కనీస వేతన మండలి చైర్మన్‌గా సదానందం గౌడ్ | minimum wage is the chairman of the board of the Goud sadanandam | Sakshi
Sakshi News home page

కనీస వేతన మండలి చైర్మన్‌గా సదానందం గౌడ్

Published Fri, Nov 28 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:14 PM

minimum wage is the chairman of the board of the Goud sadanandam

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌గా మంద సదానందం గౌడ్ నియమితులయ్యారు. మండలిలో సభ్యుల జాబితాలో ఆరు మంది కార్మిక సంఘాల నేతలతో పాటు మరో ఆరు మంది యాజమాన్యాల ప్రతినిధులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి ఆర్‌వీ చంద్రవదన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

సభ్యులుగా నియమితులైన వారిలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, ఐఎన్‌టీయూసీ ముఖ్యకార్యదర్శి దేవసాని బిక్షపతి, బీఎంఎస్ ఉపాధ్యక్షుడు బి.రాజ్ రెడ్డి, ఏఐటీయూసీ ముఖ్యకార్యదర్శి టి.నరసింహ, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నారాయణ, హెచ్‌ఎంఎస్ గ్రేటర్ కార్యదర్శి  పి.నరసింహ, ఫ్యాప్సీ ఉపాధ్యాక్షుడు వెన్నం అనిల్ రెడ్డి, సైనోడ్ ఆసియాపిక్ -ఎంఈఏ హెచ్‌ఆర్ డెరైక్టర్ ఉమా దేవగుప్తా, దక్షిణ భారత మిల్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.సెల్వరాజు, ఈఎఫ్‌ఎస్‌ఐ తెలంగాణ శాఖ గౌరవ కార్యదర్శి ఎస్‌ఎల్‌ఎన్ మూర్తి, రిసోర్స్ ఇన్‌పుట్ హెచ్‌ఆర్ మేనేజర్ సీవీ మధుసూదన్ రావు, లేజర్ షేవింగ్ మేనేజర్ పి.పెంటారెడ్డిలతో పాటు ఇద్దరు స్వంతంత్ర సభ్యులు ఈ వెంకటేశన్, సీహెచ్ నారాయణ రెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement