బ్యూటీషియన్‌ శిరీషది ఆత్మహత్యే | beautician sirisha death case: Hyderabad Police present the accused before media | Sakshi
Sakshi News home page

బ్యూటీషియన్‌ శిరీషది ఆత్మహత్యే

Published Fri, Jun 16 2017 2:13 PM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM

బ్యూటీషియన్‌ శిరీషది ఆత్మహత్యే - Sakshi

బ్యూటీషియన్‌ శిరీషది ఆత్మహత్యే

హైదరాబాద్‌ : సంచలనం సృష్టించిన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్‌ శిరీషది ఆత్మహత్యనని పోలీసులు తేల్చారు. ఈ కేసులో  ఏ-1 శ్రావణ్‌, ఏ-2 రాజీవ్‌లను నిందితులుగా చేర్చారు. అలాగే శిరీష, శ్రావణ్‌, రాజీవ్‌ సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి వెల్లినట్లు పోలీసులు నిర్థారించారు. ఆ రాత్రి శిరీషతో పాటు రాజీవ్‌, శ్రావణ్‌, ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి మద్యం సేవించినట్లు పోలీసులు వెల్లడించారు.

పార్టీ అనంతరం ఒంటరిగా ఉన్న శిరీషపట్ల ఎస్‌ఐ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు శ్రావణ్‌, రాజీవ్‌ పోలీసులు విచారణలో తెలిపారు.  అతడి చేష్టలతో అవాక్కయిన శిరీష మనస్తాపం చెందిందని, ఒక్కసారిగా ఆమె పెద్దగా అరవడంతో బయట ఉన్న రాజీవ్‌, శ్రావణ్‌ లోనికి వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మహేందర్‌ రెడ్డి మీడియాకు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement