cardon search
-
గంజాయి, సారా స్వాధీనం
నగరి : మండలంలోని ఓజీకుప్పం గ్రామాన్ని ఆదివారం ఉదయం పోలీసులు చుట్టుముట్టి తనిఖీ నిర్వహించారు. కార్డన్ అండ్ సెర్చ్ (సమస్యాత్మక పల్లెల్ని చుట్టుముట్టి తనికీ చేయడం)లో భాగంగా ఆదివారం జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐలు, చిత్తూరు అడిషనల్ ఎస్పీ కృష్ణార్జునరావు, చిత్తూరు ఎస్బీ డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, చిత్తూరు ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, నగరి, నగరి రూరల్, పుత్తూరు సీఐలు మద్దయ్య ఆచారి, రాజశేఖర్, వెంకట్రామిరెడ్డి, ఎస్ఐలతో పాటు 100 మంది పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీ చేశారు. సీఐ మద్దయ్య ఆచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్లి అనుమానిత వ్యక్తులు ఉన్నారా అని ఆరాతీశారు. ఇళ్ల వద్ద ఉన్న వాహనాల రికార్డులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఊహించని పలు అంశాలు వెలుగుచూశాయి. గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పళని(48), మునస్వామి(28), మురళి (32), సంపూర్ణమ్మ(70) పట్టుపడగా, వారి వద్ద నుంచి 12.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా సారా, మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న దొరై(60), మునిలక్ష్మి (56)ని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 114 సారాపాకెట్లు, 11 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. రికార్డులు సక్రమంగా లేని 11 ద్విచక్రవాహనాలను గుర్తించి స్టేషన్‌కు తరలించారు. గంజాయి నిల్వ ఉంచుకున్న వారిపై ఎన్ఈబీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేయగా, అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్న వారిపై ఏపీ ఎక్సైజ్ యాక్టు కింద కేసు నమోదు చేశారు. -
కార్డన్ సెర్చ్‌లో దుప్పి కొమ్ములు గుర్తింపు
కొమరోలు(గిద్దలూరు): కార్డన్ సెర్చ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు అక్కడి ఇళ్లలో గుర్తించిన అడవి జంతువుల కొమ్ములు, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాటు సారా అరికట్టేందుకు శుక్రవారం మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వేకువజామునే గ్రామానికి చేరుకున్న గిద్దలూరు సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది గ్రామంలో అణువణువూ పరిశీలించారు. రాకపోకలు సాగిస్తున్న వాహనాలను ఆపి పత్రాలను, డ్రైవింగ్ లైసెన్స్‌లను పరిశీలించారు. పత్రాలు సక్రమంగా లేని 10 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలోని పలు గృహాల్లో తనిఖీలు నిర్వహించగా 11 దుప్పి కొమ్ములు, మూడు చిన్నపాటి ఎర్రచందనం దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వివిధ అవసరాల కోసం ఉపయోగించే కత్తులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. దుప్పికొమ్ములు, ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులకు అప్పగించామని సీఐ యు.సుధాకర్‌రావు చెప్పారు. ఇలాంటి వాటిని కలిగి ఉండటం చట్ట విరుద్దమన్నారు. కార్యక్రమంలో కొమరోలు, గిద్దలూరు, రాచర్ల, బేస్తవారిపేట ఎస్ఐలు ఎస్.మల్లికార్జునరావు, షేక్ సమందర్‌వలి, త్యాగరాజు, రవీంద్రారెడ్డి, ఎక్సైజ్ ఎస్సై రాజేంద్రప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే ఇక్కడి ప్రజలు ఎర్రచందనం దుంగలతో రోకళ్లు, పచ్చడి బండలు తయారు చేసుకుని ఉపయోగిస్తారని, దుప్పి కొమ్ములను శుభ సూచకంగా ఇళ్లలో అలంకరిస్తారని స్థానికులు తెలిపారు. -
ఇందిరానగర్‌లో ముట్టడి.. కట్టడి
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 5లోని ఇందిరానగర్‌లో శనివారం అర్దరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంజగుట్ట ఏసీపీ తిరుపతన్నతో పాటు బంజారాహిల్స్ డీఐ కె. రవికుమార్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె. బల్వంతయ్యతో పాటు ఐదురుగు ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, 66 మంది కానిస్టేబుళ్ళు, 11 మంది హోంగార్డులు పాల్గొని బస్తీని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి అర్ధరాత్రి అనుమానాస్పదంగా, అనుమతిలేని పత్రాలతో, నంబర్‌ప్లేట్ లేని వాహనాలపై తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఇందులో భాగంగా 122 ఇళ్లను తనిఖీలు చేశారు. 300 మందిని ప్రశ్నించారు. 403 వాహనాలను తనిఖీ చేసి పత్రాలు సరిగ్గా లేని 46 వాహనాలను ïసీజ్ చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న 87 మందిని అదుపులోకి తీసుకున్నారు. 11 మంది హిజ్రాలను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. హిజ్రాల కోసం పాత బస్తీ నుంచి వచ్చిన 110 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 230 మంది యువకుల ఫోన్ నంబర్లను తనిఖీలు చేసి వారు ఎవరెవరికి టచ్‌లో ఉంటున్నారో తెలుసుకున్నారు. 60 మంది ఫింగర్‌ప్రింట్స్ సేకరించారు. ఫేషియల్ రికగ్నజేషన్ సిస్టమ్‌లో భాగంగా 98 మందిని పరిశీలించారు. 5 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. -
నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్
ఆలేరు : నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ చేపడుతున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జ్ డీసీపీ కె.నాగరాజు తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆలేరు పట్టణంలోని సుభాష్‌నగర్, ఆదర్శనగర్‌లలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలతో పాటు ఒక రౌడీషీటర్‌ను, ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్ముతున్న ఇరువురిపై ఎక్సైజ్ కేసు నమోదు చేశామని, 3 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంతే కాకుండా ద్విచక్ర వాహనాలను నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలు నడిపే వారు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ చేయించాలని కోరారు. రాత్రి 2గంటల నుంచి ఉదయం 6గంటల వరకు సోదాలు కొనసాగాయి. ఏసీపీ శ్రీనివాసాచార్యులు, 8 మంది సీఐలు, 10మంది ఎస్ఐలు, 17 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 51 మంది సివిల్ పోలీసులు, 13 మంది మహిళ పోలీసులు, హోంగార్డులు, 34 మంది ఎఆర్, సీసీఎస్, క్లూస్‌టీం, ఎస్‌ఓటీలు పాల్గొన్నారు. -
పార్థి గ్యాంగ్ తిరుగుతుందట నిజమేనా సారూ?
హుస్నాబాద్ మెదక్ : సారూ మా పిల్లలు పదిలమేనా?, పార్థి గ్యాగ్ తిరుతుందంట నిజమేనా? అని హుస్నాబాద్ ఎల్లం బజార్‌కు చెందిన ఓ మహిళ కార్డున్ సెర్చ్ పర్యవేక్షించడానికి వచ్చిన సీపీ జోయల్ డేవిస్ ఎదుట తన భయం వ్యక్తం చేసింది. గ్రామాల్లో పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలు తిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది నిజమేనా సారు? గుంపుల కొద్ది పోలీసులు వస్తే భయమైతాంది అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. స్పందించిన సీపీ జోయల్ డేవీస్ అదేమి లేదమ్మా అలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు. మీ ఫోన్లలో వాట్సాప్‌కు వచ్చిన ఫొటోలు ఏమైనా ఉన్నాయా అని సదరు మహిళను ప్రశ్నించారు. తమ వద్ద ఫొటోలు లేవని అందరు అనుకుంటున్నారని ఆమె బదులిచ్చింది. హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లంబజార్‌లో సోమవారం ఉదయం పోలీసులు కార్డూన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..పిల్లలను ఎత్తుకు పోయేందుకు పార్థి గ్యాంగ్ వంటి ముఠాలు, నేరగాళ్లు, దొంగలు తిరుగుతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అలాంటి సమాచారం, ఆధారాలు పోలీస్‌ల వద్ద లేవని స్థానిక మహిళలకు ధైర్యం చెప్పారు. ఇలాంటి ప్రచారాలను జిల్లా ప్రజలు నమ్మొద్దని సూచించారు. మీ రక్షణకు మేము ఉన్నామని, నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని భరోసానిచ్చారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ మా పోలీసుల బాధ్యత అని అన్నారు. గ్రామాలు, పట్టణాల్లోని అనుమానిత ప్రదేశాలు, వ్యక్తులపై మా ప్రత్యేక పోలీస్‌ల నిఘా నిరంతరం ఉంటుందన్నారు. సీపీ వెంట అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ మహేందర్, సీఐలు శ్రీనివాస్‌జీ, రఘు, ఎస్ఐ సుధాకర్ ఉన్నారు. -
ప్రజల భయం పోగొట్టేందుకే కార్డన్ సెర్చ్
నవాబుపేట: ప్రజల్లో భయాన్ని పోగొట్టి పోలీసులపై నమ్మకాన్ని కల్పించేందుకు కార్డన్ సెర్చ్ చేపడుతున్నామని వికారాబాద్ డీఎస్పీ శిరీష అన్నారు. మండల పరిధిలోని మైతాప్‌ఖాన్‌గూ డ గ్రామంలో ఆదివారం ఉదయం డీఎస్పీ శి రీష ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, 50 మంది సిబ్బందితో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలోని ఇళ్లు, కిరాణం షా పులు, ఫాస్టుఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వ హించారు. తనిఖీలో 3,080 గుట్కా ప్యాకెట్లు, 148 మద్యం బాటిళ్లు, పత్రాలు లేని ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, అనుమానిత వ్య క్తులు సంచరిస్తే వెంటనే 100కు డయ ల్ చేసి సమాచారం అంది ంచాలన్నారు. గ్రామంలో మ ద్యం విక్రయాలు చేపడితే సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమం లో సీఐలు శ్రీనివాస్, వెంకట్రామయ్య, నవాబుపేట, బంట్వారం, మర్పల్లి, వికారాబాద్ టౌన్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. శంషాబాద్‌లో విస్తృతంగా కార్డన్ సర్చ్ శంషాబాద్: శంషాబాద్ పట్టణంలోని అహ్మద్‌నగర్, ఖాజీగల్లి, కోమటి బస్తీల్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. శంషాబాద్ జోన్ డీసీపీ పీ.వీ.పద్మజ ఆధ్వర్యంలో ఏసీపీ అశోక్‌కుమార్, ఐదు గురు సీఐలు, 200 మంది కానిస్టేబుళ్లతో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివా రం ఉదయం 8 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పత్రాలు లేని 100 బైక్‌లు, 20 ఆటోలు, ఐదు కార్లు, మూడు డీసీఎంలతో పాటు 15 మంది రౌడీషీటర్లు, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ సీపీ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణ కోసం విస్తృతంగా కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామని డీసీపీ పద్మజ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్‌లను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ ప్రాంగణానికి తరలించారు. తనిఖీల్లో ఆర్జీఐఏ సీఐ మహేష్, శంషాబాద్ సీఐ కృష్ణప్రసాద్ తదితరులున్నారు. -
నల్గొండ పట్టణంలో కార్డన్ సెర్చ్
నల్లగొండ జిల్లా : పట్టణంలోని లెప్రసీ కాలనీలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో ఒక డీఎస్పీ, తొమ్మిది మంది సీఐలు, 14 మంది ఎస్ఐలు, 16 మంది మహిళా సిబ్బంది, 171 పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఎలాంటి పేపర్లు లేని 6 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలు, 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇద్దరు అనుమానిత వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులు ఫోన్ చేసి తెలుపాలని సూచించారు. ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు కిరాయి ఇవ్వవద్దని తెలిపారు. అలాగే ఎలాంటి డాక్యుమెంట్ లేని వెహికిల్ నడిపేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అలం‘పురం’ ఉలిక్కిపాటు
అలంపూర్ రూరల్: తెల్లవారుతుండగా అలంపూర్‌లో పోలీసులు బలగాలు దిగాయి.. ప్రజలంతా గాడ నిద్రలో ఉండగా పోలీసులు ఇళ్లు తట్టడం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సోదాలు చేస్తున్నామని.. మీ ఆధార్‌కార్డులు.. వాహనాల పత్రాలు.. ఇళ్ల పత్రాలు చూయించాలని అడిగితే ముందు ప్రజలకు విషయం ఏంటో అర్థం కాక తికమక పడ్డారు. తర్వాత శాంతిభద్రతల కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారని చెప్పడంతో ఊపరిపి పీల్చుకున్నారు. ఎస్పీ రెమారాజేశ్వరి నేతృత్వంలో.. అలంపూర్‌లో మంగళవారం తెల్లవారుఝామున 4గంటల నుంచి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 80 మంది పోలీసులు, ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఏడు మంది ఎస్ఐలు 8 బృందాలుగా విడిపోయి అలంపూర్ పట్టణాన్ని జల్లెడ పట్టారు. కాలనీల్లో తిరుగుతూ ఇళ్లల్లో సోదాలు, వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 31 ద్విచక్రవాహనాలు, 4 ఆటోలు, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. ఒక్కో బృందం ఒక్కో కాలనీలో పర్యటించింది. ఇళ్లల్లో ఎవరైన కొత్త వ్యక్తులు ఉన్నారా.? వారు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు.? ఏ పని నిమిత్తం ఇక్కడ మకాం వేశారు. వారి ఆధార్ నెంబర్లు ఎక్కడున్నాయి.. ఇలా వివిధ కోణాల్లో ప్రశ్నలు వేస్తూ ప్రజలను విచారణ చేశారు. అనుమానం వచ్చిన వారిపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నిజ నిర్ధారణ చేసుకుని వదిలేశారు. అలాగే వాహనాలను నిలిపి వాటి పత్రాలను పరిశీలించారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పత్రాలు చూయించిన వారి వాహనాలను మళ్లి వారికి అప్పగించారు. ప్రజలతో ఎస్పీ మాటామంతి.. పోలీసులు ఉన్నట్టుండి ఎందుకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు..? ఎవరికైనా తెలుసా.. పోలీసులు మీ ఇళ్లకు వచ్చారా.? ఏం అడిగారు.? చెప్పండి అంటూ ఎస్పీ రెమారాజేశ్వరి స్థానిక ప్రజలను ప్రశ్నించారు. దీన్ని కార్డెన్ సెర్చ్ అంటారని, నేరాలను అదుపు చేసేందుకు ముందస్తుగా ప్రజల భద్రత కోసమే ఇలా చేస్తున్నామని తెలిపారు. నేరాలు.. ఘోరాలు జరిగిపోయాక స్పందించడం కంటే ముందస్తుగా వాటిపై దృష్టి పెట్టి ఆపేందుకు ఉపయోగపడుతుందన్నారు. కొత్త వ్యక్తులకు ఎవరు ఆశ్రయం ఇవ్వొద్దని.. వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని... నిజనిర్ధారణ చేసుకున్నాకే అద్దెకు ఇవ్వాలని కోరారు. వాహనాల కొనుగోలు సమయాలలో కూడా పూర్తి పత్రాలను సరి చూసుకోవాలని లేని పక్షంలో ఇబ్బంది పడాల్సి వస్తుందని అప్రమత్తం చేశారు. ఇదిలాఉండగా పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరగా పోలీసుశాఖ పేద డిపార్ట్మెంట్ అని.. తమ వద్ద ప్రత్యేకంగా ఎలాంటి నిధులు ఉండవని.. ప్రజల సహకారంతోనే సీసీ కెమరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుందని తనిఖీల్లో డీఎస్పీ సురేందర్‌రావు, సీఐ రజిత, సీఐ వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, ఎస్ఐలు వాస ప్రవీణ్‌కుమార్ విజయ్, గడ్డం కాశీ, పర్వతాలు, మహేందర్, భాగ్యలక్ష్మిరెడ్డి తదితరులు ఉన్నారు. -
గుర్తింపు కార్డులు చూసి ఇళ్లు అద్దెకివ్వండి
అత్తాపూర్: నేరస్తులను గుర్తించేందుకు శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్, బాబానగర్, హసన్‌నగర్ ప్రాంతాలలో పోలీసులు బుధవారం అర్ధరాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆరు మంది రౌడీ షీటర్లతో పాటు 12 మంది అనుమానితులను, 50 ద్విచక్ర వాహనాలు, 30 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌లకు, ఆటోలకు ఎలాంటి పత్రాలు లేవని డీసీపీ తెలిపారు. కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో పాటు ప్రజలను పలు విషయాలపై అప్రమత్తం చేశారు. ఎలాంటి గుర్తింపు కార్డులు లేని వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వవద్దని సూచించారు. అనుమానితులు కనపడితే వెంటనే 100 నెంబర్‌కు సమాచారం అందించాలని, నేరం చేయడంతో పాటు నేరస్తులకు ఆశ్రయం కల్పించడం కూడా నేరమే అని డీసీపీ తెలిపారు. ద్విచక్ర వాహనాలు భారీ ఎత్తున లభ్యమవడంతో వీటిని ఏఏ ప్రాంతాలలో కోనుగోలు చేశారు, ఎవరు వీరికి అమ్మారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్డన్ సెర్చ్‌లో శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డితో పాటు రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్, రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ సురేష్‌తో పాటు 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అర్ధరాత్రి 3 గంటలకు ప్రారంభమైన కార్డన్ సెర్చ్ ఉదయం 6 గంటల వరకు కొనసాగింది. ప్రతి ఒక్కరి ఆధార్‌కార్డును తనిఖీ చేయడంతో పాటు ఇళ్లను కూడా పోలీసులు సోదాలు చేశారు. -
నేరస్తులను అష్టదిగ్బంధనం చేస్తాం
గుంటూరు: అర్బన్ జిల్లా పరిధిలో నేరాలు జరుగకుండా చూడడమే తమ లక్ష్యమని, నేరాలకు పాల్పడే వారిని అష్టదిగ్బంధనం చేస్తామని అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు చెప్పారు. ఇందులో భాగంగా ఆయన బుధవారం తెల్లవారు జామున నగరంలోని కేవీపీ కాలనీ, కేఎస్ కాలనీ, స్వర్ణభారతి నగర్, దాసరిపాలెం, మహానాడు కాలనీల్లో పోలీసు బలగాలతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 125 వాహనాలను సీజ్ చేసి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సీహెచ్ విజయారావు వివరాలు వెల్లడించారు. మొదటి విడతగా సమస్యాత్మక ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహించామని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా జిల్లాలోకి వచ్చి ఉంటున్న 20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 90 ద్విచక్రవాహనాలు, 28 ఆటోలు, కారు, ట్రాక్టర్‌ను కూడా సీజ్ చేశామని స్పష్టం చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో తమ బలగాలు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ సమర్ధంగా తనిఖీలు పూర్తిచేశారన్నారు. సరైన ఆధారాలు చూపితే వాహనాలు తిరిగి అప్పగించడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. నేరాలు జరగకుండా ఉండేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల నియంత్రణ కోసం ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించామని వివరించారు. భవిష్యత్తులో కూడా కార్డన్ సెర్చ్ కార్యక్రమం కొనసాగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్(ఎల్‌హెచ్‌ఎంఎస్)ను ప్రజలు ఏర్పాటు చేసుకుంటే చోరీలు జరిగే అవకాశం ఉండదన్నారు. ఇప్పటికే 1200 నివాసాలకు ఏర్పాటు చేశామని, అక్కడ ఎలాంటి చోరీలు జరగలేదని చెప్పారు. నగరంలో వంద సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి నిరంతరం తమ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్పీ వైటీ నాయుడు, డీఎస్పీలు జి.రామాంజనేయులు, మూర్తి, కేజీవీ సరిత, కె.శ్రీనివాసులు, వెంకటరెడ్డి, పాపారావు, రమేష్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
మళ్లీ కార్డెన్ సెర్చ్
పెబ్బేరు (కొత్తకోట): వనపర్తిని నేర రహిత జిల్లాగా మార్చాలనే ఉద్దేశంతో ఇన్చార్జ్ ఎస్పీ రెమారాజేశ్వరి పెబ్బేరులో రెండుసారి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజామున ఇన్చార్జ్ అదనపు ఏఎస్పీ భాస్కర్, వనపర్తి డీఎస్పీ సృజన పర్యవేక్షణలో ముగ్గురు సీఐలు, 9 మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్స్, ఓంగార్డులు కలిపి సుమారు 100 మంది ఏడు బృందాలుగా విడిపోయి పట్టణంలో తనిఖీలు చేపట్టారు. గాంధీనగర్, గాయత్రినగర్, సినిమా టాకిస్ కాలనీ, మార్కెట్ వెనకాల, ఓల్డ్ఆర్టీఏ కార్యాలయంలో కాలనీలో తనిఖీలు చేపట్టారు. అనుమానితులు ఎవరైనా ఇంటి అద్దెకు తీసుకొని ఉంటారనే అనుమానంతో వారి ఆధార్ కార్డు, ఐడి ఇతర ఆదారాలు సేకరించి పరిశీలించారు. అనంతరం ఎలాంటి పత్రాలు లేని 34 మోటర్ సైకిళ్లు, 2 ఆటోలను సీజ్ చేసి పెబ్బేరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. నేరాల అదుపునకు సహకరించాలి నేరాలు అదుపులో ఉండాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని ఇన్చార్జ్ ఎస్పీ రెమా రాజేశ్వరి కోరారు. కార్డెన్ సెర్స్‌లో భాగంగా బస్తి ప్రజలతో మాట్లాడారు. ప్రస్తుతం చేస్తున్న సోదాలు ప్రజల సంక్షేమం కోసంమేనని, అసాంఘిక శక్తుల ఆట కట్టించి నేరస్తులు తప్పించుకోకుండా ఉండేందుకు తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా అనుమానస్పదంగా తిరిగితే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఎలాంటి పరిచయం లేని వారికి ఇల్లు అద్దెకు ఇవ్వొద్దని, ఆధార్ కార్డు జిరాక్స్‌తోపాటు పూర్తి వివరాలు తెలుసుకొని ఇవ్వాలన్నారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేని వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో కొత్తకోట సీఐ సోమ్‌నారాయణసింగ్, ఆత్మకూర్ సీఐ శంకర్, వనపర్తి, పెబ్బేరు ఎస్ఐ ఓడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను రక్షించేందుకే పోలీసులు
మెదక్‌రూరల్: ప్రజలను రక్షించేందుకే పోలీసులు ఉన్నారనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించాలని మెదక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి గ్రామంలో ఎస్పీ చందనదీప్తి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రతీ ఇంటిని తనిఖీ చేసి వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను, ఆస్తులను కాపాడేందుకే పోలీసులు ఉన్నారన్నారు. పోలీసులు అంటే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికి ఏ సమస్య ఉన్నా ధైర్యంగా తెలియజేయాలని తెలిపారు. ప్రజలు పోలీసుల పట్ల నమ్మకాన్ని పెంచుకోవాలన్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్డన్ సెర్చ్‌లో భాగంగా ఇంటింటికీ తనిఖీలు చేస్తామని అనుమానితులుగా ఎవరు కనిపించినా, ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు ఉన్నా పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. వాహనాల పత్రాలు తీసుకొస్తే యజమానులకు వాహనాలను అప్పగిస్తామని, లేని పక్షంలో కోర్టుకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్‌లో ముగ్గురు సీఐలు, 8 మంది ఎస్ఐలు, 12 మంది ఏఎస్ఐలు, 42 కానిస్టేబుల్స్, 50 మంది ట్రైనింగ్ సిబ్బంది.. మొత్తం 125 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు రామకృష్ణ, భాస్కర్, రవీందర్‌రెడ్డి, మెదక్ రూరల్ ఎస్ఐ లింబాద్రి, సందీప్ తదితరులు ఉన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి
ఆర్మూర్: ప్రతి పౌరుడు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు శాఖతో సహకరించాలని నిజామాబాద్ సీపీ కార్తికేయ అన్నారు. పట్టణంలోని 2వ వార్డు పరిధిలో గల రంగాచారి నగర్, సంతోష్‌నగర్, జిరాయత్ నగర్ కాలనీల్లో శుక్రవారం వేకువజామున సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అడిషనల్ డీసీపీ శ్రీధర్‌రెడ్డి, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు శివకుమార్, రఘు, సీఐలు సీతారాం, రమణారెడ్డితో పాటు 14 మంది సీఐలు, 23 మంది ఎస్ఐలు, 10 మంది ఏఎస్ఐలు, 25 మంది హెడ్ కానిస్టేబుళ్లు, వంద మంది కానిస్టేబుళ్లతో పాటు మహిళా కానిస్టేబుళ్లు సైతం ఈ సెర్చ్ పాల్గొన్నారు. పోలీసు బలగాలు ఇంటింటికీ సోదాలు చేశారు. అనుమానంగా ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసారు. సుమారు వంద బైకులు, రెండు ట్రాక్టర్లు, ఇతర వాహనాలకు సరైన పత్రాలు లేక సీజ్ చేసారు. కాలనీలోని ఇళ్లలో నివసిస్తున్న వారి ఆధార్ కార్డులను సై తం పరిశీలించారు. సీపీ కార్తికేయ స్థానికులతో మాట్లాడారు. కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇ వ్వాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లితే పోలీసులకు తెలిపితే పెట్రోలింగ్ నిర్వహించే కా నిస్టేబుళ్ల ఆ ఇళ్లను గమనిస్తారన్నారు. దీంతో చో రీలు తగ్గిపోతాయన్నారు. పట్టణంతో పాటు అ న్ని గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసామన్నారు. ఒకవేళ ఎవరైనా నేరానికి పాల్పడితే సీసీ కెమెరాల ద్వారా దొరికి పోతున్నారన్నారు. ఇలాంటి వారికి జరిమానాలతోపాటు జైలు శిక్ష సైతం విధిస్తారన్నారు. -
కార్డన్‌సెర్చ్‌తో అక్రమదందాలకు చెక్
కొడంగల్ రూరల్: అక్రమంగా నిర్వహిస్తున్న దందాలు, కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కార్డన్‌సెర్చ్ నిర్వహించినట్లు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ శంకర్, 10మంది ఎస్సైలు, నలుగురు ఏఎస్సైలు, 80మంది పోలీస్ సిబ్బంది, 10మంది మహిళా కానిస్టేబుల్స్ గ్రామంలోని కిరాణషాపులు, బెల్ట్ షాపులు, హోటల్స్, ఇంటింటి తనిఖీలతోపాటు గ్రామంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 9గ్యాస్ సిలిండర్లు, 4500గుట్కాలు, 90బీరు బాటిల్స్‌ను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎస్పీ అన్నపూర్ణ ఆదేశాల మేరకు కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక సరిహద్దులో ఉన్నందున ఈ గ్రామంలో గంజాయి, మద్యం, డ్రగ్స్, ఆయుధాలు వంటివి సరఫరా అవుతుందనే అనుమానంతో గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగితాలు లేని వాహనాలతో దుండగులు తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వదిలివెళ్తుంటారని అన్నారు. ప్రతి అంశంలోనూ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం పెంచి, ప్రజల సహకారంతో నేరాలు అదుపుచేయడం కార్డన్‌సెర్చ్ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడం, అక్రమ దందాలను అరికట్టడం, అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకోవడం జరుగుతుందని చెప్పారు. యువత సన్మార్గంలో నడవాలని, సమాజసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. అక్రమ దందాలకు పాల్పడేవారి విషయాలపై పోలీస్ శాఖకు సమాచారం అందిస్తే వారి విషయాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో సీఐ శంకర్, దోమ, పరిగి, చన్గోముల్, కొడంగల్ హైవే, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కొడంగల్ ఎస్ఐలు రవికుమార్, సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలి
భిక్కనూరు: ప్రతీ ఒక్కరూ శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ శ్వేత అన్నారు. గురువారం వేకువజామున భిక్కనూరు మండలకేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రసన్నరాణి, సీఐలు శ్రీధర్‌కుమార్, కోటేశ్వర్రావ్, భిక్షపతి, ఎస్సైలు రాజుగౌడ్, రవిగౌడ్, సంతోష్‌కుమార్, కృష్ణమూర్తి, నరేందర్, శోభన్‌బాబు, సురేశ్‌తోపాటు 75 మంది సిబ్బంది కార్డన్ సర్చ్‌లో పాల్గొన్నారు. ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. పలువురి ఆధార్ కార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ శ్వేత మాట్లాడుతూ... ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలను నడిపించాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అన్ని గ్రామాలు, వీధుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలు ఉంటే దొంగతనాలు జరగవని, ఒకవేళ జరిగితే దొంగలు సులువుగా చిక్కుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నర్సింహారెడ్డికి పలు సూచనలు చేశారు. గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, ఉన్నవాటిని సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అన్నదానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. -
కోస్గిలో కార్డెన్ సెర్చ్
కోస్గి (కొడంగల్): పోలీసు ప్రత్యేక బృందాలు కోస్గిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఒక్కసారిగా తనిఖీలు జరపడంతో పట్టణవాసులు భయాందోళనకు గురయ్యారు. ముం దుగా డీఎస్పీ వాహనం, పదుల సంఖ్యలో పోలీసుల వాహనాలు, వెంటనే డీసీఎంలతో పోలీసు బలగాలు కోస్గికి చేరుకున్నాయి. పోలీసుల హంగామాను చూసి ఏం జరుగుతుందో తెలియక పట్టణ ప్ర జల్లో తీవ్ర ఉత్కంట నెలకొంది. ఇదంతా పోలీసు శాఖ చేపట్టిన కార్డెన్ సెర్చ్ అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు. పేట డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 11 మంది ఎస్ఐలు, 150 మంది సిబ్బందితో పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఇంటింటికి వెళ్లి అన్నిరకాల వివరాలు సేకరించారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తూ సంబంధిత పత్రాలను పరిశీలించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు యువకులను విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు జరిపిన కార్డెన్ సెర్చ్‌లో మొత్తం 22 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. -
నేరస్తుల కట్టడికే కార్డన్ సెర్
భువనగిరిఅర్బన్ : నేరస్తులను కట్టడి చేసేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న డీసీపీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని తాతానగర్, పహాడీనగర్ కాలనీల్లో బుధవారం తెల్లవారుజామున పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 50 బైక్‌లు, నాలుగు కార్లు, ఐదు ఆటోలను సీజ్ చేశారు. అలాగే ముగ్గురు రౌడిషీటర్లు, మరో ముగ్గురు అనుమానితులు, ఇద్దరు ఎక్స్కాన్వెర్స్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా బెల్టుషాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని, గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న మరోవ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రెండు గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా డీసీపీ కోరారు. కాగా, తెల్లవారుజామునే పోలీసులు తనిఖీ చేపట్టడంతో ప్రజలు ఒకింత భయాందోళన చెందారు. కార్డన్సర్చ్లో భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ రమేష్, 6 మంది సీఐలు, 15 మంది ఎస్ఐలు, 130 మంది కానిస్టేబుల్, హోంగార్డులు పాల్గొన్నారు. సీజ్ చేసిన వాహనాలు ధృవపత్రాలను పరిశీలిస్తున్న డీసీపీ -
యాదాద్రి జోన్లో కార్డన్ సెర్చ్..
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జోన్లో పోలీసులు తాజాగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. యాదగిరిగుట్ట ట్రెయినీ ఐపీఎస్ అధికారిణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ సెర్చ్‌లో ఒక డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 8 సీఐలు, 20 మంది ఎస్సైలు, 15 మంది మహిళా పోలీసులు, 120 పోలీసులు పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలులేని నాలుగు కార్లు, నాలుగు ఆటోలు, 21 బైకులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలు జంటలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో 21 మంది మహిళలను, 43 మంది పురుషులు ఉన్నారు. -
కార్డన్ సెర్చ్..29 వాహనాలు స్వాధీనం
సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్ వైఎస్సార్ నగర్లో ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 26 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు, 1 మారుతి ఓమ్ని, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 8మంది అనుమానితులను ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక బెల్ట్ షాపును సీజ్ చేశారు. -
భువనగిరిలో కార్డన్ సెర్చ్
భువనగిరిఅర్బన్ : నేరాల నియంత్రణలో భాగంగా రాచకొండ సీపీ మహేష్‌భగవత్ ఆదేశాల మేరకు డీసీసీ రామచంద్రారెడ్డి నేతృత్వంలో పోలీసులు శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మూకుమ్మడిగా కార్డన్ సెర్చ్‌కు దిగారు. సుమారు 250 మంది పోలీసులు 2,3 వార్డుల్లోని ఇళ్లలో విస్తృ తంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భం గా డీసీపీ మాట్లాడుతూ.. భువనగిరి పట్టణంలో ప్రశాంతమైన వాతావరణం కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. పాత నేరస్తులు, పలు కేసుల్లో నిందితులుగా ఉండి పరారీ లో ఉన్న వ్యక్తులను పట్టుకోవడానికి కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అనుమానితులను వదిలిపెట్టేది లేదన్నారు. ఈ తనిఖీ ల్లో ఎనిమిది మంది అనుమానితులను, ఇద్దరు రౌడీషీటర్లను గుర్తించినట్లు డీసీపీ చెప్పారు. అలాగే అనుమతి లేకుండా గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న, ఎక్కువగా గ్యాస్ సిలిండర్లు కలిగిన ఉన్న, ఇంట్లో మద్యం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించామని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.2, 3వ వార్డులోని సంతోష్‌నగర్, సంజీ వనగర్ కాలనీల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేపటట్టామని అనుమతి, సరైన పత్రాలు, ఎలాంటి ఆధారాలు లేకుండా ఉన్న రెండు ట్రాక్టర్లు, రెండు ప్యాసింజర్ ఆటోలు, ఒక కారు, 43 బైకులను సీజ్ చేసినట్లు చెప్పారు. ఆధారాలు చూపితే వాహనాలు ఇస్తామన్నారు. పోలీసులకు రెండు కాలనీల ప్రజలు సహకరించాలని తెలిపారు. శాంతిభద్రతలు, నేరాల నియంత్రణకోసం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇక ముందు అన్ని కాలనీల్లో కార్డెన్ సెర్చ్‌లు కొనసాగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, భువనగిరి ఏసీపీ జితేందర్‌రెడ్డి, చౌటుప్పల్ ఏసీపీ రమేష్, 7 మంది సీఐలు ఎం. శంకర్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, అంజనేయులు, 20 మంది ఎస్ఐలు, 250 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
సుభాష్‌నగర్‌లో ‘నేను సైతం’
కరీంనగర్: కరీంనగర్ నగరంలోని సుభాష్ నగర్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కాలనీవాసులు ముందుకొచ్చారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులు ఇందుకు అంగీకరించారు. కాలనీలో బుధవారం ఉదయం కార్డన్ సెర్చ్ జరిగింది. సిపి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. -
భద్రాచలంలో కార్డన్ సెర్చ్
భద్రాచలం: భద్రాచలంలోని అశోక్‌నగర్ కాలనీలో పోలీసులు సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు, సుమారు 50మంది సిబ్బంది కాలనీని చుట్టుముట్టి ప్రతీ ఇంటినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 50 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కార్డన్ సెర్చ్‌లో ముగ్గురు రౌడీ షీటర్ల అరెస్ట్
రాజమహేంద్రవరం: నగరంలో సమస్యాత్మకమైన రాజేంద్రనగర్‌లో పోలీసులు ఆదివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 56 బైక్‌లను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు రౌడీ షీటర్లను, ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్బన్ ఎస్పీ డి.రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో 300 మంది సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. -
కార్డన్ సెర్చ్.. ఏడుగురు రౌడీ షీటర్లు అరెస్ట్
-
కార్డన్ సెర్చ్.. ఏడుగురు రౌడీ షీటర్లు అరెస్ట్
సికింద్రాబాద్: చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధి మహ్మద్గూడలో శనివారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ సుమతి ఆధ్వర్యంలో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో 380 మంది పోలీసులు పాల్గొని ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టారు. ఏడుగురు రౌడీ షిటర్లు సహా 14 మంది అనుమానితులను ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేనటువంటి 35 బైక్‌లు, 3 ఆటోలు, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
జూబ్లీహిల్స్ లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో గురువారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సెర్చ్ లో 500 మంది పోలీసులు పాల్గొన్నారు. జవహర్ నగర్, మసీద్ గడ్డల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు 43 మంది అనుమానితులు, 8 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 63 బైక్ లు, ఐదు ఆటోలు, గ్యాస్ సిలీండర్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. -
జూబ్లీహిల్స్ లో కార్డన్ సెర్చ్
-
కరీంనగర్లో పోలీసుల కార్డన్ సెర్చ్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. మంగళవారం వేకువజామున నుంచి 7.30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. సీపీ కమలాసన్‌రెడ్డి నేతృత్వంలో 50 మంది పోలీసులు జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇల్లిల్లూ సోదా జరిపారు. ఈ సందర్భంగా 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 20 బైకులు, 2 కార్లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా క్వింటాలు సీజ్ చేశారు. సోదాల్లో ఏసీపీ రామారావు, సీఐలు హరిప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, సదానందం పాల్గొన్నారు. -
మీర్‌పేటలో పోలీసుల కార్డన్ సెర్చ్
-
మీర్‌పేటలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని మీర్‌పేట లెనిన్‌నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రాచకొండ జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా 14 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 బైక్‌లు, 9 ఆటోలు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పాతబస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో శనివారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో కామటిపుర, బార్కాస్, వట్టేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 మంది రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు, నాలుగు ఆయుధాలు, 65 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ తేనె, వెనిగర్, అల్లం పేస్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు తయారీ గోడౌన్‌ను సీజ్ చేశారు. కల్తీ పాల తయారీ కేంద్రంతో పాటు రెండు కబేళ కేంద్రాలను పోలీసులు సీజ్ చేశారు. -
గోదావరిఖనిలో కార్డన్‌సెర్చ్
గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): గోదావరిఖనిలోని 5 ఇంక్లైన్, విఠల్‌నగర్, చంద్రశేఖర్ నగర్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను, నిల్వ చేసిన బొగ్గు, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఓ డీసీపీ, ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్ఐలు, 400 మంది పోలీసులు పాల్గొన్నారు. -
పాతబస్తిలో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తలాబ్‌కట్ట, అమన్ నగర్ ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్‌నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన దృవపత్రాలు లేని 83 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 10 మంది రౌడీ షీటర్లతో పాటు 84 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రెండు బెల్ట్ షాపులపై దాడులు చేసిన పోలీసులు 76 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మండల డీసీప వి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ సెర్చ్‌లో 400 మంది పోలీసులు పాల్గొన్నారు. -
కార్డన్ సెర్చ్: 8 మంది అరెస్ట్
హైదరాబాద్: మేడిపల్లి ఇందిరానగర్‌లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేనటువంటి 36 బైక్‌లు, 3 ఆటోలు, 7 సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు పాత నేరస్తులు సహా ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాతబస్తీలో కార్డెన్ సెర్చ్: 172 మంది అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో శుక్రవారం అర్థరాత్రి నుంచి పోలీసులు కాల్డెన్సర్చ్ నిర్వహించారు. 15 బృందాలలో దాదాపు 400 మంది పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 172 మంది పాతనేరస్తులు, రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి కత్తులు, తపంచాలు స్వాధీనం చేసుకున్నారు. -
కార్డన్ సెర్చ్‌లో..నోరెళ్లబెట్టిన పోలీసులు
డిచ్పల్లి(నిజామాబాద్): మండలంలోని అమృతాపూర్ పంచాతీయ పరిధిలో గల ఒడ్డెర కాలనీ, దేవునగర్ లెప్రసీ క్యాంపులో పోలీసులు మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు మొదలైన తనిఖీలు ఉదయం 10 గంటల వరకు కొనసాగాయి. నిజామాబా ద్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ నేతృత్వంలో డిచ్పల్లి సీఐ తిరుపతి, ఎస్సైలు కట్టా నరేందర్‌రెడ్డి, శ్రీదర్‌గౌడ్, ము రళి, ప్రొబేషనరీ ఎస్సై నవీన్‌కుమార్, ఏఎస్సై గంగారాం, సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సోదాలు చేశారు. ఈ సందర్భంగా లభించిన సామగ్రిని చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. దాదాపు ప్రతి ఇంట్లో క్రిస్టియన్ మెడికల్ కళాశాల (సీఎంసీ)కు చెందిన సామగ్రి లభించడంతో విస్తుబోయారు. కళాశాలలోని మంచాలు, టేబుళ్లు, బెంచీలు, ఫ్రిజ్‌లు, బీరువాలు, సీలింగ్‌ఫ్యాన్లు ఆ ఖరికి పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన బెడ్లు లభించడంతో సిబ్బంది విస్మయానికి గురయ్యారు. కొందరైతే అవసరం లేకున్నా గదులకు ఉన్న తలుపులు ఎత్తుకొచ్చి ఇళ్లల్లో దాచుకున్నారు. సామగ్రిని ఐదు ట్రాక్టర్లలో తరలించి విక్టోరియా హాస్పిటల్ ఆవరణలోని భవనంలో ఉంచారు. పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. సంఘ విద్రోహ శక్తులను అరికట్టేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. ప్రతి ఇంట్లో సీఎంసీ కళాశాలకు చెందిన సామాగ్రి లభించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. త్వరలో మరోసారి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామని, చోరీ చేసిన సామాగ్రి లభిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న సామగ్రి వివరాలు నమోదు చేసుకుని సీఎంసీ ప్రతినిధులకు అప్పగిస్తామని తెలిపారు. -
కోఠిలో 300 మంది పోలీసుల కార్డన్‌సెర్చ్
-
కోఠిలో 300 మంది పోలీసుల కార్డన్‌సెర్చ్
హైదరాబాద్: నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కోఠిలో శనివారం రాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సోదాల్లో 300 మంది పోలీసులు పాల్గొన్నారు. కోఠి ప్రాంతంలోని సుల్తాన్‌బజార్, గుజరాతీ గల్లీ, బ్యాంక్ స్ట్రీట్, హరిద్వార్ గల్లీల్లో ఇళ్లను, వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 96 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను సీజ్ చేశారు. 34 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
పోలీసుల అదుపులో ఘరానా దొంగలు
♦ కార్డన్ సెర్చ్‌లో పట్టుబడ్డ పాండు గ్యాంగ్ ♦ ఓ పాత నేరస్థుడికి రిమాండ్ ♦ 2లక్షల చోరీ సొత్తు రూ.50వేల నగదు, ♦ నాలుగు సెల్ ఫోన్లు రికవరీ చిక్కడపల్లి: దేవాలయంలో పురాతన పంచలోహ విగ్రహాలతో పాటు పూజా సామాగ్రి ఎత్తుకెళ్లిన పాత నేరస్థుడు సుబ్రహ్మణ్యంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులను భయబ్రాంతులకు గురిచేసి దృష్టి మళ్లించి నగదు చోరీ చేసే పాండు గ్యాంగ్ చిక్కడపల్లి సబ్ డివిజనల్ పోలీసులు ఆరెస్ట్ చేశారు. గాంధీనగర్ పీఎస్ పరిధిలోని ఉన్ని కోట, తాళ్ళబస్తీ తదితర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం నుంచి రూ.2లక్షల విలువైన పంచలోహ విగ్రహాలు , పాండు గ్యాంగ్ నుంచి రూ.50వేల నగదు, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పాండు గ్యాంగ్ నాయకుడు పాండుతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. శనివారం చిక్కడపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ జె.నర్సయ్య, డీఐలు బాబ్జీ, సంతోష్‌కుమార్, శ్రీనాథ్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని పుట్‌పాత్‌లపై నివసించే సుబ్రహ్మణ్యం(20), ఐదు రోజుల క్రితం నారాయణగూడ పీఎస్ పరిధిలోని పంచముఖ హనుమాన్ ఆలయంలోని హనుమాన్ విగ్రహంతో పాటు పూజాసామాగ్రి ఎత్తుకెళ్లాడన్నారు. గత ఏడాది ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిని పోచమ్మ దేవాలయంలో ఇతను చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ/కుల దృష్టి మళ్లించి నగదు చోరీ చేస్తున్న పొండు గ్యాంగ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇటీవల సికింద్రాబాద్ బైబిల్ హౌస్ సమీపంలో బస్సు ప్రయాణీకులను భయబ్రాంతులకు గురిచేసి వారి నుంచి రూ.13వేలు చోరీ చేసిన సంఘటనపై సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించిన పోలీసులు కార్డెన్ సెర్చ్‌లో వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో ఆల్వాల్ పాండు(40), దేవకుమార్(42), ఒంగూరి సురేష్(38), గుండేపల్లి శ్రీను(42), మహ్మద్ ఇక్బాల్(30), పట్టుబడగా బల్లు (25), పరారయ్యాడు. -
అఫ్జల్‌గంజ్‌లో పోలీసుల కార్డన్‌సెర్చ్
హైదరాబాద్: అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాంబాగ్, పూసలబస్తీ, సుందర్బాగ్లో శనివారం రాత్రి ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంటింటి వెళ్లి సోదాలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి అద్దెకు ఉంటున్న వారి వివరాలను కూడా సేకరించారు. దాదాపు 200 మంది పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు. -
కార్డన్ సెర్చ్‌లో 48 వాహనాలు సీజ్
మలక్‌పేట్: మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాలివాహననగర్ ప్రాంతాలో పోలీసులు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసు బలగాలతో జల్లెడ పట్టారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా... సరైన పత్రాలు లేని 48 ద్విచక్ర వాహనాలు, రెండు సిలీండర్లను స్వాధీనం చేసుకున్నారు. మలక్‌పేట ఏసీపీ సుధాకర్, సీఐ గంగారెడ్డి, డీఐ గుజ్జ రమేష్, డీఎసై ్స నరేష్, ఎస్సైలు రమేష్, రంజిత్‌కుమార్, వెంకట్రామ్రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. -
నాగోలులో కార్డన్‌సెర్చ్.. 17 వాహనాలు సీజ్
హైదరాబాద్: నాగోలులోని ఫతుల్‌గూడ ప్రాంతంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎల్బీనగర్ డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది పోలీసులు ఆ ప్రాంతంలో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో రౌడీషీటర్లు కూడా ఉన్నారని సమాచారం. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలతోపాటు గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. -
కార్డన్ సెర్చ్.. ఐదుగురు రౌడీ షీటర్ల అరెస్ట్
హైదరాబాద్: టప్పచబుత్ర జోషివాడలో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. సుమారు 150 మంది పోలీసులు ఆదివారం వేకువజాము నుంచే ఈ తనిఖీలు మొదలుపెట్టారు. తమ తనిఖీలలో భాగంగా 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఐదుగురు రౌడీ షీటర్లను అరెస్ట్ చేశారు. సరైన పత్రాలు చూపించని కారణంగా 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పాతబస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని పహాడిషరీఫ్, షహీన్ నగర్లో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. భారీ మొత్తంలో పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఏడుగురు రౌడీషీటర్లతో పాటూ 50 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. సరైన పత్రాలులేని 50బైక్‌లు, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. -
కార్డన్ సర్చ్‌లో 36 వాహనాలు స్వాధీనం
నిజామాబాద్ జిల్లా లింగంపేట మండల కేంద్రంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నలుగురు ఎస్ఐలు, 9 మంది శిక్షణ ఎస్ఐలు, 35 మంది కానిస్టేబుళ్లు మూడు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో సోదాలు, తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 30 ద్విచక్ర వాహనాలు సహా మొత్తం 36 వాహనాలను సీజ్ చేశారు. -
రాజేంద్రనగర్‌లో కార్డన్ సెర్చ్
హైదరాబాద్: రాజేంద్రనగర్, లంగర్ హౌస్, హుమయున్ నగర్లో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈజిప్ట్, ఆఫ్గనిస్తాన్, నైజీరియా దేశస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూపీ, మహారాష్ట్రకు చెందిన 16మంది వ్యక్తులను పోలీసులు విచారిస్తున్నారు. ఆరుగురు రౌడీషీటర్లను కూడా అదుపులోకి తీసుకొని, సరైన పత్రాలులేని 14బైక్‌లు సీజ్ చేశారు. -
బహదూర్‌పురాలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని కిషన్‌బాగ్, అసద్‌బాబానగర్‌లో బుధవారం ఉదయం నుంచిపోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో 300 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. దక్షిణ మండలం పోలీసుల ఆద్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇంటెలిజెన్స్, ఎస్బీ హెచ్చరికలతో పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో అనుమతి లేకుండా నివసిస్తున్న 120 మంది బర్మా దేశస్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. -
పాతబస్తీలో నకిలీ దందా బాగోతం
-
బాలానగర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్
-
బాలానగర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: బాలానగర్ సురారం కాలనీ మైత్రినగర్‌లో ఆదివారం తెల్లవారుజామునుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అడిషినల్ డీసీపీ నివాస్ ఆధ్వర్యంలో 300 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 45 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి 22 బైకులు, 10 ఆటలోలు, కారు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
హబ్సీగూడలో భారీ కార్డన్ సెర్చ్
హైదరాబాద్‌సిటీ: హబ్సీగూడ పరిధిలోని జీజీకాలనీలో ఈస్ట్‌జోన్ డీసీపీ రవిందర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్(నిర్బంధ తనిఖీలు) నిర్వహించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని..45 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో సుమారు 150 పోలీసులు పాల్గొన్నారు. శాంతిభద్రతల దృష్టితో హైదరాబాద్ పోలీసులు ఈ మధ్యకాలంలో తరచూ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
పాతబస్తీలో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో మంగళవారం ఉదయం నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హఫీజ్ నగర్, బహదూర్‌పురా, కాలాపత్తార్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
ఎల్బీనగర్లో పోలీసుల కార్డన్ సెర్చ్
-
ఎల్బీనగర్లో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్:నగరంలోని ఎల్బీనగర్, ఎన్టీఆర్ నగర్లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ ఇక్భాల్ ఆధ్వర్యంలో 380 మంది పోలీసులతో ప్రతి ఇంట్లోనూ సోదాలు జరిపారు. ఈ సోదాల్లో41 బైకులు,10 ఆటోలు, 9 గ్యాస్ సిలిండర్లు, రెండు గ్యాస్ రీఫిల్లింగ్ మిషన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు దుకాణాలను సీజ్ చేసి, 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 11 మంది పాత నేరస్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు రౌడీషీటర్లు కూడా ఉన్నారు. -
పోలీసుల కార్డన్ సెర్చ్ : 60 మంది అరెస్ట్
-
మందుల బస్తీలో కార్డన్ సెర్చ్
-
డాక్యుమెంట్స్ లేని వాహనాలు సీజ్
-
వాజ్‌పేయినగర్‌లో కార్డన్‌సెర్చ్
కుత్బుల్లాపూర్: పేట్‌బషీరాబాద్ పరిధిలోని వాజ్‌పేయినగర్‌లో సైబరాబాద్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు ఇంటింటికి వెళ్లి సోదాలు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని, వారి వాహనాలను సీజ్ చేశారు. గతంలో వీరిపై ఏమైనా కేసులున్నాయా..? అన్న విషయంపై ఆరా తీశారు. జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో అడిషనల్ డీసీపీ ఎస్ఓటీ రామచంద్రారెడ్డి, ఏసీపీలు అశోక్‌కుమార్, నంద్యాల నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్లు, కిష్టయ్యలతో పాటు 12 మంది సీఐలు, 25 మంది ఎస్సైలు, 150 మంది సిబ్బందితో ఆదివారం తెల్లవారు జామున 3 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కార్టన్ సెర్చ్ నిర్వహించారు. పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. -
ఉస్మానియా ఆస్పత్రిలో కార్డన్‌సెర్చ్
అప్జల్‌గంజ్ (హైదరాబాద్): ఉస్మానియా ఆస్పత్రిలో అప్జల్‌గంజ్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం సుల్తాన్‌బజార్ ఏసీపీ రావుల గిరిధర్ నేతృత్వంలో చాదర్‌ఘాట్, సుల్తాన్‌బజార్, అప్జల్‌గంజ్ పోలీస్స్టేషన్లకు చెందిన దాదాపు 100 మంది పోలీసులు ఈ కార్డన్‌సెర్చ్‌లో పాల్గొన్నారు. ఆస్పత్రిలోని ఔట్ పేషెంట్ బ్లాక్, ఇన్ పేషెంట్ బ్లాక్‌లతో పాటు అన్ని వార్డులలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉస్మానియాలో దొంగతనాలు జరుగుతున్నాయని ఫిర్యాదు రావడంతో కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఏసీపీ రావుల గిరిధర్, అప్జల్‌గంజ్ ఇన్స్పెక్టర్ అంజయ్య తెలిపారు. -
రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్
రాంగోపాల్‌పేట (హైదరాబాద్) : అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని గురువారం రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టారు. సెంట్రల్ జోన్ డీసీపీ కమల్ హాసన్ రెడ్డి ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొని తనిఖీలు చేపట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి సరైన గుర్తింపు పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. -
పోలీసుల అదుపులో ఆరుగురు రౌడీ షీటర్లు
-
పోలీసుల అదుపులో ఆరుగురు రౌడీ షీటర్లు
హైదరాబాద్ : నగరంలోని షాహినాద్ గంజ్ పీఎస్ పరిధిలోని జుమ్మెరాత్ బజార్, దేవినగర్‌లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు తనిఖీలు చేశారు. ఆరుగురు రౌడీ షీటర్లు, 15 మంది అనుమానితులను అదుపులోనికి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 17 వాహనాలు, 2 వేల గుడుంబా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
జీడిమెట్లలో పోలీసుల కార్డన్ సెర్చ్...
హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలోని జగద్గిరిగుట్ట, రింగ్ బస్తీలో శనివారం అర్థరాత్రి నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా సైబరాబాద్ జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 400మంది పోలీసులు పాల్గొని తనిఖీలు చేశారు. తనిఖీల్లో 10మంది రౌడీషీటర్లు, 20మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు 9 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
డీసీపీ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్
-
సెర్చ్ ఆపరేషన్ : ఆరుగురు అరెస్ట్
-
పోలీసు దిగ్బంధం...
హసన్‌నగర్‌లో ‘కార్డన్ సర్చ్’ * సోదాల్లో పాల్గొన్న 400 మంది పోలీసులు * ప్రతి ఇల్లూ తనిఖీ * పాతనేరస్తుల అరెస్టు * అదుపులో అనుమానితులు అత్తాపూర్: తెల్లవారుజాము 3 గంటలు... హసన్‌నగర్... బూట్లచప్పుళ్లు.... ఆయుధాలతో వందల సంఖ్యలో పోలీసులు... అసలు ఏం జరుగుతుందో తెలియక బస్తీవాసుల్లో భయాందోళన ... చివరకు ‘కార్డన్ సర్చ్’లో భాగంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. డీసీపీ రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి హసన్‌నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు హసన్‌నగర్ చేరుకున్నారు. బస్తీ మొత్తాన్ని చుట్టుముట్టారు. ఎవ్వరినీ బస్తీలోకి, బయటకు వెళ్లకుండా రహదారులను మూసివేశారు. \ప్రతీ ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో వారి గురించి ఆరా తీశారు. పాతనేరస్తులు మహ్మద్ మునీర్(22), మహ్మద్ మోసిన్(19)లను పట్టుకున్నారు. రౌడీషీటర్ ఎస్కె. మస్తాన్(49), మహ్మద్ యూనిస్‌లతో పాటు మరో 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. క్రైం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఓఎస్డీ అడిషనల్ డీసీపి ఈ. రాంచంద్ర రెడ్డి, రాజేంద్రనగర్, శంషాబాద్, క్రైం ఏసీపీలు ముత్యంరెడ్డి, సుదర్శన్, మహేష్, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు ఇతర సిబ్బంది ‘కార్డన్ సర్చ్’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ డీసీపీ రమేష్ నాయుడు విలేకరులతో మాట్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరస్తులు ఎక్కువగా ఉండే హసన్‌నగర్‌లో సోదాలు నిర్వహించామన్నారు. నగరాన్ని సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రం చేస్తున్న కృషిలో తాము కూడా భాగస్వాములమన్నారు. శాంతిభద్రతల పరంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ధైర్యం చెప్పడానికి నేరస్తులపై కఠిన చ ర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు సోదాలు నిర్వహించి, ఇన్నాళ్లూ తమ మధ్య ఉంటున్న నేరస్తులను అరెస్టు చేయడం ఎంతో ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు. -
ఏలూరులో పోలీసులు విస్తృత తనిఖీలు
-
నందనవనంలో పోలీసులు విస్తృత తనిఖీలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట మండలం నందనవనంలో పోలీసులు ఇంటింట తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అలాగే అనుమానితులకు చెందిన 19 బైకులు 19 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ డీసీపీ విశ్వప్రసాద్ నేతృత్వంలో ఈ సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో దాదాపు 200 మందికిపైగా పోలీసులు పాల్గొన్నారు. శనివారం అర్థరాత్రి ప్రారంభమైన ఈ సోదాలు ఆదివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి. శనివారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతల్లో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా దాదాపు 65 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరు పేకాటరాయుళ్లు ఉన్న సంగతి తెలిసిందే. -
జూబ్లీహిల్స్‌లో భారీగా పోలీసు తనిఖీలు
నేరాలను అదుపు చేసేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు మొదలుపెట్టారు. ఇటీవలే మల్లేపల్లి ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేసి, దాదాపు 56 మంది వరకు నేరస్థులను, కొన్ని హత్యకేసుల్లో నిందితులను కూడా పట్టుకున్న పోలీసులు.. ఇప్పుడు తాజాగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొదలుపెట్టిన ఈ ఆపరేషన్.. తెల్లవారుజాము వరకు కొనసాగింది. మొత్తం 65 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 25 మంది పేకాట రాయుళ్లను కూడా అరెస్టు చేశారు. నగరంలో నేరాలను అదుపులోకి తెచ్చేందుకే ఈ కార్డన్ సెర్చ్ చేస్తున్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.