RV Chandravadan
-
‘సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయలేదు’
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆర్వీ చంద్రవదన్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసులో చట్టానికి లోబడి దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 27 మందికి నోటీసులిచ్చామని, 19 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. నోటీసులు ఇచ్చినవారిలో 12 మంది సినిమా ప్రముఖులు ఉన్నారని, వీరిలో ఇప్పటివరకు ఐదుగురు ప్రశ్నించినట్టు తెలిపారు. దర్యాప్తు ఆగస్టు 2 వరకు కొనసాగుతుందని, చట్టానికి లోబడి విచారణ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశామనడం కరెక్ట్ కాదని, న్యాయపరంగా ముందుకు వెళుతున్నామన్నారు. కేసు దర్యాప్తుపై కొంత మందికి కోర్టును వెళ్లారని, తాము కూడా న్యాయస్థానానికి సమాధానం ఇస్తామని చెప్పారు. న్యాయపరమైన సలహాలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నిందితుల నుంచి బలవంతంగా శాంపిల్స్ తీసుకోవడం లేదని, దౌర్జన్యం చేయడం లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి పనిచేస్తున్నామన్నారు. రక్త నమూనాలు ఇచ్చిన వారు భయపడాల్సిన పనిలేదన్నారు. పూర్తి నిబద్ధత, చట్టప్రకారం లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు చంద్రవదన్ ప్రకటించారు. -
‘సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయలేదు’
-
'గణతంత్ర వేడుకల్లో శకటాల ప్రదర్శన ఉండదు'
సికింద్రాబాద్: భారత గణతంత్ర వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తామని తెలంగాణ సమాచార శాఖ కమిషనర్ ఆర్ వీ చంద్రవదన్ గురువారం హైదరాబాద్‌లో వెల్లడించారు. ఉదయం 10.30 గం. గవర్నర్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ఏడాది శకటాల ప్రదర్శన ఉండదని చెప్పారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేవారు పేపర్ జెండాలను మాత్రమే వాడాలని, ప్లాస్టిక్ జెండాలను వాడరాదని సూచించారు. చిన్నారులు ఇబ్బందులు పడని రీతిలో పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు చేస్తున్నట్లు చంద్రవదన్ పేర్కొన్నారు. -
కనీస వేతన మండలి చైర్మన్‌గా సదానందం గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌గా మంద సదానందం గౌడ్ నియమితులయ్యారు. మండలిలో సభ్యుల జాబితాలో ఆరు మంది కార్మిక సంఘాల నేతలతో పాటు మరో ఆరు మంది యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి ఆర్వీ చంద్రవదన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులుగా నియమితులైన వారిలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, ఐఎన్టీయూసీ ముఖ్యకార్యదర్శి దేవసాని బిక్షపతి, బీఎంఎస్ ఉపాధ్యక్షుడు బి.రాజ్ రెడ్డి, ఏఐటీయూసీ ముఖ్యకార్యదర్శి టి.నరసింహ, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నారాయణ, హెచ్ఎంఎస్ గ్రేటర్ కార్యదర్శి పి.నరసింహ, ఫ్యాప్సీ ఉపాధ్యాక్షుడు వెన్నం అనిల్ రెడ్డి, సైనోడ్ ఆసియాపిక్ -ఎంఈఏ హెచ్ఆర్ డెరైక్టర్ ఉమా దేవగుప్తా, దక్షిణ భారత మిల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.సెల్వరాజు, ఈఎఫ్‌ఎస్‌ఐ తెలంగాణ శాఖ గౌరవ కార్యదర్శి ఎస్ఎల్ఎన్ మూర్తి, రిసోర్స్ ఇన్పుట్ హెచ్ఆర్ మేనేజర్ సీవీ మధుసూదన్ రావు, లేజర్ షేవింగ్ మేనేజర్ పి.పెంటారెడ్డిలతో పాటు ఇద్దరు స్వంతంత్ర సభ్యులు ఈ వెంకటేశన్, సీహెచ్ నారాయణ రెడ్డి ఉన్నారు. -
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ
21 మందితో కొత్త కార్యవర్గం ఉత్తర్వులు జారీచేసిన సర్కార్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా సీనియర్ సంపాదకులు అల్లం నారాయణను నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌తోపాటు పలు ప్రధాన పత్రికల సంపాదకులను ఇందులో సభ్యులుగా నియమించింది. ఈ మేరకు సమాచార శాఖ కమిషనర్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఆర్వీ చంద్రవదన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల్లోగా ప్రెస్ అకాడమీ పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు కేబినెట్ హోదాతోపాటు అన్ని లాంఛనాలు ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రెస్ అకాడమీ పనిచేస్తున్న చోటే తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ పనిచేయడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఆ అకాడమీ కార్యదర్శిని, సమాచార శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అకాడమీ పాలక మండలి పదవీ కాలం రెండేళ్లపాటు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు: టంకశాల అశోక్, వి.మురళి, కె.శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మ య్య, కె.శేఖర్‌రెడ్డి, సీఆర్ గౌరీశంకర్, కె.శ్రీనివాస్‌రెడ్డి, జహీర్ అలీఖాన్, వినయ్‌వీర్, ఎన్.వేణుగోపాల్,ఎం.నారాయణరెడ్డి, కొమరవెల్లి అంజయ్యలతోపాటు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సమాచార శాఖ నామినీ, తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా వర్సిటీ జర్నలిజం విభాగాల అధిపతులు, దూరదర్శన్ స్టేషన్ డెరైక్టర్, సమాచార శాఖ డెరైక్టర్, ప్రెస్ అకాడమీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.