
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జోన్‌లో పోలీసులు తాజాగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. యాదగిరిగుట్ట ట్రెయినీ ఐపీఎస్ అధికారిణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ సెర్చ్‌లో ఒక డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 8 సీఐలు, 20 మంది ఎస్సైలు, 15 మంది మహిళా పోలీసులు, 120 పోలీసులు పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలులేని నాలుగు కార్లు, నాలుగు ఆటోలు, 21 బైకులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలు జంటలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో 21 మంది మహిళలను, 43 మంది పురుషులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment