శిరీష కుకునూరుపల్లికి ఎందుకు వెళ్లింది? | why did beautician sirisha go to kukunoore | Sakshi
Sakshi News home page

శిరీష కుకునూరుపల్లికి ఎందుకు వెళ్లింది?

Published Wed, Jun 14 2017 6:17 PM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM

శిరీష కుకునూరుపల్లికి ఎందుకు వెళ్లింది? - Sakshi

శిరీష కుకునూరుపల్లికి ఎందుకు వెళ్లింది?

హైదరాబాద్‌ : బ్యూటీషియన్‌ శిరీష ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు శిరీష కుకునూరుపల్లికి ఎందుకు వెళ్లింది?  ఆమెతో పాటు ఉన్న రాజీవ్‌, శ్రవణ్‌లతో పాటు ఉన్న మరో ఇద్దరు ఎవరనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా రాజీవ్‌ ఫోటో స్టూడియోలో ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది కూడా ఇంకా మిస్టరీగానే ఉంది.

ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డిని కలిసేందుకు రాజీవ్‌, శ్రావణ్‌, శిరీష  మొన్న రాత్రి (సోమవారం) కుకునూరుపల్లి వెళ్లారు. రాత్రి రెండున్నర వరకూ వీరి మధ్య పంచాయితీ కొనసాగిందని, ఆ సమయంలో రాజీవ్‌, శిరీష మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో శిరీష కారులో నుంచి దూకేందుకు యత్నించగా, వారు ఆపినట్లు సమాచారం.

అనంతరం ఫోటో స్టూడియోకు వచ్చిన తర్వాత శిరీష ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కాగా శిరీష, రాజీవ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజీవ్‌పై గతంలో తను అనే యువతి ఫిర్యాదు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. అయితే ఈ కేసుకు సంబంధించి తాము ఇప్పుడే ఏం చెప్పలేమని, ఉన్నతాధికారులు వెల్లడిస్తారని బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement