వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపధ్యంలో ట్రంప్ ఆదేశాల మేరకు స్థానిక చట్ట అమలు సంస్థలు అక్రమ వలసదారులపై చర్యలు మొదలుపెట్టాయి. తాజాగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) న్యూయార్క్‌లో అక్రమంగా ఉంటున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేసింది.
న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ బరోలోని ఫుల్టన్ ప్రాంతంలో నలుగురు బంగ్లాదేశీయులను ఐసీఈ అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ప్రోథోమ్ అలో తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్ వలసలకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులను జారీ చేసినప్పటి నుండి అక్రమ వలసదారుల్లో ఆందోళన మొదలయ్యిందని ఆ వార్తాపత్రిక పేర్కొంది.
న్యూయార్క్‌లో బంగ్లాదేశీయులు అధికంగా నివసించే ప్రాంతాల్లోని వీధులు, రెస్టారెంట్లు ఇప్పుడు దాదాపు నిర్మానుష్యంగా మారాయని ఆ పత్రిక నివేదించింది. చట్ట అమలు అధికారి ఖాదీజా ముంతాహా రూబా తెలిపిన వివరాల ప్రకారం తగిన ధృవపత్రాలు లేకుండా సంచరిస్తున్న నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేశారు. ఇక్కడి బంగ్లాదేశీయులు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా చట్ట అమలు సంస్థ సభ్యులు వారిని ప్రశ్నిస్తే వారు సహకరించాలని ముంతాహా రూబా సూచించారు. కాగా గత కొన్ని దశాబ్దాల్లో అమెరికాకు వస్తున్న బంగ్లాదేశీయుల సంఖ్య మరింతగా పెరిగింది. న్యూయార్క్ నగరంలోని ఆసియా జాతి సమూహాలలో బంగ్లాదేశీయులు పెద్దసంఖ్యలో ఉన్నారని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి
Comments
Please login to add a commentAdd a comment