
పోలీసుల అదుపులో ఘరానా దొంగలు
దేవాలయంలో పురాతన పంచలోహ విగ్రహాలతో పాటు పూజా సామాగ్రి ఎత్తుకెళ్లిన పాత నేరస్థుడు సుబ్రహ్మణ్యంతో పాటు
♦ కార్డన్ సెర్చ్‌లో పట్టుబడ్డ పాండు గ్యాంగ్
♦ ఓ పాత నేరస్థుడికి రిమాండ్
♦ 2లక్షల చోరీ సొత్తు రూ.50వేల నగదు,
♦ నాలుగు సెల్ ఫోన్లు రికవరీ
చిక్కడపల్లి: దేవాలయంలో పురాతన పంచలోహ విగ్రహాలతో పాటు పూజా సామాగ్రి ఎత్తుకెళ్లిన పాత నేరస్థుడు సుబ్రహ్మణ్యంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులను భయబ్రాంతులకు గురిచేసి దృష్టి మళ్లించి నగదు చోరీ చేసే పాండు గ్యాంగ్ చిక్కడపల్లి సబ్ డివిజనల్ పోలీసులు ఆరెస్ట్ చేశారు. గాంధీనగర్ పీఎస్ పరిధిలోని ఉన్ని కోట, తాళ్ళబస్తీ తదితర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా వీరు పట్టుబడ్డారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం నుంచి రూ.2లక్షల విలువైన పంచలోహ విగ్రహాలు , పాండు గ్యాంగ్ నుంచి రూ.50వేల నగదు, నాలుగు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
పాండు గ్యాంగ్ నాయకుడు పాండుతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు. శనివారం చిక్కడపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ జె.నర్సయ్య, డీఐలు బాబ్జీ, సంతోష్‌కుమార్, శ్రీనాథ్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని పుట్‌పాత్‌లపై నివసించే సుబ్రహ్మణ్యం(20), ఐదు రోజుల క్రితం నారాయణగూడ పీఎస్ పరిధిలోని పంచముఖ హనుమాన్ ఆలయంలోని హనుమాన్ విగ్రహంతో పాటు పూజాసామాగ్రి ఎత్తుకెళ్లాడన్నారు. గత ఏడాది ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనిని పోచమ్మ దేవాలయంలో ఇతను చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ/కుల దృష్టి మళ్లించి నగదు చోరీ చేస్తున్న పొండు గ్యాంగ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇటీవల సికింద్రాబాద్ బైబిల్ హౌస్ సమీపంలో బస్సు ప్రయాణీకులను భయబ్రాంతులకు గురిచేసి వారి నుంచి రూ.13వేలు చోరీ చేసిన సంఘటనపై సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించిన పోలీసులు కార్డెన్ సెర్చ్‌లో వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో ఆల్వాల్ పాండు(40), దేవకుమార్(42), ఒంగూరి సురేష్(38), గుండేపల్లి శ్రీను(42), మహ్మద్ ఇక్బాల్(30), పట్టుబడగా బల్లు (25), పరారయ్యాడు.