ర ఉత్సవాల పేరిట చేపట్టాలని రాష్ట్ర స్వయం సేవక్‌సంఘ్ (ఆరెస్సెస్) నిర్ణయించింది. రాజకీయరంగు లేకుండా నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఆనాటి నియంతృత్వ పాలనను ఎత్తిచూపేలా వివిధ కార్యక్రమాలను చేపట్టాలని భావిస్తున్నారు. ఏడాదిపాటు వీటి నిర్వహణకు ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఇతర భావసారూప్య శక్తులు, వ్యక్తులతో ఒక సమన్వయ కమిటీ ద్వారా చేపట్టనున్నట్లు సమాచారం. ఈ సమితికి గౌరవాధ్యక్షుడిగా జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, అధ్యక్షుడిగా డా. వంశతిలక్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమితి లక్ష్యాలు, ఆలోచనలు, చేపట్టబోయే కార్యక్రమాలను శనివారం ప్రకటించనున్నారు. చదవండి: ఏడాది పొడవునా తెలంగాణ విలీన వజ్రోత్సవాలు! -
Hyderabad: పరేడ్ గ్రౌండ్లో విజయ సంకల్ప సభ(ఫోటోలు)
-
తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్‌ను నిర్మిస్తాం: ప్రధాని మోదీ
BJP Vijaya Sankalpa Sabha Live Updates: బీజేపీ కార్యవర్గ సమావేశాలు ముగిసిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సభా వేదికపైకి చేరుకోగానే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మోదీ భుజం తట్టి అభినందించారు. బీజేపీ శ్రేణులతో పరేడ్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బీజేపీని ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఈ సభకు వచ్చారనిపిస్తోంది. మీరు నాపట్ల చూపిన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. హైదరాబాద్‌కు ప్రతిభకు పట్టం కడుతుంది. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తి తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ. భద్రాచలంలో శ్రీరాముడు, యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి జోగులాంబ అమ్మవారు, వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉన్నాయి. కాకతీయులు వీరత్వం, శిల్పకళా సౌందర్యం ఎంతో గొప్పది. ఇక్కడి సాహిత్యకారుల కృషి దేశానికే గర్వకారణం. తెలంగాణలో కలలు, నైపుణ్యం ఎంతో మెండుగా ఉన్నాయి. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తిని ఇస్తోంది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరిస్తోంది. బలహీన వర్గాల కోసం బీజేపీ బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోంది. సబ్ కా సాథ్, సబ్కా వికాస్ కోసం పనిచేస్తున్నాం. కరోనా కాలంలో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాం. బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం మరింత పెరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోంది. గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశాం. దశాబ్దాల నుంచి వంచనకు గురైన వాళ్ల అభివృద్ధి కోసం పనిచేశాం. కరోనా సమయంలో తెలంగాణకు ఎంతో చేశాం 2019 ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్దతు పలికారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగిరింది. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజల కోసం చాలా పనిచేశాం. ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందించాం. తెలంగాణ ప్రజల్లో బీజేపీ నమ్మకం పెరుగుతోంది. హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ఎంతో ప్రయత్నిస్తున్నాం. బయోమెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. తెలుగులో టెక్నాలజీ, మెడికల్ చదువులు ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచించండి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాం. తెలంగాణ నుంచి భారీగా ధాన్యం కొనుగోలు చేశాం. గత ఆరేళ్లో లక్ష కోట్ల విలువచేసే ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది. రైతులకు అండగా నిలిచేందుకు మద్దతు ధర పెంచాం. రాష్ట్రంలో జాతీయ రహదారులకు భారీగా నిధులు కేటాయించాం. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లను నిర్మించాం. తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్‌ను నిర్మిస్తాం. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడితే మరింత అభివృద్ధి సాధిస్తుంది అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఓటమి ఖాయం: జేపీ నడ్డా ►తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఓటమి ఖాయమని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ‘‘తెలంగాణ 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిపోయింది. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ సర్కార్‌కు కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. పేదలను ఆదుకున్న దేవుడు మోదీ: బండి సంజయ్ ►ప్రధానిపై టీఆర్ఎస్ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. పేదలకు ఉచితంగా అన్నం పెట్టినందుకు తిడుతున్నారా?. దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించినందుకు తిడుతున్నారా?. ఉక్రెయిన్ యుద్ధాని ఆపి తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కాపాడినందుకు తిట్టాలా?. అంటూ ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడిపోయినా మోదీని ఘనంగా స్వాగతిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం.. ►సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. విజయ సంకల్ప సభ వేదికపైకి ప్రధాని చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని ప్రసంగించనున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలు ప్రసంగిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్‌కు ప్రధాని మోదీ.. కాసేపట్లో ప్రసంగం ►సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. కాసేపట్లో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ ►ప్రధాని మోదీ బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి పరేడ్ గ్రౌండ్స్‌కు ప్రధాని చేరుకోనున్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించనున్నారు. ►ప్రధాని మోదీ పరేడ్ గ్రౌండ్స్‌కు బయలుదేరారు. కాసేపట్లో బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన ప్రసంగించనున్నారు. గెలిచేది మేమే.. అమిత్ షా ►ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అమిత్ షా అన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా.. తర్వాత ఎన్నికలు వచ్చినా గెలిచేది మేమే అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ బలం ఏంటో చూపించాం: సీఎం యోగి ఆదిత్యనాథ్ ►గడిచిన రెండు రోజులుగా మేమంతా భాగ్యనగర్‌లో ఉన్నామని.. భవిష్యత్ గురించి మేము ఎన్నో ఆలోచనలు చేశామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ బీజేపీ కార్యకర్తల ఉత్సాహం తమకు స్ఫూర్తినిస్తోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బలం ఏంటో చూపించామని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. బీజేపీ ముందు టీఆర్ఎస్ ఒక బుడ్డ పార్టీ ►బీజేపీ ముందు టీఆర్ఎస్ ఒక బుడ్డ పార్టీ అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ, ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదని ప్రధాని చెప్పారన్నారు. -
హైదరాబాద్: మెట్రో ప్రయాణికులకు శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంటి నుంచి మెట్రో స్టేషన్‌కు, మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి చేరుకునేందుకు మెట్రో రైడ్ పేరుతో ఈ– ఆటో సేవలు ప్రారంభమయ్యాయి. గురువారం పరేడ్‌గ్రౌండ్ స్టేషన్ పార్కింగ్‌లో హెచ్ఎం ఆర్ఎల్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో రైల్ సీఈవో ఎండీ కేవీబీ రెడ్డి, మెట్రోరైడ్ కో–ఫౌండర్ గిరిష్ నాగ్‌పాల్, షెల్ ఫౌండేషన్ ప్రతినిధి తహసీన్ ఆలమ్, డబ్ల్యూ ఆర్ ఐ ఇండియా డైరెక్టర్ పవన్ ములుకుట్లలతో కలిసి ఈ– ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో స్టేషన్ చేరుకోవాలంటే ప్రైవేటు ఆటోల కంటే మెట్రో ఆటోల్లో చార్జీలు తక్కువ అని అన్నారు. మొదటి కిలోమీటర్‌కు పది రూపాయలు తర్వాత ప్రతి కిలో మీటరుకు ఆరు రూపాయల చొప్పున చార్జీలు ఉంటాయని చెప్పారు. ఆటోను బుక్ చేసుకునేందుకు మెట్రోరైడ్ ఇండియా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. పరేడ్ గ్రౌండ్స్, రాయదుర్గం మెట్రో స్టేషన్ల వద్ద 50 ఎలక్ట్రికల్ ఆటలతో ప్రారంభిస్తున్నామని, దశలవారీగా అన్ని మెట్రో స్టేషన్లకు ఈ సేవలు విస్తరిస్తామని చెప్పారు. మెట్రో సంస్థపై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని, ఫేజ్– 2లో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు సేవలను రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. -
పట్నం వస్తున్న పల్లె...
సాక్షి, హైదరాబాద్: మహానగరం ఒక్కసారిగా పల్లె జ్ఞాపకాల్లోకి వెళ్లబోతోంది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్, జింఖానా మైదానాలు స్వీట్, కైట్ ఫెస్టివల్‌కు వేదిక కాబోతున్నాయి. గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలకు ఏటా ఓ కొత్త ఈవెంట్‌ను జోడించే క్రమంలో భాగంగా ఈసారి గ్రామీణ పని, ఆటపాటలను (విలేజ్ గేమ్స్ అండ్ కల్చర్) జోడిస్తున్నారు. పల్లెల్లోనూ కనిపించకుండా పోయిన విసుర్రాయి, తాడూ బొంగరం, చిర్రగోన, టైరు ఆట, గోలీలాటల సందడితో పదికి పైగా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 20 దేశాల పతంగ్‌లు.. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో భాగంగా ఈసారి అమెరికా, సింగపూర్, ఇండోనేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర 20 దేశాల పతంగ్‌లు ఎగరనున్నాయి. 13న ఉదయం, సాయంత్రం వేళల్లో 100 మంది పతంగ్ ఫ్లయర్స్ తో పాటు ముప్పైకి పైగా కైట్ క్లబ్‌లు ఈ పెస్టివల్‌లో పాల్గొంటాయి. ఇక స్వీట్ ఫెస్టివల్లో భాగంగా ఆంధ్రా పూతరేకులు, తమిళ పొంగళ్, గుజరాత్ బాసుంది, జార్ఖండ్ అనార్సా, మణిపూర్ ఖీర్, సిక్కిం సీల్‌రోటీ ఇలా దాదాపు 1,200 రకాల స్వీట్లన్నీ ఒకే చోట నోరూరించనున్నాయి. 13, 14, 15 తేదీల్లో మధ్యాçహ్నం 2 నుంచి రాత్రి వరకు ఈ స్టాళ్లు అందుబాటులో ఉంటాయి. ఏటా కొత్త ఈవెంట్లు నగరానికి పండుగ కళ తీసుకువచ్చే క్రమంలో 2016 నుంచి కైట్, 2017 నుంచి స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం. ఈ యేడు కొత్తగా విలేజ్ గేమ్స్ అండ్ కల్చర్ ఈవెంట్లను కొత్తగా తీసుకువస్తున్నాం. వచ్చే ఏడాది మరో కొత్త అంశాన్ని యాడ్ చేస్తాం. ఈసారి జరిగే ఉత్సవాలకు 15 లక్షల మందికి పైగా జనాలు వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. – బుర్రా వెంకటేశం, పర్యాటక శాఖ కార్యదర్శి -
గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం జరుగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నగర పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రిపబ్లిక్–డే పరేడ్ జరిగే సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌ను గురువారం నాటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జరిగే రిహార్సల్స్‌ను వీక్షించే ఉన్నతాధికారులు భద్రతా చర్యల్లో తీసుకోవాల్సిన మార్పు చేర్పులను సూచించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ భారీగా బలగాలను మోహరిస్తున్నారు. గ్రౌండ్స్ చుట్టూ అనునిత్యం పెట్రోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొనున్నాయి. దాదాపు 1500 మంది సిబ్బందిని బందోబస్తుకు వినియోగించనున్నట్లు సమాచారం. నగర వ్యాప్తంగా నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించారు. పరేడ్ గ్రౌండ్స్‌లోకి దారి తీసే రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు ప్రధాన ద్వారాల దగ్గర మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజలు తమ వెంట హ్యాండ్ బ్యాగ్స్, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, బ్రీఫ్ కేసులను తీసుకురావడాన్ని నిషేధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈసారి గగన తలంపై నిఘా సైతం ఏర్పాటు చేశారు. రూఫ్ టాప్ వాచ్ కోసం ఎత్తయిన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క శనివారం సాయంత్రం గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌లోనూ ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్న నేపథ్యంలో సోమాజిగూడ పరిసరాల్లోనూ గట్టి బందోబస్తుఉండబోతోంది. రాజ్‌భవన్ పరిసరాల్లో ఇలా... రిపబ్లిక్–డేను పురస్కరించుకుని గవర్నర్ తన అధికార నివాసంలో ఇవ్వనున్న ఎట్ హోమ్ విందు నేపథ్యంలో రాజ్‌భవన్ పరిసరాల్లోనూ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ పేర్కొన్నారు. గులాబీ రంగు పాస్‌లతో వచ్చే ఆహుతులు రాజ్‌భవన్ గేట్–1 ద్వారా లోపలకు ప్రవేశించాలి. దర్బార్ హాలు ఎదురుగా వాహనాలు ఆపాలి. వీటిని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర పార్క్ చేసుకోవాలి. ఆకుపచ్చ రంగు పాస్‌లకు గేట్–2 కేటాయించారు. ఇవి కూడా దర్బార్ హాల్ దగ్గర ఆహుతులను దింపి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గర పార్క్ చేసుకోవాలి. తెల్లరంగు పాస్‌లకు గేట్–3 కేటాయించారు. వీరికి దిల్కుష్గెస్ట్ హౌస్‌లో పార్కింగ్ కేటాయించారు. మిగిలిన వారంతా తమ వాహనాలను ఎంఎంటీఎస్ స్టేషన్లో పార్క్ చేసుకోవాలి. డ్యూటీ వెహికిల్స్‌కు చిల్లా వద్ద పార్కింగ్ చేయాలి. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో శనివారం జరుగనున్న గణతంత్ర దినోత్సవాల నేపథ్యంలో ఆ పరిసరాల్లో, గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలు వీటిని గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు. ♦ సికింద్రాబాద్‌లోని సర్దార్‌పటేల్ రోడ్‌లోని సెంట్రల్ టెలిగ్రాఫ్ ఆఫీసు జంక్షన్–వైఎంసీఏ చౌరస్తా మధ్య శనివారం ఉదయం 7–11 గంటల మధ్య వన్–వే అమలులో ఉంటుంది. దీని ప్రకారం పరేడ్ ప్రారంభానికి ముందు సీటీవో జంక్షన్ నుంచి వైఎంసీఏ వైపు, పూర్తయిన తరవాత వైఎంసీఏ నుంచి సీటీవో జంక్షన్ వైపు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ఇదే సమయంలో కంటోన్మెంట్ గార్డెన్స్–ఎస్బీహెచ్ చౌరస్తా మధ్య ఎలాంటి వాహనాల ప్రవేశానికి అనుమతి ఉండదు. ♦ బేగంపేట వైపు నుంచి వచ్చే వాహనాలు సీటీఓ ఫ్లైఓవర్ కింది నుంచి ప్రయాణించి ప్యారడైజ్, బాలమ్రాయ్ మీదుగా పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకోవాలి. ♦ సెయింట్ జాన్స్ రోటరీ నుంచి వచ్చే వాహనాలు వైఎంసీఏ ఫ్లైఓవర్ కింది నుంచి వచ్చి ఉప్కార్ చౌరస్తా లేదా క్లాక్ టవర్ మీదుగా గ్రౌండ్స్‌కు రావాలి. ♦ సికింద్రాబాద్ క్లబ్ ఇన్‌గేట్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్బీహెచ్ చౌరస్తాకు అనుమతించరు. వైఎంసీఏ క్రాస్‌రోడ్స్ లేదా టివోలీ చౌరస్తా మీదుగా వెళ్లాలి. ♦ ఆర్పీ రోడ్ నుంచి ఎస్బీహెచ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్ ప్యాట్నీ నుంచి ప్యారడైజ్ లేదా క్లాక్ టవర్ వైపు మళ్లాల్సి ఉంటుంది. -
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే రిహార్సల్స్
-
ఆ ర్యాలీకి నిధులెక్కడివి..?
కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ శనివారం విపక్షాలతో కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ర్యాలీపై పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ ఘాటుగా స్పందించింది. ఈ భారీ ర్యాలీకి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణకు డిమాండ్ చేస్తూ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయనున్నట్టు పేర్కొంది. ఈ మెగా ర్యాలీకి రూ కోట్లలో వెచ్చించారని, అడుగడుగునా కటౌట్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారని, వందలాది వాహనాలు సమకూర్చారని వీటన్నింటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నకు తృణమూల్ కాంగ్రెస్ బదులివ్వాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముకుల్ రాయ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ కోరుతూ తాము ఈసీకి లేఖ రాస్తామని చెప్పారు. ప్రజలు తిరస్కరించిన నేతలతో తృణమూల్ చేతులు కలిపిందని విపక్షాల ర్యాలీని ఆయన ఎద్దేవా చేశారు. ఆ పార్టీలకు బీజేపీని ఎదుర్కొనే సత్తా లేదని వ్యాఖ్యానించారు. బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన మాయావతి ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడటం విడ్డూరమని పేర్కొన్నారు. -
పద పదవే వయ్యారి గాలిపటమా!
సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాలుబోసిపోగా పరేడ్ గ్రౌండ్ పరిసరాలు మాత్రం సందర్శకులతో కిక్కిరిసి పోయాయి. నగరంలో సంక్రాంతి సందడంతా పరేడ్ గ్రౌండ్లోనేకనిపించింది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.ఈ ఉత్సాహం.. పండుగ వాతావరణాన్ని చూసేందుకు రెండు కళ్లుచాలవంటే అతిశయోక్తి కాదు. ఈ హడావుడితో మైదానం చుట్టూ రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం మురిసిపోయింది. ఆకాశం సప్తవర్ణ శోభితమైంది. పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నగర గగనానికి కొత్తరంగులు అద్దింది. అంతర్జాతీయ పతంగుల పండుగను నగర యువత ఎంజాయ్ చేస్తోంది. అసలే పండుగ.. ఆపై వరుస సెలవులు కావడంతో సోమవారం భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. రకరకాల ఆకారాలు, రంగురంగుల పతంగులను ఎగరేస్తూ.. రాత్రి వరకు ఉత్సాహంగా గడిపారు. ఈ పండుగకోసమే వచ్చిన దేశ, విదేశాలకు చెందిన పతంగులు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. గాలిలో నృత్యం చేస్తున్న టైగర్, డ్రాగన్, చింపాంజీ, గరుడ వంటి రకరకాల పతంగులు చూసేందుకు ఉత్సాహం చూపించారు. గ్రౌండ్లో ఏర్పాటుచేసిన డీజే సౌండ్స్ సందర్శకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. రిమోట్ సహాయంతో రాత్రి ఆకాశంలో ఎగురవేసిన లైటింగ్ పతంగులు ఈ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సప్తవర్ణాల పతంగులతో పరేడ్ గ్రౌండ్ పరిసరాలు కలర్పుల్గా మారాయి. అటు నెక్లెస్ రోడ్‌లోనూ కుర్రకారు ఉత్సాహంగా పతంగులు ఎగురవేశారు. ఇదినాలుగోసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పాల్గొనడం ఇది నాలుగోసారి. ఈసారి.. ఇండోనేసియా, థాయ్‌లాండ్, మలేసియా, స్వీడన్, పోలాండ్, న్యూజిలాండ్, అమెరికా, బ్రిటన్, కొరియా, కాంబోడియా, పిలిప్పీన్స్ దేశాలకు చెందిన కైట్ ప్లేయర్స్ పాల్గొన్నారు. మాది గుజరాత్. వ్యక్తిగతంగా నాకు ఇది 15వ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. 45 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ ఇందులో పాల్గొంటున్నారు. – పవన్ సొలంకి, తెలంగాణ టూరిజం కైట్స్ కన్సల్టెంట్ -
కన్నులపండువగా కైట్ ఫెస్టివల్..
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. మూడురోజులపాటు జరగనున్న ఈ ఫెస్టివల్లో 20 దేశాలకు చెందిన ప్రతినిధులు సందడి చేస్తున్నారు. మనదేశంలోని 25 రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులు కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. కైట్ ఫెస్టివల్‌కుతోడు స్వీట్ ఫెస్టివల్ కూడా ఇక్కడ జరుగుతుండటంతో పరేడ్ గ్రౌండ్లో కోలాహలం నెలకొంది. స్వీట్ ఫెస్టివల్లో భాగంగా 1200 రకాల మిఠాయిలు ఆహూతుల నోరూరింపజేస్తున్నాయి. దీనికితోడు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద నృత్యాలు ఆహూతులకు కనువిందు చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
జోరుమీదున్న ‘కారు’
సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల పర్వం ముగియడంతో టీఆర్ఎస్ ప్రచార జోరు పెంచింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ రోడ్‌షోల షెడ్యూల్ ఖరారైంది. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్రావు ఈ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 22 నుంచి 29 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కేటీఆర్ ప్రచారం చేస్తారని.. రోడ్‌షోలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. రోడ్‌షోలు ముగిసిన అనంతరం డిసెంబర్ 3న పరేడ్‌గ్రౌండ్‌లో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. మొత్తం 15 నియోజకవర్గాల్లో ఈ రోడ్‌షోలు ఉంటాయని వివరించారు. వీలును బట్టి రోడ్‌షోల సంఖ్య పెరగవచ్చని తెలిపారు. రోజూ మధ్యాహ్నం 3 గంటల దాకా కేటీఆర్‌తో టౌన్ హాల్ మీటింగ్స్ ఉంటాయని, సాయంత్రం 4 గంటల నుం చి రోడ్‌షోలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. రోడ్‌షోల వివరాలు.. ఈ నెల 22న ఉప్పల్, కంటోన్మెంట్, 23న మహేశ్వరం, ఎల్బీనగర్, 24న జూబ్లీహిల్స్, సనత్‌నగర్, 25న విరామం, 26న గోషామహల్, ఖైరతాబాద్, 27న రా జేంద్రనగర్, శేరిలింగంపల్లి, 28న అంబర్‌పేట, ము షీరాబాద్, 29న కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయని రామ్మోహన్ తెలిపారు. సమన్వయ కమిటీ సభ్యులు వీరే.. జీహెచ్ఎంసీ పరిధిలో మంత్రి కేటీఆర్ రోడ్‌షోల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటైంది. ఇందులో బొంతు రామ్మోహన్ (జీహెచ్ఎంసీ మేయర్), పోచంపల్లి శ్రీనివాసరెడ్డి (రాష్ట్ర కార్యదర్శి), గ్యాదరి బాలమల్లు (ప్రధాన కార్యదర్శి), మారెడ్డి శ్రీనివాసరెడ్డి (ప్రధాన కార్యదర్శి), నేవూరి ధర్మేందర్‌రెడ్డి (రాష్ట్ర యువజన సమన్వకర్త), వై.సతీశ్‌రెడ్డి (యువజన ప్రధాన కార్యదర్శి)లు సభ్యులుగా ఉన్నారు. -
కాషాయ దళం.. కమల వికాసం
-
పోలీసుల ఆధీనంలో పరేడ్ గ్రౌండ్స్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని (జూన్ 2) పురస్కరించుకొని నగరంలోని పరేడ్ గ్రౌండ్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు 2500 మంది పోలీసులతో బందోబస్తు చేస్తున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఆక్టోపస్ బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు పరేడ్ గ్రౌండ్‌ను తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్‌ను తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు బాంబ్, డాగ్ స్వ్కాడ్లతో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అదే విధంగా గురువారం 9 బెటాలియన్లు, ఒక మౌంటెడ్ పోలీస్, రెండు బ్యాండ్ బృందాలతో కవాతు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. పాసులు ఉన్నవారిని మాత్రమే పరేడ్ గ్రౌండ్లోకి అనుమతించనున్నారు. జనరల్ పబ్లిక్ కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. జూన్ 2న పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు. -
రిపబ్లిక్ డేకి ముస్తాబైన పరేడ్ గ్రౌండ్స్
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబైంది. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాం గం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 9.15 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి తదితర అంశాలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారు లు, ఉద్యోగులకు అవార్డులు అందిస్తారు. గణతంత్ర వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ గురువారం పర్యవేక్షించారు. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేద్దాం: గవర్నర్ నరసింహన్ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణలో నాల్గవసారి గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నట్లు ఆయన గుర్తు చేశారు. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేద్దామన్నారు. ప్రజల ఆకాంక్ష లకు అనుగుణంగా, వారి కలలను సాకారం చేసే విధంగా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు సీఎం శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న దేశం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటుందని గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా, ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. -
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్వీట్ ఫెస్టివల్
-
సిటీలో స్వీట్స్ అండ్ కైట్స్ సంబరాలు
-
భాగ్యనగరిలో ఉత్సవాల ‘పరేడ్’
సాక్షి, హైదరాబాద్: వెయ్యి రకాలకుపైగా మిఠాయిలు.. అద్భుతమైన వినోదాన్ని పంచే పతంగులు.. కళ్లు తిçప్పనివ్వని సాంస్కృతిక ప్రదర్శనలు.. ఇవన్నీ ఒకేచోట ఏర్పాటైతే.. ఆ సందడే వేరు. సంక్రాంతి సందర్భంగా భాగ్య నగరంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. నేటి(శనివారం) నుంచి ఈ నెల 15 వరకు అంటే మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు ఒకేచోట కనువించు చేయను న్నాయి. స్వీట్, కైట్ ఫెస్టివల్స్‌తో పాటు సాంస్కృతిక ఉత్సవం నగరం నడిబొడ్డున ఉన్న పరేడ్ గ్రౌండ్ వేదికగా నగరవాసులను అలరించనున్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. స్వీట్ ఫెస్టి వల్ చైర్మన్ బుర్రా వెంకటేశం, వైస్ చైర్మన్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొంటారు. మిఠాయిల పండుగ అంతర్జాతీయ మిఠాయిల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ ఫెస్టివల్లో నగరంలో స్థిరపడ్డ 15 దేశాలు, 25 రాష్ట్రాల వారు పాల్గొననున్నారు. వారి సంప్రదాయ స్వీట్లను ఫెస్టివల్లో ఉంచి విక్ర యిస్తారు. శనివారం మధ్యాహ్నం 3 గంట లకు స్వీట్ ఫెస్టివల్ ప్రారంభమై.. మూడు రోజులపాటు జరుగుతుంది. ఇందులో తెలంగాణ నుంచి 20, ఏపీ నుంచి 20 రకాల స్వీట్లతో పాటు పలు దేశాలు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 1,000 రకాల మిఠాయిలను ప్రదర్శనలో ఉంచనున్నారు. కైట్ ఫెస్టివల్ రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి అంతర్జాతీయ పతంగుల ఉత్సవం నిర్వహిస్తోంది. ఏటా అగాఖాన్ అకాడమీలో దీనిని నిర్వహించే వారు. కానీ తొలిసారిగా ప్రజల్ని భాగస్వాము లను చేయాలని పరేడ్ గ్రౌండ్లో ఈ ఫెస్టి వల్‌ను ఏర్పాటు చేశారు. సింగపూర్, మలేసియా, జర్మనీ తదితర 14 దేశాలు, గుజరాత్, కేరâý తదితర రాష్ట్రాలకు చెందిన ఔత్సాహికులు ఇందులో పాల్గోనున్నారు. నైట్ కైట్ ఫెస్టివల్ ఈసారి ప్రత్యేక ఆకర్షణ. సాంస్కృతిక ఉత్సవం సాంస్కృతిక ఉత్సవంలో 15 అంతర్జాతీయ, భారతీయ కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు పరేడ్ గ్రౌండ్లో ఇది ప్రారం భమవుతుంది. ఒగ్గుడోలు, పేర్ని, కథక్, కూచిపూడి, పులివేషాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి. దీనిలో భాగంగానే ఫుడ్ ఫెస్టివల్‌ను సైతం ఏర్పాటు చేశారు. హైదరాబాదీ స్పెషల్ బిర్యానీతో పాటు వివిధ రకాల తెలంగాణ వంటకాలు నోరూరించనున్నాయి. -
నగరంలో మరో వేడుక
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు, ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత మరో ప్రపంచస్థాయి వేడుకకు నగరం వేదిక కానుంది. జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో వరల్డ్ స్వీట్ ఫెస్టివల్ జరగనుంది. ప్రతి రాష్ట్రం నుంచి 50 రకాల స్వీట్లను వేడుకల్లో ప్రదర్శించనున్నారు. 1000 రకాల స్వీట్లను అమ్మకానికి ఉంచనున్నారు. దీనికి లక్ష మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన పలు రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో బుధవారం జరిగిన సమీక్షలో వేడుకల నిర్వహణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. -
ధర్మయుద్ధం మహాసభ ప్రారంభం
హైదరాబాద్ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లుపెట్టాలని మాదిగలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో మాదిగల ధర్మయుద్ధం మహాసభ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష మాదిగ నేతృత్వంలో జరుగుతున్న ఈ సభకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డితో పాటు పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు నేతలు మద్దతు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మాదిగలు తరలివచ్చారు. -
27న ఎమ్మార్పీఎస్ ధర్మయుద్ధ మహాసభ
ఆమనగల్లు(మహబూబ్‌నగర్ జిల్లా): శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని కోరుతూ ఈనెల 27న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దర్మయుద్ద మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య తెలిపారు. ఆమనగల్లు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ధర్మయుద్ద మహాసభ పోస్టర్లను స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 23 ఏళ్లుగా పవిత్ర యుద్దం చేస్తుందని అన్నారు. ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ బిల్లును సాధించి తీరుతుందని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ సాధన కోసం ఎమ్మార్పీఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని, డిల్లీ వేధికగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేసిందని ఆయన వివరించారు. ఈనెల 23న జరిగే ధర్మయుద్ద మహాసభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
ఆవిర్భావం.. అదరాలె
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ధూంధామ్‌గా నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఉత్సవాలు.. ఆటపాటలు ఎలా ఉండాలో మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆవిర్భావ వేడుకలు గ్రామం, మండలం, డివిజన్ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్‌దీపాలతో అలంకరిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర రెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై ఇప్పటికే కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అధికారులతో సమీక్షించారు. ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లు, పబ్లిక్‌రంగ సంస్థలు, థియేటర్లను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. అలాగే కార్యాలయ ఆవరణాలన్నీ పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఆస్పత్రులు, అనాథ, వృద్ధాశ్రమాల్లో పండ్లు పంపిణీ చేస్తారు. రక్తదాన శిబిరాలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. అలాగే గురువారం నూతన పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు, డబుల్బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, భూమి కొనుగోలు పథకం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఉదయం 8గంటల నుంచి.. జిల్లా వ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమవుతాయి. ఉదయం సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, అమరవీరుల స్థూపం వద్ద భారీ నీటిపారదల శాఖ మంత్రి హరీశ్‌రావు నివాళులర్పిస్తారు. అనంతరం పోలీస్ పెరేడ్‌గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అమరులైన వారి కుటుంబ సభ్యులను సన్మానిస్తారు. వివిధ రంగా ల్లో ప్రతిభావంతులు, నిష్ణాతులకు నగదు పారితోషికంతోపా టు ప్రశంసాపత్రం అందజేస్తారు. సాంస్కృతిక కార్యక్రమా లు నిర్వహిస్తారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఆయా శాఖలకు సంబంధించిన ప్రదర్శనశాలలను ఏర్పాటు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు.. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో వారం రోజుల ముందే పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. మురికికాల్వల్లో పూడిక తీయడం, వీధులు శుభ్రం చేయడం వంటివి చేస్తున్నారు. ప్రజా భవనాల పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. గ్రామపంచాయతీ భవనాలకు, వాటి అనుబంధ సంస్థల భవనాలకు అవసరమైనచోట కలర్స్ వేస్తున్నారు. గ్రామ పంచాయతీలలో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, కార్యాచరణ కమిటీలకు ఆటల పోటీలు నిర్వహిస్తారు. గ్రామ పంచాయతీల్లో 25 కేజీల మిఠాయిలు పంపిణీ చేస్తారు. -
గులాబీ జోష్..!
* పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభ విజయవంతం * సీఎం హామీలతో టీఆర్ఎస్ శ్రేణుల ఖుషీ సాక్షి, సిటీబ్యూరో: అధికార టీఆర్ఎస్ పార్టీ పరేడ్ గ్రౌండ్స్లోనిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడం గ్రేటర్ గులాబీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. సీఎం కేసీఆర్ పాల్గొన్న ఈ సభకు నగరంలోని 150 డివిజన్ల నుంచి టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు వేలాది జనాన్ని తరలించారు. నగరాభివృద్ధిపై సీఎం చేసిన ప్రసంగం తమకు కలిసి వస్తుందని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ అభ్యర్థులను సీఎం ప్రజలకు పరిచయం చేస్తూ అవినీతి రహితంగా పాలన అందిస్తామని..పైసా లంచం ఇవ్వకుండా ప్రజలు భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు కృషి చేస్తామని వారితో ప్రతిజ్ఞ చేయిస్తున్నానని ప్రకటించడంతో కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, స్వచ్ఛమైన తాగునీరు అందించడం, వరద కాల్వల ప్రక్షాళన, ముంపు సమస్యల పరిష్కారానికి సుమారు రూ.30 వేల కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని హామీ ఇవ్వడంపై కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీకి ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాత్రమే స్టార్ క్యాంపెయినర్‌గా మారిన విషయం విదితమే. శనివారం సభతో ముఖ్యమంత్రి స్వయంగా నగర అభివృద్ధిపై విజన్ ఆవిష్కరించడంతో పాటు గ్రేటర్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తామని స్పష్టం చేయడం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. అంచనాలకు మించి అన్నివర్గాల జనం తరలిరావడంతో బల్దియా ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు అవకాశాలపై విశ్వాసం పెరిగిం దన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయిని నర్సింహా రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, గ్రేటర్ పార్టీ అధ్యక్షుడు మైనంపల్లి, డివిజన్ల బాధ్యతలు చూస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
దేశమంటే మట్టి కాదోయ్... దేశభక్తి అంటే మాటలు కాదోయ్...
స్వరాజ్య శోభ స్వాతంత్య్ర దినోత్సవాలకు నగరం సిద్ధమైంది. పరేడ్ గ్రౌండ్స్‌తో పాటు గోల్కొండ కోటలో ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు... వివిధ ప్రదర్శనలకు సన్నాహాలు చేస్తున్నారు. పోలీసులు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరికి ఉగ్రవాద సంస్థ హుజీతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు. నో యువర్ ఆర్మీ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఆంధ్రసబ్ ఏరియా ఆర్మీ ఆధ్వర్యంలో శనివారం వివిధ యుద్ధాల్లో పాల్గొన్న యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను ప్రదర్శించారు. దీనిని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, పౌరులు ఆసక్తిగా తిలకించారు. వాటి వివరాలను ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే 72ఎం1 ట్యాంకులు, మిషన్ గన్స్, రాకెట్ లాంచర్లు, శత్రువుల కదలికలను పసిగట్టే బైనాక్యూలర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -రసూల్‌పురా మువ్వన్నెలు... హిమాయత్‌నగర్‌లోని ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నొవేషన్... పంద్రాగస్టు వేడుకల్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మువ్వన్నెల్ని ‘ధరించిన’ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థినులు ముచ్చటైన ముస్తాబులో అలరించారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమాన్ని సంస్థ డెరైక్టర్ రూపేష్గుప్తా పర్యవేక్షించారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి ఏదో ఒక రోజు మువ్వన్నెల జెండాకు సెల్యూట్ కొట్టి సంబరపడడమా? క్రికెట్లో మన జట్టు చేతిలో పాకిస్థాన్ ఓడిపోతే టపాసులు కాల్చడమా? విదేశాల్లో మన సినిమాల కలెక్షన్లు చూసి కాలరెగరేయడమా?... ఇదేనా దేశభక్తి? ఇంకేదైనా ఉందా? ఈ విషయంపై నగరానికి చెందిన భిన్నరంగాల ప్రముఖులతో మాట్లాడితే... గుడ్ సిటిజన్‌గా... సిటిజన్ బాధ్యత గుర్తు ఉంచుకోవాలి. సొసైటీ పట్ల మన రెస్పాన్సిబులిటీ తెలుసుకుని ప్రతి ఒక్కరూ గుడ్ సిటిజన్ అనిపించుకుంటే చాలు. దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. మన సంస్కృతికి విలువనిచ్చి వాటికి దూరం కాకుండా దేశాన్ని ముందుకు తీసుకెళితే అందరికన్నా గొప్ప అవుతాం. మనకున్న చరిత్ర, సంప్రదాయ వైభవం ఏ దేశానికీ లేదు. చరిత్రకారులను గుర్తుంచుకుని స్ఫూర్తి పొందాలి. త్వరలో రవీంద్రభారతిలో రుద్రమ ప్రదర్శన ఇవ్వనున్నాను. అంత గొప్ప పాత్రలను ధరించేటప్పుడు ఎంతో ఉద్విగ్నంగా అనిపిస్తుంది. -అలేఖ్య పుంజల, నృత్యకారిణి ‘స్వచ్ఛ’త... దేశభక్తి అంటే నా దృష్టిలో తొలుత మనం ఉండేచోటు నుంచి మొదలుకుని పరిశుభ్రం చేసుకుంటూ వెళ్లడమే. చుట్టుపక్కల శుభ్రంగా ఉంటే మైండ్ కూడా క్లీన్‌గా ఉంటుంది. ఆ తర్వాత మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడం, సాటి మనిషికి సాయం చేసే స్థాయికి ఎదగడం, అలా దేశానికి కూడా ప్రయోజనం కలిగించే మనిషి అవుతాం. స్వాతంత్య్ర దినోత్సవం నాడు స్కూల్లో జెండా వందనంతో పాటు స్వీయ క్రమశిక్షణనూ పిల్లల మైండ్లోకి ఎక్కించాలి. -సురేష్, సినీనటుడు ఒకరికొకరు సాయం కావాలి... ఇది మన 69వ ఇండిపెండెన్స్‌డే. నేను ఆ వేడుకను ప్రతిఫలించే దుస్తులను ధరించాను. ఇంతకన్నా ఖరీదైన, డిజైనర్ దుస్తులు ధరించినప్పుడు కూడా లేనంత సంతోషంగా అనిపిస్తుంది. భారతీయులుగా పుట్టినందుకు గర్వంగా ఫీలవ్వాలి. ఇండియాని అగ్రస్థానంలో నిలిపే పనిలో అందరం భాగస్వాములవ్వాలి. సాటి మనిషి జీవితం తను హాయిగా గడిపేందుకు ప్రతి ఒక్కరూ తన వంతు సాయం చేయాలి. ముఖ్యంగా మహిళ తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయగలిగితే, కుటుంబం మొత్తాన్ని దారిలో పెడుతుంది. అంటే మహిళలకు చేయూతని అందించడం అంటే పరోక్షంగా సమాజానికి ఇచ్చినట్టే. -రేఖ లహోటి, చైర్పర్సన్ ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ అభివృద్ధిలో పాలుపంచుకోవడం... స్వాతంత్య్ర దినోత్సవ పండుగ తర్వాతా ఆ స్ఫూర్తిని మిగిలిన 364 రోజులూ కొనసాగించి దేశాభివృద్ధిలో పాటుపడాలి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి విలువలు నేర్పి అభివృద్ధి కారకులుగా తీర్చిదిద్దాలి. మన ఇంట్లో, చుట్టుపక్కల మొక్కలు నాటడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం... ఇవన్నీ అభివృద్ధి ప్రక్రియలో భాగమే. నాడు 1917 నుంచి 30 ఏళ్ల పాటు నిరంతరం పోరాడారు గాంధీ. అలాగే నేతాజీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్, భగత్‌సింగ్... ఇలా ఎందరో. వారి స్ఫూర్తిని అంది పుచ్చుకుని దేశాభివృద్ధికి బాటలు వేసుకోవాలి. - చంద్రబోస్, సినీ గేయ రచయిత -
పేరేడ్ గ్రౌండ్లో ఆర్మీ ఎక్స్పో
-
జాబుల జాతర
వచ్చే నెలలో 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు: కేసీఆర్ ► కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకూ శ్రీకారం ► రూ.2,500 కోట్లతో డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ► ఈ ఏడాదిలోనే 50 వేల ఇళ్ల నిర్మాణం ► రూ. 35 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతలు ► రాష్ట్రావతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్: వచ్చే నెల నుంచే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులను ఇంకెంతో కాలం నిరీక్షింప చేయదలుచుకోలేదని, పలు ప్రభుత్వ శాఖల్లోని 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. జూలై నుంచే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. తొలి రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా సీఎం ఈ ప్రకటన చేశారు. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం ఉదయం ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమమే ధ్యేయంగా తొలి ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించడంతో పాటు కొత్త వరాలను ప్రకటించారు. ‘నిరుద్యోగ సోదరులు ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు రావాలని ఎదురుచూస్తున్నారు. వారిని ఎక్కువకాలం నిరీక్షణకు గురిచేయకుండా జూలైలో 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటిస్తాం. రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులందరినీ వచ్చే నెల నుంచి క్రమబద్ధీకరించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఏడాదిలోనే అందరినీ క్రమబద్ధీకరిస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు. ‘గత ఏడాది అనేక కార్యక్రమాల వల్ల డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని చేపట్టలేకపోయాం. రూ.5.04 లక్షల ఖర్చుతో ఒక్కో ఇంటిని నిర్మించబోతున్నాం. ఈ ఏడాదిలోనే రూ.2500 కోట్లతో 50 వేల ఇళ్లను నిర్మించబోతున్నాం. వలస జిల్లా పాలమూరు, ఫ్లోరైడ్ ఖిల్లాగా మారిన నల్లగొండ జిల్లాల కన్నీళ్లు తుడవడానికి రూ.35 వేల కోట్లతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం. ఉత్తర తెలంగాణ జిల్లాలకు, కరువు ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందించేందుకు రూ. 30 వేల కోట్లతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈ నెలలోనే శంకుస్థాపన చేస్తాం’ అని సీఎం వెల్లడించారు. పోలీసుల సమస్యల పరిష్కారం కోసం డీజీపీ ఆధ్వర్యంలో కమిటీని వేశామని తెలిపారు. ‘మైనారిటీ, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచేం దుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుధీర్, చెల్లపల్ల ఆధ్వర్యంలో 2 కమిషన్లను నియమించాం. వాటి నివేదికలు అందిన వెంటనే రిజర్వేషన్ల పెంపు దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. 2018 నాటికి నిరంతర విద్యుత్ ‘తెలంగాణ వస్తే కష్టాలు తప్పవని, అంధకార బంధురమవుతుందని అసత్య ప్రచారం చేశారు. ఆరేడు నెలల్లోనే విద్యుత్ వెలుగులు విరజిమ్మే స్థాయికి తెలంగాణ ఎదిగింది. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు అవసరమైతే పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసే విధంగా తెలంగాణను దేశంలో అత్యధిక మిగులు విద్యుత్ గల రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రూ.91 వేల కోట్లతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం. కొత్తగూడెం, మణుగూరులో విద్యుత్ ప్లాంట్లు, నల్గొండ జిల్లా దామరచెర్లలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ సాకారం కాబోతోంది. 2018 నాటికి తెలంగాణలో అన్ని రంగాలకు.. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది’ అని ముఖ్యమంత్రి వివరించారు. పేదల సంక్షేమమే ధ్యేయం పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, దేశచరిత్రలో ఎక్కడ లేని విధంగా ఏటా రూ.28 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం, ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చామన్నారు. అవసరమైతే గ్రాంట్లు ఇచ్చి ఆర్టీసీని అద్భుతమైన సంస్థగా తీర్చిదిద్దుతామన్నారు. ‘అంగన్వాడీలకు, హోంగార్డులకు వేతనాలు పెంచాం. రైతులకు రూ.17 వేల కోట్ల పంట రుణాల మాఫీని చిత్తశుద్ధితో అమలు చేసినం. రూ.400 కోట్లతో పోలీసు వ్యవస్థను ఆధునీకరించాం. మహిళల భద్రతకు షీ-టీమ్స్‌ను ఏర్పాటు చేశాం. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధ్వర్యంలో రూ.20 వేల కోట్లతో అద్భుతమైన రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. సమైక్య రాష్ట్రంలో చెరువులు కునారిల్లిపోయాయి. మిషన్ కాకతీయ ద్వారా ఐదేళ్లలో రాష్ట్రంలోని 46 వేల చెరువులు, కుంటలకు పూర్వ వైభవం తెస్తాం. సమైక్య రాష్ట్రంలో అటవీ సంపద స్మగ్లర్ల పాలైంది. భవిష్యత్తు తరాలకు సమశీతోష్ణ తెలంగాణను అందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపడుతున్నాం. 300 కోట్ల మొక్కలు నాటడమే హరితహారం లక్ష్యం. జూలైలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో విద్యార్థుల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు అందరూ పాలుపంచుకోవాలి’ అని సీఎం పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మతో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నిరుద్యోగ సోదరులు ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు రావాలని ఎదురుచూస్తున్నారు. వారిని ఎక్కువకాలం నిరీక్షణకు గురిచేయకుండా జూలైలో 25 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటిస్తాం. రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులను వచ్చే నెల నుంచి క్రమబద్ధీకరించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఏడాదిలోనే అందరినీ క్రమబద్ధీకరిస్తాం. - సీఎం కేసీఆర్ తెలుగు ప్రజలకు మోదీ శుభాకాంక్షలు న్యూఢిల్లీ: విభజనతో రెండు రాష్ట్రాలుగా ఏర్పాటైన ఏపీ, తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకుపోవాలని ఆకాంక్షించారు. వికాసయాత్రలో కష్టపడుతున్న ఏపీ ప్రజలకూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా మంగళవారం గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న ఇటలీకి కూడా మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. -
జయ జయహే తెలంగాణ..
పరేడ్ గ్రౌండ్స్‌లో వైభవంగా రాష్ట్రావతరణ వేడుకలు కళాకారుల ఆటాపాటా, వివిధ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకున్న పోలీస్ కవాతు.. వందనం స్వీకరించిన సీఎం కేసీఆర్ 52 మందికి సన్మానం.. హైదరాబాద్: లయబద్ధంగా డప్పు వాయిద్యాలు.. గిరిజన సంస్కృతిని చాటే డోల్ దెబ్బ విన్యాసాలు.. ఊపునిచ్చే చప్పుళ్లకు అనుగుణంగా బంజారా నృత్యాలు.. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బోనాలు, బతకమ్మల ఊరేగింపు.. మత సామరస్యానికి అద్దంపట్టే పీర్ల పలకరింపు.. ఆధునిక హంగులు సంతరించుకున్న పోలీసు బృందాల కవాతు.. బంగారు తెలంగాణకు బాటలు పరుస్తూ ప్రభుత్వ శాఖలు చేపట్టిన కార్యక్రమాలను ప్రతిబింబించే అందమైన శకటాలు.. ‘తెలంగాణ రాష్ట్రం’ పేరు వినిపించగానే ఆహూతుల్లో పులకరింత.. మన రాష్ర్టం-మన పాలన అనుకుంటూ ఉప్పొంగిన గుండెలు.. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో మంగళవారం ఆవిష్కృతమైన దృశ్యమాలిక ఇది. రాష్ట్రావతరణ వేడుకలను రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ఘనంగా ప్రారంభించింది. తొలి వార్షికోత్సవ వేళ రాష్ట్రం నలుమూలలా పండుగ వాతావరణం నెలకొంది. పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సీఎం కేసీఆర్ ఈ వేడుకలను ప్రారంభించారు. అంగరంగ వైభవంగా... ఉదయం తొమ్మిది గంటలకు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద సీఎం కేసీఆర్ నివాళులర్పించి పరేడ్మైదానానికి చేరుకున్నారు. జెండా ఆవిష్కరణ తర్వాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అదనపు డీజీపీ త్రివేది నేతృత్వంలో వివిధ బెటాలియన్లు లయబద్ధంగా నిర్వహించిన కవాతు విశేషంగా ఆకట్టుకుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో రూపుదిద్దుకున్న సాంస్కృతిక సారథి సభ్యులు ఆటపాటతో అబ్బురపరిచారు. 550 మంది కళాకారులు సాంస్కృతిక కవాతు నిర్వహించారు. ‘సారథి’ చైర్మన్ రసమయి బాలకిషన్ ముందు నడవగా కళాకారుల బృందాలు డప్పు వాయిద్యాల మధ్య ఆడిపాడుతూ ముందుకుసాగారు. పురుషులు గులాబీ రంగు చొక్కాలు, ధోవతి ధరించగా... మహిళలు ఆకుపచ్చరంగు చీరల్లో మెరిశారు. బతుకమ్మలు, బోనాలు, పీర్లు, బంజారా నృత్యాలు, డ ప్పు చప్పుళ్లు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందంగా ముస్తాబైన శకటాలు ఇక ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు భావి ‘బంగారు తెలంగాణ’ను ఆవిష్కరించాయి. తొలుత సమాచార శాఖ శకటాన్ని ప్రదర్శించారు. అమరవీరుల స్థూపం, కాకతీయతోరణ నమూనాలు ఏర్పాటు చేశారు. మిషన్ కాకతీయ శకటం, గ్రామీణ నీటిపారుదల శాఖ స్వచ్ఛ భారత్ శకటం, నేలతల్లి కల్పవల్లి పేరుతో వ్యవసాయ శాఖ శకటం, పౌరసరఫరాల శాఖ శకటం, అటవీ శాఖ హరితహారం శకటం ముందుకు సాగాయి. షాదీ ముబారక్‌తో మైనారిటీ సంక్షేమ శాఖ శకటం, గిరిజన శాఖ కొమురం భీం శకటం, దేవాదాయ శాఖ యాదాద్రి శకటం, పర్యాటక శాఖ గోల్కొండ కోట శకటం అలరించాయి. రోడ్లు భవనాల శాఖ, మెట్రో రైలు శకటాలు ప్రత్యేకంగా నిలిచాయి. స్వచ్ఛ హైదరాబాద్ నినాదంతో జీహెచ్ఎంసీ శకటం, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యమిస్తూ చీపురు ఆకృతిలోని వాహనం ఆకట్టుకున్నాయి. పోలీసు శాఖ చివరగా భారీ వాహన కాన్వాయ్‌తో ప్రత్యేకతను చాటుకుంది. మెట్రో రైలు శకటం ప్రథమ బహుమతిని, అటవీ శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ శకటాలు రెండు, మూడో బహుమతులను దక్కించుకున్నాయి. అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురు ప్రతిభావంతులను ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించారు. 32 రంగాలకు చెందిన 52 మందికి లక్షా నూటపదహార్ల నగదు పురస్కారాన్ని, పోచంపల్లి శాలువా, పెంబర్తిలో రూపొందిన జ్ఞాపికలను అందజేశారు. అసెంబ్లీలో అవతరణోత్సవాలు అసెంబ్లీలోనూ రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులు అర్పించారు. శాసన మండలిలో చైర్మన్ స్వామిగౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో హోం మంత్రి నాయిని జెండాను ఆవిష్కరించారు. -
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
భారీ ఏర్పాట్లు చేస్తున్న సర్కారు జూన్ 2 నుంచి 7 వరకు కార్యక్రమాలు హైదరాబాద్: జూన్ 2 నుంచి వారం రోజులపాటు నిర్వహించనున్న రాష్ట్రావతరణ వేడుకలకు ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని 30 ప్రాంతాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఐదు బృందాలను నియమించింది. ప్రత్యేకంగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తోంది. జూన్ 2న గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళితో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో వివిధ రంగాల వారికి అవార్డుల ప్రదానం, 20 విభాగాలకు చెందిన శకటాల ప్రదర్శన, సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. ఇక 7వ తేదీ సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కనీవినీ ఎరుగని రీతిలో ముగింపు ఉత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అత్యాధునిక త్రీడీ మ్యాపింగ్ సిస్టం ద్వారా సికింద్రాబాద్ క్లాక్ టవర్, కాచిగూడ రైల్వే స్టేషన్, హుస్సేన్‌సాగర్‌లోని బుద్దుడి విగ్రహానికి సప్తవర్ణాల్లో మిరుమిట్లు గొలిపే వెలుగు జిలుగులు అమర్చనున్నారు. మునుపెన్నడూ లేని విధంగా చార్మినార్ వేదికపై అంతర్జాతీయ కళాకారుడితో అద్భుత ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాగే శిల్పారామం, రవీంద్రభారతి, చౌమహల్లా ప్యాలెస్, తారామతి బారాదరి, గోల్కొండ తదితర ప్రాంతాల్లోనూ సాయంత్రం 6.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. లితిత కళా తోరణంలో 2 నుంచి 7వ తేదీ వరకు తెలంగాణ సినిమాలను ప్రదర్శించనున్నారు. సాంస్కృతిక సారథి నేతృత్వంలో అన్ని జిల్లాల్లో 500 మంది కళాకారులతో సాంస్కృతిక జైత్రయాత్ర నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికను రూపొందించారు. -
అన్ని దారులు రాజధాని వైపే
- బహిరంగ సభకు తరలిన గులాబీ దండు - టీఆర్ఎస్ వాహనాలతో కిటకిటలాడిన రహదారులు జిల్లాలోని అన్ని దారులు హైదరాబాద్‌లో వైపు దారితీశాయి. పరేడ్‌గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు సోమవారం జిల్లా నుంచి గులాబీ దండు తరలింది. నాయకులు, కార్యకర్తలు పార్టీ ఆవిర్భావసభకు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు. దారి పొడవునా జై తెలంగాణ.. కేసీఆర్ జిందాబాద్ నినాదాలు హోరెత్తాయి. బహిరంగసభకు వెళ్లే వాహనాలతో రహదారులన్నీ కిటకిటలాడాయి. సాక్షి, సంగారెడ్డి: పార్టీ అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జరుపుకుంటున్న ఆవిర్భావ దినోత్సవం కావడంతో గులాబీ శ్రేణులు పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో నేతలందరూ పెద్ద సంఖ్యలో జనసమీకరణతో రాజధానికి బయలుదేరారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్ నేతృత్వంలో జహీరాబాద్ ప్రాంత నాయకులు భారీ సంఖ్యలో హైదరాబాద్ వెళ్లారు. జిల్లా కేంద్రం సంగారెడ్డి నుంచి పదివేల మంది నాయకులు, కార్యకర్తలు బహిరంగసభకు బయలుదేరి వెళ్లారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కార్యకర్తల వాహనాల్లో కొద్దిసేపు వారితో కలిసి ప్రయాణించారు. నియోజకవర్గంలోని మూడు మండలాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు బహిరంగసభకు వెళ్లారు. గణేష్‌గడ్డ వద్ద టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలిసి బహిరంగసభకు కార్యకర్తలకు స్వాగతం పలికారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరారు. సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సుమారు 320 వాహనాల్లో కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. హైదరాబాద్‌కు బయలు దేరిన వారిలో మున్సిపల్మాజీ చైర్మన్ రాజనర్సు, వైస్ చైర్మన్ చిన్న, మాజీ కౌన్సిలర్లు మచ్చవేణుగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి టీఆర్ఎస్ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. రాష్ట్రభారీ నీటి పారుదల శాఖామాత్యులు హరీష్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిల పర్యవేక్షణలో జనాలను తరలించారు. ప్రజ్ఞాపూర్ నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి బహిరంగ సభకు వెళ్లే వాహనాలను పంపించారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు మెదక్ నియోజకవర్గం నుంచి సుమారు 21వేల మంది తరలివెళ్లారు. నర్సాపూర్ నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు తరలి వెళ్లారు. నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి సభకు తరలి వెళ్తున్న బస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ బహిరంగసభకు అందోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, రాయికోడ్, టేక్మాల్ మండలాల నుంచి సుమారుగా 100 ఆర్టీసీ బస్సులలో తరలివెళ్లారు. టీఆర్ఎస్ సభకు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్లాయి. 150కి పైగా వాహనాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు బయలు దేరి వెళ్లారు. 54 ఆర్టీసీ బస్సులు, 70కి పైగా స్కూలు బస్సులతో పాటు ప్రత్యేక వాహనాల్లో కూడా కార్యకర్తలు తరలి వెళ్లారు. సభకు తరలి వెళ్లిన వారిలో మాజీ మంత్రి ఎం.డి.ఫరీదుద్దీన్, నియోజకవర్గం ఇన్చార్జి కె.మాణిక్‌రావులతో పాటు మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బహిరంగసభకు బయలుదేరి వెళ్లారు. అంచనాల కమిటీ చైర్మన్ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో చేగుంట నుంచి తరలి వెళ్లారు. -
గులాబీ కళ
టీఆర్ఎస్ బహిరంగ సభకు గ్రేటర్ ముస్తాబు నగరం నుంచి మూడు లక్షల జన సమీకరణ ఏర్పాట్లలో మంత్రులు బిజీ బిజీ సాక్షి, సిటీబ్యూరో:అధికార టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు గ్రేటర్ నగరం ముస్తాబైంది. సభ జరిగే పరేడ్ గ్రౌండ్స్‌లో వేదిక, బారికేడ్లు, ఆడియో, లైటింగ్, సీటింగ్ తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పనులను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లు ఆదివారం పరిశీలించారు. వేదిక ఏర్పాటు బాధ్యతను ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు తీసుకున్నారు. ఈ సభకు గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గాల నుంచి సుమారు 3 లక్షల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులకు లక్ష్యం నిర్దేశించారు. జన సమీకరణకు బస్తీలు, కాలనీల ముఖ్య నాయకులను కలవడంతో పాటు... సభకు హాజరయ్యేందుకు కార్యకర్తలకు అవసరమైన వాహనాలను నాయకులు ఇప్పటికే సమకూర్చారు.రాబోయే బల్దియా ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపించడం... గ్రేటర్ క్యాడర్లో జోష్ నింపడం... ఇతర పార్టీల్లోని ముఖ్య నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు ఈ సభను వినియోగించుకోవాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గులాబీ వనంగా నగరం... బహిరంగ సభ నేపథ్యంలో పది జిల్లాల నుంచి నగరానికి వచ్చే కార్యకర్తలకు ఘన స్వాగతం పలికేందుకు ముఖ్య రహదారులపై భారీ ఎత్తున స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ పరిసరాలు, మైదానం గులాబీ జెండాలు, తోరణాలతో నిండిపోయాయి. గ్రౌండ్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు నేతల ప్రసంగాలు దూరప్రాంతాలకు వినిపించేలా సౌండ్సిస్టంను ఏర్పాటు చేశారు. సుమారు నాలుగు వేల మంది పోలీసులతో బందోబస్తు, సభకు హాజర య్యే వారి వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్రేటర్‌లోని 150 డివిజన్ల నుంచి ముఖ్య కార్యవర్గంతో పాటు, అనుబంధ సంస్థల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, తెలంగాణ వాదులు సభకు హాజరయ్యేలా చూసేందుకు డివిజన్ స్థాయి నేతలతో మంత్రులు ప్రత్యక్షంగా మాట్లాడారు. సభను విజయవంతం చేయాలని కోరారు. ఆటుపోట్ల ప్రస్థానం... సుమారు 14 సంవత్సరాలుగా గ్రేటర్ పరిధిలో అస్తిత్వ పోరాటం చేసిన టీఆర్ఎస్... నేడు అధికార పార్టీగా అవతరించి... భారీ బహిరంగ సభ నిర్వహించనుండడం విశేషం. 2001 ఏప్రిల్ 27న నగరంలోని జలదృశ్యంలో అధినేత కేసీఆర్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. తొలినాళ్లలో పార్టీ ఉనికిని చాటుకునేందుకు పెద్ద పోరాటమే చేసింది. జలదృశ్యం నుంచి నేటి జనదృశ్యం వరకు ఎదిగిన తీరు పార్టీ వర్గాలను సైతం అబ్బురపరుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో గ్రేటర్ వ్యాప్తంగా పార్టీ ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటుటోంది.ప్రధాన పార్టీల నేతలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా పార్టీలో చేర్చుకొని... రాబోయే బల్దియా ఎన్నికల్లో గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురవేయాలన్నదే నగర మంత్రులు, అధినేత లక్ష్యమని గ్రేటర్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహా నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే సిద్ధం చేశారని... వీటిని దశల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. మరోవైపు ఇటీవలే టీఆర్ఎస్ గ్రేటర్ విభాగం అధ్యక్షునిగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు నేతృత్వంలో పార్టీని అజేయశక్తిగా మలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపాయి. హోం మంత్రి పరిశీలన రసూల్‌పురా: సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సోమవారం జరుగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో కలసి ఆదివారం పర్యవేక్షించారు. బందోబస్తు విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీకి డబ్బులు చెల్లిస్తే బస్సులను ఏర్పాటు చేస్తామని డిపో మేనేజర్లు హామీ ఇచ్చారని... నాయకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. 14 సంవత్సరాలుగా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికుల్లా పార్టీ కోసం పని చేస్తున్నారని కొనియాడాఉ. బంగారు తెలంగాణే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. హరీష్‌రావు అలకబూనినట్లు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని ఆయన తేల్చిచెప్పారు. హోంమంత్రి వెంట మంత్రులు మహమూద్ అలీ, తలసాని, ఎమ్మేల్యే రసమయి బాలకిషన్, నార్త్‌జోన్ డీసీపీ సుధీర్‌బాబు, ఏసీపీ గణేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు. బందోబస్తుపై సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: టీఆర్ఎస్ బహిరంగ సభ బందోబస్తును నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సమీక్షించారు. బహిరంగ సభలకు వచ్చే ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బందోబస్తులో 4000 మంది సిబ్బంది పాల్గొంటున్నారని వెల్లడించారు. నగర పోలీసులు, టీఎస్ఎస్పీ, ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బందితోపాటు వివిధ జిల్లాల నుంచి అదనపు పోలీసు బలగాలను రప్పించామన్నారు. అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, స్వాతిలక్రా, జితేందర్, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ వై.నాగిరెడ్డిలతో కలిసి బందోబస్తు చర్యలను స్వయంగా పరిశీలించారు. బందోబస్తులో పాల్గొంటున్న అధికారులకు నార్త్‌జోన్ డీసీపీ సుధీర్‌బాబు తగిన సూచనలిచ్చారు. -
10లక్షల మందితో టీఆర్స్ భారీ బహిరంగ సభ
-
సభకు 10 లక్షల మంది
హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్: టీఆర్ఎస్ ఆవి ర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలి పారు. పది లక్షల మంది హాజ రయ్యే ఈ భారీ బహిరంగసభ కోసం కనీవినీ ఎరుగని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేపాల్, భారత్‌లలోని పలు ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో మృతి చెందిన వారికి టీఆర్ఎస్ తరపున నాయిని సంతాపం ప్రకటించారు. నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువాళ్లను రప్పిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, డీజీపీ, హోం సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కాగా సికింద్రాబాద్ పరేడ్‌మైదానంలో జరగనున్న సభ ఏర్పాట్లను శనివారం మంత్రులు కేటీఆర్, పద్మారావు, తలసాని, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, భానుప్రసాద్‌లతో కలసి పర్యవేక్షించారు. -
'గణతంత్ర వేడుకల్లో శకటాల ప్రదర్శన ఉండదు'
సికింద్రాబాద్: భారత గణతంత్ర వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామని తెలంగాణ సమాచార శాఖ కమిషనర్ ఆర్ వీ చంద్రవదన్ గురువారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఉదయం 10.30 గం. గవర్నర్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ఏడాది శకటాల ప్రదర్శన ఉండదని చెప్పారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేవారు పేపర్ జెండాలను మాత్రమే వాడాలని, ప్లాస్టిక్ జెండాలను వాడరాదని సూచించారు. చిన్నారులు ఇబ్బందులు పడని రీతిలో పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు చేస్తున్నట్లు చంద్రవదన్ పేర్కొన్నారు. -
సంయుక్తంగానే గణతంత్ర దినం
పరేడ్ గ్రౌండ్స్‌లో గవర్నర్ ప్రసంగం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన కారణంగా స్వాతంత్య్ర దిన వేడుకలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు విడివిడిగా నిర్వహించినా, గణతంత్ర దినోత్సవాలను మాత్రం సంయుక్తంగానే నిర్వహించనున్నారు. శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వారి అభీష్టంమేరకు నిర్వహించారు. అయితే జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించాల్సింది రాష్ట్రాల గవర్నర్లు మాత్రమే. రెండు రాష్ట్రాలకూ గవర్నర్ ఒకరే కావడం, హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తున్నందున గణతంత్ర వేడుకలను ఉమ్మడిగా నిర్వహిస్తారు. ఎప్పటిమాదిరిగానే నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్‌డే ఉత్సవాలు జరుగుతాయని అధికారవర్గాలు తెలిపాయి. ఈ ఉత్సవాలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఉన్నతాధికారులను ఆహ్వానిస్తామని చెప్పాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను, చేపట్టబోయే కార్యక్రమాలను గవర్నర్ ప్రసంగంలో వివరిస్తారని అధికారవర్గాలు తెలిపాయి. -
‘పోలీస్’కు హంగులు
గస్తీ సిబ్బందికి స్పెషల్ జాకెట్లు, కొత్త వాహనాలు పంద్రాగస్టు నుంచి అమల్లోకి.. పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభించనున్న సీఎం సాక్షి, సిటీబ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం పంద్రాగస్టు నుంచి ఉమ్మడి రాజధాని పోలీసులు సరికొత్త హంగులు సంతరించుకోనున్నారు. లండన్ పోలీసులకు దీటుగా ఇక్కడి పోలీసు వ్యవస్థను తీర్చిదిద్దేందుకు కావాల్సిన కసరత్తు ప్రారంభించారు. కొత్త ఇన్నోవా, బైకులతోపాటు గస్తీ (పెట్రోలింగ్) పోలీసులు సరికొత్త డ్రెస్సులో కనిపించనున్నారు. వీటిని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు లాంఛనంగా ప్రారంభిస్తారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జంట పోలీసు కమిషనరేట్లకు 1650 ఇన్నోవా వాహనాలు, 1500 బైకులు ఖరీదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.371 కోట్ల నిధులను ఇటీవల విడుదల చేసింది. ఈ నిధుల నుంచి తక్షణం కొన్ని వాహనాలను ఖరీదు చేసి పంద్రాగస్టు నుంచి తిప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌లు కసరత్తు చేపట్టారు. పెట్రోలింగ్ కార్లు, బైకులు ఆకర్షణీయంగా ఉండేలా స్టిక్కర్లను రూపొందించారు. ప్రత్యేక డ్రెస్ కోడ్... ప్రస్తుతం ఉన్న పోలీసు డ్రెస్ కోడ్‌ను కూడా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు విదేశాలకు ఓ ప్రత్యేక బృందాన్ని పంపించి అధ్యయనం చేయించాలని అధికారులు నిర్ణయించినా ప్రస్తుత ం డ్రెస్ కోడ్ విషయాన్ని పెండింగ్‌లో పెట్టారు. అయితే, పెట్రోలింగ్ పోలీసు సిబ్బందికి మాత్రం స్పెషల్ జాకెట్లు తయారు చేస్తున్నారు. డార్క్ బ్లూ కలర్లో ఈ జాకెట్లు రాబోతున్నాయి. పంద్రాగస్టు రోజు కొత్త వాహనాలపై బ్లూ జాకెట్లు ధరించిన పెట్రోలింగ్ పోలీసులు దర్శనమిస్తారు. ఈ జాకెట్లో మ్యాన్‌పాక్, సెల్‌ఫోన్, చిన్నపాటి బుక్, పెన్ను, విజిల్ తదితర పోలీసులకు ఉపయోగపడే వస్తువులు పట్టే విధంగా రూపొందించారు. ఇప్పటి వరకు ఈ విధానం సైబరాబాద్ ఐటీ కారిడార్ పెట్రోలింగ్ పోలీసులకు మాత్రమే ఉంది. ఇకపై జంట కమిషనరేట్లలో గస్తీ పోలీసులు ఈ డ్రస్ కోడ్‌లోనే కనిపిస్తారు. -
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష మరికొన్ని గంటల్లో నెరవేరబోతోంది. ఆరవై ఏళ్ల పోరాట ఫలం అతి త్వరలో అందబోతోంది. జూన్ రెండో తేదీని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినంగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో అన్నివర్గాలు ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో పెద్దఎత్తున వేడుకలు నిర్వహిస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం కూడా అధికారికంగా ఆవిర్భావ వేడుకలు చేపడుతోంది. ప్రభుత్వ యంత్రాంగం జూన్ ఒకటో తేదీ అర్ధరాత్రి నుంచి ఏకంగా వారం రోజులపాటు ఆవిర్భావ వేడుకలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రెండో తేదీ ఉదయం గచ్చిబౌలిలోని పోలీస్ కమిషనరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక తయారుచేశారు. అదేవిధంగా జూన్ ఐదో తేదీన కలెక్టరేట్లో జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులకు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, కవులు, కళాకారులకు సన్మానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 8న వికారాబాద్‌లో ఉత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. -
రాహుల్ సభకు గ్రౌండ్లే లేవు
'రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఎవరైనా జాన్తానై! వాళ్లకు మా గ్రౌండ్ ఇచ్చేది లేదు' అంటూ సైన్యం ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రాహుల్ గాంధీ ఎన్నికల సభ నిర్వహించాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలు బోల్తా పడ్డాయి. విద్యాసంస్థల్లో ఎన్నికల సభలు నిర్వహించకూడదన్న ఎన్నికల సంఘం నిబంధన పుణ్యమా అని నిజాం కాలేజీ గ్రౌండ్స్ కూడా దక్కే పరిస్థితులు లేవు. ఒక్క లాల్ బహదూర్ స్టేడియం తప్ప మరెక్కడా సభ నిర్వహించుకోవడం కుదరదు. దీంతో అన్ని ప్రధాన పార్టీలకూ హైదరాబాద్ లో సభలు నిర్వహించడం కష్టమైపోతోంది. దీంతో ఇప్పుడు హైదరాబాద్ లో సభ నిర్వహించడం కన్నా రోడ్ షో పెట్టుకోవడమే మేలన్న ఆలోచనలో ఉంది కాంగ్రెస్. ఎన్నికలు ఏప్రిల్ 30 న జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు కంగారులో ఉంది. 'అసలు రాహుల్ గాంధీ వస్తారా లేదా అన్నదే ఇప్పుడు మా సందేహం' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అంటున్నారు. ఒక్క కాంగ్రెసే కాదు అరవింద్ కేజరీవాల్, మేధా పాట్కర్ లతో సభ నిర్వహించాలన్న ఆప్ ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయినట్టే. దీంతో హైదరాబాద్ లో ఏ ప్రధాన రాజకీయ పార్టీ సభను పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్మీ పరేడ్ గ్రౌండ్స్, జింఖానా గ్రౌండ్స్ ను స్వాతంత్ర్య దినోత్సవం, రిపబ్లిక్ డేలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని ఆర్మీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
క్రీడోత్సాహం
జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో కడపలోని ఆ శాఖ పరెడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న క్రీడలు రెండో రోజైన శనివారం కూడా కొనసాగాయి. ఎస్పీ అశోక్‌కుమార్ పర్యవేక్షణలో ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణ, పోలీస్ సిబ్బంది ఆరు జట్లుగా పోటీల్లో పాల్గొన్నారు. అథ్లెటిక్స్ సహా వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ క్రీడాంశాల్లో పోలీసులు పోటీ పడ్డారు. ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్‌లోనూ తమ సత్తా చాటారు. మున్సిపల్ స్టేడియంలో బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించారు. మొత్తమ్మీద ఈ పోటీలు పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపాయి. - న్యూస్‌లైన్, కడప అర్బన్ -
మా తుఝే సలాం..
గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో విద్యార్థుల నృత్యప్రదర్శనలు అదరహో అనిపించాయి. విభిన్న వేషధారణ, సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తి భావాన్ని నింపాయి. మహబూబ్‌నగర్ కల్చరల్, న్యూస్‌లైన్: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆది వారం జి ల్లా కేంద్రంలోని పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. విద్యార్థు లు బృంద నృత్యాలు ప్రదర్శించి దేశభక్తి భావాన్ని నింపారు. కలెక్టర్, ఎస్పీ, జేసీ, ఏజేసీ, ట్రైనీ కలెక్టర్‌తో పాటు జి ల్లా అధికారులు చప్పట్లు చరిచి విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షే మ శాఖ విద్యార్థులు ‘ఈ జెండా అమరవీరుల త్యాగఫలం’ అన్న గీతానికి నృత్యం, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ కేడెట్లు ‘తెలుగింట పాడే జంబూరీ’ నృత్యం, వారు ప్రదర్శించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. జిల్లా కేంద్రంలో ని మైనార్టీ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ‘రుధిరనేత్ర అరుణారుణ కదనంతో ’ అం టూ వందేమాతరం ఫౌండేషన్ సౌజన్యంతో అ ద్భుతంగా నాట్యం చేశారు. గీతం హైస్కూల్, ఆ కృతి ఐస్కౌల్ విద్యార్థులు, నవాబ్‌పేట, దేవరక ద్ర కస్తూర్బా గాంధీ విద్యాలయాల విద్యార్థులు నృత్యాలతో అలరించారు. కార్యక్రమాల అనంతరం కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్‌లు ఆయా పాఠశాలల విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. -
మహనీయుల త్యాగాలు..
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్: సువిశాల భారతదేశం లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించేందుకు నిరంతరం పాటుపడిన మహనీయుల త్యాగాలు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. ఆదివారం పోలీసు పెరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన 65వ గణతంత్ర దినోత్సవంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. పెరేడ్‌ను తిలకించిన తర్వాత రాష్ట్రీయ సెల్యూట్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాలను అమలు చేస్తోందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ. 5 కోట్లు ఖర్చు చేశామన్నారు. అలాగే 80 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1668 కోట్ల రూపాయల పంట రుణాలను అందించామన్నారు. 2012 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 59,364 మంది రైతులకు నష్టపరిహారం కింద రూ. 52.51 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. గండికోట రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేసి మూడు టీఎంసీల నీరు నిల్వ చేశామన్నారు. శ్రీశైలం జలాశయం నుంచి తగినంత నీటి సరఫరా జరిగితే తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది రబీలో 60 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యంగా నిర్ణయించామన్నారు. జీఎన్ఎస్ఎస్లో అంతర్భాగమైన వామికొండ సాగర్ రిజర్వాయర్ ద్వారా మూడు వేల ఎకరాలకు, గండికోట లిఫ్ట్ ద్వారా ఐదు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. సంక్షేమానికి పెద్దపీట జిల్లాలోని మహిళా సంఘాలకు రూ. 487 కోట్ల బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ. 353 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. రుణాలు సక్రమంగా చెల్లించిన సంఘాలకు రూ. 28 కోట్లు వడ్డీ రూపంలో ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించిందన్నారు. స్త్రీ నిధి ద్వారా 17 వేల మంది సంఘ సభ్యులకు రూ. 30 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. బంగారుతల్లి పథకం కింద 2787 మందికి నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రాజీవ్ యువశక్తి కింద యువత స్వయం ఉపాధి కల్పన కోసం రూ. 3.70 కోట్లతో 370 యూనిట్ల స్థాపనకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందిరమ్మ, రచ్చబండ పథకాల కింద 3,76,190 ఇళ్లు మంజూరు కాగా, 2,49,685 పూర్తి చేశామని, మిగిలిన ఇళ్లను కూడా ప్రణాళిక బద్ధంగా పరిపూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ఉపాధి హామీ కోసం రూ. 150 కోట్లు ఖర్చు చేసి 20,471 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకోసం రూ. 6 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇందిర జలప్రభ కింద ఎస్సీ ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఏడవ విడతలో 10,582 మందికి 15,811 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ నిర్మల, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, డీఆర్వో ఈశ్వరయ్య, తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 386 మందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అప్రమత్తంగా లేకపోతే అంతే బియ్యం కోసం చౌకదుకాణానికి వెళ్లేటప్పుడుగానీ, తిరిగి వచ్చేటప్పుడుగానీ, దుకాణాలు, బజారులకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే గొలుసు దొంగల బారిన పడాల్సిందే. ఎన్నో సంవత్సరాలుగా కూడబెట్టుకున్న బంగారు ఆభరణాలు దొంగలపాలు కావాల్సిందే. మహిళలు ఎవరి జాగ్రత్తలో వారు ఉండటం మంచిది. - పాలగిరి మహేశ్వరి, శాస్త్రినగర్, కడప ఒంటరిగా వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మహిళలు ఒంటరిగా వెళ్లాల్సి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అనేకమార్లు సూచనలు ఇస్తూ ఉంటారు. ఆ సూచనలను తప్పక పాటించాలి. లేకపోతే విలువైన బంగారు ఆభరణాలను కోల్పోవాల్సి వస్తుంది. - బత్తల అంజనమ్మ, అక్కాయపల్లె, కడప పోలీసుల నిఘా పెరగాలి గొలుసు దొంగల విషయంలో పోలీసులు తమ శైలిని మార్చుకుని నిఘా పెంచాలి. ఎప్పటికప్పుడు నిందితుల నేరాల పద్ధతులను బట్టి పోలీసులు కూడా నిర్మానుష్య ప్రదేశాలలోఎవరైనా యువకులు గుంపులుగా గానీ, ఇద్దరు లేక ముగ్గురు గానీ మోటారు సైకిళ్లలో అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారిపై చర్యలు తీసుకోవాలి. - ఆర్.స్వప్న, అల్మాస్‌పేట, కడప మహిళలకు రక్షణ కల్పించాలి గొలుసు దొంగల బారి నుంచి మహిళలకు రక్షణ కల్పించాలి. బంగారు ఆభరణాలు వేసుకోవాలంటేనే భయమేస్తోంది. ఎక్కడ బంగారు చైన్లు పోగొట్టుకుంటామోనని మెడలలో తాడులు వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మహిళలు ఫిర్యాదు చేయడానికి వెళితేపోలీసులు కొన్ని సందర్భాలలో సరైన పద్ధతిలో స్వీకరించడం లేదు. -గౌసియా, అక్కాయపల్లె, కడప.