సికింద్రాబాద్: భారత గణతంత్ర వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తామని తెలంగాణ సమాచార శాఖ కమిషనర్ ఆర్ వీ చంద్రవదన్ గురువారం హైదరాబాద్లో వెల్లడించారు. ఉదయం 10.30 గం. గవర్నర్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ ఏడాది శకటాల ప్రదర్శన ఉండదని చెప్పారు.
గణతంత్ర వేడుకల్లో పాల్గొనేవారు పేపర్ జెండాలను మాత్రమే వాడాలని, ప్లాస్టిక్ జెండాలను వాడరాదని సూచించారు. చిన్నారులు ఇబ్బందులు పడని రీతిలో పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు చంద్రవదన్ పేర్కొన్నారు.