Golconda Fort
-
పర్యాటకంలో సత్తా చాటుతున్న భాగ్యనగరం
చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ టూంబ్స్ తదితర ల్యాండ్ మార్కుల ద్వారా అందివచి్చన గొప్ప సాంస్కృతిక వారసత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి నిలయంగా ప్రపంచ వేడుకలకు చిరునామాగా మారిన ఆధునిక తత్వం వెరసి ప్రపంచ పర్యాటకులకు నగరాన్ని గమ్యస్థానంగా మారుస్తున్నాయి. ఇవే కాకుండా భారీ సినిమాల తయారీ కేంద్రంగా కళలు, ప్రసిద్ధ వంటకాలు కూడా వృద్ధికి ఊతమిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం రూపొందించిన పర్యాటక పాలసీ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్త పర్యాటకాభివృద్ధికి మరింత దోహదం చేయనుంది. ఈ నేపథ్యంలో నగర పర్యాటక రంగ వృద్ధి విశేషాలపై ఓ విశ్లేషణ. నగర పర్యాటక అభివృద్ధిలో బిజినెస్ టూరిజమ్ కీలక పాత్ర పోషిస్తోంది. అంతర్జాతీయ కంపెనీలు, పెట్టుబడుల రాకతో ప్రపంచ స్థాయి వాణిజ్య సదస్సులు, సమావేశాలకు వేదికగా, వ్యాపార పర్యాటకానికి నగరాన్ని ప్రధాన గమ్యస్థానంగా మార్చాయి. అదే విధంగా శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆరోగ్య వసతులు, కార్పొరేట్ ఆస్పత్రులు విదేశాలతో పోలిస్తే అందుబాటులోనే ఉన్న వైద్య సేవల వ్యయం నగరాన్ని ఆరోగ్య పర్యాటకానికి రాజధానిగా మారుస్తున్నాయి. మెట్రో టు.. ఎయిర్ ట్రా‘వెల్’.. నగర పర్యాటక వృద్ధికి నిదర్శనంగా నిలుస్తోన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 72 దేశీయ, 18 అంతర్జాతీయ ప్రయాణ గమ్యస్థానాలకు ప్రయాణ సౌకర్యాలను అందిస్తోంది. గత 2023–24లో నగరం నుంచి సుమారు 20లక్షల మంది అమెరికా, యుకేలకు ప్రయాణించారు. ఇందులో గణనీయమైన భాగం విద్యార్థులు, నిపుణులు ఉన్నారు. ప్రయాణికుల సంఖ్య 2021లో 8 లక్షల నుంచి 2022లో 12.4 లక్షలకు, 2023లో దాదాపు 21 లక్షలకు, 2024లో దాదాపు 25 లక్షలకు పెరిగింది. ఇది సుమారు 45.6% సమీకృత వార్షిక వృద్ధి రేటుగా సూచిస్తుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) డేటా ప్రకారం.. 2023 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2024 వరకూ చూస్తే.. దేశంలోని టాప్ 5 మెట్రో నగరాల్లో ప్రయాణికుల రద్దీ పరంగా సిటీ అత్యధిక వృద్ధి సాధించింది. నగరం 11.7% పెరుగుదలను సాధించగా బెంగళూరు (10.1%) ముంబై (4%), కోల్‌కతా 9.7%, చెన్నై 3.3 శాతంతో వెనుకబడ్డాయి. ఫుల్.. హోటల్స్.. ప్రస్తుతం, రాష్ట్రంలో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటల్స్ పరంగా చూస్తే.. 7,500 గదులు అందుబాటులో ఉన్నాయని అంచనా. వీటిలో మన హైదరాబాద్ నగరంలోనే 5,000 వరకూ ఉన్నాయి. రాజధాని నగరంలో అడుగుపెట్టిన వారి సంఖ్య ఏడాదిలో 16 శాతానికి పైగా పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నగరంలోని ఐటీ కారిడార్‌లోని హోటళ్లు దాదాపు 80 శాతం ఆక్యుపెన్సీతో కళకళలాడుతున్నాయని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట రెడ్డి చెబుతున్నారు. దేశీయ పర్యాటకులు 2021–22లో 3.2 లక్షల మంది, 2022–23లో 6.07 లక్షల మంది తెలంగాణను సందర్శించారని, 89.84 శాతం పెరుగుదల నమోదు చేసిందని లెక్కలు చెబుతున్నాయి. ఇదే కాలంలో విదేశీ పర్యాటకులు 5,917 నుంచి 68,401 (10–56.01 శాతం)కి పెరిగారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వృద్ధిలో సింహభాగం నగరానికే దక్కుతుందనేది తెలిసిందే.రానున్నాయ్ ఆకర్షణలెన్నో.. ముంబయిలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ను నెలకొల్పే ముందు వరకూ కూడా భారీ స్థాయి సమావేశాలకు నగరంలోని హెచ్ఐసీసీ ప్రముఖ గమ్యస్థానంగా ఉంది. అయితే ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో 10,000 సీట్ల సామర్థ్యం గల కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇది ఎమ్ఐసీఎఫ్ సెగ్మెంట్లో నగరాన్ని తిరిగి అగ్రస్థానంలో ఉంచుతుందని ప్రభుత్వాధినేతలు చెబుతున్నారు. ఇటీవలే హుస్సేన్ సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్‌ను ప్రారంభించారు. దుబాయ్ తరహా షాపింగ్ మాల్స్ సహా ఇంకా మరెన్నో ఆకర్షణలు నగర పర్యాటకానికి మరింత ఊపు తేనున్నాయి.నగరం వెలుపల కూడా.. నగరంలోని చారిత్రాత్మక కట్టడాలతో పాటు సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం, లాడ్ బజార్ వంటివి హిస్టారికల్ టూరిజం వృద్ధికి దోహదం చేసే విశేషాలుగా నిలుస్తున్నాయి. ఇక నగరానికి కాస్త దూరంలోనే ఉన్న యాదాద్రి, బాసర, నల్గొండ, మెదక్, రామప్ప, ఆలంపూర్, వేములవాడ, కాళేశ్వరం.. వంటి చోట్ల స్పిరిట్యువల్ టూరిజం వృద్ధికి కారణంగా నిలుస్తున్నాయి. అలాగే పోచంపల్లి, గద్వాల్, నారాయణ పేట్ వంటివి సంప్రదాయ హస్తకళల పట్ల ఆసక్తి కలిగిన పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. -
గోల్కొండ కోటలో ఇండియన్ ఆర్మీ ‘నో యువర్ ఆర్మీ’ మేళా (ఫొటోలు)
-
రక్షణ రంగంలో భారత్ అగ్రగామి: గవర్నర్
గోల్కొండ (హైదరాబాద్): రక్షణ రంగంలో భారత దేశం అగ్రగామిగా ఉందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. శుక్రవారం గోల్కొండ కోటలో ఆయన ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసిన ‘నో యువర్ ఆర్మీ’మేళాను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ మేళాలో సైన్యం వాడే ఆయుధాలను ప్రదర్శించారు. ప్రదర్శనను ప్రారంభించిన తర్వాత గవర్నర్ ఒక్కో స్టాల్‌ను తిరిగి అక్కడ ప్రదర్శనలో పెట్టిన ఆయుధాలను చూసి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడు తూ యుద్ధంలో వాడే వివిధ రకాల ఆయు« దాలను ఎక్కువ శాతం మన దేశమే సొంతంగా తయారు చేసుకుంటోందన్నారు. మన దేశం రక్షణ రంగంలో ప్రపంచంలోనే మేటి అని, అత్యాధునికమైన, ఖరీదైన ఆయుధాలు భారత్ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. మొట్టమొదటి సారి ఆర్మీవారు తమ ఆయుధాలను ప్రజల కోసం ప్రదర్శనకు పెట్టారని తెలిపారు. అనంతరం గవర్నర్ వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులతో ముచ్చటించారు. ఇదిలా ఉండగా ‘నో యువర్ ఆర్మి’మేళా పర్యాటకులతో పాటు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.‘నో యువర్ ఆర్మీ’మేళాలో తుపాకీ పరిశీలిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ -
విశ్వ వేదికపై తెలంగాణ బ్రాండ్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి. విశ్వవేదికపై తెలంగాణ బ్రాండ్‌ను సగర్వంగా చాటాలి. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురంచి సమగ్రంగా వివరించాం. ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణను పరిచయం చేశాం. ఈ సందర్భంగా, దావోస్ పర్యటన సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి కార్యాచరణ ప్రారంభించాం.పోరాడి సాధించుకున్న తెలంగాణలో దశాబ్దం తర్వాత నిజమైన ప్రజాపాలన మొదలైంది. లోతైన సమీక్షలతో మంచీ చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ, స్ఫూర్తితో పాలన చేస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం గోల్కొండ కోటపై ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.స్వేచ్ఛా స్వాతంత్య్రాల పునరుద్ధరణ‘అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరు ద్ధరిస్తామన్నాం. అక్షరాలా చేసి చూపిస్తున్నాం. పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈ రోజు తెలంగాణలో ఉంది. మా ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉంది. గత పదేళ్లలో రాష్ట్ర అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది.రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.75,577 కోట్లు ఉన్న అప్పు, 2023 డిసెంబర్ నాటికి రూ.7 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థకు చికిత్స చేస్తున్నాం. అమెరికా పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో జరిగిన భేటీలో తక్కువ వడ్డీలతో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై సానుకూల చర్చలు జరిగాయి. గతంలో మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ప్రజలపై భారం మోపం’ అని రేవంత్ చెప్పారు. త్వరలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు‘ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీల అమలు బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ప్రారంభించి చరిత్ర సృష్టించాం. మహా లక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాల ద్వారా జూలై నాటికి మహిళలు రూ. 2,619 కోట్లు ఆదా చేయగలిగారు. ఆరోగ్యశ్రీ వైద్యచికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ అమలు చేయాలని నిర్ణయించాం. ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీని త్వరలో ప్రారంభిస్తాం. రూ.500కే వంట గ్యాస్ సరఫరాతో 43 లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. గృహజ్యోతి పథకం కింద 47,13,112 పేదల గృహాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం‘ధరణిలో అనేక అవకతవకలు జరిగినట్టుగా గుర్తించాం. భూ సమస్యల పరిష్కారానికి సరికొత్త సమగ్ర చట్టం తీసుకురావాలని భావిస్తున్నాం. డ్రగ్స్ విషయంలో జీరో టాలరెన్స్‌ను అనుసరిస్తున్నాం. సైబర్ నేరాల బాధితులకు సత్వర సహాయం అందేలా 1930 నంబర్‌తో 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నాం. బేగరి కంచె వద్ద యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశాం..’ అని సీఎం పేర్కొన్నారు. అమరవీరులకు సీఎం నివాళిసాక్షి, హైదరాబాద్/రసూల్‌పురా: స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని గురువారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ముందుగా జూనియర్ సైనికుడు ఒకరు నివాళులర్పించిన అనంతరం ఆర్మీ అధికారులు, సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి.. పలువురు ఆర్మీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. కాగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కూడా రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. నిరుద్యోగులు చెప్పుడు మాటలు వినొద్దు‘రాష్ట్రంలో 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. శాసనసభలో జాబ్ క్యాలెండర్ ప్రవేశ పెట్టాం. నిరుద్యోగ యువత చెప్పుడు మాటలు విని భవిష్యత్తును చెడగొట్టుకోవద్దు. 63 లక్షల మంది మహిళలను వ్యాపార, పా రిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇందిర మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేశాం. 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. పొరుగు రాష్ట్రాలు, కేంద్రంతో స్నేహ పూర్వకంగా, సఖ్యతతో వ్యవహరిస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘రైతన్నలకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ ఓ అద్భుత ఘట్టం..’ అని అన్నారు. -
గోల్కొండ కోటపై ఘనంగా పంద్రాగష్టు పండుగ (ఫొటోలు)
-
గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి
-
గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి... స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినమని పేర్కొన్నారు.రాజ్‌భవన్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ.. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఇరిగేషన్, ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకు వెళ్తుందన్నారు. ఎన్నో త్యాగాలు, పోరాటాల వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు.అహింస, సత్యాగ్రహం అనే శక్తివంతమైన ఆయుధాల వల్ల దేశానికి స్వాతంత్ర సాధన సాధ్యమైంది. గాంధీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్రం ఏర్పడింది. బ్రిటిష్ రూల్ నుంచి విముక్తి లభించింది. ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారతదేశ ఎదగడం మనందరికీ గర్వకారణం’’ అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. -
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబవుతున్న గోల్కొండ కోట (ఫొటోలు)
-
వారసత్వ కట్టడాలకు తెలంగాణ పెట్టింది పేరు: రేవంత్‌రెడ్డి
గోల్కొండ (హైదరాబాద్): వారసత్వ కట్టడాలకు, శతాబ్దాల సంస్కృతికి తెలంగాణ పెట్టింది పేరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన గోల్కొండ కోట సమీపంలోని కుతుబ్షాహి సమాధుల ప్రాంగణంలో పునరుద్ధరణ ప్రాజెక్టు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇతర అధికారులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్‌షాహీలు పాలించిన ఈ ప్రాంతం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందని అన్నారు.రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. మరిన్ని చారిత్రక కట్టడాలను పునరుద్ధరించి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఆఘాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సంస్థ 106 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిందని తెలిపారు. ముందు ముందుకూడా చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనుల్లో ఆఘాఖాన్ ట్రస్టు ఫర్ కల్చర్ సంస్థ సేవలను ఉపయోగించుకుంటామని వెల్లడించారు. తెలంగాణలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నామని దీని ఫలితంగా రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్య పెరిగిందని చెప్పారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. అనంతరం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ తాను విద్యారి్థగా ఉన్న సమయంలో కుతుబ్‌షాహీ సమాధుల వద్దకు స్కూల్ నుంచి విజ్ఞాన, విహార యాత్రకు వచ్చేవారమని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ రహీమ్ ఆఘాఖాన్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్, రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి వాణిప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. -
మోదీ హయాంలోనే పర్యాటక అభివృద్ధి
హైదరాబాద్(గోల్కొండ): ప్రధాని మోదీ హయాంలోనే పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందింద ని ఆ శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. బుధవా రం గోల్కొండ కోటలో సరికొత్తగా ఏర్పాటు చేసిన లేజర్ బేస్డ్ లైట్ అండ్ సౌండ్ షోను సినీనటుడు చిరంజీవితో కలిసి కేంద్రమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ హయాంలోనే అన్ని రాష్ట్రాలలో టూరిజంకు ఆదరణ పెరిగిందని, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు. గోల్కొండ కోటలో ప్రస్తుతమున్న లైట్ అండ్ సౌండ్ షోకు మరింత ఆధునిక సాంకేతికత జోడించి పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తయారు చేశామన్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షో ప్రతి రోజూ మూడు భాషల్లో ఉంటుందని చెప్పారు. తెలంగాణతోపాటు హైదరాబాద్ నగరానికి కూడా పర్యాటకులు ఎక్కువగా వచ్చేలా ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేస్తామన్నారు. కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లను రూ.1300 కోట్లతో ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్షో వచ్చే నెలలో ప్రారంభమవుతుందని, దీనికి వాడుతున్న లేజర్ లైట్లు దేశంలోనే అత్యుత్తమమైనవని తెలిపారు. వరంగల్ కోటలో కూడా లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేస్తామని, వెయ్యి స్తంభాల గుడిని అభివృద్ధి చేయడానికి కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. గిరిజన పర్యాటక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, శక్తిపీఠమైన జోగుళాంబ ఆలయాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ తాను కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నప్పుడు గోల్కొండ కోటలో 50 దేశాల ప్రతినిధులతో సమావేశమైన వారికి లైట్ అండ్ షో చూపించామన్నారు. మగధీరతో పాటు రామ్‌చరణ్‌తో కలిసి గోల్కొండ కోటలో తాను సినిమా షూటింగ్లో పాల్గొన్న రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ యూఎస్.రావత్ పాల్గొన్నారు. -
ఆశీర్వదించండి!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ నేడు నిరంతర విద్యుత్తు వెలుగులు, పంట కాల్వలు, పచ్చని చేలతో కళకళలాడుతోంది. మండే ఎండల్లో సైతం చెరువులు మత్తడి దుంకుతున్నయి. చెక్ డ్యాములు నీటి గలగలలతో తొణికిసలాడుతున్నాయి. కాళేశ్వర జలధారలతో గోదావరి సతత జీవధారయై తెలంగాణ భూములను తడుపుతోంది. ఇరవైకి పైగా రిజర్వాయర్లతో తెలంగాణ పూర్ణకలశం వలె తొణికిసలాడుతోంది. దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా విలసిల్లుతోంది. సంక్షేమం, అభివృద్ధిలో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తోంది. తెలంగాణ అపూర్వ ప్రగతిని చూసి యావద్దేశం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఈ పురోగమనం ఇదే రీతిన కొనసాగే విధంగా రాష్ట్ర ప్రజలు తమ సంపూర్ణమైన ఆశీర్వాద బలాన్ని అందించాలి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. నాడు ఆత్మహత్యలు, ఆకలి చావులు! పదేళ్ల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవన చిత్రాన్ని తలుచుకుంటే ఇప్పటికీ దుఖం తన్నుకొస్తుంది. ఎడతెగని కరెంటు కోతలు, అర్ధరాత్రి మోటరు పెట్టబోయి కరెంటు షాకుకో, పాము కాటుకో బలైపోయిన రైతన్నలు. అప్పుల ఊబిలో చిక్కి ఆత్మహత్యలే శరణ్యమైన అన్నదాతలు. ఉరి పెట్టుకుంటున్న చేనేత కార్మికులు. యువకులంతా వలసెల్లిపోతే ముసలివాళ్లే మిగిలిన పల్లెలు. ఎటుచూసినా ఆకలిచావులు, హాహాకారాలు. ఇలాంటి అగమ్యగోచర పరిస్థితుల నడుమ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక పవిత్ర యజ్ఞంగా నిర్వహించింది. అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. నేడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి ఒక దేశం, రాష్ట్రం సాధించిన ప్రగతికి తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగాన్ని సూచికలుగా పరిగణిస్తారు. ఈ రెండింటిలోనూ తెలంగాణ దేశంలో నంబర్ 1గా నిలిచింది. రూ.3,12,398 తలసరి ఆదాయంతో, 2,126 యూనిట్ల తలసరి విద్యుత్తు వినియోగంతో తొలి స్థానంలో ఉంది. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. తొమ్మిదిన్నరేళ్లలో రూ.37 వేల కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా స్థిరీకరించింది. కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ వక్ర భాష్యాలు చెబుతున్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తు చాలని వ్యాఖ్యానిస్తున్నారు. వీరికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని విశ్వసిస్తున్నా. సాగునీరు, వైద్యారోగ్య రంగంలో ప్రగతి మిషన్ కాకతీయ, పెండింగు ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులతో తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించినా కేసులు వీగిపోయాయి. పర్యావరణ అనుమతులు లభించాయి. స్వల్ప కాలంలోనే 21 వైద్య కశాళాలలను ప్రారంభించి రాష్ట్రం చరిత్ర సృష్టించింది. మరో 8 మెడికల్ కాలేజీలను త్వరలోనే ప్రారంభించి, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. హైదరాబాద్ చుట్టూ 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, నిమ్స్ విస్తరణ శరవేగంగా జరుగుతున్నాయి. అనాథ పిల్లలను ‘స్టేట్ చి్రల్డన్’గా గుర్తిస్తూ వారికోసం ప్రత్యేక పాలసీని ప్రభుత్వం రూపొందించింది. విద్యారంగ వికాసం..ఐటీలో మేటి వెయ్యికి పైగా గురుకుల జూనియర్ కళాశాలలు ప్రారంభించాం. మన ఊరు–మన బడి, మన బస్తీ–మన బడి పేరుతో రాష్ట్రంలోని 26 వేలకు పైగా పాఠశాలలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నాం. రూ.20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్లను అందిస్తున్నాం. టీఎస్ ఐపాస్ చట్టం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో పారిశ్రామిక రంగంలో నూతనోత్తేజం వచ్చింది. రూ.2.51 లక్షల కోట్ల పెట్టుబడులతో రా్రష్రానికి కొత్త పరిశ్రమలు వచ్చాయి. 17.21 లక్షల మందికి ఉపాధి లభించింది. రాష్ట్రంలో 6 లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్ల నుంచి రూ.2,41,275 కోట్లకు పెరిగాయి. త్వరలో ‘తెలంగాణ చేనేత మగ్గం’ దళితబంధు కింద దళిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం. ప్రభుత్వ లైసెన్సు వ్యాపారాల్లో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు, బీసీల్లోని వృత్తిపనుల వారికి, మైనారిటీలకు రూ.లక్ష సాయం, ధూపదీప నైవేద్యం పథకం కింద అందించే మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంపు, గొర్రెల పంపిణీ, చేపల పెంపకం, ఈత, తాటి చెట్లపై పన్ను రద్దు, మద్యం దుకాణాల్లో గౌడలకు 15శాతం రిజర్వేషన్లు, గీతన్న, నేతన్నలకు రూ.5 లక్షల బీమా, నేత కార్మికులకు నూలు రసాయనాలపై 50 శాతం సబ్సిడీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ఫ్రేమ్ మగ్గాల పంపిణీకి ‘తెలంగాణ చేనేత మగ్గం’అనే కొత్త పథకాన్ని అమలు చేయనున్నాం. ఆసరా పెన్షన్లను రూ.200 నుంచి రూ.2,016కు, లబ్దిదారుల సంఖ్యను 29 లక్షల నుంచి 44 లక్షలకు పెంచాం. లబ్దిదారుల వయో పరిమితిని 60 నుంచి 57 ఏళ్లకు తగ్గించాం. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.3,016 నుంచి రూ.4,016కు పెంచాం. 33,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం 33,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోగా, ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందిన సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయి. వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందింది. తెలంగాణ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలను పొందుతున్నారు. త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతాం. అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తాం. సింగరేణి కార్మికులకు వచ్చే దసరా, దీపావళి పండుగల బోనస్‌గా రూ.1,000 కోట్లు పంపిణీ చేయబోతున్నాం. వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులనూ క్రమబద్దీకరించాలని నిర్ణయించాం. హైదరాబాద్‌లో పేదలకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ లక్షా 50 వేల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములపై ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పించింది. వారికి రైతుబంధు సాయం సైతం అందించింది. పోడు కేసుల నుంచి విముక్తులను చేసింది. గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాం. గత నెలలో భారీ వర్షాలు కురవడంతో తక్షణ సహాయంగా రూ.500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు మంగళవారం నుంచే అర్హులైన పేదలకు అందజేస్తున్నాం. నగరం నలువైపులకూ రూ.69 వేల కోట్లతో మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదరికం తగ్గుముఖం సంపద పెంచు – ప్రజలకు పంచు అనే సదాశయంతో అనుసరిస్తున్న విధానాల ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గుతోందని, తలసరి ఆదాయం పెరుగుతోందని నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన బహుముఖీయ పేదరిక సూచి స్పష్టం చేసింది. జాతీయ స్థాయి సగటుతో పోల్చిచూస్తే తెలంగాణలో పేదరికం అందులో మూడోవంతుగా నమోదైంది. 2015–16 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019–21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది. ఏకంగా 7.3 శాతం పేదరికం కనుమరుగైంది. లక్ష్యం చేరని స్వతంత్ర భారతం 75 ఏళ్ల స్వతంత్ర భారతం గణనీయ ప్రగతి సాధించినా, ఆశించిన లక్ష్యాలు, చేరవల్సిన గమ్యాలను ఇంకా చేరలేదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల్లో పేదరికం తొలగిపోలేదు. వనరుల సంపూర్ణ వినియోగంతో ప్రగతి ఫలాలు అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే స్వాతంత్య్రానికి సార్థకత. అమర వీరులకు నివాళి గోల్కొండ కోటలో జెండావిష్కరణకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమర జవానుల స్మృతి చిహ్నాన్ని సీఎం కేసీఆర్ సందర్శించి ఘన నివాళి అర్పించారు. ఎయిర్ వైస్ మార్షల్ చంద్రశేఖర్, ఆంధ్ర, తెలంగాణ సబ్ ఏరియా జీవోసీ మేజర్ జనరల్ రాకేష్ మనోచా ఇతర ఆర్మీ అధికారులు అమర సైనికులకు నివాళులర్పించారు. ఇలావుండగా సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో కూడా జాతీయ జెండాను ఎగురవేశారు. సీఎంఓ కార్యాలయ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్ కింద రూ. వెయ్యి కోట్లు : సీఎం కేసీఆర్
►సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో తెలంగాణది 15 స్థానం ఉండగా.. ప్రస్తుతం వరి ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానం కోసం పోటీ పడుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయన రాష్ట్ర ప్రగతిపై ప్రసంగిస్తూ.. రైతులు 3 గంటల కరెంట్ చాలన కొందరు వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. ►ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి గృహలక్షి పథకం ►రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉచిత మంచినీరు అందిస్తున్నాం ►దళితబంధు దేశానికే దిక్సూచిగా నిలిచింది ►నేతన్నల కోసం తెలంగాణ మగ్గం పేరుతో కొత్త పథకం ►ఆసరా పెన్షన్లకు రూ.2016కు పెంచాం ►ఆర్టీసీ బిల్లును విజయవంతంగా ప్రవేశపెట్టాం ►ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం ►సింగరేణలో రూ.12వేల కోట్ల టర్నోవర్‌ను 30 వేల కోట్లకు పెంచాం ►సింగరేణిలో కార్మికులకు ఈ సారి దసరా, దీపావళి బోనస్ కింద రూ. వెయ్యి కోట్లు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు ► జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ..హైదరాబాద్‌లో నేటి నుంచి డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రూ.37 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, పోడు సమస్యకు పరిష్కారం చూపించడంతో పాటు తెలంగాణలో తాగునీటి సమస్య లేకుండా చేశామని చెప్పారు. రాష్ట్రం ప్లోరోసిస్ రహితంగా మారిందని కేంద్రమే ప్రకటించిందన్నారు. ►సమైక్య పాలనతో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. ►రాష్ట్ర సాగునీటి రంగంలో స్వర్ణయుగం నడుస్తోందని అన్నారు. 44 లక్షల మందకి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ► స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండకు చేరుకున్న సీఎం కేసీఆర్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రగతిపై సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. సాక్షి, హైదరాబాద్: ప్రగతి భవన్లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని సైనిక్ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్కగచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అక్కడి నుంచి నేరుగా గోల్కొండకు చేరుకుంటారు. అనంతరం ఆ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం చేయనున్న ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. -
గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
-
కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు!
సాక్షి, హైదరాబాద్/రసూల్‌పురా: జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో జాతీయజెండాను ఎగురవేయనున్నట్టు కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం జెండా వందనం సందర్భంగా కేంద్ర బలగాల కవాతు కూడా నిర్వహించనున్నారు. సాయంత్రం గోల్కొండ కోటలో సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. గురువారం జరిగిన బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా వర్కింగ్ కమిటీ సమావేశంలో కిషన్‌రెడ్డి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రకటన చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ఉత్సవాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కిషన్‌రెడ్డి లేదా సీనియర్ మంత్రి జాతీయజెండాను ఎగురవేసే అవకాశముంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీలకు ఆహ్వానాలు పంపనున్నట్లు సమాచారం. గత సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు బీజేపీ అగ్రనేత, కేంద్రహోం మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరై సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ ఇతర కేంద్ర బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అదే తరహాలో కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ ఔన్నత్యాన్ని చాటుతున్న మోదీ దేశంలో ఉగ్రవాద కదలికలను కట్టడి చేసి ప్రపంచ దేశాలకు భారత దేశ ఔన్నత్యాన్ని చాటుతున్న నేత ప్రధాని మోదీ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతున్నా ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో పది లక్షల కుంభకోణం జరిగిందని కాగ్, సుప్రీంకోర్టులు నిర్ధారించాయన్నారు. కార్యక్రమంలో ఎంపీ డా.కె.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘మన్ కీ బాత్’థీమ్.. గోల్కొండలో సౌండ్ అండ్ లైట్ షో
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరంలోని గోల్కొండ కోటలో ఈ నెల 29న ‘మన్ కీ బాత్’థీమ్‌తో ప్రత్యేకమైన సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నెల 30 న ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం కానున్న మన్ కీ బాత్ 100 వ ఎపిసోడ్ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనుంది. మన్ కీ బాత్కు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని థీమ్స్‌ను పురావస్తు శాఖ అధీనంలో దేశవ్యాప్తంగా ఉన్న 13 చారిత్రక కట్టడాల్లో సౌండ్ అండ్ లైట్ షో ద్వారా ప్రదర్శించనున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోని ఎర్రకోట, గ్వాలియర్ కోట, సూర్య దేవాలయం, వెల్లూరు కోట, గేట్ వే ఆఫ్ ఇండియా, నవ్నతన్ ఘడ్ కోట, రాంనగర్ ప్యాలెస్, ది రెసిడెన్సీ భవనం, గుజరాత్‌లోని సూర్య దేవాలయం, రాంఘడ్ కోట, చిత్తోర్‌ఘడ్ కోట, ప్రధాని సంగ్రహాలయతో పాటు హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలోనూ ‘మన్ కీ బాత్’కు సంబంధించిన ప్రత్యేక ప్రదర్శనలను చేపట్టనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ గురువారం తెలిపారు. ‘మన్ కీ బాత్ ఆర్ట్ ఎగ్జిబిషన్’ మరోవైపు మన్ కీ బాత్ థీమ్ ఆధారంగా దేశంలో ప్రసిద్ధి పొందిన 12 మంది చిత్రకారులు వేసిన పెయింటింగ్స్, ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ఈ నెల 30 న ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో నీటి పొదుపు, నారీశక్తి, కోవిడ్‌పై అవగాహన, స్వచ్ఛ భారత్, వాతావరణ మార్పు, రైతాంగం–వ్యవసాయం, యోగా – ఆయుర్వేదం, సైన్స్–ఖగోళ శాస్త్రం, క్రీడలు–ఫిట్నెస్, భారత్ ఎట్ 75 అమృత్ కాల్, ఈశాన్య రాష్ట్రాలు అనే 12 రకాల థీమ్స్ ఉంటాయి. దీంతో పాటు 12 అమర్‌చిత్ర కథ కామిక్స్‌లో మొదటి కామిక్‌ను ఈ నెల 30 న విడుదల చేయనున్నట్లు గోవింద్ మోహన్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సాగర తీరాన ధగధగల సౌధం -
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తోంది
-
జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
-
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముస్తాబైన గోల్కొండ
-
గోల్కొండలో ‘పంద్రాగస్టు’కు ఏర్పాట్లు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఈ నెల 15న చారిత్రక గోల్కొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు గోల్కొండ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. జాతీయ పతాకానికి గౌరవంగా నేషనల్ సెల్యూట్ ఉంటుందని, దీనికి ముందు ముఖ్యమంత్రి పోలీస్ గౌరవవందనం స్వీకరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా దాదాపు వెయ్యిమంది కళాకారులు స్వాగతం పలుకుతారన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
గోల్కొండ బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభం....(ఫొటోలు)
-
గురువారం నుంచే బోనాలు ప్రారంభం.. గోల్కోండ అమ్మవారికి నగర్ బోనం
లంగర్‌హౌస్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే ప్రధాన పండగల్లో ఒకటైన బోనాల ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రథమ పూజ నిర్వహించడంతో బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి. మొదటి పూజలో భాగంగా అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు. నేడు లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం, తొట్టెలను తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది. ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జులై 10న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహించనున్నారు. డప్పు వాద్యాలు, పోతరాజుల నృత్యాలు, శివసత్తులతో కలిసి అంగరంగ వైభవంగా అమ్మవారికి నైవేద్యం తీసుకొని వెళ్లి బోనంలా సమర్పించనున్నారు. వేడుకలకు లంగర్‌హౌస్, గోల్కొండ వేదిక కానున్నాయి. -
‘గోల్కొండ’ సందర్శనలో హైకోర్టు సీజే దంపతులు
గోల్కొండ (హైదరాబాద్): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ఆదివారం తన సతీమణితో సహా గోల్కొండకోటను సందర్శించారు. ఆసిఫ్‌నగర్ డివిజన్ ఏసీపీ శివమారుతి, గోల్కొండ ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి సతీష్‌చంద్ర దంపతులకు కోట వద్ద స్వాగతం పలికారు. కోటలోని క్లాపింగ్ పోర్టికోతోపాటుగా, ఎగువభాగాన ఉన్న కుతుబ్‌షాహీ కాలం నాటి ఫిరంగి, చారిత్రక కట్టడాలను దంపతులిద్దరూ ఆసక్తిగా తిలకించారు. కోటలోని సీనియర్ గైడ్ వారికి చారిత్రక కట్టడాల విశేషాలను వివరించారు. అనంతరం పర్యాటకశాఖ నిర్వహించే లైట్ అండ్ సౌండ్ షోను వీక్షించారు. -
గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్
తెలంగాణలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆదివారం ఉదయం ప్రగతి భవన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆపై సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అటునుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేదికైన గోల్కొండ కోటకు చేరుకున్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి.. అటుపై సాయుధ దళాల నుంచి గౌరవ వందనం అందుకున్నారు ఆయన. అనంతరం కోటలోని రాణిమహల్ ప్రాంగణం నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చేపట్టిన సంస్కరణలతోనే పరిస్థితి మారిందని, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇచ్చిన ప్రతీ హామీకి కట్టుబడి పని చేస్తున్నామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. ‘‘ప్రతీ రంగంలో అభివృద్ధి సాధించాం. దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాం’’ అని ఆయన పేర్కొన్నారు. కరోనా తీవ్ర అవరోధాలు సృష్టించినా అభివృద్ధి ఆగలేదు. రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని, అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రణాళికలు రూపొందించామని ఆయన పేర్కొన్నారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఏడేళ్లలో స్థిరమైన ఆర్ధిక అభివృద్దితో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందని తెలంగాణ సీఎం కేసీఆర్ గోల్కొండ కోట వేదికగా చాటి చెప్పారు. దేశంలో కనీస అవసరాల కోసం ప్రజలు ఇంకా అల్లాడే పరిస్థితులే ఉన్నాయన్నారు. దేశం సాధించిన అభివృద్దిని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం సాధించుకొన్న రోజు నుండి అన్ని రంగాల అభివృద్దిపై దృష్టి పెట్టామన్నారు. విద్యుత్, తాగు, సాగునీటి సమస్యలు ఇప్పుడు లేవన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ లో మిగులు సాధ్యమౌతోందన్నారు.రాష్ట్ర జీఎస్డీపీలో 20 శాతం వ్యవసాయరంగం నుండి వస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత దండగ అనుకొన్న వ్యవసాయం పండుగలా మారిందని సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని, ఆ సంస్కరణలతో తెలంగాణ ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా నిలిచిందని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. రైతులకు రూ.50వేల లోపు రుణాల మాఫీ ఇవ్వడంతో పాటు ధరణి పోర్టల్ ద్వారా భూమి లెక్కలు తేల్చామని, మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు. బస్తీ దవాఖానాలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి, వరంగల్‌లో అధునాతన ఆస్పత్రిని నిర్మిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. -
హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా
సాక్షి, హైదరాబాద్ : గోల్కొండ కోటలో ఆదివారం పంద్రాగస్టు వేడుకలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంపై పోలీసు విభాగం డేగకన్ను వేసింది. గోల్కొండ కోటలో ప్రతి అణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంది. మొత్తమ్మీద 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన నగర పోలీసులు వీటినీ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో (సీసీసీ) అనుసంధానించింది. స్థానిక పోలీసుస్టేషన్, కోట వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌లోనూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేశారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పని తీరుపై సీసీసీ అధికారులు శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. గోల్కొండ కోటలోకి ప్రవేశించే ప్రతి ద్వారం దగ్గరా డోర్‌ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా ► 15న ఉ. 7 నుంచి మ. 12 గంటల వరకు కో ట వైపునకు వాహనాలకు అనుమతి లేదు. ► రాందేవ్‌గూడ నుంచి కోటకు ఎ, బి, సి, పాస్ హోల్డర్స్ వాహనాలకే అనుమతి. ► కింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్‌ట్యాంక్, మెహిదీపట్నం నుంచి వచ్చే పాస్ హోల్డర్లు రేతిబౌలి,నానల్‌నగర్ జంక్షన్ నుంచి లంగర్‌హౌస్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జి, రాందేవ్‌గూడ జంక్షన్ మీదుగా రావాలి. ► మక్కై దర్వాజ వద్ద ఎ– కారు పాస్ హోల్డర్లు మెయిన్ రోడ్డు పక్కన, బి– పాస్ హోల్డర్లు గోల్కొండ కోట బస్టాప్ వద్ద, సి– కారు పాస్ హోల్డర్లు గోల్కొండ బాయ్స్ గ్రౌండ్ ఫుట్‌బాల్ గ్రౌండ్లో పార్క్ చేయాలి. ► డి– పాస్ హోల్డర్లు ప్రియదర్శిని స్కూల్ వద్ద వాహనాలను పార్క్ చేయాలి. ఇ– కారు పాస్ హోల్డర్లు సెవన్ టూంబ్స్ బంజారా దర్వాజ మీదుగా రేతిగల్లిలోని ఒౖవైసి గ్రౌండ్లో వాహనాలను పార్క్ చేయాలి. ► లంగర్‌హౌస్ మీదుగా వచ్చే ఇ– పాస్ హోల్డర్లు బడాబజార్, బల్దియా ఐలాండ్ మీదుగా ఒవైసి గ్రౌండ్‌కు వెళ్లాలి. ఎఫ్– కారు పార్క్ హోల్డర్లు లంగర్‌హౌస్ మీదుగా ఫతే దర్వాజ నుంచి హుడా పార్కు వద్ద వాహనాలను పార్క్ చేయాలి. ► షేక్‌పేట్, టోలిచౌకికి చెందిన వారు బంజారా దర్వాజ నుంచి ఆర్టీసి బస్సుల ద్వారా కోటకు చేరుకోవాలి. ► వేడుకలు పూర్తయిన తర్వాత ఏ,బీ,సీ– కారు పాస్ హోల్డర్లు మక్కై దర్వాజ, రాందేవ్‌గూడ, లంగర్‌హౌస్ నుంచి వెళ్లాలి. డి కారు పాస్ హోల్డర్లు బంజారదర్వాజ మీదుగా సెవన్ టూంబ్స్ వైపు వెళ్లాలి. ఇ– కారు పాస్ హోల్డరు బడాబజార్, ఫతే దర్వాజ గుండా వెళ్లాలి. ఎఫ్– కారు పాస్ హోల్డర్లు తమ తమ పార్కింగ్ ప్రదేశాల నుంచి వచ్చిన మార్గం గుండానే వెనక్కి వెళ్లిపోవాలి. అన్ని రకాల పాస్ హోల్డర్లు తమ పాస్‌ను తమ కారుపై డిస్ప్లే చేయాలి. -
యునెస్కోను మెప్పించాలి
27 చారిత్రక కట్టడాలనూ.. చారిత్రక గోల్కొండ కోట, కుతుబ్‌షాహీ టూంబ్స్‌తోపాటు రాష్ట్రంలోని 27 పురాతన చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రణాళికలు 4 వారాల్లో రూపొందించాలని ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ చారిత్రక కట్టడాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సమావేశమై పలు సూచలను చేసిందని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. సాక్షి, హైదరాబాద్: ‘చారిత్రక వారసత్వసంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి ప్రపంచ పటంలో స్థానం లభించడం తెలంగాణకు గర్వకారణం. దీంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. చారిత్రక శిల్పకళా సంపద కల్గిన రామప్ప ఆలయాన్ని యునెస్కో తాత్కాలిక ప్రాతిపదికన హెరిటేజ్ కేంద్రంగా ఎంపిక చేసింది. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి యునెస్కో అధికారులను మెప్పించాలి. వారి అంచనాల మేరకు డిసెంబర్‌లోగా ఈ క్షేత్రం సంరక్షణకు చర్యలు చేపట్టి పూర్తిస్థాయి హెరిటేజ్ కేంద్రంగా గుర్తింపు సాధించాలి’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రామప్ప ఆలయానికి యునెస్కో తాత్కాలిక గుర్తింపు లభించడంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యంగా విచారణకు స్వీకరించి బుధవారం విచారించింది. ఆగస్టు 4న ఏఎస్ఐ, కలెక్టర్ సమావేశమవ్వాలి ‘ఇదొక అద్భుతమైన, బంగారం లాంటి అవకాశం. రామప్ప ఆలయ సంరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. దీనిని అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దాలి. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఉండేందుకు ఇక్కడ విడిది సౌకర్యాలు కల్పించాలి. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ), రాష్ట్ర ఆర్కియాలజీ విభాగం, హెరిటేజ్ విభాగం, జిల్లా కలెక్టర్ సమన్వయంతో పనిచేయాలి. ఆగస్టు 4న ఈ నాలుగు విభాగాల అధికారులు సమావేశం కావాలి. నాలుగు వారాల్లో క్షేత్రస్థాయిలో సర్వే చేసి రామప్ప ఆలయ అభివృద్ధికి బ్లూప్రింట్ రూపొందించాలి. వెంటనే కార్యాచరణ ప్రారంభించాలి. పనుల పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించుకోవాలి. యునెస్కో అంచనాల మేరకు అధికారులు పనిచేయక, గుర్తింపు వెనక్కు పోయే పరిస్థితి వస్తే మాత్రం దేశమంతా నిందిస్తుంది. సంరక్షణ, అభివృద్ధి కార్యక్రమాలను మేమే పర్యవేక్షిస్తాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. -
ఈసారి కుతుబ్ షాహీ టూంబ్స్
సాక్షి, హైదరాబాద్: రామప్ప రుద్రేశ్వర దేవాలయానికి ప్రతిష్టాత్మక ప్రపంచ వారసత్వ హోదా దక్కిన నేపథ్యంలో, తదుపరి కుతుబ్ షాహీ టూంబ్స్ రూపంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది. హైదరాబాద్ నగర నిర్మాతలైన కుతుబ్ షాహీ వంశస్తుల సమాధుల ప్రాంగణాన్ని గతంలోనే యునెస్కోకు ప్రతిపాదించినప్పటికీ తిరస్కరణకు గురైంది. వాస్తవానికి అప్పట్లో చార్మినార్, గోల్కొండలతో కలిపి దాన్ని ప్రతిపాదించారు. అద్భుత కట్టడాలే అయినప్పటికీ చార్మినార్, గోల్కొండల చుట్టూ పలు ఆక్రమణలు ఉండటంతో యునెస్కో ఆ ప్రతిపాదనను బుట్ట దాఖలు చేసింది. దీంతో సమాధుల ప్రాంగణం ఒక్కదాన్నే ప్రతిపాదించాలన్న ఆలోచన తాజాగా తెరపైకి వస్తోంది. కాగా తదుపరి దశలో పాండవుల గుట్ట, అలంపూర్ నవబ్రహ్మ దేవాలయ సమూహాలకు కూడా యునెస్కో గుర్తింపు కోసం ప్రతిపాదించే అర్హత ఉందని పురావస్తు నిపుణులు చెబుతున్నారు. కుతుబ్ షాహీ టూంబ్స్కు అవకాశం ఉంది రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావటంలో వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న కాకతీయ హెరిటేజ్ ట్రస్టు కీలక భూమిక నిర్వహించిన విషయం తెలిసిందే. యునెస్కోకు ప్రతిపాదన (డోజియర్) రూపొందించటం మొదలు, చివరకు ఫైనల్ ఓటింగ్ రోజున వర్చువల్ సమావేశంలో పాల్గొనటంతో పాటు ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేస్తూ కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగంతో ఈ ట్రస్టు కలిసి పనిచేసింది. ఇప్పుడు తదుపరి ప్రతిపాదన విషయంలో కూడా ఇదే ట్రస్టు కీలకంగా వ్యవహరించనుంది. ఈసారి కుతుబ్ షాహీ సమాధుల ప్రాంగణాన్ని ప్రతిపాదించాలనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. ‘రామప్ప’లాంటి ప్రతిపాదన మరోసారి చేసేందుకు ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్న ప్రాంతం కుతుబ్‌షాహీ టూంబ్స్ ప్రాంగణమే అని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ మాజీ సలహాదారు పాపారావు ‘సాక్షి’తో చెప్పారు. గతంలో అడ్డుగా నిలిచిన పరిస్థితులను చక్కదిద్దగలిగితే కుతుబ్ షాహీ టూంబ్స్కు కూడా ప్రపంచ వారసత్వ హోదా దక్కే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాజవంశీయుల సమాధులన్నీ ఒకేచోట.. ఓ రాజవంశానికి చెందిన వారి సమాధులన్నీ ఒకేచోట ఉండటం, వాటి నిర్మాణం ప్రత్యేకంగా రూపొందటం ప్రపంచంలో మరెక్కడా లేదు. కుతుబ్ షాహీ రాజులు, వారి భార్యలు, పిల్లలు, వారి ముఖ్య అనుచరుల సమాధులు .. వెరసి 30 సమాధులు ఒకేచోట ఉన్నాయి. గోల్కొండ కోటకు కేవలం కిలోమీటరు దూరంలో ఇబ్రహీంబాగ్గా పేర్కొనే చోట వీటిని నిర్మించారు. పర్షియన్–ఇండియన్ నిర్మాణ శైలితో అద్భుతంగా నిర్మించారు. ç1543–1672 మధ్య ఇవి రూపొందాయి. వారి పాలన అంతరించాక వాటి నిర్వహణ సరిగా లేక కొంత దెబ్బతిన్నా.. 19వ శతాబ్దంలో సాలార్జంగ్–3 వాటిని మళ్లీ మరమ్మతు చేసి పునరుద్ధరించారు. ఢిల్లీలోని హుమయూన్ సమాధిని యునెస్కో గుర్తించిన నేపథ్యంలో.. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణం మరింత సులభంగా యునెస్కో గుర్తింపును పొందుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యునెస్కో నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధిలో ఆక్రమణలు లేకుండా చూడాలి. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మరో ప్రపంచ వారసత్వ హోదా కోసం పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. మరో నాలుగేళ్ల తర్వాతనే.. తాజా ప్రతిపాదనను యునెస్కో ముందుంచేందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి సరైన పోటీ లేనిపక్షంలో మళ్లీ తెలంగాణకు అవకాశం రావచ్చునని అంటున్నారు. ఈలోపు నిర్ధారించుకున్న కట్టడ పరిసరాలను యునెస్కో నిబంధనల మేరకు తీర్చిదిద్దితే, కేంద్రంపై ఒత్తిడి తేవడం ద్వారా మరో గొప్ప అవకాశాన్ని ఒడిసిపట్టుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరో గొప్ప నిర్మాణం అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాల సమూహం.. కర్ణాటకలోని పట్టడకల్ దేవాలయాలు యునెస్కో గుర్తింపు పొందాయి. వాటిని నిర్మించిన బాదామీ చాళుక్యులే అలంపూర్‌లో ఏడో శతాబ్దంలో బ్రహ్మేశ్వరాలయాల సమూహాన్ని అద్భుత శిల్ప, వాస్తు నైపుణ్యంతో నిర్మించారు. నవ బ్రహ్మలుగా తొమ్మిది శివరూపాలతో ఉన్న ఈ ఆలయాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. తుంగభద్ర ఒడ్డున ఉన్న ఈ ఆలయాలను ఎర్ర ఇసుకరాతితో నిర్మించారు. వాటిల్లో 32 రకాల కిటికీలు, పైకప్పు శిల్పాలు రేఖా నాగర ప్రాసాదం శైలిలో నిర్మాణాలు జరిగాయి. దాదాపు 50 ఎకరాల వైశాల్యంలో ఉన్న ఈ దేవాలయ ప్రాంగణానికి కూడా వారసత్వ హోదా పొందే అర్హత ఉందని చరిత్ర పరిశోధకులు, పురావస్తుశాఖ విశ్రాంత స్తపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. పాండవుల గుట్ట కూడా సిద్ధం.. దాదాపు 10 వేల సంవత్సరాల క్రితం మానవుడి చిత్రలేఖనం ఎలా ఉండేది..? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే పూర్వపు వరంగల్ జిల్లాలోని పాండవుల గుట్ట గుహలను పరికిస్తే తెలుస్తుంది. దాదాపు వేయి చిత్రాలు ఈ గుహల్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని బింబేడ్కాలో దాదాపు 2 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టల్లో వేల సంఖ్యలో ఇలాంటి చిత్రాలున్నాయి. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా ఆదిమానవులు వేసిన అన్ని చిత్రాలు ఒకేచోట బయటపడ్డ దాఖలాలు లేవు. దీంతో దాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాతో సత్కరించింది. ఆ తర్వాత అన్ని చిత్రాలున్న ప్రాంతంగా ఇప్పటివరకు పాండవుల గుట్టనే రికార్డుల్లో ఉంది. ఇది కూడా యునెస్కో గుర్తింపును పొందగల అర్హతలున్న ప్రాంతమేనని పురావస్తు పరిశోధకులు రంగాచార్యులు, శ్రీరామోజు హరగోపాల్‌లు తెలిపారు. -
బురుజు కట్టే వారెవరు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం లాంటి భారీ సాగునీటి ప్రాజెక్టును కట్టేశాం.. సంప్రదాయ–ఆధునిక నమూనాల మేళవింపుతో కొత్త సచివాలయ నిర్మాణం సాగుతోంది.. భాగ్యనగరంలో ఎన్నో ఆకాశహర్మ్యాలూ సిద్ధమవుతున్నాయి.. ఇలాంటి భారీ కట్టడాలకు నిర్మాణ కంపెనీలు పోటీపడుతున్నాయి.. కానీ, ఓ కట్టడానికి మాత్రం ఇంజనీర్లు దొరకడం లేదు. అదే మజ్నూ బురుజు. గోల్కొండ కోటకు అనుబంధంగా ఉన్న నయాఖిల్లాలో ఈ బురుజు ప్రస్తుతం శిథిలగుట్టగా ఉంది. దీన్ని పునర్నిర్మించేందుకు గతేడాది నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణకు బురుజులు కొత్త కాదు. చాలా ఊళ్లలో అవి దర్శనమిస్తాయి. అప్పట్లో ఊరూవాడా వాటిని సులభంగా నిర్మించేశారు. ఇప్పుడు వాటిని కట్టేవా రి కోసం కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) భూతద్దం పెట్టి గాలిస్తున్నా దొరకడం లేదు. ఇదీ సంగతి.. నయాఖిల్లాలో 500 ఏళ్ల క్రితం లైలా–మజ్నూల పేరుతో రెండు బురుజులు నిర్మించారు. ఇందులో మజ్నూ బురుజు కాస్త పెద్దది. గత అక్టోబర్‌లో కురిసిన అతి భారీ వర్షాలకు కుప్పకూలింది. అంతకు కొన్ని నెలల ముందే దానికి భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. గోల్ఫ్ కోర్టు అభివృద్ధి చేసే క్రమంలో దాని దిగువన జరిగిన మట్టిపనులతో సమతౌల్యం దెబ్బతిని పగుళ్లు ఏర్పడటానికి కారణమైందని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. ఆ పగుళ్లకు ఏఎస్ఐ సకాలంలో స్పందించలేదు. ఆలస్యంగా పనులు ప్రారంభించినా, శాస్త్రీయత లేకుండా లోపభూయిష్టంగా చేపట్టడంతో వాననీళ్లు సులభంగా లోనికి చొరబడి మట్టి జారి కట్టడం కూలిపోయింది. ఇది పూర్తిగా మట్టి కట్టడం. చుట్టూ భారీ బండరాళ్లను పద్ధతి ప్రకారం పేర్చి బురుజు రూపమిచ్చారు. నాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. మట్టి కట్టడం ఐదు శతాబ్దాల పాటు నిలబడి, మానవ తప్పిదంతో చివరకు కూలిపోయింది. చరిత్రలో ఆ కట్టడానికి స్థానం ఉండటం, చారిత్రక గోల్కొండ కోట అంతర్భాగం కావటంతో దాన్ని తిరిగి నిర్మించాలని ఏఎస్ఐ నిర్ణయించి గతేడాది చివరి నుంచి ప్రయత్నిస్తోంది. జాతీయ స్థాయిలో రెండు దఫాలు టెండరు నోటిఫికేషన్ ఇచ్చినా దాన్ని నిర్మించగలిగే సంస్థలు రాలేదు. నైపుణ్యం ఉన్న వారు కరువు... మట్టితో నిర్మించి, బాహ్య భాగాన్ని డంగు సున్నం పూతతో పెద్ద రాళ్లతో నిర్మించాలని ఈసారి నిర్ణయించారు. ఈ తరహా కట్టడాలను నిర్మించిన అనుభవం ఉన్న వారిని ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. బురుజుల పునర్నిర్మాణం, లేదా ఆ తరహా భారీ గోడలను నిర్మించిన వారు, ఆ పనుల్లో కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్నవారు కావాలని పేర్కొన్నారు. ఇలాంటి నైపుణ్యం ఉన్నవారికి కరవు వచ్చి పడింది. కొందరు వచ్చినా అనుభవం లేకపోవటంతో రద్దు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ పనితీరు అనుభవం ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. కేవలం రూ.కోటి విలువైన ఈ పని పూర్తి చేయటం ఇప్పుడు ఏఎస్ఐకి కత్తిమీద సాములా మారింది. అది కూలిన సమయంలో పై భాగంలో గాలిలో వేళ్లాడుతూ ఉండిపోయిన 18 అడుగుల పొడవైన 150 టన్నుల బరువున్న భారీ తోపును కిందకు దింపేందుకు రెండు రోజులు పట్టింది. అందుకే ఇప్పుడు ఆ పనులు సవాల్ విసురుతున్నాయి. -
భూగర్భంలో గోల్కొండ షో!
సాక్షి, హైదరాబాద్/గోల్కొండ: మట్టి కోట మహా నగరమైంది. కాకతీయుల పరిపాలన వైభవానికి ప్రతీకగా వెలిసింది. అనతి కాలంలోనే కుతుబ్‌షాహీల రాజధానిగా అభివృద్ధి చెందింది. కుతుబ్‌షాహీల రాజ్యం నలుదిశలా విస్తరించింది. ఆ తర్వాత రాజ్యాధికారం చేపట్టిన అసఫ్జాహీలు ఆధునిక హైదరాబాద్‌కు శ్రీకారం చుట్టారు. అప్పటికే ఈ నగరం అంతర్జాతీయ ఖ్యాతికెక్కింది. వజ్ర వైఢూర్యాలను రాశులుగా పోసి విక్రయించిన మార్కెట్లు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. కుతుబ్‌షాహీల నుంచి అసఫ్‌జాహీల వరకు వైవిధ్యభరితమైన చారిత్రక కట్టడాలు నిర్మించారు. ఆనాటి నవాబుల ఆహార్యం నుంచి ఆహారం వరకు అన్నీ ఆకర్షిస్తాయి.(చదవండి: తెలంగాణ మొత్తానికి 50 వేల పరీక్షలేనా?) ఇప్పటికే సాలార్జంగ్ మ్యూజియం, నిజామ్స్ మ్యూజియాలలో అలాంటి అద్భుతమైన వస్తువులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. దాదాపు అలాంటి మరో స్మారక కేంద్రాన్ని కుతుబ్‌షాహీల సమాధుల చెంత నిర్మించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. గోల్కొండ సమాధుల పక్కనున్న దక్కన్ పార్కులో భూగర్భంలో ‘ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్’ పేరుతో దీన్ని నిర్మించనున్నారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థతో పాటు పర్యాటక అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఆధునిక ప్రదర్శశాల ఏర్పాటుకు సన్నద్ధమయ్యాయి. ఒకప్పటి చారిత్రక కట్టడాలను తలపించేలా ఈ భూగర్భ ప్రదర్శనశాల సుమారు రూ.45 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకోనుంది. ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్లో చరిత్ర పుస్తకాలతో ఒక లైబ్రరీ, అప్పటి రాజుల జీవిత విశేషాలు, చిత్రపటాలతో కూడిన ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ‘సెవన్ టూంబ్స్’గా పేరొందిన కుతుబ్ షాహీ సమాధుల చెంత ఇది మరో చారిత్రక కట్టడాన్ని తలపించనుంది. ఉద్యానవనంలోకి అడుగుపెట్టగానే.. ఏడెనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దక్కన్ హెరిటేజ్ పార్కు వద్ద 6,500 చదరపు అడుగుల పరిధిలో ఈ ప్రదర్శనశాలను ఏర్పాటు చేయనున్నారు. పైన అందమైన ఉద్యానవనం ఉంటుంది.కింద భూగర్భలో ప్రదర్శనశాల,కెఫెటేరియా, లైబ్రరీ, తదితర సదుపాయాలు ఉంటాయి. గోల్కొండ కోట, కుతుబ్‌షాహీల చరిత్రకు సంబంధించిన సమస్త సమాచారం ఇక్కడ లభిస్తుంది. సుమారు 1,200 చదరపు అడుగుల్లో కాన్ఫరెన్స్ హాల్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓరియంటేషన్ కోర్టు, పిల్లల గ్యాలరీలు, స్క్రీనింగ్ సెంటర్లు, సావనీర్ స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. కొన్ని న్యాయపరమైన వివాదాల దృష్ట్యా పనులు నిలిచిపోయాయని, ఉన్నత న్యాయస్థానం నుంచి సానుకూలమైన తీర్పు వెలువడితే 2023 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నామని ప్రాజెక్టుకు సంబంధించిన ఓ ప్రతినిధి తెలిపారు. -
డంగుతోనే హంగు!
సాక్షి, హైదరాబాద్: గట్టి ప్లాన్స్.. మట్టి వాల్స్.. రాతికీ రాతికీ మధ్య సున్నం మిశ్రమం కూడా లేదు.. రాతి మీద రాతిని పేర్చి పొందికగా కట్టిన నిర్మాణం.. అయినా వందల ఏళ్లపాటు పదిలం.. ఇది గోల్కొండ కోట ప్రత్యేకత. తాజాగా కూలిన నిర్మాణాలు పరిశీలిస్తే 80 శాతం మట్టితోనే కట్టినట్టు స్పష్టమవుతోంది. కాకతీయుల హయాంలో మట్టితో కోటగోడలు కట్టడం ప్రత్యేకత. గోల్కొండను కూడా వారు అలాగే నిర్మించారు. ఆ తర్వాత దాన్ని ఆక్రమించిన బహమనీల నుంచి స్వాధీ నం చేసుకున్న కుతుబ్‌షాహీలు దాన్ని కొంత పటిష్ట పరిచారు. ఇప్పుడు అది క్రమంగా కూలిపోవటం ప్రారంభమైంది. ఇటీవలి భారీవర్షాలకు నయాఖిల్లాలో కూలిన మజ్నూ బురుజు, కోట పైభాగంలో ఉన్న జగదాంబిక ఆలయం వైపు వెళ్లే క్రమంలో కూలిన మెట్ల వద్ద ప్రాకారం శిథిలాల్లో మట్టి తప్ప డంగు సున్నం మిశ్రమం లేదు. నిర్మాణం మొత్తం డంగు సున్నంపూత పూయకుంటే ప్రమాదమే.. ఇటీవలి వర్షాలకు మూడు ప్రాంతాల్లో గోడలు కూలిపోయిన నేపథ్యంలో భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్ఐ) విభాగం అధికారులు దాన్ని ఆసాంతం పరిశీలించారు. డంగు సున్నం పూత లేని ప్రాంతాల్లో, గోడల్లో మొక్కలు మొలిచి వాటి వేళ్లు పాకిపోవటంతో పగుళ్లు ఏర్పడి, కాలక్రమంలో అవి వెడల్పుగా మారినట్టు భావిస్తున్నారు. ఆ పగుళ్లకు సకాలంలో మరమ్మ తులు చేయకపోవటంతో వర్షం నీళ్లు లోపలికి చేరి మట్టి కరిగి గోడలు కూలిపోవటం ఆరంభించాయి. ఇప్పుడు ఉన్నఫళంగా కోట గోడలకు డంగు సున్నం పూతలు పూయనిపక్షంలో నిర్మాణాలు కూలిపోవటం ఖాయ మని నిపుణులు తేల్చారు. (చదవండి: గోల్కొండ ఖిల్లా.. ఇలా అయితే ఎలా?) ఏం చేయాలంటే.. 1 పెయింటింగ్ వర్క్: కోట ప్రధాన ప్రాకారం మొదలు, అంతర్గత గోడల వరకు అన్నీ మట్టితో నిర్మించి ఉన్నాయి. మట్టితో గోడలు నిర్మించి వాటికి వెలుపల, లోపలివైపు రాళ్లను పేర్చారు. రాళ్లు పడిపోగానే లోపల ఉన్న మట్టి జారిపోతోంది. ఇప్పుడు ఆ రాళ్లకు.. లోపల, బయటివైపు డంగు సున్నం మిశ్రమంతో సంప్రదాయపద్ధతిలో పూత పూయాల్సి ఉంది. 2 గ్రౌటింగ్: కొన్ని గోడలకు ఏర్పడ్డ పగుళ్లు బాగా వెడల్పుగా మారిపోయాయి. ఇటీవల జగదాంబిక దేవాలయం మార్గంలో కూలిన గోడకు కుడివైపు పైనుంచి కింది వరకు ఉన్న పగుళ్లు ఇలా వెడల్పుగా మారి భయపెడుతున్నాయి. ఇలాంటి పగుళ్లను వెంటనే మూసేయాల్సి ఉంది. ఏఎస్ఐ నిర్వహణ పద్ధతి ప్రకారం.. ఇటుక ముక్కలను లోనికి దూర్చి వాటికి డంగు సున్నం మిశ్రమంతో కోట్ వేస్తారు. ఆ తర్వాత పై భాగంలో అదే మిశ్రమంతో రాళ్ల మధ్య పూస్తారు. ఇప్పుడు అన్ని గోడలకు ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. 3 కోపింగ్: గోడల పైభాగం నుంచి వాన నీళ్లు లోనికి వెళ్లకుండా మందంగా డంగు సున్నం మిశ్రమాన్ని అద్దుతారు. వాన నీళ్లు పడగానే పక్కలకు జారి పోయేందుకు ఏటవాలు ఉండేలా దాన్ని పూస్తారు. ఆ పూత చాలా గోడలపై ఊడిపోయింది. అక్కడి నుంచి వాననీళ్లు లోనికి చేరుతున్నట్టు గుర్తించారు. ఇప్పుడు మళ్లీ పైభాగంలో పూత వేయాల్సి ఉంది. మజ్నూ బురుజు మూడొంతులు మళ్లీ కట్టాల్సిందే.. నయాఖిల్లాలో కూలిపోయిన మజ్నూ బురుజు మరోవైపు పావు భాగం పదిలంగానే ఉందని గుర్తించారు. మూడొంతుల భాగాన్ని పూర్తిగా తొలగించి మళ్లీ మట్టి నింపి కట్టాల్సి ఉంది. పునర్నిర్మాణంలో మాత్రం డంగు సున్నం మిశ్రమాన్ని వాడుతూ నిర్మించాలని నిర్ణయించారు. దాని పునాది భాగం వరకు పాత నిర్మాణాన్ని తొలగించి పునాదిని పటిష్టం చేసి కట్టనున్నారు. భారీ బడ్జెట్ అవసరం.. గోల్కొండ గోడల మరమ్మతులకు భారీగా వ్యయం అవుతుంది. దాన్ని తేల్చే డీపీఆర్ రూపొందించి కేంద్రానికి పంపి నిధులు తెప్పించుకోవాల్సి ఉంది. ఈ పనులు పూర్తి కావటానికి కనీసం ఐదేళ్లు పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే వానాకాలంలోపు.. ప్రమాదకరంగా ఉన్న గోడలకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఎడబాసిన లైలా–మజ్నూలు.. నయాఖిల్లాల్లో ఒకదాని పక్కన ఒకటిగా రెండు బురుజులున్నాయి. అమరప్రేమికులుగా చరిత్రలో నిలిచిన లైలా–మజ్నూల పేర్లను వీటికి పెట్టారు. ఇప్పుడు ఇందులో మజ్నూ బురుజు కూలిపోవటంతో వాటి మధ్య ఎడబాటు వచ్చినట్టయింది. డంగు సున్నంమిశ్రమం ఇలా.. అలనాటి నిర్మాణాల్లో డంగుసున్నం మిశ్రమందే కీలకపాత్ర. అందులో డంగు సున్నం, రాతిపొడి, గుడ్డు సొన, కరక్కాయ, నల్లబెల్లం కలిపి చాలా మెత్తని మిశ్రమాన్ని రూపొందిస్తారు. ఆధునిక నిర్మాణాల్లో సిమెంట్ పాత్రను ఇది పోషిస్తుంది. మిశ్రమం తయారీకి ముందు 21 రోజుల పాటు కరక్కాయలను నానబెడతారు. ఇప్పుడు గోల్కొండలో కూలిన భాగాల పునర్నిర్మాణంలో దీన్నే వినియోగించనున్నారు. ముందు ఉన్న రూపును అచ్చంగా తిరిగి తీసుకొస్తారు. ఇంటర్‌లాకింగ్ నిర్మాణం.. అప్పట్లో నిర్మాణ ఇంజనీరింగ్‌లో ఇంటర్‌లాకింగ్ రాతి కట్టడాలు ప్రత్యేకంగా ఉంటాయి. రాతికి గ్రూవ్స్ తరహాలో సందులు చేసి, పైరాయి అందులో కూర్చునేలా రూపొందిస్తారు. గోల్కొండ కోటలో ప్రాకారాల్లో రాళ్లను ఇలాగే నిలిపారు. ఇక్కడ పూర్తిస్థాయి ఇంటర్ లాకింగ్ టెక్నిక్ కాకుండా రాళ్లు జారిపోకుండా కాస్త వాలు, కాస్త ఎత్తుగా ఉండేలా కోసి మరో రాయి అందులో పేర్చి నిర్మించారు. ఆ క్రమంలో రాళ్ల మధ్య చెట్ల గోందు(గమ్)లాంటిది పూసి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు అలా పునర్నిర్మాణం సాధ్యం కానందున, రాళ్ల మధ్య బైండింగ్ కోసం డంగు సున్నం మిశ్రమాన్ని వాడబోతున్నారు. -
గోల్కొండ ఖిల్లా.. ఇలా అయితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరం తొలిరూపు గోల్కొండ.. భాగ్యనగరం అనగానే ముందుగా గుర్చొచ్చే చారిత్రక నిర్మాణం. కాకతీయులు పునాది వేయగా, కుతుబ్‌షాహీలు ఆక్రమించుకుని మరింత అభివృద్ధి చేశారు. ఆ తర్వాత అసఫ్జాహీలు ఏలారు. ఇన్ని రాజవంశాల చేతులు మారినా.. పదిలంగా నిలిచిన ఆ మహా కోటకు ఇప్పుడు ప్రమాదం ముంచుకొచ్చింది. చాలా ఏళ్లు కావడంతో స్వతహాగా ఏర్పడుతున్న పగుళ్లు క్రమంగా పెరిగి మూలాలనే పెకిలిస్తున్నాయి. వాటికి వేగంగా మరమ్మతులు జరగక క్రమంగా కోటకు బీటలు వేస్తున్నాయి. ఇంతటి ప్రమాదపు అంచుల్లో ఉన్న కోటకు ఇటీవలి భారీ వర్షాలు పెద్ద కుదుపునే ఇచ్చాయి. రికార్డు స్థాయి వర్షంతో ఒక్కసారిగా గోడలన్నీ కదిలిపోయి నిట్టనిలువునా కూలిపోయేందుకు సిద్ధమయ్యాయి. ఆ వర్షాల సమయంలోనే ఓ బురుజు, మరో మహా కోట ప్రాకారం, నవాబులు జలకాలాడిన కటోరా హౌస్ ప్రహరీ నేలమట్టమైంది. మరికొన్ని గోడలు కూడా కూలే ప్రమాదం ఉంది. వాన కాదు కదా బలంగా గాలివీచినా రాళ్లు జారిపడేలా మారింది ఈ మహా కట్టడం. కేంద్రం వెంటనే స్పందించకుంటే కోటలోని చాలాప్రాంతాలు మట్టిదిబ్బగా మారటం ఖాయం. రూ.6 నుంచి రూ.8 కోట్లు కావాలి ఇటీవలి వర్షాలకు కూలిన ప్రాంతాలను పునరుద్ధరించాలంటే రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు అవసరం అవుతాయని సమాచారం. ప్రస్తుతం స్థానిక అధికారులు అంచనాలు రూపొందించి మరమ్మతు కోసం అనుమతి కోరుతూ ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. దానికి సమ్మతిస్తూ సరిపడా నిధులు కేటాయిస్తేనే వీలైనంత తొందరలో పునరుద్ధరణ పూర్తవుతుంది. వచ్చే వానాకాలం లోపు ప్రధాన పనులు చేపట్టడంతో పాటు, బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతు చేయకపోతే ఏడాదిలో మరిన్ని గోడలు కూలడం ఖాయం. నిధులేవి.. ఇంతపెద్ద గోల్కొండ నిర్వహణకు కేంద్ర పురాతత్వ సర్వేక్షణ విభాగం కేటాయిస్తున్న నిధులు సంవత్సరానికి రూ.కోటిన్నర మాత్రమే. శతాబ్దాల నాటి నిర్మాణం కావటంతో అడుగడుగునా మరమ్మతు చేస్తే తప్ప నిర్మాణం పదిలంగా ఉండని పరిస్థితిలో ఈ నిధులు ఏ మూలకూ చాలట్లేదు. మరోవైపు ఏ చిన్న మరమ్మతు చేయాల్సి వచ్చినా ఢిల్లీకి అనుమతి కోసం పంపి, అక్కడి నుంచి అనుమతి వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతోంది. ఇక మరమ్మతు పనుల్లో నైపుణ్యం ఉన్న పనివారు దొరక్కపోవటం జాప్యానికి మరో కారణం. నిత్యం నిశితంగా పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు మరమ్మతులు వేగంగా చేపడితేనే ఈ కట్టడం పదిలంగా ఉంటుంది. చారిత్రక కట్టడాలను దత్తత ఇచ్చేందుకు గతేడాది కేంద్రం శ్రీకారం చుట్టింది. గోల్కొండ బాధ్యత జీఎమ్మార్‌కు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఎవరైనా దాతలు ముందుకొస్తే దత్తత ఇచ్చేందుకు ఏఎస్ఐ సిద్ధంగా ఉన్నా ఎవరూ స్పందిచట్లేదు. (చదవండి: టూరిస్టుల గోల్కొండ) జారిపోయిన బండరాళ్లు.. గోల్కొండ కోట పైభాగంలో జగదాంబ దేవాలయం వైపు వెళ్లే దారిలో 50 అడుగుల ఎత్తయిన కోట గోడ నిలువునా జారిపోయింది. గతంలో ఇక్కడ కొన్ని పగుళ్లు ఏర్పడ్డాయి. దానికి మరమ్మతు చేయటంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత కూడా పైభాగంలోనే పనులు చేపట్టారు. బలహీనంగా ఉన్న కింది భాగానికి పూర్తిస్థాయి మరమ్మతు జరగలేదు. దీంతో భారీ వర్షాలకు కిందిభాగం మరింత బలహీనపడి కూలింది. దీంతో పైనుంచి రాళ్లు జారి పడిపోయాయి. ఫలితంగా గోడ వెనుక ఉండే మట్టి పూర్తిగా జారిపోయింది. మజ్నూ బురుజు.. దాదాపు కనుమరుగు మజ్నూ బురుజు. నయాఖిల్లాలో ఉంది. ప్రస్తుతం దీని చుట్టూ గోల్ఫ్ కోర్సు అభివృద్ధి అయి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు సరిగ్గా 20 రోజుల ముందు దీనికి పైభాగంలో భారీ పగులు ఏర్పడింది. బురుజు పైభాగంలో 18 అడుగుల పొడవైన ఫిరంగి ఉంది. ఇది ఔరంగజేబు సైన్యం ఏర్పాటు చేసింది. దాని వెనుకవైపు పిట్టగోడ తరహాలో ఓ గోడ అప్పట్లోనే కట్టారు. ఆ గోడ నుంచి పగులు మొదలైంది. భారీ వర్షాల సమయంలో ఆ పగులు నుంచి నీరు లోపలికి చేరటంతో మట్టి జారి పైనుంచి దిగువ వరకు సగం బురుజు కూలిపోయింది. సగం బురుజు కూలగా, మిగతా సగం కూడా బలహీనపడింది. దానిపై టన్నుల బరువుండే ఫిరంగి ఉంది. ప్రస్తుతం అది కొంత భాగం గాలిలో వేళ్లాడుతోంది. క్రేన్‌తో దాన్ని పదిలంగా తీసి పనులు చేపట్టాలి. (చదవండి: గోల్కొండ కోట వద్ద నిర్మాణాలా..?) ఇలా అయితే కష్టమే.. జగదాంబ దేవాలయానికి మరోవైపు వెళ్లే మార్గం. ఆ పక్కన కూలిన గోడ లాగానే ఇక్కడ కూడా ప్రధాన కట్టడానికి పైనుంచి దిగువ వరకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు దీనికి అత్యవసరంగా శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతు అవసరం. లేకుంటే, సాధారణ వర్షాలకు కూడా అది కూలిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల కురిసిన స్థాయి భారీ వర్షం భవిష్యత్తులో కురిస్తే ఈ గోడ నామరూపాల్లేకుండా పోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. రోడ్డు నిర్మాణంలో లోపం? కుతుబ్‌షాహీ నవాబుల కుటుంబం జలకాలాడేందుకు 460 ఏళ్ల కింద రూపుదిద్దుకున్న భారీ జలాశయాన్ని కటోరా హౌస్ అంటారు. దీన్ని ఆనుకునే రోడ్డు ఉంది. దానివైపు దాదాపు 5 అడుగుల ఎత్తుతో 60 మీటర్ల పొడవైన గోడ ఉంది. గతంలో రోడ్డు నిర్మించినప్పుడు, ఆ తర్వాత మరమ్మతులు చేసినప్పుడు వరద నీటి ప్రవాహ మార్గం చెదిరిపోయింది. వర్షాల వరద ప్రవాహం గతి తప్పి, గోడను ఆనుకుని ఉన్న మట్టి జారింది. ఇటీవలి వర్షాలకు ఆ గోడ దాదాపు 40 మీటర్ల మేర కటోరా హౌస్‌లోకి పడిపోయింది. ఇక్కడ నిర్వహణలో శాస్త్రీయత లోపించటం వల్లే ఈ గోడ కూలిందని స్పష్టమవుతోంది. -
గోల్కొండ కోట సందర్శనకు అనుమతి
-
పర్యాటకులు భౌతికదూరం పాటించేలా చర్యలు
-
గోల్కొండ కోట, చార్మినార్ సందర్శనకు అనుమతి
-
చార్మినార్, గోల్కొండ మూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే జూ పార్కులు, ప్రదర్శనశాలలు, ప్రధాన పార్కు లను రాష్ట్ర ప్రభుత్వం మూసేయగా, తాజాగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ విభాగం (ఏఎస్ఐ) ప్రధాన పర్యాటక కేంద్రాలను మూసేసింది. మంగళవారం నుంచి గోల్కొండ, చార్మినార్, వరంగల్ కోట తదితర ప్రాంతాలకు పర్యాటకులకు అనుమతి రద్దు చేసింది. ఇదే విభాగం అధీనంలో ఉన్న వేయిస్తంభాల దేవాలయం, రామప్ప గుడి, గద్వాల జోగుళాంబ దేవాలయాలకు మాత్రం స్వల్ప సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఇవి దేవాలయాలు కావడంతో వాటిని మూసే పరిస్థితి లేదు. అయితే ఎక్కువ సంఖ్యలో గుమికూడకుండా, క్యూలైన్లలో ఎక్కువ సేపు ఉండకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రామనవమి ఉత్సవాలపై నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దేవాలయాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం శుభకార్యాలు ఎక్కువగా జరిగే రోజులు కావటంతో దేవాలయాలకు వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. దీంతోపాటు ఆలయాల్లో పరిశుభ్రత చర్యలు ముమ్మరం చేశారు. కోవిడ్ వైరస్ వ్యాపించే విధానం, దాన్ని నియంత్రిం చేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా వచ్చే నెల 2న జరిగే శ్రీరామనవమి ఉత్సవాలపై అధికారులు దృష్టి సారించారు. భద్రాచలంలో ప్రభుత్వ వేడుకగా జరిగే సీతారామ కల్యాణాన్ని పూర్తిగా ఆలయ కార్యక్రమంగా పరిమితం చేశారు. అర్చకులు, ప్రభుత్వ ప్రతినిధులు, ఉద్యోగులు మాత్రమే పాల్గొనేలా చర్యలు చేపట్టారు. సాధారణ భక్తులు ఆలయానికి రాకుండా కట్టడి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆన్లైన్ టికెట్లను రద్దు చేశారు. ఇప్పటికే ఆ టికెట్లు కొన్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని వైష్ణవాలయాల్లోనూ అర్చకులు దేవేరుల కల్యాణం నిర్వహించటానికే పరిమితం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అధికారులు దేవాలయ నిర్వాహకుల దృష్టికి తెచ్చారు. బలవంతంగా భక్తులు రాకుండా కట్టడి సాధ్యం కానందున, భక్తులే స్వచ్ఛందంగా ఆలయ సందర్శన విరమించుకుని ఇళ్లలో వేడుకలు చేసుకోవాలని పేర్కొంటున్నారు. ఉగాది వేడుకలకూ దూరం! ఉగాది వేడుకలనూ ఆర్భాటాలకు దూరంగా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ కార్యక్రమంగా ప్రగతిభవన్‌లో నిర్వహించే వేడుకలకు సాధారణ ప్రజలు రాకుండా నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. టీవీల్లో లైవ్ ద్వారా ప్రజలు చూడాలనే సూచన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బోసిపోయిన భద్రాద్రి రామాలయం పరిసరాలు -
గోల్కొండ కోట వద్ద నిర్మాణాలా..?
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోట కందకం దెబ్బతినేలా కోట వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నుంచి అనుమతి లేకుండా నిర్మాణ పనులెలా చేస్తారని ప్రశ్నించింది. కోట వద్ద పైపులైన్ పనుల నిర్మాణం గురించి పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు ప్రజాహితవ్యాజ్యంగా పరిగణించి సోమవారం విచారణ చేపట్టింది. కోట చుట్టూ నిర్మాణ పనులు చేయడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ ప్రాముఖ్యత ఉన్న గోల్కొండ కోట 500 ఏళ్ల నాటిదని, అలాంటి చారిత్రక కట్టడం వద్ద పైపులైన్ పనులని ఏవిధంగా చేపట్టారో, ఎవరి అనుమతి తీసుకుని చేస్తున్నారో తెలియజేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. చార్మినార్, గోల్కొండ వంటివి కాకుండా ఇంకేమైనా జాతీయ రక్షిత కట్టడాల గురించి తెలియజేయాలని ఏఎస్ఐ, జీహెచ్ ఎంసీలను ఆదేశించింది. రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తించిందని, రాష్ట్రం మాత్రం చారిత్రక కట్టడాల్ని పట్టించుకోవడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జరుగుతున్నాయా.. లేదా.. కోట వద్ద పనులు జరుగుతున్నాయో లేదో మధ్యాహ్నం 2.30 గంటలకు చెప్పాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. తిరిగి విచారణ ప్రారంభం కాగానే జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది వాదిస్తూ, ఎలాం టి పనులు జరగడం లేదని చెప్పారు. అక్కడే ఉన్న అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ఉద్దేశించి.. హైదరాబాద్ మహానగరంలోని చారిత్రక కట్టడాల జాబితాలో కొత్త వాటిని చేర్చేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించట్లేదని ధర్మాసనం ప్రశ్నిం చింది. హెరిటేజ్ మాన్యుమెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలన్న ఆదేశాల్ని ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఇలాంటి కట్టడాల రక్షణకు తీసుకునే చర్యలు, ప్రాధాన్యత ఉన్న భవనాల జాబితాలను ఏఎస్ఐ, రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా నివేదించాలని ఆదేశించింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్‌కూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వాదనలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఏజీ కోరడంతో విచారణను జనవరి 21కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా(అమికస్‌క్యూరీగా) సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డిని ధర్మాసనం నియమించింది. -
టూరిస్టుల గోల్కొండ
హైదరాబాద్ అనగానే టక్కున గుర్తొచ్చే ల్యాండ్‌మార్క్.. చార్మినార్. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ ప్రఖ్యాతి చెందిన ఈ చారిత్రక కట్టడం పర్యాటకులను ఆకర్షించడంలో మాత్రం వెనుకబడుతోంది. దీనిని కాదని గోల్కొండ ఖిల్లా.. స్వదేశీ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. పర్యాటకుల సందర్శనీయ ప్రాంతాల జాబితాలో గోల్కొండ ప్రథమ స్థానంలో ఉంది. మూడేళ్లుగా ఈ చారిత్రక కట్టడాలను సందర్శిస్తున్న పర్యాటకుల లెక్కలే ఈ విషయాన్ని చెబుతున్నాయి. నిర్మాణ చాతుర్యపరంగా చార్మినార్ కట్టిపడేస్తున్నా.. గోల్కొండ కోటలోని వివిధ నిర్మాణాల ఇంజనీరింగ్ నైపుణ్యమే పర్యాటకులను ఎక్కువ ఆకట్టుకుంటోందని తేలింది. పైగా, కోట విశాలంగా ఉండటం, ఆహ్లాదకర వాతావరణం, ఎక్కువసేపు అక్కడ గడిపేందుకు అనువైన పరిస్థితులు ఉండటం వంటివి గోల్కొండకు పెద్దసంఖ్యలో పర్యాటకులను రప్పిస్తోంది. -
కొత్త చట్టం.. జనహితం
సాక్షి, హైదరాబాద్: ‘బూజు పట్టిన పాత రెవెన్యూ చట్టాలు రైతులు, ప్రజలకు అపార నష్టం కలిగించాయి. ఈ నష్టాన్ని నివారించుకునేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. అవినీతికి, అలసత్వానికి అవకాశం లేని నూతన రెవెన్యూ చట్టాన్ని త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెడతాం’అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ‘పరిపాలనా సంస్కరణలతోనే ప్రజలకు మెరుగైన పాలన అందించడం సాధ్యమవుతుంది. అవినీతిరహిత సుపరిపాలన అందించడానికి ప్రస్తుతమున్న చట్టాలు సరిపోవు. పాత చట్టాలను సమూలంగా మార్చాల్సిన అవసరమొచ్చింది. అందుకే ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని, నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పరిశుభ్రమైన, పచ్చదనం వెల్లివిరిసే గ్రామాలు, మునిసిపాలిటీలను తయారు చేసుకోగలం’అని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం చరిత్రాత్మక గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సరైన దిశలో పెట్టేందుకు గడిచిన ఐదేళ్ళలో చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయని ఆయన తెలిపారు. ‘తెలంగాణలో గత ఐదేళ్ళలో పునర్నిర్మాణ ప్రణాళికను ఒక యజ్ఞంలా నిర్వహించాం. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం కోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేశాం. విద్యుత్తు, తాగునీరు, రహదారుల నిర్మాణం తదితర మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా దేశం ముందు గర్వంగా నిలబడింది’అని తెలియజేశారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. సుస్థిర ఆర్థికాభివృద్ధి గత ఐదేళ్లుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. పటిష్టమైన క్రమశిక్షణ వల్ల అవినీతికి ఆస్కారం లేకుండా సత్వరమైన నిర్ణయాలతో ఈ లక్ష్యాన్ని మనం సాధించగలిగాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నివేదిక ప్రకారం, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 14.84% వృద్ధిరేటుతో స్థూల రాష్ట్రీయ జాతీయోత్పత్తి (జీఎస్డీపీ)లో మన రాష్ట్రం ముందు వరుసలో ఉంది. ఆదాయవృద్ధిలో స్థిరత్వం వల్ల సమకూరిన వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగించడం వల్ల రాష్ట్ర సంపద ఐదేళ్లలో రెట్టింపైంది. రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణలో రూ.4లక్షల కోట్ల విలువైన సంపదుంటే, నేడు రూ.8.66లక్షల కోట్లకు చేరుకోవడం మన ఆర్థిక ప్రగతికి సంకేతంగా నిలుస్తుంది. గడిచిన ఐదేళ్ళలో ఐటీ ఎగుమతులు రూ.52వేల కోట్ల నుంచి లక్షా పదివేల కోట్ల రూపాయలకు చేరుకోవడం మనం సాధించిన ప్రగతికి అద్దం పడుతుంది. గురువారం గోల్కొండలో జరిగిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో గౌరవ వందనం చేస్తున్న పోలీసులు. జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు. చిత్రంలో సీఎస్ ఎస్కే జోషి 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక కొత్త పంచాయతీరాజ్, మునిసిపల్ చట్టాల అమలుతో నూతన ఒరవడిని ప్రవేశ పెట్టడానికి 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఫైనాన్స్ కమిషన్ల గ్రాంటు నిధులను ఈ ప్రణాళిక అమలుకు ముందే స్థానిక సంస్థలకు విడుదల చేయాలని నిర్ణయించింది. 60రోజుల ప్రణాళికలో ప్రజాప్రతినిధులు, అధికారులు.. ప్రజల భాగస్వామ్యం ద్వారా గ్రామాలు, పట్టణాల రూపురేఖల్ని మార్చాలి. మొదటిదశలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలి. ప్రజాసంఘాలు, ప్రజల భాగస్వామ్యంతో సమగ్రంగా చెత్తనిర్మూలనకు నడుంకట్టాలి. ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయిన పిచ్చిమొక్కలు. కూలిపోయిన ఇండ్ల శిథిలాలు. పాడుబడ్డ పశువుల కొట్టాలు. మురుగునీటి నిల్వతో దోమలను సృష్టిస్తున్న గుంతలు, పాడుపడిన బావులు.. ఇవీ రాష్ట్ర వ్యాప్తంగా కనినిపిస్తున్న దృశ్యాలు. వీటన్నింటినీ ఈ 60 రోజుల్లో తొలగించుకోవాలి. నిరుపయోగంగా ఉన్న బోరు బావులను వెంటనే పూడ్చివేయాలి. విద్యుత్ వారోత్సవాలు విద్యుత్ సమస్యల పరిష్కారానికి 60 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యుత్‌శాఖ ప్రజల భాగస్వామ్యంతో పవర్ వీక్ నిర్వహించుకోవాలి. వంగిన కరెంట్ పోల్స్‌ను, వేలాడే వైర్లను సరిచేయాలి. తుప్పుపట్టిన పాత స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ వేయాలి. అన్ని గ్రామాలు, పట్టణాలకు అవసరమైన స్తంభాలు, వైర్లను ప్రభుత్వమే సమకూరుస్తుంది. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు రాష్ట్రంలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామం తమకు అవసరమైన నర్సరీలను 60 రోజుల కార్యాచరణలో భాగంగా స్థానికసంస్థల ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసుకోవాలి. మొక్కల సంఖ్యను, మొక్కల రకాలను, ఇతర విషయాలలో జిల్లా గ్రీన్ కమిటీ (హరిత కమిటీ) అందించే సూచనలను కచ్చితంగా పాటించాలి. పట్టణ, గ్రామబడ్జెట్లో 10% నిధులను పచ్చదనం పెంచే పనుల కోసం కేటాయించాలి. నిర్దిష్టమైన విధానంలో గ్రీన్ కమిటీ సూచనల మేరకు మొక్కలు నాటాలి. ప్రజల చేత నాటించాలి. పట్టణాల్లో, గ్రామాల్లో ప్రతీ ఇంటికీ ప్రజలు కోరుకునే 6మొక్కలను సరఫరా చేయాలి. ప్రజలంతా ఆ మొక్కలను చక్కగా కాపాడి జాగ్రత్తగా పెంచేలా ప్రేరణ కలిగించాలి. కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేసీఆర్ పంచాయతీరాజ్‌లో ఖాళీలన్నీ భర్తీ పల్లెలను ప్రగతి కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పంచాయతీరాజ్ విభాగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించింది. 60రోజుల ప్రత్యేక కార్యాచరణలో ఒక ఆదర్శవంతమైన విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ విధానాన్ని అనుసరించి గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలను ఆయా పాలక మండళ్లు రూపొందించాలి. ఈ ప్రణాళికలు ఖచ్చితంగా గ్రామసభల ఆమోదం పొందాలి. దానికి అనుగుణంగానే స్థానిక సంస్థలు నిధులు ఖర్చు చేయాలి. తద్వారా పల్లెలు, పట్టణాలు ఓ పద్ధతి ప్రకారం ప్రగతిపథంలో పయనించేందకు వీలుంటుంది. పంచాయతీరాజ్ శాఖలోని అన్ని విభాగాల్లో అన్ని ఖాళీలను వేగవంతంగా భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగ నియామకాల్లో స్థానిక కోటాను 95 శాతానికి పెంచాం. మన రైతాంగ విధానం దేశానికే ఆదర్శం తెలంగాణ ప్రభుత్వ రైతాంగ విధానం యావద్భారతానికి ఆదర్శంగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుబంధు పథకం ద్వారా ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఎకరానికి ఏడాదికి 8వేల నుంచి 10వేల రూపాయలకు పెంచి, అందిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుబీమా పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల వరకున్న పంట రుణాలను మాఫీ చేయడం కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదనంగా 575 టీఎంసీలు గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల వచ్చే జూన్ నుంచి తెలంగాణ రైతాంగం అదనంగా 575 టీఎంసీల నీటిని నికరంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఏటా 400 టీఎంసీల నీరు లభిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 టీంఎసీలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు దేవాదుల ద్వారా 75టీఎంసీల నీటిని నికరంగా వాడుకోవడానికి వీలుంటుంది. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఏడాది నుంచే సాగునీరు అందించడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. జూరాలతో కలిపి పాలమూరు జిల్లాలో నేడు 11లక్షల 20వేల ఎకరాలకు సాగునీరందేలా చేసుకోగలుగుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వీలైనంత వేగంగా నిర్మించి ఉమ్మడి పాలమూరుతోపాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందిస్తామని తెలియచేస్తున్నాను. ఆరోగ్య తెలంగాణ దిశగా.. ప్రజలందరికీ సంపూర్ణంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. వీటి ఫలితాల ఆధారంగా తెలంగాణ ఆరోగ్య సూచిక ‘హెల్త్ ప్రొఫైల్’తయారు చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జంటనగరాల్లో బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తండాల్లో తొలిసారిగా జెండా వందనం గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు, మారుమూల పల్లెలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా మార్చడంతో ఇవాళ మొదటి సారిగా అక్కడ సర్పంచ్‌లు సగర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురేసుకుంటున్న దృశ్యం ఆవిష్కృతమైంది. పింఛన్లు రెట్టింపు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పింఛన్లను రెట్టింపు చేసుకున్నాం. దివ్యాంగులకు 3,016 రూపాయలు, ఇతరులకు 2,016 రూపాయల పింఛన్ ఇస్తున్నాం. వృద్ధాప్య పింఛన్ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 57ఏళ్లకరు తగ్గించి పింఛన్‌ను అందించాలని నిర్ణయించాం. ఈ మేరకు అర్హుల జాబితా రూపొందించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. గోల్కొండ ‘కళ’కళ ! సాక్షి, హైదరాబాద్ : గోల్కొండ కోట వేదికగా స్వాతంత్య్ర దినోత్సవం కన్నులపండువగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వందల మంది కళాకారులు గోల్కొండ కోటపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే కళారూపాలను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించడానికి సీఎం కేసీఆర్ వస్తున్న తరుణంలో డప్పు చప్పుళ్ల హోరుతో 16 కళారూపాలను ఏకకాలంలో ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల విద్యార్థినులతో ఏర్పాటు చేసిన ప్రదర్శన సైతం ఆకట్టుకుంది. ప్రగతి భవన్లో జెండా వందనం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయమైన ప్రగతిభవన్‌లో జెండాను ఆవిష్కరించారు. అనంతరం సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానానికి చేరుకుని అక్కడి సైనిక స్మారక స్థూపం వద్ద పుష్పగుచ్చం వుంచి నివాళి అర్పించా రు. అక్కడి విజిటర్స్ బుక్‌లో సంతకం చేశారు. అనంతరం గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించారు. 15వ బెటాలియన్ సహాయ కమాండెంట్ శ్రీధర్ రాజా, మంచిర్యాల డీసీపీ నేతృత్వంలో నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకుంది. కవాతులో పాల్గొన్న ఒడిశా పోలీసు కాంటింజెంట్‌కు కేసీఆర్ ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. -
కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే నియామకాలు : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపడతామని తెలంగాణా సీఎం కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణను వెంటాడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ఆత్మ విశ్వాసం, సానుకూల దృక్పథంతో ముందడుగు వేస్తోందని అన్నారు. ఉత్పత్తుల రంగంలో ముందువరుసలో తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో గురువారం ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఆ తరువాత రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి చర్యలు చేపడతామని చెప్పారు. స్వచ్ఛతే లక్క్ష్యంగా 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు. రాష్ట్రంలో శాంతి సామరస్యం వెల్లివెరిస్తున్నాయని తెలిపారు. వాడని బోరుబావులు ఎక్కడ ఉన్నా మూసివేయాలని కోరారు. ఐదేళ్లుగా సుస్థిర ఆర్ధికాభివృద్ధిని సాధిస్తున్నామని చెప్పారు. -
జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: 73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నగరంలోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ఆ తరువాత రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. -
కోటకు బయలెల్లి..
-
జగదాంబిక ఆలయంలో తొలి పూజలు
-
గోల్కొండ కోటపై నుంచి దూకి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
-
బంగారు తెలంగాణకు బలమివ్వండి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రస్థానం సాగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తోందని చెప్పారు. బంగారు తెలంగాణకు పునరంకితమవుతున్నామని, ప్రజలు ఎప్పటికప్పుడు తగిన బలాన్ని అందించాలని కోరారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారమిక్కడ గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రగతి అంశాలను వివరిస్తూ ప్రసంగించారు. ‘తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వరాష్ట్రంలో చరిత్రాత్మకమైన గోల్కొండ కోటలో వరుసగా ఐదోసారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు గర్విస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసింది. నేడు యావత్ దేశానికి ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాను అందించింది. సమైక్య రాష్ట్రంలో కుదేలైన రంగాలన్నీ నేడు పునరుత్తేజం పొందాయి. సంక్షేమ పథకాలు అణగారిన వర్గాలకు అండగా నిలుస్తున్నాయి. అన్ని రంగాల్లో వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ అనతి కాలంలోనే దేశం గర్వించే రాష్ట్రంగా గుర్తింపు పొందింది. తనను తాను నిర్మించుకుంటూ జాతి నిర్మాణానికి దోహదం చేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ అంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఎంతో పరిణతితో వ్యవహరించిందని, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించడంలోనే సంపూర్ణంగా నిమగ్నమైందని ప్రకటించారు. ప్రధాని చెప్పినట్లుగానే మనం చిల్లర మల్లర రాజకీయాలతోనో, వ్యర్థ వివాదాలతోనో పొద్దు పుచ్చలేదు. ఈ నాలుగేళ్ల సమయాన్ని తెలంగాణ భవిష్యత్తుకు తగిన అభివృద్ధి ప్రాతిపదికలు నిర్మించేందుకు సమర్థవంతంగా వినియోగించుకున్నం. నాలుగేళ్లలో రాష్ట్రం ఏడాదికి సగటున 17.12 శాతం ఆదాయ వృద్ధి రేటును సాధించింది. పురోగామి రాష్ట్రంగా దేశంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. పెరుగుతున్న సంపదనంతా పేదరిక నిర్మూలనకు ఉపయోగించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది’’ అని పేర్కొన్నారు. నాడు జలదృశ్యంలో ఉద్యమానికి ఉద్యుక్తుడినవుతూ.. పోరాటాన్ని మధ్యలో ఆపితే రాళ్లతో కొట్టండని ప్రతిజ్ఞ చేశానని, అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసేవరకు విశ్రమించలేదని చెప్పారు. నేడు అదే సంకల్పబలంతో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పునరంకితమవుతున్నట్టు వివరించారు. ‘‘ఈ ప్రయాణంలో ప్రజలే నాకు అండ దండ. వారి దీవెనలే ప్రేరణ. తెలంగాణ విజయయాత్ర ఇలాగే కొనసాగేందుకు తగిన బలాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు అందించాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా’’ అని కోరారు. వివిధ రంగాల అభివృద్ధికి, పురోగతికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ఆ అంశాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయం, రైతులపై.. తెలంగాణలో వ్యవసాయరంగాన్ని పటిష్ట పరిచే దిశగా ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకుంది. రూ.17 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేసి రాష్ట్రంలోని 35.29 లక్షల మంది రైతులకు ఉపశమనం కలిగించింది. రైతులకు పెట్టుబడి సమస్యను పరిష్కరించాలని ‘రైతుబంధు’ పేరుతో అపూర్వమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో భూమి కలిగిన ప్రతి రైతుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.8 వేలను ఈ పథకం ద్వారా అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 49.49 లక్షల మంది రైతులకు రూ.5,111 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇంత భారీ బడ్జెట్ నేరుగా రైతుల చేతికి అందించటం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. వచ్చే నవంబర్‌లో రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. రాష్టంలో ఏ కారణంగానైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడవద్దని ప్రభుత్వం యోచించింది. ఏ రైతు ఏ కారణంతో మరణించినా అతని కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందించి, భరోసా కల్పించేందుకు రైతు బీమా పథకాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తెస్తోంది. దేశంలో ఇంత పెద్దఎత్తున రైతులకు బీమా సౌకర్యం కల్పించిన ఒకే ఒక్క రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రతీ ఏటా ప్రీమియం మొత్తాన్ని రైతుల తరఫున ప్రభుత్వమే ఎల్ఐసీకి చెల్లిస్తుంది. రైతు మరణించిన పది రోజుల్లోపే వారి కుటుంబానికి బీమా మొత్తం అందేలా ప్రభుత్వం పథకాన్ని రూపొందించింది. రాష్ట్రంలో పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సీడీపై 2.13 లక్షల మంది రైతులకు బర్రెల పంపిణీని ప్రారంభించింది. ఒక్కో యూనిట్‌కు రూ.80 వేలు కేటాయించింది. కోటి ఎకరాలకు నీరిస్తాం కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో ఏటా రూ.25 వేల కోట్లను కేటాయిస్తున్నాం. బ్యాంకుల ద్వారా ప్రభుత్వం అదనపు నిధులు సమకూరుస్తోంది. సమైక్య రాష్ట్రంలో ఉద్దేశ్యపూర్వకంగా పెండింగులో పడేసిన ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తోంది. ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాం. ఈ ఏడాది మరో 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. ప్రాజెక్టులు పూర్తి కావడానికి రాత్రింబవళ్లు అంకితభావంతో పనిచేస్తున్న నీటి పారుదల శాఖకు అభినందనలు. భగీరథపై 11 రాష్ట్రాల ఆసక్తి.. తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించిన అద్భుతం మిషన్ భగీరథ పథకం. శుద్ధి చేసిన నదీ జలాలను ప్రతీ ఇంటికీ, ప్రతీ రోజు అందించడానికి 1.40 లక్షల కిలో మీటర్ల పొడవైన భారీ పైపులైన్ నిర్మాణం జరిగింది. ఇప్పటికే 19 వేల పైచిలుకు ఆవాస ప్రాంతాలకు శుద్ధి చేసిన నదీ జలాలు చేరుతున్నాయి. మిగతా గ్రామాల్లో పనులను వేగంగా పూర్తి చేస్తున్నాం. అనుకున్న సమయం కన్నా ముందే ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడానికి కృషి చేస్తున్న మిషన్ భగీరథ యంత్రాంగానికి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నా. మిషన్ భగీరథ కార్యక్రమం దేశ ప్రధానితోపాటు అందరి ప్రశంసలు పొందింది. తెలంగాణ చూపిన దారిలో ఈ పథకం అమలు చేయడానికి దేశంలోని 11 రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. ఆయా రాష్ట్రాల బృందాలు ఇక్కడికి వచ్చి అధ్యయనం చేశాయి. తాగునీటి వసతి కల్పనలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం. విద్యుత్ వెలుగులు విద్యుత్ రంగంలో మన రాష్ట్రం అనూహ్య ప్రగతిని సాధించింది. వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు నేడు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోంది. త్వరలోనే తెలంగాణ మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుతుంది. బీసీలకు అండగా.. బీసీ కులాల వారు వారికి నచ్చిన పని చేసుకోవడానికి వీలుగా తగిన ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు బ్యాంకులతో నిమిత్తం లేకుండా, లబ్ధిదారులు ఒక్క రూపాయి వాటాధనం చెల్లించాల్సిన అవసరం లేకుండా, వందకు వంద శాతం ఉచితంగా బీసీ కులాల వారందరికీ స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ధన సహాయం చేస్తుంది. ప్రగతి భవన్లో జెండా వందనం ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, ముఖ్య కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పరేడ్ మైదానంలో సైనికుల స్మారకం వద్ద సీఎం నివాళులర్పించారు. అనంతరం గోల్కోండ కోట వద్దకు చేరుకున్నారు. జోనల్ ఆమోదం తర్వాత భారీగా నియమాకాలు తెలంగాణ సాధించుకున్న ఫలితం సంపూర్ణంగా పొందాలంటే స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కాలి. కొత్త జిల్లాల ప్రాతిపదికన స్థానికుల హక్కులు పరిరక్షణ కోసం, ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. లోకల్ కేడర్ ఉద్యోగాల్లో 95 శాతం అవకాశాలు స్థానికులకే లభించేలా చట్టం చేసింది. డిస్ట్రిక్ట్ కేడర్‌తోపాటు ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. కేంద్రం ఈ చట్టాన్ని ఆమోదించడానికి సానుకూలత వ్యక్తం చేసింది. కేంద్ర ఆమోదం లభించిన వెంటనే కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఉద్యోగాల నియామక ప్రక్రియ పెద్ద ఎత్తున ప్రారంభిస్తాం. విశ్వనగరానికి ప్రత్యేక ప్రణాళిక హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తోంది. హైదరాబాద్ వాసులు ఎంతగానో ఎదురుచూసిన మెట్రో రైలు మొదటి దశ ప్రారంభమైంది. రోజుకు లక్ష మందికిపైగా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం ఆనందాన్ని కల్గిస్తోంది. ప్రస్తుతం నాగోలు నుంచి మియాపూర్ వరకు 30 కి.మీ. మేర మెట్రో రైలు పరుగులు పెడుతోంది. వచ్చే నెల నుంచి అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్ వరకు, నవంబర్‌లో అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు మెట్రో రైలు నడిపించడానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. సంక్షేమంలో మనం నంబర్ వన్ దేశంలో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేక గుర్తింపు పొందింది. రూ.40 వేల కోట్లతో 40కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజా సంక్షేమంలో దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. ఆసరా పెన్షన్ల రూపంలో 41.78 లక్షల మందికి రూ.5,367 కోట్లను ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం అందించేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ప్రారంభించింది. ఇప్పటివరకు 4 లక్షల మంది లబ్ధి పొందారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం అమలవుతోంది. ఇప్పటి వరకు 12,974 ఎకరాలు కొనుగోలు చేసి, 5,065 మంది దళితులకు పంపిణీ చేశాం. దళితులకు మూడెకరాల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ. మైనారిటీ ఐటీ పారిశ్రామికవేత్తల కోసం హైదరాబాద్‌లో త్వరలోనే ప్రత్యేక ఐటీ పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్స్, షీ టీమ్స్, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి, భద్రతకు దోహదపడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మార్కెట్ కమిటీల్లో మహిళలకు ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం కింద ఇప్పటి వరకు 2,72,763 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. రైతు బీమా షురూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కోండ కోటలో ప్రారంభించారు. రైతుల బీమాకు సంబంధించిన మాస్టర్ ఇన్సూరెన్స్ బాండ్‌ను ఎల్ఐసీ దక్షిణ మధ్య విభాగం జోనల్ మేనేజర్ సుశీల్‌కుమార్ సీఎం సమక్షంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథికి అందించారు. బీసీల ఉపాధి పథకాలు బీసీ వృత్తి కులాల లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేసే పత్రాలను సీఎం పంపిణీ చేశారు. ఎస్.రాజేశ్వరీ(తిరుమలగిరి), చిప్పోలు నిర్మల(ఆసిఫ్‌నగర్), పోలంపల్లి స్వప్న(ముషీరాబాద్), బర్రోతు లక్ష్మణ్‌రావు(ముషీరాబాద్), ముదగుల శ్రీనివాస్(షేక్‌పేట)లకు సీఎం ఈ పత్రాలను అందజేశారు. అధికారులకు అవార్డులు ఐదుగురు అఖిలభారత సర్వీసు అధికారులను ప్రభుత్వం ఉత్తమ సేవ పతకాలకు, ప్రశంసా పత్రాలకు ఎంపిక చేసింది. సీఎం కేసీఆర్ వీరికి అవార్డులు, పత్రాలను అందజేశా>రు. సిద్దిపేట కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి, అటవీ శాఖ అడిషనల్ పీసీసీఎప్ ఆర్.ఎం.డోబ్రియాల్, మత్స్యశాఖ కమిషనర్ సి.సువర్ణలు ఉత్తమ సేవాపత్రాలు అందుకున్నారు. ఇంటెలిజెన్స్ విభాగం డీఐజీ టి.ప్రభాకర్‌రావు, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ డీఐజీ రాజేశ్‌కుమార్‌లు ఉత్తమ సేవా పతకాలు అందుకున్నారు. ఫొటోలు; గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలు -
గోల్కొండ కోటలో స్వాతంత్ర్య వేడుకలు
-
యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శం : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని, యావత్ దేశానికే తెలంగాణ అభివృద్ధి నమూనాను అందించామని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కేసీఆర్ గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసించారని, దేశంలో అన్ని రంగాల్లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ‘వ్యవసాయ రంగ పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నాం. రూ 17 వేల కోట్ల వ్యవసాయ రుణాలను మాఫీ చేశాం. కల్తీలపై ఉక్కుపాదం మోపుతాం. రైతు సమస్వయ సమితులు ఏర్పాటు చేశాం. 6,028 ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేశాం. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. తెలంగాణ ఏర్పడితే చిమ్మచీకట్లే అన్నవాళ్ల అంచనాలు తలకిందులు చేశాం. విద్యుత్ రంగంలో అనూహ్య ప్రగతి సాధించాం. త్వరలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ మారబోతుంది. సీతారామ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తాం’ అని తెలిపారు. -
ఖిల్లా.. సుబహానల్లా!
రాజుల కాలంలో నిర్మించిన కోటలు నాటి పాలనకు సజీవ సాక్ష్యాలు. ఆ కట్టడాలు అప్పటి పరిస్థితులకు అద్దం పడతాయి. నిర్మాణం, శిల్ప కళతో పాటు శత్రుదుర్భేద్యంగా నిర్మించడంలో పాలకులు వైవిధ్యం కనబరిచేవారు. అలా సరిగ్గా 500 ఏళ్ల క్రితం గోల్కొండ కోట నిర్మించారు. కాకతీయులు, బహుమనీలు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసీప్ జాహీలు పాలించిన అద్భుతమైన కోట ఇది. ఈ కోట నిర్మాణానికి 500 ఏళ్లవుతున్న సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం... – సాక్షి, హైదరాబాద్ మట్టి కోట నిర్మాణం... క్రీ.శ. 1083 నుంచి 1323 వరకూ కోట కాకతీయుల పాలనలో ఉంది. గోల్కొండ అసలు పేరు గొల్ల కొండ. ఇక్కడ ఓ గొర్రెల కాపరికి మంగళవారం అనే కొండపై దేవతావిగ్రహం కనపడింది. ఈ విషయాన్ని కాకతీయ రాజులకు తెలుపగా వారు ఆ విగ్రహం చుట్టూ 1143లో మట్టి కోటని నిర్మించారు. కాలక్రమంలో గొల్లకొండ గోల్కొండగా మారింది. తర్వాత కాలంలో ఈ కోట అనేక రాజులు మారి 1518 సంవత్సరంలో కులీ కుతుబ్ షాహీల పాలనలోకి వచ్చింది. కుతుబ్ షాహీ రాజుల కాలంలోనే మట్టి కోట స్థానంలో ఇప్పుడున్న రాళ్ల కోటను కట్టించారు. 1689లో మొఘలులు దండయాత్ర చేసి కోటను స్వాధీనం చేసుకున్నారు. మట్టి కోట స్థానే రాళ్ల కోట... బహుమనీ సుల్తాన్ల రాజ్యం పతనమయ్యాక కుతుబ్ షాహీ పాలన వచ్చింది. సుల్తాన్ అలీ కుతుబ్ షా గోల్కొండకు పాలకుడిగా ప్రకటించుకున్నాడు. ఈయన గోల్కొండ కోటను రాళ్లతో నిర్మించాలని భావించాడు. అప్పుడే యుద్ధాల్లో కొత్తగా ఫిరంగి వినియోగిస్తున్నారు. దీనికి మట్టి కోట తట్టుకోలేదని, రాళ్ల కోట నిర్మించాడు. దేశంలోని ఇతర కోటలను వేరే ప్రదేశం నుంచి తెచ్చిన రాళ్లతో నిర్మించగా, గోల్కొండకు మాత్రం అదే గుట్ట అంటే నల్లకొండ రాతినే వినియోగించారని చరిత్రకారులు చెబుతారు. పద్మవ్యూహాన్ని తలపించే మెట్లు... 120 మీటర్ల ఎత్తున్న నల్లరాతి కొండపై గోల్కొండ కోటను నిర్మించారు. శత్రువుల నుంచి రక్షణ కోసం చుట్టూ ఎత్తైన గోడను నిర్మించారు. ఇది 87 అర్ధ చంద్రకార బురుజులతో 10 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ కోటకు నాలుగు ప్రధాన సింహ ద్వారాలు ఉన్నాయి. రాజ దర్బారుకు చేరాలంటే మూడు మార్గాలున్నాయి. మొదటిది నేరుగా రాజదర్బారుకు వెళితే... రెండో దారిలో సైనికుల నివాసాలు కనిపిస్తాయి. ఇక్కడి మెట్లు ఓ పద్మవ్యూహాన్ని తలపిస్తాయి. శత్రువులు ప్రవేశించినా చివరికి సైనిక స్థావరాల్లోకి వెళ్లేలా వీటిని నిర్మించడం వారి ప్రతిభకు తార్కాణంగా చెప్పొచ్చు. ఈ కోటకు ఉన్న ప్రధాన ద్వారాలను ఇనుముతో నిర్మించారు. వీటి ఎత్తు సుమారు 24 అడుగులు. పర్షియా, ఇస్లామిక్ నిర్మాణ శైలిలో కోటను నిర్మించారు. కోటలోనికి చేరుకోవడానికి 380 రాతిమెట్లున్నాయి. ఇవేగాక మరెన్నో ప్రత్యేకతలు ఈ కోట సొంతం. ధ్వని.. ప్రతి ధ్వని విధానం.. గోల్కొండ నిర్మాణం పర్షియన్ ఆర్కిటెక్చర్ ఓ అద్భుతం. 500 ఏళ్ల క్రితమే ఉపయోగించిన ఇంజనీరింగ్ విధానం ఆశ్చర్యపరుస్తుంది. కోటలోకి శత్రువులు ప్రవేశించినప్పుడు పైవారికి సమాచారం చేరవేసేందుకు ధ్వని.. ప్రతి ధ్వని.. అనే విధానాన్ని వినియోగించారు. కోట కింద భాగంలో చప్పట్లు కొడితే కిలోమీటరు దూరంలో లోపల ఉండే బాలాహిసార్ వద్ద ఆ శబ్దం వినిపిస్తుంది. కోట ప్రధాన ద్వారం కనిపించకుండా ముందు కర్టెన్ వాల్ నిర్మించారు. కోటలో ఊట బావులు, వర్షపు నీటి నిల్వ బావులు ఏర్పాటుచేశారు. వీటిలోకి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న దుర్గం చెరువు నుంచి నీళ్లు వచ్చేవి. దీని కోసం మట్టి పైపులు, ఇనుప చక్రాలు వాడేవారు. 67 ఏళ్ల వరకు నిర్మాణం.. ఏదైన కట్టడాన్ని కింది నుంచి పైకి కడతారు. కానీ గోల్కొండను పైనుంచి కిందికి కడుతూ వచ్చినట్లు చారిత్రక పుస్తకాల ద్వారా తెలుస్తోంది. 1518, సుల్తాన్ కులీ కుతుబ్ షా కాలంలో కోట నిర్మాణం ప్రారంభించగా, 1585 మహ్మద్ కులీ కుతుబ్ షా కాలం వరకు నిర్మాణం జరిగింది. అంటే దాదాపు 67 ఏళ్లపాటు ఐదుగురు పాలకుల హయాంలో నిర్మాణం కొనసాగింది. -
బోనమెత్తిన భాగ్యనగరి
సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోట జనసంద్రమైంది. ఆదివారం ప్రారంభమైన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాలకు జనం వేలాదిగా తరలి వచ్చారు. అశేష జనవాహిని మధ్య లంగర్‌హౌస్ నుంచి ప్రారంభమైన అమ్మవారి తొట్టెల ఊరేగింపు ఫతే దర్వాజా, చోటా బజార్, బడా బజార్, గోల్కొండ చౌరస్తాల గుండా కోటకు చేరుకుంది. భారీ తొట్టెల కోట ప్రధాన ద్వారం నుంచి అమ్మవారి ఆలయం వరకు ముందుకు సాగగా.. భక్తులు వెంట వెళ్లారు. మరోవైపు గోల్కొండ బంజార దర్వాజ నుంచి పటేలమ్మ మొదటి బోనం ఊరేగింపు కఠోర గంజ్, మొహల్లాగంజ్‌ల గుండా కోటకు చేరుకుంది. ఈ సందర్భంగా నగీనా బాగ్‌లోని నాగదేవత ఆలయం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావుగౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కూడా బోనాల ప్రారంభానికి విచ్చేశారు. ఆలయాలకు రూ.15 కోట్ల నిధులు: ఇంద్రకరణ్ గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలిపూజతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వినోద్ ఆధ్వర్యంలో మంత్రులు లంగర్‌హౌస్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత అమ్మవారికి బోనాల ర్యాలీ ప్రారంభమైంది. ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురవాలని, అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. బోనాల సందర్భంగా ఆలయాల అభివృద్ధి కోసం విడుదల చేసిన రూ.15 కోట్ల నిధులు కేవలం జంటనగరాల కోసమేనని చెప్పారు. మిగిలిన జిల్లాలకు కూడా ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మొదటి రోజు ఉత్సవాలతోనే అధికారులు చేతులు దులుపుకోవద్దని, గోల్కొండలో జరిగే తొమ్మిది వారాల పూజలకు ప్రతి శాఖ అధికారి భక్తులకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గోల్కొండ బోనాల ఉత్సవాలను తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆలయాల అభివృద్ధికి సీఎం పెద్దపీట వేశారని, కేవలం ప్రధాన ఆలయాలకే పరిమితం కాకుండా గల్లీల్లోని చిన్న దేవాలయాలను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు. -
కోటంత బోనం.. కొండంత జనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బోనాల జాతర ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో ప్రారంభం కానుంది. దీనికోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గోల్కొండ కోట, అమ్మవారి ఆలయం, పరిసర ప్రాంతాలను అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భారీసంఖ్యలో తరలిరానున్న భక్తుల కోసం అన్ని సదుపాయాలను సిద్ధం చేశారు. వందల ఏళ్లుగా నగరప్రజలు ఎంతో ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. కరువు, కాటకాలు, అంటువ్యాధుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ ప్రజలు భక్తిప్రపత్తులతో శక్తి స్వరూపిణి అయిన మహంకాళికి సమర్పించే ప్రసాదమే బోనం. నేటి(ఆదివారం) నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ప్రతి ఆది, గురువారాల్లో అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఈ 15వ తేదీనే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర సన్నాహాలు మొదలవుతాయి. ఇందులో భాగంగా ఆదివారం నుంచి ఘటం ఎదుర్కోలు నిర్వహిస్తారు. ఉజ్జయిని మహంకాళి ముఖాకృతి, ఆభరణాలు, వస్త్రాలను ఘటంపై ఉంచి ప్రధాన ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం ఈ నెల 29న మహంకాళి బోనాలు, 30న రంగం భవిష్యవాణి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే లాల్‌దర్వాజ సింహవాహిని బోనాల పండుగ జరుగుతుంది. బోనాల ఉత్సవాల దృష్ట్యా గోల్కొండ కోటలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మొదటిరోజు సుమారు లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశముంది. అధికార లాంఛనాలతో ఉత్సవాలు... ఆదివారం ఉదయం గోల్కొండ బోనాల పండుగ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు లంగర్‌హౌస్ వద్ద తొట్టెల ఊరేగింపు మొదలవుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసే స్వాగ తవేదిక వద్దకు మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి వచ్చి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, అధికార లాంఛనాలు సమర్పిస్తారు. బోనా ల ఊరేగింపు సందర్భంగా నిర్వí హించే ప్రతిఘట్టం భక్తిపూరితంగా, భావోద్వేగభరితంగా ఉంటుంది. పోత రాజుల నృత్యాలు, బ్యాండుమేళాలు, భక్తకోటి కోలాహలం, తొట్టెల ఊరేగింపు కనులపండువగా సాగిపోతాయి. గో ల్కొండ కోటపైకి అమ్మవారి ఊరేగింపు కాలినడకన చేరుకోవడంతో అక్కడ పెద్ద జాతరను తలపిస్తుంది. సువిశాలమైన గోల్కొండ కోట భక్తులతో కిటకిటలాడుతుంది. నగీనాబాగ్ నుంచి భక్తరామదాసు బందీఖానా మీదుగా అమ్మవార్ల ఆలయానికి మెట్లపై వెళ్లే మార్గంలో బారులు తీరిన భక్తులను చూసేందుకు రెండు కళ్లు చాలవు. తెలంగాణ భవన్లో బోనాల సంబరాలు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం, లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాల ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి మూడు రోజలు పాటు తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతులు దేశవ్యాప్తంగా తెలిసేలా ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ శనివారం తెలిపారు. జూలై 16న ఫొటో ఎగ్జిబిషన్, 17న ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి భవన్లో ప్రతిష్టించడం, రాత్రి బోనాల విశిష్టతను తెలుపుతూ తెలుగు వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ సత్యనారాయణ అధ్యక్షతన కవి సమ్మేళనం, 18న అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాల సమర్పణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎంపీ కవిత పాల్గొనే అవకాశం ఉందన్నారు. -
గోల్కొండ కోట బోనాలు
గోల్కొండ : గోల్కొండ కోట బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించి తెలంగాణ పండుగల గొప్పదనాన్ని చాటుతామని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు జరిగే శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవార్ల బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం గోల్కొండలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతి«ధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గోల్కొండ కోటలో అమలవుతున్న ప్లాస్టిక్ నిషేదానికి మరింత చేయూతనిచ్చేందుకు కోటకు వచ్చే భక్తులకు తాగునీరు, మట్టి గ్లాసులు, మట్టి చెంబులలో అందిస్తామని ఆయన తెలిపారు. భక్తులు చేసుకునే వంటలకు ప్రత్యేక స్థలం కేటాయించాలని, రోడ్లకు ప్యాచ్‌వర్క్‌లు నిర్వహించాలని, డ్రైనేజీ, త్రాగునీటి పైప్లైన్లకు మరమ్మత్తులు నిర్వహించి వీధి లైట్ల నిర్వహణను సరి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి బోనం రోజున లంగర్‌హౌస్ నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని, ఆ రోజు లంగర్‌హౌస్ నుంచి కోటకు వరకు 550 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చే యాలన్నారు. బల్దియా కమిషనర్ డాక్టర్ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ... ప్లాస్టిక్ రహిత హైదరాబాద్ ఏర్పాటులో పాల్గొన్న స్వచ్ఛ బోనాలు– స్వచ్ఛ గోల్కొండ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు, ఈ కార్యక్రమం అంతర్జాతీయ ప్లాస్టిక్ నిషేదిత కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ భారతి హోలికేరి, జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీవత్సకోట, పర్యాటకశాఖ ఎండి మనోహర్ తదితరులు పాల్గొన్నార -
గోల్కొండలో గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య?
హైదరాబాద్: గోల్కొండ కోటలో గుర్తు తెలియని పర్యాటకుడు శనివారం అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. రాత్రి 9గంటలకు సెక్యూరిటీ గార్డులు కోటలోని రాణీ మహల్ వెనక లైట్ అండ్ సౌండ్ షో జరిగే ప్రాంతాన్ని పరిశీలిస్తుండగా అక్కడ ఓ వ్యక్తి పడి ఉండటాన్ని గమనించారు. ముందు నిద్రపోతున్నాడని అనుకున్నా, కదిపి చూసినా లేవకపోవడంతో అనుమానం వచ్చి ఉన్నతాధికారులకు, 108కి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది అతడు మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతదేహం పక్కన కూల్‌డ్రింగ్ సీసా, టీ కప్పు ఉండటంతో మృతుడు ఏదైనా విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుని వయసు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండొచ్చని తెలిపారు. -
చారిత్రక వనం..పునర్వైభవానికి సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: గురుత్వాకర్షణ శక్తితో నీటిని విరజిమ్మే ఫౌంటెన్.. నలువైపులా ఉద్యానవనం.. కాలిబాటలు.. అందమైన పూల చెట్లు.. చుట్టూ ఉన్న చెరువుల నుంచి నీటిని తరలించే కాలువలు.. టెర్రకోట పైపులైన్లు.. పూదోట అందాల్ని తిలకించేందుకు ప్రత్యేకంగా ఓ బారాదరి (పెవిలియన్).. గోల్కొండ నయా ఖిల్లాలో 450 ఏళ్ల కిందటి అద్భుత ఉద్యానవనం ప్రత్యేకతలివి. తాజ్‌మహల్ ముందు ఉన్న మొఘల్ గార్డెన్‌కు మాతృకగా భావించే ఈ ఉద్యానవనం.. కాలక్రమేణా భూగర్భంలో కలసింది. తాజాగా దానిని పునరుద్ధరించేందుకు కేంద్ర పురావస్తు శాఖ చర్యలు చేపట్టింది. గోల్కొండ కోటకు మరోవైపున.. కాకతీయుల నుంచి గోల్కొండను స్వాధీనం చేసుకున్నాక దానికి కొత్తరూపు ఇచ్చే క్రమంలో కుతుబ్‌షాహీలు నయాఖిల్లాను నిర్మించారు. అందులో అద్భుత ఉద్యానవనాన్ని నిర్మించారు. 1590 సంవత్సరం అనంతరం అసఫ్‌జాహీల పాలన మొదలయ్యాక ఉద్యానవనం కనుమరుగైంది. కొన్నేళ్ల కింద ఈ ప్రాంతంలో గోల్ఫ్‌కోర్టు నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్నపుడు ఉద్యానవనం ఆనవాళ్లు బయటపడ్డాయి. దీనిపై దృష్టి సారించిన కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టులు కృష్ణయ్య, తాహెర్‌లు తవ్వకాలు జరిపి పర్షియా గార్డెన్ ఆనవాళ్లను వెలుగులోకి తెచ్చారు. ప్రస్తుతం సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు మిలింద్ కుమార్ చావ్లే.. ఈ ఉద్యానవనానికి పునర్వైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. పక్కనే ఉన్న శాతం చెరువు నుంచి నీటిని తీసుకొచ్చే కాలువల్లో మిగిలిన భాగాన్ని పునరుద్ధరించారు. బారాదరిని డంగు సున్నంతో బాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఏ ఇతర తవ్వకాలకు కొత్త అనుమతులు కోరకుండా.. కేవలం ఈ ఒక్కపనికే అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఇక చుట్టూ ఉన్న భూముల్లో ఇంకా నిర్మాణాలేమైనా ఉండిపోయా యా అన్న సందేహం మేరకు జీఐఎస్ సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను చెన్నై ఐఐటీకి అప్పగించారు. భూమిలో పూడుకుపోయిన కట్టడాలు, నాటి వస్తువులు, నాణేల వంటివి ఏవి ఉన్నా దానితో గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు. శిథిలమైన ఉద్యానవనం కట్టడాలు అతిథులు కూర్చునేందుకు నిర్మించిన బారాదరి -
గోల్కొండ.. ‘ప్లాస్టిక్’ లేకుండా..
సాక్షి, హైదరాబాద్ : గోల్కొండ కోట చూద్దామని వెళ్లారు.. ఎంట్రీ టికెట్ తీసుకున్నారు.. ప్రవేశ ద్వారం దగ్గరకు వచ్చారు.. ఆగండాగండి.. చేతిలో ప్లాస్టిక్ నీళ్ల బాటిల్ ఉందా.. అయితే రూ.20 కట్టాల్సిందే.. అదేంటి?.. ఎందుకు కట్టాలి అనుకుంటున్నారా.. అయితే మీకు ‘స్టిక్కరింగ్’ ప్రయోగం గురించి వివరించాల్సిందే.. అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువగా సందర్శించే గోల్కొండ కోటలో గతంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లే కనిపించేవి. కోట పరిసరాలు శుభ్రం చేసే సిబ్బంది తక్కువగా ఉండటంతో వ్యర్థాల నియంత్రణ, తొలగింపు సవాల్‌గా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు కేంద్ర పురావస్తు సర్వేక్షణ (ఏఎస్ఐ) విభాగానికి వచ్చిన కొత్త అధికారి ‘స్టిక్కరింగ్’ విధానం తీసుకొచ్చారు. ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలే కోటలో కనిపించడం లేదంటే ఆ చిట్కా ఎలా పని చేసిందో అర్థమైపోయుంటుంది. ఖాళీ బాటిల్‌ను పడేశారో.. గోల్కొండ కోటను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా గతంలోనే ప్రకటించారు. కానీ ప్లాస్టిక్ వ్యర్థాలు పడేయకుండా పర్యాటకులను నిరోధించటం సాధ్యం కాకపోవటంతో అది ఫలితమివ్వలేదు. దీంతో ఏఎస్ఐ తెలంగాణ సర్కిల్ సూపరింటెండెంట్ ఆర్కియోలజిస్ట్ మిలన్ కుమార్ చావ్లే స్టిక్కరింగ్ విధానం ప్రవేశపెట్టారు. ఆ విధానం ప్రకారం పర్యాటకులు వెంట తెచ్చుకున్న మంచి నీళ్ల బాటిల్‌కు సిబ్బంది స్టిక్కర్ అతికించి రూ.20 వసూలు చేస్తారు. సందర్శన పూర్తయ్యాక తిరిగి వెళ్లే సమయంలో స్టిక్కర్ వేసిన బాటిల్ ఇస్తే రూ.20 తిరిగి ఇస్తారు. ఖాళీ బాటిల్‌ను ఎక్కడైనా పడేశారో.. ఆ రూ. 20 ఇవ్వరు. స్టిక్కర్ వద్దనుకుంటే.. గోల్కొండ క్యాంటిన్లలోనూ నీళ్ల బాటిల్ కొని వెంట తీసుకెళ్తే బాటిల్ ధరకు రూ.20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఖాళీ బాటిల్ ఇచ్చి రూ.20 తిరిగి తీసుకోవచ్చు. కోట ప్రవేశ ద్వారం వద్ద స్టిక్కర్ అతికిస్తారు. ఖాళీ బాటిళ్లు ఇచ్చేందుకు 3 చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టిక్కర్ వద్దనుకుంటే మాత్రం బాటిల్‌ను లోనికి అనుమతించరు. అక్కడే నిలబడి నీళ్లు తాగి బాటిల్‌ను చెత్తబుట్టలో పడేస్తేనే లోనికి అనుమతి ఉంటుంది. గతంలో కోట లోపల నిత్యం 250 ఖాళీ సీసాలు దర్శనమిచ్చేవి. తాజా విధానం బాగా పని చేసింది. ఎక్కడపడితే అక్కడ ఖాళీ బాటిళ్లు విసిరేసే నిర్లక్ష్యానికి చెల్లుచీటి పడింది. తినుబండారాలకూ.. బాటిళ్లే కాదు.. ప్లాస్టిక్ కవర్లలో తినుబండారాలుంటే వాటినీ అనుమతించడం లేదు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు లోనికి తీసుకెళ్లాలంటే కవర్‌ను చించి తినుబండారాలను అందుబాటులో ఉంచిన కాగితం కవర్లో వేసుకుని తీసుకెళ్లాలి. ఒక్కో కాగితం కవర్‌కు రూ.1 చొప్పున చెల్లించాలి. ఈ రెండు విధానాలనూ ఇటీవలే అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో కోటలో ప్లాస్టిక్ నిషేధం ఠంచన్‌గా అమలవుతోంది. నిర్బంధం తప్పదు ‘ప్లాస్టిక్ నిషేధించినా పర్యాటకులు పెడచెవిన పెడుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు పోగై కట్టడం చెత్తమయంగా కనిపిస్తోంది. అందుకే ఈ విధానాన్ని అమలు చేస్తున్నాం. తొలుత పర్యాటకులు వ్యతిరేకించినా ఇప్పుడు అలవాటు పడ్డారు. మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ విధానం అమలు చేస్తే పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలుండవు’ – ఏఎస్ఐ ఎస్ఏ మిలన్ కుమార్ చావ్లే -
గంగిరెద్దులను ఆడిస్తే జైలుకే..
హైదరాబాద్ , ముషీరాబాద్: కులవృత్తిని నమ్ముకుని తరతరాలుగా బిక్షాటన చేస్తూ జీవిస్తున్న గంగిరెద్దుల కులస్తులను బిక్షగాళ్లుగా పరిగణిస్తూ పోలీసులు అరెస్టు చేయడం దారుణమని పలువురు గంగిరెద్దుల వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత 20సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, చిగురు మామిడి తదితర మండలాల నుంచి 100 నుంచి 150కుటుంబాలు డిసెంబర్ మాసంలో నగరానికి చేరుకుంటారన్నారు. సంక్రాంతి వరకు నగరంలో గంగిరెద్దులను ఆడించి జీవనోపాధి పొందిన తర్వాత మళ్లీ తిరిగివెళ్తారని తెలిపారు. ఇటీవల ఇవాంకా ట్రంప్ రాక సందర్భంగా బిచ్చగాళ్లను నగరం నుంచి తరలించేందుకు 77సి కొత్తగా చట్టాన్ని తీసుకువచ్చారని, ఆ చట్టం కింద తమను కూడా చేరుస్తూ అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారని అలా దిల్‌షుక్‌నగర్‌లో సోమవారం బత్తుల రాకేష్, గంట అశోక్‌ను జైలుకు పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా టీమాస్ జిల్లా నాయకులు ఎం. శ్రీనివాస్, ఎంబీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడిరాజు నరేష్ నిలిచి విడిపించారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకపక్క తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తుంటే పోలీసులు మాత్రం అనాదిగా సంక్రాంతినాడు గంగిరెద్దులను ఆడించే తమను బిక్షగాళ్లుగా చూస్తూ అరెస్టు చేయడం తగదన్నారు. ఇందుకు నిరసనగా మంగళవారం గొల్కొండ చౌరస్తాలో సుమారు 100కి మందికి పైగా గంగిరెద్దుల కులస్తులు ఎద్దులతో కలిసి నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసిన గంగిరెద్దుల కులస్తులకు డబుల్ బెడ్రూం ఇండ్లు, 3ఎకరాల భూమి, ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పోలీసులు వేధింపుపులు, దాడులు మానుకొని సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గంగిరెద్దుల సంఘం నాయకులు కోటయ్య, అశోక్, సమ్మయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
జిల్..జిగేల్..గోల్కొండ
-
గోల్కొండ కోటలో అమెరికా నెలవంక
-
దోమలు.. కనిపిస్తే కాల్చివేత..!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు హాజరయ్యే అతిథులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు ఇవ్వనున్న గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. విందు నాటికి గోల్కొండ కోటలో ఒక్క దోమ కూడా లేకుండా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోమల నిర్మూలన చర్యల్ని ముమ్మరం చేసింది. దోమల నిర్మూలనలో భాగంగా ఇప్పటి వరకూ ఫాగింగ్, స్ప్రేయింగ్‌లకు శక్తిమంతమైన అల్ఫా సైపర్ మెథ్రిన్, సిఫనోథ్రిన్‌తోపాటు పొగ రాకుండా పైరిథ్రమ్‌ను వాడుతున్న సిబ్బంది.. తాజాగా పరిమళాలు వెదజల్లే సిట్రనెల్లా ఆయిల్, డెల్టా మిథిలీన్ లిక్విడ్లను స్ప్రే చేస్తున్నారు. వీటివల్ల దోమల నిర్మూలనే కాకుండా పరిసరాల్లో సువాసనలు వెదజల్లుతాయి. మస్కిటో రెపెల్లెంట్స్ గానూ పనిచేస్తుండంతో వీటిని వినియోగిస్తున్నారు. ఈ పనులకుగానూ 4 డ్యూరోటెక్ మెషీన్లు, 8 పవర్ స్ప్రేయర్లు, 8 మొబైల్ మెషీన్లను వాడుతున్నారు. పరీక్షలతో దోమల లెక్క.. దోమల నిర్మూలనకు చేపట్టిన చర్యలతో పాటు ఏరోజుకారోజు ప్రత్యేకంగా మస్కిటో డెన్సిటీ అధ్యయనం చేస్తున్నారు. ఇందుకు గానూ గోడలపై సక్షన్ ట్యూబ్‌లను ఉంచి గాలి గుంజుతారు. దీంతో పరిసరాల్లోని దోమలు ట్యూబ్‌లోకి వస్తాయి. వాటిని టెస్ట్‌ట్యూబ్‌లోకి పంపి లెక్కిస్తారు. బుధవారం విందు సమయానికి ఒక్క దోమా లేకుండా చేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తూ అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం.. చీకటి పడ్డ తర్వాత ఇలా రోజుకు రెండు పర్యాయాలు ఈ పరీక్షలు చేస్తున్నారు. గోల్కొండ కోటలో పరీక్షల్లో ఐదు రోజుల క్రితం గంటకు 200 దోమలు ఉండగా.. శనివారం నాటికి 40కి తగ్గాయి. సోమవారం వరకు వీటిని జీరో చేసే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. సాధారణంగా చీకటి పడిన తర్వాత గోల్కొండ కోటలోకి దోమలు ఎక్కువగా వస్తాయని, అయితే తాము చేపట్టిన చర్యలతో శని, ఆదివారాల్లో దోమలు చాలా వరకు తగ్గిపోయాయని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వి.వెంకటేశ్ ‘సాక్షి’కి తెలిపారు. గోల్కొండ కోట పరిసరాల్లో దోమల లార్వా వ్యాప్తికి కారణమవుతున్న గుర్రపుడెక్కను తొలగించారు. శాతం చెరువు, హుడా తలాబ్, టిప్పుఖాన్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లోనూ గుర్రపుడెక్క తొలగించినట్లు సీనియర్ ఎంటమాలజిస్ట్ లచ్చిరెడ్డి తెలిపారు. విందురోజు ప్రత్యేక అగర్బత్తీలు.. ఇప్పటికే పరిమళాలు వెదజల్లే లిక్విడ్స్‌తో స్ప్రేయింగ్ పనులు చేస్తుండగా విందురోజు ప్రత్యేక పరిమళాలతోపాటు దోమలను దరి చేరకుండా చేసే లెమన్‌గ్రాస్‌తో తయారు చేసిన ప్రత్యేక అగర్బత్తీలను గోల్కొండ కోటలో వినియోగించనున్నారు. లెమన్ గ్రాస్.. దోమల రెపెల్లెంటే కాక సుగంధం వెదజల్లడంతో సదరు అగర్బత్తీలను నాందేడ్ నుంచి తెప్పిస్తున్నారు. -
‘గ్లోబల్’ అతిథులకు ప్రత్యేక విందు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్–2017కు హాజరు కానున్న విదేశీ అతిథులకు హైదరాబాద్ నగర చరిత్ర, సంస్కృతి, గత వైభవాన్ని తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోటల్లో వారికి ప్రత్యేక విందులను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 28న ఈ సదస్సు ప్రారంభం కానుండగా, అదేరోజు విదేశీ అతిథులకు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో, 29న గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, పారిశ్రామికవేత్త ఇవాంకా ట్రంప్‌తో పాటు దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో సహా 1,200 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై గురు వారం సచివాలయంలో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ పై విషయాన్ని వెల్లడించారు. 28న ప్రారంభోత్సవం ఉంటుందని, 29, 30 తేదీల్లో ప్లీనరీ సెషన్ మరియు ప్యానెల్ డిస్కషన్, వర్క్‌షాప్ మానిటరింగ్ క్లాసులు ఉంటాయన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సదస్సుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు. సదస్సు నిర్వహణపై వచ్చేవారం మరో మారు సమావేశం అవుతామన్నారు. సదస్సును పురస్కరించుకొని ఈ నెల 17 నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ సీఎస్‌కు వివరించారు. -
ఐపీఎల్ ట్రోఫీ ఆగయా..
ఐపీఎల్–2017 ప్రచార కార్యక్రమంలో భాగంగా ట్రోఫీని దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రదర్శిస్తున్నారు. బుధవారం ఈ ట్రోఫీ హైదరాబాద్ చేరుకుంది. గోల్కొండ కోట ముందు ఐపీఎల్ ట్రోఫీతో పోజు ఇస్తున్న సినీ తార శ్రద్ధా దాస్. ఐపీఎల్–10 తొలి మ్యాచ్ ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోనే జరుగుతుంది. -
‘లైట్’ వేసి దోచేస్తున్నారు!
పర్యాటక ప్రాంతాల్లో ‘సౌండ్స అండ్ లైట్ షో’లో అవకతవకలు - కాసుల కక్కుర్తితో అధికారుల ఇష్టారాజ్యం - రూ.కోట్లతో ప్రాజెక్టులు.. లోపభూరుుష్టంగా పనులు - మూడేళ్లలోపే పడకేసిన వరంగల్ ప్రాజెక్టు - మళ్లీ మరమ్మతుల పేర భారీ ఖర్చులకు రంగం సిద్ధం - సరిగా పనులు చేయకున్నా అదే సంస్థకు మరిన్ని ప్రాజెక్టులు సాక్షి, హైదరాబాద్: అది పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన ప్రాజెక్టు.. ఒకటి కాదు రెండు కాదు రూ.మూడున్నర కోట్లతో ఏర్పాటు చేశారు.. కానీ మూన్నాళ్లకే మూతపడింది.. పనిచేసిన కొద్దికాలమూ కిందా మీదా పడుతూ నడిపించారు.. ఇప్పుడు పూర్తిగా పడకేయడంతో మరమ్మతుల కోసం రూ.లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు.. చారిత్రక వరంగల్ కోటపై ఏర్పాటు చేసిన ‘సౌండ్స అండ్ లైట్ షో’ప్రాజెక్టు దుస్థితి ఇది. అంతేకాదు ఇంత నాసిరకంగా పనులు చేసిన సంస్థకే కరీంనగర్ జిల్లా ఎలగందుల కోటపై రూ.3.85 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు పనులు అప్పగించారు. ఇప్పుడు మరో ప్రాజెక్టు పనులు అప్పగించేందుకూ సిద్ధమయ్యారు. మరోవైపు గోల్కొండ కోటలోనూ ‘సౌండ్స అండ్ లైట్ షో’వ్యవస్థ కూడా దారుణ పరిస్థితికి చేరుకుంది. కాసుల కోసం అధికారుల కక్కుర్తే ఈ పరిస్థితికి కారణమనే ఆరోపణలు వస్తున్నారుు. పర్యాటకులను ఆకర్షించేలా.. గోల్కొండ కోటపై గంభీరంగా అమితాబ్‌బచ్చన్ వారుుస్ ఓవర్‌తో సాగే ‘సౌండ్స అండ్ లైట్ షో’కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు ఈ షోను తిలకించేందుకు ఎంతో ఉవ్విళ్లూరుతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ఇతర చారిత్రక ప్రాంతాల్లోనూ అలాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఉమ్మడి రాష్ట్ర సమయంలోనే నిర్ణరుుంచారు. అందులో భాగంగా మూడేళ్ల కింద వరంగల్ కోట వద్ద ‘సౌండ్స అండ్ లైట్ షో’ను ఏర్పాటు చేశారు. ఇందుకు రూ.మూడున్నర కోట్లు ఖర్చు చూపారు. కానీ ప్రారంభమైనప్పటి నుంచీ అందులో లోపాలు కనిపించసాగారుు. లైట్లు సరిగా వెలగకపోవటం, ధ్వనిలో స్పష్టత దెబ్బతిని గర్రు.. మంటూ శబ్దాలు రావటం, ఉన్నట్టుండి లైట్లు ఆరిపోవటం, కేబుళ్లు పాడైపోవటం.. దీంతో పర్యాటకులంతా నిరాశకు గురికావడం వంటివి జరిగా రుు. అరుునా అతికష్టమ్మీద ఇటీవలి వరకూ నెట్టుకొచ్చి.. నెలన్నర కింద షోను పూర్తిగా రద్దు చేశారు. అరుుతే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసిన బెంగళూరు సంస్థకు కబురుపెట్టడంతో.. దాని ప్రతినిధులు వచ్చి సాఫ్ట్వేర్ లోపాలున్నాయని, ఇతర కేబుళ్లు, పరికరాలు దెబ్బతిన్నాయని, వాటిని మార్చేందుకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని చెప్పి వెళ్లారు. అన్నీ నాసిరకం పరికరాలే.. అసలు ఈ వ్యవస్థ ఏర్పాటు సమయంలోనే నాసిరకం కేబుళ్లు, ఇండోర్‌లో ఏర్పాటుకు సరిపోయే పరికరాలను ఆరుబయట ఏర్పాటు చేయటం, కొన్ని మాత్రమే ఎల్ఈడీ లైట్లు అమర్చి మిగతావి మామూలు బల్బులు బిగించటం వంటి అక్రమాలకు పాల్పడ్డారు. అధికారులు కాసుల కక్కుర్తితో అభ్యంతరం చెప్పకుండా బిల్లులు చెల్లించేశారు. సాధారణంగా ఇలాంటి ఎలక్ట్రికల్ పనులు జరుగుతున్నప్పుడు ఆ రంగంలో నిష్ణాతులతో పర్యవేక్షణ చేరుుంచాలి. కానీ అలాంటిదేమీ జరగలేదు. తాజాగా మరమ్మతులంటూ లక్షలు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు. అదే సంస్థకు మరిన్ని ప్రాజెక్టులు సాధారణంగా ఏదైనా ప్రాజెక్టు లోపభూరుుష్టంగా ఉంటే ఆ పనులు చేసిన వారికి మరో పని అప్పగించేందుకు తటపటారుుస్తారు. కానీ ఇక్కడ మాత్రం అదే సంస్థకు కరీంనగర్ జిల్లా ఎలగందుల కోటపై ‘సౌండ్స అండ్ లైట్ షో’ఏర్పాటు బాధ్యత అప్పగించారు. దానికి దాదాపు రూ.3.8 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు త్వరలో మరో భారీ ప్రాజెక్టును కూడా అప్పగించేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. గోల్కొండ కోటలోనూ.. గోల్కొండ కోటపై 1993 నుంచి 2014 వరకు లోపాలు లేకుండా ‘సౌండ్స అండ్ లైట్ షో’ అద్భుతంగా సాగింది. తర్వాత తరచూ మొరారుుస్తుండటంతో మరమ్మతు చేరుుంచి రూ.కోటిన్నర వరకు ఖర్చరుునట్టు చూపారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు మళ్లీ మరమ్మతులంటూ రూ.లక్షలు వ్యయం చేసేం దుకు రంగం సిద్ధం చేశారు. అసలు ఈ ఎలక్ట్రికల్ వ్యవస్థపై అవగాహన లేని అధికారులు దానికి బాధ్యులుగా ఉండడం గమనార్హం. కొందరు ఉన్నతాధికారులు కమీషన్లకు అలవాటు పడి.. సరిగా మరమ్మతులు చేయకపోరుునా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నారుు. -
వైభవ కాంతులు
-
గోల్కొండ కోటలో ఘనంగా పంద్రాగస్టు
సాక్షి, హైదరాబాద్: కోట గోడ మీద సైనికుల పహారా.. పక్కనే స్వాగత ద్వారంపై భేరీలు, నగారాలు మోగిస్తూ జయజయధ్వానాలు.. సంప్రదాయ వాద్య, సంగీత, నృత్య విన్యాసాలు.. చిందు యక్షగాన మాధుర్యం.. ఒగ్గుడోలు లయబద్ధ శబ్ద విన్యాసం.. వీటన్నింటికీ సొగసులద్దుతున్నట్టుగా లంబాడీ యువతుల నృత్యాలు.. మేమేమీ తీసిపోమన్నట్టు యువకుల గుస్సాడీ నృత్యాలు.. ఆ పక్కనే కొమ్ముబూరల పలకరింపు.. హైదరాబాదీ ప్రత్యేక మార్ఫీ ఉల్లాసం.. రాజన్న డోలు, డప్పుల శబ్దాలు.. ఆ ఊపును మరింత పెంచే షేరీబాజా బృందం.. ఖవ్వాలీ సంగీతం.. ముజ్రా నృత్యం... ఇదీ గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకల దృశ్యం. 70వ స్వాతం త్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలు అలరించాయి. అమర జవాన్లకు నివాళులర్పించి.. తొలుత సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ మైదానం వద్ద ఉన్న అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం ఉదయం పది గంటల సమయంలో గోల్కొండ కోటకు చేరుకున్నారు. పోలీసు సమ్మాన్ గార్డ్స్ స్వాగతిస్తుండగా కోటలోకి వచ్చారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించి, పోలీసు వందనం స్వీకరిం చారు. హరితహారం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వారికి హరితమిత్ర పురస్కారాలు ప్రదానం చేశారు. రాష్ట్రపతి పోలీసు పతకాలు సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందికి మెడల్స్ ప్రదానం చేశారు. స్థలాభావం.. అంతా హడావుడి.. స్వాతంత్య్ర దినోత్సవం అనగానే పోలీసు వందనం, వివిధ విభాగాల పోలీసులు, ఎన్సీసీ సిబ్బంది కవాతు, ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, చిన్నారుల నృత్య విన్యాసాలు ఉంటాయి. వాటిని వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించినప్పుడు ఆ సందడి కనిపించేది. కానీ గోల్కొండ కోటలో దిగువన రాణీమహల్ వద్ద కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్కడ సరిపడినంత స్థలం లేక పోలీసు కవాతు, శకటాలు, నృత్యాలకు అవకాశం లేకుండా పోయింది. సోమవారం వందల మంది కళాకారులు ప్రదర్శించిన సంగీత, నృత్య విన్యాసాలు ఆకట్టుకున్నా... వాటికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. సీఎం కేసీఆర్ కోట వద్దకు కొద్ది సేపట్లో చేరుకుంటారనగా కళాకారులకు అవకాశమిచ్చారు. కానీ రెండు, మూడు నిమిషాల్లోనే ముగించాలనడంతో వారంతా ఉసూరుమన్నారు. తమ విన్యాసాల్లో మునిగిపోయిన కళాకారులకు ‘చాలు.. ఇక ఆపండి’ అని పలుమార్లు సూచించడంతో.. సందర్శకులు విస్మ యం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల చిన్నారులు ప్రత్యేక విన్యాసాలకు సిద్ధమైనా.. ప్రదర్శించే అవకాశం లేకపోవటంతో సీఎం ప్రసంగానికి చప్పట్లు కొట్టడానికే పరిమితమయ్యారు. ప్రసంగం అనంతరం అర నిమిషం పాటు అలల తరహాలో విన్యాసంతో ఆకట్టుకున్నారు. స్థలంలేక సాధారణ సందర్శకులను లోనికి అనుమతించకపోవడంతో కోటకు దూరంగానే ఉండిపోయారు. వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, వారి కుటుంబసభ్యులు, అమెరికా, ఇరాన్ ఎంబసీల ప్రతినిధులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలు వీరే.. హరిత మిత్ర పురస్కారాలు అందుకున్నవారు.. నిజామాబాద్ కలెక్టర్ యోగితారాణా, నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం గిద్ద జెడ్పీ పాఠశాల, సిద్దిపేట పురపాలక సంఘం, ఆర్మూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ, గ్రామీణాభివృద్ది శాఖ జాయింట్ కమిషనర్, హయత్‌నగర్ డిస్పెన్సరీ అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ వంశీకృష్ణారెడ్డి, మెదక్ గ్రామీణ నీటి పారుదల విభాగం ఎస్ఈ విజయ్‌ప్రకాశ్. రాష్ట్రపతి పురస్కారం పొందిన సూక్ష్మ కళాఖండాల నిపుణుడు మారుతికి ప్రశంసా పత్రం అందజేశారు. పోలీసు సేవాపతకాలు పొందినవారు రవి గుప్తా (ఐపీఎస్), నవీన్ చంద్ (ఐపీఎస్), గోవింద్ సింగ్ (ఐపీఎస్), వై.గంగాధర్ (ఐపీఎస్), నాగరాజు (అదనపు డీసీపీ), అనూప్ కుమార్‌మిశ్రా (డీఎస్పీ), ఆర్.వెంకటయ్య (గ్రేహౌండ్స్ అసిస్టెంట్ కమాండర్), బి.జనార్దన్ (డీఎస్పీ), నారాయణ (ఏసీపీ), డి.రామ్‌గోపాల్ (ఇన్స్పెక్టర్), ఎండీ గౌస్ (ఆర్ఎస్ఐ-పీటీసీ), తిరుపతిరెడ్డి (ఏఎస్సై), లక్ష్మారెడ్డి (హెడ్‌కానిస్టేబుల్), వెంకటేశ్వరరావు (హెడ్‌కానిస్టేబుల్), లునావత్ గోపి (కానిస్టేబుల్), ఐలమల్లు (ఫైర్‌మ్యాన్), ఎంఏ రవూఫ్ (డ్రైవర్ ఫైర్ ఆపరేటర్) -
సేవకు గుర్తింపు
హైదరాబాద్ గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో కాజీపేట ఏసీపీ జనార్దన్‌కు ఇండియన్ పోలీస్ మెడల్, మహబూబాబాద్ లీడింగ్ ఫైర్‌మెన్ ఐలుమల్లుకు ఉత్తమ సేవా పురస్కారం అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. -
వైభవ కాంతులు
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక నగరి సాంస్కృతిక వైభవంతో మురిసింది. పంద్రాగస్టు వేడుకలో భాగంగా గోల్కొండ కోటలో కళాకారులు వివిధ ప్రదర్శనలతో సందడి చేశారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాజన్న డోలు, ఒగ్గుడోలు, గుస్సాడి, కొమ్ముకోయ, పేరిణి, నగర కళా పేరి–బాజా, భాంగ్రా, రాజస్థానీ, దాండియా, కథక్, ముజ్రా వంటి 22 కళారూపాలు ఒకే వేదికపై కనువిందు చేశాయి. సిటీలోని పలు వారసత్వ కట్టడాలు విద్యుద్దీపాల వెలుగుల్లో కాంతులీనాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిన్నారుల దేశభక్తి కళా ప్రదర్శనలు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది విన్యాసాలు ఆకట్టుకున్నాయి. -
తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్
-
వేడుకలపై పోలీసుల డేగకన్ను
సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ కోటలో సోమవారం పంద్రాగస్టు వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంపై పోలీసులు డేగకన్ను వేశారు. కోటతో పాటు చుట్టపక్కల ప్రాంతాలు, రహదారుల పర్యవేక్షణకు నగర పోలీసు విభాగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆయా మార్గంలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్, కమ్యూనిటీ సీసీ కెమెరాలకు తోడు తాత్కాలిక ప్రాతిపదికన అదనపు కెమెరాలు ఏర్పాటు చేసింది. గోల్కొండ కోటలో అణువణువూ రికార్డు అయ్యేలా చర్యలు తీసుకుంది. మొత్తం 120 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు వీటినీ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)కు అనుసంధానించింది. దీంతో పాటు స్థానిక పోలీసుస్టేషన్, గోల్కొండ కోట వద్ద ఉన్న కంట్రోల్ రూమ్‌లోనూ దృశ్యాలను చూసేలా ఏర్పాటు చేశారు. కోటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ అనుకోని సవాళ్లు ఎదురైతే వ్యూహాత్మకంగా ఎదుర్కోవడానికి ఈ ని«ఘా ఉపకరించనుంది. సీసీసీలో ఉండే మ్యాప్‌ల ద్వారా గోల్కొండ కోటకు చుట్టుపక్కల మార్గాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇక్కడి అధికారులు అవసరానికి తగ్గట్టు స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేయడంతో పాటు అదనపు బలగాలను మోహరిస్తారు. ఈ తాత్కాలిక సీసీ కెమెరాల పని తీరుపై సీసీసీ అధికారులు ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. పంద్రాగస్టు వేడుకలు జరిగే గోల్కొండ కోటతో పాటు గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు నగర పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షించడానికి ఆదివారం నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి కోటను, రాజ్‌భవన్‌ను సందర్శించి అవసరమైన మార్పు చేర్పులు సూచించారు. కోటకు వచ్చే సందర్శకులు తవు వెంట హ్యాండ్ బ్యాగ్‌లు, కెమెరాలు, టిఫిన్ బాక్సులు, వాటర్‌బాటిళ్లు తదితర వస్తువులు తీసుకురావడం నిషేధించారు. అత్యవసరమై ఎవరైనా తీసుకువచ్చినా... కచ్చితంగా సోదా చేస్తారు. నగర వ్యాప్తంగా తనిఖీలు... నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో నగర వ్యాప్తంగా నిఘా, గస్తీ వుువ్మురం చేశారు. అడుగడుగునా నాకాబందీ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. జనసవుర్థ ప్రాంతాలతో పాటు బస్సులు, రైళ్లల్లోనూ పోలీసులు సోదాలు చేస్తున్నారు. లాడ్జీలు, అనువూనిత ప్రాంతాలపై డేగకన్ను వేశారు. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వుఫ్టీ పోలీసులను మోహరించారు. గోల్కొండ కోటలోకి దారితీసే ప్రతి ద్వారం దగ్గరా డోర్‌ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేసి తనిఖీ చేయనున్నారు. గోల్కొండ కోట చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు వేడుకలు చూడటానికి వచ్చే ప్రముఖులు, సాధారణ ప్రజలకు వేర్వేరుగా ప్రవేశ మార్గాలు, పార్కింగ్స్ కేటాయించారు. -
నగరానికి పంద్రాగస్టు శోభ
సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ కోటను క్రీస్తుశకం 945 – 970 మధ్య కాలంలో కాకతీయులు నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ప్రతాపరుద్రుడి కాలంలో కేవలం మట్టితోనే ఈ కోటను నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. 10వ శతాబ్దంలో కుతుబ్షాహి పాలకులు దీన్ని మళ్లీ నిర్మించారు. 1518–1543లో సుల్తాన్ కులీ కుతుబ్‌షా ముల్క్, 1543 – 1550 మధ్య జంషీర్ కులీకుతుబ్ షా, 1550 – 1580 వరకు పాలించిన ఇబ్రహీం కుతుబ్‌షాలు మట్టి నిర్మాణం అలాగే ఉంటే దండయాత్ర చేసే రాజుల ఫిరంగి గుళ్లకు కోట బీటలు వారుతుందనే ఉద్దేశంతో భారీ నిర్మాణాన్ని సరికొత్త పద్ధతిలో చేపట్టారు. దేశంలోని ఇతర కోటలైన దౌల్తాబాద్, రాజస్థాన్ కోటల కంటే మరింత పటిష్టంగా దీనిని నిర్మించారు. అందుకే ఔరంగజేబు ఈ కోటను జయించలేక అక్కడ కాపలాదారుడిగా ఉన్న అబ్ధుల్లాఖాన్ను లోబర్చుకుని కోటలోకి చొరపడ్డాడని చరిత్ర చెప్తోంది. వారు అక్కడ కాలుపెట్టిన తర్వాత ఈ కోటకు ‘మహ్మద్ నగర్’ అనిపేరు పెట్టి అక్కడ తొలి నగరాన్ని తీర్చిదిద్దాడు. అదే క్రమంగా హైదరాబాద్‌గా అభివృద్ధి చెందినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. కోటలో అన్ని మతాల వారు, వర్గాల వారు కలిసిమెలిసి జీవించారు. అక్కడ ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, పచ్చిక ప్రార్థనా మందిరాలు, మసీదులు, రాజభవనాలు నిర్మించారు. కుతుబ్ షాహీల రాజధాని కేంద్రంలో జనాభా సంఖ్య నానాటికీ పెరుగుతుండటంలో ఇబ్రహీం కుతుబ్ షా మూసీనదికి దక్షిణాన హైదరాబాద్ నగర్ విస్తరణకు 1591లో శంకుస్థాపన చేశారు. అలా మహానగరం విస్తరించింది. కోటలోని చెప్పుకోదగ్గ పది ప్రత్యేకతలు ఉన్నాయి. కందక నిర్మాణం, కోటగోడలు, సిగ్నలింగ్ వ్యవస్థ, కాగజ్ బురుజు, అక్కన్న మాదన్న ప్యాలెస్, హెలిపెంట్ ట్రీ, సింహ ద్వారాలు, కటోరా హౌస్, ప్రభుత్వం ఉద్యాన వనాలు, కోహినూర్ కీ కహానీలు చూపరులను కట్టిపడేస్తున్నాయి 22 కళారూపాలు... 650 మంది కళాకారులు... గోల్కొండ కోటలో ఆగస్టు 15న జరిగే మువ్వన్నెల జెండా పండుగ సందర్భంగా దాదాపు 650 మంది కళాకారులు 22 వివిధ కళారూపాలను భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శించనున్నారు. గతేడాది కళాకారుల ప్రదర్శనను అంతర్జాతీయ పత్రికలు ఆకాశానికి ఎత్తేస్తు కథనాలు రాశాయి. అంత అద్భుతంగా కళా ప్రదర్శనలు జరిగాయి. ఈసారి భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 22 కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. రాజన్న డోలు, ఒగ్గుడోలు, గుస్సాడీ, కొమ్ముకోయ, డప్పులు, పేర్ని, నగర కళ పేర్ని– బాజా, ఖాంద్రా(పంజాబీ), రాజస్థానీ, గుజరాతీ దాండియా, కథక్, ముజ్రా లాంటి కళారూపాల ప్రదర్శనలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. సరిగ్గా ఉదయం 15న ఉదయం 8.30కి ప్రదర్శనలు ప్రారంభం అవుతాయి. 9.30కి ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోటలోకి ప్రవేశించగానే 650 మంది కళాకారులు ఒకేసారి ప్రదర్శనలు ఇస్తూ స్వాగతం పలుకుతారు. అంతేకాకుండా హుస్సేన్ సాగర్‌లోని జాతీయ జెండా వద్ద 100 మంది కళాకారులు స్వాతంత్య్ర సంగ్రామానికి సంబంధించిన థీమ్ సాంగ్‌కి కళాప్రదర్శన ఇస్తారు. చిన్న వయసులోనే సూక్ష్మచిత్ర కళలో పేరుగాంచిన నిజామాబాద్ జిల్లా గుమ్మిరియాల గ్రామానికి చెందిన రామోజు మారుతిని ప్రభుత్వం ప్రశంసా పత్రం, జ్ఞాపిక, శాలువతో సత్కరించనుంది. -
గోల్కొండలో పంద్రాగస్టుకు ఏర్పాట్లు ప్రారంభం
గోల్కొండ : గోల్కొండ కోటలో పంద్రాగస్టు ఏర్పాట్లు సోమవారం ప్రారంభమయ్యాయి. పంద్రాగస్టు రోజున గోల్కొండ కోటలో జరిగే పతాకావిష్కరణ కార్యక్రమ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొని పతావిష్కరణగావించనున్నారు. ఈ ఏర్పాట్లను అధికారులు సోమవారం ప్రారంభించారు. గోల్కొండ మెయిన్ గేటు, గోల్కొండ లాన్స్, పతావిష్కరణ జరిగే ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించే పనులు ప్రారంభమయ్యాయి. కోట గోడలపై విద్యుత్ దీపాలను, జనరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ దీపాల అలంకరణ అనంతరం Sపతాకావిష్కరణ జరిగే ప్రాంతంలో మంత్రులు, వీఐపీలు కూర్చొనే ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని అధికారులు అంటున్నారు. -
బోనమెత్తిన గోల్కొండ.
-
గోల్కొండ కోటలో వైభవంగా బోనాలు
-
గోల్కండ కోటలో బోనాల ఉత్సవాలు
-
కోటలో ప్రారంభమైన బోనాలు
హైదరాబాద్: ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు గోల్కొండలో గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కోటపై కొలువైన ఎల్లమ్మకు ఉదయం తొలిబోనం సమర్పణతో తెలంగాణలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయి. బోనాల ఎదుర్కోలు కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు తలసాని శ్రీనివాస యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ లు హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఈ వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటతోపాటు తొట్టెల ఊరేగింపు కొనసాగే బంజారాదర్వాజ్, ఫతేదర్వాజ్, నుంచి కోటకు దారి తీసే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బోనం సంబురాలకు ‘కోట’ ముస్తాబు
గోల్కొండ: తెలంగాణ సమాజం సామూహికంగా ఆచరించే బోనాలకు గోల్కొండ కోట ముస్తాబు అయింది. కోటపై కొలువైన ఎల్లమ్మకు గురువారం ఉదయం తొలిబోనం సమర్పణతో తెలంగాణలో బోనాల వేడుకలు ప్రారంభమవుతాయి. గురు, ఆదివారం జరిగే ఈ వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటతోపాటు తొట్టెల ఊరేగింపు కొనసాగే బంజారాదర్వాజ్, ఫతేదర్వాజ్, నుంచి కోటకు దారి తీసే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు లక్షలమంది భక్తులు సందర్శించే గోల్కొండ బోనాల నిర్వహణకు ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, వాటర్ వర్స్, విద్యుత్, సాంస్కృతిక శాఖల సహకారంతో దేవాదాయ, ధర్మాదాయ శాఖ విస్త్రతంగా ఏర్పాట్లు చేసింది.గోల్కొండ బోనాల ఎదుర్కోలు కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఇతర మంత్రులు హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. ఆగస్టు 4న గోల్కొండ కోటలో చివరి బోనం సమర్పించే వరకు నగరంలో ఉత్సవాలు కొనసాగుతాయి. ఈనెల 24, 25 తేదీల్లో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సికింద్రాబాద్‌లోని పలు గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారు. ఉజ్జయిని మహంకాళి బోనాలకు 10వ తేదీన ఘటోత్సవం (ఎదుర్కోలు) నిర్వహిస్తారు. ఘటోత్సవం పురవీధుల్లో ఊరేగుతూ 24వ తేదీ తెల్లవారుజామున ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకుంటుంది. 17న ఘటోత్సవంతో పాతబస్తీ బోనాల వేడుక మొదలవుతుంది. లష్కర్ బోనాలు ముగిసిన వారం తర్వాత హైదరాబాద్ బోనాలు వైభవంగా జరుగుతాయి. జాతరలో ఈనెల 31న ఉమ్మడి ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో హరిబౌలిలోని అక్కన్న మాదన్న ఆలయంలో, లాల్‌దర్వాజలోని శ్రీసింహవాహిని ఆలయంలో, భాగ్యలక్ష్మి ఆలయాల్లో బోనాలు నిర్వహిస్తారు. -
గోల్కొండ కోటలో విస్తృత తనిఖీలు
గోల్కొండ : ఆషాడ మాసం బోనాలకు ముస్తాబు అవుతున్న గోల్కొండ కోటలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. బుధవారం ఉదయం బాంబ్‌స్క్వాడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. బోనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. -
కుతుబ్‌షాహీ సమాధులను సందర్శించిన ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆదివారం గోల్కొండ కోట సమీపంలోని కుతుబ్‌షాహీ సమాధులను సందర్శించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలసి సమాధుల సుందరీకరణ, మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఇండియా చైర్మన్ అబద్ అహ్మద్‌ను వివరాలు, ప్రత్యేకతలు అడిగి తెలుసుకున్నారు. రాజ కుటుంబీకులకు స్నానం చేయించే హమామ్ భవనం, దాని నిర్మాణ శైలిని చూసిన అన్సారీ ఆశ్చర్యచకితులయ్యారు. దాదాపు గంటసేపు ఈ ప్రాంగణంలో అన్సారీ గడిపారు. ఆయన వెంట రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం తదితరులున్నారు. ముగిసిన పర్యటన... కాగా, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తన హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు రాష్ట్ర మంత్రులు ఆయనకు వీడ్కోలు పలికారు. -
గోల్కొండ ఖ్యాతికి ‘మసక’
♦ సౌండ్ అండ్ లైట్ షోలో తరచూ సాంకేతిక సమస్యలు ♦ అర్ధంతరంగా నిలిచిపోతున్న ప్రదర్శనలు ♦ ఉత్సాహంగా వచ్చి ఉసూరుమంటున్న విదేశీ పర్యాటకులు సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యాటకులు ముచ్చటపడి వచ్చారు.. క్యూలో నిలబడి టికెట్ కొని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో అంతా చీకటి.. ఓ మూలన తళుక్కుమంటూ కాంతి విరజిమ్మింది..! ‘‘రండి.. రండి.. మీకు సాదర స్వాగతం.. ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధి గల ఈ గోల్కొండ కథ చెబుతాను.. ఇక్కడి రాళ్లకు జీవమే వస్తే హృదయాన్ని హత్తుకునేలా ఎన్ని కమనీయ కథలు చెప్పేవో.. ’’ అంటూ హిందీ, ఇంగ్లిష్‌లో గంభీరంగా అమితాబ్ బచ్చన్ గొంతు..! అంతే అందరిలో తెలియని పులకింత. మరోపక్క ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు రంగు లైట్ల కాంతి లయబద్ధంగా కదలాడుతుంటే ప్రేక్షకుల్లో తన్మయత్వం! ఇంతలో గర్ర్ర్మంటూ శబ్దం.. ఆ వెంటనే నిలిచిపోయిన మాటలు.. లైట్ల కాంతిలోనూ మసక... షో ఆగిపోయింది. ‘‘సారీ.. సాంకేతిక కారణాలతో ఈ షోను రద్దు చేస్తున్నాం. మీ టికెట్ డబ్బులు వాపసు చేస్తాం తీసుకోండి..’’ అంటూ సిబ్బంది సూచన. విదేశీ పర్యాటకుల్లో తీవ్ర అసంతృప్తి... ఉసూరుమంటూ నిష్ర్కమణ.. గోల్కొండ కోట వద్ద సౌండ్ అండ్ లైట్ షోలో పరిస్థితి ఇదీ! ప్రపంచవ్యాప్తంగా చారిత్రక కట్టడాల వద్ద నిర్వహించే ఈ సౌండ్ అండ్ లైట్ షో అన్నింట్లోకెల్లా గోల్కొండ వద్ద ప్రదర్శించే షో ప్రత్యేకతే వేరు! దీన్ని అనుసరిస్తూ ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు గొప్ప ఖ్యాతిని మూటగట్టుకున్న ఈ షో ఇప్పుడు సాంకేతిక లోపాలతో విదేశీ పర్యాటకుల ముందు మన పరువు తీస్తోంది. మధ్యలో నిలిచిపోతున్న షోలు కోట వద్ద ప్రతిరోజూ తొలుత గంటపాటు ఆంగ్లంలో, ఆ తర్వాత గంటపాటు హిందీ/తెలుగు భాషల్లో రెండు విడతలుగా సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శన 23 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. పాతబడ్డ సౌండ్ అండ్ లైట్ షో వ్యవస్థ మొరాయిస్తోంది. దీంతో మధ్యలోనే ఆపేసి పర్యాటకులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించి పంపుతున్నారు. పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఆ షోను ఎలాగోలా నిర్వహించేందుకు పర్యాటకశాఖ అధికారులు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. దీన్ని ఆధునీకరించేందుకు రూ.4 కోట్లతో ప్రతిపాదనలు పంపినా మోక్షం లభించటం లేదు. మరమ్మతు చేసినా మారని పరిస్థితి ఈజిప్టులో ఇలాంటి ప్రదర్శన గురించి 1988లో తెలుసుకున్న అప్పటి సీఎం ఎన్టీఆర్ ఆదేశం మేరకు 1993లో గోల్కొండలో ఈ ప్రదర్శన మొదలైంది. అప్పుడు ఏర్పాటు చేసిన లైట్లు, సౌం డింగ్ వ్యవస్థనే ఇప్పటివరకూ కొనసాగుతోంది. దీంతో అది దెబ్బతినడంతో కొద్దిరోజుల క్రితమే రూ.కోటితో మరమ్మతు చేయించా రు. అయినా తరచూ షో మొరాయిస్తోంది. పాతకాలం నాటి హాలోజన్ లైట్లను మార్చేసి ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని, మంచి సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
గోల్కొండ కోట సందర్శన వేళల్లో మార్పులు
గోల్కొండ కోట సందర్శన వేళలను ఒక గంట పెంచారు. పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు వేళలను మార్చినట్లు కోట సీనియర్ పరిరక్షణ అధికారి ఎం.సాంబశివ రావు తెలిపారు. సవరించిన వేళల ప్రకారం కోటను ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ తెరిచి ఉంచుతారు. ఇప్పటి వరకూ కోటను ఉదయం 9 గంటలకు తెరిచే వారు. లైట్ షో షెడ్యూల్ లో ఎటువంటి మార్పూ లేదు. -
దేశమంటే మట్టి కాదోయ్... దేశభక్తి అంటే మాటలు కాదోయ్...
స్వరాజ్య శోభ స్వాతంత్య్ర దినోత్సవాలకు నగరం సిద్ధమైంది. పరేడ్ గ్రౌండ్స్‌తో పాటు గోల్కొండ కోటలో ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు... వివిధ ప్రదర్శనలకు సన్నాహాలు చేస్తున్నారు. పోలీసులు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరికి ఉగ్రవాద సంస్థ హుజీతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు. నో యువర్ ఆర్మీ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఆంధ్రసబ్ ఏరియా ఆర్మీ ఆధ్వర్యంలో శనివారం వివిధ యుద్ధాల్లో పాల్గొన్న యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను ప్రదర్శించారు. దీనిని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, పౌరులు ఆసక్తిగా తిలకించారు. వాటి వివరాలను ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. శత్రువుల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే 72ఎం1 ట్యాంకులు, మిషన్ గన్స్, రాకెట్ లాంచర్లు, శత్రువుల కదలికలను పసిగట్టే బైనాక్యూలర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -రసూల్‌పురా మువ్వన్నెలు... హిమాయత్‌నగర్‌లోని ఇన్స్టిట్యూటో డిజైన్ ఇన్నొవేషన్... పంద్రాగస్టు వేడుకల్ని నిర్వహించింది. ఈ సందర్భంగా మువ్వన్నెల్ని ‘ధరించిన’ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థినులు ముచ్చటైన ముస్తాబులో అలరించారు. దేశభక్తి గీతాలను ఆలపించారు. కార్యక్రమాన్ని సంస్థ డెరైక్టర్ రూపేష్గుప్తా పర్యవేక్షించారు. - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి ఏదో ఒక రోజు మువ్వన్నెల జెండాకు సెల్యూట్ కొట్టి సంబరపడడమా? క్రికెట్లో మన జట్టు చేతిలో పాకిస్థాన్ ఓడిపోతే టపాసులు కాల్చడమా? విదేశాల్లో మన సినిమాల కలెక్షన్లు చూసి కాలరెగరేయడమా?... ఇదేనా దేశభక్తి? ఇంకేదైనా ఉందా? ఈ విషయంపై నగరానికి చెందిన భిన్నరంగాల ప్రముఖులతో మాట్లాడితే... గుడ్ సిటిజన్‌గా... సిటిజన్ బాధ్యత గుర్తు ఉంచుకోవాలి. సొసైటీ పట్ల మన రెస్పాన్సిబులిటీ తెలుసుకుని ప్రతి ఒక్కరూ గుడ్ సిటిజన్ అనిపించుకుంటే చాలు. దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. మన సంస్కృతికి విలువనిచ్చి వాటికి దూరం కాకుండా దేశాన్ని ముందుకు తీసుకెళితే అందరికన్నా గొప్ప అవుతాం. మనకున్న చరిత్ర, సంప్రదాయ వైభవం ఏ దేశానికీ లేదు. చరిత్రకారులను గుర్తుంచుకుని స్ఫూర్తి పొందాలి. త్వరలో రవీంద్రభారతిలో రుద్రమ ప్రదర్శన ఇవ్వనున్నాను. అంత గొప్ప పాత్రలను ధరించేటప్పుడు ఎంతో ఉద్విగ్నంగా అనిపిస్తుంది. -అలేఖ్య పుంజల, నృత్యకారిణి ‘స్వచ్ఛ’త... దేశభక్తి అంటే నా దృష్టిలో తొలుత మనం ఉండేచోటు నుంచి మొదలుకుని పరిశుభ్రం చేసుకుంటూ వెళ్లడమే. చుట్టుపక్కల శుభ్రంగా ఉంటే మైండ్ కూడా క్లీన్‌గా ఉంటుంది. ఆ తర్వాత మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడం, సాటి మనిషికి సాయం చేసే స్థాయికి ఎదగడం, అలా దేశానికి కూడా ప్రయోజనం కలిగించే మనిషి అవుతాం. స్వాతంత్య్ర దినోత్సవం నాడు స్కూల్లో జెండా వందనంతో పాటు స్వీయ క్రమశిక్షణనూ పిల్లల మైండ్లోకి ఎక్కించాలి. -సురేష్, సినీనటుడు ఒకరికొకరు సాయం కావాలి... ఇది మన 69వ ఇండిపెండెన్స్‌డే. నేను ఆ వేడుకను ప్రతిఫలించే దుస్తులను ధరించాను. ఇంతకన్నా ఖరీదైన, డిజైనర్ దుస్తులు ధరించినప్పుడు కూడా లేనంత సంతోషంగా అనిపిస్తుంది. భారతీయులుగా పుట్టినందుకు గర్వంగా ఫీలవ్వాలి. ఇండియాని అగ్రస్థానంలో నిలిపే పనిలో అందరం భాగస్వాములవ్వాలి. సాటి మనిషి జీవితం తను హాయిగా గడిపేందుకు ప్రతి ఒక్కరూ తన వంతు సాయం చేయాలి. ముఖ్యంగా మహిళ తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయగలిగితే, కుటుంబం మొత్తాన్ని దారిలో పెడుతుంది. అంటే మహిళలకు చేయూతని అందించడం అంటే పరోక్షంగా సమాజానికి ఇచ్చినట్టే. -రేఖ లహోటి, చైర్పర్సన్ ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ అభివృద్ధిలో పాలుపంచుకోవడం... స్వాతంత్య్ర దినోత్సవ పండుగ తర్వాతా ఆ స్ఫూర్తిని మిగిలిన 364 రోజులూ కొనసాగించి దేశాభివృద్ధిలో పాటుపడాలి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారికి విలువలు నేర్పి అభివృద్ధి కారకులుగా తీర్చిదిద్దాలి. మన ఇంట్లో, చుట్టుపక్కల మొక్కలు నాటడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడం... ఇవన్నీ అభివృద్ధి ప్రక్రియలో భాగమే. నాడు 1917 నుంచి 30 ఏళ్ల పాటు నిరంతరం పోరాడారు గాంధీ. అలాగే నేతాజీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్, భగత్‌సింగ్... ఇలా ఎందరో. వారి స్ఫూర్తిని అంది పుచ్చుకుని దేశాభివృద్ధికి బాటలు వేసుకోవాలి. - చంద్రబోస్, సినీ గేయ రచయిత -
ముస్తాబైన గోల్కొండ
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవానికి గోల్కొండ కోట ముస్తాబైంది. గతేడాది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గోల్కొండ కోటలోనే అధికారికంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించిన రాష్ర్ట ప్రభుత్వం.. ఈ ఏడాదీ అక్కడే ఘనంగా వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. కోటలోని రాణి మహల్ లాన్స్‌ను పూలతో అందంగా అలంకరించటంతోపాటు కోటను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు భారీ ఎత్తున లైటింగ్ ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం 9.20 గంటలకు సీఎం కేసీఆర్ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించి గోల్కొండ కోటకు చేరుకుంటారు. 9.50 గంటలకు పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. పది గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగిస్తారు. గ్రామజ్యోతికి శ్రీకారం: గ్రామజ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకల సందర్భంగా లాంఛనంగా ప్రారంభించనుంది. ప్రజల భాగస్వామ్యంలో పల్లెపల్లెనా గ్రామ స్వరాజ్యం తేవాలని.. స్వచ్ఛ భారత్ తరహాలో ‘స్వచ్ఛ గ్రామం’ కార్యక్రమం చేపట్టాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే విధివిధానాలను రూపొందించారు. గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో అయ్యే పనులు సమష్టి కృషితో నిర్వహిస్తూనే గ్రామ స్థాయిలోనే ప్రణాళికలు తయారు చేసి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తరఫున సాయం అందించాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీంతోపాటు ప్రభుత్వోద్యోగాల నియామకాలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, డబుల్ బెడ్రూం ఇళ్లు, హరితహారం, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాలపై సీఎం తన సందేశంలో స్పష్టత ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా పంద్రాగస్టు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. పది గంటలకు జెండావందనం రాష్ట్రంలో జాతీయ పతాకావిష్కరణ వేళలు మారాయి. ఏటా ఆగస్టు 15న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఆనవాయితీ. అయితే ఆఖరి నిమిషంలో ఈ వేళలను మార్పు చేయాలని సీఎం కార్యాలయం నిర్ణయించింది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం గోల్కొండ కోటలో ఉదయం పదికే సీఎం కేసీఆర్, జిల్లాల్లో సీనియర్ మంత్రులు పతాకావిష్కరణ చేస్తారు. అయితే ఈ ఆకస్మిక మార్పుతో అన్ని జిల్లాల్లోనూ అధికారులు గందరగోళానికి గురయ్యారు. వేడుకలను ఉద్దేశించి సీఎం, మంత్రులు చేసే ప్రసంగాల్ని సమాచార పౌర సంబంధాల శాఖ ముందుగానే సిద్ధంచేసి, అధికారికంగా ముద్రించి మీడియాకు పంపిణీ చేసేది. ఈ విధానానికి సైతం స్వస్తి పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గవర్నర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 15 అంకితభావాన్ని, గత స్మృతులను స్మరించుకోవాల్సిన దినమని ఆయన పేర్కొన్నారు. తరాల తరబడి త్యాగం, సమరయోధుల నిస్వార్థ పోరాటం మేలు కలయికతో స్వాతంత్య్రం సిద్ధించిందని తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా చిన్నాపెద్దా తేడాలు లేకుండా దేశం యావత్తూ స్వాతంత్య్రం కోసం ఒక్కటై నిలిచిందని అన్నారు. స్వాతంత్య్ర ఫలాలను అనుభవిస్తున్న మనం వారి పోరాట స్ఫూర్తికి తలవంచి నమస్కరించాలని ఆయన ఒక సందేశంలో పేర్కొన్నారు. -
గోల్కొండ.. పర్యాటకానికి అండ
పంద్రాగస్టు వేడుకలతో సందర్శకుల తాకిడి * చార్మినార్‌ను వెనక్కి నెట్టిన వైనం సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోట పర్యాటకరంగానికి ఊతమిస్తోంది. సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలోనే గత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాలను గోల్కొండ కోటపై ప్రభుత్వం నిర్వహించింది. మువ్వన్నెల జెండా రెపరెపలు గోల్కొండకు కొత్త ఊపునిచ్చాయి. దీంతో గోల్కొండకు పర్యాటకుల తాకిడి పెరిగింది. అప్పటి వరకు తెలంగాణలో అత్యధిక పర్యాటకులు సందర్శించే చారిత్రక స్థలంగా రికార్డుల్లో నమోదైన చార్మినార్‌ను వెనక్కునెట్టి గోల్కొండ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మరోసారి గోల్కొండ కోట మీద జాతీయ పతాకం సగర్వంగా ఎగరనుండటంతో ఈసారి కూడా కోట ఖ్యాతి మరింత విస్తరించనుంది. పంద్రాగస్టు వేడుకలను కోటలో నిర్వహించటంతో గత సంవత్సరం ఆగస్టులో దేశవిదేశాల్లో దానికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. దీంతో సరిహద్దులు దాటి పర్యాటకులు కోట వైపు క్యూ కట్టారు. గత సంవత్సరం ఆగస్టు వరకు నెలకు సగటున లక్ష మంది పర్యాటకులు కోటను సందర్శిస్తూ రాగా... ఆ తర్వాత అది 1.60 లక్షలకు చేరుకుంది. అప్పటి వరకు సగటున నెలకు లక్షన్నర మంది పర్యాటకులతో తొలిస్థానంలో ఉన్న చార్మినార్ ఇప్పుడు రెండోస్థానానికి పడిపోయింది. గోల్కొండకు పర్యాటకుల తాకిడి స్థిరంగా ఉంటుందని గుర్తించిన కేంద్రపురావస్తు శాఖ ప్రత్యేక చర్యలకూ సిద్ధమైంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోటలోని ‘సౌండ్ అండ్ లైట్ షో’కు కూడా పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. దీన్ని కూడా మరింత ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ సిద్ధమైంది. గత ఆగస్టు 15కు పూర్వం సగటున రోజుకు వంద మంది సౌండ్ అండ్ లైట్ షోను సందర్శిస్తుండగా ఒక్కసారిగా ఆ సంఖ్య 500 ను చేరుకోవటం విశేషం. అప్పటి వరకు రోజుకు రూ.పది వేలలోపు ఆదాయం ఉండగా అది ప్రస్తుతం రూ.75 వేలకు చేరింది. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల రాక భారీగా పెరిగింది. సగ టున నెలకు 1200 విదేశీ పర్యాటకులు కోట దర్శనానికి వస్తుండడం విశేషం. -
పంద్రాగస్టుపై పోలీసుల ఫోకస్
సాక్షి, హైదరాబాద్: పంద్రాగస్టు వేడుకలు దగ్గర పడుతుండటంతో పోలీసుల నిఘాను మరింత తీవ్రతరం చేశారు. స్వాత్రంత్య దినోత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు నిఘాను విస్తృతం చేస్తున్నారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ జెండా ఎగురవేయనున్న గోల్కొండ కోటను ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. తాజాగా శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఏవియేషన్ సెక్యూరిటీ హెచ్చరికల నేపథ్యంలో సందర్శకుల అనుమతిని నిలిపేశారు. అదేవిధంగా ఇతర ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని జిల్లాల్లో శాంతిభద్రతలకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలంటూ ఎస్పీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాల భద్రతకు సంబంధించి డీజీపీ కార్యాలయం ఎస్పీలతో ప్రతీరోజూ పర్యవేక్షిస్తోంది. సరిహద్దుల్లో గట్టి నిఘా రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు సరిహద్దు ప్రాంతాలపై గట్టి నిఘా ఉంచారు. అసాంఘిక శక్తులు రాష్ట్రంలోకి చొరబడకుండా ఉండేందుకు 24 గంటలూ గస్తీ నిర్వహిస్తున్నారు. రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల పంజాబ్‌తో పాటు జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు వరుసగా దాడులు జరపడంతో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. జమ్ముకాశ్మీర్‌లో దాడి తరా్వాత ఏడుగురు ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. దీంతో వారు మళ్లీ ఎక్కడైనా ఉప్రదవం తలపెట్టే అవకాశమున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరంలో చాలా సులువుగా కలిసిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలతో పాటు జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రదేశాలపై నిఘా ఉంచారు. అనుమానిత వ్యక్తులు, ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచారు.