పోలీసు దిగ్బంధం... | Searches 400 people were involved in the police | Sakshi
Sakshi News home page

పోలీసు దిగ్బంధం...

Published Mon, Nov 24 2014 12:32 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

Searches 400 people were involved in the police

హసన్‌నగర్‌లో ‘కార్డన్ సర్చ్’
* సోదాల్లో పాల్గొన్న 400 మంది పోలీసులు
* ప్రతి ఇల్లూ తనిఖీ
* పాతనేరస్తుల అరెస్టు
* అదుపులో అనుమానితులు

అత్తాపూర్: తెల్లవారుజాము 3 గంటలు... హసన్‌నగర్...  బూట్లచప్పుళ్లు.... ఆయుధాలతో వందల సంఖ్యలో పోలీసులు...  అసలు ఏం జరుగుతుందో తెలియక బస్తీవాసుల్లో భయాందోళన ... చివరకు ‘కార్డన్ సర్చ్’లో భాగంగా పోలీసులు తనిఖీ చేస్తున్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.   డీసీపీ రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి హసన్‌నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు హసన్‌నగర్ చేరుకున్నారు. బస్తీ మొత్తాన్ని చుట్టుముట్టారు. ఎవ్వరినీ బస్తీలోకి, బయటకు వెళ్లకుండా రహదారులను మూసివేశారు.  

\ప్రతీ ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో వారి గురించి ఆరా తీశారు.  పాతనేరస్తులు మహ్మద్ మునీర్(22), మహ్మద్ మోసిన్(19)లను పట్టుకున్నారు. రౌడీషీటర్ ఎస్‌కె. మస్తాన్(49), మహ్మద్ యూనిస్‌లతో పాటు మరో 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.  క్రైం అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, ఓఎస్‌డీ అడిషనల్ డీసీపి ఈ. రాంచంద్ర రెడ్డి, రాజేంద్రనగర్, శంషాబాద్, క్రైం ఏసీపీలు ముత్యంరెడ్డి, సుదర్శన్, మహేష్, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు ఇతర సిబ్బంది ‘కార్డన్ సర్చ్’లో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా శంషాబాద్ డీసీపీ రమేష్ నాయుడు విలేకరులతో మాట్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేరస్తులు ఎక్కువగా ఉండే హసన్‌నగర్‌లో సోదాలు నిర్వహించామన్నారు. నగరాన్ని సేఫ్ అండ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రం చేస్తున్న కృషిలో తాము కూడా భాగస్వాములమన్నారు. శాంతిభద్రతల పరంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ధైర్యం చెప్పడానికి నేరస్తులపై కఠిన చ ర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు సోదాలు నిర్వహించి, ఇన్నాళ్లూ తమ మధ్య ఉంటున్న నేరస్తులను అరెస్టు చేయడం ఎంతో ఆనందంగా ఉందని స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement