
కోటలోకి వెళ్తున్న జస్టిస్ శర్మ దంపతులు
గోల్కొండ (హైదరాబాద్): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ఆదివారం తన సతీమణితో సహా గోల్కొండకోటను సందర్శించారు. ఆసిఫ్‌నగర్ డివిజన్ ఏసీపీ శివమారుతి, గోల్కొండ ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి సతీష్‌చంద్ర దంపతులకు కోట వద్ద స్వాగతం పలికారు. కోటలోని క్లాపింగ్ పోర్టికోతోపాటుగా, ఎగువభాగాన ఉన్న కుతుబ్‌షాహీ కాలం నాటి ఫిరంగి, చారిత్రక కట్టడాలను దంపతులిద్దరూ ఆసక్తిగా తిలకించారు. కోటలోని సీనియర్ గైడ్ వారికి చారిత్రక కట్టడాల విశేషాలను వివరించారు. అనంతరం పర్యాటకశాఖ నిర్వహించే లైట్ అండ్ సౌండ్ షోను వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment