ఇందిరానగర్‌లో ముట్టడి.. కట్టడి | Cardon Search in Indiara nagar Hyderabad | Sakshi

ఇందిరానగర్‌లో ముట్టడి.. కట్టడి

Oct 14 2019 10:31 AM | Updated on Oct 14 2019 10:31 AM

Cardon Search in Indiara nagar Hyderabad - Sakshi

వివరాలు సేకరిస్తున్న పోలీసులు

హిజ్రాలకు కౌన్సెలింగ్‌  

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 5లోని ఇందిరానగర్‌లో శనివారం అర్దరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ పోలీసులు సంయుక్తంగా కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ సుమతి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ  కార్యక్రమంలో పంజగుట్ట ఏసీపీ తిరుపతన్నతో పాటు బంజారాహిల్స్‌ డీఐ కె. రవికుమార్, జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. బల్వంతయ్యతో పాటు ఐదురుగు ఇన్‌స్పెక్టర్లు, 10 మంది ఎస్‌ఐలు, 8 మంది ఏఎస్‌ఐలు, 66 మంది కానిస్టేబుళ్ళు, 11 మంది హోంగార్డులు పాల్గొని బస్తీని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి అర్ధరాత్రి అనుమానాస్పదంగా, అనుమతిలేని పత్రాలతో, నంబర్‌ప్లేట్‌ లేని వాహనాలపై తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.

ఇందులో భాగంగా 122 ఇళ్లను తనిఖీలు చేశారు. 300 మందిని ప్రశ్నించారు. 403 వాహనాలను తనిఖీ చేసి పత్రాలు సరిగ్గా లేని 46 వాహనాలను ïసీజ్‌ చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న 87 మందిని అదుపులోకి తీసుకున్నారు. 11 మంది హిజ్రాలను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. హిజ్రాల కోసం పాత బస్తీ నుంచి వచ్చిన 110 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 230 మంది యువకుల ఫోన్‌ నంబర్లను తనిఖీలు చేసి వారు ఎవరెవరికి టచ్‌లో ఉంటున్నారో తెలుసుకున్నారు. 60 మంది ఫింగర్‌ప్రింట్స్‌ సేకరించారు. ఫేషియల్‌ రికగ్నజేషన్‌ సిస్టమ్‌లో భాగంగా 98 మందిని పరిశీలించారు. 5 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement