హాయ్ ఫ్రెండ్స్... డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రావడం లేదు. మా అమ్మకు చెప్తే నాలుగు బర్లను కొనిచ్చింది. బర్లను కాయడానికి వచ్చిన ఫ్రెండ్స్.. ఏడాదిన్నర కిందట వచ్చిందీ వీడియో. బీకాం చదువుకున్న శిరీష అనే యువతి ఈ వీడియో చేసింది. అప్పటినుంచి ఆమె బర్రెలక్కగా ఫేమస్ అయింది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఆమెకు బిగ్‌బాస్ షో నుంచి ఆఫర్ వచ్చిందని, ఓ కారు కూడా పంపించారంటూ ఓ పుకారు మొదలైంది.
తాజా ఇంటర్వ్యూలో ఈ రూమర్‌పై స్పందించింది బర్రెలక్క. ఆమె మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ వాళ్లు నన్ను ఇంతవరకు సంప్రదించలేదు. బహుశా నా గురించి వారికి తెలియదేమో! వారి దగ్గరి నుంచి నాకు ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదు. అలాగే నాకు కారు కొనిచ్చారన్నది పూర్తిగా అవాస్తవం. అన్నవాళ్లు నేను ఇబ్బంది పడుతున్నా అని వాళ్లు నడుపుతున్న కార్లు తీసుకొచ్చి ప్రచారానికి వాడుకోమన్నారు. ఒక కారు మాత్రం ఒక అన్న ఉచితంగా ఇచ్చాడు' అని క్లారిటీ ఇచ్చింది బర్రెలక్క.
చదవండి: యువతకు స్ఫూర్తినిస్తూ కొల్లాపూర్‌లో పోటీకి దిగిన బర్రెలక్క
Comments
Please login to add a commentAdd a comment