హైదరాబాద్: నగరంలోని మీర్‌పేట లెనిన్‌నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున నుంచి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రాచకొండ జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా 14 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 బైక్‌లు, 9 ఆటోలు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.