దేశమంటే మట్టి కాదోయ్... దేశభక్తి అంటే మాటలు కాదోయ్... | Independence Day celebrations | Sakshi
Sakshi News home page

దేశమంటే మట్టి కాదోయ్... దేశభక్తి అంటే మాటలు కాదోయ్...

Published Sat, Aug 15 2015 5:36 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

దేశమంటే మట్టి కాదోయ్...    దేశభక్తి అంటే మాటలు కాదోయ్...

దేశమంటే మట్టి కాదోయ్... దేశభక్తి అంటే మాటలు కాదోయ్...

స్వరాజ్య శోభ

స్వాతంత్య్ర దినోత్సవాలకు నగరం సిద్ధమైంది. పరేడ్ గ్రౌండ్స్‌తో పాటు గోల్కొండ కోటలో ఉత్సవాలు  పెద్ద ఎత్తున నిర్వహించేందుకు
 అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు... వివిధ ప్రదర్శనలకు సన్నాహాలు చేస్తున్నారు.  పోలీసులు నగరంలో
 విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరికి ఉగ్రవాద సంస్థ హుజీతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు.

 
నో యువర్ ఆర్మీ
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఆంధ్రసబ్ ఏరియా ఆర్మీ ఆధ్వర్యంలో శనివారం వివిధ యుద్ధాల్లో పాల్గొన్న యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను ప్రదర్శించారు. దీనిని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, పౌరులు ఆసక్తిగా తిలకించారు. వాటి వివరాలను ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే 72ఎం1 ట్యాంకులు, మిషన్ గన్స్, రాకెట్ లాంచర్లు, శత్రువుల కదలికలను పసిగట్టే బైనాక్యూలర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.     
     -రసూల్‌పురా
 
మువ్వన్నెలు...
 హిమాయత్‌నగర్‌లోని ఇన్‌స్టిట్యూటో డిజైన్ ఇన్నొవేషన్... పంద్రాగస్టు వేడుకల్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మువ్వన్నెల్ని ‘ధరించిన’ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థినులు ముచ్చటైన ముస్తాబులో అలరించారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమాన్ని సంస్థ డెరైక్టర్ రూపేష్‌గుప్తా పర్యవేక్షించారు.
 - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి
 
ఏదో ఒక రోజు మువ్వన్నెల జెండాకు సెల్యూట్ కొట్టి సంబరపడడమా? క్రికెట్‌లో మన జట్టు చేతిలో పాకిస్థాన్ ఓడిపోతే టపాసులు కాల్చడమా? విదేశాల్లో మన సినిమాల కలెక్షన్లు చూసి కాలరెగరేయడమా?... ఇదేనా దేశభక్తి? ఇంకేదైనా ఉందా? ఈ విషయంపై నగరానికి చెందిన   భిన్నరంగాల ప్రముఖులతో మాట్లాడితే...
 
 గుడ్  సిటిజన్‌గా...
 సిటిజన్ బాధ్యత గుర్తు ఉంచుకోవాలి. సొసైటీ పట్ల మన రెస్పాన్సిబులిటీ తెలుసుకుని ప్రతి ఒక్కరూ గుడ్ సిటిజన్ అనిపించుకుంటే చాలు. దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. మన సంస్కృతికి విలువనిచ్చి వాటికి దూరం కాకుండా దేశాన్ని ముందుకు తీసుకెళితే  అందరికన్నా గొప్ప అవుతాం. మనకున్న చరిత్ర, సంప్రదాయ వైభవం ఏ దేశానికీ లేదు. చరిత్రకారులను గుర్తుంచుకుని స్ఫూర్తి పొందాలి. త్వరలో రవీంద్రభారతిలో రుద్రమ ప్రదర్శన ఇవ్వనున్నాను. అంత గొప్ప పాత్రలను ధరించేటప్పుడు ఎంతో ఉద్విగ్నంగా అనిపిస్తుంది.
 -అలేఖ్య పుంజల, నృత్యకారిణి
 
 
 ‘స్వచ్ఛ’త...
 దేశభక్తి అంటే నా దృష్టిలో తొలుత మనం ఉండేచోటు నుంచి మొదలుకుని పరిశుభ్రం చేసుకుంటూ వెళ్లడమే. చుట్టుపక్కల శుభ్రంగా ఉంటే మైండ్ కూడా క్లీన్‌గా ఉంటుంది. ఆ తర్వాత మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడం, సాటి మనిషికి సాయం చేసే స్థాయికి ఎదగడం, అలా దేశానికి కూడా ప్రయోజనం కలిగించే మనిషి అవుతాం. స్వాతంత్య్ర దినోత్సవం నాడు స్కూల్లో జెండా వందనంతో పాటు స్వీయ క్రమశిక్షణనూ పిల్లల మైండ్‌లోకి ఎక్కించాలి.
-సురేష్, సినీనటుడు

ఒకరికొకరు సాయం కావాలి...
 ఇది మన 69వ ఇండిపెండెన్స్‌డే. నేను ఆ వేడుకను ప్రతిఫలించే దుస్తులను ధరించాను. ఇంతకన్నా ఖరీదైన, డిజైనర్ దుస్తులు ధరించినప్పుడు కూడా లేనంత సంతోషంగా అనిపిస్తుంది. భారతీయులుగా పుట్టినందుకు గర్వంగా ఫీలవ్వాలి. ఇండియాని అగ్రస్థానంలో నిలిపే పనిలో అందరం భాగస్వాములవ్వాలి. సాటి మనిషి జీవితం తను హాయిగా గడిపేందుకు ప్రతి ఒక్కరూ తన వంతు సాయం చేయాలి. ముఖ్యంగా మహిళ తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయగలిగితే, కుటుంబం మొత్తాన్ని దారిలో పెడుతుంది. అంటే మహిళలకు చేయూతని అందించడం అంటే పరోక్షంగా సమాజానికి ఇచ్చినట్టే.
 -రేఖ లహోటి, చైర్‌పర్సన్ ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్
 
 అభివృద్ధిలో పాలుపంచుకోవడం...
 స్వాతంత్య్ర దినోత్సవ పండుగ తర్వాతా ఆ స్ఫూర్తిని మిగిలిన 364 రోజులూ కొనసాగించి దేశాభివృద్ధిలో పాటుపడాలి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి విలువలు నేర్పి అభివృద్ధి కారకులుగా తీర్చిదిద్దాలి. మన ఇంట్లో, చుట్టుపక్కల మొక్కలు నాటడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం... ఇవన్నీ అభివృద్ధి ప్రక్రియలో భాగమే. నాడు 1917 నుంచి 30 ఏళ్ల పాటు నిరంతరం పోరాడారు గాంధీ. అలాగే నేతాజీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్, భగత్‌సింగ్... ఇలా ఎందరో. వారి స్ఫూర్తిని అంది పుచ్చుకుని దేశాభివృద్ధికి బాటలు వేసుకోవాలి.     - చంద్రబోస్, సినీ గేయ రచయిత
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement