beautician suicide
-
బ్యూటీషియన్ ఆత్మహత్య..
మలక్‌పేట: సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఓ బ్యూటీషియన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మేళ్లచేర్వు మండలం మల్లారెడ్ది గూడెం గ్రామానికి చెందిన డేవిడ్‌రాజ్ ఎలక్ట్రిషియన్ కుమార్తె పి.హిమబిందు (22) బ్యూటీషియన్ కోర్సు శిక్షణ కోసం మూడేళ్ల క్రితం నగరానికి వచ్చింది. ఆస్మాన్‌గఢ్ వెంకటాద్రినగర్ ధాత్రి నిలయంలో ఉంటున్న స్వాతితో ఆమెకు పరిచయమైంది. అప్పటి నుంచి బ్యూటిషియన్ హెల్పర్‌గా స్వాతి వద్ద పని చేస్తూ ఆమె కుటుంబంతో ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో స్వాతి సోదరుడు సాయికిషోర్ పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసి హిమబిందు తన బెడ్రూమ్లో ఉరేసుకుందని, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిదని సమాచారం అందించాడు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఎస్సై బాలరాజ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయి కిషోర్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తుండగా... ప్రేమ వ్యవహారమే హిమబిందు ఆత్మహత్యకు కారణమై ఉంటుదని పోలీసులు భావిస్తున్నారు. -
శిరీష మృతికేసు విచారణ ముగిసింది: డీసీపీ
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన బ్యుటీషియన్ శిరీష మృతి కేసులో విచారణ ముగిసిందని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. శిరీషపై అత్యాచారం జరగలేదని... ఉరి వేసుకోవడం వల్లే చనిపోయినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలోనూ స్పష్టమైందని ఆయన అన్నారు. శిరీష్‌ది హత్య అంటూ ఆమె కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌కు శిక్షపడేలా అన్ని చర్యలు తీసుకుంటామంటున్న డీసీపీ తెలిపారు. కాగా శిరీష మృతి కేసులో కీలక నివేదిక బయటకొచ్చింది. అత్యాచారం జరగలేదు.. ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఆ నివేదికను బంజారాహిల్స్ పోలీసులకు అందించారు. శిరీష దుస్తులపై ఉన్న మరకలు ఆహారానికి సంబంధించినవని ఆ నివేదికలో పేర్కొంది. కాగా, కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న కేసుపై విచారణ కొనసాగుతున్నదని పోలీసు వర్గాలు తెలిపారు. రెండు రోజుల్లో ఫోరెన్సిక్ నివేదికను అధికారికంగా వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా శిరీష ఆత్మహత్య కేసు విచారణకు సంబంధించి తమను కుకునూర్‌పల్లి తీసుకెళ్లి తమ అనుమానాలను పోలీసులు నివృత్తి చేయలేదని ఆమె బంధువులు తెలిపారు. ఆమె మృతిపై తమకు ఇప్పటికీ అనుమానాలున్నాయని వారు పేర్కొన్నారు. నిందితులకు బెయిల్ నిరాకరణ ఈ కేసులో నిందితులు రాజీవ్, శ్రావణ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు శుక్రవారం తిరస్కరించింది. శిరీష కుటుంబసభ్యుల అనుమానాలపై దర్యాప్తు దృష్ట్యా బెయిల్ నిరాకరిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. -
శిరీషపై అత్యాచారం జరగలేదు!
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీషపై అత్యాచారం జరగలేదని ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందినట్లు తెలుస్తోంది. శిరీష దుస్తులపై ఉన్న మరకల ఆధారంగా ఈ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కాగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక తమకు ఇంకా అందలేదని పోలీసులు చెబుతునక్నారు. అయితే ఫోరెన్సిక్ పరీక్ష రిపోర్ట్ పూర్తిస్థాయిలో వస్తేనే ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది అధికారికంగా, స్పష్టంగా చెప్పగలమని పోలీసులు చెబుతున్నారు. అయితే శిరీషపై అత్యాచారం జరగలేదని నిందితులు రాజీవ్, శ్రావణ్‌లు విచారణలో చెప్పారని, హైదరాబాద్ నుంచి కుకునూర్‌పల్లి వరకూ ఆరుచోట్ల సీసీ ఫుటేజ్ సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్జే స్టూడియోలో రాజీవ్‌కు సంబంధించిన వీడియోలు సేకరించినట్లు పేర్కొన్నారు. కాగా కుకునూర్‌పల్లిలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆమెపై అత్యాచారయత్నం చేయడంతో పాటు అనంతరం జరిగిన ఉదంతం నేపథ్యంలోనే మనస్తాపంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని, ఆమెది ముమ్మాటికీ ఆత్మహత్యేనని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే శిరీష కుటుంబసభ్యులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ముమ్మాటికీ హత్యనేని ఆరోపిస్తున్నారు. మరోవైపు శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు బోదాసు శ్రవణ్(21), వల్లభనేని రాజీవ్ (31) పోలీస్ కస్టడీ ముగియడంతో వారిని నిన్న కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
‘కసబ్ కంటే శిరీష కేసు పెద్దది కాదు’
హైదరాబాద్ :ముంబైలో దాడులకు పాల్పడ్డ పాక్ ఉగ్రవాది కసబ్ కేసు కంటే బ్యూటీషియన్ శిరీష మృతి కేసు పెద్దది కాదని ఈ కేసులో ప్రధాన నిందితుల తరఫు న్యాయవాది వెంకట్ వ్యాఖ్యానించారు. పోలీసుల విచారణ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కాగా ఈ కేసులో సమగ్ర విచారణ నిమిత్తం నిందితులు శ్రావణ్, రాజీవ్‌లను బంజారాహిల్స్ పోలీసులు ఇవాళ తమ కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు వారిని పోలీసులు విచారణ చేయనున్నారు. అంతకు ముందు వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపైన కూడా సమగ్రంగా విచారణ జరపనున్నారు. శిరీష మృతి కేసులో సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ‘శిరీష ఆత్మహత్య చేసుకుందా?, హత్యకు గురయిందా?. ఆమెను కుకునూర్‌పల్లిలో ఏ సెటిల్మెంట్కు తీసుకు వెళ్లారు. ఇంతకీ శిరీష డిమాండ్ ఏంటి?. రాజీవ్ ఏం కావాలనుకున్నాడు. కుకునూర్‌పల్లిలో ఏం జరిగింది.అక్కడ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రాలేదు?. ఉద్దేశపూర్వకంగానే శిరీషను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి అప్పగించారా? ఈ కేసులో తేజస్విని పాత్ర ఏంటి?. తేజస్విని ఇప్పటివరకు పోలీసులు ఎందుకు విచారించలేదు?. శిరీష ఆడియో రికార్డింగ్‌లు ఎవరు బయటపెట్టారు?. కుకునూర్‌పల్లి నుంచి వచ్చే దారిలో శిరీషను ఎందుకు కొట్టారు?. అసలు ఆర్జే స్టూడియోలో ఏం జరిగింది? సీసీ పుటేజ్ ఎందుకు బయటకు రాలేదు?. కాల్ రికార్డులో ఉన్న నందు, నవీన్ ఎవరు?. వారిని పోలీసులు విచారించారా?. తేజస్విని సంగతి చూడమని శిరీష ఎవరెవరికి చెప్పింది?. ఆమెను ఎవరెవరు బెదిరించారు?. ఈ విషయం రాజీవ్‌కు తెలుసా?.’ అనే ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు మాత్రం బయటకు రాలేదు. -
శిరీషపై ఎస్ఐ రేప్ అటెంప్ట్ చేశాడు..కానీ..
- మృతురాలి శరీరభాగాలను భద్రపరిచాం.. పరీక్షల తర్వాత మరిన్ని వివరాలు - సంచలనాత్మక కేసు వివరాలను వెల్లడించిన సీపీ మహేందర్ రెడ్డి - ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి శిరీషను తీసుకెళ్లడంలో శ్రావణ్ కుట్ర - శిరీష కేసులో ఏ1గా శ్రావణ్, ఏ2గా రాజీవ్ - ఎస్సై ఆత్మహత్యకేసులో విడిగా దర్యాప్తు సాగుతోందన్న కొత్వాల్ హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీషపై కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచార యత్నం చేశాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రేప్ అటెంప్ట్ సమయంలో శిరీష గట్టిగా కేకలు వేసిందని, ‘నేను అలాంటిదాన్ని కాను..’ ఎస్సైని వేడుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనతోపాటు హైదరాబాద్ తిరుగుప్రయాణంలో రాజీవ్, శ్రావణ్‌లు పలు మార్లు కొట్టడంతో మనస్తాపానికి గురైన శిరీష్ ఆత్మహత్య చేసుకుందని సీపీ వివరించారు. ఈ కేసుకు సంబంధించి శ్రావణ్‌ను ఏ1గా, రాజీవ్‌ను ఏ2గా చేర్చామని చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదికలో కూడా శిరీష ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయి ఉండొచ్చని వైద్యులు పేర్కొన్నట్లు కమిషనర్ మహేందర్‌రెడ్డి చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే.. ‘‘విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్ కుమార్ హైదరాబాద్‌లో ఆర్జే ఫోటోగ్రఫీ పేరుతో స్టూడియో నిర్వహిస్తున్నాడు. అతని స్టూడియోలో శిరీష నాలుగేళ్లుగా పని చేస్తోంది, వీరి మధ్య క్రమంగా సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కొంతకాలం క్రితం రాజీవ్‌కు ఫేస్బుక్ ద్వారా బెంగళూరుకు చెందిన తేజస్వినీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తేజస్వినీ మూడు నెలల క్రితం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌పై వచ్చింది. శిరీష వ్యవహారాన్ని ఆలస్యంగా తెలుసుకున్న తేజస్వీ.. రాజీవ్‌ను నిలదీసింది. అదే సమయంలో శిరీష కూడా రాజీవ్ తనను దూరం చేస్తున్నాడని భావించింది. ఈ క్రమంలో శిరీష-తేజస్విని మధ్య గొడవ జరిగి, అదికాస్త ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అయితే రెండు రోజుల అనంతరం తేజస్వినీ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుని, తాము పరిష్కరించుకుంటామని తెలిపింది. మరోవైపు శిరీష... ఈ వ్యవహారాన్ని అంతా తనకు ఏడాది క్రితం పరిచయం అయిన శ్రావణ్‌కు తెలిపింది. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం కావాలని అడగగా, అతడు తనకు సన్నిహితుడు అయిన సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి తెలిపాడు. అతని వద్దకు వెళ్లి వివాదాన్ని పరిష్కరించుకుందామంటూ శ్రావణ్, శిరీష, రాజీవ్‌తో కలసి అక్కడకు వెళ్లారు. వెళ్లేటప్పుడు తమతో మద్యాన్ని తీసుకు వెళ్లారు. ఎస్ఐ క్వార్టర్స్‌లోనే వీరంతా కలిసి మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో శిరీష, రాజీవ్‌ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే సమస్య ఎంతకూ పరిష్కారం కాలేదు. దీంతో రాజీవ్, శ్రావణ్ సిగరెట్ తాగేందుకు బయటకు వెళ్లారు. గదిలో ఉన్న శిరీషపై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో రాజీవ్, శ్రావణ్‌లు లోనికి వెళ్లారు. సమస్య పరిష్కారం చేసుకుందామని తీసుకు వచ్చి ఇలా ప్రవర్తిస్తారా అంటూ శిరీష భోరున ఏడుస్తూ పెద్దగా అరవసాగింది. అయితే అలా అరవద్దొంటూ శిరీషపై రాజీవ్ చేయిచేసుకుని, అక్కడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భగా కారులో నుంచి కూడా దూకేందుకు ఆమె ప్రయత్నించడంతో శిరీషను బలవంతంగా కారులోకి తోయడంతో పాటు, కొట్టడంతో ఆమె పెదవులకు గాయాలు అయ్యాయి. తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నాక, ఆర్జే స్టూడియకు శిరీష వెళ్లింది. తాను కూడా ఇంటికి వెళతానని పైకి వెళ్లిన శిరీష ఎంతకీ కిందకు రాకపోవడంతో రాజీవ్, శ్రావణ్ వెళ్లి చూశారు. అయితే డోర్ తెరుచుకోకపోవడంతో శ్రావణ్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో శిరీష...రాజీవ్‌కు వీడియో కాల్ చేసినా, అతడు స్పందించలేదు. దాంతో కాల్ కూడా చేసింది. శ్రావణ్‌ను పంపించిన అనంతరం రాజీవ్ పైకి వెళ్లి చూసేసరికి శిరీష ఉరేసుకుని ఉంది. రాజీవ్...ఆ విషయాన్ని శ్రావణ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. రాజీవ్ వచ్చాకా అపోలో నుంచి డాక్టర్లను తీసుకు వచ్చి శిరీషను పరీక్ష చేయించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శిరీష భర్తకు సమాచారం అందించారు. మరోవైపు ఈ నెల 13న బంజారాహిల్స్ ఎస్ఐకి కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి, ఈ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అలాగే 14న మరోసారి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అదేరోజు మధ్యాహ్నం ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు.’ అని సీపీ పేర్కొన్నారు. శిరీష, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్యలేనని ఆయన తెలిపారు. నేరస్తులు చెప్పిన ప్రకారం శిరీష కూడా మద్యం సేవించిందని చెబుతున్నారని, అయితే ఆమె మద్యం సేవించిందా లేదా అనేది మెడికల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాతే తేలుతుందని సీఐ చెప్పారు. మరోవైపు మృతురాలు శిరీష సోదరి భార్గవి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న తేజస్వినీని పోలీసులు ఎందుకు విచారణ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. -
బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యే
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యనని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఏ-1 శ్రావణ్, ఏ-2 రాజీవ్‌లను నిందితులుగా చేర్చారు. అలాగే శిరీష, శ్రావణ్, రాజీవ్ సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి వెల్లినట్లు పోలీసులు నిర్థారించారు. ఆ రాత్రి శిరీషతో పాటు రాజీవ్, శ్రావణ్, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మద్యం సేవించినట్లు పోలీసులు వెల్లడించారు. పార్టీ అనంతరం ఒంటరిగా ఉన్న శిరీషపట్ల ఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు శ్రావణ్, రాజీవ్ పోలీసులు విచారణలో తెలిపారు. అతడి చేష్టలతో అవాక్కయిన శిరీష మనస్తాపం చెందిందని, ఒక్కసారిగా ఆమె పెద్దగా అరవడంతో బయట ఉన్న రాజీవ్, శ్రావణ్ లోనికి వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మహేందర్ రెడ్డి మీడియాకు వివరించారు. -
శిరీష మృతికి కారణాలు తెలియదు: సతీష్ చంద్ర
హైదరాబాద్ : తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష భర్త సతీష్ చంద్ర అన్నారు. భార్య మరణంపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు సమగ్రంగా విచారణ జరిపితే అసలు విషయం బయటకు వస్తుందన్నారు. కాగా శ్రీకృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి అలియాజ్ శిరీష (28) ఫిలింనగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్ఆర్గా పనిచేస్తున్నది. మంగళవారం ఉదయం ఆమె తన కార్యాలయంలో మృతదేహమై కనిపించింది. దీంతో తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్జే ఫోటోగ్రఫీ యజమాని రాజీవ్, అతడి స్నేహితుడు శ్రావణ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే శిరీష మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు ముందు శిరీష, రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్ బయటకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. వీరు ముగ్గురు కలిసి మద్యం సేవించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలతో శిరీషది ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు శిరీష మరణపై ఆమె తల్లి రామలక్ష్మి స్పందించారు. తన కూతురు చచ్చిపోయేంత పిరికిది కాదన్నారు. తన కూతుర్ని కావాలని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. శిరీష హ్యాండ్ బ్యాగ్ తెగిపోయి ఉందనిచ ముఖంపై గాయాలు కనిపిస్తున్నాయన్నారు. తన కుమార్తె పీక నులిమి చంపేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని రామలక్ష్మి ఆరోపించారు. పోలీసులు, ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ కూతురు చావుకు వల్లభనేని రాజ్‌కుమార్ అలియాస్ రాజీవ్, అతని ప్రియురాలు తేజస్వి, శ్రావణ్ లే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. -
ఎస్సై ప్రభాకర్‌రెడ్డిది హత్యే!!
హైదరాబాద్: ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అనుమానాస్పద మృతి వ్యవహారంతో సిద్దిపేట జిల్లా కుకునూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్ని నెలల కిందట కుకునూర్ పోలీసు స్టేషన్లోనే ఓ ఎస్సై ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌కు చెందిన బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతికి ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి సంబంధం ఉందని, మద్యం మత్తులో శిరీషపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో కుకునూర్‌లో గ్రామస్తులు భగ్గుమన్నారు. మీడియాలో కథనాలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. చనిపోయిన ప్రభాకర్‌రెడ్డిపై అభాండలు వేస్తున్నారని, ఆయనకు శిరీషతో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు చేయడం తగదని వారు అంటున్నారు. ప్రభాకర్‌రెడ్డి వ్యక్తిత్వం గురించి కుకునూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని 26 గ్రామాల ప్రజలకు తెలుసునని, ఆయన అలాంటి వ్యక్తి కాదని, పోలీసులు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ఇలాంటి కథనాలు ప్రసారం చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి మృతి వెనుక పోలీసులు ఒత్తిడి ఉండి ఉంటుందని, ఆయనది హత్యే అయి ఉండవచ్చునని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు. చదవండి:ఎస్ఐ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ -
శిరీష కుకునూరుపల్లికి ఎందుకు వెళ్లింది?
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు శిరీష కుకునూరుపల్లికి ఎందుకు వెళ్లింది? ఆమెతో పాటు ఉన్న రాజీవ్, శ్రవణ్‌లతో పాటు ఉన్న మరో ఇద్దరు ఎవరనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా రాజీవ్ ఫోటో స్టూడియోలో ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డిని కలిసేందుకు రాజీవ్, శ్రావణ్, శిరీష మొన్న రాత్రి (సోమవారం) కుకునూరుపల్లి వెళ్లారు. రాత్రి రెండున్నర వరకూ వీరి మధ్య పంచాయితీ కొనసాగిందని, ఆ సమయంలో రాజీవ్, శిరీష మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో శిరీష కారులో నుంచి దూకేందుకు యత్నించగా, వారు ఆపినట్లు సమాచారం. అనంతరం ఫోటో స్టూడియోకు వచ్చిన తర్వాత శిరీష ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కాగా శిరీష, రాజీవ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజీవ్‌పై గతంలో తను అనే యువతి ఫిర్యాదు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. అయితే ఈ కేసుకు సంబంధించి తాము ఇప్పుడే ఏం చెప్పలేమని, ఉన్నతాధికారులు వెల్లడిస్తారని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. -
ఎస్ఐ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి ఘటనకు ఎస్ఐకి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ రోజు ఉదయం శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఈరోజు మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా శ్రీకృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి అలియాజ్ శిరీష (28) ఫిలింనగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్ఆర్గా పనిచేస్తున్నది. మంగళవారం ఉదయం ఆమె తన కార్యాలయంలో మృతదేహమై కనిపించింది. దీంతో తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ ఘటనకు ముందు శిరీష, రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్ బయటకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. వీరు ముగ్గురు కలిసి మద్యం సేవించినట్లు గుర్తించారు. ముగ్గురికి వివాదాలు ఉన్నాయని, వీరి మధ్య మంగళవారం తెల్లవారుజామున రెండున్నర వరకూ పంచాయితీ కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిరీషది ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఆర్జే ఫొటోగ్రఫీ సంస్థ యజమాని వల్లభనేని రాజీవ్‌ను ప్రశ్నించగా రాత్రి రెండుగంటల ప్రాంతంలో శిరీష ఫ్యాన్‌కు ఉరేసుకుందని తానే చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని చెప్పినట్లు సమాచారం. రెండోసారి విచారించగా బాత్రూంలో ఆత్మహత్య చేసుకుందని చెబుతుండటంతో అనుమానాలు బలపడ్డాయి. అలాగే రాజీవ్‌తో పాటు అతడి స్నేహితుడిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి
బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో ఓ బ్యూటీషియన్ మృతిచెందింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీకృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి అలియాజ్ శిరీష (28) ఫిలింనగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్ఆర్గా పనిచేస్తున్నది. సోమవారం రాత్రి 8–40 గంటలకు తన భర్త సతీష్‌చంద్రకు ఫోన్‌చేసి తాను ఆలస్యంగా వస్తానని చెప్పింది. అయితే రాత్రికి ఆమె ఇంటికి రాలేదు. ఎప్పటిలాగానే సతీష్ మంగళవారం ఉదయం బేగంపేటలోని తాను కుక్‌గా పనిచేసే ఆశ్రయ్–ఆకృతి పాఠశాలకు వెళ్ళారు. తరువాత సతీష్‌చంద్రకు బంజారాహిల్స్ పోలీసులు ఫోన్‌చేసి ఫిలింనగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీ కార్యాలయానికి రావాలని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూడగా మంచంపైన భార్య శిరీష మృతదేహం కనిపించింది. యజమాని వల్లభనేని రాజీవ్‌ను ఏమైందని ప్రశ్నించగా రాత్రి 2 గంటల ప్రాంతంలో ఫ్యాన్‌కు ఉరేసుకుందని తానే చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని తెలిపారు. తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు పిర్యాదుచేశారు. ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరికి 12 సంవత్సరాల కూతురు ఉంది.