శంషాబాద్: కార్డన్ సెర్చ్‌లో పోలీసులతో మాట్లాడుతున్న డీసీపీ పద్మజ
నవాబుపేట: ప్రజల్లో భయాన్ని పోగొట్టి పోలీసులపై నమ్మకాన్ని కల్పించేందుకు కార్డన్ సెర్చ్ చేపడుతున్నామని వికారాబాద్ డీఎస్పీ శిరీష అన్నారు. మండల పరిధిలోని మైతాప్‌ఖాన్‌గూ డ గ్రామంలో ఆదివారం ఉదయం డీఎస్పీ శి రీష ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, 50 మంది సిబ్బందితో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని ఇళ్లు, కిరాణం షా పులు, ఫాస్టుఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వ హించారు. తనిఖీలో 3,080 గుట్కా ప్యాకెట్లు, 148 మద్యం బాటిళ్లు, పత్రాలు లేని ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అనుమానిత వ్య క్తులు సంచరిస్తే వెంటనే 100కు డయ ల్ చేసి సమాచారం అంది ంచాలన్నారు. గ్రామంలో మ ద్యం విక్రయాలు చేపడితే సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమం లో సీఐలు శ్రీనివాస్, వెంకట్‌రామయ్య, నవాబుపేట, బంట్వారం, మర్పల్లి, వికారాబాద్ టౌన్ ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
శంషాబాద్‌లో విస్తృతంగా కార్డన్ సర్చ్
శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని అహ్మద్‌నగర్, ఖాజీగల్లి, కోమటి బస్తీల్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. శంషాబాద్ జోన్ డీసీపీ పీ.వీ.పద్మజ ఆధ్వర్యంలో ఏసీపీ అశోక్‌కుమార్, ఐదు గురు సీఐలు, 200 మంది కానిస్టేబుళ్లతో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివా రం ఉదయం 8 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పత్రాలు లేని 100 బైక్‌లు, 20 ఆటోలు, ఐదు కార్లు, మూడు డీసీఎంలతో పాటు 15 మంది రౌడీషీటర్లు, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ కోసం విస్తృతంగా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని డీసీపీ పద్మజ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లను శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ ప్రాంగణానికి తరలించారు. తనిఖీల్లో ఆర్‌జీఐఏ సీఐ మహేష్, శంషాబాద్ సీఐ కృష్ణప్రసాద్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment