Satish Chandra
-
ఎంపీ డానిష్ అలీపై బీఎస్పీ బహిష్కరణ వేటు
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యుడు డానిష్ అలీని శనివారం బహుజన్ సమాజ్ పార్టి(బీఎస్పీ) సస్పెండ్ చేసింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ‘పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ మీరు ఎలాంటి ప్రకటన చేయరాదని, ఎటువంటి చర్య తీసుకోవద్దని చాలాసార్లు మౌఖికంగా చెప్పాం. అయినప్పటికీ మీరు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం మానలేదు. అందుకే, పార్టీ ప్రయోజనాల రీత్యా మిమ్మల్ని బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం’అని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా డానిష్ అలీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
హఠాత్తుగా వాహనం దిగి.. హోంగార్డును అభినందించి.
సాక్షి, హైదరాబాద్: అది ఎల్బీ స్టేడియం పక్కన ఉన్న బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం చౌరస్తా... రోజూ మాదిరిగానే శుక్రవారం కూడా అబిడ్స్ ట్రాఫిక్ ఠాణా హోంగార్డు అష్రఫ్ అలీ ఖాన్ విధుల్లో ఉన్నారు. ఉదయం 9.20 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వాహనం ఆ దారిలో వెళ్తోంది. హఠాత్తుగా సీజే తన వాహనాన్ని స్లో చేయించి అలీని దగ్గరకు పిలిచారు. వాహనం నుంచి కిందికి దిగిన జస్టిస్ సతీశ్‌చంద్ర.. అలీని ‘వెల్డన్ ఆఫీసర్’ అంటూ అభినందించి పుష్పగుచ్ఛం ఇచ్చారు. దీంతో అలీఖాన్‌తోపాటు అక్కడున్న వాళ్లూ ఆశ్చర్యపోయారు. విజయ్‌నగర్ కాలనీకి చెందిన అష్రఫ్ 24 ఏళ్ల క్రితం హోంగార్డుగా అడుగుపెట్టారు. రెండున్నరేళ్లుగా అబిడ్స్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అలీ నిత్యం బీజేఆర్ స్టాట్యూ చౌరస్తాలోని పాయింట్లో డ్యూటీ చేస్తుంటారు. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ రాకపోకలు సాగించేది ఈ చౌరస్తా మీదుగానే. అత్యంత ప్రముఖుల జాబితాలో ఉండే ఆయనకు ట్రాఫిక్ పోలీసులు గ్రీన్‌చానల్ ఇస్తుంటారు. సీజే ప్రయాణించే సమయంలో, ఆ మార్గంలో మిగిలిన వాహనాలను ఆపి, ఆయన వాహనాన్ని ముందుకు పంపిస్తారు. బీజేఆర్ స్టాట్యూ వద్ద అలీ ఒక్క రోజు కూడా చిన్న ఇబ్బందీ రానీయలేదు. అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్న అలీని కొన్నాళ్లుగా గమనిస్తున్న సీజే శుక్రవారం అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. హోంగార్డు అలీ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఇన్నేళ్లల్లో ఒక్కసారి కూడా సీజే స్థాయి వారిని దగ్గర నుంచి కూడా చూడలేదు. అలాంటిది సీజే నా వద్దకు వచ్చి అభినందించడంతో షాకయ్యా’ అని ఉబ్బితబ్బిబ్బయ్యారు. సీజే ఇచ్చిన స్ఫూర్తిని అలీ జీవితకాలమంతా గుర్తుపెట్టుకుంటారని డీజీపీ మహేందర్‌రెడ్డి ట్టిట్టర్లో పేర్కొన్నారు. -
హెచ్‌సీయూ అప్పీల్‌పై సర్కారుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తమకు చట్టబద్ధమైన భూకేటాయింపులు లేవంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) దాఖలు చేసిన అప్పీల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలీలతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసీల్దార్లను ఆదేశించింది. తమకు కేటాయించిన భూమిలోని 18.30 ఎకరాల్లో నిర్మిస్తున్న రహదారిని నిలిపివేయాలంటూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దాఖలు చేసిన పిటిషన్‌ను సింగిల్ జడ్జి కొట్టేస్తూ ఇటీవల తీర్పునిచ్చారు. ఈ భూమిపై వర్సిటీకి హక్కులు లేవని, హక్కుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించాలని సూచించారు. -
సమాన న్యాయంతోనే సార్థకత
సాక్షి, మేడ్చల్ జిల్లా/శామీర్‌పేట్: న్యాయ సమానత్వం కోసం న్యాయవాదులు కృషిచేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. హక్కులు, న్యాయం కోసం పోరాడేందుకు యువత ముందుకు రావాలని, యువత తమ శక్తిని పూర్తిగా వినియోగించుకున్నపుడే మెరుగైన భవిష్యత్తు ఏర్పడుతుందని చెప్పారు. ఆదివారం శామీర్‌పేటలోని నల్సార్ విశ్వవిద్యాలయంలో జరిగిన 18వ స్నాతకోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయ విద్యార్థులు క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని, భాష ఏదైనా సమాచార సేకరణ సమర్థవంతగా ఉండాలన్నారు. న్యాయ విద్యా ర్థులు ఉన్నతస్థాయికి వెళ్లేందుకు ముందుగా విచారణ అనుభవాన్ని పొందాలని సూచించారు. విశ్వవిద్యాలయాల కంటే ప్రజలతో ప్రత్యక్షంగా నేర్చుకున్న పాఠాలే మేధోసంపత్తి ఎదుగుదలకు దోహదపడతాయని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. అంతకుముందు వర్సిటీలో విద్యార్థుల హాస్టళ్ల భవనాలతోపాటు డైనింగ్ హాలును హైకోర్టు ప్రధానన్యాయమూర్తి, నల్సార్ చాన్స్‌లర్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. గోల్డ్ మెడల్స్ అందజేత 2020, 2021 సంవత్సరాల్లో గోల్డ్‌మెడల్స్ సాధించిన 104 మంది విద్యార్థులకు జస్టిస్ రమణ గోల్డ్ మెడల్స్ అందజేశారు. అలాగే వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి పట్టాలను అందజేసి అభినందించారు. అనంతరం నల్సార్ వర్సిటీ రూపొందించిన పలు రివ్యూ డాక్యుమెంటరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రీ, జస్టిస్ పి.వెంకటరమణా రెడ్డి, కార్మిక మంత్రి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘గోల్కొండ’ సందర్శనలో హైకోర్టు సీజే దంపతులు
గోల్కొండ (హైదరాబాద్): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ఆదివారం తన సతీమణితో సహా గోల్కొండకోటను సందర్శించారు. ఆసిఫ్‌నగర్ డివిజన్ ఏసీపీ శివమారుతి, గోల్కొండ ఎస్సై చంద్రశేఖర్‌రెడ్డి సతీష్‌చంద్ర దంపతులకు కోట వద్ద స్వాగతం పలికారు. కోటలోని క్లాపింగ్ పోర్టికోతోపాటుగా, ఎగువభాగాన ఉన్న కుతుబ్‌షాహీ కాలం నాటి ఫిరంగి, చారిత్రక కట్టడాలను దంపతులిద్దరూ ఆసక్తిగా తిలకించారు. కోటలోని సీనియర్ గైడ్ వారికి చారిత్రక కట్టడాల విశేషాలను వివరించారు. అనంతరం పర్యాటకశాఖ నిర్వహించే లైట్ అండ్ సౌండ్ షోను వీక్షించారు. -
ఆర్టీఏకు వచ్చిన హైకోర్టు చీఫ్ జస్టిస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. తన డ్రైవింగ్ లైసెన్సు రెన్యువల్ కోసం ఆయన నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి రావడం గమనార్హం. రవాణా కమిషనర్ ఎం.ఆర్.ఎం రావు, హైద రాబాద్ జేటీసీ పాండురంగ నాయక్, ప్రాం తీయ రవాణా అధికారి రాంచందర్ తదితరులు చీఫ్ జస్టిస్‌కు సాదరస్వాగతం పలికారు. నిబంధనల మేరకు డ్రైవింగ్ లైసెన్సు కాలపరిమితిని పునరుద్ధరించి అందజేశారు. -
పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: న్యాయశాఖలో ఉన్న పెండింగ్ సమస్యలు, కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న 525 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీచంద్ర శర్మకు విజ్ఞప్తి చేసింది. న్యాయ శాఖ ఉద్యోగుల సం ఘం జాతీయ అధ్యక్షుడు బి.లక్ష్మారెడ్డి నేతృ త్వంలో ప్రతినిధిబృందం గురువారం జస్టిస్ శర్మను కలసి వినతిపత్రం సమర్పించింది. సమస్యల పరిష్కారానికి, ఖాళీల భర్తీకి చర్య లు తీసుకుంటామని ఈ సందర్భంగా సీజే హామీ ఇచి్చనట్లు ప్రతినిధి బృందం పేర్కొంది. సీజేను కలిసిన వారిలో ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బ య్య, రమణ, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, భుజంగరావు, ప్రేమ్‌కుమార్, నల్లారెడ్డి, ఐలయ్య పాల్గొన్నారు. -
వెంకట్రామిరెడ్డి రాజీనామా ఆమోదం చట్టవిరుద్ధం
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట పూర్వ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా ఆమోదం చట్టవిరుద్ధమంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. కరీంనగర్ జిల్లాకు చెందిన జె.శంకర్, ఆంథోల్ ప్రాంతానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్‌లు గురువారం ఈ పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా భోజన విరామం తర్వాత విచారించాలని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనాన్ని అభ్యరి్థంచారు. దీనికి ధర్మాస నం నిరాకరించింది. ‘వెంకట్రామిరెడ్డి 2011లో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. ఐఏఎస్ అధికారుల నియామకాలు చేపట్టేది రాష్ట్రపతి. వారు కేంద్ర ప్రభుత్వ అ«దీనంలో ఉంటూ.. విధులు నిర్వహిస్తారు. వారి రాజీనామా ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఐఏఎస్ అధికారులు రాజీనామా చేయడానికి 3 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వాలి. వెంకట్రామిరెడ్డి రాజీనామాతో ఆయనపై ఎటువంటి కేసులు పెండింగ్‌లో లేవని నిర్ధారిస్తూ విజిలెన్స్ విభాగం నివేదికను జతచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయన దరఖాస్తును కేంద్రానికి పంపాలి. వీటన్నింటినీ పరిశీలించకుండా రాజీనామా ఆమోదించడం చట్టవిరుద్ధం. అయితే వెంకట్రామిరెడ్డి 14న స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే అదే రోజున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదించినట్లుగా పత్రికల్లో కథనాలొచ్చాయి. వెంటనే టీఆర్ఎస్లో చేరి 16న ఎంఎల్సీ అభ్యరి్థగా నామినేషన్ దాఖలు చేశారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్ తిరస్కరించేలా ఆదేశించండి’ అని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్లో కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) ముఖ్య కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి, తెలంగాణ శాసన మండలి కార్యదర్శి, ఎంఎల్సీ ఎన్నికల రిటర్నింగ్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో పి.వెంకట్రామిరెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. -
‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో మొక్కలు నాటిన సీజే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ ‘గ్రీన్ఇండియా చాలెంజ్’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ చాలెంజ్ చేపట్టిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రత్యేకంగా అభినందించారు. పర్యావరణ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. తాను కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన విషయాన్ని సీజే గుర్తుచేశారు. ఇలాంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళుతున్నందుకు సంతోష్‌ను ప్రశంసించారు. మంగళవారం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హైకోర్టు ప్రాంగణంలో జరిగిన కార్య క్రమంలో సీజే, బీఎస్ ప్రసాద్, ఏజీ జె.రామచంద్రరావులతో కలిసి సంతోష్‌కుమార్ మొక్కలు నాటారు. సీజే సతీశ్‌చంద్ర శర్మ, ఇతర న్యాయమూర్తుల కు ఎంపీ సంతోష్ వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు. కార్యక్రమంలో జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ శ్రీసుధ, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం అశోక్‌గౌడ్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్‌రావు, జీపీలు జోగినిపల్లి సాయికృష్ణ, సంతోష్ కుమార్, పీపీలు, సీనియర్ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్స్, ఫుడ్ కమిషన్ మెంబర్ గోవర్ధన్‌రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. -
58 శాతంకన్నా ఎక్కువ డ్రా చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టం మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐడీసీఎల్) ఫిక్స్డ్ డిపాజిట్లను డ్రా చేసుకుంటోందంటూ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌ఐడీసీఎల్) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఏపీకి రావాల్సిన 58 శాతంకన్నా ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకోరాదని ఆదేశించింది. ఉమ్మడి కార్పొరేషన్‌కు చెందిన ఫిక్స్డ్ డిపాజిట్లలో ఏపీకి రావాల్సిన 58 శాతంకన్నా ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకుంటున్నారంటూ టీఎస్‌ఐడీసీఎల్ ఎండీ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏపీఐడీసీఎల్ వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ తీర్పు ప్రకారం ఉమ్మడి సంస్థల నిధులను 58, 42 శాతం నిష్పత్తిలో పంచుకోవాల్సి ఉందన్నారు. 58 శాతానికి మించి ఏపీఐడీసీఎల్ డ్రా చేసుకోదని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీఐడీసీఎల్ చైర్మన్/ఎండీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐలను ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 3కు వాయిదా వేసింది. -
వచ్చే నెల 1 నుంచి డిగ్రీ తరగతులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజనీరింగ్, బీఏ, బీఎస్సీ తదితర ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహించే అన్ని యాజమాన్యాల్లోని డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలలో అక్టోబర్ 1వ తేదీనుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర (ఉన్నత విద్యాశాఖ) సోమవారం జీవో–242 విడుదల చేశారు. కోవిడ్ దృష్ట్యా సరి, బేసి విధానంలో అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించారు. కోవిడ్‌కు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్వోపీ) ప్రకారం తగు జాగ్రత్తలతో తరగతులు నిర్వహించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. నాన్ ప్రొఫెషనల్ కోర్సుల క్యాలెండర్ ఇలా (బేసి సెమిస్టర్లు) ► కాలేజీల రీ ఓపెనింగ్: అక్టోబర్ 1, 2021 ► 1, 3, 5 సెమిస్టర్ల తరగతులు: అక్టోబర్ 1 నుంచి ► 1, 3, 5, సెమిస్టర్ ఇంటర్నల్ పరీక్షలు: డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు ► తరగతుల ముగింపు: జనవరి 22, 2022 ► సెమిస్టర్ పరీక్షల ప్రారంభం: జనవరి 24 నుంచి నాన్ ప్రొఫెషనల్ కోర్సులు (సరి సెమిస్టర్లు) ► 2, 4, 6 సెమిస్టర్ల తరగతుల ప్రారంభం: ఫిబ్రవరి 15, 2022 ► అంతర్గత పరీక్షలు: ఏప్రిల్ 4 నుంచి 9 వరకు ► తరగతుల ముగింపు: మే 28, 2022 ► 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలు: జూన్ 1, 2022 నుంచి ► కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టు: 2వ సెమిస్టర్ పరీక్షల అనంతరం 8 వారాలు ► సమ్మర్ ఇంటర్న్‌షిప్/జాబ్ ట్రైనింగ్/అప్రెంటిస్‌షిప్: 4వ సెమిస్టర్ తరువాత 8 వారాలు ► తదుపరి విద్యా సంవత్సరం ప్రారంభం: ఆగస్టు 9, 2022 -
ఇంతకు ఈ విషయం ఆమెకు తెలుసా
రేల పూలు రాల్చుకొని రాల్చుకొని గాలి ముసల్ది అయ్యింది కూడబెట్టుకున్న వెన్నెలంతా పక్షుల పాటకు ఇనామై కరిగిపోతుంది చెరువు వొడ్డున గరక మంచుపూలు పూసి మాయమైపోతుంటే ఏ ఋతువు తెచ్చిన వేదనో కాని, లోపల కురిసిన వానని దుఃఖం అనడం ఇష్టం లేదు పుట్ట తాడు గంగమ్మ అలికిడి కోనేటి మూలన కొలువయ్యి ఉన్నయి కదా ఇంక ఎంత కాలమైనా గీ చెరువు వొడ్డునే నిద్రిస్తా నా కల చేపలతో పాటు ఈదుతునే ఉంటుంది శూన్యం తాలుకు శబ్దం నా గుండెల మీద దిగేవరకు ఇక్కడే ఉంటా మబ్బులు వాయిద్యాల్లాగ ఉరుముతుంటే వాన నాట్యంలా ఆడుతుంది కాలువలో చేపలు పొర్లుతున్నట్టు నాలో నీ జాసలు పొర్లుతున్నయి నన్ను ఎవరేమనుకున్నా సరే వెన్నెలకు చేతబడి జేసి నా వెంటే తిప్పుకుంటా రోగం తిరగబడ్డది అనుకున్నారు కాదు వయస్సు మర్లబడ్డది చెరువులో చేపలు కొత్త నీరును మీటుతుంటే చెట్లు ఆకుల్ని చెవుల్ని జేసుకున్నాయి ఏవో పాత నీడలు నిలదీసి అడుగుతున్నయి ఏండ్ల నించి ఎదురు జూస్తున్నవు సరే... ఇంతకు ఈ విషయం ఆమెకు తెలుసా. -మునాసు వెంకట్ దశావతారాలు వాలితే పువ్వు ఎగిరితే గువ్వ రేకలే రెక్కలు కాబోలు. విరిస్తే మనసు పరిస్తే తనువు తలపే పరుపు కాబోలు. చాస్తే అరచెయ్యి మూస్తే పిడికిలి బిగింపే తెగింపు కాబోలు. తడిపేస్తే అల ఆరిపోతే కల ముంపే ప్రేమ కాబోలు. నిలిస్తే వెదురు వంగితే విల్లు ఒంపే వ్యూహం కాబోలు. కరిగితే వాన కాలితే పిడుగు కన్నీరే కార్చిచ్చు కాబోలు. కోస్తే కాయ వలిస్తే పండు అదనే పదును కాబోలు. కునికితే గొంగళి లేస్తే చిలుక మెలకువే మార్పు కాబోలు చీకితే తీపి మింగితే తిండి రుచే బతుకు కాబోలు. దాస్తే లోహం దూస్తే ఖడ్గం చలనమే జననం కాబోలు. - సతీష్ చందర్ -
నైపుణ్య శిక్షణకు మైక్రోసాఫ్ట్
సాక్షి, అమరావతి: విద్యార్థి దశ నుంచే నైపుణ్య శిక్షణను అందించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా అందులో భాగస్వామ్యం కావడానికి ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థతో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) సతీష్‌చంద్ర వెల్లడించారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సీఎక్స్‌వో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నైపుణ్య శిక్షణకు సంబంధించి ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌తో పలుమార్లు చర్చలు జరిపామని.. శిక్షణ అందించే కోర్సులను కూడా గుర్తించినట్లు తెలిపారు. సాధారణ రుసుముతో ఏటా 1.60 లక్షల మంది డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గధామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనురులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందుకోసమే డిగ్రీ సిలబస్‌ను నాలుగేళ్లకు మార్చడమే కాక 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసినట్లు సతీష్‌చంద్ర తెలిపారు. ప్రధాన రంగాలతో ఐటీ అనుసంధానం అంతకుముందు.. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జి. జయలక్ష్మి మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్య, వైద్య, స్మార్ట్ సిటీ వంటి ఆరు ప్రధాన రంగాలతో ఐటి అనుసంధానం ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచుకోగలుగుతామన్నారు. అలాగే, కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పెరుగుతోందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ సమ్మేళనం ద్వారా వ్యక్తమయ్యే అభిప్రాయాలతో కొత్త పాలసీ రూపొందించుకుని ముందుకు వెళ్తామన్నారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రధాన ఆదాయ వనరు అయిన వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐటీ వినియోగాన్ని పెంచామని చెప్పారు. రాష్ట్రంలోని 10 వేలకు పైగా రైతుభరోసా కేంద్రాల్లో ఏర్పాటుచేసిన కియోస్క్‌లే ఇందుకు ఉదాహరణ అన్నారు. ఈ–క్రాపింగ్, మార్కెటింగ్ వంటి వాటిల్లో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఖర్చులను తగ్గిస్తున్నామని.. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యయం తగ్గి రైతులకు లాభాలు పెరిగే అవకాశం ఉందన్నారు. కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీపై అందరి దృష్టి ఇదిలా ఉంటే.. కరోనాతో కాంటాక్ట్ లెస్ టెక్నాలజీపై అందరి దృష్టిపడిందని, ఆఫీసుకు వెళ్లకుండానే ఐటి టెక్నాలజీతో ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటుకు అందరూ ఆకర్షితులవుతున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి అన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వున్న మానవ వనరులను వినియోగించుకుని సాంకేతికంగా వారిలో నైపుణ్యాన్ని పెంచగలిగితే ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా అనంతపురం, తిరుపతి, విశాఖల్లో ఐటీ కాన్సెప్ట్ సిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అబ్బయ్యచౌదరి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా ప్రసంగించగా.. 63 కంపెనీల సీఈవోలు, ఎండీలు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్, ఫార్మసీ 'ఫీజుల ఖరారు'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యాసంస్థల్లో బీటెక్, బీఆర్క్, మెరైన్ ఇంజనీరింగ్, బీఫార్మసీ కోర్సులకు ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం బుధవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2020–21, 2021–22, 2022–23 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయి. రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ (ఏపీ హెచ్‌ఈఆర్‌ఎంసీ) సిఫార్సులను అనుసరించి ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఫీజుల ఉత్తర్వులను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో మెరైన్ ఇంజనీరింగ్ ఫీజు రూ.1.25 లక్షలుగా ఖరారు చేయగా బీటెక్, బీఆర్క్ కోర్సులకు కనిష్టం రూ.35 వేల నుంచి గరిష్ట ఫీజు రూ.70 వేలుగా నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రైవేట్, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలైన 240 ఇంజనీరింగ్ కాలేజీలు, 4 బీఆర్క్ కాలేజీలతోపాటు 1 మెరైన్ ఇంజనీరింగ్ కాలేజీకి ఈ ఫీజులు వర్తించనున్నాయి. ఆదాయ, వ్యయ నివేదికలు, సదుపాయాలు, ఇతర అంశాలకు సంబంధించి ఆయా కాలేజీలు సమర్పించిన వివిధ పత్రాలను ఆడిట్ చేసిన అనంతరం యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపిన ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఆయా సంస్థలకు కోర్సుల వారీగా ఫీజులను సిఫార్సు చేసింది. వాటిని అనుసరించి ఉన్నత విద్యా శాఖ ఫీజులను ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆడిట్ ఫలితాల ఆధారంగా.. బీటెక్, బీఆర్క్ కోర్సులకు సంబంధించి 8 కాలేజీలకు రూ.70 వేల చొప్పున ఫీజులు ఖరారు కాగా.. రూ.35 వేలకు పైబడి రూ.70 వేల లోపు ఫీజులు ఖరారైన కాలేజీలు 94 ఉన్నాయి. 142 కాలేజీలకు కనిష్ట ఫీజు రూ.35 వేలను నిర్ణయించారు. బీ.ఫార్మసీకి సంబంధించి గరిష్ట ఫీజును రూ.65,900గా, కనిష్ట ఫీజును రూ.35 వేలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం రాష్ట్రంలోని 113 కాలేజీలకు ఈ ఫీజులను నిర్ణయించారు. గరిష్ట ఫీజు ఖరారైన కాలేజీ ఒకటి కాగా.. రూ.35 వేలకు పైబడి రూ.65 వేల వరకు ఫీజులు నిర్ణయమైన కాలేజీలు 55 ఉన్నాయి. 57 కాలేజీలకు రూ.35 వేల కనిష్ట ఫీజు ఖరారైంది. ఇతర ఫీజులు వసూలు చేయకూడదు అన్నిరకాల రుసుములతో కలుపుకుని ప్రభుత్వం ఈ ఫీజులను ఆయా సంస్థలకు నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్యూషన్ ఫీజు, అఫిలియేషన్ ఫీజు, గుర్తింపు కార్డు చార్జీ, మెడికల్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, గేమ్స్, కల్చరల్ మీట్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, శానిటరీ, మెయింటనెన్స్, ఇతర సదుపాయాలు, ఎక్స్ట్రా కరిక్యులర్ కార్యక్రమాల ఫీజులు, డెవలప్మెంట్ ఫీజు, రికగ్నైజేషన్ ఫీజు, కామన్ సర్వీస్ ఫీజు ఇతర రుసుములన్నిటితో కలిపి ఈ ఫీజులను నిర్ణయించినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంతకుమించి విద్యార్థుల నుంచి అదనపు రుసుములు వసూలు చేయడానికి వీల్లేదు. క్యాపిటేషన్, డొనేషన్, మరే ఇతర ఫీజులను పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ వసూలు చేయరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. యూనివర్సిటీలు గుర్తింపు ఇవ్వని కాలేజీలు ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం ఈ ఫీజులను పూర్తిగా రీయింబర్స్మెంట్ చేయనుంది. గత ప్రభుత్వ హయాంలో ఆయా కాలేజీలకు ఎంత ఫీజు ఉన్నా కేవలం రూ.35 వేలు మాత్రమే రీయింబర్స్మెంట్ ఇచ్చేది. మిగతా మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు చెల్లించాల్సి వచ్చేది. -
550, 111 జీవోలకు సవరణ
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాసంస్థల్లోని సీట్ల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చిన జీవోలు 550, 111లను సవరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో జారీచేసిన జీవోల్లోని నిబంధనలపై స్పష్టత ఇస్తూ, ఎలాంటి సందేహాలకు తావులేకుండా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఆయా సీట్లను మెరిట్ ప్రకారం భర్తీ చేసేలా తాజాగా సవరణలు ఉత్తర్వులు జారీచేశారు. వీటి ప్రకారం... ► మెరిటోరియస్ రిజర్వుడ్ అభ్యర్థి స్లైడింగ్‌తో వేరే కాలేజీలో సీటు పొందితే ఖాళీ అయ్యే ఓపెన్ కేటగిరీ సీటును మెరిట్ ప్రకారం అదే రిజర్వుడ్ వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ చేస్తారు. ► మెరిటోరియస్ రిజర్వుడ్ అభ్యర్థి స్లైడింగ్ ద్వారా కేటాయింపు అయిన కాలేజీలోని సీటులో చేరని పక్షంలో ఖాళీ అయిన ఓపెన్ కేటగిరీ సీటును తిరిగి ఓపెన్ కేటగిరీగానే పరిగణిస్తారు. ► మెరిటోరియస్ రిజర్వుడ్ అభ్యర్థి ఖాళీచేసే సీటును పొందిన అదే కేటగిరీకి చెందిన మరో అభ్యర్థి కూడా ఆ సీటులో జాయిన్ కాని పక్షంలో..అదే రిజర్వుడ్ వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ అయ్యేవరకు కౌన్సెలింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఉన్నతస్థాయి కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక వేర్వేరుగా ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ ఇలావుండగా కమిటీ చేసిన సిఫారసులతో మరికొన్ని ప్రతిపాదనలు కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అమల్లోకి తెస్తోంది. ► ఈసారి ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌లు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దీనికిముందు అన్నీ కలిపి చేయడం వల్ల ఒకింత గందరగోళానికి దారితీసేది. ► అభ్యర్థులు ప్రాధాన్యత ప్రకారం ఒకేసారి తమకు నచ్చినన్ని ఆప్షన్లు ఇచ్చుకొనేలా చేస్తున్నారు. తర్వాత మార్చుకోవడానికి అవకాశం ఇవ్వరు. గతంలో ఆప్షన్లను పలుమార్లు మార్చుకునేందుకు అవకాశం ఉండేది. ► ఈసారి ఒక కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన అభ్యర్థి దానిలో జాయినయినట్లు ఆన్లైన్ ద్వారా రిపోర్టు చేస్తేనే తదుపరి కౌన్సెలింగ్‌కు, స్లైడింగ్‌కు అనుమతిస్తారు. ► గతంలో ఒక కౌన్సెలింగ్‌లో కాలేజీలో సీటు వచ్చిన అభ్యర్థి అందులో జాయినయినట్లు ఆప్షన్ ఇవ్వకున్నా తదుపరి కౌన్సెలింగ్‌కు, స్లైడింగ్‌కు అవకాశముండేది అలా స్లైడింగ్లతో ఆప్షన్లు ఇస్తూ ఆ అభ్యర్థి చివరకు ఎక్కడా జాయిన్ కాకుంటే ఆ సీట్లు ఖాళీగా మేనేజ్మెంటుకు మిగిలేవి. చివరకు ఇదో పెద్ద అక్రమాల తంతుగా మారింది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ దీనికి కొంతవరకు అడ్డుకట్టవేసేలా జాయినింగ్ రిపోర్టును తప్పనిసరి చేస్తోంది. -
జిల్లాల్లో హెల్త్‌కేర్ క్యాంపులు
సాక్షి, అమరావతి: కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్రంలో అంతర్ జిల్లాల మధ్య రాకపోకలను ప్రభుత్వం నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల్లో ఉండిపోయిన వేరే జిల్లాల వారికి కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో హెల్త్‌కేర్ క్యాంపులు (క్వారంటైన్) నిర్వహించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా వారికి మెరుగైన వసతి, నాణ్యమైన భోజనం, నీటి సరఫరా అందించాలని సూచించింది. ఆయా క్యాంపుల్లో సౌకర్యాల కల్పనలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేయడానికి.. ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర స్థాయిలో నోడల్ ఆఫీసర్‌గా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ పీయూష్ కుమార్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హెల్త్‌కేర్ క్యాంపుల్లోని ప్రజలతో మాట్లాడి ఎప్పటికప్పుడు వారికి అన్ని వసతులు సమకూర్చేలా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రతిరోజూ నివేదికను సీఎస్‌తోపాటు సీఎం కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లోని ఆంధ్రుల కోసం నోడల్ అధికారిగా సతీశ్ చంద్ర లాక్డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిచిపోయిన ఆంధ్రుల బాగోగులను చూసేందుకు నోడల్ ఆఫీసర్‌గా ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్రను రాష్ట్ర ప్రభుత్వం నియమిం చింది. ఈ మేరకు సీఎస్ నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లో నిలిచిపోయిన రాష్ట్ర ప్రజల కోసం అక్కడే హెల్త్‌కేర్ క్యాంపులు (క్వారంటైన్స్) ఏర్పాటు చేసి వారికి భోజనం, మంచి నీరు, వసతి, పారిశుధ్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొ న్నారు. కర్ణాటకలోని కోలార్ జిల్లా, ఉత్తరప్ర దేశ్‌లోని వారణాసి జిల్లాల్లో రాష్ట్రానికి చెందిన వారు నిలిచిపోయారని ప్రభుత్వం గుర్తించిం ది. దీంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
గతం వలలో చిక్కుకోవద్దు
21వ శతాబ్దం భవిష్యద్దార్శనికులకు చెందినదే. రేపటి గురించి తపన ఉన్నవారిదే. ఈ మాట సతీశ్ చంద్ర సేథ్ చెప్పారు. 1932–2009 మధ్య జీవించిన ఒక భవిష్యవాది. సివిల్ సర్వీస్ అధికారి, సైన్స్ విద్యాపాలనాధికా రిగా పనిచేసిన మేధావి సతీశ్ సేథ్. బిగ్ డేటా లేదా ఇన్ఫర్మేషన్ హైవే అని ఈనాడు మనం చూస్తున్న కొత్త సాంకేతిక ప్రక్రియ గురించి కొన్ని దశాబ్దాలకిందటే ఊహించిన భవిష్యద్దర్శకుడు. ఆయన కృత్రిమ మేధాశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి కూడా ముందే ఊహించిన భావి స్వాప్ని కుడు. విరామం లేని భవిష్యమూర్తి అనే పేరున సతీశ్ చంద్ర జీవనయానాన్ని, ఆయన రచనలు, ప్రతిపాదించిన తత్త్వం, వ్యాఖ్యానం, భారతదేశం గురించే కాకుండా ప్రపంచ మానవాళి రేపటి ప్రపంచాన్ని గురించి నిరంతరం చింతించి వెలువరించిన సాహిత్యాన్ని సమీక్షిస్తూ ఒక పుస్తకాన్ని రచించారు. దాని పేరు ‘‘ది రెస్ట్ లెస్ ఫ్యూచరిస్ట్, సతీశ్ సేథ్ క్వెస్ట్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా’’. ఈ పుస్తకాన్ని భారతదేశ మాజీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఈనెల 14న ఆవిష్కరించారు. ఆ తరువాత సేథ్ స్మారక ప్రసంగం చేశారు. ఈ పుస్తకం చదివితే గతం గురించి ఆలోచించడం కాస్సేపయినా ఆపి, రేపటి పై దృష్టి పెడతారు. సతీశ్ ఒక వ్యక్తి కాదు, ప్రేరణ నిచ్చే ఒక వ్యవస్థ. చమురు లేని శక్తి వనరుల గురించి, పునర్నవీకరణ వీలైన ఇంధనం గురించి ఆయన కలలు కన్నారు. నేటి సమాచార విప్లవం చూస్తుంటే సతీశ్ ఈ విషయాన్ని ముందే ఎలా ఊహించారా అనిపిస్తున్నదని ఆర్.ఎ.మశేల్కర్ ఈ పుస్తకానికి ముందుమాటలో రాసాడు. సమాచార హక్కు చట్టం 2005 ద్వారా విస్తృతమైన సమాచారాన్ని ప్రభుత్వమే వెల్లడించవలసిన బాధ్యత వచ్చింది. రాజస్తాన్‌లో జన సూచనా పోర్టల్‌ను ఈ నెలలో ప్రారంభించారు. ఈ అంతర్జాల వేదికమీద వందల మెగా బైట్ల సమాచారం అందిస్తున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఎంతమందికి ఆహార పదార్థాలు ఎంత ఎప్పుడు ఇచ్చారు. మిగిలిందెంత. స్టాకు ఎప్పుడొస్తుంది. నిన్నటిదాకా ఎన్ని నిలువలు ఉన్నాయి. రేషన్ డీలర్ ఎవరు అనే వివరాలు, రేషన్ కార్డు నెంబర్‌తో సహా అన్ని ఒక క్లిక్‌తో ఎక్కడి నుంచైనా ఎవరైనా చూసుకోవచ్చు. ఇది ఇదివరకెవరూ ఊహించింది కాదు, ఒక్క సతీశ్ చంద్ర సేథ్ తప్ప. సెక్షన్ 4(1)(బి) నిర్దేశించిన విధంగా 20 సేవలపై 13 విభాగాలు ఎప్పటికప్పుడు కొత్త సమాచారాన్ని జనానికి చేర్చే శక్తి ఈ అంతర్జాల సాంకేతిక పరిజ్ఞానానికి ఉందని రాజస్తాన్ ప్రత్యక్ష ప్రమాణాలతో రుజువు చేస్తున్నది. ఆర్టీఐ ఐటి సాధించిన అద్భుతం ఇది. చట్టం హక్కు ఇస్తే సాంకేతిక పరిజ్ఞానం ఆ హక్కుకు నిజరూపం ఇచ్చింది. ఎవరెవరికి ఎంత రేషన్ లభించిందో ఎంత మిగిలిందో తెలిస్తే స్టాక్‌ను చీకటి బజారుకు తరలించే అవినీతికి ఆస్కారమే ఉండదు. పెద్ద ఎత్తున భారీ సమాచారాన్ని శరవేగంగా ఇవ్వడంతో సరిపోదు. విలువలతో కూడిన విజ్ఞానానికి అది దారి తీయాలి అని సతీశ్ చంద్ర సేథ్ అనేవారు. మార్పుల వల్ల వచ్చే సమస్యలు భవిష్యత్తులో టెక్నాలజీకి సంబంధించినవి కావు, నీతి నియమాలకు సంబంధించినవి, నైతిక వ్యవస్థకు సంబంధించిన సమస్యలే తీవ్రమైనవి అని సతీశ్ చంద్ర సేథ్ అనేవారు. సతీశ్ గారు మరో మాట అనే వారు. మనం గతం పరచిన వలలో చిక్కుకోకూడదు. రేపటి గురించి ఆలోచించడం నేర్చు కోవాలి అని. భారతీయ ప్రజానీకానికి ఒక పరి మితి ఉంది, అది కర్మసిద్ధాంతం. మనం ఈ రోజున్న పరిస్థితికి కారణం గతంలో లేదా గత జన్మలో చేసిన పనులు లేదా పాపం అని స్థిరంగా నమ్మడం వల్ల రేపటి గురించి ఆలోచించి మంచి భవిష్యత్తును నిర్మించుకోలేకపోతున్నాం అని సతీశ్ చంద్ర సేథ్ ఆవేదన చెందారు. ప్రతి నిన్న, మళ్లీ మళ్లీ రేపును కూడా కబళించదు. కాని మనం రేపులో నిన్నను తలుచుకుంటూ భవిష్యత్తును కోల్పోతున్నామా అని ప్రతి వ్యక్తీ ఆలోచించుకోవాలని సతీశ్ ప్రబోధించారు. భవిష్యత్తు ఈ రోజే అని ఆయన నినాదం. భారతదేశ రెండో స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ అల్లుడైన సతీశ్ స్మృతి సభను మాడభూషి పద్మాసేథ్ నిర్వహించారు. కొడుకు ఆదిత్య ప్రణబ్ ముఖర్జీని సన్మానించారు. సతీశ్ పుస్తకంపై జరిగిన చర్చలో ఎన్. భాస్కర్ రావు, రచయిత రాకేశ్ కపూర్, ప్రొఫెసర్ వీణా రామచంద్రన్, ఈ వ్యాస రచయిత పాల్గొన్నారు. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
శిరీషపై అత్యాచారం జరగలేదు!
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీషపై అత్యాచారం జరగలేదని ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందినట్లు తెలుస్తోంది. శిరీష దుస్తులపై ఉన్న మరకల ఆధారంగా ఈ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కాగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక తమకు ఇంకా అందలేదని పోలీసులు చెబుతునక్నారు. అయితే ఫోరెన్సిక్ పరీక్ష రిపోర్ట్ పూర్తిస్థాయిలో వస్తేనే ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది అధికారికంగా, స్పష్టంగా చెప్పగలమని పోలీసులు చెబుతున్నారు. అయితే శిరీషపై అత్యాచారం జరగలేదని నిందితులు రాజీవ్, శ్రావణ్‌లు విచారణలో చెప్పారని, హైదరాబాద్ నుంచి కుకునూర్‌పల్లి వరకూ ఆరుచోట్ల సీసీ ఫుటేజ్ సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్జే స్టూడియోలో రాజీవ్‌కు సంబంధించిన వీడియోలు సేకరించినట్లు పేర్కొన్నారు. కాగా కుకునూర్‌పల్లిలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆమెపై అత్యాచారయత్నం చేయడంతో పాటు అనంతరం జరిగిన ఉదంతం నేపథ్యంలోనే మనస్తాపంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని, ఆమెది ముమ్మాటికీ ఆత్మహత్యేనని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే శిరీష కుటుంబసభ్యులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ముమ్మాటికీ హత్యనేని ఆరోపిస్తున్నారు. మరోవైపు శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు బోదాసు శ్రవణ్(21), వల్లభనేని రాజీవ్ (31) పోలీస్ కస్టడీ ముగియడంతో వారిని నిన్న కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
‘కసబ్ కంటే శిరీష కేసు పెద్దది కాదు’
హైదరాబాద్ :ముంబైలో దాడులకు పాల్పడ్డ పాక్ ఉగ్రవాది కసబ్ కేసు కంటే బ్యూటీషియన్ శిరీష మృతి కేసు పెద్దది కాదని ఈ కేసులో ప్రధాన నిందితుల తరఫు న్యాయవాది వెంకట్ వ్యాఖ్యానించారు. పోలీసుల విచారణ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కాగా ఈ కేసులో సమగ్ర విచారణ నిమిత్తం నిందితులు శ్రావణ్, రాజీవ్‌లను బంజారాహిల్స్ పోలీసులు ఇవాళ తమ కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు వారిని పోలీసులు విచారణ చేయనున్నారు. అంతకు ముందు వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపైన కూడా సమగ్రంగా విచారణ జరపనున్నారు. శిరీష మృతి కేసులో సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ‘శిరీష ఆత్మహత్య చేసుకుందా?, హత్యకు గురయిందా?. ఆమెను కుకునూర్‌పల్లిలో ఏ సెటిల్మెంట్కు తీసుకు వెళ్లారు. ఇంతకీ శిరీష డిమాండ్ ఏంటి?. రాజీవ్ ఏం కావాలనుకున్నాడు. కుకునూర్‌పల్లిలో ఏం జరిగింది.అక్కడ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రాలేదు?. ఉద్దేశపూర్వకంగానే శిరీషను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి అప్పగించారా? ఈ కేసులో తేజస్విని పాత్ర ఏంటి?. తేజస్విని ఇప్పటివరకు పోలీసులు ఎందుకు విచారించలేదు?. శిరీష ఆడియో రికార్డింగ్‌లు ఎవరు బయటపెట్టారు?. కుకునూర్‌పల్లి నుంచి వచ్చే దారిలో శిరీషను ఎందుకు కొట్టారు?. అసలు ఆర్జే స్టూడియోలో ఏం జరిగింది? సీసీ పుటేజ్ ఎందుకు బయటకు రాలేదు?. కాల్ రికార్డులో ఉన్న నందు, నవీన్ ఎవరు?. వారిని పోలీసులు విచారించారా?. తేజస్విని సంగతి చూడమని శిరీష ఎవరెవరికి చెప్పింది?. ఆమెను ఎవరెవరు బెదిరించారు?. ఈ విషయం రాజీవ్‌కు తెలుసా?.’ అనే ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు మాత్రం బయటకు రాలేదు. -
శిరీషపై ఎస్ఐ రేప్ అటెంప్ట్ చేశాడు..కానీ..
- మృతురాలి శరీరభాగాలను భద్రపరిచాం.. పరీక్షల తర్వాత మరిన్ని వివరాలు - సంచలనాత్మక కేసు వివరాలను వెల్లడించిన సీపీ మహేందర్ రెడ్డి - ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి శిరీషను తీసుకెళ్లడంలో శ్రావణ్ కుట్ర - శిరీష కేసులో ఏ1గా శ్రావణ్, ఏ2గా రాజీవ్ - ఎస్సై ఆత్మహత్యకేసులో విడిగా దర్యాప్తు సాగుతోందన్న కొత్వాల్ హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీషపై కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచార యత్నం చేశాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రేప్ అటెంప్ట్ సమయంలో శిరీష గట్టిగా కేకలు వేసిందని, ‘నేను అలాంటిదాన్ని కాను..’ ఎస్సైని వేడుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనతోపాటు హైదరాబాద్ తిరుగుప్రయాణంలో రాజీవ్, శ్రావణ్‌లు పలు మార్లు కొట్టడంతో మనస్తాపానికి గురైన శిరీష్ ఆత్మహత్య చేసుకుందని సీపీ వివరించారు. ఈ కేసుకు సంబంధించి శ్రావణ్‌ను ఏ1గా, రాజీవ్‌ను ఏ2గా చేర్చామని చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదికలో కూడా శిరీష ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయి ఉండొచ్చని వైద్యులు పేర్కొన్నట్లు కమిషనర్ మహేందర్‌రెడ్డి చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే.. ‘‘విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్ కుమార్ హైదరాబాద్‌లో ఆర్జే ఫోటోగ్రఫీ పేరుతో స్టూడియో నిర్వహిస్తున్నాడు. అతని స్టూడియోలో శిరీష నాలుగేళ్లుగా పని చేస్తోంది, వీరి మధ్య క్రమంగా సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కొంతకాలం క్రితం రాజీవ్‌కు ఫేస్బుక్ ద్వారా బెంగళూరుకు చెందిన తేజస్వినీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తేజస్వినీ మూడు నెలల క్రితం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌పై వచ్చింది. శిరీష వ్యవహారాన్ని ఆలస్యంగా తెలుసుకున్న తేజస్వీ.. రాజీవ్‌ను నిలదీసింది. అదే సమయంలో శిరీష కూడా రాజీవ్ తనను దూరం చేస్తున్నాడని భావించింది. ఈ క్రమంలో శిరీష-తేజస్విని మధ్య గొడవ జరిగి, అదికాస్త ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అయితే రెండు రోజుల అనంతరం తేజస్వినీ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుని, తాము పరిష్కరించుకుంటామని తెలిపింది. మరోవైపు శిరీష... ఈ వ్యవహారాన్ని అంతా తనకు ఏడాది క్రితం పరిచయం అయిన శ్రావణ్‌కు తెలిపింది. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం కావాలని అడగగా, అతడు తనకు సన్నిహితుడు అయిన సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి తెలిపాడు. అతని వద్దకు వెళ్లి వివాదాన్ని పరిష్కరించుకుందామంటూ శ్రావణ్, శిరీష, రాజీవ్‌తో కలసి అక్కడకు వెళ్లారు. వెళ్లేటప్పుడు తమతో మద్యాన్ని తీసుకు వెళ్లారు. ఎస్ఐ క్వార్టర్స్‌లోనే వీరంతా కలిసి మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో శిరీష, రాజీవ్‌ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే సమస్య ఎంతకూ పరిష్కారం కాలేదు. దీంతో రాజీవ్, శ్రావణ్ సిగరెట్ తాగేందుకు బయటకు వెళ్లారు. గదిలో ఉన్న శిరీషపై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో రాజీవ్, శ్రావణ్‌లు లోనికి వెళ్లారు. సమస్య పరిష్కారం చేసుకుందామని తీసుకు వచ్చి ఇలా ప్రవర్తిస్తారా అంటూ శిరీష భోరున ఏడుస్తూ పెద్దగా అరవసాగింది. అయితే అలా అరవద్దొంటూ శిరీషపై రాజీవ్ చేయిచేసుకుని, అక్కడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భగా కారులో నుంచి కూడా దూకేందుకు ఆమె ప్రయత్నించడంతో శిరీషను బలవంతంగా కారులోకి తోయడంతో పాటు, కొట్టడంతో ఆమె పెదవులకు గాయాలు అయ్యాయి. తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నాక, ఆర్జే స్టూడియకు శిరీష వెళ్లింది. తాను కూడా ఇంటికి వెళతానని పైకి వెళ్లిన శిరీష ఎంతకీ కిందకు రాకపోవడంతో రాజీవ్, శ్రావణ్ వెళ్లి చూశారు. అయితే డోర్ తెరుచుకోకపోవడంతో శ్రావణ్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో శిరీష...రాజీవ్‌కు వీడియో కాల్ చేసినా, అతడు స్పందించలేదు. దాంతో కాల్ కూడా చేసింది. శ్రావణ్‌ను పంపించిన అనంతరం రాజీవ్ పైకి వెళ్లి చూసేసరికి శిరీష ఉరేసుకుని ఉంది. రాజీవ్...ఆ విషయాన్ని శ్రావణ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. రాజీవ్ వచ్చాకా అపోలో నుంచి డాక్టర్లను తీసుకు వచ్చి శిరీషను పరీక్ష చేయించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శిరీష భర్తకు సమాచారం అందించారు. మరోవైపు ఈ నెల 13న బంజారాహిల్స్ ఎస్ఐకి కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి, ఈ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అలాగే 14న మరోసారి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అదేరోజు మధ్యాహ్నం ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు.’ అని సీపీ పేర్కొన్నారు. శిరీష, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్యలేనని ఆయన తెలిపారు. నేరస్తులు చెప్పిన ప్రకారం శిరీష కూడా మద్యం సేవించిందని చెబుతున్నారని, అయితే ఆమె మద్యం సేవించిందా లేదా అనేది మెడికల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాతే తేలుతుందని సీఐ చెప్పారు. మరోవైపు మృతురాలు శిరీష సోదరి భార్గవి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న తేజస్వినీని పోలీసులు ఎందుకు విచారణ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. -
బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యే
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యనని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఏ-1 శ్రావణ్, ఏ-2 రాజీవ్‌లను నిందితులుగా చేర్చారు. అలాగే శిరీష, శ్రావణ్, రాజీవ్ సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి వెల్లినట్లు పోలీసులు నిర్థారించారు. ఆ రాత్రి శిరీషతో పాటు రాజీవ్, శ్రావణ్, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మద్యం సేవించినట్లు పోలీసులు వెల్లడించారు. పార్టీ అనంతరం ఒంటరిగా ఉన్న శిరీషపట్ల ఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు శ్రావణ్, రాజీవ్ పోలీసులు విచారణలో తెలిపారు. అతడి చేష్టలతో అవాక్కయిన శిరీష మనస్తాపం చెందిందని, ఒక్కసారిగా ఆమె పెద్దగా అరవడంతో బయట ఉన్న రాజీవ్, శ్రావణ్ లోనికి వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మహేందర్ రెడ్డి మీడియాకు వివరించారు. -
శిరీష మృతికి కారణాలు తెలియదు: సతీష్ చంద్ర
హైదరాబాద్ : తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష భర్త సతీష్ చంద్ర అన్నారు. భార్య మరణంపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు సమగ్రంగా విచారణ జరిపితే అసలు విషయం బయటకు వస్తుందన్నారు. కాగా శ్రీకృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి అలియాజ్ శిరీష (28) ఫిలింనగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్ఆర్గా పనిచేస్తున్నది. మంగళవారం ఉదయం ఆమె తన కార్యాలయంలో మృతదేహమై కనిపించింది. దీంతో తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్జే ఫోటోగ్రఫీ యజమాని రాజీవ్, అతడి స్నేహితుడు శ్రావణ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే శిరీష మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు ముందు శిరీష, రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్ బయటకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. వీరు ముగ్గురు కలిసి మద్యం సేవించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలతో శిరీషది ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు శిరీష మరణపై ఆమె తల్లి రామలక్ష్మి స్పందించారు. తన కూతురు చచ్చిపోయేంత పిరికిది కాదన్నారు. తన కూతుర్ని కావాలని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. శిరీష హ్యాండ్ బ్యాగ్ తెగిపోయి ఉందనిచ ముఖంపై గాయాలు కనిపిస్తున్నాయన్నారు. తన కుమార్తె పీక నులిమి చంపేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని రామలక్ష్మి ఆరోపించారు. పోలీసులు, ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ కూతురు చావుకు వల్లభనేని రాజ్‌కుమార్ అలియాస్ రాజీవ్, అతని ప్రియురాలు తేజస్వి, శ్రావణ్ లే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. -
శిరీష కుకునూరుపల్లికి ఎందుకు వెళ్లింది?
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు శిరీష కుకునూరుపల్లికి ఎందుకు వెళ్లింది? ఆమెతో పాటు ఉన్న రాజీవ్, శ్రవణ్‌లతో పాటు ఉన్న మరో ఇద్దరు ఎవరనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా రాజీవ్ ఫోటో స్టూడియోలో ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డిని కలిసేందుకు రాజీవ్, శ్రావణ్, శిరీష మొన్న రాత్రి (సోమవారం) కుకునూరుపల్లి వెళ్లారు. రాత్రి రెండున్నర వరకూ వీరి మధ్య పంచాయితీ కొనసాగిందని, ఆ సమయంలో రాజీవ్, శిరీష మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో శిరీష కారులో నుంచి దూకేందుకు యత్నించగా, వారు ఆపినట్లు సమాచారం. అనంతరం ఫోటో స్టూడియోకు వచ్చిన తర్వాత శిరీష ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కాగా శిరీష, రాజీవ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజీవ్‌పై గతంలో తను అనే యువతి ఫిర్యాదు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. అయితే ఈ కేసుకు సంబంధించి తాము ఇప్పుడే ఏం చెప్పలేమని, ఉన్నతాధికారులు వెల్లడిస్తారని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. -
ఎస్ఐ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి ఘటనకు ఎస్ఐకి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ రోజు ఉదయం శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఈరోజు మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా శ్రీకృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి అలియాజ్ శిరీష (28) ఫిలింనగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్ఆర్గా పనిచేస్తున్నది. మంగళవారం ఉదయం ఆమె తన కార్యాలయంలో మృతదేహమై కనిపించింది. దీంతో తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ ఘటనకు ముందు శిరీష, రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్ బయటకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. వీరు ముగ్గురు కలిసి మద్యం సేవించినట్లు గుర్తించారు. ముగ్గురికి వివాదాలు ఉన్నాయని, వీరి మధ్య మంగళవారం తెల్లవారుజామున రెండున్నర వరకూ పంచాయితీ కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిరీషది ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఆర్జే ఫొటోగ్రఫీ సంస్థ యజమాని వల్లభనేని రాజీవ్‌ను ప్రశ్నించగా రాత్రి రెండుగంటల ప్రాంతంలో శిరీష ఫ్యాన్‌కు ఉరేసుకుందని తానే చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని చెప్పినట్లు సమాచారం. రెండోసారి విచారించగా బాత్రూంలో ఆత్మహత్య చేసుకుందని చెబుతుండటంతో అనుమానాలు బలపడ్డాయి. అలాగే రాజీవ్‌తో పాటు అతడి స్నేహితుడిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
సతీశ్ చంద్రపై మండిపడ్డ అయ్యన్నపాత్రుడు
-
సీఎం బాబుకు ముఖ్య కార్యదర్శిగా సతీష్ చంద్ర
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుకు ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సతీష్ చంద్ర నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్లో రెసిడెంట్ కమిషనర్‌గాను, అక్కడే సీఎం ముఖ్యకార్యదర్శిగాను సతీష్ చంద్ర వ్యవహరిస్తున్నారు. ఆయనను సీఎం ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేస్తూ సీఎస్ ఐ.వై.ఆర్. కృష్ణారావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న జి. జయలక్ష్మిని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఏపీ వైద్య, ఆరోగ్య, గృహ, మౌలిక సదుపాయాల సంస్థ మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న ఎం. రవిచంద్రను ఎక్సైజ్ కమిషనర్‌గా, చేనేత జౌళి శాఖ డెరైక్టర్‌గా ఉన్న కె.వి. సత్యనారాయణను ఏపీఐఐసీ ఎండీగా బదిలీ చేశారు. -
8న బళ్లారిలో కే-సెట్
= 32 సబ్జెక్టులకు ఐదు కేంద్రాల్లో పరీక్షలు = వీఎస్కేయూ వీసీ మంజప్ప హొసమనె సాక్షి, బళ్లారి : బళ్లారి నగరంలో ఈనెల 8వ తేదీన కేసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ)వైస్ చాన్స్‌లర్ మంజప్ప హొసమనె తెలిపారు. నగర శివార్లలోని వీఎస్కేయూలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 నోడల్ కేంద్రాల్లో కేసెట్ పరీక్షలు జరుపుతున్నారని, అందులో భాగంగా బళ్లారి నగరంలోని సరళాదేవి సతీష్‌చంద్ర అగర్వాల్,ప్రభుత్వ ఎక్స్ మున్సిపల్ పీయూ కళాశాల, బసవరాజేశ్వరి పబ్లిక్ స్కూల్ అండ్ కాలేజీ, వాసవీ పీయూ కళాశాల, గాంధీనగర్ చైతన్య పీయూ కళాశాల కేంద్రాల్లో 32 సబ్జెక్ట్‌లకు సంబంధించి పరీక్షలు జరుగుతాయన్నారు. సబ్జెక్టులవారిగీ కేంద్రాలు కన్నడ, కెమికల్ సైన్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించి సరళాదేవి కళాశాలలో, కన్నడ, లైబ్రరీ సైన్స్, హిందీ, ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సైకాలజీకి సంబంధించి ఎక్స్ మున్సిపల్ కళాశాలలో, ఎకనామిక్స్ సోషియల్ వర్క్, లైఫ్ సైన్స్, మేనేజ్మెంట్ మాస్ కమ్యూనికేషన్, ఉర్దూ బసవరాజేశ్వరీ పీయూ కళాశాలలో, సోషియాలజీ, మేథమెటికల్ సైన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్, పర్యావరణ పరిరక్షణ సమితి ఎగ్జామ్స్, అర్థ్ సైన్స్, లా, హోంసైన్స్ వాసవీ పీయూ కళాశాలలో, హిస్టరీ, ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫి, సాంస్కృతికం, ఫ్లో లిటరేచర్, పబ్లిక్ అడ్మిస్ట్రేషన్ చైతన్య కళాశాలలో ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం బళ్లారి సెంటర్లలో 3626 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు అందజేశారన్నారు. ఫస్ట్, సెకెండ్ పేపర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మూడవ పేపర్ మధ్యాహ్నం 1.30 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.