Sirisha
-
మేయర్ అనే కాదు.. మహిళా అని కూడా చూడకుండా..
-
షణ్ముగ శ్రీనివాస్‌కు స్వర్ణం... శిరీషకు కాంస్యం
ఇండియన్ గ్రాండ్‌ప్రి–2 అథ్లెటిక్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు పతకాలతో మెరిశారు. గురువారం చెన్నైలో జరిగిన పురుషుల 200 మీటర్ల విభాగంలో నలబోతు షణ్ముగ శ్రీనివాస్ స్వర్ణ పతకం సాధించగా... మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో ముగద శిరీష కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. 21 ఏళ్ల షణ్ముగ శ్రీనివాస్ అందరికంటే వేగంగా 21.18 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. ఇదే నెలలో భువనేశ్వర్‌లో జరిగిన ఫెడరేషన్ కప్ చాంపియన్‌షిప్‌లో షణ్ముగ రజత పతకం సాధించాడు. మూడేళ్ల క్రితం కెన్యాలో జరిగిన అండర్–20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్íÙప్లో శ్రీనివాస్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 400 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 20 ఏళ్ల శిరీష 1ని:03.06 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శిరీష ఖేలో ఇండియా గేమ్స్‌లోనూ కాంస్య పతకం సాధించింది. -
మన్యంలో మోసగాడిగా.. పచ్చ నేత! యథేచ్ఛగా మేత!!
పాడేరు: మఠం భాస్కర్.. రంపచోడవరం నియోజకవర్గంలో ఈయన పేరు తెలియని వారండరు.. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో సిద్ధహస్తుడు. సొంతూరు రాజవొమ్మంగి మండలం అనంతగిరి. రంపచోడవరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మిరియాల శిరీషాదేవికి భర్త. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ.కోటి వరకు గతంలో వసూలు చేశాడు.. ఆ సొమ్ముకోసం ఇప్పటికీ బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆయన నేరచరిత్ర కూడా పెద్దదే. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన పలు కేసుల్లో నిందితుడు. నిరుద్యోగులకు మంచి జరగాలంటే భార్య శిరీషాదేవికి ఓటేయాలని ఇప్పుడు అభ్యర్థిస్తున్నాడు. అతను మాటలు నమ్మితే మన్యాన్ని మడత పెట్టేస్తాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.సార్వత్రిక ఎన్నికల్లో రంపచోడవరం అసెంబ్లీకి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి మఠం భాస్కర్ రాజవొమ్మంగి పోలీసు స్టేషన్లో నమోదైన పలు కేసుల్లో నిందితుడు. ఏజెన్సీలో గిరిజన యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని రెండేళ్ల క్రితం వారి నుంచి సుమారు రూ.కోటి వరకు డబ్బులు వసూలు చేశాడు. నియోజకవర్గంలోని రాజవొమ్మంగి, జడ్డంగి, దేవీపట్నం, వీఆర్‌పురం, డొంకరాయి, అడ్డతీగల గ్రామాల్లో ఆయన ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు ఎంతోమంది ఉన్నారని ప్రచారం జరుగుతోంది.రాజవొమ్మంగి మండలం చికిలింత గ్రామానికి చెందిన గిరిజన యువకుడికి ఓ ఎయిడెడ్ స్కూల్లో టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.3 లక్షల వరకు తన ఖాతాకు నగదు బదిలీ చేయించుకున్నట్టు సమాచారం. ఇందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన టీడీపీకి చెందిన ఓ నాయకుడు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని అడిగినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చే వరకు అడగవద్దని హెచ్చరించినట్టు తెలిసింది.అడ్డతీగల మండలం దుప్పులపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు గిరిజన యువకుల నుంచి సీఆర్టీ పోస్టు ఇప్పిస్తానని ఒకొక్కరి నుంచి రూ.లక్ష చొప్పన మూడు లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా మరో యువకుడి నుంచి టీచర్ పోస్టు ఇప్పిస్తానని రూ.లక్ష, గుమస్తా పోస్టుకు రూ. 60 వేలు మధ్యవర్తుల సమక్షంలో వసూలు చేసినట్టు సమాచారం. ఇలా తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించేందుకు ఒప్పుకున్న మఠం భాస్కర్ పూర్తిగా చెల్లించిన దాఖల్లాలేవు. ఉద్యోగాలు మాట దేవుడెరుగు మా డబ్బులు మాకివ్వండి అంటూ గిరిజన యువత గగ్గోలు పెట్టిన ఫలితం లేకుండా పోయింది. అయితే ఎప్పటికైనా ఎంతో కొంత మొత్తం ఇస్తాడన్న ఆశతో వారు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పేందుకు రాలేకపోతున్నారు.అసెంబ్లీ అభ్యర్థి శిరీషాదేవి భర్త మఠం భాస్కర్‌కు నేర చరిత్ర కూడా ఉంది. రాజవొమ్మంగి పోలీసుస్టేషన్లో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.2016లో రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్Œ వద్ద విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఏకే దొరపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వాహనాలను తనిఖీ చేస్తున్న అతనిపై దాడికి దిగడంతో (ఎఫ్ఐఆర్: 50/2017) అదే పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2017లో అతని స్వగ్రామం అనంతగిరిలో జీడిమామిడి తోటను దగ్ధం చేశాడు. గ్రామస్తుల సమక్షంలో బాధిత రైతుకు నష్టపరిహారం చెల్లించాలని గ్రామపెద్దలు చెప్పినప్పటికీ అందుకు అంగీకరించనట్టు తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు (ఎఫ్ఐఆర్: 15/2017) రాజవొమ్మంగి పోలీసుస్టేషన్లో కేసు నమోదు అయింది.2019లో జరిగిన ఎన్నికల సమయంలో రాజవొమ్మంగిలో గొడవకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడన్న అభియోగంపై (ఎఫ్ఐఆర్:47/2019) కేసు నమోదైంది.2022లో అనంతగిరి గ్రామ సమీపంలో అశ్లీల నృత్య ప్రదర్శన, పేకాట, గుండాట నిర్వహించాడన్న అభియోగం మేరకు అతనిపై రాజవొమ్మంగి పోలీసులు (ఎఫ్ఐఆర్: 10/2022) కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులన్నీ కోర్టులో విచారణ దశలో ఉన్నాయి.ఇవి చదవండి: కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్ కళ్యాణ్ -
బర్రెలక్క పెళ్లి సందడి
-
బర్రెలక్క ఇంట పెళ్లిసందడి.. వీడియో వైరల్!
తెలంగాణ ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన పేరు బర్రెలక్క.. ఆమె అసలు పేరు కర్నె శిరీష. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందనుకున్న శిరీష పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ఈ నెల 28న వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది. కాబోయే భర్తను పరిచయం చేస్తూ ప్రీ వెడ్డింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. తాజాగా ఇవాల్టి నుంచే బర్రెలక్క పెళ్లిసందడి షూరూ అయింది. మొదటి రోజు హల్దీ వేడుకలో భాగంగా పెళ్లి కూతురిగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. పెళ్లి పిల్లను చేస్తున్నారు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) -
బర్రెలక్క అభిమానులకు శుభవార్త
-
ఆధార్‌కార్డు మార్చే విషయంపై.. వివాహిత తీవ్ర నిర్ణయం!
నిజామాబాద్: భర్త వేధింపులతోనే వివాహిత నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి మృతిచెందినట్లు ఎస్సై సుధాకర్ గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం గండిమాసానిపేటకు చెందిన శిరీష(25), సతీశ్ దంపతులు. వీరికి ఏడాది బాబు యోగేశ్ ఉన్నాడు. తరచూ భర్త వేధింపులతో పాటు ఆధార్‌కార్డులో అడ్రస్ మార్పు విషయమై వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మానసిక వేదనకు గురైన శిరీష బుధవారం తల్లిగారింటికి వెళ్తున్నాని చెప్పి కుమారుడు యోగేశ్‌తో కలిసి బస్సులో వెళ్లింది. మార్గమధ్యలో బస్సు దిగిన శిరీష నిజాంసాగర్ ప్రధాన కాలువ సమీపంలో ఉన్న చెట్టు కింద కుమారుడు యోగేశ్‌ను కూర్చోబెట్టి తాను కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంది. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో మృతదేహం ఆచూకీ లభించలేదు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో గురువారం ఉదయం మృతదేహం లభ్యమైంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
Basara IIIT: వాడు లేని జీవితం నాకొద్దు!
భైంసా: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ ఫస్టియర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ప్రాణంగా ప్రేమించిన బావ మృతిని తట్టుకోలేకే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు లేఖ రాసింది. వర్సిటీ అధికారుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దవ్వూరుకు చెందిన తెనుగు శిరీష(17) గురువారం తన ఇంటి నుంచి వర్సిటీకి వచ్చింది. గంగా హాస్టల్లోని తన 117 గదిలోనే సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన సిబ్బంది క్యాంపస్ హెల్త్‌సెంటర్‌కి తరలించగా.. అప్పటికే మృతి చెందిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు. శిరీష మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్టు క్యాంపస్ వర్గాలు చెబుతున్నాయి. తల్లిదండ్రులకు ఆమె రాసిన ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె బావ ఈ మధ్యే మృతి చెందగా.. అది తట్టుకోలేకే శిరీష బలన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. శిరీష మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
కొల్లాపూర్ లో బర్రెలక్క ముందంజ
-
ఓటు వేసిన ఆనందంలో బర్రెలక్క మొహం చూడండి
-
బర్రెలక్కని సీఎం చేస్తా !...కేఏ పాల్ హామీ
-
బర్రెలక్క(శిరీష)కు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం
-
హైకోర్టును ఆశ్రయించిన శిరీష అలియాస్ బర్రెలక్క
-
ఎన్నికల్లో గెలిపించాలని కొల్లాపూర్ ప్రజలను కోరుతున్న బర్రెలక్క
-
ఎన్నికల్లో గెలిచి శాసన సభలో అడుగుపెడతా: బర్రెలక్క
-
బర్రెలక్కకు బిగ్‌బాస్ ఆఫర్? స్పందించిన శిరీష
హాయ్ ఫ్రెండ్స్... డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రావడం లేదు. మా అమ్మకు చెప్తే నాలుగు బర్లను కొనిచ్చింది. బర్లను కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్.. ఏడాదిన్నర కిందట వచ్చిందీ వీడియో. బీకాం చదువుకున్న శిరీష అనే యువతి ఈ వీడియో చేసింది. అప్పటినుంచి ఆమె బర్రెలక్కగా ఫేమస్ అయింది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఆమెకు బిగ్‌బాస్ షో నుంచి ఆఫర్ వచ్చిందని, ఓ కారు కూడా పంపించారంటూ ఓ పుకారు మొదలైంది. తాజా ఇంటర్వ్యూలో ఈ రూమర్‌పై స్పందించింది బర్రెలక్క. ఆమె మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ వాళ్లు నన్ను ఇంతవరకు సంప్రదించలేదు. బహుశా నా గురించి వారికి తెలియదేమో! వారి దగ్గరి నుంచి నాకు ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదు. అలాగే నాకు కారు కొనిచ్చారన్నది పూర్తిగా అవాస్తవం. అన్నవాళ్లు నేను ఇబ్బంది పడుతున్నా అని వాళ్లు నడుపుతున్న కార్లు తీసుకొచ్చి ప్రచారానికి వాడుకోమన్నారు. ఒక కారు మాత్రం ఒక అన్న ఉచితంగా ఇచ్చాడు' అని క్లారిటీ ఇచ్చింది బర్రెలక్క. చదవండి: యువతకు స్ఫూర్తినిస్తూ కొల్లాపూర్‌లో పోటీకి దిగిన బర్రెలక్క -
బరిగీసి.. బర్రెలక్క
రాష్ట్రంలోని నిరుద్యోగుల తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు శిరీష. సోషల్‌మీడియాలో ‘బర్రెలక్క’గా ప్రాచుర్యం పొందిన 26 ఏళ్ల యువతి కర్నె శిరీష. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీలో నిలవడంతో ఆమెకు వివిధ వర్గాల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే యానాం మాజీ మంత్రి, ఢిల్లీ ప్రత్యేక అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఆమె ప్రచార ఖర్చుల కోసం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఇతర ప్రాంతాల నుంచి నిరుద్యోగులు వచ్చి కొల్లాపూర్‌లో ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మద్దతుగా హోరెత్తిన ప్రచారం.. కొల్లాపూర్ నుంచి నామినేషన్ వేసిన శిరీష తాను నిరుద్యోగుల తరపున పోరాటం చేసేందుకే అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచినట్టు ప్రకటించారు. దీంతో క్రమంగా ఆమెకు సోషల్‌మీడియాతో పాటు రాష్ట్రంలోని యువత, నిరుద్యోగుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి నిరుద్యోగులు స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహించేందుకు కొల్లాపూర్‌కు తరలివస్తున్నారు. ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న ఆమె తమ్ముడు చింటూపై కొందరు యువకులు ఇటీవల దాడికి పాల్పడటంపై నిరుద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఈ ఘటనపై ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శిరీషకు మద్దతు ఇచ్చారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న శిరీషకు రక్షణ కల్పించాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. బర్రెలక్క పేరుతోనే ట్రెండింగ్.. ‘హాయ్ ఫ్రెండ్స్.. డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రావడం లేదు. అందుకే మా అమ్మకు చెబితే నాలుగు బర్లను కొనిచ్చింది. బర్లను కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్’ అంటూ ఏడాదిన్నర కిందట శిరీష చేసిన వీడియో సోషల్ మీడియాలో సంచలనమైంది. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన కర్నె శిరీష బీకాం వరకు చదువుకుంది. తల్లి అనూరాధ ఓ చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ శిరీషతో పాటు ఇద్దరు కుమారులను చదివించింది. చిన్న రేకులòÙడ్డులో జీవనం సాగిస్తున్న ఆ కుటుంబానికి తల్లితో పాటు తానూ పెద్దదిక్కులా నిలవాలని భావించింది. ఆ మేరకు పోలీస్ కానిస్టేబుల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమైంది. అయితే నోటిఫికేషన్లు రాలేదంటూ అప్పట్లో ఈమె చేసిన వీడియోపై పోలీసులు 2022లో పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 505(2) సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నా ‘రాష్ట్రంలో నోటిఫికేషన్లు రాక, నియామకాల ప్రక్రియ సక్రమంగా లేక ఉద్యోగాలు పొందలేని నిరుద్యోగుల తరపున అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాతో కలసి ప్రచారంలో ఉన్న మా తమ్మునిపై దాడిచేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నిరుద్యోగుల తరపున పోరాటాన్ని కొనసాగిస్తాను. యువత రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నా. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యావంతురాలుగా నాకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఙప్తి చేస్తున్నా.’ -పాదం వెంకటేష్ -
'బర్రెలక్క' తమ్ముడిపై దాడి..! ఓట్లు చీల్చుతుందనే భయంతోనే ఇలా..
సాక్షి, మహబూబ్‌నగర్: నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కకు ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆమె తమ్ముడు భరత్‌పై పెద్దకొత్తపలి మండలం వెన్నచెర్లలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు తాను ఓట్లు చీల్చుతాననే భయంతో దాడులకు తెగబడుతున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సరికాదని శిరీష వాపోయింది. ఆమె తమ్ముడిపై దాడిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా తప్పుబట్టారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిర్వహించాలని, పోటీలో ఉన్న వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ ఈ దాడి అత్యంత బాధాకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆమెకు, కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన డీజీపీ, ఎన్నికల ప్రధాన కార్యదర్శిని కోరారు. సీపీఎం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు, పలు ప్రజా సంఘాల నాయకులు దాడిని ఖండించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్దన్‌రెడ్డి కూడా దాడి హేయనీయమన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలని, మహిళా అభ్యర్థిపై దాడికి ప్రయత్నించడం, ఆమె సోదరునిపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం కాదన్నారు. ఈ దాడి ఘటనపై కొల్లాపూర్‌లో సోషల్‌మీడియాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇవి చదవండి: 'యుద్ధానికి సిద్ధంగా ఉండాలి' : విజయశాంతి -
బర్రెలక్క తమ్ముడిపై దాడి
మహబూబ్‌నగర్: కొల్లాపూర్‌లో బర్రెలక్క అలియాస్ శిరీష స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మంగళవారం కోడేరులో ప్రచారం ముగించుకుని వెన్నచర్ల గ్రామానికి వెళ్లగా.. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు శిరీష తమ్ముడు భరత్‌కుమార్‌పై దాడికి యత్నించారు. విషయాన్ని గమనించిన శిరీష తన మద్దతుదారులతో కలిసి పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తన తమ్ముడిపై దాడి చేసిన వారిని శిక్షించాలని, తనకు పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్ఐ రాజు శిరీషతో మాట్లాడి శాంతింపజేశారు. దాడి చేసిన వారిపై ఫిర్యాదు తీసుకుని సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోలీస్ సెక్యూరిటీ విషయంలో జిల్లా ఎస్పీతో మాట్లాడుతామని చెప్పారు. దారుణం.. కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన నిరుద్యోగి శిరీష అలియాస్ #Barrelakka తమ్ముడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గత కొద్దిరోజులుగా ప్రజల చందాలతో ఎన్నికల ప్రచారం చేస్తున్న శిరీషకు సోషల్ మీడియాతో విస్తృత స్పందన వస్తోంది. గతంలో కేసులు, బెదిరింపులతో… pic.twitter.com/UopywJvMdA — ThulasiChandu (@thulasichandu1) November 21, 2023 -
ప్రేమ పేరుతో ఆర్మీ ఉద్యోగి మోసం
డోన్ టౌన్: ప్రేమ పేరుతో ఆర్మీ ఉద్యోగి తనను మోసం చేశాడని ఓ యువతి సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టింది. బాధితురాలు చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన శిరీష మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ప్రవీణ్ ఆరేళ్ల క్రితం ప్రేమ పేరుతో తన వెంట పడ్డాడన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడన్నారు. ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఆరోపించారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. కాగా యువతికి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు నిర్మలమ్మ, ఉపాధ్యక్షురాలు షమీమ్‌బేగం గ్రామ మహిళలు మద్దతు తెలిపారు. -
నందివాడ ఎస్ఐ భర్త ఆత్మహత్య
గుడివాడ టౌన్(నందివాడ): నందివాడ సబ్ ఇన్స్పెక్టర్ శిరీష భర్త బోగాది అశోక్(30) ఆదివారం నందివాడ లోని ఆయన నివాసంలో ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డారు. వీరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. అశోక్ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని నందివాడ పోలీసులు అంటున్నారు. ఈ దంపతులకు ఏడాది కుమార్తె ఉంది. శిరీష ఏడాది క్రితం నందివాడ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
గౌతు శిరీష అహమే శత్రువా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తన కోపమే తన శత్రువని అంటారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన గౌతు శిరీషకు మాత్రం తన అహమే తన శత్రువవుతోంది. ప్రత్యర్థి నేతలతో పాటు స్వపక్ష నాయకులతోనూ వైరం పెంచుకుంటున్న ఆమె వింత వైఖరి అసమ్మతి సెగ రేపుతోంది. ఇంటా బయటా నాయకులు తనకంటే సీనియర్స్ కావడంతో ఆమె తట్టుకోలేకపోతున్నారు. అరవై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తన కుటుంబానికి ఇన్నాళ్లూ అండగా ఉన్న నేతలే తనకు అడ్డు తగులుతారేమో అన్న అభద్రతా భావంలో ఉన్నారు. తాతతండ్రుల చరిత్రలు చెబుతూ నిత్యం అహంతో వ్యవహరించడం తప్ప సొంత ముద్ర వేసుకోలేక సతమతమవుతున్నారు.వాస్తవానికి సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలిగా పెత్తనం చెలాయించడం తప్ప గౌతు శిరీష పేరు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. గౌతు శ్యామసుందర్ శివాజీ రాజకీయంగా కనుమరుగు అవుతుండటంతో వారసత్వ రాజకీయాల్లో భాగంగా ఆమె తెరపైకి వచ్చారు. వారసత్వ రాజకీ యం సిక్కోలుకు కొత్త కాకపోయినా.. విశాఖపట్నంలో ఉండి ఇక్కడ రాజకీయాలు చేసి గద్దెనెక్కాలనే ఆమె ఆలోచన ఎవరికీ నచ్చడం లేదు. ప్రతి విషయంలో డబ్బును, బ్యాగ్రౌండ్‌ను చెప్పుకోవడం, ఏ మండలంలో ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియకపోవడం, ప్రజల మన్ననలతో కాకుండా వారసత్వం పేరుతో పెత్తనం చెలాయించాలన్న ఆలోచన ఇప్పుడామె కొంప ముంచుతోంది. ఇంతవరకు కుటుంబానికి అండగా నిలిచిన నాయకులే ఇప్పుడు ఎదురుతిరిగే పరిస్థితి ఏర్పడింది.అధికార పార్టీ నాయకులపైన విమర్శలు, ఆరోపణలు చేస్తే అది రాజకీయం అనుకోవచ్చు. కానీ ఉన్నవీ లేనివీ మాట్లాడి నోరు పారేసుకోవడం వల్ల ఇప్పటికే నియోజకవర్గంలో ఆమె ప్రతిష్ట మసకబారిపోయింది. అది చాలదన్నట్టు సొంత పార్టీ నేతలను దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. రానున్న ఎన్నికల్లో ఎక్కడ టిక్కెట్‌కు పోటీ పడతారేమోనన్న అభద్రతా భావంతో స్వపక్షంలోనే నాయకులతో వైరం పెట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి తనకు తప్ప ఎవ్వరికీ ఎమ్మెల్యే సీటు దక్కకూడదనే ఉద్దేశంతో పారీ్టలో ఎదగాల్సిన నాయకులను వెనక్కు నెట్టేందుకే ప్రయ తి్నస్తున్నారు. ఇన్‌కంటాక్స్‌లో ఆఫీసర్‌గా పనిచేసి వచ్చిన ఉద్దాన వాసి జుత్తు తాతారావు ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించడంతో ఆయనతో విభేదాలు పెట్టుకుని ఆయన పారీ్టకి దూరంగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. తాజాగా పలాస–కాశీబుగ్గ మున్సిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబూరావుకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్ కోసం పోటీ పడతారన్న ఉద్దేశంతో ఆయన్ని అణగదొక్కేలా వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి చిన్న విషయంలో వజ్జ బాబురావు అండ్‌కోపై చిర్రుబుర్రులాడుతున్నారు. సొంత పార్టీ నాయకుల సీనియారిటీని సైతం విస్మరించి తన చెప్పుచేతుల్లో ఉండేలా హకుం జారీ చేస్తున్నారు. ఇటీవల శిరీష రాకుండా ఆఫ్‌షోర్ ప్రాజెక్టు చూసేందుకు ప్రతిపక్ష పాత్రలో వెళ్లారంటూ వజ్జపై రుసరుసలాడారు. చెప్పాలంటే వజ్జ బాబూరావును అవమాన పరిచేలా పలు సందర్భాల్లో వ్యవహరించారు. సీనియర్ అయినప్పటికీ తన వెనుక ఉండాలే గానీ తన మాట దాటొద్దంటూ ఆంక్షలు విధించారు. వజ్జ బాబూరావుకు ఏ ఒక్కరు జై కొట్టినా సహించలేకపోతున్నారు. దీంతో శిరీషకు సహజంగానే అసమ్మతి పోరు మొదలైంది. వజ్జ బాబూరావు వర్గీయులంతా ఇప్పుడామెపై గుర్రుగా ఉన్నారు. విశాఖలో ఉండి, పార్టీ పిలుపు సమయంలో ఇక్కడికొచ్చి కార్యక్రమాలు చేపట్టి, తర్వాత వెళ్లిపోయి కేడర్‌ను గాలికొదిలేసిన శిరీష వెంట ఎలా ఉండగలమని వ్యతిరేక వర్గమంతా బాహాటంగానే నిరసన గళం విప్పుతున్నారు. ఆ స్వరం రోజురోజుకీ ఎక్కువై నియోజకవర్గంలో టీడీపీ వర్గాలుగా చీలిపోయింది. -
ఎన్ఐఏ అదుపులో ఆర్కే భార్య శిరీష
టంగుటూరు: మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ (రామకృష్ణ అలియాస్ ఆర్కే) సతీమణి శిరీష అలియాస్ పద్మని కేంద్ర దర్యాప్తు సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆమె ఇంట్లో అదుపులోకి తీసుకుంది. మూడు ప్రైవేటు కార్లలో ఆలకూరపాడుకు చేరుకున్న ఎన్ఐఏ బృందం ఇంటి పనుల్లో ఉన్న ఆమెను సాయంత్రం 6 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని, బలవంతంగా కారులో తరలించేందుకు ప్రయత్నం చింది. ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నముచినా సమాధానం చెప్పలేదు. అనంతరం ఆమెను టంగుటూరు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, ఐదు నిమిషాలు అక్కడ ఉంచారు. అనంతరం సింగరాయకొండ సీఐ దాచేపల్లి రంగనాథ్, ఎస్సై శ్రీరామ్, ఒంగోలు దిశ ఎస్సై ఫిరోజ్ ఫాతిమాల సమక్షంలో ఆమెను అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఎక్కడికి తీసుకెళ్లారన్నది తెలియరాలేదు. ఈ సమాచారాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆమెను ఏ కారణాలతో అదుపులోకి తీసుకున్నారో కూడా వెల్లడించలేదు. గతంలోనూ తనిఖీ ఆర్కే 2021 అక్టోబర్ 16న అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుమారుడు మున్నా సైతం ఉద్యమ బాటలో నడిచి ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత 2022లో ఆలకూరపాడులో శిరీష ఇంట్లో ఎన్ఐఏ బృందం ఓసారి తనిఖీలు చేసింది. మావోయిస్టులకు సహకరించడం, నగదు సమకూర్చడం, వైద్య విద్యారి్థనితో దళాలకు వైద్యం చేయించి, దళం వైపు ఆకర్షించేలా చేయడంలో శిరీషకు సంబంధం ఉందన్న ఆరోపణలతో 2022 జూలై 19న ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఎన్ఐఏ బృందం ఆమె ఇంట్లో తనిఖీ చేసింది. ఆ సమయంలో శిరీష వైద్యం నిమిత్తం విజయవాడ వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో విరసం నేత కళ్యాణరావును తీసుకొచ్చారు. శిరీష లేకుండా తలుపులు తీయడానికి ఆయన నిరాకరించడంతో తహసీల్దార్, వీఆర్వో సమక్షంలో తాళం పగలగొట్టారు. శిరీష ఇంటి నుంచి సాధారణ షాపుల్లో దొరికే కొన్ని పుస్తకాలు, పలు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఇది అక్రమ అరెస్టు: కళ్యాణరావు శిరీషను ఎన్ఐఏ అదుపులోకి తీసుకొన్నట్లు తెలుసుకున్న విప్లవ రచయితల సంఘం నేత గంగుల కళ్యాణరావు హుటాహుటిన స్టేషన్‌కు వచ్చారు. కళ్యాణరావు, ఇతర బంధువులు ఎస్సై శ్రీరామ్‌తో మాట్లాడారు. అనంతరం కళ్యాణరావు మీడియాతో మాట్లాడుతూ.. శిరీషను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. ఎన్ఐఏ బృందం తమ కుటుంబానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా శిరీషను బలవంతంగా తీసుకెళ్లిందని, ఎక్కడ ఉంచారన్నదీ ఇప్పటివరకు తెలపకపోవడం దారుణమని చెప్పారు. ఎవరినైనా అరెస్టు చేసే ముందు కుటుంబ సభ్యులకు తెలపాలని అన్నారు. శిరీషను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.శిరీషపై పెట్టినవన్నీ బూటకపు కేసులేనని అన్నారు. -
‘లాయిడ్స్’ సీఈవోగా శిరీష ఓరుగంటి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉన్న యూకే సంస్థ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్‌లోని లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈవో, ఎండీగా శిరీష ఓరుగంటిని నియమించింది. స్థాపన, దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాన్ని ఆమె పర్యవేక్షిస్తారని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఇప్పటివరకు ఆమె జేసీపెన్నీ ఎండీగా, కంపెనీ బోర్డ్ మెంబర్‌గా పనిచేశారు. పలు అంతర్జాతీయ సంస్థల్లో కీలక విధులను నిర్వర్తించారు. ఐటీ ఆర్కిటెక్చర్, డేటా ఇంజనీరింగ్, ఫిన్‌టెక్ ఆవిష్కరణలలో విస్తృత అనుభవాన్ని తీసుకు వస్తారని లాయిడ్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. -
గాజు ముక్కతో కళ్లలో పొడిచి.. బురదలో తొక్కి చంపి..
పరిగి: కలకలం రేపిన శిరీష మృతి మిస్టరీ కేసు వీ డింది. సొంత అక్క భర్తే హత్య చేసినట్లు విచారణ లో తేలిందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం పరిగిలో మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాల ను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన జుట్టు యాదమ్మ, జంగయ్య దంపతులకు ఇద్దరు కూతు ళ్లు, పెద్ద కుమార్తె శ్రీలతను పరిగి పట్టణానికి చెందిన ఎర్రగడ్డపల్లి అనిల్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. అనిల్‌కు వికారాబాద్‌లో నర్సింగ్ చేస్తున్న మరదలు శిరీష(18)పై కన్ను పడింది. ఈ క్రమంలో శిరీష ఫోన్లో వేరే యువకుడితో మాట్లాడుతోందని ఆమెపై కోపం పెంచుకున్నాడు. కాగా, ఇటీవల శిరీష తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను నగరంలో ని ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఇంట్లో ఉంటు న్న శిరీష ఈనెల 10న ఫోన్లో మాట్లాడుతుండటంతో తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్ మందలించారు. ఇదే అదనుగా అనిల్ కూడా శిరీషను ఫోన్లో మందలించడంతో పాటు జంగయ్యతో కలిసి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి పారిపోయిన శిరీష తీవ్ర మనస్తాపం చెందిన శిరీష ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. ఆమెను వెతికే క్రమంలో గోనె మై సమ్మ గుడివద్ద శిరీష ఉందన్న సమాచారం మేరకు అనిల్ అక్కడికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇన్ని రోజులూ తనతో కలవడానికి నిరాకరించి వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడతావా అంటూ కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. పగిలిన బీరు సీసా ముక్కతో కళ్లలో పొడిచాడు. పడిపోయిన శిరీషను పక్కనే ఉన్న నీటి కుంటలోకి లాక్కెళ్లి బురదలో తొక్కి.. చనిపోయిందని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. తొందరగా శిక్ష పడేట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
శారీరక సంబంధం..పెళ్లికి ఒప్పుకోలేదనే శిరీష హత్య
సాక్షి, వికారాబాద్:సంచలనం సృష్టించిన పారామెడికల్ విద్యార్థిని శిరీష హత్యకేసును పోలీసులు ఛేదించారు. శిరీషను దారుణంగా హత్య చేసింది ఆమె బావ అనిల్ అని పోలీసులు తేల్చారు. శారీరక సంబంధానికి ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను హతమార్చినట్టు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు కేసు వివరాలను వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మీడియాకు వివరించారు. శిరీషకు శారీరకంగా దగ్గరై, ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని అనిల్‌కు దురాలోచన ఉంది. అయితే శిరీష అతనికి సహకరించలేదు. శిరీష తరచూ ఫోన్లలో మరో వ్యక్తితో చాటింగ్ చేయడం, మాట్లాడుతుండటంతో అనిల్‌లో కోపం పెరిగింది. ఈ విషయంలో ఆమె తండ్రి, సోదరుడు.. బావ అనిల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పలుమార్లు అనిల్ ఆమెపై దాడి చేశాడు. హత్యకు ముందు రోజు సాయంత్రం అనిల్ కొట్టడంతో శిరీష ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. శిరీష వెనుకాలే ఆమెను అనుసరిస్తూ వెళ్లిన అనిల్ ఆమెతో గొడపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితుడు బీరు సీసాతో దాడిచేసి నీటికుంటలో ముంచి హతమార్చాడు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరుపుతామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో శిరీష పై అత్యాచారం జరగలేదని వెల్లడైనట్టు ఎస్పీ చెప్పారు. జరిగింది ఇదే.. వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) ఇంటర్ పూర్తిచేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. తల్లి యాదమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు శిరీష అన్న శ్రీకాంత్ హైదరాబాద్‌లో కొంతకాలంగా చికిత్స చేయిస్తున్నాడు. ఇంటి వద్ద తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్ ఉంటున్నారు. భోజనానికి ఇబ్బంది అవుతోందని భావించిన తండ్రి.. రెండు నెలల కిందట కుమార్తెను కాళ్లాపూర్‌కు రప్పించాడు. ఆమె తమ్ముడు శ్రీనివాస్ శనివారం రాత్రి పరిగిలో ఉంటున్న తన మరో అక్క భర్త అనిల్‌కు ఫోన్ చేసి.. శిరీష వంట చేయడంలేదని తెలిపాడు. దీంతో వెంటనే కాళ్లాపూర్ వచ్చిన అనిల్.. శిరీషను మందలించి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇదే విషయమై తండ్రి కూడా శిరీషను కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై రాత్రి పదిన్నర తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం గ్రామానికి కిలోమీటరు దూరంలోని నీటికుంటలో విగతజీవిగా కనిపించింది. ఆమె రెండు కళ్లను పొడిచి, గొంతుకోసినట్లు, తలకు బలమైన గాయాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధానంగా శిరీష కుటుంబసభ్యులపైనే అనుమానం వ్యక్తం కావడంతో ఆమె తండ్రి జంగయ్య, అక్క భర్త అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బావపై అనుమానం బలపడటంతో, లోతుగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. ఇదీ చదవండి: భర్తతో విడిపోయినవాళ్లే ఆ బాబా టార్గెట్ -
మిస్టరీగా వికారాబాద్ శిరీష కేసు
సాక్షి, వికారాబాద్: కాండ్లాపూర్ నర్సింగ్ విద్యార్థిని శిరీష హత్య కేసు మిస్టరీగా మారుతోంది. యువతి మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించి కూడా పోలీసులు ఏం తేల్చలేకపోయారు. ఈ క్రమంలో కాండ్లాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శిరీష మృతిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కాండ్లాపూర్ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. అంతకు ముందు శిరీష తండ్రిపైనా దాడి చేశారు. శిరీషను హత్య చేసిన ఆనవాళ్లే కనిపిస్తున్నాయని, వాస్తవాల్ని బయటపెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో యువతి చేయి, కాళ్లపై బ్లేడుతో కోసిన గాయలు ఉండడంతో పోలీసులు దాడిగా అనుమానిస్తున్నారు. లైంగిక దాడి జరిగిందా? అనే అనుమానాల నేపథ్యంలో మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం ఉదయం శిరీష ఇంటికి చేరుకున్న పోలీసులు.. డాక్టర్ వైష్ణవి నేతృత్వంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఇందులోనూ పోలీసులు ఏం తేల్చలేదు. ‘‘యువతి కళ్లకు కట్టెలు లేదంటే రాళ్లు గుచ్చుకుని ఉండొచ్చు. పరీక్ష రిపోర్టును ఎఫ్ఎస్ఎల్(FSL)కు పంపించాం. రిపోర్టు రావాలి’’ అని డాక్టర్ వైష్ణవి తెలిపారు. అయితే అత్యాచారం జరిగిందా? అనే ప్రశ్నకు ఆమె స్పష్టత ఇవ్వలేదు. రిపోర్ట్ వస్తేనేగానీ తెలియదు చెప్పారు. ఈ క్రమంలో ఆమె అక్కడి నుంచి హడావిడిగా వెళ్లిపోగా.. గ్రామస్తులు ఆగ్రహానికి లోనయ్యారు. ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును మూసేసే యత్నం జరుగుతుందని ఆరోపిస్తూ శిరీష బంధువులు, గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ‘‘మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారు. రేపు మా వాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాదని గ్యారెంటీ ఏంటి?. కేసును పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామ’’ని గ్రామస్తులు అంటున్నారు. శాంతింపజేసిన పోలీసులు శిరీష కేసులో ఆందోళన చేపట్టిన కాండ్లాపూర్ గ్రామస్తుల్ని పోలీసులు శాంతింపజేశారు. నచ్చజెప్పడంతో వాళ్లు నిరసనను ఆపినట్లు తెలుస్తోంది. నోరు విప్పని బావ ఇక శిరీష హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న శిరీష బావ అనిల్ నోరు విప్పలేదు. ఆమె ఇంట్లోనే ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులకు అనిల్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లోనే చేతిపై, గొంతు దగ్గర కోసుకుని తనను, ఆమె తండ్రిని బెదిరించిందని అనిల్ చెప్పాడు. ఈ క్రమంలో తాను ఆమె ఫోన్ లాక్కున్నాడని, ఆమె బయటి నుంచి గడియ పెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు అనిల్ పోలీసులకు చెప్పాడు. ఆపై ఆమె ఊరు శివారులో ఉన్న కుంటలో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తొలుత భావించారు. అయితే కళ్లు పొడిచి ఉండడం, కాళ్లు చేతులకు గాయాల నేపథ్యంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో.. ఇంట్లో గొడవ జరిగితే శిరీష తండ్రి మాత్రం పొంతన లేని సమాధానం చెప్తుండడం, మోకాళ్ళ లోతు నీటి కుంటలో ఆత్మహత్య ఎలా సాధ్యమవుతుందనే అనుమానాలు ఉన్నాయి. అసలు ఇంట్లో గొడవలకి కారణాలేంటన్న కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: అప్సర మొదటి భర్త ఆత్మహత్య.. కార్తీక్ తల్లి సంచలన ఆరోపణలు -
కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవోగా శిరీష
విశాఖపట్నం: కనకమహాలక్ష్మి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ కె.శిరీష నియమితులయ్యారు. ఇంతవరకూ ఈవోగా విధులు నిర్వహిస్తున్న కె.రమేష్‌నాయుడు కృష్ణాజిల్లా తిరుపతమ్మ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బదిలీ అయ్యారు. సహాయ కమిషనర్ బాధ్యతలతో పాటు కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలను శిరీష నిర్వహించనున్నారు. గతేడాది జూలై ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి 29వరకు ఆమె కనకమహాలక్ష్మి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆలయ ఆదాయం పెంపు, భక్తులకు సౌకర్యాలతో పాటు అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. ముఖ్యంగా అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ రామచంద్రస్వామి దేవస్థానం ఆస్తులు, అనకాపల్లిలో అన్యాక్రాంతం కాగా వాటిని స్వా«దీనం చేసుకొని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. దీంతో శిరీషాను అమ్మవారి దేవస్థానం ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో శిరీష ఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఆర్కేకు మహిళలంటే భయం!
టంగుటూరు: నాలుగు దశాబ్దాల పాటు ఉద్యమమే ఊపిరిగా బతికిన విప్లవ నాయకుడు, సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అక్కిరాజు హరగోపాల్ (65) అలియాస్ రామకృష్ణ, అలియాస్ ఆర్కే. 2004లో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో పార్టీ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించాడు. ప్రజల డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టి సమర్థవంతంగా చర్చించాడు. చర్చల ప్రక్రియలో పార్టీ రాజకీయ ధృక్పథాన్ని రాష్ట్ర, దేశ ప్రజల్లోకి వ్యాప్తి చేశాడు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని, ఎన్నో ఎన్కౌంటర్ల నుంచి వెంట్రుక వాసిలో తప్పించుకుని తుది వరకు తను నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడ్డాడు. ‘ప్రజల కోసమే జీవిస్తాం.. ప్రజల కోసమే చస్తాం’ అన్న మాటను నిలుపుకుంటూ విప్లవోద్యమానికి నిస్వార్థంగా సేవలు అందిస్తూ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆర్కే వైవాహిక జీవితం ఎలా సాగింది? ఏ విధంగా పెళ్లి జరిగింది? ఆర్కేకు మహిళలంటే భయమా? పిల్లల విషయంలో ఈ దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయా? కుమారుడిని కూడా ఉద్యమంలోకి ఎందుకు ఆహ్వానించాడు? తదితర ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ ఆర్కే భార్య శిరీష ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఉద్యమ పరంగా ఆర్కే గొప్పలీడర్. అలాంటి లీడర్ భావజాలానికి మీరు ఎలా దగ్గరయ్యారు? శిరీష : పెళ్లికి ముందే 1977 నుంచి 1987 వరకు ఉద్యమంలో పని చేశాను. 1987లో ఆయన (ఆర్కే)తో పరిచయం ఏర్పడింది. ఈ జిల్లాల్లో దళితులపై ఎక్కువగా దాడులు జరిగేవి. దాంతో ఉద్యమాలు, పెద్ద ఎత్తున మీటింగ్‌లు జరిగేవి. ఆ మీటింగ్‌లకు నేను వెలుతుండేదాన్ని. ఈ మీటింగ్‌లకు ఆయన కూడా వచ్చేవారు. జననాట్య మండలి ప్రోగ్రాములు జరుగుతుండేవి. నాకు మహిళా సంఘాల్లో పని చేయాలని ఆసక్తి ఉండేది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇప్పుడైతే చాలా మంది మాట్లాడుతున్నారు. అప్పట్లో తక్కువ. ఆయన దళితుల మధ్య ఉంటూ, వారి సమస్యలపై పోరాడుతూ.. వారితో తినడం నాకు నచ్చింది. మీరు ఏమి చదువుకున్నారు. శిరీష : ఇంటర్ వరకు చదువుకున్నా. కారంచేడు ఉద్యమంలో మీరు పాల్గొన్నారా? శిరీష: అగ్రనాయకులు ఇక్కడికి వచ్చి దళితుల కోసం పోరాడుతుంటే మనం వారికి మద్దతు ఇవ్వకపోతే ఎలా? మనం కూడా పోరాటం చేయాలని అనిపించింది. ప్రశ్నించే వారు ఉండాలి. అడిగితే కానీ ప్రభుత్వాలు ఇవ్వవు. అది భూమి కావచ్చు.. మరేదైనా కావచ్చు. ప్రశ్నించే విధానం అలవర్చు కోవాలి. ఆర్కేను పెళ్లి చేసుకోవాలని ఎందుకనిపించింది? శిరీష : తొలుత తోటి ఉద్యమదారుల వద్ద ఆర్కే గురించి విన్నాను. ఆ తర్వాత ఆయన పోరాట పంథా నాకు బాగా నచ్చింది. నేను కొంచెం మౌనంగా ఉండే రకం. ఆ విషయం ఆయనకు నచ్చింది. కొందరు ఉద్యమకారులు ఆర్కే గురించి మా పెద్దవాళ్లకు చెప్పారు. ఇద్దరం ఇష్టపడ్డాకే పెళ్లి చేసుకున్నాం. వాస్తవానికి ఆయనకు మహిళలు అంటే కొంచెం బెరుకు. దూరంగా ఉంటారు. ఇద్దరం అలాంటి వాళ్లమే కాబట్టి త్వరగా కలిసిపోయాం. పెళ్లప్పుడు నా వయసు 19 ఏళ్లు మాత్రమే. ఆర్కేను పెళ్లి చేసుకుని తప్పు చేశాను అనిపించిందా? శిరీష : అలా ఎప్పుడూ అనిపించలేదు. అందరిలాగా తిరగాలని అనిపించేది. బయటకు వెళ్లాలని అనిపించేది. అయితే మా పరిస్థితి దృష్ట్యా ఎక్స్పోజ్ కాకూడదు. బయట తిరగకూడదు. వస్తు వ్యామోహం ఉండకూడదు. మొదట్లో నాకు మాత్రం అన్నీ కావాలని కోరిక ఉండేది. బట్టలు, వస్తువులన్నా వ్యామోహం ఉండేది. అయితే అవన్నీ సరికాదని ఆయన చెప్పే వారు. ఆయన చెప్పేవన్నీ విన్నాక సబబే అనిపించింది. ఆయన చెప్పిన ప్రకారం నడుచుకునేదాన్ని. ఎప్పుడైనా తగవులు.. గొడవలు పడే వారా? శిరీష: పిల్లలు పుడితే ఉద్యమానికి ఇబ్బంది అవుతుందనే వారు. ‘ఒక్కోసారి పిల్లలను వదిలేసి వెళ్లాల్సి వస్తుంది.. వారి ప్రేమకు దూరం అవుతాం.. మన ప్రేమకు వారు దూరమవుతారు.. తల్లిదండ్రులకు దూరమై ఇంటి వద్ద ఉన్న పిల్లల వల్ల ఇబ్బంది అవుతుంది. ఆలోచించు’ అన్నారు. ఎంత కష్టమొచ్చిన సరే ఒకరినైనా కనాలని గొడవ పెట్టుకున్నా. ఆ విషయంలో నన్ను కన్విన్స్ చేయలేకపోయారు. 1992లో బాబు (మున్నా) పుట్టాడు. బాబు పుట్టాక పెంపకం ఎలా? శిరీష : అప్పుడు ఆయన నాతోపాటు సంవత్సరం ఉన్నారు. నేను బాబును తీసుకుని అమ్మవాళ్ల వద్దకు వచ్చి ఐదేళ్ల వరకు ఉన్నాను. ఆ సమయంలో నేను మాత్రమే ఆయన్ను అప్పుడప్పుడు కలిసేదాన్ని. ఆరు సంవత్సరాల తర్వాత బాబును ఆయన చూశాడు. బిడ్డ వల్ల ఇబ్బందులొచ్చాయా? శిరీష : అలాంటి పరిస్థితి రాలేదు. కాకపోతే తల్లిదండ్రులిద్దరి మధ్య బాబు పెరగడం లేదన్న బాధ నాకుండేది. అమ్మ వాళ్ల వద్ద కానీ, అక్క వాళ్ల వద్ద కానీ బిడ్డను పెట్టమని చెప్పారు. లేదా పిల్లలు లేని వారికి ఇచ్చేద్దాం అన్నారు. మున్నాను ఎంత వరకు చదివించారు? శిరీష : ఇంటర్ వరకు మున్నా ఉద్యమం పట్ల ఎలా ఆకర్షితుడయ్యాడు? శిరీష: అబ్బాయిని రౌడీలా, గూండాలా పెంచకూడదనుకున్నాను. అనుకున్నట్లే మంచి విలువలతో పెంచాను. చిన్నప్పుడు నాన్న ఎక్కడ? అని అడిగినప్పుడు దూరంగా జాబ్ చేస్తున్నాడని చెప్పేదాన్ని. ఎందుకు అంత దూరం ఉంటాడు అనేవాడు. ఎప్పుడొస్తారని అడిగేవాడు. వస్తారులే అని చెప్పేదాన్ని. ఆర్కే గురించి ఎలా తెలుసుకున్నాడు? శిరీష: పెద్దగయ్యే కొద్దీ వాస్తవాలు తెలుసుకున్నాడు. నాన్నను చూడాల్సిందేనని పట్టు పట్టాడు. అడవిబాట పడితే తప్ప అది సాధ్యం కాదని తెలుసుకుని వెళ్లి కలుసుకున్నాడు. వాళ్ల నాన్న వద్దకు వెళ్లి రావడానికి పోలీసులతో ఇబ్బంది ఉండేది. ఇక్కట్లు వస్తాయని చెప్పాను. చదువు కొనసాగించడమో, లేక ఇక్కడే ఏదైనా జాబ్ చేసుకోవాలనో చెప్పాను. అడవిలోకి వెళ్లాక ఆయన భావజాలాలకు కనెక్ట్ అయ్యి అక్కడే ఉండిపోయాడు. తండ్రిన మించిన కుమారుడుగా పేరు తెచ్చుకున్నాడు. కానీ నాకైతే మరో అబ్బాయి ఉంటే బాగుండేదని అనిపించేది. ఇప్పుడిక వారిద్దరి జ్ఞాపకాలే నాకు మిగిలాయి. -
అమ్మాయివి నీకెందుకమ్మా? నన్ను చూసి నవ్వుకున్నారు..
లైన్ ఉమెన్ నియామకాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే రాతపరీక్ష సహా స్తంభాలు ఎక్కే పరీక్షల్లో (పోల్ క్లైంబింగ్ టెస్టు) విజయం సాధించి అన్ని విధాలుగా సమర్థతను నిరూపించుకున్నప్పటికీ..వారికి ఇప్పటికీ పోస్టింగ్ దక్కలేదు. ఒక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన పోలీసు, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవి వంటి రక్షణ రంగాల్లో పెద్దపీట వేస్తూ మహిళాభ్యున్నతికి పాటుపడుతుంటే..మరో వైపు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)మాత్రం ఇప్పటికీ మహిళల పట్ల వివక్షతను ప్రదర్శిస్తూనే ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అధికారుల తీరు వల్ల లైన్‌ఉమెన్‌గా ఇప్పటికే అన్ని అర్హతలు సాధించిన వాంకుడోతు భారతి, బి.శిరీషలకు ఏడాది కాలంగా నిరీక్షణ తప్పలేదు. సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 2019 సెప్టెంబర్ 28న 2500 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిస్కం చట్టం ప్రకారం దరఖాస్తు ఫాంలో మహిళలకు ఆప్షన్ ఇవ్వలేదు. అయితే అప్పటికే ఐటీఐ ఎలక్ట్రికల్ కోర్సు పూర్తి చేసిన మహబూబ్‌బాద్‌కు చెందిన భారతి, సిద్ధిపేటకు చెందిన శిరీష సహా మరో 30 మంది మహిళలు తమ భవితవ్యంపై ఆందోళన చెందారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 34 మంది ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. పురుష అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించినప్పటికీ.. మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించకపోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2019 డిసెంబర్ 15 వీరికి రాత పరీక్ష నిర్వహించారు. ఈ రాత పరీక్షలో ఇద్దరు మాత్రమే (భారతి, శిరీష)అర్హత సాధించారు. అప్పటికే పురుష అభ్యర్థులకు పోల్ క్లైంబింగ్ టెస్టు నిర్వహించి.. మహిళా అభ్యర్థులకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో వారు మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు 2020 డిసెంబర్ 23న వీరికి ఎర్రగడ్డలోని సెంట్రల్ పవర్ ఇనిస్టిట్యూట్‌లో పోల్ క్లైంబింగ్ పరీక్ష నిర్వహించారు. వీరిద్దరూ ఎనిమిది మీటర్ల ఎత్తున్న విద్యుత్ స్తంభాన్ని ఈజీగా ఎక్కి, పురుషులకు తామేమాత్రం తీసిపోబోమని నిరూపించారు. అంతేకాదు సంస్థలో లైన్ ఉమెన్ ఉద్యోగానికి అర్హత సాధించిన తొలి మహిళలుగా చరిత్ర సృష్టించారు. అయితే వీరికి ఇంకా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వక పోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులోని తొమ్మిదో నెంబర్ సింగిల్ బెంచి వద్ద పెండింగ్‌లో ఉండిపోవడంతో వారికి నిరీక్షణ తప్పలేదు. అయితే డిస్కం మాత్రం కోర్టు ఆదేశాలు వచి్చన తర్వాతే ఆర్డర్స్ ఇస్తామని చెబుతోంది. ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి? మాది సిద్ధిపేట జిల్లా మర్కుకు మండలం గణేష్‌పల్లి గ్రామం. మా అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలే. 2015లో అల్వాల్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఎల్రక్టీషియన్ ట్రేడ్‌లో చేరాను. అప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్ అభ్యంతరం కూడా చెప్పారు. అమ్మాయివి ఈ కోర్సు ఎందుకమ్మా...? మరేదైనా కోర్సు తీసుకోవచ్చు కదా! అని సూచించారు. కానీ నేను వినలేదు. పట్టుబట్టి అదే కోర్సులో చేరి పాసయ్యాను. 2019లో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేసేందుకు వెళ్లితే అందు లో ఫీమేల్ ఆఫ్షన్ లేకపోవడం ఆందోళన కలిగింది. కొంత మంది యువతులం కలిసి హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు అనుమతి ఇవ్వడంతో రాతపరీక్ష సహా పోల్ క్లైంబింగ్ కూడా పూర్తి చేశాం. అయినా మాకు ఉద్యోగం రాలేదు. ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలో?. – బి.శిరీష, సిద్ధిపేట వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి మాది జనగాం జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామ సపీమంలోని సుకారిగడ్డ తండా. అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తారు. టెన్త్ వరకు అక్కడే చదువుకున్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో 2015లో ఇల్లందు ఐటీఐ కాలేజీలో ఎలక్ట్రికల్ కోర్సులో చేరాను. నాన్ లోకల్ కేటగిరిలో డిస్కంకు దరఖాస్తు చేశాను. రాత పరీక్ష కోసం వరంగల్‌లోని ఓ కేంద్రంలో శిక్షణ తీసుకున్నా. 90 మంది పురుష అభ్యర్థుల మధ్య నేను ఒక్కతినే. వారంతా నన్ను చూసి నవ్వుకున్నారు. అయినా నిరుత్సాహ పడలేదు. చివరకు కోర్టు ఆదేశాలతో రాత పరీక్ష, స్తంభం ఎక్కడం వంటి పరీక్షల్లోనూ నెగ్గాను. ఇప్పటికే మూడేళ్లైంది. అయినా ఎదురు చూపులు తప్పడం లేదు. వెంటనే పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చి మాకు న్యాయం చేయాలి. – వాంకుడోతు భారతి, జనగాం జిల్లా -
శిరీష సాహసం గర్వకారణం
సాక్షి, తెనాలి: ‘తాతా...డోంట్ ఫియర్...సక్సెస్‌ఫుల్‌గా తిరిగొస్తాను’ ..అని చెప్పిన మనుమరాలు అంతరిక్ష యానం పూర్తిచేసుకొని విజయవంతంగా తిరిగి రావటం ఎన లేని సంతోషాన్ని కలిగిస్తోందని రోదసీ యాత్ర చేసిన తొలి తెలుగమ్మాయిగా రికార్డు సృష్టించిన బండ్ల శిరీష తాతయ్య రాపర్ల వెంకట నరసయ్య అన్నారు. వర్జిన్ గెలాక్టిక్ స్పేస్‌పోర్టు నుంచి సాగిన అంతరిక్షయాత్ర ప్రత్యక్ష ప్రసారాన్ని తోటి బంధువులతో కలిసి వీక్షించిన దగ్గర్నుంచీ, వెంకటనరసయ్య దంపతుల ఆనందానికి హద్దే లేకుండాపోయింది. మరుసటి రోజంతానూ బంధువులు, మిత్రులు, సన్నిహితుల అభినందనలు అందుకుంటూనే ఉన్నారు. సాయంత్రం తనను కలిసిన విలేకరులతో ఆ ఆనందాన్ని పంచుకున్నారు. ఈనెల ఆరో తేదీన మనుమరాలు శిరీష తనతో ఫోనులో మాట్లాడి, తమకు ధైర్యం చెప్పిన మాటల్ని గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్లవరకు తన దగ్గర పెరిగిన శిరీష 1992లో అమ్మానాన్నతో కలిసి అమెరికా వెళ్లిందన్నారు. తిరిగి తొమ్మిదేళ్ల వయసులో 1997లో తెనాలి వచ్చినపుడు పైలట్ కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయటమే కాదు...‘నేను పైలెట్‌నై మిమ్మల్నిద్దర్నీ అమెరికా తీసుకెళతాను తాతయ్యా’ అని చెప్పిందన్నారు. కంటిచూపు కారణంగా అవకాశం మిస్సయినా, తగిన చదువులు చదివి, ప్రైవేటు రంగంలో అవకాశాలను అందిపుచ్చుకుని ఈ స్థాయికి చేరుకుందన్నారు. 2016లో తమ 50వ వివాహ వార్షికోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిందనీ, మళ్లీ 2019లో వచ్చినపుడు తనకు కాబోయే భర్తను శిరీష పరిచయం చేసినట్టు వివరించారు. అంతరిక్ష యాత్ర ముగిశాక తన కుమార్తె, అల్లుడుతో మాట్లాడానని చెప్పారు. శిరీషతో మాట్లాడేందుకు వీలుపడలేదన్నారు. ఏదేమైనా స్త్రీలు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరనీ తన మనుమరాలు సాహసయాత్రతో చాటటం గర్వకారణంగా ఉందన్నారు. తన లక్ష్యాన్ని సాకారం చేసుకున్న తీరు, సాధించిన వైనం యువతకు స్ఫూర్తి కాగలదన్నారు. -
అంతరిక్షంలోకి పయనమైన తొలి తెలుగు మహిళ
-
శిరీష భవిష్యత్తు గానమయంగా సాగిపోవాలి..
ఇండియన్ ఐడెల్‌లో తెలుగువారి ప్రతిభ కొత్తది కాదు. ఇండియన్ ఐడెల్ 5ను తెలుగు గాయకుడు శ్రీరామచంద్ర గెలుచుకున్నాడు. కారుణ్య ఇండియన్ ఐడెల్ 2లో రన్నర్ అప్‌గా నిలిచాడు. తెలుగువారు జాతీయ స్థాయిలో సింగింగ్ టాలెంట్ చూపగలరని ఎప్పుడో నిరూపితం అయ్యింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఇండియన్ ఐడెల్ 12 లో ఇద్దరు విశాఖ అమ్మాయిలు ప్రతిభ చూపుతూ ఉండటం విశేషం. వారు షణ్ముఖ ప్రియ, శిరీష భాగవతుల. వీరిలో శిరీష భాగవతుల టాప్ 11 వరకూ వచ్చి రెండు రోజుల క్రితం ఎలిమినేట్ అయ్యింది. షణ్ముఖ ప్రియ టాప్ టెన్‌లోకి వెళ్లింది. ఇద్దరిదీ ఘనతే అనుకోవాలి. విశాఖకు చెందిన శిరీష చిన్నప్పటి నుంచి తాతగారి దగ్గర సంగీతం నేర్చుకుంది. పాడాలని ఉంది విజేతగా నిలిచింది. ఇంజినీరింగ్ చేసి చెన్నైలో సంగీతం నేర్చుకుంటూ అక్కడ తమిళంలో పాటలు పాడుతోంది. శిరీష గాయని చిత్రకు వీరాభిమాని. ఆమె పాటలు ఎక్కువగా పాడుతుంది. ఇండియన్ ఐడెల్ ఆడిషన్స్‌లో కూడా శిరీష ‘సాథియా తూనే క్యా కియా’ (ఈనాడే ఏదో అయ్యింది), కెహెనా హై క్యా (కన్నానులే) పాడి చిత్రలాంటి గాయనిగా జడ్జ్‌ల నుంచి ప్రశంసలు అందుకుంది. ఒక ఎపిసోడ్ ‘జియ జలే జాన్ జలే’ పాటతో స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. దాదాపు హేమాహేమీలుగా ఉన్న 16 మంది సింగర్స్‌తో మొదలైన ఈ షో టాప్ 11 వరకూ నిలవడం కూడా సామాన్యం కాదు. సెలబ్రిటీలు హాజరైన ఎపిసోడ్స్‌లో ముఖ్యంగా బప్పీలహరి, ప్యారేలాల్, ఉదిత్ నారాయణ్ వీరందరి సమక్షంలో పాడి శిరీష ప్రతిభ చాటుకుంది. షణ్ముఖ ప్రియతో కలిసి హీరో గోవిందా ఎపిసోడ్లో ‘చికుబుకు చికుబుకు రైలే’ హిందీ వెర్షన్‌ను పాడి క్లాప్స్ అందుకుంది. మెలొడీలే కాకుండా కామెడీ, డిస్కో అన్నీ పాడగలనని శిరీష ఈ డయాస్ నుంచి చాటి చెప్పింది. ఇప్పటికే రహమాన్ దృష్టిలో పడి ఆయన సంగీతం లో ‘విజిల్’లో పాడిన శిరీష ఇప్పుడు ఇండియన్ ఐడల్ తో వచ్చిన గుర్తింపుతో మరిన్ని మంచిపాటలు పాడే అవకాశం ఉంది. ఇండియన్ ఐడెల్కు సంగీత దర్శకులు విశాల్, హిమేష్ రేష్మియా, గాయని నేహా కక్కర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. శిరీష భవిష్యత్తు గానమయంగా సాగాలని కోరుకుందాం. -
ఆ పేర్లలోనే ఏదో కరెంట్ ఉంది
భారతి, శిరీష... ఆ పేర్లలోనే ఏదో కరెంట్ ఉంది.‘చెట్టులెక్కగలవా ఓ నరహరి’ అని చెంచిత అడిగింది.నరహరి అడగలేదు.ఎందుకంటే చెంచితకు చెట్టులెక్కడం రాదు.. పుట్టలెక్కడం రాదు అని జనాభిప్రాయం.చెట్లే ఎక్కలేని స్త్రీలు కరెంట్ పోల్ ఏమెక్కుతారని కూడా చాలా ఏళ్లుగా అభిప్రాయం.‘మేము ఎక్కగలం’ అన్నారు భారతి, శిరీష.లైన్లను దారిలో పెట్టగలం అని పెట్టి మరీ చూపిస్తున్నారు.ఉమెన్ పవర్ అంటే ఏమిటో కాదు. ఇటువంటి స్త్రీలు చూపేదే. పల్లెటూరులో పుట్టి పెరిగిన ఇద్దరు యువతులు కొత్త చరిత్రకు నాంది పలికారు. విద్యుత్ శాఖలో మహిళలు చేయలేరని భావించే లైన్మెన్ ఉద్యోగానికి రాష్ట్రంలో తొలిసారిగా ఎంపికై ఎంతోమందికి వెలుగు బాట చూపారు. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అవరోధాలు ఎదురైనా పట్టుదల తో ముందుకు సాగారు. కోర్టును ఆశ్రయించి అనుకున్నది సాధించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దేశ్యా తండాకు చెందిన 32 ఏళ్ల వాంకుడోతు భారతి, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం గణేష్‌పల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల బబ్బూరి శిరీషల విజయగాథ ఇది. తల్లి, మేనమామతో శిరీష ఇంతకాలం పురుషులకే పరిమితమైన విద్యుత్ లైన్మెన్ పోస్టును మహిళలుగా తొలిసారి మీరు చేజిక్కించుకోవడం ఎలా ఉంది? భారతి: చాలా ఆనందంగా ఉంది. ముందు ఉద్యోగం కోసం చాలా సాధారణంగానే అన్ని ప్రయత్నాలు చేశా. కానీ, ఇలా అందరూ అభినందనలు చెబుతుంటే గర్వంగా కూడా ఉంది. శిరీష: మేం పడిన కష్టానికి ఫలితం దక్కిందనిపించింది. ఈ ఉద్యోగాన్నే ఎంచుకోవడానికి కారణం? భారతి: తండాలో పుట్టి పెరిగాను. గిరిజనులమైన మాకు వ్యవసాయమే ఆధారం. అయినా, ఎంకామ్ వరకు చదువుకున్నాను. ఐటిఐ చేస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయనీ అదీ పూర్తి చేశాను. గవర్నమెంటు ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఆ క్రమంలోనే లైన్మెన్ నోటిఫికేషన్ గురించి తెలిసింది. చిన్నప్పటి నుంచీ పొలాల్లో చెట్లు ఎక్కాను, నాట్లేశాను, కలుపుతీశాను, ఎండవానలు తేడా లేకుండా పనులు చేశాను. లైన్‌మన్ ఉద్యోగం చేయడం పెద్ద కష్టం అనిపించలేదు. శిరీష: మా అమ్మ నాన్నలకు నేనొక్కదాన్నే కూతురును. మాకు ఎలాంటి ఆస్తిపాస్తుల్లేవు. రెక్కలకష్టమే జీవనాధారం. ఊళ్లో పనులు దొరక్క నా చిన్నప్పుడే అమ్మనాన్నలు మేడ్చల్‌కు వలసవెళ్లారు. అక్కడి కంపెనీల్లో కూలి పనులు చేస్తూ పూటగడుపుకునేవారు. మేడ్చల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి చదివా. ఆ తర్వాత పరిస్థితుల కారణంగా తిరిగి ఊరికి వెళ్లిపోయాం. ఊళ్లోనే ఉంటున్న నాకు మా మేనమామ చెప్పడంతో ఐటిఐ పూర్తిచేశాను. ఆ తర్వాత అంబేద్కర్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ చేస్తూ, ఈ ఉద్యోగానికి అప్లై చేశాను. ఈ ఉద్యోగం ఆడవాళ్లు చేయదగినది కాదు అని నాకు ఎంతమాత్రం అనిపించలేదు. లైన్మెన్ పోస్టుల్లో మహిళా అభ్యర్థులకు అవకాశమే లేదన్నారు. మరి ఆ అవరోధాలను ఎలా ఎదుర్కొన్నారు? భారతి: 2019 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ వచ్చింది. అందులో స్త్రీలు అప్లయ్ చేసుకోవడానికి అసలు ఆప్షనే లేదు. అన్ని రంగాల్లో స్త్రీలకు 33 శాతం అవకాశాలు ఉన్నాయంటారు, మరి దీనికి ఎందుకు లేదు అని కోర్టుకు వెళ్లాను. కోర్టు పర్మిషన్ ఇచ్చింది. రిటన్ టెస్ట్ అయిపోయింది. పోల్ టెస్ట్‌కి మళ్లీ అడ్డంకులు. మళ్లీ కోర్టుకు వెళ్లాం. భవిష్యత్తులో న్యాయం చేయాలని బెంచ్ తీర్పునిచ్చింది. ఈ కాపీని తీసుకెళ్లి సంబంధిత అధికారులకు చూపించగా... ‘కోర్టు తీర్పు భవిష్యత్తులో అని ఉందిగా...తర్వాత చూద్దాంలే...’ అని దాట వేశారు. మళ్లీ కోర్టుకు వెళ్లాం. గడువు లోపల పోల్ టెస్ట్ పెట్టి, కంప్లీట్ చేయమని మళ్లీ కోర్టు అదేశాలు ఇచ్చింది. ఆ టెస్ట్‌లో 1 మినిట్లోపు పోల్ ఎక్కి దిగాలి. అందులో పాసయ్యాను. అధికారులు అభినందించి, ఎంపికైనట్టు చెప్పారు. శిరీష: ఈ పోస్టుకు దరఖాస్తుచేసే సమయంలో మహిళలకు అప్షన్ లేకపోవడం చాలా ఆందోళనగా అనిపించింది. ఈ రోజుల్లో ఇంకా మగ–ఆడ తేడా చూపే ఉద్యోగాలు ఉన్నాయా అనుకున్నాను. మొత్తానికి కోర్టుకు వెళ్లడంతో పర్మిషన్ వచ్చింది. కిందటి నెల 23న హైద్రాబాద్ యూసుఫ్‌గూడలోని సీపీటీఐ (సెంట్రల్ పవర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లో విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో పోల్ క్లైంబింగ్ పరీక్ష నిర్వహించడంతో విజయవంతంగా పరీక్షలో నెగ్గాను. విద్యుత్ స్తంభాలు ఎక్కడం, దిగడం... ఈ పనులు మీరెలా నేర్చుకున్నారు? భారతి: ఇద్దరు పిల్లల తల్లిని. ఎనిమిదేళ్ల కొడుకు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు నాకు. తండాల్లో పుట్టి పెరిగినదాన్ని. చెట్లు ఎక్కి దిగడం చిన్నప్పటి నుంచీ నాకు అలవాటే. ఆ ధైర్యంతోనే స్తంభాలు ఎక్కగలనని కోర్టుకు విన్నవించుకున్నా. అయినా పోల్ టెస్ట్‌కు ముందు వరంగల్‌లోని ఎన్పీసిఎల్ గ్రౌండ్లో నెల రోజుల పాటు రోజూ ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేశాను. శిరీష: మా మేనమామ శేఖర్‌గౌడ్ ప్రత్యేకంగా తర్ఫీదునిచ్చాడు. ఇంట్లో తాడుతో స్తంభాలు ఎక్కే విధానం, ఆ తర్వాత ప్రజ్ఞాపూర్‌లోని సబ్‌స్టేషన్ లో పోల్ ఎక్కడం నేర్పాడు. రేషన్ బియ్యం తప్ప ఇతర పోషకాహారం లభించని దయనీయ స్థితిలో ఉన్న నాకు ఫిజికల్ ఫిట్నెస్ కోసం పోషకాహారం సమకూర్చాడు. దాదాపు ఆరునెలలు సాధన చేశాను. ఎంతో ఆత్మవిశ్వాసం, అంతకుమించి ధైర్యం తో లైన్మెన్ ఉద్యోగంలో చేరిన వీరికి అభినందనలు చెబుదాం. కష్టమేమీ కాదు.. పేదరికంలో ఎన్నో కష్టాలు పడ్డాను. వాటి ముందు స్తంభాలు ఎక్కి, ఎలక్ట్రికల్ పనులు చేయడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిరుత్సాహపడలేదు. మొండిగా కోర్టు చుట్టూ తిరిగా. గవర్నర్ అభినందించడం జీవితంలో మరిచిపోలేను. – బబ్బూరి శిరీష నిమిషంలో పోల్ టెస్ట్ పాస్ నా చిన్నతనంలో తండా నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కి నడిచివెళ్లేదాన్ని. ఇంటర్ దేరుట్ల కాలేజీలో, డిగ్రీ భద్రాచలంలో గవర్నమెంట్ కాలేజీలో, ఎంకామ్ కేయూ యూనివర్శిటీలో చదివాను. పద్దెనిమిదేళ్ల క్రితం పెళ్లయ్యింది. పిల్లలు పుట్టాక అత్తగారింటివద్దే వ్యవసాయపనులు చేసుకుంటూ ఉండిపోయాను. అయినా, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. లైన్‌మన్ జాబ్ ఇన్నాళ్లకు వచ్చింది. రోజు మొత్తం వ్యవసాయం పనులు చేయడం వల్ల నిమిషంలో పోల్ ఎక్కడం పెద్ద కష్టమేమీ అనిపించలేదు. – వాంకుడోతు భారతి – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇన్పుట్స్: – వై.సురేందర్, సాక్షి, గజ్వేల్ ఫొటోలు: కె.సతీష్, సిద్దిపేట Telangana's 1st linewoman : 20 years old Sirisha cracked the junior lineman Exam by TSSPDCL to become 1st linewoman in Telanagana Congratulations Sirisha proud of your accomplishments #womenempowerment @PMOIndia @MinistryWCD @IPRTelangana @PIBHyderabad @airnews_hyd @DDYadagiri — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 2, 2021 -
కేరింటలు
కరోనా వల్ల పిల్లల స్కూళ్లకు సెలవులొచ్చాయి. ఒక్కరోజు స్కూల్‌కి వెళ్లక్కర్లేదంటేనే చాలు పిల్లలకు పెద్ద పండగే. అలాంటిది పదిహేను రోజులంటే... వాళ్ల ఆనందం మాటల్లో వివరించ లేనిది. రెండు, మూడు, నాలుగు రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు బోర్ ఫీలవ్వడం మొదలుపెడుతున్నారు. కొందరు పిల్లలు తమ తోబుట్టువులతో గొడవలు పెట్టుకొని పెద్దలకు తలనొప్పులు తెస్తున్నారు. అలాగని వాళ్లనీ తప్పు పట్టలేం. బయటకెళ్లి తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి లేదు. సినిమాలకు వెళ్లడానికి లేదు. ఇక షాపింగ్‌లు, షికార్లు సరేసరి. ఫంక్షన్లకు వెళ్లేది లేదు. బంధువుల ఇళ్లకు వెళ్లేది లేదు. ‘అమ్మా! బోర్ కొడుతోంది...’ ఇదీ పిల్లల ఫిర్యాదు. ఎంతసేపూ టీవీ,సెల్ఫోన్లతో కాలక్షేపం. ‘ఏంటి చేయడం...’ తల్లిదండ్రులకు ఇప్పుడు ఇదో పెద్ద సమస్య. దీనిని అధిగమించడానికి ఇంట్లోనే ఓ చిన్న సమ్మర్ క్యాంప్‌ను ముందస్తు క్యాంప్‌గా మార్చేశారు హైదరాబాద్ తార్నాకలో ఉంటున్న డాక్టర్ శిరీష ముఖేష్. వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఇన్ని పాయింట్స్, ఈజీ కుకింగ్కు సంబంధించిన ఐటమ్స్ నేర్చుకుంటే ఇన్ని పాయింట్స్, గార్డెనింగ్ చేస్తే ఇంకొన్ని పాయింట్స్.. అంటూ రోజూ ఏదో ఒక ఇంటి పనిలో తన ఇద్దరు పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. పిల్లలు చేస్తున్న... నేర్చుకుంటున్న ఇంటిపనులు, వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాట్సప్ ఫ్యామిలీ గ్రూప్‌ల్లో పోస్ట్ చేస్తూ పిల్లలను ఉత్సాహ పరుస్తున్నారు. దీంతో పిల్లలు బోర్ ఫీలవకుండా, పెద్దవారిని విసిగించకుండా టైమ్‌ని ప్లానింగ్‌గా మార్చేస్తున్నారు. ‘ఇలాగే మనమూ చేయచ్చు కదా!’ అని మిగతా తల్లిదండ్రులకూ ఆలోచన అందిస్తున్నారు. కరోనా అంటూ భయంతో ఇంట్లోనే ముడుచుకు కూర్చోవాల్సిన పనిలేదు. పిల్లలకు ఎన్నో అంశాల్లో నైపుణ్యాలకు సంబంధించి తరగతులు ఇవ్వడానికి తల్లిదండ్రులు ఇలా ఇంట్లోనే కొత్తగా ప్లాన్ చేసుకోవచ్చు. -
డీఎస్పీ శిరీష బదిలీ
వికారాబాద్: వికారాబాద్ డీఎస్పీ శిరీష రాఘవేంద్రను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2017 ఆగస్టు నెలలో ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఆమె శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సార్లు వికారాబాద్ వచ్చిన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుత వాతావరణంలో పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో ముందుకుసాగారు. డివిజన్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా తనదైన శైలిలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. అన్ని మతాలకు సంబంధించిన పండుగలు.. కులమతాలకు అతీతంగా, శాంతియుతంగా జరుపుకొనేందుకు చర్యలు తీసుకున్నారు. క్లిష్టమైన అనేక కేసులను తేలికగా ఛేదించిన అధికారిగా అవార్డులు సైతం అందుకున్నారు. ఫిర్యాదే కారణమా..? త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు, ఎంపీ,స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు ఉన్న సమయంలో డీఎస్పీని అకస్మాత్తుగా డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయడం చర్చనీయాంశమైంది. ఓ ప్రైవేటు భూతగాదాలో తలదూర్చడంతో.. బాధితులు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన తర్వాతే ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా డీఎస్పీని అటాచ్ చేయడం సాధారణంగానే జరిగిందని.. ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏదిఏమైనా గత పది రోజుల క్రితం వికారాబాద్ పోలీస్ స్టేషన్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్న సీఐ సీతయ్యను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయడం మరవక ముందే.. డీఎస్పీని డీజీపీ ఆఫీస్‌కు పంపించడం చర్చనీయాంశంగా మారింది. సీఐని ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసిన తర్వాత శాఖాపరమైన వ్యవహారాలన్నింటినీ డీఎస్పీయే పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆమె కూడా లేకపోవడంతో.. ఈ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ సాగుతోంది. కొత్త అధికారిగా ఎవరు రానున్నారోనని డివిజన్ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. -
హత్యాయత్నం కేసుపై డీఎస్పీ దర్యాప్తు
శృంగవరపుకోట రూరల్: మండలంలోని శివరామరాజుపేట గ్రామంలో ఎస్సీ యువతి జుంజూరు శిరీష(19)పై వేపాడ మండలం ఆకులసీతంపేట గ్రామానికి చెందిన సుంకరి బంగారుబుల్లయ్య అనే ఆటో డ్రైవర్ ఇటీవల హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై విజయనగరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ 1 డీఎస్పీ బి.మోహనరావు శుక్రవారం దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఎస్.కోట ఎస్ఐ ఎస్.అమ్మినాయుడు, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి శిరీషపై హత్యాయత్నం జరిగిన శివరామరాజుపేట గ్రామంలో బంధువుల ఇంటిని పరిశీలించారు. నిందితుడు దాడి చేసిన సమయంలో అక్కడే పడి ఉన్న పలు వస్తువులను వీఆర్ఓ అప్పలరాము, ఇతర పెద్దల సమక్షంలో డీఎస్పీ స్వాధీనం చేసుకున్నారు. సాక్షుల నుంచి వాంగ్మూలం నమోదు ముందుగా హత్యాయత్నానికి గురైన జుంజూరు శిరీష తల్లి సూరీడమ్మను డీఎస్పీ మోహనరావు విచారించగా.. తమ స్వగ్రామం వేపాడ మండలం ఆకులసీతంపేట గ్రామమని, 2007లో తన భర్త శ్రీను మృతి చెందటంతో ఉన్న ఒక్కగానొక్క కుమార్తెతో కలిసి గంట్యాడ మండలం పెదమధుపాడ గ్రామంలో కన్నవారింటికి వెళ్లి జీవిస్తున్నట్లు స్పష్టం చేసింది. గతంలో ఆకులసీతంపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బంగారుబుల్లయ్య తన కుమార్తెను వేధింపులకు గురి చేస్తే అక్కడి గ్రామపెద్దల దృష్టికి తీసుకెళ్లామని, పెద్ద మనుషులు బంగారుబుల్లయ్యను వారించి ఇకపై శిరీష జోలికి రానంటు ఒక లేఖ కూడా రాయించారని తెలియజేసింది. నాలుగు రోజుల కిందట నా కుమార్తె శిరీష పేరున బ్యాంకులో ఖాతా తెరిచేందుకు ఇద్దరం వెళ్లామని, సమయం మించి పోవటంతో మరొక రోజు రమ్మన్నారని చెప్పటంతో కుమార్తె శిరీష సమీపంలో గల శివరామరాజుపేటలోని తన అక్క గారింటికి వెళ్లగా తాను పెదమధుపాడ వెళ్లిపోయానని వాంగ్మూలం ఇచ్చింది. శిరీషపై హత్యాయత్నానికి పాల్పడి ఇంట్లో నుంచి నిందితుడు వెళ్లిపోతున్న సమయంలో చూసిన శిరీష పెద్దమ్మను, మావయ్య గౌరినాయుడు, మరో ప్రత్యక్ష సాక్షి ముచ్చకర్ల చిరంజీవి సూర్యనారాయణను డీఎస్పీ విచారించి వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం నిందితుడు బంగారుబుల్లయ్య, హత్యాయత్నానికి గురైన బాధిత యువతి శిరీషల స్వగ్రామమైన వేపాడ మండలంలోని ఆకులసీతంపేట గ్రామానికి వెళ్లి అక్కడి మాజీ ఎంపీటీసీ అడపా ఈశ్వరరావు, మాజీ సర్పంచ్ మంచిన అప్పలసూరి తదితరులను డీఎస్పీ విచారించారు. డీఎస్పీ వెంట ఎస్.కోట ఎస్ఐ అమ్మినాయుడు, వేపాడ ఎస్ఐ తారకేశ్వరరావు, ఇతర పోలీసు సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు. -
అర్ధరాత్రి యువతి దారుణ హత్య
సాక్షి, చందంపేట : గతంలో భ్రూణ హత్యలు.. ఆడపిల్లల అమ్మకాలకు పుట్టినిల్లుగా ఉన్న నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి గ్రామంలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అందుగుల శిరీష(19) దేవరకొండ పట్టణంలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్నతనంలోనే తండ్రి పెద్ద ముత్యాలు, అంజమ్మ మృతిచెందారు. సొంత గ్రామమైన పోలేపల్లిలో నాయినమ్మ అందుగుల ఎల్లమ్మ ఇంట్లోనే శిరీష ఉంటోంది. ఈమెకు ఓ సోదరి ఉండగా ఆమెకు వివాహమైంది. శిరీష బాబాయి చిన ముత్యాలు.. భార్య రెండేళ్ల క్రితం అతడిని వదలివెళ్లడంతో హైదరాబాద్‌లో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆరుబయట నాయినమ్మ మంచంపై నిద్రించగా.. శిరీష కింద పడుకుంది. సుమారు అర్థరాత్రి 12.30 గంటల సమయంలో అందుగుల ఎల్లమ్మ మూత్ర విసర్జనకు వెళ్తుండగా శిరీష రక్తపు మడుగులో పడిఉంది. ఇది చూసిన ఎల్లమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. శిరీష నాయినమ్మ ఎల్ల మ్మ పేరిట ఎకరన్నర భూమి, చిన్న ఇల్లు ఉంది. ఈ ఆస్తి కోసమా.. లేక ప్రేమ వ్యవహారం కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. యువతి దారుణ హత్యకు గురికావడం గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ గ్రామంలో అర్ధరాత్రి జరిగిన యువతి హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న దేవరకొండ డీఎస్పీ మహేశ్వర్, సీఐ శేఖర్‌రెడ్డి, చందంపేట, నేరెడుగొమ్ము ఎస్ఐలు రామకృష్ణ, పచ్చిపాల పరమేశ్‌తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువతి మృతదేహంపై పదిహేను చోట్ల గొడ్డలి గాట్లు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంతకుముందు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. -
సత్తా చాటేందుకే రాజకీయాల్లోకి..
చింతలపాలెం (హుజూర్నగర్) : గ్రామీణ యువతుల సత్తా చాటేందుకే రాజకీయాల్లో వచ్చా. యువతులు వంటింటికి, ఒక రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలి. ముఖ్యంగా గ్రామీణ యువతుల్లోని చైతన్యాన్ని నింపాలి. అందుకే రాజకీయ రంగాన్ని ఎంచుకున్నా. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని నాలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకుంటా. ప్రభుత్వ పథకాలు గ్రామీణులకు సకాలంలో చేరేవిధంగా యువత నడుం బిగించి రాజకీయాల్లో రాణించాలి. అందుకు గ్రామీణ రాజకీయాల్లో కూడా యువత ఆదర్శంగా ఎదగాలి. – అన్నెం శిరీష, వేపలసింగారం, హుజూర్నగర్ -
యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని..
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిం చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలోని వెంగమాంబనగర్‌లో గురువారం తెల్లవారుజా మున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. వెంగమాంబనగర్‌లో నివాసం ఉంటున్న జయరామయ్య, వెంకటసుబ్బమ్మలకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. జయరామయ్న ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో కుటుంబ పోషణ భారమైన వెంకటసుబ్బమ్మ కువైట్‌కు వెళ్లింది. వెంకటసుబ్బమ్మ కుమారుడు పవన్ హైదరాబాద్‌లో ఉంటుండగా ... కుమార్తె డేరంగుల శిరీష (20) డిగ్రీ మధ్యలోనే ఆపేసి అమ్మమ్మ టి.సుబ్బమ్మతోనే కలిసి ఉంటుంది. అయితే కొన్ని నెలలుగా శిరీష కడుపునొప్పితో బాధపడుతుండేది. చాలా ప్రాంతాల్లో వైద్య పరీక్షలు చేయించినా కడుపునొప్పి తగ్గలేదు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సుబ్బమ్మ ఇంటి బయట కసువు ఊడ్చుతుండగా శిరీష బాత్రూంలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గట్టిగా కేకలు వినిపించడంతో సుబ్బమ్మ లోపలికి వెళ్లి చూడగా శిరీష శరీరం పూర్తిగా కాలిపోయి చనిపోయి ఉంది. విషయం తెలుసుకున్న అర్బన్ ఇన్స్పెక్టర్ రమేష్‌బాబు మృతురాలి అమ్మమ్మను, సోదరుడిని విచారించారు. మృతురాలి అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఇంకా తెలవారలేదు
బడికి వెళ్లి అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు మంచు తెరలపై రక్తాక్షరాలు అయ్యారు. తెల్లవారుజామునే జరిగిన రోడ్డు ప్రమాదంలో నెత్తుటి ముద్దలుగా మారారు. ఈ ఘోరం∙జరిగి సరిగ్గా ఏడాది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి నలుగురు విద్యార్థులతోపాటు ఆటోడ్రైవర్ బలైన విషాద ఘటన 2017 డిసెంబరు 28వ తేదీన ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ శివారులో జరిగింది. ఆ ఘటనలో విద్యార్థినులు కనుమర్తి గాయత్రి (15), ఆళ్ల రేణుక (15), పొట్లపల్లి శైలజ (15), మున్నంగి కార్తీక్ రెడ్డి (15), వీరితోపాటు ఆటోడ్రైవర్ రేపూడి ధన్‌రాజ్ (28) చనిపోయారు. గాయపడిన వారిలో పొట్లపల్లి భాను, పొట్లపల్లి వైష్ణవి, ఆలకుంట శిరీషలు ఉన్నారు. ఈ సంఘటన ఎనిమిది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. అందరూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. వైష్ణవి, శిరీష, లక్ష్మీ భవానీలు ముగ్గురికీ కాళ్లు విరగడంతో ఆపరేషన్లు చేశారు. కొద్ది రోజుల క్రితం వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగు పడటంతో ఇంటికి పంపారు. వీరిలో వైష్ణవి, లక్ష్మీభవాని ఇంటివద్ద మంచంలో ఉంటూనే చదువుకుని చేతి కర్రలుపట్టుకుని తల్లిదండ్రుల సహకారంతో పదోతరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ప్రైవేట్ కళాశాల హాస్టల్లో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. శిరీషకు మూడు ఆపరేషన్లు జరిగాయి. ఒక ఆపరేషన్ విజయవంతం కాకపోవడంతో అమ్మ సాయం లేనిదే నడవలేని పరిస్థితిలో ఉంది. దీంతో పదోతరగతి పరీక్షలు కూడా రాయలేక మంచానికే పరిమితమైంది. తాను బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించాలని అనుకునేదాన్నంటూ శిరీష గద్గద స్వరంతో చెబుతోంది. కదిలిస్తే కన్నీళ్లే శైలజ తండ్రి శ్రీధర్ ఎంత ముఖ్యమైన పని ఉన్నా గ్రామం నుంచి ఫిరంగిపురం వెళ్లే మార్గంలో ఉన్న దుర్ఘటన ప్రాంతం మీదుగా వెళ్లడం లేదు. అటు వెళితే తమ కుమార్తె అసువులు బాసిన ప్రాంతం వస్తుందని, అది చూసి తట్టుకోలేనన్న భయంతో కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న ఫిరంగిపురం వెళ్లేందుకు ఏడు కిలోమీటర్ల దూరం వచ్చి, 113 తాళ్లూరు నుంచి ఫిరంగిపురానికి రాకపోకలు సాగిస్తున్నారు. కార్తీక్‌రెడ్డి తండ్రి కూడా ఘటన గురించి ఎవరైనా గుర్తు చేస్తే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్ రాని కారణంగా తన కుమారుడు పాఠశాలకు ఆటోలో వెళ్తూ ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లాడని.. ప్రభుత్వం నుంచి అందిన పరిహారంతో తన కుమారుడు కార్తీక్ పేరుతో బస్ షెల్టర్ నిర్మించాడు. పూలచెట్లు చూస్తే తమ కుమార్తె గుర్తుకు వస్తుందంటూ రేణుక తల్లి దేవి విలపిస్తున్న తీరు అపరిచితులు సైతం కంటనీరు తెప్పిస్తోంది. బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగం పొంది మిమ్మల్ని బాగా చూసుకుంటానని ఎప్పుడూ చెబుతుండేదని, దేవుడు తమకు అన్యాయం చేసి తీసుకెళ్లాడని గాయత్రి తల్లి శివకుమారి గుండెలు పగిలేలా రోదిస్తోంది. వైద్యం కోసం ఇల్లు తాకట్టు ఏడాది కాలంగా మంచానికే పరిమితమైన ఆలకుంట శిరీషకు మూడు విడతలుగా ఆపరేషన్లు జరిగాయి. మొదట ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఉచితంగా వైద్యం చేయించిన ప్రభుత్వం ఆ తరువాత పట్టించుకోలేదు. దీంతో ప్రతినెలా వైద్యపరీక్షలు, మందుల కోసం వేలకు వేలు ఖర్చు అవుతుండటతోపాటు తండ్రి కృష్ణయ్య రెండేళ్లుగా పక్షవాతం కారణంగా కాలుచేయి పనిచేయక ఇంటివద్దే ఉంటున్నాడు. శిరీష తల్లి పుల్లమ్మకు కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. ప్రభుత్వం 2 లక్షలు నష్టపరిహారం ఇస్తుందనుకుంటే 1 లక్ష మాత్రమే ఇవ్వడంతో చేసేది లేక ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి శిరీషకు వైద్యం చేయిస్తున్నారు. బాసటగా వై.ఎస్.జగన్ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ బాధితుల పక్షాన నిలబడడంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అయితే ప్రకటించింది గానీ అందులోనూ మోసం చేసింది. – ఎన్. మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు -
శిరీష హత్య కేసులో కొత్తకోణం
సాక్షి, శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలంలోని ప్రగతి రిసార్టులో జరిగిన శిరీష హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మజిద్ అనే యువకుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు సాయిప్రసాద్ స్వగ్రామమైన కొత్తూరు మండలం తిమ్మాపురం వాసిగా గుర్తించారు. మజీద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు సహకరించినట్లు వెల్లడైందని పోలీసులు తెలిపారు. శిరీష, ఆమె ప్రియుడు సాయిప్రసాద్‌ను మజీద్ కారులోనే ప్రగతి రిసార్ట్స్‌కు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ హత్య కేసులో మొదట సాయిప్రసాద్ మాత్రమే నిందితుడని పోలీసులు భావించారు. అయితే హత్య అనంతరం సాయిప్రసాద్ కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేయడంతో మజీద్ విషయం తెలిసింది. శిరీషను హత్య చేసిన అనంతరం నిందితుడు సాయి మొదటగా మజీద్‌కే ఫోన్ చేసి విషయం చెప్పినట్లు విచారణలో తేలింది. పోలీసులకు సమాచారం అందించకుండా మజీద్ అక్కడ నుంచి కారులో పారిపోయినట్లు తేలడంతో అతడిని అరెస్ట్ చేశారు. మజిద్ నుంచి ఫోర్డ్ కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సాయిప్రసాద్, అదే మండలం కుమ్మరిగూడ గ్రామానికి చెందిన శిరీష(21) పరిచయస్తులు. గతంలో వీరు ప్రేమించుకున్నారు. అయితే, కొంతకాలంగా శిరీష సాయిప్రసాద్‌కు దూరంగా ఉంది. తనను పెళ్లి చేసుకోవాలని సాయిప్రసాద్ ఆమెపై ఒత్తిడి తీసుకురాగా యువతి నిరాకరించింది. దీంతో అతడు శిరీషపై కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కకూడదని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపేయాలని పథకం వేశాడు. గత గురువారం శంకర్పల్లి మండల పరిధిలోని ప్రగతి రిసార్టులో ఆన్లైన్లో గది బుక్ చేశాడు. అయితే, పథకం ప్రకారం సాయిప్రసాద్ తనతో ఓ కత్తి తెచ్చుకున్నాడు. నిర్వాహకులు ఎలాంటి తనిఖీలు చేయలేదు. వారి గుర్తింపు కార్డులను సైతం చెక్ చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గదిలోకి వెళ్లిన తర్వాత సాయిప్రసాద్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో శిరీష నిరాకరించింది. దీంతో అతడు కత్తితో ఆమె గొంతు కోసం చంపేశాడు. నిర్వాహకులు గుర్తించేసరికి పారిపోయాడు. అనంతరం పోలీసులు బృందాలుగా ఏర్పడి అతడిని మరుసటి రోజు చిలుకూరు చౌరస్తాలో పట్టుకొని కటకటాల వెనక్కి పంపారు. -
నిందితుడిని ఉరితీయాలి
వారిద్దరికీ ఇంటర్మీడియట్ చదివే సమయంలో పరిచయం ఏర్పడింది. తెలిసి తెలియని వయస్సులో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. స్నేహం ముసుగులో ఉన్మాదిగా మారిన ఓ యువకుడు తోటి స్నేహితురాలిని నమ్మించి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద సంఘటన కొత్తూరు పంచాయతీ కుమ్మరిగూడలో శుక్రవారం చోటు చేసుకుంది. రంగారెడ్డి, కొత్తూరు : స్థానికులు, హత్యకు గురైన విద్యార్థి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు పంచాయతీ పరిధిలోని కుమ్మరిగూడ గ్రామానికి చెందిన ఈశ్వర్, పద్మమ్మ దంపతుల కుమార్తె శిరీష(21). దిల్‌సుఖ్‌నగర్‌లోని అనిబిసెంట్ కళాశాలలో డిగ్రీ చదువుతూ బ్యాంక్ ఉద్యోగం కోసం అక్కడే ఓ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుంటుంది. కాగా శిరీష ఇంటర్మీడియట్ చదివే సమయంలో తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ నుంచి నిత్యం కళాశాలకు వెళ్లేది. ఈ క్రమంలో తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ కాలనీకి చెందిన సాయిప్రసాద్‌తో స్నేహం ఏర్పడింది. క్రమంగా అతడి ప్రవర్తన హద్దు మీరడంతో శిరీష విషయాన్ని కుటుంబ సభ్యులు తెలపడంతో వారు అతడ్ని మందలించారు. చాలా కాలం పాటు శిరీష జోలికెళ్లని సాయిప్రసాద్ గురువారం తాను దిల్‌సుఖ్‌నగర్‌లోని కోచింగ్ సెంటర్‌కు వెళ్లినట్లు తెలుసుకొని అక్కడి నుంచి మాటల్లో పెట్టి తనను శంకర్‌పల్లిలోని ప్రగతి రిసార్ట్ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. అనంతరం శిరీష మొఖం కడుకునేందుకు సబ్బు రాసుకునే సమయంలో పథకం ప్రకారం.. తనను హత్య చేయాలని అనుకున్న సాయిప్రసాద్ కత్తితో గొంతు కోశాడు. రక్తపు మడుగులో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. సాయంత్రం అవుతున్నా కూతురు ఇంటికి రాకపోయే సరికి ఆమెకు తండ్రి ఫోన్ చేయడంతో స్విచ్చాఫ్ వచ్చింది. తీరా రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో శంకర్పల్లి పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్‌చేసి శిరీష ప్రగతి రిసార్ట్స్‌లో హత్యకు గురైనట్లు తెలపడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. బహిరంగంగా ఉరితీయాలి... తమ కూతురు చదువుల్లో ఎప్పుడు ఫస్ట్‌గా ఉండడంతో పాటు కుటుంబసభ్యులతో ఎంతో సంతోషంగా ఉండేదని శిరీష తల్లి పద్మమ్మ బంధువులతో చెబుతూ కన్నీంటి పర్యంతమయ్యారు. పథకం ప్రకారమే సాయి ప్రసాద్ తమ కూతుర్ని హత్య చేసినట్లు వాపోయారు. మరోమారు ఆడపిల్లలపై ఇలాంటి ఘోరాలకు పాల్పడకుండా ప్రభుత్వం సాయిప్రసాద్‌ను బహిరంగంగా ఉరితీయాలని కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. చదువు కోసం ఇంటి నుంచి వెళ్లిన కుమార్తె శవమై రావడంతో కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతరం గ్రామానికి చేరుకున్న విద్యార్థిని మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
హత్యపై అనుమానాలెన్నో..
రంగారెడ్డి, చేవెళ్ల: శంకర్పల్లి మండలంలోని ప్రగతి రిసార్టులో గురువారం జరిగిన శిరీష హత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రేమించిన యువకుడు నమ్మించి రిసార్టుకు తీసుకువచ్చి దారుణంగా కత్తితో గొంతుకొసి కడుపులో, ముఖంపై విచక్షణారహితంగా పొడిచి హత్యచేశాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కత్తితో రావడంతో అతనికి ఎవరైనా సహకరించి ఉంటారని మృతురాలి కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. అతనితో పాటు ఉన్న వ్యక్తులు, సహకరించిన వ్యక్తులను అరెస్టు చేసి శిక్షించాలని కోరుతున్నారు. ప్రగతి రిసార్టు లాంటి పేరొందిన దానిలోకి ఎవరైనా రావాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. అలాంటిది కేవలం ఇద్దరు పెళ్లికాని యువతీయువకులు ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకుంటే వారి వివరాలు చెక్ చేయకుండా ఎలా కేటాయించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి తోడు రిసార్టులోకి ఎవరు వెళ్లినా వారిని పూర్తిగా చెక్‌చేసి డిడెక్టర్ల ద్వారా పరిశీలించి పంపిస్తుంటారు. అలాంటిది హత్య చేసేందుకు పథకం వేసుకొని వచ్చిన యువకుడు కత్తిని ఎలా రిసార్టు లోపలికి తీసుకెళ్తే భద్రత ఏమైందని ప్రశ్నిస్తున్నారు. గోప్యంతోనే ఆలస్యమా..? సాయిప్రసాద్‌తో పాటు ఎవరైనా రిసార్టులోకి వచ్చి ఉంటారని హత్య చేసేందుకు సహకరించి తరువాత దీనిని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించి విఫలం కావడంతోనే బయటకు వచ్చేందుకు ఆలస్యం జరిగిందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య విషయం సాయంత్రం పోలీసులకు, రిసార్టు సిబ్బందికి తెలిసినప్పుడు మృతురాలి శిరీష వద్ద ఉన్న ఐడీ కార్డులు, సెల్ఫోన్ల ఆధారంగా తల్లిదండ్రులకు ఎందుకు వెంటనే సమాచారం అందించలేదని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు కనిపించలేదని, ఫోన్‌చేస్తే కలవలేదన్నారు. చివరకు రాత్రి 8 గంటలకు ఫోన్ చేస్తే పోలీసులమని మీరు ప్రగతి రిసార్టు వద్దకు రావాలని చెప్పారని అంటున్నారు. హత్య జరిగిన తరువాత ఇంత సమయం ఎందుకు అయిందని పలు అనుమానాలకు తావునిస్తుంది. రిసార్టు పేరు బయట పడకుండా ఉండే జాగత్ర పడ్డారా? లేక హత్య చేసిన యువకుడి వెనక పలుకుబడి ఉన్న నాయకులు ఎవరైనా ఉండి కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ పోలీసులు హత్య చేసిన యువకుడు దొరకడంతో ఆధారాల ప్రకారం తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ హత్యపై వస్తున్న అనుమానాలపై కూడా పూర్తి వివరాలు సేకరిస్తున్నామని డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు. -
శిరీష ఇంకెవరికీ దక్కకూడదనే..
-
శిరీష మరొకరికి దక్కకూడదనే...
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి రిసార్ట్‌లో దారుణ హత్యకు గురైన డిగ్రీ విద్యార్థిని శిరీష కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ పద్మజ మీడియాకు వివరించారు. తనకు దక్కని శిరీష ఇంకెవరికీ దక్కకూడదనే కోపంతోనే సాయిప్రసాద్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. చేవెళ్ల ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆమె ప్రెస్మీట్లో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘శిరీష పదో తేదీ ఉదయం 11 గంటలకు కోచింగ్‌కు అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది. ఆమె దిల్‌సుఖ్‌నగర్‌లోని టైమ్స్ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుంటోంది. సాయిప్రసాద్ ఆమెతో మాట్లాడాలి అని చెప్పి శంషాబాద్‌కు రావాలని ఫోన్ చేశాడు. అదే సమయంలో అతడు... ప్రగతి రిసార్ట్స్‌లో ఆన్లైన్లో కాటేజ్ బుక్ చేసి ఆమెను నేరుగా రిసార్ట్స్‌కు తీసుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో నిన్న శిరీషను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసాడు. బాత్రూమ్కు వెళ్లిన ఆమెపై వెంట తెచ్చుకున్న కత్తితో గొంతుకోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. నిందితుడు సాయిప్రసాద్ కొత్తూరులోని ఎన్‌టీడీఎఫ్ కళాశాలలో డిప్లొమా చేసి ఉద్యోగ ప్రయాత్నాలు చేస్తున్నాడు. గత అయిదేళ్లగా ప్రేమ పేరుతో శిరీష వెంట పడుతూ, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. గత రాత్రే సాయిప్రసాద్‌ను చిలుకూరు బాలజీ టెంపుల్ వద్ద ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతోనే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. శిరీష, సాయిప్రసాద్ శంషాబాద్‌లో ఇంటర్మీడియెట్ ఒకే కాలేజీలో చదివారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది.’ అని తెలిపారు. శిరీష మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడి అవుతాయని ఆమె తెలిపారు. శిరీష హత్య కేసు వివరాలను వెల్లడించిన డీసీపీ పద్మజ చదవండి.... రిసార్ట్‌లో దారుణం: అత్యాచారం చేసి.. ఆపై గొంతుకోసి -
ప్రజల భయం పోగొట్టేందుకే కార్డన్ సెర్చ్
నవాబుపేట: ప్రజల్లో భయాన్ని పోగొట్టి పోలీసులపై నమ్మకాన్ని కల్పించేందుకు కార్డన్ సెర్చ్ చేపడుతున్నామని వికారాబాద్ డీఎస్పీ శిరీష అన్నారు. మండల పరిధిలోని మైతాప్‌ఖాన్‌గూ డ గ్రామంలో ఆదివారం ఉదయం డీఎస్పీ శి రీష ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, 50 మంది సిబ్బందితో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని ఇళ్లు, కిరాణం షా పులు, ఫాస్టుఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వ హించారు. తనిఖీలో 3,080 గుట్కా ప్యాకెట్లు, 148 మద్యం బాటిళ్లు, పత్రాలు లేని ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అనుమానిత వ్య క్తులు సంచరిస్తే వెంటనే 100కు డయ ల్ చేసి సమాచారం అంది ంచాలన్నారు. గ్రామంలో మ ద్యం విక్రయాలు చేపడితే సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమం లో సీఐలు శ్రీనివాస్, వెంకట్రామయ్య, నవాబుపేట, బంట్వారం, మర్పల్లి, వికారాబాద్ టౌన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. శంషాబాద్‌లో విస్తృతంగా కార్డన్ సర్చ్ శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని అహ్మద్‌నగర్, ఖాజీగల్లి, కోమటి బస్తీల్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. శంషాబాద్ జోన్ డీసీపీ పీ.వీ.పద్మజ ఆధ్వర్యంలో ఏసీపీ అశోక్‌కుమార్, ఐదు గురు సీఐలు, 200 మంది కానిస్టేబుళ్లతో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివా రం ఉదయం 8 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పత్రాలు లేని 100 బైక్‌లు, 20 ఆటోలు, ఐదు కార్లు, మూడు డీసీఎంలతో పాటు 15 మంది రౌడీషీటర్లు, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ కోసం విస్తృతంగా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని డీసీపీ పద్మజ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ ప్రాంగణానికి తరలించారు. తనిఖీల్లో ఆర్జీఐఏ సీఐ మహేష్, శంషాబాద్ సీఐ కృష్ణప్రసాద్ తదితరులున్నారు. -
పది రోజుల్లో పెళ్లి.. అంతలోనే
కథలాపూర్(వేములవాడ): ఐదు రోజుల క్రితం నిశ్చితార్థం.. పదిరోజుల్లో పెళ్లి.. అంతలోనే యు వతి ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఈ ఘటన తక్కళ్లపెల్లిలో విషాదం నింపింది. పోచంపెల్లి సాయ మ్మ–గంగరాజం దంపతులకు ఇద్దరు కుమారు లు, కూతురు శిరీష(21) సంతానం. యువతికి మేడిపెల్లి మండలం దేశాయిపేటకు చెందిన వ్యక్తితో ఈనెల 4న నిశ్చితా ర్థం జరిగింది. ఈనెల 19న పెళ్లి ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఆభరణాల విషయంలో పెళ్లికొడుకు అత్తింటి వారికి ఫోన్ చే శారు. అరతులం బంగారుపుస్తెలు తాడు చేయించాలని అనడంతో మనస్పర్థలు వచ్చాయి. ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లి తర్వాత ఎంత ఒత్తిడి ఉంటుందో నని ఆందోళన చెందిన శిరీష సోమవారం ఇంట్లోనే ఉరి వేసుకుందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగేశ్వర్రావు తెలిపారు. -
క్రీడా సిరి.. శిరీష
వల్లూరు: ఆమె పుట్టింది గ్రామీణ ప్రాంతమైనా... మక్కువ పెంచుకుని ఎంచుకున్న వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో విశేష ప్రతిభ కనబరుస్తూ పతకాల సాధనలో క్రీడా సిరిగా నిలుస్తోంది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అసాధారణ రీతిలో రాణిస్తున్న ఆమె పేరు కొప్పర్తి శిరీష. వల్లూరు మండలంలోని పెద్దపుత్త గ్రామానికి చెందిన కొప్పర్తి వెంకట శివారెడ్డి, వెంకట లక్ష్మిల ఏకైక కుమార్తె శిరీష మూడవ తరగతి పూర్తవగానే హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్‌కు జరిగిన ఎంపికల్లో స్థానం సాధించింది. ఆ స్కూల్లో 2001వ సంవత్సరంలో నాలుగవ తరగతిలో చేరింది. 2003లో వెయిట్ లిఫ్టింగ్ పట్ల ఆకర్షితురాలైంది. అనుకున్నదే తడవు కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణకు శ్రీకారం చుట్టింది. ♦ స్కూల్ గేమ్స్ నుండి వివిధ స్థాయిలలో జరిగే అన్ని పోటీలలో అగ్ర స్థానంలో నిలుస్తోంది. వెయిట్ లిఫ్టింగ్ క్రీడా పోటీలలో స్నాచ్, క్లీన్ అండ్ జర్క్, టోటల్ విభాగాల్లో విశేషంగా రాణిస్తూ తన ప్రత్యేకతను చాటుతోంది. అంకిత భావంతో కఠోర శ్రమ .. వెయిట్ లిఫ్టింగ్ లాంటి క్రీడలో రాణించడం మహిళలకు ఒక సవాలు లాంటిది. మిగిలిన క్రీడలతో పోలిస్తే వెయిట్ లిఫ్టింగ్‌లో మానసికంగా , శారీరకంగా చాలా శక్తివంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎదురైన అవరోధాలను అధిగమిస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి గానూ శిరీష కఠోర శ్రమతో నిత్యం ప్రాక్టీస్ చేస్తూ ముందుకు సాగింది. ♦ 2005లో స్టేట్ మీట్లో అరంగేట్రం చేసింది. 2008 లో నేషనల్ గేమ్స్‌లోకి అడుగిడింది. 2010 లో ఇంటర్నేషనల్ స్థాయి పోటీలకు ఎంపికైంది. ♦ 2014 వ సంవత్సరంలో సీనియర్స్ విభాగంలోకి వచ్చిన మొదట్లో ఒకటి రెండు పోటీల్లో అనుకున్నంతగా రాణించక పోయినా రెట్టించిన ఉత్సాహంతో తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించి రాణించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలో 2016 లో సెంట్రల్ రైల్వే జోన్ వారు ఈమె ప్రతిభను గుర్తించి క్రీడా కోటాలో ఉద్యోగాన్ని ఇచ్చారు. కొద్ది రోజులకు మోకాలి నొప్పి వేధించడంతో సీనియర్ నేషనల్ గేమ్స్‌కు దూరం కావాల్సి వచ్చినప్పటికీ నిరుత్సాహ పడలేదు. ముంబాయిలో తాను నివాసం వుంటున్న చోటు నుండి ప్రాక్టీస్ చేయడానికి లోకల్ ట్రైన్లో ప్రతి రోజు రాను రెండు గంటలు, పోను రెండు గంటలు ప్రయాణించి స్టేడియంకు చేరుకోవాల్సి వచ్చినప్పటికీ ప్రాక్టీస్‌ను కొనసాగించింది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి గత సంవత్సరం పంజాబ్‌లో జరిగిన ఆల్ ఇండియా రైల్వే ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్‌ను సాధించింది. ♦ ఈ ఏడాది జనవరిలో మంగళూరులో జరిగిన నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి మహిళా శక్తికి తిరుగు లేదని నిరూపిస్తోంది. అన్ని పోటీల్లో పతకాలే.. ♦ 2005వ సంవత్సరంలో విశాఖలో జరిగిన సీనియర్ స్టేట్‌మీట్ పోటీలలో 44 కేజీల విభాగంలో రెండవ స్థానంతో శిరీష తన క్రీడా పతకాల ఖాతా తెరిచింది. అప్పటి నుండి తిరిగి చూడకుండా పాల్గొన్న ప్రతి పోటీలోనూ పతకాన్ని సాధిస్తూ గొప్పగా రాణిస్తోంది. -
సంతోషి, శిరీషలకు స్వర్ణాలు
మంగళూరు: జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ లిఫ్టర్లు మత్స సంతోషి (మహిళల 53 కేజీలు), కె.శిరీష (మహిళల 58 కేజీలు), కోరాడ రమణ (పురుషుల 56 కేజీలు), రాగాల వెంకట రాహుల్ (పురుషుల 85 కేజీలు) స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. మరోవైపు మహిళల 63 కేజీల విభాగంలో జి.లలిత, పురుషుల 77 కేజీల విభాగంలో ఎం.రామకృష్ణ రజతాలు సాధించారు. మహిళల 69 కేజీల విభాగంలో ఎస్కే అలీమా బేగం నాలుగు పతకాలు గెలిచింది. క్లీన్ అండ్ జర్క్, ఇంటర్ స్టేట్ అంశాల్లో రజతాలు, జర్క్, టోటల్లలో కాంస్యాలు దక్కించుకుంది. -
మనసున్న మహారాజులు
దుగ్గొండి (నర్సంపేట): ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ‘అంపశయ్యపై శిరీష’ కథనానికి దాతలు స్పందించారు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన రేగుల శోభన్–సౌందర్యల ఆవేదన.. కిడ్నీలు పాడైన యువతి శిరీష (21) దీనావస్థను ఈ నెల 25న ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనాలకు ఎందరో మనసున్న మహారాజులు స్పందించి చేసిన సాయంతో మంగళవారం ఒక్క రోజులోనే రేగుల శోభన్ ఖాతాలో రూ.1,00,100 జమ అయ్యాయి. 29 మంది తమ మానవత్వాన్ని చాటి ఈ సాయాన్ని అందించారు. అలాగే, ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనానానికి రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి స్పందించారు. శిరీష కిడ్నీ మార్పిడి చికిత్సకు సుమారు రూ.6 లక్షల వ్యయం అవుతుందని, అందులో రూ.5 లక్షలు ముఖ్యమంత్రి సçహాయ నిధి నుంచి అందించేందుకు కృషి చేస్తానని, ఆపరేషన్ కంటే ముందే సీఎం కె.చంద్రశేఖర్‌రావును ఒప్పించి ఎల్‌ఓసీనీ తీసుకువచ్చి ఆపరేషన్ జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని అ«ధైర్యపడవద్దని సూచించారు. శిరీషకు సాయం చేయాలనుకునేవారు రేగుల శోభన్ 7732045246 ఫోన్ నంబర్‌కు ఫోన్‌చేసి గాని, బ్యాంక్ అకౌంట్ నంబర్ 62112812530 (ఎస్బీఐ ఐఎఫ్ఎస్సీ నం.0021561) బ్యాంకు ఖాతాలో డబ్బులు జమచేయవచ్చు. -
బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదంలో టెకీ మృతి
-
ఆర్టీసీ బస్ ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని (25) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా ఐడీ కార్డు ఆధారంగా మృతురాలు స్పిన్స్‌సై సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగిని శిరీషగా గుర్తించారు. ఆమెకు ఇటీవలే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ నుంచి కార్యాలయానికి వెళ్లే సమయంలో శిరీష రోడ్డు ప్రమాదానికి గురైంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరోవైపు బస్సు డ్రైవర్, కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
’నారాయణ’ఆడియో టేపుల్లో ఉన్నదంతా నిజమే
-
శిరీష కేసులో కొత్త కోణం
పట్నంబజారు(గుంటూరు): విద్యార్థులను ఇటలీకి పంపిన వీసాల కేసులో గత 18న ఆత్మహత్యకు పాల్పడిన ఇంటూరి శిరీష (29) కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. సుమారు రెండు వందల మంది విద్యార్థులకు సంబంధించిన వీసాల విషయంలో ముంబైలోని కన్సల్టెన్సీ నకిలీదని పోలీసులు గుర్తించారు. గత కొద్ది రోజుల క్రితం గుంటూరు పాతగుంటూరుకు చెందిన పోలీసులు ముంబై వెళ్లారు. అయితే ముంబైలోని మెహాతారోడ్ కృష్ణకుంజ్ ప్రాంతంలో ఉన్న గగన్‌దీప్ కార్యాలయానికి వెళ్లిన గుంటూరు పోలీసులు సైతం కంగుతున్నారు. పూర్తిస్థాయిలో గుంటూరుకు పంపని వీసాలకు తమకు ఎటువంటి సంబంధంలేదని గగన్‌దీప్ కన్సల్టెన్సీ నిర్వాహకులు తెలిపినట్లు సమాచారం. కనీసం పోలీసులకు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. ఎటువంటి సమాచారం ఇచ్చేందుకు నిర్వాహకులు అంగీకరించకపోవటంతో పోలీసులు వెనుదిరిగి వచ్చేశారని చెబుతున్నారు. ఈ క్రమంలో విచారణపై మరింత దృష్టి సారించిన పోలీసులు ముంబై నుంచి గుంటూరుకు వచ్చిన కొరియర్ ఆధారంగా అక్కడి కొరియర్ కార్యాలయాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం. ఆయా సంస్థల నిర్వాహకుల నుంచి సమాచారం కొరవడటంతో సదరు పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. ఇటలీలో ఉన్న తలశిల కిషోర్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఢిల్లీలో సీఐడీ బృందంతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. మరి వీసాలు ఎలా వచ్చాయి? ముంబైలో గగన్‌దీప్ కన్సలెటెన్సీ, కొరియర్ కార్యాలయ నిర్వాహకుల నుంచి కొద్దిపాటి సమాచారం ఆధారంగా కొరియర్ ద్వారా కూడా వీసాలు వచ్చేందుకు అవకాశంలేదని, శిరీషను మోసం చేసిన వ్యక్తులే కొరియర్లా నకిలీ వీసాలను పంపి ఉంటారనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఫోన్‌కాల్ డేటా ఆధారంగా నకిలీ వీసాలు తయారు చేసిన వ్యక్తులను పట్టుకునే పనిలో పోలీసులు వర్గాలు చర్యలు చేపడుతున్నారు. -
నమ్మించి.. నట్టేట ముంచి
♦ తండ్రీకూతుళ్ల బలవన్మరణం కేసులో మలుపు ♦ తొమ్మిది మందిని ఇటలీ పంపేందుకు డబ్బులు అడిగిన ఓ వ్యక్తి ♦ డబ్బులు ముట్టజెప్పిన తర్వాత నకిలీ వీసాలు జారీ, అరెస్టులు పట్నంబజారు (గుంటూరు) : ‘విద్యార్థులకు ఇటలీలో హోటల్ మేనేజ్మెంట్ సీట్లు ఇప్పిస్తా.. మొత్తం నేనే చూసుకుంటా.. నా ఖాతాలో పని నడిపించేందుకు డబ్బులు లేవు.. పంపు..’ అని చెప్పిన వ్యక్తి మాటలు నమ్మి డబ్బు అతని ఖాతాలో వేయడం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. గుంటూరులోని నవభారత్‌కాలనీలో సోమవారం తండ్రీకూతుళ్లు శిరీషా, సూర్యనారయణ బలవన్మరణానికి పాల్పడిన సంగతి విదితమే. మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన భర్త అనేక విషయాలు వెల్లడించారు. తన భార్య ఇటలీలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన నేపథ్యంలో మరో తొమ్మిది మందిని అక్కడికి పంపేందుకు సిద్ధమైంది. ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల చొప్పున తీసుకుని మాయమాటలు చెప్పిన తలశిల కిషోర్ అనే వ్యక్తికి నగదు చెల్లించింది. వీసాతో పాటు ఇతర ఏర్పాట్లు చూడటానికి ముంబైలోని గగన్‌దీప్ అనే కన్సల్టెన్సీని ఆశ్రయించారు. ఈనెల 15న హైదరాబాద్ నుంచి బయలుదేరిన పలువురు అభ్యర్థులు ఢిల్లీ నుంచి టర్కీకి, అక్కడి నుంచి ఇటలీకి వెళ్లాల్సి ఉంది. అయితే.. ఢిల్లీలోనే సదరు వ్యక్తులను నకిలీ వీసాలు కలిగి ఉన్నారని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై 353, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తీహార్ జైలుకు పంపినట్లు సమాచారం. ఇదేకాక మరో వైపు శిరీషా కుటుంబానికి రూ. 20 లక్షలు అప్పుగా ఇచ్చి రూ. 50 లక్షలకు పైగా వడ్డీ వసూలు చేసిన ఇంటూరి శ్రీనివాసరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు కన్సల్టెన్సీతో పాటు తలశిల కిషోర్ మోసంపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర వివరాలు వెల్లడి కావాల్సిఉంది. -
ఒక్కటైన ప్రేమ జంట
♦ పర్సు మరిచిపోయిన యువతితో ప్రేమలో పడిన ఆటోడ్రైవర్ ♦ ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వివాహం ఖిల్లా ఘనపురం: పల్లెటూరుకు చెందిన ఓ యువకుడు బతుకుదెరువుకోసం హైదరాబాద్ వెళ్లి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆ ఆటోలో ఎక్కిన యువతి తన పర్సు మరిచిపోయి దిగింది. ఆ పర్సులో రూ.6వేల నగదుతో పాటు ఏటీఎం కార్డులు, ఫోన్ బుక్కు ఉండడంతో ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఆమె సామగ్రి అందజేసిన డ్రైవర్.. ఆ తర్వాత ఆమెతోనే ప్రేమలో పడ్డాడు. వీరిద్దరి ప్రేమను తొలుత నిరాకరించగా గుడిలో వివాహం చేసుకున్నప్పటికీ ఇరువురి కుటుంబాలు ఆ తర్వాత ఓకే చెప్పడంతో మళ్లీ వినాయకుడి సాక్షిగా ఆదివారం పెళ్లి చేసుకున్నారు. సినిమా కథను తలపించే ఈ స్టోరీ వివరాలు... వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామానికి చెందిన వడ్డె కొండన్న, రామచంద్రమ్మ దంపతుల కుమారుడు రామస్వామి హైదరాబాద్‌లో ఆటో నడుపుతున్నారు. అక్కడే సూపర్మార్కెట్లో పనిచేసే శిరీష ఆటోలో వెళ్లి దిగిపోయే క్రమంలో పర్సు మరిచిపోయింది. అందులో నగదు, ఏటీఎం కార్డులు, ఫోన్‌బుక్ ఉండడంతో రామస్వామి ఆమెకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత గచ్చిబౌలి దగ్గర సూపర్మార్కెట్లో ఉన్న శిరీష వద్దకు వెళ్లి పర్సు అప్పగించగా పరిచయం ప్రారంభమైంది. ఇక అప్పటి నుంచి తరచూ ఫోన్లో మాట్లాడుకుంటుండడంతో ప్రేమ చిగురించింది. ఇరువురి కులాలు వేరు కావడంతో ఈనెల 25న బాల్నగర్ సమీపంలోని అయ్యప్పస్వామి దేవాలయంవివాహం చేసుకున్నారు. విషయం తెలిసి ఇరుకుటుంబాల వారు పెద్ద మనుషులతో కలిసి సోమవారం ఖిల్లాఘనపురంలో పంచాయతీ నిర్వహించగా.. అందరూ అంగీకరించారు. దీంతో ఖిల్లాఘనపురంలోని వడ్డెగేరి సమీపాన ప్రతిష్ఠించిన వినాయకుడి దగ్గర ఇరుకుటుంబాల సమక్షంలో రామస్వామి, శిరీష మళ్లీ పెళ్లి చేసుకున్నారు. -
మాజీ భర్త హత్యకు కుట్ర..భగ్నం
హైదరాబాద్: మాజీ భర్తను హతమార్చేందుకు యత్నించిన భార్య పన్నిన కుట్రను పోలీసులు సకాలంలో స్పందించి భగ్నం చేశారు. మియాపూర్‌లోని పెట్రోల్ పంపుల యజమాని శ్యామ్ సుందర్ రెడ్డిని హతమార్చాలని మాజీ భార్య శిరీష రెడ్డి తండ్రి వాసుదేవరెడ్డి, సుపారి గ్యాంగ్ తో కలసి చేసిన ప్రయత్నాన్ని సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు విఫలం చేశారు. వివరాల్లోకి వెళితే... శ్యామ్ సుందర్ రెడ్డిది వరంగల్ జిల్లా పరకాల. అదే గ్రామానికి చెందిన దగ్గర బంధువైన శిరీషను ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. శిరీష తండ్రి వాసుదేవరెడ్డి బీడీ కార్మికుడు. కొంతకాలం క్రితం నగరానికి వచ్చి స్థిరపడిన శ్యామ్ సుందర్ రెడ్డి మామను, పదో తరగతి చదివిన బావమారిదిని నగరానికి తీసుకువచ్చి అతనికున్న పెట్రోల్ బంకుల్లో భాగస్వామ్యం కల్పించాడు. వీరికి ఇద్దరు పిల్లలు వీళ్ళ వైవాహిక జీవితం కొంత కాలం బాగానే సాగింది. గత ఐదు సంవత్సరాలుగా వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి అప్పటి నుంచి ఆ గొడవలు కాస్త విడాకులకు దారి తీసింది. విడాలులు తీసుకుని శ్యామ్‌సుందర్ రెడ్డి, శిరీష వేర్వేరుగా ఉంటున్నారు. కాగా ఇటీవలే శ్యామ్ సుందర్ రెడ్డి వేరే వివాహం కూడా చేసుకున్నాడు. అయితే, అతడిని మట్టుబెట్టాలనుకున్న శిరీష, ఆమె తండ్రి వాసుదేవరెడ్డి సమీప బంధువైన కొండల్ రెడ్డి తో నెల రోజుల క్రితం సుపారి గ్యాంగ్ ను కలసి రూ.12 లక్షలకు డీల్ కుదుర్చుకుని 2 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. పని అయిన తరువాత మిగతా 10 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. ఈ గ్యాంగ్ పలుమార్లు మియాపూర్ పరిసర ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఈ గ్యాంగ్‌ను పట్టుకోవటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే రూ.15 కోట్ల ఆస్తి శిరీష పేరుమీదనే ఉందని అది కాకుండా మెయింట్నెన్సుగా ప్రతినెలా లక్ష రూపాయలు భరణంగా చెల్లిస్తున్నానని, అయినా తన మీద పగబట్టి చంపాలని చూస్తుందని శ్యామ్ సుందర్ రెడ్డి వాపోయాడు. మొత్తానికి మర్డర్ ప్లాన్ భగ్నం కావడంతో శ్యామ్ సుందర్ రెడ్డి బతికి బట్టకట్టాడు. ఈ కుట్రలో పాల్గొన్న శిరీష తండ్రి వాసుదేవరెడ్డి , కొండల్‌రెడ్డితో పాటు పాత బస్తీ హంతక ముఠాకు చెందిన మజర్, అమ్జాద్, అబ్దుల్ ఖాదర్, అప్సర్, నవీద్, సయ్యద్ వసీం పోలీసుల అదుపులో ఉన్నారు. గతంలో అమ్జద్పై రెండు మర్డర్ కేసులు, అప్సర్పై ఒక మర్డర్ కేసు ఉన్నాయని వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు. -
శిరీషపై అత్యాచారం జరగలేదు
- నమూనాల్లో దానికి సంబంధించిన ఆనవాళ్లు లేవు - విశ్లేషణ తర్వాత స్పష్టం చేసిన ఫోరెన్సిక్ నిపుణులు - బంజారాహిల్స్ పోలీసులకు పరీక్షల నివేదిక అందజేత సాక్షి, హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారిం చారు. మృతదేహంతో పాటు ఆమె వస్త్రాల నుంచి సేకరించిన నమూనాల్లో అత్యాచారానికి సంబంధించిన ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు పరీక్షల నివేదికను ఫోరెన్సిక్ నిపుణులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు అందించారని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. జూన్ 13న షేక్‌పేట్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీ కార్యాలయంలో శిరీష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు రాజీవ్, శ్రవణ్‌లను అరెస్టు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. శిరీషది ఆత్మహత్యగా గతంలోనే నిర్థారించారు. అయితే శిరీష కుటుంబీకులు ఇది హత్యేనంటూ ఆరోపించడంతో పాటు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెపై అత్యాచారం జరిగిందని, ఆమె వస్త్రాలపై రక్తపు మరకలు ఉన్నాయని, ఈ నేథప్యంలో ఆమెది హత్యేనంటూ ఆరోపించారు. వీటిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు శిరీషకు పోస్టుమార్టం పరీక్షలు చేస్తున్న సమయంలో కొన్ని నమూనాలు సేకరించారు. వీటితో పాటు ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె ధరించిన వస్త్రాలనూ పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. ఈ నమూనాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు విస్రా (కడుపు నుంచి సేకరించిన నమూనా) పరీక్షలను బట్టి ఆత్మహత్య చేసుకునే సమయంలో శిరీష మద్యం తాగి ఉన్నట్లు నిర్థారించారు. మరోవైపు సున్నితమైన అవయవాల నుంచి సేకరించిన స్వాబ్స్ (నమూనాలు) విశ్లేషించిన నిపుణులు వాటిలో సెమన్(వీర్యం) కానీ, స్పర్మటోజోవా(శుక్ర కణాలు) ఆనవాళ్లు కానీ లేవని నివేదించారు. ఆమె లోదుస్తులపై ఉన్న మరకలు వ్యక్తిగతమైనవిగా తేల్చారు. మరికొన్ని నమూనాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు ఉరి వేసుకోవడం వల్లే ఆమె మరణం సంభవించినట్లు తేల్చారు. ఈ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను కేసు దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. చనిపోయిన సమయంలో శిరీష ఒంటిపై ఉన్న గాయాల విషయంలోనూ తమకు స్పష్టత ఉందని, పక్కాగా చేపట్టిన దర్యాప్తులో ఈ వివరాలు తెలిశాయని డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. కుకునూర్‌పల్లి నుంచి తిరిగి వస్తున్న సయమంలో రాజీవ్, శ్రవణ్ ఆమెపై దాడి చేశారని, ఈ నేపథ్యంలోనే ఆ గాయాలు, రక్తపు మరకలు అయ్యాయని వివరించారు. నిందితుల్ని దోషులుగా నిరూపించడానికి అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. త్వరలోనే వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేస్తామన్నారు. -
శిరీష మృతికేసు విచారణ ముగిసింది: డీసీపీ
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన బ్యుటీషియన్ శిరీష మృతి కేసులో విచారణ ముగిసిందని వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. శిరీషపై అత్యాచారం జరగలేదని... ఉరి వేసుకోవడం వల్లే చనిపోయినట్టు ఎఫ్ఎస్ఎల్ నివేదికలోనూ స్పష్టమైందని ఆయన అన్నారు. శిరీష్‌ది హత్య అంటూ ఆమె కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ కేసులో నిందితులు రాజీవ్, శ్రవణ్‌కు శిక్షపడేలా అన్ని చర్యలు తీసుకుంటామంటున్న డీసీపీ తెలిపారు. కాగా శిరీష మృతి కేసులో కీలక నివేదిక బయటకొచ్చింది. అత్యాచారం జరగలేదు.. ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. ఈ మేరకు ఆ నివేదికను బంజారాహిల్స్ పోలీసులకు అందించారు. శిరీష దుస్తులపై ఉన్న మరకలు ఆహారానికి సంబంధించినవని ఆ నివేదికలో పేర్కొంది. కాగా, కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న కేసుపై విచారణ కొనసాగుతున్నదని పోలీసు వర్గాలు తెలిపారు. రెండు రోజుల్లో ఫోరెన్సిక్ నివేదికను అధికారికంగా వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా శిరీష ఆత్మహత్య కేసు విచారణకు సంబంధించి తమను కుకునూర్‌పల్లి తీసుకెళ్లి తమ అనుమానాలను పోలీసులు నివృత్తి చేయలేదని ఆమె బంధువులు తెలిపారు. ఆమె మృతిపై తమకు ఇప్పటికీ అనుమానాలున్నాయని వారు పేర్కొన్నారు. నిందితులకు బెయిల్ నిరాకరణ ఈ కేసులో నిందితులు రాజీవ్, శ్రావణ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు శుక్రవారం తిరస్కరించింది. శిరీష కుటుంబసభ్యుల అనుమానాలపై దర్యాప్తు దృష్ట్యా బెయిల్ నిరాకరిస్తున్నట్లు న్యాయస్థానం తెలిపారు. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. -
కుకునూర్‌పల్లికి శిరీష కుటుంబీకులు
సందేహాల నివృత్తి కోసం తీసుకెళ్లిన పోలీసులు సాక్షి, హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష బాబాయితోపాటు మరికొంతమంది కుటుంబీకులను బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్ వరకు పోలీసులు తీసుకువెళ్లారు. శిరీషది ముమ్మాటికీ హత్యేనంటూ కుటుంబీకులు పలుమార్లు ఆరోపించడంతో పాటు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో శిరీష కుటుంబీకుల అనుమానాలను నివృత్తి చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. అధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు కుటుంబీకుల్ని పిలిపించి ఆ ఉదంతం పూర్వాపరాలను తెలిపారు. నగరం నుంచి కుకునూర్‌పల్లికి వెళ్లే మార్గంలో ప్రతి ప్రాంతంలో ఏం జరిగిందనే విషయాలను వివరించారు. కుకునూర్‌పల్లి పోలీసుక్వార్టర్స్‌లోని ఎస్సై గదికి తీసుకెళ్లి ఏం జరిగిందనే అంశాలను సైతం పూర్తిస్థాయిలో వారికి చెప్పారు. -
శిరీషపై అత్యాచారం జరగలేదు!
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీషపై అత్యాచారం జరగలేదని ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందినట్లు తెలుస్తోంది. శిరీష దుస్తులపై ఉన్న మరకల ఆధారంగా ఈ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కాగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక తమకు ఇంకా అందలేదని పోలీసులు చెబుతునక్నారు. అయితే ఫోరెన్సిక్ పరీక్ష రిపోర్ట్ పూర్తిస్థాయిలో వస్తేనే ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది అధికారికంగా, స్పష్టంగా చెప్పగలమని పోలీసులు చెబుతున్నారు. అయితే శిరీషపై అత్యాచారం జరగలేదని నిందితులు రాజీవ్, శ్రావణ్‌లు విచారణలో చెప్పారని, హైదరాబాద్ నుంచి కుకునూర్‌పల్లి వరకూ ఆరుచోట్ల సీసీ ఫుటేజ్ సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్జే స్టూడియోలో రాజీవ్‌కు సంబంధించిన వీడియోలు సేకరించినట్లు పేర్కొన్నారు. కాగా కుకునూర్‌పల్లిలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆమెపై అత్యాచారయత్నం చేయడంతో పాటు అనంతరం జరిగిన ఉదంతం నేపథ్యంలోనే మనస్తాపంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని, ఆమెది ముమ్మాటికీ ఆత్మహత్యేనని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే శిరీష కుటుంబసభ్యులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ముమ్మాటికీ హత్యనేని ఆరోపిస్తున్నారు. మరోవైపు శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు బోదాసు శ్రవణ్(21), వల్లభనేని రాజీవ్ (31) పోలీస్ కస్టడీ ముగియడంతో వారిని నిన్న కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
‘కసబ్ కంటే శిరీష కేసు పెద్దది కాదు’
హైదరాబాద్ :ముంబైలో దాడులకు పాల్పడ్డ పాక్ ఉగ్రవాది కసబ్ కేసు కంటే బ్యూటీషియన్ శిరీష మృతి కేసు పెద్దది కాదని ఈ కేసులో ప్రధాన నిందితుల తరఫు న్యాయవాది వెంకట్ వ్యాఖ్యానించారు. పోలీసుల విచారణ తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. కాగా ఈ కేసులో సమగ్ర విచారణ నిమిత్తం నిందితులు శ్రావణ్, రాజీవ్‌లను బంజారాహిల్స్ పోలీసులు ఇవాళ తమ కస్టడీలోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు వారిని పోలీసులు విచారణ చేయనున్నారు. అంతకు ముందు వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపైన కూడా సమగ్రంగా విచారణ జరపనున్నారు. శిరీష మృతి కేసులో సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ‘శిరీష ఆత్మహత్య చేసుకుందా?, హత్యకు గురయిందా?. ఆమెను కుకునూర్‌పల్లిలో ఏ సెటిల్మెంట్కు తీసుకు వెళ్లారు. ఇంతకీ శిరీష డిమాండ్ ఏంటి?. రాజీవ్ ఏం కావాలనుకున్నాడు. కుకునూర్‌పల్లిలో ఏం జరిగింది.అక్కడ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రాలేదు?. ఉద్దేశపూర్వకంగానే శిరీషను ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి అప్పగించారా? ఈ కేసులో తేజస్విని పాత్ర ఏంటి?. తేజస్విని ఇప్పటివరకు పోలీసులు ఎందుకు విచారించలేదు?. శిరీష ఆడియో రికార్డింగ్‌లు ఎవరు బయటపెట్టారు?. కుకునూర్‌పల్లి నుంచి వచ్చే దారిలో శిరీషను ఎందుకు కొట్టారు?. అసలు ఆర్జే స్టూడియోలో ఏం జరిగింది? సీసీ పుటేజ్ ఎందుకు బయటకు రాలేదు?. కాల్ రికార్డులో ఉన్న నందు, నవీన్ ఎవరు?. వారిని పోలీసులు విచారించారా?. తేజస్విని సంగతి చూడమని శిరీష ఎవరెవరికి చెప్పింది?. ఆమెను ఎవరెవరు బెదిరించారు?. ఈ విషయం రాజీవ్‌కు తెలుసా?.’ అనే ప్రశ్నలకు ఇప్పటికీ సరైన సమాధానాలు మాత్రం బయటకు రాలేదు. -
శిరీష వ్యవహారమే కారణం!
► ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యపై విచారణ నివేదిక సిద్ధం ► శిరీష అంశంతో పరువుపోతుందనే ఆందోళనతోనే ఆత్మహత్య ► నేడు డీజీపీకి నివేదిక అందించే అవకాశం సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహ త్యకు బ్యూటీషియన్ శిరీష వ్యవహారమే కారణమంటూ ఈ కేసులో విచారణాధికారి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రభాకర్ రెడ్డిని గజ్వేల్ ఏసీపీ వేధించినట్లుగా వచ్చిన ఆరోపణలకు ఎక్కడా ఆధారాల్లే వని వెల్లడైన ట్లుగా అందులో నిర్ధారించినట్లు సమాచారం. ఈ నెల 14న ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాకర్‌రెడ్డిది హత్య అని కొంద రు, ఉన్నతాధికారుల వేధింపుల తో ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుం బీకులు ఆరోపించారు. దీంతో డీజీపీ అనురాగ్ శర్మ ఈ ఘటనపై అదనపు డీజీపీ గోపీకృష్ణతో విచారణకు ఆదేశించారు. ఆయనతోపాటు సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న విచారణ జరిపారు. వారు కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను, ఎస్సై క్వార్టర్స్‌ను పరిశీలించారు. శిరీష ఆత్మహత్య కేసులో అరెస్టయిన రాజీవ్, శ్రవణ్ లను.. కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ సిబ్బందిని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల వేధింపులకు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉన్నాయేమో నని ఆరా తీశారు. అయితే గజ్వేల్ ఏసీపీ కావాలనే ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని వేధించినట్లుగా వచ్చిన ఆరోపణల్లో ఎక్కడా ఆధారాల్లేవని విచారణాధికారులు ధ్రువీకరించుకున్నట్టు తెలుస్తోంది. అయితే మెటర్నిటీ సెలవు విష యంలో, పాత కేసుల క్లోజింగ్ విషయంలో ఏసీపీ వేధించినట్టు ఆధారాలున్నాయని.. చార్జిమెమోల విషయంలో ఆధారాలేమీ లేవని గుర్తించినట్లు సమాచారం. శిరీష వ్యవహారం లో ఆరోపణలు వస్తే సమాజంలో పరువు పోతుందన్న భయం, మానసిక ఒత్తిడి, క్షణికా వేశంలోనే ఎస్సై ఆత్మహత్యకు పాల్పడినట్టు గా నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఆందోళన చేసినవారిపై కేసులు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న రోజు కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ ఎదుట చేసిన ఆందోళన, దాడులను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. పోలీస్‌శాఖపై ఆరోపణలు చేసిన సిబ్బందితో పాటు మీడియా వాహనాలు, పోలీస్ వాహనాల ధ్వంసానికి యత్నించిన ప్రైవేట్ వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎస్సై ఆత్మహత్య వ్యవహారాన్ని ఇద్దరు కానిస్టేబుళ్లు హత్యగా తప్పుడు ప్రచారం చేసేందుకు యత్నించినట్టుగా విచరణాధికారులు నివేదికలో పొందుప రిచినట్టు తెలిసింది. వారిపై కుట్ర కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సూచించను న్నట్లు సమాచారం. ఈ నివేదికను శుక్రవారం డీజీపీకి అందించనున్నట్లు తెలిసింది. -
శిరీష కేసులో తాజా అప్డేట్స్
హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో శ్రవణ్, రాజీవ్‌లను పోలీసులు నాంపల్లి కోర్టులో హజరుపరిచారు. అంతకుముందు వీరిద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి వీరిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించనున్నారు. శిరీష ఆత్మహత్య చేసుకున్నప్పటికీ అందుకు వీరు పరోక్షంగా కారణమవడం, ప్రత్యక్షంగా భౌతిక దాడి చేయడం వంటి కారణాల దృష్ట్యా కనీసం వీరిద్దరికి పదేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. మరిన్ని వార్తా కథనాలకై చదవండి శిరీషది ఆత్మహత్యే -
కేసును పక్కదోవ పట్టిస్తున్నారు
- శిరీష తండ్రి రవీందర్, అక్క భార్గవి ఆరోపణ - రాజీవ్, శ్రవణ్, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి కలిసే హత్య చేశారు - న్యాయం జరిగే వరకూ పోరాడతామని వెల్లడి మిర్యాలగూడ: శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, అది ముమ్మాటికీ హత్యేనని ఆమె తండ్రి ఎక్కంటి రవీందర్, అక్క భార్గవి పేర్కొన్నారు. పోలీసులు ఈ కేసును పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో రవీందర్, భార్గవి విలేకరులతో మాట్లాడారు. శిరీష కుటుంబా నికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు, మరే విధమైన సమస్యలు లేవని వారు పేర్కొ న్నారు. ఎంతో చలాకీగా ఉండే శిరీష మంచి బ్యూటీషియన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందన్నారు. స్నేహితుల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించాలంటూ.. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి వద్దకు వెళితే శిరీషపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణమని పేర్కొన్నారు. పోలీసు అధికారులే ఇలా చేస్తే ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్, శ్రవణ్, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ముగ్గురు కలసి పథకం ప్రకారమే శిరీషను హత్య చేశారని ఆరోపించారు. శిరీష దేహంపై గాయాలున్నాయని వాటిని చూస్తే ముమ్మాటికీ హత్యేనని అర్థమవుతోందని చెప్పారు. పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కూడా హత్యగా పేర్కొన్నారని.. కానీ కావాలనే పోలీసులు కేసును నీరుగార్చుతున్నారని ఆరోపించారు. పోరాటం చేస్తాం.. రాజీవ్‌తో శిరీషకు వివాహేతర సంబంధం ఉందని పోలీసులు చెప్పడం దారుణమని.. పోలీసు శాఖను కాపాడుకోవడానికే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని శిరీష తండ్రి, సోదరి పేర్కొన్నారు. దగ్గరుండి కంటితో చూసినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. తేజస్విని వల్లే వారి మధ్య వివాదం వచ్చిందని, ఆమెను విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయని పేర్కొన్నారు. కానీ పోలీసులు ఇప్పటి వరకు కూడా తేజస్వినిని ఎందుకు విచారించలేదని ప్రశ్నిం చారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని... మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. ప్రభు త్వం చొరవ తీసుకుని కేసును తిరిగి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. -
శిరీషది ముమ్మాటికీ హత్యే
- కుటుంబసభ్యుల ఆరోపణ - ఆమె శరీరంపై ఉన్న గాయాలే ఇందుకు సాక్ష్యం ఆచంట: బ్యూటీషియన్ ఆరుమల్లి విజయలక్ష్మి (శిరీష) మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శిరీష ఆత్మహ త్యకు పాల్పడిందని పోలీస్ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరులో ఉంటు న్న ఆమె కుటుంబసభ్యులు శుక్రవారం మీడి యా ముందుకు వచ్చారు. శిరీష తల్లి రామ లక్ష్మి మాట్లాడుతూ.. తన కుమార్తె మృతి కేసును పోలీసులు నీరు గారుస్తున్నారన్నారు. ‘నా కూతురు ఒకరికి భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది మాత్రం కాదు..’ అని రామలక్ష్మి అన్నారు. తేజస్వినిని ఎందుకు విచారించలేదు? స్టూడియో యజమాని రాజీవ్‌ను వివాహం చేసుకోవాల్సిన తేజస్వినిని ఇప్పటివరకు ఎం దుకు విచారించలేదని రామలక్ష్మి ప్రశ్నిం చారు. ప్లాస్టిక్ తాడును మెడకు బిగించినట్టు శిరీష మృతదేహంపై గుర్తులున్నాయన్నారు. శిరీష 6 అడుగుల ఎత్తు, 80 కేజీల వరకూ బరువుంటుందని.. ఆమె ఫ్యాన్‌కు ఉరివేసు కుంటే ఫ్యాన్ ఎందుకు చెక్కు చెదరలేదని ప్రశ్నించారు. రాజీవ్, శ్రావణ్‌లు పథకం ప్రకా రమే శిరీషను స్టూడియోకు తీసుకెళ్లి మెడకు వైరు బిగించి చంపేసి ఆత్మహత్యగా చిత్రీ కరిస్తున్నారని రామలక్ష్మి ఆరోపించారు. కట్టు కథలు చెబుతున్నారు రాజీవ్, శ్రావణ్‌లు పథకం ప్రకారం శిరీషను చంపేశారు. ఆమె తలపై, చెంపలు, పెదవులమీ దున్న గాయాలే ఇందుకు సాక్ష్యం. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయకుండా కేసును పక్క దారి పట్టిస్తున్నారు. వారి మాటలన్నీ కట్టుక థల్లా ఉన్నాయి. – శిరీష అత్త శారద, మామ వెంకటేశ్వర రావు -
శిరీషది ఆత్మహత్యే
ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ - రాజీవ్ విషయంగా తేజస్విని–శిరీష మధ్య వివాదం - దాన్ని పరిష్కరించాలంటూ కుకునూర్‌పల్లికి వెళ్లిన రాజీవ్, శ్రవణ్, శిరీష.. మద్యం మత్తులో ఆమెపై ఎస్సై ప్రభాకర్ అత్యాచారయత్నం - గొడవ చేసిన శిరీష.. ఆమెపై చేయి చేసుకున్న రాజీవ్ - స్టూడియోకు చేరుకున్నాక ఉరివేసుకున్న శిరీష - ఈ విషయం బయటపడుతుందని ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యగా తేలిందని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి వెల్లడించారు. తేజస్వినికి సంబంధించిన వివాదాన్ని సెటిల్ చేసుకునేందుకు రాజీవ్, శ్రవణ్‌లతో కలసి ఆమె కుకునూర్‌పల్లి వెళ్లారని.. అక్కడ ఎస్సై ప్రభాకర్‌రెడ్డి సహా నలుగురూ మద్యం తాగారని చెప్పారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మద్యం మత్తులో శిరీషపై అత్యాచారయత్నం చేసినట్లు తేలిందని.. వారు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక శిరీష ఆత్మహత్యకు పాల్పడిందని వివరించారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెస్ట్‌జోన్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు ఎ.వెంకటేశ్వరరావు, బి.లింబారెడ్డిలతో కలసి ఆయన ఈ ఘటన వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంలో తేజస్వినిపై ఎలాంటి కేసూ ఉండదని, శ్రవణ్ కుట్రతో వ్యవహరించినట్లు అనుమానిస్తున్నామని చెప్పారు. సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్యూటీపార్లర్‌కు నష్టాలు రావడంతో.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన ఎ.విజయలక్ష్మి అలియాస్ శిరీష వృత్తిరీత్యా బ్యుటీషియన్. 13 ఏళ్ల క్రితం ఎ.సతీష్‌చంద్రతో ఆమెకు వివాహం జరిగింది. వారికి 12 ఏళ్ల కుమార్తె ఉంది. కొంతకాలం బ్యూటీపార్లర్ నిర్వహించిన శిరీష.. నష్టాలు రావడంతో నాలుగేళ్ల కింద ఫిల్మ్‌నగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియోలో మేనేజర్ కమ్ మేకప్ ఆర్టిస్ట్‌గా చేరింది. విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్‌కుమార్ ఈ స్టుడియోకు యజమాని. రాజీవ్‌కు, శిరీషకు అంతకుముందే ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే స్టుడియోలో ఉద్యోగమిచ్చాడు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మరోవైపు రాజీవ్‌కు దాదాపు ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారానే బెంగళూరుకు చెందిన తేజస్విని అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె తరచూ హైదరాబాద్‌కు వచ్చి రాజీవ్‌ను కలిసేది. ఇది ప్రేమగా మారి శారీరకంగానూ ఒక్కటయ్యారు. వివాహం చేసుకుందామని కూడా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తేజస్విని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆఫీస్ బాయ్ ద్వారా విషయం బయటపడి.. తేజస్వినికి తొలుత శిరీష–రాజీవ్‌ల మధ్య సంబంధం తెలియదు. అయితే కొద్దిరోజుల కింద ఆమె స్టూడియోకు వచ్చి రాజీవ్ గురించి అడగగా.. ఆయన తన భార్యతో కలసి బయటికి వెళ్లారని ఆఫీస్ బాయ్‌లు చెప్పారు. అదేమిటని ఆరా తీయడంతో శిరీష–రాజీవ్ మధ్య సంబంధం తెలిసింది. అప్పటి నుంచి ఈ విషయంపై వివాదం మొదలైంది. గత నెల 30న స్టూడియోకు వచ్చిన తేజస్విని.. రాజీవ్‌తో ఉన్న సంబంధంపై శిరీషతో వాగ్వాదానికి దిగింది. గొడవ ముదిరి ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో రాజీవ్ ‘100’ద్వారా పోలీసులకు సమాచారమిచ్చాడు. స్టూడియోకు వచ్చిన బంజారాహిల్స్ పోలీసులు.. ఆ ముగ్గురినీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఎస్సై శ్రీనివాస్‌కు తేజస్విని, శిరీష ఒకరిపై ఒకరు మౌఖికంగా ఫిర్యాదు చేశారు. అయితే ఎస్సై వారికి కౌన్సెలింగ్ చేసి పంపేశారు. తేజస్విని బెదిరింపులతో.. గొడవ ఘటన తర్వాత నుంచి పోలీసు కేసు పెడతానంటూ తేజస్విని పలుమార్లు రాజీవ్, శిరీషలను బెదిరించింది. వాట్సాప్ ద్వారా శిరీషకు అభ్యంతరకర సందేశాలు పంపడం మొదలుపెట్టింది. దీనితో విసిగిపోయిన శిరీష ఈ వివాదాన్ని పరిష్కరించాలంటూ.. తన స్నేహితుడైన బోదాసు శ్రవణ్‌కుమార్‌ను కోరింది. నల్లగొండ జిల్లా మాల్‌కు చెందిన రియల్టర్ శ్రవణ్‌కుమార్.. ఏడాది క్రితం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో ఉండి ఎస్సై పరీక్షలకు కోచింగ్ తీసుకున్నాడు. అక్కడికి సమీపంలో ఉన్న ఓ బొటిక్కు వస్తున్న నేపథ్యంలో శిరీషతో పరిచయమై, స్నేహంగా మారింది. శిరీష విజ్ఞప్తి మేరకు తేజస్విని వివాదం పరిష్కరించడానికి శ్రవణ్ సిద్ధమయ్యాడు. ఇందుకోసం తన స్నేహితుడైన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డిని సహాయం కోరాడు. ప్రభాకర్‌రెడ్డి దేవరకొండలో ప్రొబేషనరీ ఎస్సైగా పనిచేసినప్పుడు శ్రవణ్‌తో పరిచయమైంది. అయితే ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లోనే ఎస్సైగా పనిచేసే తన స్నేహితుడు హరీందర్ వద్దకు వెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో 12వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో రాజీవ్, శ్రవణ్ ఎస్సై హరీందర్‌ను కలిశారు. అదే పోలీస్‌స్టేషన్‌లోని మరో ఎస్సై శ్రీనివాస్ వద్దకు అంతకుముందే ఈ వివాదం వచ్చిందని తెలియడం, పనిఒత్తిడిలో ఉండటంతో హరీందర్ వారిని కొద్దిరోజుల తర్వాత రమ్మని సూచించారు. అప్పటికప్పుడు కుకునూర్‌పల్లికి.. బంజారాహిల్స్ ఎస్సైని కలసి వచ్చిన తర్వాత రాజీవ్, శ్రవణ్, శిరీష ముగ్గరూ బంజారాహిల్స్ రోడ్ నం.10లోని ఓ కాఫీ షాప్‌కు వెళ్లారు. అక్కడ కూర్చున్న సమయంలో ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన కుకునూర్‌పల్లికి రావాలని సూచించడంతో రాత్రి 9.30 గంటల సమయంలో ముగ్గురూ రాజీవ్‌కు చెందిన ఎండీవర్ కారులో బయలుదేరారు. మధ్యలో బంజారాహిల్స్‌లో మద్యం, రాయదుర్గం రోడ్లో తినుబండారాలు కొనుక్కుని వెళ్లారు. రాత్రి 11.30 గంటల సమయంలో నేరుగా కుకునూర్‌పల్లి పోలీసుస్టేషన్ పక్కన ఉన్న ఎస్సై క్వార్టర్స్‌కు చేరుకున్నారు. నలుగురూ అర్ధరాత్రి 2 గంటల వరకు క్వార్టర్స్‌లోనే మద్యం తాగారు. ఈ సమయంలోనే తేజస్విని వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులను శిరీష, రాజీవ్‌లు ప్రభాకర్‌రెడ్డికి వివరించగా.. తాను పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. అయితే మధ్యలో శిరీష మినహా మిగతా ముగ్గురూ సిగరెట్ తాగడానికి క్వార్టర్స్ నుంచి బయట ఆవరణలోకి వచ్చారు. శిరీష కూడా వస్తుండగా.. సెంట్రీ చూస్తే ఇబ్బందంటూ లోపలే ఉండాలని సూచించారు. వ్యభిచారుల వద్దకు వెళ్లాలంటూ.. క్వార్టర్స్ ఆవరణలో ఉన్న సమయంలో ప్రభాకర్‌రెడ్డి వ్యభిచారిణుల ప్రస్తావన తెచ్చాడు. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో అందమైన వ్యభిచారిణులు ఉంటారని, వెళ్లి ఎంజాయ్ చేసి రావాలని సూచించాడు. ఈ సమయంలో వారి మాటలు విన్న శిరీష కీడు శంకించింది. రాజీవ్, శ్రవణ్‌లు అలా వెళితే తాను ఒంటరిగా మిగిలిపోతాననే భయంతో ‘రాజీవ్ ప్లీజ్ డోంట్ లీవ్.. బీ విత్ మీ’అంటూ రాజీవ్‌కు వాట్సాప్ సందేశాలు పంపింది. అనంతరం ముగ్గురూ క్వార్టర్స్‌లోకి వెళ్లారు. తిరిగి అందరూ కలసి మరికొంత మద్యం తాగారు. కొద్దిసేపటికి రాజీవ్, శ్రవణ్ మళ్లీ సిగరెట్ తాగివస్తామంటూ క్వార్టర్స్ బయట ఆవరణలోకి వెళ్లారు. ఈ సమయంలో ఒంటరిగా మిగిలిన శిరీషపై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం చేశాడు. దానిని ప్రతిఘటించిన శిరీష.. రోదిస్తూ కేకలు వేసింది. దీంతో లోపలికి వెళ్లిన రాజీవ్, శ్రవణ్‌లు ఆమెకు సర్దిచెప్పే యత్నం చేశారు. అయినా ఆమె గొడవ చేయడంతో ప్రభాకర్‌రెడ్డిని బయటకు తీసుకువచ్చారు. ఆ సమయంలో ప్రభాకర్‌రెడ్డి మరోసారి రాజీవ్, శ్రవణ్‌లను వ్యభిచారిణుల వద్దకు వెళ్లాలని సూచించాడు. శిరీషపై చేయి చేసుకున్న రాజీవ్ అయితే శిరీష గొడవచేయడం ఆపకపోవడంతో రాజీవ్ దుర్భాషలాడుతూ ఆమెపై చేయి చేసుకున్నాడు. ఈ గొడవతో పోలీస్ క్వార్టర్స్‌లోని ఇతరులు మేల్కొంటారనే ఉద్దేశంతో.. అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ప్రభాకర్‌రెడ్డి సూచించాడు. దీంతో ఆమెను రాజీవ్, శ్రవణ్‌లు శిరీషను కారులో ఎక్కించుకుని.. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఆమె గొడవ చేయడం ఆపలేదు. తనను వ్యభిచారిగా చూస్తున్నారంటూ.. కారు దిగి పారిపోయే ప్రయత్నం చేసింది. శ్రవణ్ కారు దిగి వెళ్లి ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చి కారు ఎక్కించాడు. ఈ సమయంలో రాజీవ్ మరోసారి ఆమెపై చేయి చేసుకున్నాడు. దాంతో ఆమె తల, ముఖం, పెదవులు, కడుపు భాగంలో గాయాలయ్యాయి. వారు హైదరాబాద్ వచ్చేసరికి ప్రభాకర్‌రెడ్డి రెండుసార్లు శ్రవణ్‌కు ఫోన్ చేశాడు. తమ ప్రాంతం దాటారా.. లేదా? ఆమె గొడవ చేయడం ఆపిందా? అంటూ ఆరా తీశాడు. తిరిగి రాగానే ఆత్మహత్య రాజీవ్, శ్రవణ్, శిరీష ముగ్గురూ మంగళవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఫిల్మ్‌నగర్‌లోని స్టూడియో వద్దకు చేరుకున్నారు. వెంటనే లోపలికి వెళ్లిన శిరీష.. తన స్కార్ఫ్‌తో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఇది చూసిన రాజీవ్.. అప్పటికే క్యాబ్‌లో వెళ్లిపోతున్న శ్రవణ్‌కు ఫోన్ చేసి వెనక్కి పిలిచాడు. శిరీషను కిందికి దింపి మంచంపై పడుకోబెట్టాడు. శ్రవణ్ కూడా వచ్చి అంబులెన్స్, పారామెడికల్ స్టాఫ్‌ను పిలిపించగా.. అప్పటికే శిరీష మరణించినట్లు ధ్రువీకరించారు. దీంతో రాజీవ్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే ఈ వివాదానికి సంబంధించి ప్రభాకర్‌రెడ్డి విషయం బయటకు వెల్లడించవద్దని రాజీవ్, శ్రవణ్‌లు నిర్ణయించుకున్నారు. బంజారాహిల్స్ ఎస్సై నుంచి ప్రభాకర్‌రెడ్డికి వివరాలు శిరీష భర్త ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసిన పోలీసులు మంగళవారం రాజీవ్, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏం జరుగుతోందనే ఆందోళనతో ప్రభాకర్‌రెడ్డి తన స్నేహితుడైన ఎస్సై హరీందర్‌కు పలుమార్లు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బుధవారం ఉదయం 10.05 గంటలకు ఫోన్ చేసినప్పుడు ‘ముగ్గురూ (రాజీవ్, శ్రవణ్, శిరీష) నీ దగ్గరకు వచ్చారట కదా! నలుగురూ కలిసి మద్యం తాగారట కదా..’అని హరీందర్ పేర్కొన్నారు. దీంతో తాను, శ్రవణ్ మాత్రమే మద్యం తాగామంటూ ప్రభాకర్‌రెడ్డి ఫోన్ కట్ చేశారు. ఆ తర్వాత కొంత సేపటికే ప్రభాకర్‌రెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాజీవ్, శ్రవణ్‌లను అరెస్టు చేస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కేసులో శేష ప్రశ్నలెన్నో..! బ్యూటీషియన్ శిరీషది కచ్చితంగా హత్యేనని.. ఈ వ్యవహారంలో ఎన్నో సందేహాలున్నాయని ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని డిమాండ్ చేస్తున్నా రు. వారు వ్యక్తం చేస్తున్న అనుమానాలివి .. 1. శిరీష 6 అడుగుల ఎత్తు, 80 కేజీల వరకూ బరువుంటుందని.. కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుంటే ఫ్యాన్ ఎందుకు చెక్కు చెదరలేదు? అసలు ఫాల్స్ సీలింగ్ ఉన్న గదిలో మంచంపై నిల్చుని ఫ్యాన్‌కు ఉరేసుకోవడం సాధ్యమేనా? 2. కుకునూర్‌పల్లిలో శిరీష, రాజీవ్, శ్రవణ్, ఎస్సై ప్రభాకర్‌రెడ్డి కలసి మద్యం తాగారని... మిగతా ఇద్దరు సిగరెట్ కాల్చ డానికి బయటకు వచ్చిన సమయంలో శిరీషపై ప్రభాకర్‌రెడ్డి అత్యాచారయత్నం చేశాడన్న వాదనను పోలీసులు ఎలా నమ్మారు? సిగరెట్ కాల్చి వచ్చే వ్యవధి లోనే అలా చేయడం సాధ్యమా? 3. ఏడాది కింద పరిచయమైన తేజస్వినికి రాజీవ్ సన్నిహితమయ్యాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని.. శిరీషను వదిలించుకోవాలని భావించాడు. అలాంటి వ్యక్తి చెప్పిన కథనం ఎంత వరకు నమ్మశక్యం? 4. కుకునూర్‌పల్లిలో శిరీషపైనే అత్యాచారయ త్నం జరిగింది. బాధితురాలి పైనే రాజీవ్ ఎందుకు చేయిచేసుకోవాల్సివచ్చింది? 5. ఆమె మరణించిన తర్వాత నిందితులు ఆమెకు సంబంధించి చెప్పిన వివరాలను పోలీసులు ఎలా నమ్మారు? వారి మాటలు నమ్మి శిరీష, తేజస్వినిల వ్యక్తిగత జీవితా లపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబేనా? -
శిరీషపై ఎస్ఐ రేప్ అటెంప్ట్ చేశాడు..కానీ..
- మృతురాలి శరీరభాగాలను భద్రపరిచాం.. పరీక్షల తర్వాత మరిన్ని వివరాలు - సంచలనాత్మక కేసు వివరాలను వెల్లడించిన సీపీ మహేందర్ రెడ్డి - ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి శిరీషను తీసుకెళ్లడంలో శ్రావణ్ కుట్ర - శిరీష కేసులో ఏ1గా శ్రావణ్, ఏ2గా రాజీవ్ - ఎస్సై ఆత్మహత్యకేసులో విడిగా దర్యాప్తు సాగుతోందన్న కొత్వాల్ హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీషపై కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అత్యాచార యత్నం చేశాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రేప్ అటెంప్ట్ సమయంలో శిరీష గట్టిగా కేకలు వేసిందని, ‘నేను అలాంటిదాన్ని కాను..’ ఎస్సైని వేడుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనతోపాటు హైదరాబాద్ తిరుగుప్రయాణంలో రాజీవ్, శ్రావణ్‌లు పలు మార్లు కొట్టడంతో మనస్తాపానికి గురైన శిరీష్ ఆత్మహత్య చేసుకుందని సీపీ వివరించారు. ఈ కేసుకు సంబంధించి శ్రావణ్‌ను ఏ1గా, రాజీవ్‌ను ఏ2గా చేర్చామని చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదికలో కూడా శిరీష ఆత్మహత్య చేసుకోవడం వల్లే చనిపోయి ఉండొచ్చని వైద్యులు పేర్కొన్నట్లు కమిషనర్ మహేందర్‌రెడ్డి చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే.. ‘‘విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్ కుమార్ హైదరాబాద్‌లో ఆర్జే ఫోటోగ్రఫీ పేరుతో స్టూడియో నిర్వహిస్తున్నాడు. అతని స్టూడియోలో శిరీష నాలుగేళ్లుగా పని చేస్తోంది, వీరి మధ్య క్రమంగా సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే కొంతకాలం క్రితం రాజీవ్‌కు ఫేస్బుక్ ద్వారా బెంగళూరుకు చెందిన తేజస్వినీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తేజస్వినీ మూడు నెలల క్రితం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్‌పై వచ్చింది. శిరీష వ్యవహారాన్ని ఆలస్యంగా తెలుసుకున్న తేజస్వీ.. రాజీవ్‌ను నిలదీసింది. అదే సమయంలో శిరీష కూడా రాజీవ్ తనను దూరం చేస్తున్నాడని భావించింది. ఈ క్రమంలో శిరీష-తేజస్విని మధ్య గొడవ జరిగి, అదికాస్త ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అయితే రెండు రోజుల అనంతరం తేజస్వినీ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుని, తాము పరిష్కరించుకుంటామని తెలిపింది. మరోవైపు శిరీష... ఈ వ్యవహారాన్ని అంతా తనకు ఏడాది క్రితం పరిచయం అయిన శ్రావణ్‌కు తెలిపింది. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం కావాలని అడగగా, అతడు తనకు సన్నిహితుడు అయిన సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి తెలిపాడు. అతని వద్దకు వెళ్లి వివాదాన్ని పరిష్కరించుకుందామంటూ శ్రావణ్, శిరీష, రాజీవ్‌తో కలసి అక్కడకు వెళ్లారు. వెళ్లేటప్పుడు తమతో మద్యాన్ని తీసుకు వెళ్లారు. ఎస్ఐ క్వార్టర్స్‌లోనే వీరంతా కలిసి మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో శిరీష, రాజీవ్‌ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే సమస్య ఎంతకూ పరిష్కారం కాలేదు. దీంతో రాజీవ్, శ్రావణ్ సిగరెట్ తాగేందుకు బయటకు వెళ్లారు. గదిలో ఉన్న శిరీషపై ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో రాజీవ్, శ్రావణ్‌లు లోనికి వెళ్లారు. సమస్య పరిష్కారం చేసుకుందామని తీసుకు వచ్చి ఇలా ప్రవర్తిస్తారా అంటూ శిరీష భోరున ఏడుస్తూ పెద్దగా అరవసాగింది. అయితే అలా అరవద్దొంటూ శిరీషపై రాజీవ్ చేయిచేసుకుని, అక్కడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సందర్భగా కారులో నుంచి కూడా దూకేందుకు ఆమె ప్రయత్నించడంతో శిరీషను బలవంతంగా కారులోకి తోయడంతో పాటు, కొట్టడంతో ఆమె పెదవులకు గాయాలు అయ్యాయి. తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నాక, ఆర్జే స్టూడియకు శిరీష వెళ్లింది. తాను కూడా ఇంటికి వెళతానని పైకి వెళ్లిన శిరీష ఎంతకీ కిందకు రాకపోవడంతో రాజీవ్, శ్రావణ్ వెళ్లి చూశారు. అయితే డోర్ తెరుచుకోకపోవడంతో శ్రావణ్ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో శిరీష...రాజీవ్‌కు వీడియో కాల్ చేసినా, అతడు స్పందించలేదు. దాంతో కాల్ కూడా చేసింది. శ్రావణ్‌ను పంపించిన అనంతరం రాజీవ్ పైకి వెళ్లి చూసేసరికి శిరీష ఉరేసుకుని ఉంది. రాజీవ్...ఆ విషయాన్ని శ్రావణ్‌కు ఫోన్ చేసి చెప్పాడు. రాజీవ్ వచ్చాకా అపోలో నుంచి డాక్టర్లను తీసుకు వచ్చి శిరీషను పరీక్ష చేయించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శిరీష భర్తకు సమాచారం అందించారు. మరోవైపు ఈ నెల 13న బంజారాహిల్స్ ఎస్ఐకి కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి, ఈ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నాడు. అలాగే 14న మరోసారి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అదేరోజు మధ్యాహ్నం ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయాడు.’ అని సీపీ పేర్కొన్నారు. శిరీష, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిది ఆత్మహత్యలేనని ఆయన తెలిపారు. నేరస్తులు చెప్పిన ప్రకారం శిరీష కూడా మద్యం సేవించిందని చెబుతున్నారని, అయితే ఆమె మద్యం సేవించిందా లేదా అనేది మెడికల్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాతే తేలుతుందని సీఐ చెప్పారు. మరోవైపు మృతురాలు శిరీష సోదరి భార్గవి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న తేజస్వినీని పోలీసులు ఎందుకు విచారణ చేయడం లేదని ఆమె ప్రశ్నించారు. -
బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యే
హైదరాబాద్ : సంచలనం సృష్టించిన అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీషది ఆత్మహత్యనని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఏ-1 శ్రావణ్, ఏ-2 రాజీవ్‌లను నిందితులుగా చేర్చారు. అలాగే శిరీష, శ్రావణ్, రాజీవ్ సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లి వెల్లినట్లు పోలీసులు నిర్థారించారు. ఆ రాత్రి శిరీషతో పాటు రాజీవ్, శ్రావణ్, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి మద్యం సేవించినట్లు పోలీసులు వెల్లడించారు. పార్టీ అనంతరం ఒంటరిగా ఉన్న శిరీషపట్ల ఎస్ఐ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు శ్రావణ్, రాజీవ్ పోలీసులు విచారణలో తెలిపారు. అతడి చేష్టలతో అవాక్కయిన శిరీష మనస్తాపం చెందిందని, ఒక్కసారిగా ఆమె పెద్దగా అరవడంతో బయట ఉన్న రాజీవ్, శ్రావణ్ లోనికి వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మహేందర్ రెడ్డి మీడియాకు వివరించారు. -
‘మా చెల్లి శిరీష పిరికిది కాదు.. తనది హత్యే’
నల్లగొండ: తమ చెల్లి శిరీష ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె సోదరి భార్గవి అన్నారు. శిరీషది ముమ్మాటికి హత్యే అని ఆమె చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించాలని అస్సలు వదిలిపెట్టొద్దని అన్నారు. హత్య వెనుక రాజీవ్, శ్రవణ్, తేజస్వీ ప్రమేయం ఉందని అన్నారు. కావాలనే హత్యను ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తన సోదరి చాలా ధైర్యంగల యువతి అని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ఈ కేసులో తనకు పలు అనుమానాలున్నాయని, ఇప్పటి వరకు పోలీసులు తేజస్వీని ఎందుకు చూపిండం లేదని ప్రశ్నించారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనతో తెరపైకి వచ్చిన బ్యూటీషియన్ అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష మృతి కేసును ఛేదించినట్లుగా పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే. తొలుత ఆత్మహత్యగా.. అనంతరం అనుమానాస్పద మృతిగా మారిన ఈ కేసుపై వివరాలను హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వెల్లడిస్తారని ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలో శిరీష సోదరి భార్గవి స్పందించారు. -
వెళ్లింది పోలీస్ స్టేషన్కా? లేక ఫామ్ హౌస్కా?
గజ్వేల్ / కొండపాక : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లి ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనపై దర్యాప్తు ముమ్మరమైంది. ఈ పోలీస్‌స్టేషన్‌లో పది నెలల వ్యవధిలోనే ఇది రెండో ఘటన కావడం, సీఎం సొంత నియోజకవర్గం అయినందున సీరియస్‌గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. కేసులో నెలకొన్న అనుమానాలను నిగ్గుతేల్చేందుకు వేగంగా ముందుకు సాగుతున్నారు. గురువారం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న డీఐజీ శివశంకర్‌రెడ్డి, సిద్దిపేట పోలీస్ కమిషనర్ శివకుమార్, ఏసీపీలు నర్సింహారెడ్డి, శివకుమార్ కేసు ప్రగతిపై సమీక్షించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి తోటి సిబ్బంది ద్వారా మరిన్ని వివరాలు సేకరించారు. ఆత్మహత్య ఘటనకు నాలుగు రోజుల ముందు నుంచి జరిగిన పరిణామాలపై క్షుణ్ణంగా వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి ఆ నాలుగు రోజులే కీలకం కావడం వల్ల ఈ దిశగా విచారణ ప్రక్రియ సాగుతోంది. ఆ ముగ్గురూ ఎక్కడ? హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డ మేకప్ ఆర్టిస్ట్ శిరీష ఘటనతో ప్రభాకర్‌రెడ్డి కేసుకు ప్రమేయముందా..? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. హైదరాబాద్ కృష్ణానగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీ స్టూడియో యజమాని రాజీవ్‌తో అదే సంస్థలో పనిచేస్తున్న మేకప్ ఆర్టిస్ట్ శిరీషకు విభేదాలు తలెత్తగా ఆ వివాదాన్ని పరిష్కరించడానికి రాజీవ్ స్నేహితుడు శ్రవణ్ కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు వారిద్దరినీ తీసుకొచ్చి ఎస్ఐతో మాట్లాడి వెళ్ళారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు సీసీటీవీ పుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. శిరీష ఆత్మహత్య ఘటనతో ప్రమేయమున్న రాజీవ్, శ్రవణ్, తేజస్వినీలను కుకునూర్‌పల్లి ఘటనపై విచారణాధికారిగా నియమితులైన సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న.. తన అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఘటనకు ముందు వీరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారా? లేదా, పోలీస్‌స్టేషన్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడకండ్ల గ్రామంలోని ఫామ్‌హౌస్‌కు వచ్చారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఈ విషయంలో పోలీస్ స్టేషన్ లోని ఇతర సిబ్బంది నుంచి వివరాలు సేకరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో రాజీవ్, శ్రవణ్, తేజస్వినీలను గురువారం కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ జరుపుతారనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ జరగలేదు. సంగారెడ్డి డీఎస్పీ వీరిని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు చెబుతున్నారు. పోలీస్ స్టేషన్ కు వస్తున్నట్టు సమాచారం రావడంతో మీడియా ప్రతినిధులు పెద్దసంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అలాంటిదేమీ లేదని సిద్దిపేట ఏసీపీ స్పష్టం చేయడంతో అంతా వెనుదిరిగారు. తెల్లవారుజామునే పోస్టుమార్టం పూర్తి బుధవారం రాత్రి 9:30 గంటల తర్వాత ఆందోళనకారులను వ్యూహాత్మకంగా నిలువరించి, కుకునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ నుంచి ప్రభాకర్‌రెడ్డి మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారుజామునే పోస్టుమార్టం ప్రక్రియను పూర్తిచేసి మృతదేహాన్ని ఎస్ఐ స్వగ్రామమైన యాదాద్రి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు తరలించారు. అంత్యక్రియలకు కుకునూర్పల్లితో పాటు పీఎస్ పరిధిలోని సుమారు 20 గ్రామాల నుంచి ఎస్ఐతో పరిచయాలున్న నాయకులు తరలివెళ్ళారు. అంతేగాకుండా గతంలో ప్రభాకర్‌రెడ్డి పనిచేసిన శామీర్‌పేట ప్రాంతం నుంచి కూడా భారీగా అతని సన్నిహితులు అంత్యక్రియలకు వెళ్ళి కడసారి వీడ్కోలు పలికారు. -
శిరీష పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలనాలు
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలకంగా మారిన పోస్ట్‌మార్టం నివేదిక బహిర్గతమైంది. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో శిరీష మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు.. గురువారం సాయంత్రం నివేదికను పోలీసులకు అందజేశారు. ఆ రిపోర్టులో పలు సంచలన అంశాలను పేర్కొన్నారు. శిరీష మెడ, పెదవి, చెంపలపై బలమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మెడ భాగంలో తీవ్రమైన ఒత్తిడి కలగడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. మరిన్ని పరీక్షలు నిర్వహించిన మీదట.. శిరీషది ఆత్మహత్యా లేక హత్యా అనేదానిపై స్పష్టత వస్తుందని వైద్యులు చెప్పారు. కాగా, ప్రచారంలో ఉన్నట్లు శిరీషపై అత్యాచారం జరిగిందా? లేదా?అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే సంచలనంగా మారిన ఈ కేసులో శిరీష పోస్ట్‌మార్టం నివేదికతో ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
‘శిరీష- ప్రభాకర్ రెడ్డి’ కేసు దర్యాప్తు వేగవంతం
హైదరాబాద్: సంచలనం రేపిన బ్యుటీషియన్ శిరీష, కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యల కేసుల్లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ రెండు కేసుల్లోనూ కీలకంగా మారిన ఫొటో స్టుడియో యజమాని రాజీవ్‌ను పోలీసులు గురువారం మధ్యాహ్నం కుకునూర్‌పల్లికి తీసుకెళ్లారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో విచారణాధికారిగా నియమితులైన సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న.. గురువారం ఉదయం బంజారాహిల్స్(హైదరాబాద్) పోలీసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శిరీష ఆత్మహత్య కేసులో లభించిన ఆధారాలు, రాజీవ్, శ్రావణ్‌ల వాగ్మూలం తదితర విషయాలను బంజారాహిల్స్ పోలీసులు తిరుపతన్నకు వివరించారు. ఆత్మహత్యలు జరగడానికి ముందు కుకునూర్‌పల్లిలోని ప్రభాకర్‌రెడ్డికి చెందిన క్వార్టర్స్‌లో శిరీష, రాజీవ్, శ్రావణ్‌లు కలిసిఉన్నందున అప్పుడేం జరిగిందో బతికున్న ఇద్దరికే తెలుసుకాబట్టి ఆ మేరకు రాజీవ్, శ్రావణ్‌లనుంచి విషయాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శిరీషపై ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అఘాయిత్యానికి పాల్పడ్డాడా? లేదా? అనే విషయం ఇప్పటిదాకా వెల్లడికాలేదు. ఇదిలాఉంటే బుధవారం సొంత స్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడిన కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి మృతదేహానికి సిద్దిపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ఆయన స్వస్థలం టంగుటూరు(యాదాద్రి జిల్లా ఆలేరు మండలం)కు తరలించారు. నేటి సాయంత్రం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక బ్యూటీషియన్ శిరీష అంత్యక్రియలు పశ్చిమగోదావరి జిల్లాని ఆమె స్వస్థలం ఆచంటలో బుధవారమే నిర్వహించారు. (చదవండి: రెండు ఆత్మహత్యలు.. వంద సందేహాలు) -
శిరీష మృతికి కారణాలు తెలియదు: సతీష్ చంద్ర
హైదరాబాద్ : తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష భర్త సతీష్ చంద్ర అన్నారు. భార్య మరణంపై అనుమానాలు ఉన్నాయని, పోలీసులు సమగ్రంగా విచారణ జరిపితే అసలు విషయం బయటకు వస్తుందన్నారు. కాగా శ్రీకృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి అలియాజ్ శిరీష (28) ఫిలింనగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్ఆర్గా పనిచేస్తున్నది. మంగళవారం ఉదయం ఆమె తన కార్యాలయంలో మృతదేహమై కనిపించింది. దీంతో తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆర్జే ఫోటోగ్రఫీ యజమాని రాజీవ్, అతడి స్నేహితుడు శ్రావణ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే శిరీష మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు ముందు శిరీష, రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్ బయటకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. వీరు ముగ్గురు కలిసి మద్యం సేవించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలతో శిరీషది ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు శిరీష మరణపై ఆమె తల్లి రామలక్ష్మి స్పందించారు. తన కూతురు చచ్చిపోయేంత పిరికిది కాదన్నారు. తన కూతుర్ని కావాలని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు. శిరీష హ్యాండ్ బ్యాగ్ తెగిపోయి ఉందనిచ ముఖంపై గాయాలు కనిపిస్తున్నాయన్నారు. తన కుమార్తె పీక నులిమి చంపేసినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని రామలక్ష్మి ఆరోపించారు. పోలీసులు, ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ కూతురు చావుకు వల్లభనేని రాజ్‌కుమార్ అలియాస్ రాజీవ్, అతని ప్రియురాలు తేజస్వి, శ్రావణ్ లే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. -
ఎస్సై ప్రభాకర్‌రెడ్డిది హత్యే!!
హైదరాబాద్: ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అనుమానాస్పద మృతి వ్యవహారంతో సిద్దిపేట జిల్లా కుకునూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్ని నెలల కిందట కుకునూర్ పోలీసు స్టేషన్లోనే ఓ ఎస్సై ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌కు చెందిన బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతికి ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి సంబంధం ఉందని, మద్యం మత్తులో శిరీషపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో కుకునూర్‌లో గ్రామస్తులు భగ్గుమన్నారు. మీడియాలో కథనాలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. చనిపోయిన ప్రభాకర్‌రెడ్డిపై అభాండలు వేస్తున్నారని, ఆయనకు శిరీషతో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు చేయడం తగదని వారు అంటున్నారు. ప్రభాకర్‌రెడ్డి వ్యక్తిత్వం గురించి కుకునూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని 26 గ్రామాల ప్రజలకు తెలుసునని, ఆయన అలాంటి వ్యక్తి కాదని, పోలీసులు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ఇలాంటి కథనాలు ప్రసారం చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి మృతి వెనుక పోలీసులు ఒత్తిడి ఉండి ఉంటుందని, ఆయనది హత్యే అయి ఉండవచ్చునని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు. చదవండి:ఎస్ఐ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ -
శిరీష కుకునూరుపల్లికి ఎందుకు వెళ్లింది?
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు శిరీష కుకునూరుపల్లికి ఎందుకు వెళ్లింది? ఆమెతో పాటు ఉన్న రాజీవ్, శ్రవణ్‌లతో పాటు ఉన్న మరో ఇద్దరు ఎవరనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా రాజీవ్ ఫోటో స్టూడియోలో ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది కూడా ఇంకా మిస్టరీగానే ఉంది. ఎస్ఐ ప్రభాకర్‌రెడ్డిని కలిసేందుకు రాజీవ్, శ్రావణ్, శిరీష మొన్న రాత్రి (సోమవారం) కుకునూరుపల్లి వెళ్లారు. రాత్రి రెండున్నర వరకూ వీరి మధ్య పంచాయితీ కొనసాగిందని, ఆ సమయంలో రాజీవ్, శిరీష మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుగు ప్రయాణంలో శిరీష కారులో నుంచి దూకేందుకు యత్నించగా, వారు ఆపినట్లు సమాచారం. అనంతరం ఫోటో స్టూడియోకు వచ్చిన తర్వాత శిరీష ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. కాగా శిరీష, రాజీవ్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజీవ్‌పై గతంలో తను అనే యువతి ఫిర్యాదు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి అయింది. అయితే ఈ కేసుకు సంబంధించి తాము ఇప్పుడే ఏం చెప్పలేమని, ఉన్నతాధికారులు వెల్లడిస్తారని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. -
ఎస్ఐ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
హైదరాబాద్ : సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి ఘటనకు ఎస్ఐకి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ రోజు ఉదయం శిరీష ఆత్మహత్య వ్యవహారం బయటకు రావడంతో ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఈరోజు మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా శ్రీకృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి అలియాజ్ శిరీష (28) ఫిలింనగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్ఆర్గా పనిచేస్తున్నది. మంగళవారం ఉదయం ఆమె తన కార్యాలయంలో మృతదేహమై కనిపించింది. దీంతో తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ ఘటనకు ముందు శిరీష, రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్ బయటకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. వీరు ముగ్గురు కలిసి మద్యం సేవించినట్లు గుర్తించారు. ముగ్గురికి వివాదాలు ఉన్నాయని, వీరి మధ్య మంగళవారం తెల్లవారుజామున రెండున్నర వరకూ పంచాయితీ కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శిరీషది ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఆర్జే ఫొటోగ్రఫీ సంస్థ యజమాని వల్లభనేని రాజీవ్‌ను ప్రశ్నించగా రాత్రి రెండుగంటల ప్రాంతంలో శిరీష ఫ్యాన్‌కు ఉరేసుకుందని తానే చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని చెప్పినట్లు సమాచారం. రెండోసారి విచారించగా బాత్రూంలో ఆత్మహత్య చేసుకుందని చెబుతుండటంతో అనుమానాలు బలపడ్డాయి. అలాగే రాజీవ్‌తో పాటు అతడి స్నేహితుడిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
బ్యూటీషియన్ అనుమానాస్పద మృతి
బంజారాహిల్స్: అనుమానాస్పద స్థితిలో ఓ బ్యూటీషియన్ మృతిచెందింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీకృష్ణానగర్‌లో నివసించే అరుమిల్లి విజయలక్ష్మి అలియాజ్ శిరీష (28) ఫిలింనగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీలో బ్యుటీషియన్‌గానే కాకుండా హెచ్ఆర్గా పనిచేస్తున్నది. సోమవారం రాత్రి 8–40 గంటలకు తన భర్త సతీష్‌చంద్రకు ఫోన్‌చేసి తాను ఆలస్యంగా వస్తానని చెప్పింది. అయితే రాత్రికి ఆమె ఇంటికి రాలేదు. ఎప్పటిలాగానే సతీష్ మంగళవారం ఉదయం బేగంపేటలోని తాను కుక్‌గా పనిచేసే ఆశ్రయ్–ఆకృతి పాఠశాలకు వెళ్ళారు. తరువాత సతీష్‌చంద్రకు బంజారాహిల్స్ పోలీసులు ఫోన్‌చేసి ఫిలింనగర్‌లోని ఆర్జే ఫొటోగ్రఫీ కార్యాలయానికి రావాలని చెప్పారు. అక్కడికి వెళ్ళి చూడగా మంచంపైన భార్య శిరీష మృతదేహం కనిపించింది. యజమాని వల్లభనేని రాజీవ్‌ను ఏమైందని ప్రశ్నించగా రాత్రి 2 గంటల ప్రాంతంలో ఫ్యాన్‌కు ఉరేసుకుందని తానే చున్నీని కత్తిరించి మంచం మీద పడుకోబెట్టానని తెలిపారు. తన భార్య ఆత్యహత్య చేసుకొనే పిరికిది కాదని మరణం వెనుక పలు అనుమానాలున్నాయని సతీష్‌చంద్ర పోలీసులకు పిర్యాదుచేశారు. ఆత్మహత్యా, హత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరికి 12 సంవత్సరాల కూతురు ఉంది. -
ఆరేళ్ల కష్టం!
మోహన్‌కృష్ణ, శిరీష, సౌజన్య ముఖ్య తారలుగా గంగారపు లక్ష్మణమూర్తి దర్శకత్వంలో మాణిక్య మూవీస్ పతాకంపై రాజు నిర్మిస్తున్న సినిమా ‘బావ మరదలు’. బండారు దానయ్యకవి స్వరపరచిన ఈ సినిమా పాటలను, ట్రైలర్‌ను ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘గోదావరి జిల్లా నుంచి మరో హీరో, నిర్మాత సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం సంతోషం. పాటలు బాగున్నాయి. ట్రైలర్ చూస్తుంటే మంచి కుటుంబ కథా చిత్రం అనిపిస్తోంది’’ అన్నారు. ‘‘నా తొలి చిత్రం ‘అతడు ఆమె ఓ స్కూటర్’ నచ్చడంతో రాజుగారు ఈ చిత్రానికి దర్శకుడిగా అవకాశమిచ్చారు. మోహన్ కృష్ణ భవిష్యత్‌లో పెద్ద హీరో అవుతాడు’’ అని గంగారపు లక్ష్మణమూర్తి అన్నారు. ‘‘హీరోగా నా తొలి చిత్రమిది. ఇందుకు ఆరు సంవత్సరాలు కష్టపడ్డా. నా రెండో సినిమా జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది’’ అన్నారు హీరో మోహన్‌కృష్ణ. ఈ కార్యక్ర మంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య పాల్గొన్నారు. సమర్పణ: నామన లోహిత్.