
కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్న పోలీసులు, స్వాధీనం చేసుకున్న సరైన పత్రాలు లేని సిలిండర్లు
కొడంగల్ రూరల్: అక్రమంగా నిర్వహిస్తున్న దందాలు, కల్తీ ఆహార పదార్థాల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కార్డన్‌సెర్చ్ నిర్వహించినట్లు పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ శంకర్, 10మంది ఎస్సైలు, నలుగురు ఏఎస్సైలు, 80మంది పోలీస్ సిబ్బంది, 10మంది మహిళా కానిస్టేబుల్స్ గ్రామంలోని కిరాణషాపులు, బెల్ట్ షాపులు, హోటల్స్, ఇంటింటి తనిఖీలతోపాటు గ్రామంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 9గ్యాస్ సిలిండర్లు, 4500గుట్కాలు, 90బీరు బాటిల్స్‌ను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎస్పీ అన్నపూర్ణ ఆదేశాల మేరకు కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కర్ణాటక సరిహద్దులో ఉన్నందున ఈ గ్రామంలో గంజాయి, మద్యం, డ్రగ్స్, ఆయుధాలు వంటివి సరఫరా అవుతుందనే అనుమానంతో గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగితాలు లేని వాహనాలతో దుండగులు తమ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వదిలివెళ్తుంటారని అన్నారు. ప్రతి అంశంలోనూ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం పెంచి, ప్రజల సహకారంతో నేరాలు అదుపుచేయడం కార్డన్‌సెర్చ్ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడం, అక్రమ దందాలను అరికట్టడం, అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకోవడం జరుగుతుందని చెప్పారు. యువత సన్మార్గంలో నడవాలని, సమాజసేవలో ముందుండాలని ఆకాంక్షించారు. అక్రమ దందాలకు పాల్పడేవారి విషయాలపై పోలీస్ శాఖకు సమాచారం అందిస్తే వారి విషయాలను గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో సీఐ శంకర్, దోమ, పరిగి, చన్‌గోముల్, కొడంగల్ హైవే, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కొడంగల్ ఎస్‌ఐలు రవికుమార్, సతీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment