ఎస్సై ప్రభాకర్‌రెడ్డిది హత్యే!! | villagers comment on SI prabhakar reddy death | Sakshi
Sakshi News home page

ఎస్సై ప్రభాకర్‌రెడ్డిది హత్యే!!

Published Wed, Jun 14 2017 7:18 PM | Last Updated on Sun, Sep 2 2018 3:42 PM

ఎస్సై ప్రభాకర్‌రెడ్డిది హత్యే!! - Sakshi

ఎస్సై ప్రభాకర్‌రెడ్డిది హత్యే!!

హైదరాబాద్‌: ఎస్సై ప్రభాకర్‌రెడ్డి అనుమానాస్పద మృతి వ్యవహారంతో సిద్దిపేట జిల్లా కుకునూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొన్ని నెలల కిందట కుకునూర్‌ పోలీసు స్టేషన్‌లోనే ఓ ఎస్సై ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌కు చెందిన బ్యూటీషియన్‌ శిరీష అనుమానాస్పద మృతికి ఎస్సై ప్రభాకర్‌రెడ్డికి  సంబంధం ఉందని, మద్యం మత్తులో శిరీషపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రావడంతో కుకునూర్‌లో గ్రామస్తులు భగ్గుమన్నారు.

మీడియాలో కథనాలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. చనిపోయిన ప్రభాకర్‌రెడ్డిపై అభాండలు వేస్తున్నారని, ఆయనకు శిరీషతో అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు చేయడం తగదని వారు అంటున్నారు. ప్రభాకర్‌రెడ్డి వ్యక్తిత్వం గురించి కుకునూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని 26 గ్రామాల ప్రజలకు తెలుసునని, ఆయన అలాంటి వ్యక్తి కాదని, పోలీసులు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ఇలాంటి కథనాలు ప్రసారం చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి మృతి వెనుక పోలీసులు ఒత్తిడి ఉండి ఉంటుందని, ఆయనది హత్యే అయి ఉండవచ్చునని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అన్నారు.

చదవండి:ఎస్‌ఐ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement