►సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో తెలంగాణది 15 స్థానం ఉండగా.. ప్రస్తుతం వరి ఉత్పత్తిలో రాష్ట్రం అగ్రస్థానం కోసం పోటీ పడుతోందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయన రాష్ట్ర ప్రగతిపై ప్రసంగిస్తూ.. రైతులు 3 గంటల కరెంట్ చాలన కొందరు వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు.
►ప్రతి నియోజకవర్గంలో 3 వేల మందికి గృహలక్షి పథకం
►రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉచిత మంచినీరు అందిస్తున్నాం
►దళితబంధు దేశానికే దిక్సూచిగా నిలిచింది
►నేతన్నల కోసం తెలంగాణ మగ్గం పేరుతో కొత్త పథకం
►ఆసరా పెన్షన్లకు రూ.2016కు పెంచాం
►ఆర్టీసీ బిల్లును విజయవంతంగా ప్రవేశపెట్టాం
►ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం
►సింగరేణలో రూ.12వేల కోట్ల టర్నోవర్‌ను 30 వేల కోట్లకు పెంచాం
►సింగరేణిలో కార్మికులకు ఈ సారి దసరా, దీపావళి బోనస్ కింద రూ. వెయ్యి కోట్లు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు
► జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ..హైదరాబాద్‌లో నేటి నుంచి డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రూ.37 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, పోడు సమస్యకు పరిష్కారం చూపించడంతో పాటు తెలంగాణలో తాగునీటి సమస్య లేకుండా చేశామని చెప్పారు. రాష్ట్రం ప్లోరోసిస్ రహితంగా మారిందని కేంద్రమే ప్రకటించిందన్నారు.
►సమైక్య పాలనతో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, ప్రస్తుతం అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు.
►రాష్ట్ర సాగునీటి రంగంలో స్వర్ణయుగం నడుస్తోందని అన్నారు. 44 లక్షల మందకి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు.
► స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండకు చేరుకున్న సీఎం కేసీఆర్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రగతిపై సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
సాక్షి, హైదరాబాద్: ప్రగతి భవన్‌లో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని సైనిక్ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు.
అమరవీరుల స్థూపం వద్ద పుష్కగచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అక్కడి నుంచి నేరుగా గోల్కొండకు చేరుకుంటారు. అనంతరం ఆ వేదిక నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం చేయనున్న ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment