
ఎల్బీనగర్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్:నగరంలోని ఎల్బీనగర్, ఎన్టీఆర్ నగర్‌లో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ ఇక్భాల్ ఆధ్వర్యంలో 380 మంది పోలీసులతో ప్రతి ఇంట్లోనూ సోదాలు జరిపారు.
ఈ సోదాల్లో41 బైకులు,10 ఆటోలు, 9 గ్యాస్ సిలిండర్లు, రెండు గ్యాస్ రీఫిల్లింగ్ మిషన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న రెండు దుకాణాలను సీజ్ చేసి, 20 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 11 మంది పాత నేరస్తులను అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు రౌడీషీటర్లు కూడా ఉన్నారు.