సాక్షి, హైదరాబాద్: గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి... స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినమని పేర్కొన్నారు.
రాజ్‌భవన్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ.. కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఇరిగేషన్, ఐటీ, ఫార్మా రంగాల్లో దూసుకు వెళ్తుందన్నారు. ఎన్నో త్యాగాలు, పోరాటాల వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు.
అహింస, సత్యాగ్రహం అనే శక్తివంతమైన ఆయుధాల వల్ల దేశానికి స్వాతంత్ర సాధన సాధ్యమైంది. గాంధీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్రం ఏర్పడింది. బ్రిటిష్ రూల్ నుంచి విముక్తి లభించింది. ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా భారతదేశ ఎదగడం మనందరికీ గర్వకారణం’’ అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment