Indira Nagar
-
ఆ ప్రభుత్వ పాఠశాల ఎందుకంత ఫేమస్ ?
-
ఇది మామూలు ర్యాగింగ్ కాదుగా.. ఆ ఇంటి ఓనర్ పరిస్థితి ఏంటో?
నా డబుల్ బెడ్రూం ఫ్లాట్‌ను అద్దెకిస్తానంటూ ఓ ఇంటి యజమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో..నెటిజన్లు సైతం తమదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? బెంగళూరులో ప్రముఖ ప్రాంతాలుగా పేరున్న ఇందిరానగర్‌కు చెందిన భరత్_ఎంజీ ఎక్స్.కామ్‌లో తన డబుల్ బెడ్రూం ఫ్లాట్‌లో ఉండేందుకు కిరాయి దారులు కావాలని పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో ‘ఇందిరానగర్ 80 అడుగుల రోడ్డులో లేజీ సుజీ పక్కన ,12వ మెయిన్‌కి కుడివైపున నా 2 BHK ఫ్లాట్‌ని అద్దెకు ఇస్తున్నాను. ఇటీవలే ఇంటీరియర్స్ చేశారు. బెడ్రూమ్లో ప్రొజెక్టర్, మోటరైజ్డ్ స్క్రీన్‌తో హోమ్ థియేటర్ సెటప్ ఉంది. ఎలాంటి పరిమితులు లేవు. అక్టోబర్ 15 ఇంట్లో అద్దెకు జాయిన్ అవ్వొచ్చు. రెంట్ రూ. 45 వేలు, రెంట్‌కు ఇల్లు కావాలంటే డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి’ అని పేర్కొంటూ ఆ ఇంటి ఫోటోల్ని జత చేశారు. మురిసి పోయి.. రెంటు పెంచేసి అసలే ఇందిరా నగర్, పైగా చూడటానికి ఇల్లు బాగుంది. అద్దె ఇంటి కోసం వెతుకుతున్న వారు సైలెంట్‌గా ఉంటారా? ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఇంటి ఓనర్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌కి వందల మంది తమకు ఆ ఇల్లు అద్దెకు కావాలని రిప్లయి ఇచ్చారు. తాను పెట్టిన పోస్ట్‌కి ఊహించని స్పందన చూసిన యజమాని మురిసిపోయాడు. గంటలోనే అద్దె రూ.45 వేలు కాదని, రూ.55 వేలంటూ మరో పోస్ట్ పెట్టాడు. మా ఇంటిని అద్దెకిస్తున్నాం దీంతో యాజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు గట్టిగా కౌంటర్ ఇస్తూ ప్రపంచ దేశాల్లో ప్రముఖ మైన ఇళ్లను, ప్రభుత్వ కార్యాలయాల్ని అద్దె ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం. రెంట్ ఎంతో చెబుతూ సెటైరికల్‌గా కొన్ని పోస్ట్‌లు పెట్టారు. ఆ పోస్ట్‌లు సైతం నెటిజన్లను అలరించడంతో.. ఇంటి ఓనర్ తిక్క కుదురుతుందిలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు పెట్టిన పోస్ట్‌లను చూసి అలరించండి Story of bangalore rents these days covered in two images. 10k increase in just 6 hours. pic.twitter.com/j0VF44aZI5 — Nitin Kalra (@nkalra0123) September 3, 2023 అయ్యో పాపం అనుకున్నారు ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చిన్న స్వామి స్టేడియంలో అతిన్ బోస్ అనే ఓ ప్రొడక్ట్ డిజైనర్ ‘ఇందిరానగర్ లో 2బీహెచ్ కే ఇంటి కోసం చూస్తున్నాను’ అని పేర్కొంటూ పింక్ ప్లకార్డుతో దర్శనమిచ్చాడు. ఇందిరా నగర్లో 2బీహెచ్‌కే బెడ్ రూంలో ఉంటున్నా. అద్దె రూ.35,000. ప్రస్తుతం నేను ఉంటున్న ఇంటి యజమాని అద్దెను ఒక్కసారిగా 60 శాతం పెంచేశాడు. ఇప్పుడు ఇందిరాగనర్ లో రూ.60 వేల లోపు అద్దెకు ఇల్లు లభించని పరిస్థితి ఉంది. రూ.80 వేలు పెట్టినా కష్టంగానే ఉంది’ అని బోస్ వాపోయాడు. అప్పట్లో అతిన్ బోస్ తీరుతో.. బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడం ఇంత కష్టమా అంటూ నెటిజన్లు విస్మయానికి గురయ్యారు. ఇప్పుడు అదే నెటిజన్లు ఇంటి యజమానులు గంటలోనే రెంటు రూ.10వేల పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. Renting my 20 BHK villa also known as 'raichand house' with private helicopter in Indiranagar. No restrictions Move in date: Oct 15 Rent: 200K Attached pic DMs are open pic.twitter.com/7yh3g8VbqC — Jagdish Patil (@jagdishpatil02) September 3, 2023 Renting my New Delhi apartment Just off Kingsway road, next to Raisina Hill Interiors done recently Bedroom has a home theater setup with a projector and motorized screen No restrictions Move in date: Oct 15 Rent: 45K Attached pics DMs are open pic.twitter.com/V3HXkbG9gE — Sumit Sharma (@Sumitkrsharma) September 3, 2023 Renting my Delhi bungalow nearby Raisina hills 340 BHK Interiors done recently Bedroom has a home theater setup with a projector and motorized screen No restrictions Move in date: Oct 15 Rent: 45K Attached pics DMs are open https://t.co/RJlbLLJc9Y pic.twitter.com/raBbjqKOhI — Аshish Pradhan 🇮🇳🇺🇦🕉️⚕️🩺 (@DrAshishPradhan) September 3, 2023 Renting my West Delhi bungalow. Interiors done recently Bedroom has a home theater setup with a projector and motorized screen No restrictions Move in date: Oct 15 Rent: 45K Attached pics DMs are open pic.twitter.com/Q5P8XUX0FR — Anmol (@anmolm_) September 3, 2023 -
మాది దిగువ వీధి కాదు..ఇందిరా నగర్
‘కీజ తెరు’ అనంటే తమిళంలో ‘దిగువ వీధి’ అని అర్థం. ప్రతి ఊరిలో దిగువ వీధి ఉంటుంది. దిగువ వీధిలో ఎవరుంటారో ఊరి వారికి తెలుసు. దళితులు. వారు నివసించే ప్రాంతాన్ని ఆ విధంగా గుర్తిస్తారు. ‘ఇలా పేరులో వివక్షను తొలగించండి’ అని తమ వాడ పేరును మార్చడానికి సంవత్సరం పాటు పోరాడింది అనసూయ అనే అమ్మాయి. దిగువ వీధికి బదులుగా వారి వీధి మొన్నటి జూలై 1న ‘ఇందిరా నగర్’ అయ్యింది. వివక్ష గుర్తులను చెరిపే పోరాటం కొనసాగిస్తానని అంటోంది అనసూయ. తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ పదవి స్వీకరించాక 2022 అక్టోబర్‌లో గ్రేటర్ చెన్నై అంతటా కులాలను సూచించే వీధుల పేర్లను, భవంతుల పేర్లను తొలగించవలసిందిగా ఆదేశించాడు. దేశంలో అన్నిచోట్ల ఉన్నట్టే తమిళనాడులో కూడా ఊళ్లలోని కొన్ని వీధులను కులాల పేర్లతో పిలవడం వాడుకలో ఉంది. సామాజిక స్పృహ పెరిగాక ఈ ధోరణి తగ్గినా చైతన్యం ఎంతో అవసరం ఉంది. ముఖ్యంగా దళితుల విషయంలో. వీరికి ఆలయాల ప్రవేశంలోగాని, ఊరి కట్టుబాట్లలో ప్రాధాన్యం ఇవ్వడంలోగాని వివక్ష పాటిస్తున్నారనే ఎన్నో వార్తలు తమిళనాడు నుంచి వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అనసూయ శరవణ ముత్తు అనే 28 ఏళ్ల సివిల్ ఇంజినీర్ తన ఊరిలోని తన వాడకు మర్యాదకరమైన పేరు సాధించడంలో విజయం పొందింది. ఆది ద్రావిడార్ తెరు తమిళనాడులోని అరియలూర్ జిల్లాలో ఆనందవాడి అనే చిన్న పల్లె ఉంది. ఆ పల్లెలో 1994లో దళితులకు పట్టాలిచ్చారు. 2000 సంవత్సరానికి 100 కుటుంబాలు అక్కడ ఇళ్లు కట్టుకుని తమ పేటకు ‘ఇందిరా నగర్’ అని పేరు పెట్టుకున్నారు. అయితే వారు పెట్టుకునే పేరు వారు పెట్టుకోగా ఊరు వారిని తాను ‘ఎలా గుర్తించాలనుకుంటున్నదో’ అలా గుర్తించి ఆ పేటను ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘పార తెరు’, ‘ఆది ద్రావిడార్ తెరు’, ‘కీజ తెరు’, ‘దళిత కాలనీ’... ఇలా పిలవడం మొదలెట్టింది. ఇవన్నీ కూడా దళితులు నివసించే ప్రాంతాన్ని సూచించేవే. ‘నా చిన్నప్పుడు స్కూల్లో మా పేట పేరు చెప్పిన వెంటనే నేనెవరో పోల్చుకునేవారు. అప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను’ అని ఇదే ప్రాంతం, సామాజిక వర్గం నుంచి చదువుకుని సివిల్ ఇంజనీర్ అయిన అనసూయ శరవణముత్తు అంది. ‘నేను కాలేజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెళ్లిపోయాను. 2022లో తిరిగి వస్తే ఇంకా కులాన్ని సూచించే పేరుతోటే నా పేటను పిలుస్తున్నారు. ఇది ఎంతమాత్రం కుదరదు అని నిశ్చయించుకున్నాను’ అంది అనసూయ. అందరితో పోరాడి... ఇందిరా నగర్ అనే పేరును రెవిన్యూ వారు ఏ మాత్రం పట్టించుకోకుండా ‘దిగువ వీధి’ అనే పేరుతోనే వీరి పేటను రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. అలాగే రేషన్ కార్డుల్లో, ఆధార్ కార్డుల్లో, ఓటర్ కార్డుల్లో, చివరకు పాస్‌పోర్టుల్లో కూడా ఇందిరా నగర్ అని తప్ప రకరకాల వివక్ష పేర్లతో ఇక్కడ నివసిస్తున్న దళితుల గుర్తింపు కార్డులు నమోదై ఉన్నాయి. దాంతో అనసూయ 2022 ఆగస్టు నుంచి పోరాటం మొదలెట్టింది. ‘మొదట కలెక్టర్ చుట్టూ తిరిగాను. తిప్పించుకుని తిప్పించుకుని అక్టోబర్ నాటికి అఫీషియల్‌గా రికార్డుల్లో మార్చారు. కాని అసలు సమస్య పంచాయతీతో వచ్చింది. ఆనందవాడి పంచాయతీ మా పేటను దిగువ వీధి అని పిలవకూడదనే తీర్మానం చేయడానికి ఏమాత్రం ముందుకు రాలేదు. నేను పోరాడితే ఫిబ్రవరిలో తీర్మానం చేశారు. ఆ తర్వాత పంచాయితీ పెద్దలొచ్చి మా పేట ముందు బోర్డు పెట్టే కార్యక్రమంలో పాల్గొనమని ఎన్నిసార్లు తిరిగినా రాలేదు. దాని కోసం మళ్లీ పోరాడాల్సి వచ్చింది. చివరకు మొన్న జూలై 1న పంచాయతీ పెద్దలంతా వచ్చి బోర్డును నిలబెట్టి వెళ్లారు’ అని తెలిపింది అనసూయ. వివక్షాపూరితం వెనుకబడ్డ, దళిత వర్గాలను సులువుగా గుర్తించేందుకు ఎప్పటి నుంచో వారు నివసించే ప్రాంతాలకు వివక్షాపూరితమైన పేర్లు పెట్టే ఆనవాయితీ ఉందని ఈ ఉదంతం విన్నాక అనసూయను అభినందిస్తూ విల్లుపురం ఎంపీ రవికుమార్ అన్నారు. ‘నువ్వు ఎక్కడుంటావు అనే ప్రశ్నతో ఎదుటివారి కులం ఏమిటో ప్రాంతాన్ని బట్టి అర్థమవుతుంది. దీంతో వివక్ష మొదలవుతుంది. ఇలాంటి వివక్షాపూరితమైన పేర్లను రాష్ట్రమంతా తొలగించాలి’ అని రవికుమార్ అన్నారు. అనసూయలాంటి అమ్మాయిలు పూనుకుంటే అదెంత సేపు? -
ఇందిరానగర్‌లో ముట్టడి.. కట్టడి
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నెం. 5లోని ఇందిరానగర్‌లో శనివారం అర్దరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంజగుట్ట ఏసీపీ తిరుపతన్నతో పాటు బంజారాహిల్స్ డీఐ కె. రవికుమార్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె. బల్వంతయ్యతో పాటు ఐదురుగు ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, 66 మంది కానిస్టేబుళ్ళు, 11 మంది హోంగార్డులు పాల్గొని బస్తీని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి అర్ధరాత్రి అనుమానాస్పదంగా, అనుమతిలేని పత్రాలతో, నంబర్‌ప్లేట్ లేని వాహనాలపై తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఇందులో భాగంగా 122 ఇళ్లను తనిఖీలు చేశారు. 300 మందిని ప్రశ్నించారు. 403 వాహనాలను తనిఖీ చేసి పత్రాలు సరిగ్గా లేని 46 వాహనాలను ïసీజ్ చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న 87 మందిని అదుపులోకి తీసుకున్నారు. 11 మంది హిజ్రాలను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చారు. హిజ్రాల కోసం పాత బస్తీ నుంచి వచ్చిన 110 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. 230 మంది యువకుల ఫోన్ నంబర్లను తనిఖీలు చేసి వారు ఎవరెవరికి టచ్‌లో ఉంటున్నారో తెలుసుకున్నారు. 60 మంది ఫింగర్‌ప్రింట్స్ సేకరించారు. ఫేషియల్ రికగ్నజేషన్ సిస్టమ్‌లో భాగంగా 98 మందిని పరిశీలించారు. 5 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. -
శిథిలావస్థలో రిజర్వాయర్
► పగుళ్లు తేలి పెచ్చులూడుతున్న వైనం ► పట్టించుకోని అధికారులు నిర్మల్ టౌన్: పట్టణ ప్రజలకు తాగునీటిని అందిస్తున్న రిజర్వాయర్‌కు పగుళ్లు తేలి శిథిలావస్థకు చేరింది. రిజర్వాయర్ పెచ్చులూడడంతో ఇనుపచువ్వలు బయటకు కనిపిస్తూ ప్రమాదకరంగా మారింది. దీంతో ఎప్పుడు కూలి పోతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పరిస్థితి చేయి దాటక ముందే అధికారులు మేల్కొని ముందు జాగ్రత్తగా నూతన రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. కాలపరిమితి ముగిసినా పట్టణంలోని ఇందిరానగర్ గాంధీపార్కులో ఉన్న రిజర్వాయర్‌ను నిర్మించి నాలుగు దశాబ్దాలకు పైనే అవుతోంది. రిజర్వాయర్ వినియోగ కాలపరిమితి కూడా పూర్తయింది. దీంతో రిజర్వాయర్ కాస్తా శిథిలావస్థకు చేరింది. కానీ దాని స్థానంలో నూతన రిజర్వాయర్‌ను నిర్మించాల్సిఉన్నా ఆ దిశగా అధికారులు కనీస చర్యలను చేపట్టడంలేదు. గతంలో ఈ రిజర్వాయర్ నుంచి సగం పట్టణానికి నీరు సరఫరా అయ్యేది. కాలక్రమేణ పట్టణ విస్తీర్ణం పెరగడంతో పాటు పలు కాలనీల్లో రిజర్వాయర్లను నిర్మించడంతో ప్రస్తుతం పదుల సంఖ్యలోని వార్డులకు దీని నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. జనాభా అధికంగా నివాసం ఉంటున్న ఇందిరానగర్, బాగులవాడ, కస్బా, నగరేశ్వరవాడ, వాల్మీకినగర్, తదితర వార్డులకు నీరు సరఫరా జరుగుతోంది. దీంతో పాటు తాగునీరు సరఫరా కానీ ప్రాంతాలకు, శుభకార్యాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందినవారు, హోటల్ నిర్వాహకులు ఇక్కడ ఏర్పాటు చేసిన 24 గంటలు నీటిని అందించే నల్లా నుంచి తాగునీటిని తీసుకెళ్తుంటారు. అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా దీనిపై తాగునీటికోసం ఆధారపడిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అయితే నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన రిజర్వాయర్ శిథిలావస్థకు చేరినప్పటికీ ఇంకా వినియోగిస్తూనే ఉన్నారు. నూతన రిజర్వాయర్‌ను నిర్మిస్తే మేలు 40 ఏళ్లక్రితం నిర్మించిన రిజర్వాయర్ స్థానంలో కొత్త దానిని నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుంది. గతంలో నూతన రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రతిపాదనలను సిద్దం చేస్తున్నామని మున్సిపల్ అధికారులు ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. నిధులు మంజూరై, స్థల పరిశీలన పూర్తయి, రిజర్వాయర్ పూర్తి కావాలంటే కనీసం ఏడాదిన్నరకాలం పట్టే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు, పాలకులు ముందస్తుగా రిజర్వాయర్ నిర్మాణం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెడితే బాగుటుందని ప్రజలు పేర్కొంటున్నారు. నూతన రిజర్వాయర్ నిర్మించాలి రిజర్వాయర్‌ను నిర్మించి అనేక సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు స్పందించి కొత్తగా రిజర్వాయర్‌ను నిర్మించాలి. వెంటనే పనులు చేపడితే ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు కలుగవు. – రాజు, నిర్మల్ పెచ్చులు ఊడుతున్నాయి రిజర్వాయర్ పెచ్చులు ఊడుతున్నాయి. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న రిజర్వాయర్‌ను వినియోగించడం సరికాదు. ప్రమాదం జరుగకముందే అధికారులు, పాలకులు స్పందించాలి. – గణేశ్, నిర్మల్ -
కత్తులతో దొంగలు చోరీ
-
పోల‘వరం’..ఇక వేగం
సాక్షి, ఏలూరు : పోలవరం ప్రాజెక్టు (ఇందిరాసాగర్) కల సాకారానికి ఇన్నాళ్లుగా ఉన్న అడ్డంకులు తొలగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావిత 47 రెవెన్యూ గ్రామాలను పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు రాజ్యసభ, లోక్‌సభ ఆమోదం లభించడంతో ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం కానుంది. తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రజాప్రతి నిధుల ఆందోళన మధ్య కేంద్ర ప్రభుత్వం పోలవరం ఆర్డినెన్స్‌ను ఈ నెల 11న లోక్‌సభలో ఆమోదింపజేయగా, సోమవారం రాజ్యసభలోనూ ఆమో దం లభించింది. రాష్ట్రపతి ఆమోదమే తరువాయి ఖమ్మం జిల్లా పాల్వంచ రెవెన్యూ డివి జన్‌లోని కుకునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా (41 రెవెన్యూ గ్రామాలు), బూర్గంపాడు పాక్షికంగా (6 రెవెన్యూ గ్రామాలు) మన జిల్లాలో కలవడానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం ఒక్కటే మిగిలివుంది. తొలగనున్న అడ్డంకులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.16,010 కోట్లను కేటాయించారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి రూ.4,054 కోట్ల విలువైన పనులను అప్పగిం చారు. అయితే, ఏటా బడ్జెట్లో అరకొర కేటాయింపులే ఇస్తున్నారు. రెండేళ్లుగా బడ్జెట్లో రూ.800కోట్ల నుంచి రూ.850 కోట్ల వరకూ కేటాయింపులు ఇస్తున్నారు. ఈ ఏడాది తాజా బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దాదాపు 1,400 ఎకరాల భూసేకరణ ఇంకా జరగలేదు. ప్యాకేజీ-1లో 12.10 ఎకరాల అటవీ భూమి సేకరిం చాల్సి ఉంది. కోర్టు కేసుల వల్ల జిల్లాలో 551 ఎకరాల భూసేకరణ పూర్తి కాలేదు. ఇవన్నీ వేగంగా జరగాలంటే జాతీయహోదాతో పాటు నిధు లు రావాల్సిఉంది. ఉభయ సభల్లో ముంపు మండలాల విలీనానికి ఆమో దం లభించడంతో భూసేకరణకు కొంతమేర అవాంతరాలు తొలగుతాయి. పునరావాసం ప్యాకేజీ (ఆర్ అండ్ ఆర్)లో నెలకొన్న వివాదాలు సమసిపోనున్నాయి. కలల ప్రాజెక్టు జిల్లాలోని పోలవరం మండలం రామయ్యపేట గ్రామంలో చేపట్టిన ఇందిరాసాగర్ ప్రాజెక్టు పూర్తయితే ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. 80 టీఎంసీల గోదావరి నీటిని కుడి ప్రధా న కాలువ ద్వారా కృష్ణానదికి, 23.44 టీఎంసీల నీటిని విశాఖ పరిసర 560 గ్రామాల తాగునీటి, పరిశ్రమలు, సాగు అవసరాలకు ఎడమ కాలువ ద్వారా సరఫరా చేస్తారు. దీంతోపాటు ఈ నాలుగు జిల్లాల్లో పర్యాటకం, చేపల పెంపకం, జలరవాణా వంటివి అభివృద్ధి చెందుతాయి.