సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తన కోపమే తన శత్రువని అంటారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన గౌతు శిరీషకు మాత్రం తన అహమే తన శత్రువవుతోంది. ప్రత్యర్థి నేతలతో పాటు స్వపక్ష నాయకులతోనూ వైరం పెంచుకుంటున్న ఆమె వింత వైఖరి అసమ్మతి సెగ రేపుతోంది. ఇంటా బయటా నాయకులు తనకంటే సీనియర్స్ కావడంతో ఆమె తట్టుకోలేకపోతున్నారు. అరవై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న తన కుటుంబానికి ఇన్నాళ్లూ అండగా ఉన్న నేతలే తనకు అడ్డు తగులుతారేమో అన్న అభద్రతా భావంలో ఉన్నారు. తాతతండ్రుల చరిత్రలు చెబుతూ నిత్యం అహంతో వ్యవహరించడం తప్ప సొంత ముద్ర వేసుకోలేక సతమతమవుతున్నారు.వాస్తవానికి సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలిగా పెత్తనం చెలాయించడం తప్ప గౌతు శిరీష పేరు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
గౌతు శ్యామసుందర్ శివాజీ రాజకీయంగా కనుమరుగు అవుతుండటంతో వారసత్వ రాజకీయాల్లో భాగంగా ఆమె తెరపైకి వచ్చారు. వారసత్వ రాజకీ యం సిక్కోలుకు కొత్త కాకపోయినా.. విశాఖపట్నంలో ఉండి ఇక్కడ రాజకీయాలు చేసి గద్దెనెక్కాలనే ఆమె ఆలోచన ఎవరికీ నచ్చడం లేదు. ప్రతి విషయంలో డబ్బును, బ్యాగ్రౌండ్‌ను చెప్పుకోవడం, ఏ మండలంలో ఏ ఊరు ఎక్కడుందో కూడా తెలియకపోవడం, ప్రజల మన్ననలతో కాకుండా వారసత్వం పేరుతో పెత్తనం చెలాయించాలన్న ఆలోచన ఇప్పుడామె కొంప ముంచుతోంది. ఇంతవరకు కుటుంబానికి అండగా నిలిచిన నాయకులే ఇప్పుడు ఎదురుతిరిగే పరిస్థితి ఏర్పడింది.అధికార పార్టీ నాయకులపైన విమర్శలు, ఆరోపణలు చేస్తే అది రాజకీయం అనుకోవచ్చు. కానీ ఉన్నవీ లేనివీ మాట్లాడి నోరు పారేసుకోవడం వల్ల ఇప్పటికే నియోజకవర్గంలో ఆమె ప్రతిష్ట మసకబారిపోయింది.
అది చాలదన్నట్టు సొంత పార్టీ నేతలను దూరం చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. రానున్న ఎన్నికల్లో ఎక్కడ టిక్కెట్‌కు పోటీ పడతారేమోనన్న అభద్రతా భావంతో స్వపక్షంలోనే నాయకులతో వైరం పెట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి తనకు తప్ప ఎవ్వరికీ ఎమ్మెల్యే సీటు దక్కకూడదనే ఉద్దేశంతో పారీ్టలో ఎదగాల్సిన నాయకులను వెనక్కు నెట్టేందుకే ప్రయ తి్నస్తున్నారు. ఇన్‌కంటాక్స్‌లో ఆఫీసర్‌గా పనిచేసి వచ్చిన ఉద్దాన వాసి జుత్తు తాతారావు ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించడంతో ఆయనతో విభేదాలు పెట్టుకుని ఆయన పారీ్టకి దూరంగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. తాజాగా పలాస–కాశీబుగ్గ మున్సిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబూరావుకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో టిక్కెట్ కోసం పోటీ పడతారన్న ఉద్దేశంతో ఆయన్ని అణగదొక్కేలా వ్యవహరిస్తున్నారు.
దానిలో భాగంగానే ప్రతి చిన్న విషయంలో వజ్జ బాబురావు అండ్‌కోపై చిర్రుబుర్రులాడుతున్నారు. సొంత పార్టీ నాయకుల సీనియారిటీని సైతం విస్మరించి తన చెప్పుచేతుల్లో ఉండేలా హకుం జారీ చేస్తున్నారు. ఇటీవల శిరీష రాకుండా ఆఫ్‌షోర్ ప్రాజెక్టు చూసేందుకు ప్రతిపక్ష పాత్రలో వెళ్లారంటూ వజ్జపై రుసరుసలాడారు. చెప్పాలంటే వజ్జ బాబూరావును అవమాన పరిచేలా పలు సందర్భాల్లో వ్యవహరించారు. సీనియర్ అయినప్పటికీ తన వెనుక ఉండాలే గానీ తన మాట దాటొద్దంటూ ఆంక్షలు విధించారు.
వజ్జ బాబూరావుకు ఏ ఒక్కరు జై కొట్టినా సహించలేకపోతున్నారు. దీంతో శిరీషకు సహజంగానే అసమ్మతి పోరు మొదలైంది. వజ్జ బాబూరావు వర్గీయులంతా ఇప్పుడామెపై గుర్రుగా ఉన్నారు. విశాఖలో ఉండి, పార్టీ పిలుపు సమయంలో ఇక్కడికొచ్చి కార్యక్రమాలు చేపట్టి, తర్వాత వెళ్లిపోయి కేడర్‌ను గాలికొదిలేసిన శిరీష వెంట ఎలా ఉండగలమని వ్యతిరేక వర్గమంతా బాహాటంగానే నిరసన గళం విప్పుతున్నారు. ఆ స్వరం రోజురోజుకీ ఎక్కువై నియోజకవర్గంలో టీడీపీ వర్గాలుగా చీలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment