![Telangana 1st Nazar Bonam To Golconda Goddess Jagadamba - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/29/bonam.jpg.webp?itok=TmIeG3zY)
లంగర్‌హౌస్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే ప్రధాన పండగల్లో ఒకటైన బోనాల ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రథమ పూజ నిర్వహించడంతో బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి. మొదటి పూజలో భాగంగా అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు. నేడు లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం, తొట్టెలను తీసుకెళ్లనున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది. ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జులై 10న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహించనున్నారు. డప్పు వాద్యాలు, పోతరాజుల నృత్యాలు, శివసత్తులతో కలిసి అంగరంగ వైభవంగా అమ్మవారికి నైవేద్యం తీసుకొని వెళ్లి బోనంలా సమర్పించనున్నారు. వేడుకలకు లంగర్‌హౌస్, గోల్కొండ వేదిక కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment