
గోదావరిఖనిలో కార్డన్‌సెర్చ్
గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా): గోదావరిఖనిలోని 5 ఇంక్లైన్, విఠల్‌నగర్, చంద్రశేఖర్ నగర్‌లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను, నిల్వ చేసిన బొగ్గు, గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఓ డీసీపీ, ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, 400 మంది పోలీసులు పాల్గొన్నారు.