telangana bonalu
-
విజయవాడలో దుర్గమ్మకు తెలంగాణ బోనాలు (ఫోటోలు)
-
గురువారం నుంచే బోనాలు ప్రారంభం.. గోల్కోండ అమ్మవారికి నగర్ బోనం
లంగర్‌హౌస్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే ప్రధాన పండగల్లో ఒకటైన బోనాల ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రథమ పూజ నిర్వహించడంతో బోనాల సంబరాలు ప్రారంభమవుతాయి. మొదటి పూజలో భాగంగా అమ్మవారికి మొదటి నజర్ బోనం సమర్పించనున్నారు. నేడు లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి భారీ ఊరేగింపుతో గోల్కొండ కోటకు నజర్ బోనం, తొట్టెలను తీసుకెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమయ్యే ఊరేగింపు రాత్రి 8 గంటలకు కోటపై ఉన్న అమ్మవారి ఆలయానికి చేరుకోనుంది. ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జులై 10న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహించనున్నారు. డప్పు వాద్యాలు, పోతరాజుల నృత్యాలు, శివసత్తులతో కలిసి అంగరంగ వైభవంగా అమ్మవారికి నైవేద్యం తీసుకొని వెళ్లి బోనంలా సమర్పించనున్నారు. వేడుకలకు లంగర్‌హౌస్, గోల్కొండ వేదిక కానున్నాయి. -
హైదరాబాద్‌లో బోనాల జాతర.. తేదీలు ఖరారు..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 30వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆషాఢ బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30న గోల్కొండ బోనాలు, జూలై 17న సికింద్రాబాద్ బోనాలు, 18న రంగం, జూలై 24న హైదరాబాద్ బోనాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జూలై 25న ఘటాల ఊరేగింపు జరగనుంది. బోనాల నిర్వహణకు ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ దేవాలయాలతో పాటు 3 వేల ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సాయం అందిస్తామన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రహదారుల మరమ్మతులు, శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో పరిసరాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామన్నారు. సుమారు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆయ న తెలిపారు. పోలీసు బందోబస్తు మధ్య సీసీ కెమెరాలతో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తామన్నారు. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ప్రభుత్వ విప్ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖ స్పెషల్‌చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, హోం శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రవి గుప్తా, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, ఆర్అండ్బీ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ కమి షనర్ అనిల్‌కుమార్, జీహెచ్ంఎసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దాన కిషోర్, జిల్లా కలెక్టర్ శర్మన్, పోలీస్ కమిషనర్లు సీవీ.ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, మహంకాళి దేవాలయం, గోల్కొండ దేవాలయం, ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు, పాల్గొన్నారు. చదవండి: చట్ట పరిధిలో తప్పు చేస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం: రఘునందన్ -
రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ‘‘నాకు జరుగుతున్న పూజలతో నేను సం తోషంగా లేను...ఎవరు చేసుకున్న దాన్ని వారు అనుభవిస్తున్నారు...కాపాడేదాన్ని నేనే అయినా అంతకు ఎక్కువగా చేసుకుంటున్నారు...భక్తి భావంతో కాకుండా విపరీతమైన కోరికలు, కోపతాపాలతో నన్ను కొలుస్తున్నారు. భక్తి భావంతో కొలిస్తే కాపాడేదాన్ని నేనే...నా బిడ్డలను నేను కాపాడుకుంటాను...రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు వస్తాయి...ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ముందుగా హెచ్చరిస్తున్నా...నా భక్తులు లేకుండా జరిగిన బోనాలతో నేను సంతోషంగా లేను...యజ్ఞ, హోమాలు చేసి ఐదు వారాల పాటు నాకు సాక పెట్టి , నా వారం రోజు పప్పు బెల్లంతో ఫలహారం గడపగడప నుంచి రావాలి’’అంటూ రంగంలో అమ్మవారు సోమవారం భవిష్య వాణి వినిపించారు. తంబూర చేతపట్టుకుని మాతంగేశ్వరి అమ్మవారి ఎదురుగా పచ్చికుండపై నిలబడిన స్వర్ణలత అమ్మవారిని ఆవహించగా భవిష్యవాణిని వినిపించారు. కరోనాతో దేశ ప్రజలందరూ పడుతున్న ఇబ్బందుల గురించి ఆమె చెబుతూ రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని తన ప్రజలను కాపాడుకుంటానని చెప్పారు. ప్రజలు చేసుకున్న దాంతో వారు అనుభవిస్తున్నారని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని హెచ్చరించారు. ఎవరికి వారు తమ సొంత కోరికలు కోరుకుంటూ ఎలాంటి భక్తి భావం లేకుండా కోపతాపాలతో తనకు పూజలు చేస్తున్నారని మండిపడ్డారు. భక్తిశ్రద్ధలతో కొలిస్తే తన బిడ్డలను తాను కాపాడతానని కొండంత ధైర్యాన్ని అందించారు. ఇటీవల పూర్తయిన కాళేశ్వరం గురించి వేదపండితుడు వేణుమాధవశర్మ అమ్మవారిని అడుగగా గంగమ్మకు యజ్ఞయాగాలు, హోమాలు చేస్తే ఆమె సంతోషించి అందరు కోరుకున్నట్లు జరుగుతుందని తెలిపారు. -
29న సింగపూర్‌లో బోనాలు
సింగపూర్: విదేశాల్లో కూడా తెలంగాణ సాంస్కృతి, సంప్రదాయాలు విరాజిల్లుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పండుగల్లో ఒక్కటైన బోనాల జాతరను సింగపూర్‌లో అంగరంగ వైభవంగా జరపడానికి తెలంగాణ కల్చరల్ సోసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) సిద్దమైంది. బోనాల జాతరను జులై 29(ఆదివారం) రోజున స్ధానిక శ్రీ అరకేసరి శివన్ టెంపుల్లో సాయంత్రం 05:30 నుంచి కన్నుల పండుగగా జరుపడానికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జాతరకు సింగపూర్‌లో ఉన్న తెలుగు వారందరూ పాల్గొనాల్సిందింగా కోరారు. రిజిస్ట్రేషన్ కోసం https://goo.gl/WJdPL4 లో లాగిన్ కావాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు. బోనాల జాతర ఏర్పాట్లను లక్ష్మారెడ్డి, గోనే నాగెందర్, సురేందర్ రెడ్డి, రాము, ఉమేందర్, పద్మజ, కళ్యాణి, సృజన తదితరులు పర్యవేక్షిస్తున్నారు. -
లోకహితానికే తెలంగాణబోనాలు
సాక్షి, హైదరాబాద్: కుటుంబం లేదా తాను బాగుండాలని తిరుపతికి వెళ్లి మొక్కుకుంటారని, ఊరంతా బాగుండాలని తెలంగాణలో బోనం ఎత్తుకుంటారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం అన్నారు. ఇందిరాపార్కులో జేఏసీ నిర్వహిస్తున్న శాంతిదీక్షలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు, సీమాంధ్రకు ఇలాంటి చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా విభజన నిర్ణయాన్ని ఆపాలని సీమాంధ్ర సంపన్నులు, రాజకీయ నేతలు కుట్రలకు దిగుతున్నారని ఆరోపించారు. న్యాయ బద్ధమైన తెలంగాణ కోసం 60 ఏళ్ల్లు పోరాడామని, మరో ఆరురోజులు ఓపికతో కొట్లాడలేమా అని ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధి సమైక్య రాష్ట్రంలో జరిగింది కాదన్నారు. 1918లోనే హైదరాబాద్‌లో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు (నగరాభివృద్ధి మండలి)ని నిజాం ఏర్పాటుచేశారని వెల్లడించారు. 1998-2004 మధ్యకాలంలో వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని వెల్లడించారు. దీని వల్ల తెలంగాణలోనే 25 వేలమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని చెప్పారు. ఉపాధి కల్పించే పరిశ్రమలను మూయించి, ఆ భూములను రియల్ఎస్టేట్ వ్యాపార సంస్థలకు ప్రభుత్వం అప్పగించిందని విమర్శించారు. హైదరాబాద్‌లోని చెరువులను కబ్జా చేసి సినిమా థియేటర్లు కట్టించిన చరిత్ర సమైక్య రాష్ట్రానికి ఉందన్నారు. ఎంపీ జి.వివేక్ మాట్లాడుతూ సీఎం కిరణ్ సీమాంధ్రకే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీక్షలో ఎమ్మెల్సీ మహమూద్ అలీ, ఎంబీటీ, జేఏసీ అగ్రనేతలు పాల్గొన్నారు.