అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన తొలి రోజునే పలు కీలక నిర్ణయాలకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. వాటిలో ముఖ్యమైనవి ఇలా..
క్షమాపణలు: 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనం మీద దాడి చేసిన కేసులో దోషులుగా తేలిన 1,600 మందికి క్షమాభిక్ష పెడుతూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
నేషనల్ ఎమర్జెన్సీ: మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు.
ఇంధన శక్తి: ట్రంప్ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శిలాజ ఇంధన డ్రిల్లింగ్‌ను విస్తరించి, బైడెన్ విధించిన ఎలక్ట్రిక్ వాహన ఆదేశాన్ని తొలగిస్తానని హామీ ఇచ్చారు.
పారిస్ ఒప్పందం: పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫైల్ మీద సంతకం చేశారు.
ప్రభుత్వ నియామకాలు: కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయిలో పట్టు సాధించే వరకూ ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలను నిలిపివేస్తూ, ట్రంప్ మరో ఆర్డర్ జారీ చేశారు. అయితే సైన్యంతో పాటు కొన్ని విభాగాల్లో నియామకాలకు మినహాయింపు ఉంటుంది.
విధులకు తిరిగి హాజరు: ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులంతా ఆఫీసుల్లో విధులకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కోరారు.
భావప్రకటన స్వేచ్చ: భావప్రకటన స్వేచ్చ పునరుద్ధరణకు సంబంధించి ఆదేశాలను ట్రంప్ జారీ చేశారు. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహిస్తానని అన్నారు.
బర్త్‌రైట్ సిటిజన్‌షిప్: అమెరికాలో పుట్టిన వారికి అమెరికా పౌరసత్వం వస్తుందనే 150 ఏళ్ల క్రితం నాటి రాజ్యాంగబద్దమైన హక్కు హాస్యాస్పదమైనదని, దీనిని తొలగిస్తానని ట్రంప్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment